కోవిడ్‌ పర్సనాలిటీ.. మీరు ఏ టైప్‌? | Riteish Deshmukh Post About Covid-19 Personality Types | Sakshi
Sakshi News home page

హిలేరియస్‌ ఫోటో షేర్‌ చేసిన హీరో

Published Sat, Sep 19 2020 1:33 PM | Last Updated on Sat, Sep 19 2020 3:51 PM

Riteish Deshmukh Post About Covid-19 Personality Types - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌ తప్పనిసరి. అయితే మనలో చాలా మంది మాస్క్‌ను సరిగా ధరించరు. కొందరు చెవులకు తగిలించుకుంటే.. మరి కొందరు ముక్కును కవర్‌ చేయరు. కొందరు మహానుభావులు అసలు మాస్కే ధరించరు. ఈ క్రమంలో నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాకుండా, పడి పడి నవ్వేలా చేస్తుంది. ఈ ట్వీట్‌లో రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఓ ఫోటోని షేర్‌ చేశారు. ‘కోవిడ్‌ పర్సనాలిటీ రకాలు’ పేరుతో షేర్‌ చేసిన ఈ ఫోటోలో నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు. మాస్క్‌ సరిగ్గా ధరించిన వ్యక్తిని విజ్ఞాన శాస్త్రవేత్తగా పేర్కొనగా.. మాస్క్‌ ధరించని వ్యక్తిని శాస్త్రాన్ని తిరస్కరించేవాడిగా పేర్కన్నారు. (చదవండి: మాస్క్‌ ఎలా పెట్టుకోవాలో నేర్పించింది)

ఇక మూడవ వ్యక్తి ముక్కును కవర్‌ చేసేలా మాస్క్‌ ధరించలేదు. అతడిని సైన్స్‌ అర్థం కాని వ్యక్తిగా.. గడ్డం మీదుగా మాస్క్‌ ధరించేవారిని మ్యాజిక్‌ని నమ్మే వ్యక్తిగా పేర్కొన్నారు. మీరు ఏ కోవకు చెందుతారో చూడండి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవ్వడమే కాక మరింత ఫన్ని కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement