mask
-
ముసుగు మనుషులు
‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి. అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది. కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?! -
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
‘రెస్టారెంట్ మేనేజ్మెంట్’ అంటే రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్‌కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్‌లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్’ వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్‌వన్ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్’ పేరుతో అదితి దుగర్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్’ రెస్టారెంట్ తక్కువ సమయంలోనే బాగాపాపులర్ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్’ దూసుకుపోయింది. మోస్ట్ ఫార్వర్డ్ – థింకింగ్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్‌పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్ వెంచర్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్ అసైన్మెంట్స్లో భాగంగా అదితి ఒక బ్రిటిష్ హోం చెఫ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్–వెజ్ చెఫ్ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్‌లో స్పెయిన్‌లో ఉన్న అదితికి ‘మాస్క్’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్ క్లయింట్స్ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్’ వేగానికి కోవిడ్ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్ బిజినెస్‌లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్ -
మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
పంజాబ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్- 1 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పంజాబ్ ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గుండె, మధుమేహం, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలు వైద్య సహాయం కోసం, 104కు డయల్ చేయాలని కోరింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని చేతి రుమాలుతో కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేసింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడాన్ని నివారించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను కోరింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇది కూడా చదవండి: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు! -
మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ!
కోవిడ్-19 వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆగ్నేయాసియాలోని పలు ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు తిరిగి పాత నిబంధనలు అమలుకోకి తీసుకురావాలని నిర్ణయించాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు మళ్లీ మాస్క్‌లు ధరించాలని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల జ్వరాన్ని తనిఖీ చేయడానికి థర్మల్ స్కానర్లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే కోవిడ్ వేరియంట్ల తరహాలోని పలు సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికట్టాలని వివిధ ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్ నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతోంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, సంవత్సరాంతపు, పండుగ సీజన్లలో ప్రయాణాలు మొదలైనవి వైరస్ వ్యాప్తిని మరింతగా పెంచుతాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దేశాలకు, లేదా ప్రాంతాలకు ప్రయాణికులను వెళ్లవద్దని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండోనేషియన్లను అభ్యర్థించింది. కాగా గత వారం రోజుల్లో మలేషియాలో కోవిడ్ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు పోస్టుల వద్ద థర్మల్ స్కానర్లను తిరిగి ఏర్పాటు చేశారు. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కోవిడ్ నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి. ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్‌వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక! -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్‌లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్‌లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్‌ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్‌లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్‌ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్‌ను కూడా స్థానిక డీలర్‌కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్‌ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్‌పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్‌గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్‌ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్‌ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్‌లో నిమ్స్‌లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్‌ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్‌పెల్లియర్‌లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్‌లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్‌ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్‌లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
సిబ్బంది నిర్వాకం.. ఆక్సిజన్ మాస్కుకు బదులు టీకప్పుని బాలుడి ముక్కుపై పెట్టి..
చెన్నై: కాంచీపురం జిల్లా ఉత్తరమేరూరులో ఓ పాఠశాల విద్యార్థి తరగతి గదిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బాలుడిని ఉత్తర మేరూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ నాసల్ మాస్క్‌ను అమర్చాలని సూచించారు. వార్డులో చేర్చి మాస్క్ ధరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మాస్క్ లేకపోవడంతో టీ కప్పుకు రంధ్రం చేసి ఆక్సిజన్ సిలిండర్ నుంచి ట్యూబ్‌కు కనెక్ట్ చేసి విద్యార్థి చేతికి ఇచ్చి ముక్కుపై పెట్టారు. ఇది చూసిన ఓ రోగి సెల్ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ దృష్టికి వెళ్లింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్‌ను విచారణకు ఆదేశించారు. చదవండి వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది -
కళ్లకు విశ్రాంతినిచ్చే ఐ మసాజర్ మాస్క్.. ధర ఎంతంటే?
గాగుల్స్లా ఈ పరికరాన్ని కళ్లకు తొడుక్కుంటే చాలు, అలసిన కళ్లకు విశ్రాంతినిస్తుంది. కనురెప్పలు, కళ్ల చుట్టూ ఉండే కండరాలకు సున్నితంగా మర్దన చేస్తుంది. అమెరికన్ కంపెనీ పాట్రియాట్ హెల్త్ అలయన్స్ ఇటీవల ‘ఐ స్పా’ పేరుతో ఈ ఐ మసాజర్ మాస్క్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. కోరుకున్న విధంగా దీని ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. కళ్లకు వెచ్చదనం కావాలనుకుంటే, 43.3 డిగ్రీల నుంచి 45.5 డిగ్రీల సెల్సియస్ వరకు, చల్లదనం కావాలనుకుంటే 15 డిగ్రీల నుంచి 18.3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మిస్ట్ మసాజ్ ఆప్షన్ కూడా ఉంది. దీనిని సెట్ చేసుకుంటే, కళ్లకు తగినంతగా చల్లని తేమను విడుదల చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఇది పనిచేస్తుంది. దీని ఖరీదు 34.98 డాలర్లు (రూ.2,869) మాత్రమే! -
అరుదైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. అలాంటి పరిస్థితిలో!
హీరోయిన్లని చూడగానే.. అబ్బా సూపర్ ఉంది అని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే సదరు హీరోయిన్లలో కొందరు అరుదైన వ్యాధులు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఒకప్పుడు బయటపెట్టేవాళ్లు కాదు గానీ ఈ మధ్య మాత్రం తమకు ఎదురైన సమస్య గురించి నలుగురికి చెప్పడంలో సదరు బ్యూటీస్ అస్సలు మొహమాట పడట్లేదు. తాజాగా ఓ నటి అలానే ఓ ఫొటో పోస్ట్ చేసి తన హెల్త్ ప్రాబ్లమ్‌ని రివీల్ చేసింది. సమంతలా ఈ నటికి తెలుగు స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తనకు మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉందని గతేడాది బయటపెట్టిన సామ్.. ఇప్పుడు దానికి చికిత్స కోసమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీలానే బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా అరుదైన వ్యాధి బారిన పడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఈ నటి ఇన్‌స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. (ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో మళ్లీ స్టేజీపై చలాకీ చంటి!) అదే కారణమా? ఈషా గుప్తా పోస్ట్ చేసిన ఫొటోకి హైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ పెట్టింది. గతంలో ఇదే థెరపీ సమంత తీసుకుంది. మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ థెరపీ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల పాడైన కండరాలు బాగుపడతాయి. కండరాల వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అలాంటి ఆక్సిజన్ మాస్క్ తో ఈషా గుప్తా కనిపించడంతో ఈమెకీ మయోసైటిస్ వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. తెలుగులో రెండే ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈషా గుప్తా.. గతంలో తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి సచిన్ జోషి హీరోగా నటించిన 'వీడెవడు' కాగా, రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలో ఈషా సందడి చేసింది. వీటి తర్వాత ఈమెకు టాలీవుడ్లో మరో ఛాన్స్ రాలేదనే చెప్పాలి. View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు.. ఆ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!
లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి: సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’ -
తప్పనిసరిగా ధరించాల్సిందే..
సాక్షి, చైన్నె : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో మాస్క్‌లు, భౌతిక దూరాలను తప్పనిసరి చేశారు. ఇక, తమిళనాడులో ముందు జాగ్రత్తలలో భాగంగా కరోనా చికిత్స శిబిరాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఈనెల 10, 11 తేదీలలో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా అని పరిశీలించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో చైన్నె, శివారు జిల్లాలు, కోయంబత్తూరులలో అధికంగా కేసులు ఉన్నాయి. తూత్తుకుడిలో ఓ మరణం కేసు సైతం ఈ ఏడాది నమోదైంది. దీంతో ముందు జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టారు. అదే సమయంలో శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవ్య అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా కట్టడి, ముందు జాగ్రత్తల విస్తృతంపై ఆయన ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. తప్పనిసరిగా ధరించాల్సిందే.. పుదుచ్చేరి విపత్తుల నిర్వహణాధికారి వల్లవన్ మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడికి ప్రజల సహకారం కోరుతున్నామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆదేశించారు. ఆస్పత్రులు, బస్సులు, జన సంచార ప్రదేశాలు, సినిమా థియేటర్లు, వినోద కేంద్రాలు ఇలా అన్నిచోట్ల మాస్క్‌లను తప్పనిసరి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్క్ ధరించి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. భౌతిక దూరాలను పాటించే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు. ముందు జాగ్రత్త... తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా అని పరిశీలించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నామని వివరించారు. చికిత్స విధానాలు, ఏర్పాట్ల అంశాలపై ఈనెల 10, 11 తేదీలలో మాక్‌డ్రిల్‌కు నిర్ణయించామన్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్తగా అన్ని సిద్ధం చేశామని, ఓ మారు వాటి పనితీరు, చికిత్స విధానాలను తెలుసుకునే విధంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరాలను పాటించాలని కోరారు. -
మాస్కులు ధరించండి.. కరోనా కేసులు పెరగొచ్చు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల (Covid-19) పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా.. 2,995 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 16వేల మార్క్(16, 354) దాటింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ్టి (కేంద్రం గణాంకాల్లో) లెక్కల్లో కాస్త తగ్గుదలే కనిపిస్తున్నా.. రాబోయే రోజుల్లో మాత్రం కేసుల పెరుగుదల గణనీయంగా ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ మేదాంత ఆస్పత్రి(గురుగావ్) చెస్ట్ సర్జరీ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగొచ్చన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని దేశ ప్రజలకు సూచిస్తున్నారాయన. అయితే భారత్‌లో కరోనా రెండో వేవ్ నాటి ఆక్సిజన్ కొరత, గణనీయమైన మరణాల నమోదు లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారాయన. వ్యాక్సినేషన్ ప్రభావం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారాయన. అయితే.. వైరస్ వేరియెంట్, జనాలు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని, తద్వారా కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందన్నారు. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నా.. దాని వల్ల కొందరు ఇబ్బందులు పడొచ్చని తెలిపారు. పిల్లలకు.. వృద్ధులకు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకు, మరీ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లపై వైరస్ ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వేరియెంట్లలో మార్పులు త్వరగతిన జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు సూచిస్తున్నారు. కాబట్టి, లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. మాస్క్‌లు ధరించడం వల్ల ఎలాంటి నష్టం కలగదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. -
సహజ సిద్ధమైన యూత్ప్యాక్స్
పార్టీలు, వేడుకలకు వెళ్లాలనుకొన్నప్పడు ముఖానికి తక్షణ నిగారింపు రావడం కోసం రకరకాల ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి అందుబాటులో ఉండవు. ఉన్నా, చర్మానికి పడవు. అలాంటప్పుడు... సహజసిద్ధమైన ఈ ఫేస్‌ప్యాక్స్ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు యవ్వన కాంతినిస్తాయి. చందనం, రోజ్ వాటర్ చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్‌వాటర్ చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈప్యాక్ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. ఇందుకోసం... ♦ గంధపు చెక్కను రోజ్ వాటర్‌తో అరగదీసి.. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది. ఓట్ మీల్‌తో... ఓట్మీల్ సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్ మీల్ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రెండు టేబుల్స్పూన్ల ఓట్ మీల్లో టీస్పూన్ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటూ మసాజ్ చేసుకొంటున్నట్టుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. -
వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు
చైనాలో అత్యంత ఘోరంగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీ ఆంక్షలను సడలించాకే అత్యంత దారుణంగా కేసులు పెరగడం అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఒక పక్క ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతుంటే మరోవైపు వైద్యులు వారికి చికిత్స అందించలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోతున్నారు. చైనాలో విస్తృతంగా పెరుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి కూడా. చైనా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల ప్రకారం... ప్రస్తుతం సుమారు 37 మిలియన్ల మంది కరోన బారిన పడి ఉండవచ్చునని అంచనా వేసింది. టీకాలు సత్వరమే వేయడంలో వైఫల్యం తోపాటు ప్రజలకు వాటిపై సరైన అవగాహన కల్పించకపోవడం తదితర కారణాల రీత్యా ఈ దుస్థితిని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఒక వ్యక్తి ఒక వెరైటీ ఆకృతిలోని మాస్కోని ధరించి అందర్నీ ఆకర్షించాడు. సదరు వ్యక్తి పెద్ద ముక్కు ఆకృతిలోని పేపర్ మాస్క్‌ని ధరించాడు. పైగా దానికి ఓపెనింగ్ కూడా ఉంది. ఎంచక్కా మాస్క్ తీయకుండానే అలానే తినేయవచ్చు. అతను ఒక రెస్టారెంట్లో ఆ మాస్క్ ధరించి చక్కగా పదార్థాలను లాగించేస్తున్నాడు. చూస్తుంటే అచ్చం పక్షుల మాదిరిగి తింటున్నట్లు చూడముచ్చటగా ఉంది. అందుకు సంబంధించిన వీడియోను సఫీర్ అనే వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc — Safir (@safiranand) December 23, 2022 (చదవండి: తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన
సాక్షి, ఢిల్లీ: పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మన పొరుగు దేశంలో చైనాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో, ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయా వైద్య నిపుణులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరింది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి రాకపోకలపై ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోకి ఉన్నాయని తెలిపింది. మన దేశంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. చైనా, జపాన్, దక్షిణ కొరియాలో కేసులు పెరుగుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, దేశంలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. Use a mask if you are in a crowded space, indoors or outdoors. This is all the more important for people with comorbidities or are of higher age: Dr VK Paul, Member-Health, NITI Aayog after Union Health Minister's meeting on COVID pic.twitter.com/14Mx9ixIod — ANI (@ANI) December 21, 2022 -
జోడో యాత్రపై రాహుల్‌కు కేంద్రం హెచ్చరిక..
న్యూఢిల్లీ: చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు. ఈ యాత్రలో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేశారు. కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే భారత్ జోడో యాత్రలో అనుమతించాలని కేంద్రమంత్రి హితవు పలికారు. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోతే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జోడో యాత్రను రాహుల్ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈమేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు మాండవీయ లేఖ రాశారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమై ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల మీదుగా పాదయాత్ర చేసిన రాహుల్.. ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. చదవండి: రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు.. -
మాస్కు ధరించడం తప్పనిసరికాదు.. కేంద్రం కీలక ఆదేశాలు..
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు మాస్కు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు మాస్కుకు ప్రాధాన్యమిస్తే మంచిదేనని సూచించింది. విమానయాన సంస్థలు కూడా ఇకపై విమానాల్లో ప్రకటనలు చేసే సమయంలో మాస్కు తప్పనిసరి అని చెప్పొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు, ఫేస్ కవర్లు ఉపయోగిస్తే మంచిదని మాత్రమే చెప్పాలని పేర్కొంది. ఈ ఆదేశాలకు ముందు వరకు విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. మాస్కు ధరించని కారణంగా ప్రయాణికులను కిందకు దింపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో కొత్త 501 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా 474 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2020 ఏఫ్రిల్ 6 తర్వాత ఇవే అత్యల్పం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
మాస్క్ ధరించండి! అన్నందుకు.. కాల్చి చంపేశాడు
జర్మన్: మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ క్యాషియర్ని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీ కరోనా దృష్ట్యా వ్యాక్సినేషన్ ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా అక్కడ ఉండే జర్మన్లందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మారియో ఎన్ అనే వ్యక్తి సిక్స్ ప్యాక్ బీర్‌ను కొనుగోలు చేసేందుకు ఒక స్టోర్‌కి వెళ్లాడు. అప్పుడు ముసుగు ధరించాడు. ఆ తర్వాత కొనుగోలు అయిపోయింది కదా అని మాస్క్ తీసేసి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. అక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న 20 ఏళ్ల విద్యార్థి మాస్క్ ధరించండి అని చెప్పాడు. అంతే కోపంతో అతని నుదిటి పై పాయింట్ బ్లాక్‌లో గన్‌పెట్టి పేల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జర్మనీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడు మారియో అక్రమంగా తుపాకి కలిగి ఉన్నందుకు జర్మన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అంతేగాదు హత్యానేరం రుజువుకావడంతో జర్మన్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. (చదవండి: ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?) -
బ్రహ్మోత్సవాల్లో మాస్క్ తప్పనిసరి
తిరుమల: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని చెప్పారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నమయ్య భవనంలో గురువారం ఆయన ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు చెప్పారు. 27న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేస్తామని, ఆర్జిత సేవలు, శ్రీవాణి, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రివిలైజ్డ్ దర్శనాలను రద్దు చేశామని పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచనున్నట్లు తెలిపారు. -
యాపిల్ ఉద్యోగులకు ఊరట..మెయిల్లో ఏం చెప్పిందంటే!
ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఊరట కల్పించింది. కరోనా కేసులు అదుపులోకి రావడంతో చాలా కంపెనీలు ఉద్యోగులు కార్యాలయాల్ని మాస్క్‌ను ధరించే అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఉద్యోగులు ఆఫీస్‌లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని యాపిల్ తన ఉద్యోగులకు మెయిల్ చేసింది. ఉద్యోగులు మాస్క్ ధరించాలన్న కఠిన నిబంధనల్ని యాపిల్ సడలించింది. మాస్క్ ధరిస్తే సురక్షితం అనుకుంటే ధరించండి. ఆ విషయంలో ఏమాత్రం వెనకాడొద్దు. అలాగే ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని గౌరవించండి అంటూ మెయిల్లో పేర్కొంది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తెచ్చిన ఈ కొత్త నిబంధన కొన్ని స్థానాల్లో వర్తించదని తెలిపింది.“ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చాలా ప్రదేశాలలో ఇకపై ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే వర్క్ విషయంలో సహచర ఉద్యోగులతో మాట్లాడడం లేదంటే వారి క్యాబిన్లలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని యాపిల్ తన ఉద్యోగులకు పెట్టిన మెయిల్లో పేర్కొందని ది వెర్జ్ హైలెట్ చేసింది. పెరిగిపోతున్న బీఏ.5 వేరియంట్ కేసులు ఇటీవల కోవిడ్-19లోని బీఏ.5 వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన ఉద్యోగులకు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని చెప్పడం.. అదే సమయంలో సురక్షితం అనుకుంటే మాస్క్‌లు ధరించమని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఒక వారం ముందు, బే ఏరియా ట్రాన్సిట్ సిస్టమ్ ఏరియా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు మాస్క్ తప్పని సరి చేశారు. బే ఏరియాతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పని సరి చేశారు స్థానిక అధికారులు. -
Covid-19: కరోనా అంతు చూసే మాస్కు!
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటూ అది అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో మూలన విసిరేసిన మాస్కుల డబ్బాలు మళ్లీ తెరవాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులూ, ప్రభుత్వ పెద్దలూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తాకిన కొద్దిసేపటికి అది నిర్వీర్యం అయిపోయే కొత్త మాస్కులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వైద్యులు వాడే ఎన్–95 మాస్కులూ, ప్రజలు ఉపయోగించే మూడు పొరల మాస్కుల తరహాలో కరోనాను అరికట్టే రసాయనంతో మరో పొరను చేర్చుతూ వీటిని రూపొందించామంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి చెందిన కెమికల్ ఇంజనీర్ దిబాకర్ భట్టాచార్య. ‘కొత్తగా రూపొందించిన ఈ పొర మీదికి ‘సార్స్–సీవోవీ–2’వైరస్ లేదా దానికి సంబంధించిన అంశాలేవైనా చేరి... అక్కడ దాని మీద కనీసం 30 సెకండ్ల పాటు ఉంటే దాని స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యమవుతుంది. కొమ్ముల్లా ఉండే ఈ స్పైక్ ప్రోటీన్‌ను ఓ తాళం చెవిలా ఉపయోగించుకునే వైరస్ మన జీవకణాల్లోకి చేరుతుందన్న విషయం తెలిసిందే. ఇది ఎన్–95లా పనిచేస్తున్నప్పటికీ దీనిపైని అదనపు పొరపై యాంటీవైరస్ ఎంజైమ్ పూత ఉంటుంది. అది కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా ‘సార్స్–సీవోవీ–2’వ్యాప్తిని గణనీయంగా అరికడుతుంది’అంటున్నారు దిబాకర్ భట్టాచార్య. దీనిని మరింత అభివృద్ధి చేస్తే మరింత సమర్థంగా వ్యాప్తిని అరికడుతుందనే భరోసా ఇస్తున్నారు. దీన్లో వాడిన ‘స్మార్ట్ ఫిల్టరేషన్ మెటీరియల్’కేవలం గాల్లో వ్యాపించి కరోనాను వ్యాప్తిచేసే ఏరోసాల్స్‌ను మాత్రమే నిర్వీర్యం చేస్తుంది తప్ప శ్వాసప్రక్రియకు ఎలాంటి అవరోధం కల్పిందంటూ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇవి అటు డ్రాప్లెట్స్(సన్నటి లాలాజల తుంపర్ల)తో పాటు ఇటు ఏరోసాల్స్ (గాల్లో ఉండే అతి సూక్ష్మమైన కణాలు) ద్వారా కలిగే వైరస్ వ్యాప్తులను అరికడుతుందంటున్నారు. విశ్వసనీయమైన ఎన్–95 కంటే సమర్థమైందని, కరోనా వైరస్ సహా, 100 నానోమీటర్ల సైజులో ఉన్న అన్ని పార్టికిల్స్నూ 98.9 శాతం సమర్థంగా అడ్డుకుంటుందనేది పరిశోధకుల మాట. ఈ వివరాలన్నీ ‘కమ్యూనికేషన్స్ మెటీరియల్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారీ కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8 నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ట్రాఫిక్ సమస్య, పరీక్ష కేంద్రం గుర్తింపు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించవచ్చు. 3.76 లక్షల మంది విద్యార్థులు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 3.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందు కోసం సుమారు 517 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 15,048 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ కోసం కేంద్రానికి ఒక్కొక్కరి చొప్పున డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెట్లను కేటాయించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీల కోసం సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. (చదవండి: సర్కారు వారి పాట) -
పొంచివున్న ఫోర్త్ వేవ్ ముప్పు.. తస్మాత్ జాగ్రత్త అంటున్న నిపుణులు
శివాజీనగర: రాష్ట్రంలో అప్పుడే కరోనా నాలుగో వేవ్‌పై వేడి చర్చ మొదలైంది. అందుకు ప్రజలను జాగృతం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలో కోవిడ్ నాలుగో దాడి జూన్ ఆఖరి నుంచి ఆరంభమయ్యే అవకాశముందని కాన్పూర్ ఐఐటీ నిపుణులు పరిశోధనలో పేర్కొన్నారు, కానీ ఒక నెల ముందుగానే కరోనా వేవ్ రావచ్చునని ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. మంత్రి మాటలను బట్టి మే చివరి నుంచి కోవిడ్ పుంజుకోవచ్చని అంచనా. మంగళవారం ఆయన మాట్లాడుతూ జూన్ నెల తరువాత గరిష్ట స్థాయి చేరుకుని సెప్టెంబర్, అక్టోబర్ నెలవరకూ కొనసాగవచ్చని ఆ నివేదికలో నిపుణులు తెలిపారు. వారు గతంలో మూడు మూడు దాడుల గురించి ఇచ్చిన నివేదిక శాస్త్రీయంగా ఉందని అన్నారు. మే 16 నుంచి బడులు పునఃప్రారంభం వచ్చే జూన్, జులై నెలల్లో కోవిడ్ నాలుగో దాడి రావచ్చని చెబుతున్నారు. కానీ విద్యాలయాలు ముందే నిర్ధారించినట్లు మే 16 నుంచి మొదలవుతాయి, ఇందులో సందేహం లేదు అని ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రి బీ.సీ.నాగేశ్ తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో 85 కరోనా కేసులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 85 కరోనా పాజిటివ్ కేసులు, 70 డిశ్చార్జిలు నమోదయ్యాయి. 1,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 7,171 మందికి కరోనా పరీక్షలు చేశారు. బెంగళూరులో 82 కేసులు, 66 డిశ్చార్జిలు నమోదయ్యాయి. మరోవైపు బెంగళూరు మాస్క్ ధరించాలని బీబీఎంపీ మార్షల్స్ మైకుల ద్వారా కోరడం మొదలైంది. పలు రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్క్ ధరించండి అని మైకుల్లో ప్రచారం చేశారు. -
పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, పోలీస్, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 1.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో 234 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూట్ బస్ పాస్ ఉన్న విద్యార్థులు ఆ రూట్లలోనే కాకుండా హాల్ టికెట్, బస్ పాస్ కలిపి చూపించి వేరే మార్గాలలోనూ ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ షాపులను మూసివేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సూర్యలత, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వడ్డెన్న, అడిషనల్ డీసీపీ ప్రసాద్, పొలీస్ ఇన్స్పెక్టర్ రామచంద్రం, విద్యుత్ శాఖ అధికారి స్రవంతి, వాటర్ వర్క్స్ స్వామి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ రావు, పోస్టల్ శాఖ సిబ్బంది శశాంత్ కుమార్, ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ జానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఓయూ@105) -
మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉన్నా.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం కరోనా సమాచారం గురించి పలు జాగ్రత్తలను మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారాయన. అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. ఆరువారాలుగా కరోనా వైరస్ అదుపులోనే ఉంది. రోజూ 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపారాయన. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫోర్త్‌వేవ్‌పై అనేక సందేహాలున్నాయి. దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్ లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 1శాతం కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 0.5 మాత్రమే ఉంది. ఫోర్త్ వేవ్ రాబోదని ఎన్ఐఎం సీరో సర్వేలాంటివి చెప్తున్నాయి. 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సీరో సర్వేల్లో వెల్లడైంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అలాగని కరోనా భయం పూర్తిగా తొలగిపోలేదు. రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉన్నాయి. ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్లు, ప్రయాణాల్లో ప్రజలందరూ మాస్క్ లు ధరించాలి. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచిస్తున్నాం అని తెలిపారు డీహెచ్. చదవండి: భారత్‌లో వరుసగా రెండో రోజు కేసుల్లో పెరుగుదల -
కరోనా విజృంభణ.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు పెద్దఎత్తున కరోనా బారిన పడటం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆథారిటీతో వైద్యారోగ్యశాఖ అధికారులు బధవారం సమావేశమయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అలాగే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్ కట్టడికి నిపుణులతో చర్చింది ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కాగా ఢిల్లీలో ప్రతిరోజూ అయిదు వందల వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 632 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 7.72 శాతంగా ఉంది. అయితే కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం శుభపరిణామం. మరోవైపు దేశవ్యాప్తంగా మంగళవారం 4.21 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. చదవండి: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఢిల్లీలో కలవరం -
సామీ! అది మాస్క్ లేక గడ్డమా... సభలో చమత్కరించిన వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: ఒక్కోసారి రాజకీయ నాయకులు రాజకీయం పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఛలోక్తులు విసురుకోవడం సహజం. నిజానికి ఆ సెటైర్లు భలే నవ్వుతెప్పించే విధంగానే ఉంటాయి. అవతలి ప్రతిపక్షం నాయకులు కూడా స్పోర్టీవ్‌గానే తీసుకుని రివర్స్ పంచ్‌లు వేస్తుంటారు కూడా. అచ్చం అలాంటి సంఘటన రాజ్యసభలోలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రాజ్యసభలో జరుగుతున్న సమావేశంలో బీజేపీ ఎంపీ సురేష్ గోపీ వంతు రాగానే ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నారు. ఆయన మళయాళం నటుడు కూడా. అయితే ఆయన సమావేశంలో లేచి నిలబడి తన గురించి చెబుతుండగా ఇంతలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. ‘‘సార్ ఏంటిది? గడ్డమా? లేక మాస్క్? నాకు అర్థకావడం లేదు అంటూ వెంకయ్య చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగి నవ్వులు విరిశాయి. అయితే ఎంపీ సురేష్ ఇది గడ్డమే తన తదుపరి సినిమా కోసం ఇలా పెంచానని వివరణ ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసంగం కొనసాగించమని వెంకయ్యనాయుడు అన్నారు. A lighter moment in the Rajya Sabha pic.twitter.com/lQH5g0wO4U — Mohamed Imranullah S (@imranhindu) March 27, 2022 (చదవండి: మూడేళ్లుగా సేకరిచిన రూపాయి నాణేలతో డ్రీమ్ బైక్...) -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫేస్ మాస్క్..
world's largest face mask: కరోనా మహమ్మారీ సమయంలో ఫేస్‌మాస్క్‌ల ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం ప్రజలు కూడా తమదైనందిన జీవితంలో ఈ మాస్క్‌లకు అలవాటుపడిపోయారు. ఇది అందరీకి ఒక నిత్యకృత్యంగా మారిపోయింది కూడా. అంతేగాక రకరకాల మాస్క్‌లు కూడా మార్కెట్లలలో దర్శనమిస్తున్నాయి. ఇటీవలే అత్యంత ఖరీదైన మాస్కలు అంటూ బంగారంతో తయారు చేసిన వాటి గురించి విన్నాం. అయితే ఇప్పుడూ వీటన్నింటిని తలదన్నేలా ప్రపంచంలో అతిపెద్ద మాస్క్ ఒకటి తైవాన్‌లో ఉంది. అసలు ఎందుకు తయారు చేశారంటే!.. వివరాల్లోకెళ్తే...ప్రపంచంలోనే అతి పెద్ద సర్జికల్ మాస్క్‌ని తైవాన్‌కి చెందిన ఓ వైద్య సంస్థ రూపొందించింది. ఇది 27 అడుగుల ఎత్తు 3 అంగుళాల 15 అడుగుల వెడల్పు, 9 అంగుళాలు పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పోరేషన్ అనే వైద్య సంస్థ మాస్క్ క్రియేటివ్ హౌస్‌లో ఈ మాస్క్‌ని ఆవిష్కరించింది. ఇది ప్రామాణిక ఫేస్ మాస్ కంటే కూడా 50 రెట్లు పెద్దది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేతలు ఈ రికార్డును ధృవీకరించారు. కోవిడ్ -19 మహమ్మారీ సమయంలో అవగాహన పెంచడం కోసం 2020లోనే ఈ మాస్క్‌ని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ తెలిపింది. (చదవండి: ఆమె గోల్ కోసమే టెన్షన్...వేస్తుందా ? లేదా!) -
అక్కడ ఒమిక్రాన్ కలకలం.. కోవిడ్ రూల్స్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను సడలించాయి. కాగా, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భద్రతా చర్యల కోసం కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేంద్రం కొవిడ్ రూల్స్ విధించిందిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ నుంచి అన్ని నిబంధనలను తొలగిస్తున్నట్టు బుధవారం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సి ఉంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేంద్రం తీసుకున్న కోవిడ్ రూల్స్ మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. యూరప్, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, జర్మనీలలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 23, బుధవారం నాటికి 1,81,89,15,234 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం టీకాలు అందిస్తోంది. ఇక, కోవిషీల్డ్ టీకాల మధ్య గ్యాప్‌ను కూడా కేంద్రం 8-16 వారాలకు తగ్గించిన విషయం తెలిసిందే. కోవాగ్జిన్ టీకాల మధ్య గ్యాప్ 28 రోజులుగా ఉంది. ఇది చదవండి: బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే సమాధి.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. -
మూడేళ్లలో 60 లక్షల మరణాలు
బ్యాంకాక్: కోవిడ్–19 ప్రబలిన మూడేళ్లలో ప్రపంచదేశాల్లో 60 లక్షల మందిని బలితీసుకుంది. ఇప్పటికీ వైరస్ తీవ్రతతో చాలా దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. మాస్క్ ధరించడం మానేసి, ప్రయాణాలు, వ్యాపారాలు తిరిగి మొదలైనా ఈ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. గత నాలుగు నెలల్లోనే 10 లక్షల కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ సోకని పసిఫిక్ ద్వీపాల్లో సైతం మొదటి వేవ్ ప్రజలను వణికిస్తోంది. హాంకాంగ్ ప్రభుత్వం ఈ ఒక్క నెలలోనే మొత్తం 75 లక్షల మంది ప్రజలకు మూడు పర్యాయాలు కరోనా పరీక్షలు జరిపింది. అయినప్పటికీ అక్కడ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 10 లక్షల మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 45 కోట్ల మంది కోవిడ్ బారినపడినట్లు లెక్కలు తేల్చింది. అయితే, కోవిడ్‌తో 1.40 కోట్ల నుంచి 2.35 కోట్ల మంది మరణించినట్లు ‘ది ఎకనామిస్ట్’విశ్లేషకుల అంచనా. చైనాలో మళ్లీ కోవిడ్ చైనా ప్రభుత్వం కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు కొత్తగా బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో సోమవారం ఒక్క రోజు వ్యవధిలో వెలుగు చూసిన 214 కొత్త కేసుల్లో గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులో 69, జిలిన్లో 54, షాడోంగ్ ప్రావిన్స్‌లో 46 నిర్ధారణ అయినట్లు ప్రధాని లీ కెకియాంగ్ తాజాగా నేషనల్ లెజిస్లేచర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో తెలిపారు. 2019లో వూహాన్లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ జాడలు వెలుగుచూశాక ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దేశ రాజధాని బీజింగ్‌లో కొత్తగా కేసులు రానప్పటికీ మాస్క్ తప్పనిసరి చేశారు. కోవిడ్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. స్వల్పసంఖ్యలో కేసులు బయటపడిన చోట్ల కూడా క్వారంటైన్, లాక్డౌన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. బీజింగ్‌లోని ప్రముఖ బౌద్ధాలయాలు, చర్చిలు, మసీదులను జనవరి నుంచి నిరవధికంగా మూసే ఉంచారు.చైనాలో ఇప్పటి వరకు 1,11,195 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,837 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. -
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రూ.2 వేల జరిమానా రూ.500కు తగ్గింపు
న్యూఢిల్లీ: కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోర్ వీలర్ వాహనాల్లో కలిసి ప్రయాణించేవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 28(సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు మాస్క్ తప్పనిసరి ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధలను విధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగితే విధించే రూ.2 వేల జరిమానాను రూ.500 తగ్గిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఫోర్ వీలర్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మాస్క్ ధరించాలన్న నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం తొలగించింది. కారులో ఒక్కరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. -
పేరుకు పొలిటికల్ లీడర్.. పాపం ఇలా బుక్కయ్యాడు.. వీడియో వైరల్
సాక్షి, ముంబై: పేరుకు ఆయనో పెద్ద లీడర్.. కానీ, మాస్కు పెట్టుకోవడం మాత్రం రాదు. కరోనా సమయంలో మాస్కు ధరించాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ప్రభుత్వాలు మాస్కులు ధరించని వారికి జరిమానాలు సైతం విధించింది. దీంతో పల్లెటూరు నుంచి పట్నం దాకా.. మాస్కు ఎలా ధరించాలో అందరికీ తెలిసిపోయింది. కాగా, శివసేన పార్టీకి చెందిన ఓ నేత తాజాగా మాస్కు ధరించేందుకు 2 నిమిషాల పాటు తర్జనభర్జన పడ్డారు. అప్పటికీ మాస్కు ఎలా పెట్టుకోవాలో తెలియక మరో వ్యక్తి సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన తీరుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన 41 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, శివసేన నేతలు గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో శివసనే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుండగా.. ఆయన వెనుక నిలుచున్న ఓ శివసేన నేత.. ఎన్-95 మాస్కును ఎలా ధరించాలో తెలియక దాదాపు రెండు నిమిషాలు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాస్కు పెట్టుకోవాడం రాకపోవడంతో చివరకు పక్కనున్న మరో నేత సాయం కోరాడు. ఆయన సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నేతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటు.. మాస్క్ పెట్టుకోగానే ప్రజలు సంబురాలు చేసుకున్నట్లు ఓ స్పూఫ్ వీడియో కూడా జతపరిచారు. w8 for it...! 😁 pic.twitter.com/uG7gkaNLBg — Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022 -
సాక్షి కార్టూన్ 14-02-2022
ఇలా అలవాటు పడ్డాం! మాస్కులేకుండా మళ్లీ మనుషుల్ని గుర్తుపట్టడం కష్టమవుతుందేమో!! -
మాస్కా మజాకా.. ఈ కార్టూన్ చూడండి.. భాష అక్కర్లేదు..
ఇరాన్ కార్టూనిస్ట్ ఆయత్ నదేరి యానిమేటర్, యానిమేషన్ డైరెక్టర్ కూడా. ఇదంతా ఒక ఎత్తయితే టీచర్‌గా ఆయత్‌కు మంచి పేరు ఉంది. ఇస్ఫాహన్ యూనివర్శిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఆయన చెప్పే పాఠాలు ఎన్నో కుంచెలకు పదును పెట్టాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడైన ఆయత్‌కు కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయి? చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్ ‘ప్రయాణంలో’ అని చెబుతారు ఆయన. ఆయత్‌కు నచ్చిన ఇరాన్ కార్టూనిస్ట్ మాసూద్. ఏడు సోలో ఎగ్జిబిషన్స్ చేసిన ఆయత్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. తన తొలి కార్టూన్ ‘పర్యావరణం’ అనే అంశంపై వేశాడు. అది తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా వేసిన ఈ కార్టూన్ చూడండి. భాష అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మూలకు తీసుకువెళ్లినా అర్ధమవుతుంది. కరోనాకు మాస్కే మందు, మాస్కే తిరుగులేని ఆయుధం. -
రాగితో మాస్కు.. 99.9 శాతం బ్యాక్టీరియా నాశనం.. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి మాస్కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దాదాపు అన్ని చోట్లా ‘మాస్క్ తప్పనిసరి’ చేశారు. అయితే కరోనాతో పాటు అన్ని బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే మాసు్కలు వచ్చేస్తే! ఇలాంటి మాసు్కనే ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ (ఏఆర్‌సీఐ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తయారు చేశారు. రాగిని నానో స్థాయిలో వాడి రూపొందించిన ఈ కొత్త రకం మాసు్కను బెంగళూరుకు చెందిన రెసిల్ కెమికల్స్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. 20 నానోమీటర్ల సైజున్న రాగి కణాలతో.. బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకోగల మాసు్కలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నా వాటి ఖరీదు ఎక్కువ. అందుకే ఏఆర్‌సీఐ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు చౌకైన యాంటీవైరల్ మాస్కు తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేపట్టిన నానో మిషన్‌లో భాగంగా 20 నానోమీటర్ల సైజున్న రాగి కణాలను తాము తయారు చేశామని, వస్త్రంపై ఈ కణాలతో కూడిన పూత పూయడం ద్వారా 99.9 శాతంతో బ్యాక్టీరియాను నాశనం చేయగలిగామని ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త ఎన్. తాతారావు తెలిపారు. అలాగే సీసీఎంబీ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వైరస్ 99.9 శాతం నశించినట్టు గుర్తించారు. నానో కణాల పూత ఉన్న మాస్కు ఒక్క పొరతో ఉన్నా ప్రభావం బాగా కనబడింది. ప్రస్తుతం రెండు పొరలున్న మాసు్కను రెసిల్ సంస్థ పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఈ మాసు్కలను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతోంది. వీటిని సాధారణ మాసు్కల్లా శుభ్రం చేసుకుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు కూడా. -
సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?
కరోనా టైంలో ‘మాస్క్ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొవిడ్-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ జస్మిత్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్ పంపింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. -
మాస్క్ ఉన్న చల్తా... వారి ఫోన్ ఇట్టే అన్‌లాక్..!
కోవిడ్-19 రాకతో మాస్క్ ప్రతి ఒక్కరికి మస్ట్ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్‌ను ధరించడంతోనే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరీను..! ఫేస్ అన్ లాక్ ఫీచర్ కల్గిన స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా మాస్క్‌ను తీసే ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసి అన్‌లాక్ చేయాలి. ఫేస్ ఐడి అన్‌లాక్ కల్గిన ఫీచర్ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్ ఉన్న కూడా ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్‌ను త్వరలోనే యాపిల్ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ వెర్షన్లో..! యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్ ఐడీ అన్‌లాక్ ఫీచర్‌తో మాస్క్ ధరించిన ఫోన్లను లాక్చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్ వెర్షన్ నుంచి ఐవోఎస్ 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. మాస్క్ ఒక్కటే కాదు..! గతంలో ఐఫోన్లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, యాపిల్ వాచ్‌ను ఉపయోగించి సదరు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ సహాయంతో ఇకపై పాస్వర్డ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్‌తో ఐఫోను లాక్ చేసే అవకాశాన్ని యాపిల్ తన యూజర్లకు కల్పించనుంది. 'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్ సహాయంతో ఈ ఫీచర్‌ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్‌లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్‌తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్ కొత్త వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ పరిమితం కానుంది. చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..! -
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్‌లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్‌తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
గరిష్టానికి ఒమిక్రాన్ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!
లండన్: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది. గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు. ప్రజలు వర్క్ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ చెప్పారు. బ్రిటన్‌లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు. ప్లాన్ బీ టు ఏ ఓఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్ గరిష్టానికి చేరిందని హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రధాని తెలిపారు. ఓఎన్ఎస్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్‌లో ఇన్ఫెక్షన్ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్‌లో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్ అంచనా వేశారు. కోవిడ్ దాదాపు ఎండమిక్ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు. -
‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’
సాక్షి, హైదరాబాద్: ‘సిటీబస్సుల్లో ప్రయాణికులు మాస్కులు ధరించి ప్రయాణం చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు మాత్రం మాస్కులు సరిగా ధరించడం లేదు.ఇది ఇబ్బందిగా ఉంది’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే ఆర్టీసీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సంక్రాంతి రద్దీ సమయంలో స్వయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో తనిఖీలు సైతం నిర్వహించారు. ప్రయాణికులు, కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో ఈ ఆదేశాలు పెద్దగా అమలుకు నోచుకోవడం లేదు. యథావిధిగా కండక్టర్లు, డ్రైవర్లు మాస్కులు సరైన పద్ధతిలో ధరించకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 20 లక్షల మంది ప్రయాణం.. రెండు రోజులగా సంక్రాంతి దృష్ట్యా సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. సాధారణంగా రోజుకు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. కోవిడ్ రెండో ఉద్ధృతి అనంతరం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో సిటీ బస్సుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో పలు మార్గాల్లో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి బస్సులో ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్ వేగంగా వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన ప్రయాణికులతో పాటు, డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కోవిడ్ ఆరంభంలో ఈ దిశగా ఆర్టీసీ విస్తృత స్థాయిలో అవగాహన కల్పించింది. ప్రయాణికులను, సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేసింది. బస్సులను సైతం పూర్తిగా శానిటైజ్ చే శారు. కానీ మూడో ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడ ంపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రో రైల్ తరహాలో నియంత్రణ.. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటే మాస్కు తప్పనిసరిగా ఉండాల్సిందే. మాస్కులేని ప్రయాణికులను గుర్తించి అవగాహన కల్పించేందుకు ఇటీవల మెట్రో రైళ్లలో తనిఖీలను విస్తృతం చేశారు. సిటీ బస్సుల్లోనూ ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా డిపో స్థాయి అధికారులు అవగాహన చర్యలు చేపట్టడం మంచిది. చదవండి: Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు పెరగనున్న రద్దీ.. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన నగరవాసులు రానున్న రెండు రోజుల్లో తిరిగి నగరానికి చేరుకోనున్నారు. దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకొనే ప్రయాణికులతో సిటీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. మాస్కుల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వైరస్ విజృంభించే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ మాస్కులను కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించడం ఒకటే పరిష్కారం అని వైద్యులు సూచిస్తున్నారు. -
ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. ముంబై తర్వాత హైదరాబాదే.. కోవిడ్ కేసుల్లో కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. థర్డ్ వేవ్ భయాలు అన్ని రాష్ట్రాలను చుట్టుముడుతున్నా.. ప్రజలు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించాలని, పక్కాగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ముంబై, సిమ్లా, కోల్‌కతా, జమ్మూ, చెన్నై, గువాహటి, చండీగఢ్, పుణే, రాయ్‌పూర్‌లలో డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నవంబర్, డిసెంబర్ మాసాలలో మాస్కుల ధరింపుపై సర్వే నిర్వహిస్తే ఒక్క ముంబై మినహా మరే నగరంలోనూ 50 శాతానికి మించి ప్రజలు మాస్కులు ధరించట్లేదని తేటతెల్లమైంది. చదవండి: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్: మంత్రి క్లారిటీ మాస్కులను పురుషులకన్నా మహిళలే ఎక్కువగా ధరిస్తున్నట్టు వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ముంబైలో 76.28 శాతం మంది మాస్కులు ధరిస్తుండగా, మిగతా ఏ నగరంలోనూ 50 శాతానికి మించి ధరించడం లేదని తేలింది. ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే 45.75శాతం మంది పూర్తి స్థాయిలో, 17.10 శాతం మంది పాక్షికంగా మాస్కులు ధరిస్తున్నారు. చదవండి: యూపీలో బీజేపీ భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో.. కాగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,920 కరోనా కేసులు రికార్డయినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో ప్రకటించింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,015 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కరోనా కేసులు 6,97,775కు చేరింది. ఇక మంగళవారం 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా మహారాష్ట్రలో కొత్తగా 34,424 కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముంబైలోనే 11,647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,21,477కు చేరింది. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు1,281కి పెరిగాయి. చదవండి: కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు.. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఎలాంటి మాస్క్‌లు ధరించాలంటే..
కొత్త సంవత్సర వేడుకలు, పండుగల నేపథ్యాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభించొచ్చన్న వైద్య వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయన్న ఆందోళన నడుమే.. వ్యాక్సినేషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది కూడా. అదే తరుణంలో మాస్క్‌ల వాడకం, ఇతర జాగ్రత్తల గురించి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనా వేరియెంట్లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియెంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో వైద్య నిపుణులు ‘మాస్క్ అప్‌గ్రేడ్’ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. అంటే.. ఇప్పుడు వాడుతున్న వాటి కంటే మెరుగైన మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ వేరియెంట్ల స్థాయికి సాధారణ మాస్క్‌లు సరిపోవంటున్నారు గ్లోబల్ హాస్పిటల్స్ పల్మనాలిజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ ఛాప్లే. సాధారణ మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల కంటే.. ఎన్95, ఎఫ్ఎఫ్పీ2, కేఎన్95 మాస్క్‌లు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందిని ఇవి కచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఇన్ఫెక్షన్కు గురయ్యే హైరిస్క్ ఉన్న వాళ్లు ఈ తరహా మాస్క్‌లు ఉపయోగించాలని చెప్తున్నారు. అయితే ఇమ్యూనిటీ జోన్లో ఉన్నవాళ్లు, వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకున్నవాళ్లు క్లాత్ మాస్క్‌ల ద్వారా కూడా రక్షణ పొందవచ్చని ఇంటెర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ వినీత తనేజా చెప్తున్నారు. కాకపోతే సింగిల్, డబుల్ లేయర్ మాస్క్‌ల కంటే మూడు పొరల మాస్క్‌ల్ని ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఒకవేళ సింగిల్, డబుల్ లేయర్ మాస్క్‌లు గనుక ఉపయోగిస్తున్నట్లయితే.. వాటిపైనా మరో మాస్క్ ధరించడం మేలని చెప్తున్నారు. ఇక ఎలాంటి మాస్క్ ధరించాలని ఎంచుకోవడం కంటే.. దానిని సరిగా ధరించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఎందుకంటే వైరస్ వేరియెంట్లు ఎంత ప్రమాదకరమైనవి అయినా.. రక్షణ కల్పించే మార్గం ఎక్కువగా ఇదొక్కటి మాత్రమే అని డాక్టర్ వినీత చెప్తున్నారు. చాలామంది మాస్క్‌ను కిందకి పైకి జారవేస్తూ ఉంటారు. కానీ, దీనివల్ల రిస్క్‌కు ఛాన్స్ ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్‌ను ముక్కు పైభాగం నుంచి గదవ భాగం వరకు పూర్తిగా కప్పి ఉంచడం ఉత్తమమని డాక్టర్ వినీత చెప్తున్నారు. ఉత్తగా ధరించడం కాదు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చాలామంది జాగ్రత్తలను పక్కాగా పాటించారు. అయితే రాను రాను ఆ వ్యవహారం చిరాకు తెప్పించడమో లేదంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన ధైర్యమోగానీ ఆ అలవాట్లను చాలావరకు దూరం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌ల విషయంలో అయినా కనీస జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ టిప్స్ ►మాస్క్‌లను తీసేటప్పుడు, ధరించేటప్పుడు వాటి చివరల దారాలను మాత్రమే ముట్టుకోవాలి. ►క్లాత్ మాస్క్‌లను ఒక్కసారిగా వాడాక శుభ్రంగా ఉతకాలి. వేడినీళ్లలో ఉతక్కూడదు. ►సర్జికల్ మాస్క్‌లను మళ్లీ ఉపయోగించడం మంచిదికాదు. ►ఇంట్లో అందరి మాస్క్‌లను కలిపి ఉంచకూడదు. విడివిడిగా ఉంచాలి. ►మాస్క్ మీద శానిటైజర్ చల్లడం, రుద్దడం లాంటివి చేయకూడదు. ►మాస్క్‌లకు డ్యామేజ్లు, లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ►ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్‌లను పదే పదే కిందకి జరపడం లాంటివి చేయకపోవడం మంచి అలవాటు. ►పిల్లలకు నాన్ మెడికల్ మాస్క్‌లు వాడడం మంచిది. ►పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే గనుక వైద్యులను సంప్రదించి మెడికల్ మాస్క్‌లు వాడొచ్చు. ►మాస్క్ జాగ్రత్తగా వాడడమే కాదు.. వాటిని పారేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించడం ఒక బాధ్యత. మరికొన్ని.. ♦పదే పదే ముఖాన్ని చేతులతో రుద్దకపోవడం. ♦సామూహిక భోజనాలకు దూరంగా ఉండడం. ♦తరచూ చేతుల్ని సబ్బుతో, హ్యాండ్‌వాష్‌తో క్లీన్ చేసుకోవడం. ♦చలికాలంలో జలుబు, ఇతర సమస్యల కారణంగా అలర్జీతో ముక్కులో వేలు పెడుతుంటారు. అలా చేయకపోవడం ఉత్తమం. ♦శానిటైజర్ రాసిన చేతులతో తినుబండారాల్ని తాకరాదు. ♦శానిటైజర్‌ను క్యారీ చేయడం మరీ మంచిది. మాస్క్‌ను ధరిస్తూ శుభ్రతను పాటిస్తూ వీలైనంత మేర భౌతిక దూరం పాటిస్తే సాధారణ జాగ్రత్తలతోనూ కరోనా వేరియెంట్లను జయించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
ఒమిక్రాన్ అలర్ట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్ నియంత్రణకు ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ/పోలీసు కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆంక్షలు ఇవీ... ► కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తూ ఇతర జన సామూహిక కార్యక్రమాలు జరుపుకోవాలి. ► ఈ కార్యక్రమాల్లో భౌతికదూరం నిబంధన పాటించడం తప్పనిసరి. ► మాస్క్ లేకుండా ఏ వ్యక్తినీ సామూహిక కార్యక్రమాలకు అనుమతించరాదు. ► ప్రవేశద్వారం వద్ద ఐఆర్ థర్మామీటర్లు/థర్మల్ స్కానర్లతో లోపలికి వచ్చే వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించాలి. ► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వ్యక్తులపై జరిమానాలను విధించాలన్న గత ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలి. మరో ముగ్గురికి ఒమిక్రాన్ రాష్ట్రంలో కొత్తగా మూడు కోవిడ్–19 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 30కి చేరింది. వీరిలో పది మంది రికవరీ అయ్యారు. శనివారం విదేశాల నుంచి 333 మంది వచ్చారు. వీరిలో 8 మందికి కోవిడ్–19 పాజిటివ్‌గా తేలగా, ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్‌కు తరలించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. జీనోమ్ సీక్వెన్స్‌కు సంబంధించి మొత్తం 20 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, రాష్ట్రంలో కొత్తగా 140 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఇప్పటివరకు 6,80,553 మంది కరోనా బారిన పడగా, 6,73,033 మంది కోలుకున్నారు. మరో 3,499 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 4,267 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. -
మాస్క్ మస్ట్.. ధరించకుంటే రూ. 100 జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నోరు, ముక్కు పూర్తిగా మూసి ఉండేలా మాస్క్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి రూ. 100 జరిమానా విధించడాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు వెలువరించారు. మార్గదర్శకాల అమలు పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఇతర మార్గదర్శకాలు ఇలా.. ► మాస్క్ ధరించని వ్యక్తులను దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల్లోకి అనుమతిస్తే పరిస్థితుల తీవ్రతను బట్టి యజమాన్యాలకు రూ. 10–20 వేలు జరిమానా విధింపు. ► కరోనా నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, ఇతర దుకాణాలను 1–2 రోజుల పాటు మూసివేత. ► నిబంధనల ఉల్లంఘనలపై వాట్సప్ ద్వారా 8010968295 నంబర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేయడానికి అవకాశం. ► పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో 500లకు మించి ప్రజలు పాల్గొనడానికి వీలు లేదు. పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్క్ ధారణ, భౌతిక దూరం వంటి ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ► ఉద్ధేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ చట్టం–2005, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు. -
Telangana: మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా
సాక్షి, హైదరాబాద్: ‘‘ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఓ ప్రమాద హెచ్చరిక. కరోనా మొదటి, రెండో వేవ్‌లలో ఎలాంటి హెచ్చరికలు రాలేదు. కానీ ఇది హెచ్చరికలు చేసింది. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుందాం. తద్వారా కొత్త వేరియంట్‌ను తరిమికొడదాం. మూడో వేవ్ రాకుండా చూసుకుందాం’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కరోనా కొత్త వేరియంట్, రాష్ట్రంలో జాగ్రత్తలు తదితర అంశాలపై గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోందని.. ఆంక్షలు పెట్టినా కొద్దిరోజుల్లోనే నాలుగు దేశాల నుంచి 24 దేశాలకు పాకిందని తెలిపారు. అందువల్ల అందరూ మాస్కులు పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేశారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. తక్కువ వ్యాక్సిన్లు వేసిన జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని.. రెండు మూడు రోజుల్లో ఉన్నతస్థాయి అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుందని చెప్పారు. మన ప్రవర్తన మీదనే కొత్త వేరియంట్ల వ్యాప్తి ఆధారపడి ఉందన్నారు. పండుగలు, ఫంక్షన్లను జాగ్రత్తల నడుమ చేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో 48 మంది, ఖమ్మం జిల్లాలో 28 మంది విద్యార్థులకు కరోనా వచ్చిందని.. ఒక జిల్లా వైద్యాధికారికీ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ బుధవారం యూకే, సింగపూర్ దేశాల నుంచి 325 మంది రాష్ట్రానికి వచ్చారని.. అందులో తెలంగాణకు చెందినవారు 239 మంది ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆమెను టిమ్స్ ఆస్పత్రికి తరలించామని.. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు. ఆమె శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని, రెండు మూడు రోజుల్లో ఫలితం వస్తుందని వెల్లడించారు. మిగతా ప్రయాణికులకు నెగెటివ్ వచ్చిందని.. అయినా వారందరికీ మరో ఏడెనిమిది రోజుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని తెలిపారు. శంషాబాద్‌లో పకడ్బందీగా పరీక్షలు ‘ఒమిక్రాన్’ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులందరినీ స్క్రీనింగ్ చేస్తున్నారు. కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి వస్తున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చేదాకా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే.. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ♦రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా రెండో డోస్ తీసుకోలేదు. అందులో 15 లక్షల మందికిపైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. వారంతా రెండో డోస్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోకపోవడం ఆత్మహత్యతో సమానం రాష్ట్రంలో 80 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం మనకుందని.. కానీ రెండున్నర లక్షలకు మించి తీసుకోవడం లేదని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోకపోవడం ఆత్మహత్యతో సమానమని వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ రావడానికి అక్కడ వ్యాక్సినేషన్ సరిగా జరగకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలంతా విధిగా మాస్కులు పెట్టుకోవాలని.. ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని పోలీసు శాఖను కోరామని తెలిపారు. రాష్ట్రంలో రెండు మూడు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. -
West Bengal: 108 గ్రాముల బంగారంతో.. గోల్డ్ మాస్క్!! జనాల్లో ధరించలేక..
జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందనే సామెత వినే ఉంటారు. మరి బంగారం ఉంటే..!! అవును.. ఇతగాడు బంగారంతో ఏకంగా మాస్క్ చేయించుకున్నాడు. ఈ గోల్డ్ మాస్క్ ముచ్చట్లేమిటో తెలుసుకుందాం.. కోవిడ్ వచ్చాక మన జీవితాల్లో మాస్కులు కూడా ఒక భాగమైపోయాయి. వీటిని ధరించడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనుసరిస్తున్నారు. మ్యాచింగ్ మాస్కులు, ఫొటో ఫ్రింట్ మాస్కులు, ఏ చీర కామాస్కు.. ఇలా ఎన్నో. ఐతే వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 108 గ్రాముల బంగారంతో రూ. 5 లక్షల 70 వేల ఖరీదు చేసే గోల్డ్ మాస్క్ చేయించుకున్నాడు. దీనిని చందన్ దాస్ అనే జ్యువెలరీ డిజైనర్‌తో ప్రత్యేకంగా తయారు చేయించాడట. కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ వేడుకల సందర్భంగా సదరు వ్యాపారవేత్త ముచ్చటపడి చేయించుకున్న గోల్డ్ మాస్క్‌ను ధరించాడు. ఐతే జనాలు గోల్డ్ మాస్కును చూసేందుకు చుట్టూ మూగడంతో కాసేపట్లోనే తీసి జేబులో దాచుకున్నాడు. రీతుపర్నా చటర్జీ అనే జర్నలిస్ట్ గోల్డ్ మాస్క్‌కు సంబంధించిన ఫొటోలను ‘వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్?' అనే క్యాప్షన్‌తో ట్విటర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వెరల్ అయ్యాయి. తనకు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువని, అందుకే బంగారంతో మాస్కు చేయించుకున్నాడని, మెడలో రకరకాల బంగారు గొలుసులు, రెండు చేతులకు అనేక ఉంగరాలు ధరించినట్లు స్థానిక మీడియాకు సదరు వ్యాపారవేత్త తెలిపాడు. ఏదిఏమైనా కోవిడ్ కాలంలో కడుపునింపుకునేందుకు జనాలు నానాఅగచాట్లు పడ్డారు. అటువంటిది ఇతగాడు తన సంపదను ప్రదర్శించుకునేందుకు ఏకంగా గోల్డ్‌తో మాస్క్ చేయించుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందీ గోల్డ్ మాస్క్. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. What is the purpose of this? pic.twitter.com/Zy4MqIPNCZ — Rituparna Chatterjee (@MasalaBai) November 10, 2021 -
మాస్కు ధరించకుంటే మూడో వేవ్ తప్పదు
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ మొదటి రెండు దశలతో జనం బాగా భయపడ్డారు. ఇక మూడో దశ వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. కానీ కొన్ని హెచ్చరికల్లో పేర్కొన్నట్లుగా మూడో దశ వెంటనే రాలేదు. ఇక భయం లేదు, కోవిడ్ అంతమైందన్న భావనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు అక్కడక్కడా కొందరు తప్ప ఎవరూ మాస్కులు ధరించటం లేదు. కానీ ఇది చాలా ప్రమాదకర పరిణామం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, సూచనలను పెడచెవిన పెట్టిన ఫలితంగా అటు రష్యా, ఇటు యూకేల్లో ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తోంది. ఇది మనకు ఓ హెచ్చరికలాంటిది. ప్రస్తుతం ఉన్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో దశ రావటానికి పెద్దగా సమయం పట్టదన్న విషయాన్ని గుర్తించాలి’ అని ఇంటిగ్రేటివ్ స్పెషలిస్టు, మైక్రోబయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస హెచ్చరించారు. కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఇది క్రమంగా మూడో దశగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ‘సాక్షి’ తో పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వాక్సిన్లతో అతి ధీమా వల్లే.. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సిల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని జనం ఎదురు చూశారు. ప్రపంచంలో ఎక్కడ తయారైనా సరే, అందుబాటులోకి వస్తే మహమ్మారి అంతమవుతుందని భావించారు. ఇప్పుడు సొంత తయారీ వ్యాక్సిన్లు మనకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం ఎదురుచూసినప్పుడు ఉన్న అభిప్రాయమే జనంలో ఇప్పటికీ ఉందని ప్రస్తుతం వారి తీరును బట్టి అర్ధమవుతోంది. వ్యాక్సిన్ వస్తే కోవిడ్ వైరస్ అంతమైనట్లేనని ఆదిలో భావించారు. ఇప్పుడు వ్యాక్సిన్లు వచ్చాయి. సింహభాగం జనం వ్యాక్సిన్లు వేసుకున్నారు. క్రమంగా రెండో డోస్ వేయించుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టీకా తీసుకున్నాం కదా ఇక ఢోకా లేదన్న ధీమాలోకి చేరుకున్నారు. వెంటనే మాస్కులు విసిరేశారు. ఇప్పుడు ఈ ధోరణే ప్రమాదకరంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్లు సురక్షితం మాత్రమే.. రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో ఇక కోవిడ్ సోకదనే భ్రమ ప్రజల్లో ఉంది. దాని నుంచి బయటపడాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నతర్వాతకూడా వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులకు వస్తున్న వారిని చూస్తే ఇది అవగతమవుతుంది. ఏ వ్యాక్సిన్ తయారీ కంపెనీ కూడా, రెండో డోసు తర్వాత కోవిడ్ సోకదు అని ప్రకటించని విషయాన్ని జనం గుర్తించాలి. వైరస్ సోకినా ప్రాణాంతకం కాకుండా ఉండేందుకు మాత్రమే వ్యాక్సిన్లు ఉపకరిస్తాయిచ, తప్ప వైరస్ సోకకుండా అడ్డుకోలేవు. వైరస్ సోకద్దంటే కచ్చితంగా మాస్కు ధరించటంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. మరికొన్ని నెలలు వీటిని పాటిస్తే వైరస్ ప్రభావం బాగా తగ్గిపోయి సురక్షితంగా ఉండొచ్చు. వైరస్ ముప్పు తొలగలేదని, క్రమంగా అది ఎండమిక్ స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తించాలి. వైరస్ రూపాంతరం చెందినప్పుడలా ప్రభావం చూపుతుంది. సురక్షిత మాస్కులను ధరించటం, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం మినహా ప్రస్తుతానికి తరుణోపాయం లేదు. మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితిని మర ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి. వచ్చేది చలికాలం. వ్యాధులు ముసిరే కాలం. దగ్గు, జలుబుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కోవిడ్ వైరస్ విజృంభిస్తే వ్యాధి బారిన పడే వారి సంఖ్య అతి వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఆ రెండు దేశాల ధోరణి ఇలాగే.. అమెరికాలో చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిగింది. టీకాలు వేసుకున్నాక మాస్కుల అవసరం లేదన్న ప్రకటనలూ జారీ అయ్యాయి. ఆదిలో కోవిడ్‌తో వణికిపోయిన యూకేలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజలు మాస్కులతో పాటు కోవిడ్ నిబంధనలను పాతరేయటంతో ఒక్కసారిగా తదుపరి దశ ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ యూకే వణికిపోవటం మొదలుపెట్టింది. రష్యాలో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటమే కాదు, శ్మశానవాటికల్లో స్థలం కూడా లభించటం లేదు. ఆ దేశాలకంటే ఎన్నో రెట్లు జనాభా ఉన్న మన దేశంలో మూడో దశ మొదలైతే పరిస్థితి చేయిదాటిపోతుంది. -
కోవిడ్ జరిమానాలు కట్టిన వారు 40.33 లక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా కట్టిన వారు 2021 అక్టోబర్ 15 నాటికి 40,33,798 మంది.. వారు కట్టిన జరిమానా మొత్తం రూ.31,87,79,933గా తేలింది. మాస్క్ లేకుండా బయటకు వెళ్లడం, గుంపులు గుంపులుగా ఉండటం, వ్యాపార సముదాయాల్లోకి మాస్క్ లేకున్నా అనుమతించడం.. తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీగానే జరిమానాలు కట్టారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలో 11.41 లక్షల మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల్లో వెల్లడైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారు విశాఖపట్నంలో ఎక్కువగా ఉండగా, జరిమానా వసూళ్లలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కనీవినీ ఎరుగని రీతిలో చిత్తూరు జిల్లా నుంచి రూ.6.01 కోట్లు వసూలయ్యాయి. అనంతపురం జిల్లాలో సైతం 4.88 లక్షల మంది నిబంధనలు ఉల్లంఘించగా.. రూ.4.98 కోట్లకు పైగా వసూలైంది. గుంటూరు, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లోనూ జరిమానాలు రూ.కోటి దాటాయి. -
Covid-19: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ ఇంకా కనుమరుగు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య విభాగం సంచాలకుడు జి. శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిందని, రోజుకు సగటున రెండొందల మంది వైరస్‌బారిన పడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ మూడో దశ వ్యాప్తిపై స్పష్టత లేనప్పటికీ ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే వైరస్ కట్టడి ఆధారపడి ఉంటుందన్నారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో కోవిడ్, సీజనల్ వ్యాధులపై శ్రీనివాసరావు మాట్లాడారు. ‘ఈ ఏడాది జూన్‌లో 85–90% మధ్య ఉన్న మాస్కుల వినియోగం ప్రస్తుతం 15శాతానికి పడిపోయింది. భౌతికదూరం నిబంధనను ఎవరూ పాటించడం లేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు మాసాలు అత్యంత కీలకం. ప్రస్తుతం పండుగ సమయం కావడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. జనసమూహాలున్న చోటకు వెళ్లడం తగ్గించుకోవాలి. ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మూడు నెలల తర్వాత ఎలాంటి వేరియంట్ వచ్చినా మనకేమీ కాదు. కానీ జాగ్రత్తలు మరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని శ్రీనివాసరావు హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాల్లో అధిక కేసులు... ‘రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలోకి వచ్చినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం రాకపోకలు విపరీతం కావడంతో అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఎక్కువ మంది వస్తున్నారు. ఇటీవల కోవిడ్‌తో 17 ఏళ్ల బాలిక మరణించింది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉంటున్నారు’అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 9 వేల కేంద్రాల్లో టీకాలు... ‘రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విస్తృతంగా సాగుతోంది. 9వేల కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నాం. ప్రస్తుతం 30 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోస్ 72 శాతం మందికి ఇచ్చాం. ఇప్పటికే 2 కోట్లకుపైగా తొలి డోసు అందించగా వారిలో 32 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది మొదటి డోసు తీసుకుని గడువు దాటినా రెండో డోసు తీసుకోలేదు. వారంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వారే. టీకా తీసుకున్న వారికి కోవిడ్ వచ్చినా రిస్క్ ఉండదని శాస్త్రీయంగా రుజువైంది. రాష్ట్రంలో 1.2 కోట్ల మంది 18 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వారికి టీకా ఇవ్వాలని కేంద్రం ఆదేశిస్తే వేగంగా చర్యలు చేపడతాం’ అని శ్రీనివాసరావు వివరించారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 183 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 6,68,070 మంది కరోనా బారిన పడగా.. 6,59,942 మంది కోలుకున్నారు. -
కంగనా..సెలబ్రిటీలకు రూల్స్ వర్తించవా?
Kangana Ranaut Ignores No Mask, No Entry Sign: కంగనా రనౌత్ తాజాగా ముంబై విమానాశ్రయాంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులిస్తూ లోపలికి కదిలింది. అయితే నో మాస్క్, నో ఎంట్రీ అనే బోర్డు ఉన్నా కంగనా ఏమాత్రం పట్టించుకోలేదు. మాస్క్ లేకుండానే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ ఈ విషయంపై ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ.. కంగానాకు అతి దగ్గర్లోనే ‘నో మాస్క్, నో ఎంట్రీ’బోర్డు ఉంది. అయినా నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండానే వెళ్లిపోయింది. ఎన్నికల తర్వాత ఎలా అయితే రాజకీయ నాయకులు ఓటర్లను పట్టించుకోరో, కంగనా కూడా నియమాలను విస్మరించింది అంటూ దుయ్యబట్టారు. మాస్క్ లేకపోతే లోపలికి ప్రవేశం లేదు అనే నియమం సెలబ్రిటీలకు మాత్రం వర్తించవా అంటూ మరో యూజర్ ప్రశ్నించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలె కంగనా తలైవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
మాస్క్ పెట్టుకోలేదని జవాన్‌ను కొట్టి.. కాలుతో తన్నిన పోలీసులు
పట్నా: మాస్క్ పెట్టుకోలేదని భారత జవాన్ని జార్ఖండ్ పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన ఛాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ముగ్గురు పోలీసు సిబ్బందిని, మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. పోలీసులు చితకబాదిన జవాన్‌ను పవన్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఓ ప్రాంతంలో పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఆరా-భూసాహి గ్రామానికి చెందిన యాదవ్ తన బైక్‌పై ఆ రూట్లో వెళ్తున్నాడు. మాస్క్ లేకపోవడంతో పోలీసులు యాదవ్‌ని అడ్డుకుని నిలదీశారు. ఈ క్రమంలో ఓ పోలీసు దురుసుగా బైక్ తాళాలు లాక్కోగా యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జవాన్ మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో అక్కడున్న పోలీసులు అతడిని రౌండప్ చేసి కొట్టడమే కాకుండా కాలుతో కడుపులో తన్నారు. ఆశ్చర్యమేమంటే జవాన్ని కొడుతున్న పోలీసులకు కూడా మాస్క్ లేదు. చివరికి గ్రామస్థులు జోక్యం చేసుకోవడంతో జవాన్‌ను మయూర్‌హండ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R — VR (@vijayrampatrika) September 2, 2021 చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
మాస్క్ లేకపోతే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది : హీరోయిన్
కరోనా మహమ్మారి ప్రజల్లో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ ప్రభావంతో మాస్క్, శానిటైజర్ మన జీవితంలో ఓ భాగమయ్యాయి. అసలు మాస్క్ పెట్టుకోకపోతే చాలామందికి ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. తాజాగా మలయాళీ భామ మాళవిక మోహనన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'షూటింగ్ సమయంలో కఠిన భద్రతా నియమాలు పాటిస్తున్నాం. నటీనలులు తప్పా మిగతా అందరూ విధిగా మాస్కలు ధరిస్తారు. కానీ మేం కానీ షూట్ చేస్తున్నంతసేపు మాస్క్ తీసేయాల్సి ఉంటుంది. గత ఏడాదిగా మాస్క్ పెట్టుకోవడానికి బాగా అలవాటు పడ్డాం. కానీ ఒక్కసారిగా సెట్లో మాస్క్ తీసేయమంటే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది' అని పేర్కొంది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. పేటా, మాస్టర్ చిత్రాలతో గుర్తింపు పొందిన మాళవిక ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మారన్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా ధనుష్ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఇది వరకే విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో హీరోయిన్గా అవకాశం పొందినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయిని, త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇస్తానని వెల్లడించింది. చదవండి : డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన 'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు' -
‘కొంత మంది మనుషుల కన్నా.. ఈ కోతి చాలా నయం’
దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికి వైరస్ తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికీ మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, చాలా చోట్ల జనాలు కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్న సంఘటనలు ప్రతిరోజు వార్తల్లో చూస్తునే ఉన్నాం. అయితే, ఇక్కడో కోతి మాత్రం తాను మూతికి మాస్క్ ధరిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. కాగా, ఇక్కడ కోతి చేష్టలు ఫన్నీగా ఉన్నా.. అది ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. దీనిలో రోడ్డుపక్కన కోతుల గుంపు ఉంది. దానిలో ఒక కోతి రోడ్డుపై పడి ఉన్న నలుపు రంగు మాస్క్‌ను తీసుకుంది. దాన్ని చేతిలో తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసింది. ఆ తర్వాత దాన్ని తన మొహనికి పెట్టుకుంది. అంతటితో ఆగకుండా అటు ఇటూ కాసేపు తిరిగింది. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేవు. కాగా, దీన్ని ఫ్రెడ్ షుల్ట్జ్ అనే ట్విటర్ యూజర్ తన అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘కొంత మంది మనుషుల కన్నా.. కోతులే నయం..’,‘కోతి భలే మాస్క్ వేసుకుంది..’,‘ఇప్పటికైన కరోనా నియమాలు పాటించండి’అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
వానర విన్యాసం.. చూసిన వారు ఔరా అనాల్సిందే!
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో సోమవారం ఉదయం ఓ వానర విన్యాసం చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. స్థానిక శంకరప్పతోట వీధిలో ఓ ఇంటి ఎదుట పడి ఉన్న మాస్క్ తీసుకుని అటూఇటూ తిప్పి పరిశీలించిన వానరం.. అనంతరం దానిని మూతికి, ముక్కుకు వేసుకునే క్రమంలో తన ముఖం మొత్తం కప్పేసుకుని చకచకా ఇంటిపైకి చేరుకుంది. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు... కరోనా బారిన పడకుండా ఇకపై తాము కూడా మాస్క్ ధరించాలంటూ చర్చకు తెర తీశారు. -
ఒక్క మాస్క్‌తో రూ.7.5 కోట్లు వసూళ్లు
గురుగ్రామ్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్‌ఫోన్ లేకున్నా పర్లేదు కానీ మాస్క్ మాత్రం తప్పనిసరి. మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే కొందరు నిర్లక్ష్యంతో మాస్క్‌లు ధరించడం లేదు. వారి నిర్లక్ష్యం వారి కుటుంబంతో పాటు సమాజంలో మరికొందరికి వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మాస్క్ విధిగా ధరించాలనే నిబంధన అమల్లో ఉంది. ఉల్లంఘిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాస్క్ ధరించకుండా ఉల్లంఘించిన వారికి బుద్ధి వచ్చేలా పలు వింత శిక్షలు విధించారు. అయితే తాజాగా గురుగ్రామ్ ఒక్క ఏడాదిన్నరలోనే రూ.ఏడున్నర కోట్ల ఆదాయం ఒక్క మాస్క్ ద్వారానే చేకూరింది. కరోనా మొదటి దశ వ్యాప్తి నుంచి భౌతిక దూరంతో పాటు శానిటైజర్ వాడకం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం మనం చేస్తున్నాం. అయితే కొందరి నష్టంతో రెండో దశ తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే హరియాణా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో మాస్క్ లేని వారికి పెద్ద ఎత్తున జరిమానా విధించడం మొదలుపెట్టారు. గతేడాది జనవరి 23వ తేదీన మొదలుపెట్టిన జరిమానాలు ఇప్పటివరకు కొనసాగుతోంది. ఎన్ని జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఈ ఏడాదిన్నర వ్యవధిలో మాస్క్ లేకుండా తిరిగిన వారు లక్షన్నర మందికిపైగా ఉన్నారని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కేకే రావు తెలిపారు. మాస్క్ ధరించకపోవడంతో రూ.500 జరిమానా విధించారు. ఈ జరిమానాలతో ఏకంగా రూ.7.5 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఇంత ఆదాయం వచ్చిందంటే ఎంతలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారికంగా ఇంతమంది ప్రజలను గుర్తించామంటే తమకు తెలియకుండా ఎంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారో అని పోలీసులు పేర్కొంటున్నారు. ఎంతమందికి అని జరిమానాలు వేస్తాం.. ప్రజలకు స్పృహ.. బాధ్యత అనేది ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క గురుగ్రామ్‌లోనే ఇంత మంది ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే అర కోటి మందికి పైగా మాస్క్ లేకుండా తిరిగి ఉండవచ్చు అని నిఘా వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని.. కరోనాను పారదోలేందుకు కృషి చేయాలని ప్రజలకు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. -
నో మాస్క్: అధికారులపై మహిళ వీరంగం..జుట్టు పట్టుకొని!
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి.. అంటే దాదాపు ఏడాదిన్నరగా మాస్కు ధరించడం, భౌతిక దూరం అనివ్యార్యమైపోయింది. వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారిని అడ్డుకునేందుకు కోవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి అయ్యింది. కరోనా తగ్గినట్లే తగ్గి కొత్త కొత్త అవతారాల్లో పుట్టుకొస్తుంది. అందుకే మాస్క్ ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న వారిపై ఇప్పటికీ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరిలో మార్పు రావడం లేదు. మొండి వైఖరి వీడకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాక కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మాస్క్ ధరించమని అడగిన అధికారులపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. పీరాగారి మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలను ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. మాస్క్ లేనందుకు జరిమానా కట్టాలని చలాన్ విధించారు. దీంతో మహిళలకు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత ఇద్దరిలో ఓ మహిళా.. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి తెగబడింది. చెంపదెబ్బలు కొడుతూ, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అధికారుల జుట్టు పట్టుకొని వీరంగం సృష్టించింది. ఆమెను ఆపేందుకు అక్కడి వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
వైరల్: మాస్క్‌తో భయపెట్టాలనుకున్నాడు.. చివరికి
పాకిస్తాన్: విభిన్నమైన ఫేస్ మాస్కులు ధరించి కొంతమంది పలు వేడుకల్లో సందడి చేస్తారు. అయితే కొన్ని మాస్కులు వినూత్నంగా ప్రముఖుల ముఖాలు, జంతువులను పోలి ఉంటాయి. అటువంటి వాటిని ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాస్కులు మాత్రం ఎదుటివారికి భయం కలిగించేలా దెయ్యాలు, వికృతమైన ముఖాలతో తయారు చేయారుబడతాయి. ఆ మాస్కులు ధరించిన వారికి చిక్కులు కూడా తప్పవు కొన్ని సార్లు. అయితే అటువంటి ఓ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ వ్యక్తి భయంకరమైన ముఖాన్ని పోలిన ఓ మాస్కును ధరించి రోడ్డు మీద వెళ్లే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ ట్విటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో రాబోయే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ మాస్క్‌ను ధరించి అందరిని భయపెట్టించాలని చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఇలా భయంకమైన మాస్కులు ధరించి అల్లరి చేసేవారిని పాక్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. This guy arrested in Peshawar, had plans to celebrate independence day by scaring people. Apparently, the police wasn't much impressed, he was caught in his scary mask. pic.twitter.com/eYEe5YIaQE — Naila Inayat (@nailainayat) August 10, 2021 -
మాస్క్ ధరించమన్నందుకు దాడి, సెల్‌ఫోన్ ధ్వంసం
తిరుపతి తుడా: మాస్కులు ధరించకపోవడంతో రూ.100 జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో కొందరు సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక అమెరికన్ బార్ సమీపంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దాడిలో పగిలిపోయిన ప్రభుత్వ ఫోన్ తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కమిషనర్ గిరీషా ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది రంగంలోకి దిగారు. మాస్కులు లేకుండా ముగ్గురు ప్రజల మధ్య తిరుగుతుండడం గుర్తించి మాస్కు ధరించాలని సచివాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో రూ.100 జరిమానా విధిస్తామని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంమత్తులో ఉన్న వారు సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్పై దాడి చేశారు. జరిమానా విధించే ప్రభుత్వ మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. శానిటరీ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధితులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
VIRAL VIDEO: ‘వేర్ ఏ మాస్క్-సేవ్ ఏ లైఫ్’.. కరోనా టైం మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న నినాదం ఇది. దశల వారీగా, వేరియెంట్లతో మానవాళిపై వైరస్ విరుచుకుపడుతున్నా.. మాస్క్‌లు వీడొద్దంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనా వచ్చి తగ్గినా.. వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. పూర్తిస్థాయి రక్షణ కోసం మాస్క్.. వీలైతే డబుల్ మాస్కులు ధరించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆంక్షల సడలింపుతో చాలామంది ముఖానికి మాస్క్‌లు ధరించడం లేదు. ధరించినా కొందరు అసంపూర్తిగా పెట్టుకుంటున్నారు. రద్దీ మార్కెట్లు, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో.. చాలామందిలో ఈ నిర్లక్క్ష్యం పెరిగిపోయింది. అడిగితే దురుసు-నిర్లక్క్ష్యపు సమాధానాలు వినిపిస్తున్నాయి. పైగా థర్డ్ వేవ్ ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా.. చాలామందిలో ఈ ధోరణి మారడం లేదు. ఈ తరుణంలో ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు కొందరు. పైగా సందర్భానికి తగ్గ వీడియో కావడంతో చాలామంది వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా మళ్లీ వైరల్ చేస్తున్నారు. వైకల్యం ఉన్నా తమనే మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇవ్వకండని, తామే మాస్క్‌లు ధరించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లూ ధరించడం తప్పనిసరని గుర్తు చేసే ఆ వీడియో కిందటి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టర్ ఫహీమ్ యూనస్ ట్విటర్ అకౌంట్ నుంచి కిందటి ఏడాది సెప్టెంబర్ 16న పోస్ట్ అయ్యింది. కావాలంటే మరోసారి మీరూ చూసేయండి. బాధ్యతను గుర్తు చేసుకుని దయచేసి సక్రమంగా మాస్క్‌లు ధరించండి. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
-
ఫ్రిజ్, టీవీ, ఐపాడ్, మాస్క్: ఆటోనా.. హైటెక్ హోటలా?
చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు. పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. దాని ప్రకారం తన ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్, టీవీ, చిన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్ హోటల్లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో జూల్ 15న పోస్ట్ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మాస్క్ లేదని ట్రైన్ నుంచి దిగమన్నారు, వినలే.. తోసేశారు
ప్రస్తుతం ప్రజలు కరోనా మహమ్మారితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పని సరిగా మారాయి. వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలే గాక ఆంక్షల రూపంలో కూడా చెప్తున్నాయి. ఇక వీటిని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాయి. కొందరు మాత్రం వీటిని పట్టించుకోకుండా తమ రూటే సెపరేటు అనేలా ప్రవర్తిస్తున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ముప్పు లోకి నెట్టేస్నున్నారు. కాగా ఇటీవల అలా మాస్క్ ధరించని వారిపై జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా స్పెయిన్‌లో జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. లోకల్ మెట్రో ట్రైన్లో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా మాస్క్ ధరించకుండా ప్రయాణించాలని ప్రయత్నించాడు. కాగా ఇది గమనించిన కొందరు ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ లేని కారణంగా ఆ వ్యక్తిని రైలు నుంచి దిగిపోవాలని చెప్పారు. అయితే ఆ మాటలు వినకపోవడంతో ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు దిగాల్సిందిగా ఆ వ్యక్తిని బలవంతంగా డోర్ వద్దకు తీసుకువెళ్లారు. అయితే అతను కొంత సేపు ప్రతిఘటించిన చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్ డోర్ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు తోసేశారు. ఈ వ్యవహారమంతా స్టేషన్లో రైలు ఆగి ఉండగానే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ మహిళలకు మద్దతు తెలపగా, మరి కొందరు అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదంటు కామెంట్లు పెడుతున్నారు. 🚨🇪🇸 | NEW: Passengers throw a guy off a train in Spain for not wearing a mask pic.twitter.com/CQNPidJHxk — News For All (@NewsForAllUK) July 15, 2021 -
కరోనా థర్డ్‌వేవ్: రానున్న 125 రోజులు చాలా క్లిష్టమైనవి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. రానున్న 125 రోజులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్‌కు వ్యతిరేకంగా భారతదేశం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. వైరస్ సంక్రమణ కొత్త వ్యాప్తి అవకాశాలను తోసిపుచ్చలేమని.. వైరస్ వ్యాప్తికి రాబోయే 125 రోజులు చాలా క్లిష్టంగా ఉంటాయని సూచించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ, ‘‘వైరస్ సంక్రమణను వ్యాప్తి చెందకుండా ఆపాలి. కోవిడ్ కట్టడికి అనుకూలమైన ప్రవర్తను అలవాటు చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని’’ తెలిపారు. ఈ సందర్భంగా వీకే పాల్ మాట్లాడుతూ.. ‘‘మనం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేదు. ప్రస్తుతం వైరస్‌లో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం వాటిని అడ్డుకోవాలి. సురక్షితమైన జోన్లో ఉండటానికి కోవిడ్ కట్టడికి అనుకూలమైన ప్రవర్తనను అనుసరిస్తే ఇది సాధ్యమవుతుంది" అన్నారు. కోవిడ్‌పై పోరులో రాబోయే 125 రోజులు భారతదేశానికి చాలా క్లిష్టమైనవి అని అన్నారు వీకే పాల్. థర్డ్‌వేవ్ వైపు ప్రపంచ పయనం: వీకే పాల్ అనేక దేశాలలో కోవిడ్ పరిస్థితి మరింత దిగజారిపోతోందని, ప్రపంచం థర్డ్ వేవ్ వైపు పయనిస్తోంది అని డాక్టర్ పాల్ హెచ్చరించారు. ‘‘మనదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడానికి మేం సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మధ్య ఉన్న సమయం వినియోగించుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెచ్చరికను జారీ చేసింది. దాని నుంచి మనం నేర్చుకోవాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాలతో థర్డ్ వేవ్ గురించి చర్చించారు’’ అని డాక్టర్ పాల్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ (ఆరోగ్య) లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘అనేక దేశాలలో కోవిడ్ కేసులు మరోసారి పెరగడం ప్రారంభించాయి. మన పొరుగు దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌లలో కూడా కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. మలేషియా, బంగ్లాదేశ్‌లలో థర్డ్ వేవ్ ప్రభావం సెకండ్ వేవ్ కన్నా అధికంగా ఉంది’’ అన్నారు. కోవిడ్ సంబంధిత ఆంక్షలు సడలించినప్పటి నుంచి భారతదేశంలో మాస్క్‌ల వాడకం బాగా క్షీణించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. లాక్డౌన్ తర్వాత దేశంలో మాస్క్ వాడకంలో 74 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు అంచనా వేసింది. -
మంత్రి గారు మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!
డెహ్రాడూన్: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెట్టి మాస్క్‌ల వాడకానికి మంగళం పాడుతున్నారు. సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మంత్రి అయితే మాస్క్‌ను ముఖానికి కాకుంగా కాలి బొటన వేలికి తగిలించి ఓ ముఖ్యమైన భేటీలో దర్శనమిచ్చారు. సదరు మంత్రి గారి నిర్వాకానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. వీరిలో యతీశ్వరానంద్ అనే మంత్రి అయితే మాస్క్‌ను ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్లో పోస్టు చేశారు. ''ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్క్‌లు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు'' అంటూ విమర్శించారు. మాస్క్ పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్ నేత దీప్ ప్రకాశ్ పంత్ కామెంట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రెండో వేవ్ ముగియలేదు.. కాస్త తగ్గండి, ముందుంది అసలు కథ!
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గి లాక్డౌన్ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాస్క్‌లను మరిచి గుంపులుగా తిరుగుతున్న జనసందోహాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీ: తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ మాట పక్కనపెట్టినా.. అందులో మాస్క్‌లు లేన్నోళ్లే ఎక్కువ. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పర్వం కొనసాగుతోంది. ‘మెంటల్ పీస్ కోసం పోతే.. రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు’ అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ తరుణంలో ‘యూరో 2020’ ప్రస్తావన తెస్తూ.. ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Tourists ‘watering down’ all #COVID19 norms at kempty Falls Mussorie … A steep fall straight into the ‘deep waters’ of #ThirdWave !#Covididiots #coronavirus #Covid #Mussorie Video- Scoopwhoop pic.twitter.com/LBruU0k3Xp — RAHUL SRIVASTAV (@upcoprahul) July 7, 2021 సగం జనాభాకి వ్యాక్సిన్, అయినా.. కిందటి ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్ కోసం.. గేట్లు తెరిచింది లండన్ వాంబ్లే స్టేడియం. నాకౌట్ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. జులై 8న 30 వేల కేసులు(జనవరి నుంచి ఇదే హయ్యెస్ట్?!) నమోదు అయ్యాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే 51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. స్టేడియంలోకే కాదు.. స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం-అభిమానం మధ్య చివరి మ్యాచ్ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్.. కొనసాగింపుగా వస్తున్న వేరియెంట్ల ముప్పు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. యూరో సాకర్ అభిమానులు ‘సూపర్స్పెడ్రర్లు’గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇంగ్లండ్ ప్రభుత్వానికి సూచించింది. మరి మన పరిస్థితి.. మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. సింగిల్ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి విమర్శలను తట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేన్నట్లుంది. అందుకే గుంపులుగా జనాల కదలికలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉండడంతో అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ‘యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు.. మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. అసలు కరోనా రెండో వేవ్ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన.. నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. ‘కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్ ఉధృతే అయిపోలేదు. కొవిడ్ ప్రొటోకాల్‌ను జాగ్రత్తగా పాటిస్తేనే.. దానిని పూర్తిగా ఎదుర్కొగలిగిన వాళ్లం అవుతాం. సరదాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. మాస్క్‌లు ధరించండి. ’’ అని అని కొవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. -
మాస్కు లేకపోతే రూ.100 కట్టాల్సిందే!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా వేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న కర్ఫ్యూను తిరిగి ఈ నెల 14 వరకు పొడిగించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్ నిబంధనల మేరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. షాపులు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు అన్నీ నిర్వహించుకోవచ్చు. ఏవైనా పబ్లిక్ ప్లేసుల్లో (మాల్స్‌లో గానీ, సినిమాహాళ్లలో గానీ) సీటు మార్చి సీటు నిర్వహణ చేసుకోవచ్చు. మనిషికి మనిషికీ కనీసం 5 అడుగుల దూరం ఉండాలి. గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఈ మాస్క్ కరోనా వైరస్‌ను ఇట్టే పసిగడుతుంది..!
వాషింగ్టన్: ప్రపంచాన్ని కోవిడ్-19 పూర్తిగా అతాలకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కాగా పలుదేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లు మొదలైయ్యాయి. భారత్‌తో సహా కొన్ని దేశాలలో మూడో వేవ్ ముప్పు పొంచిఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్‌ను గుర్తించడానికి మార్కెట్లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మాస్క్‌తో వైరస్ గుర్తింపు...! కరోనా వైరస్‌ను గుర్తించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) , హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని వైస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ పరిశోధకుల బృందం ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తయారుచేశారు. ఈ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్‌ను కేవలం 90 నిమిషాల్లో పసిగట్టవచ్చునని పరిశోధన బృందం పేర్కొంది. ఈ మాస్క్‌ను బయోసెన్సర్ టెక్నాలజీనుపయోగించి అభివృద్ధి చేశారు. ఈ బృందం ప్రామాణిక కెఎన్95 మాస్క్‌కు బయోసెన్సర్లను ఏర్పాటుచేశారు. ఒక వ్యక్తి శ్వాసలో వైరస్ ఉందో లేదో అనే విషయాన్ని ఈ మాస్క్ గుర్తించనుంది. కరోనా వైరస్‌ను ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల మాదిరిగానే కచ్చితమైన రిజల్స్ట్ వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వైస్ ఇన్స్టిట్యూట్ పరిశోధనా శాస్త్రవేత్త పీటర్ న్గుయెన్ మాట్లాడుతూ..ఈ మాస్క్‌తో కరోనా వైరస్ పరీక్షల వేగవంతమౌతుందని పేర్కొన్నారు. అంతేకాకుంగా కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. -
ఎంత సక్కగున్నావే.. రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మన జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే శానిటైజర్ల వాడకం, మాస్క్‌ల వినియోగం, భౌతిక దూరం పాటించడం లాంటివి దినచర్యల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ప్రత్యేకంగా మాస్క్ అనేది తప్పనిసరిగా మారిందనే చెప్పాలి. ఏది మరచిపోయిన పర్లేదు కాని మాస్క్ మాత్రం మరిచిపోవద్దు. ఇక తారల విషయానికొస్తే వారి ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల నటి రష్మిక ఓ ప్రదేశానికి వెళ్లారు. కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఈ ముద్దు గుమ్మ కొన్ని సెకన్ల తర్వాత మాస్క్ పెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే వెనక్కి వెళ్లి మాస్క్ పెట్టేసుకుంది. ప్రధానంగా మాస్క్ లేదని రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కన్నడ, హిందీ భాషలలోను సినిమాలు చేస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మాస్క్ లేకుండా నెలరోజుల్లోనే లక్షన్నర మంది..
సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా కరోనా తగ్గుముఖం పట్డంతో ముంబైకర్లలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. భౌతికదూరం పాటించకపోవడమేగాకుండా ముఖానికి మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బీఎంసీ సిబ్బంది దాడులు మరింత తీవ్రం చేశారు. గడిచిన నెల రోజుల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న లక్షన్నరకుపైగా మందిపై చర్యలు తీసుకున్నారు. వారి నుంచి రూ.3 కోట్లపైనే జరిమానా వసూలు చేశారు. ఇలా ఇప్పటి వరకు బీఎంసీ ఖజానాలోకి ఏకంగా రూ.58 కోట్ల మేర అదనంగా ఆదాయం వచ్చి చేరింది. రెండు కాదు ఒక్కటీ లేదు.. రెండో వేవ్ కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదం ఇంకా పొంచే ఉందని తరుచూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. బీఎంసీ సిబ్బంది, క్లీన్ అప్ మార్షల్స్ కూడా దాడులు కొంతమేర తగ్గించారు. దీంతో ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. భౌతికదూరం ఎలాగో ఎవరు పాటించడం లేదు. కనీసం మాస్క్ ధరిస్తే కరోనా కొంతైన నియంత్రణలో ఉంటుంది. మాస్క్ కూడా ధరించకపోవడంతో దాడులు మళ్లీ ఉధృతం చేయాల్సి వచ్చింది. క్లీన్ అప్ మార్షల్లో చేపట్టిన దాడుల్లో మాస్క్ లేకుండా తిరగుతున్న 4,180 మందిని పట్టుకుని వారి నుంచి రూ.8.36 లక్షలు జరిమానా వసూలు చేశారు. పోలీసులు 1,161 మందిని పట్టుకుని రూ.2.32 లక్షలు జరిమానా వసూలు చేశారు. మాస్క్ లేకుండా తిరిగే వారి సంఖ్య పెరిగిపోవడంతో వారిని పట్టుకునేందుకు క్లీన్ అప్ మార్షల్స్ సంఖ్య పెంచాల్సి వచ్చింది. ఒక్కొక్కరు ప్రతీరోజు సుమారు 25 మందిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ టార్గెట్ విధించారు. లోకల్ రైల్వే హద్దులో కూడా రైల్వే పోలీసులు దాడులు ముమ్మరం చేయడంతో అక్కడ పరిస్ధితులు అదుపులో ఉన్నాయి. ఒకపక్క ప్రభుత్వం రెండు మాస్క్‌లు ధరించాలని చెబుతుంటే మరోపక్క రోడ్లపై తిరిగే జనాలు మాస్క్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని దీన్ని బట్టి తెలుస్తోంది. -
సుశీల్ సాబ్.. ఎక్ ఫొటో ప్లీజ్!
న్యూఢిల్లీ: ప్రియ శిష్యుడు సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో సుశీల్ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్ మెడలిస్ట్‌తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నేషనల్ మీడియా హౌజ్‌ల ద్వారా వైరల్ కావడంతో దుమారం మొదలైంది. మాస్క్‌లు లేవు, సోషల్ డిస్టెన్స్ లేదు. పైగా సుశీల్ సహా అందరూ ముఖంలో చిరునవ్వుతో ఫొజులిచ్చారు. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్ అధికారే కావడం విశేషం. అయితే ఇది తాజా ఫొటోనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? తీస్తే ఎక్కడ తీశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫొటో మీడియా హౌజ్‌ల ద్వారా జనం, అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ అధికారుల అభిమానంపై మండిపడుతున్నారు. సిగ్గులేకుండా ఇలాంటి డ్యూటీ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజలతో సహా ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతనిప్పుడు స్పోర్ట్స్ సెలబ్రిటీ కాదని.. ఓ హత్యకేసులో నేరస్థుడనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. జైలు ప్రాంగణంలో.. అదీ ఓ నేరస్తుడితో ఫొటోలు దిగిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అసోషియేషన్ ఫోరమ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. చదవండి: సుశీల్ గురించి సాగర్ పేరెంట్స్ ఏమన్నారంటే.. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం మూడు వారాలపాటు పరారీలో ఉన్న సుశీల్‌ను, సహ నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఆపై భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్ జైలు-2కు తరలించారు. ఇక ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: సాగర్ హత్య, ఆ రాత్రి ఏంజరిగిందంటే.. -
మాస్క్ పెట్టుకోలేదని కస్టమర్‌తో సెక్యూరిటీ గార్డ్ గొడవ
-
బంగారు మాస్కు ధర 5 లక్షలు..
కాన్పూర్: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరైంది. ముఖ్యంగా మాస్కుల పుణ్యమాని తోటి మనుషుల ముఖాలు చూడటం అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని మనోజ్ సెనగర్ అనే వ్యక్తి బంగారు మాస్కుతో వార్తల్లో నిలిచాడు. కాన్పూర్‌లో నివాసం ఉండే ఇతడికి బంగారం అంటే మక్కువట. ఇక రూ.5 లక్షల విలువైన బంగారంతో తయారు చేసిన ఈ మాస్కులో శానిటైజర్ వ్యవస్థ ఉండడం విశేషం. దీంతో ఈ బంగారు మాస్కును మరే విధంగానూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన శానిటైజేషన్ వ్యవస్థ వల్ల దీనిని దాదాపు ఇది 36 నెలల వరకు వినియోగించవచ్చని సెనగర్ తెలిపాడు. ఇక ఈ మాస్కుకు శివ శరణ్ అని పేరు కూడా పెట్టారు. మెడలో బంగారు గొలుసులు వేసుకుని తిరిగే సెనగర్‌ను అక్కవి స్థానికులు బప్పీ లాహరి, గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు. పేరుకు తగ్గట్టే ఏకంగా 5 లక్షల విలువైన బంగారు మాస్కుతో ఆయన మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. అతని వద్దనున్న రివాల్వర్‌కు బంగారు కవర్, మూడు బంగారు బెల్టులు ఉన్నాయి. ఇంత విలువైన సొత్తును దొంగలు, శత్రువులను నుంచి కాపాడుకోవడానికి ఇద్దరు బాడీగార్డులను నియమించుకున్నాడు. చదవండి: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు -
57 అడుగుల విగ్రహం.. 35 కేజీల మాస్క్
టోక్యో: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్ తప్పనిసరి అయ్యింది. మాస్క్ ధరించకుండా బయటకు వెళ్తే జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకపోతే ఎక్కడికి అనుమతించడం లేదు. మనుషులకు మాస్క్ సరే కానీ దేవుడి విగ్రహాలకు కూడా మాస్క్ పెట్టడం కొంత విడ్డూరంగా ఉంటుంది. అయితే అది కూడా చిన్నచితకా మాస్క్ కాదండోయే.. ఏకంగా 35 కేజీల భారీ మాస్క్ దేవతా విగ్రహానికి పెట్టారు. ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. జపాన్‌లో 57 మీటర్లు ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్క్ ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ‘35 కిలోలు’ బరువు ఉన్న మాస్కును బౌద్ధ మాతకు ధరింపజేశారు. అనంతరం కరోనా మహమ్మారి నుంచి తమను కాపాడాల్సిందిగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు జపాన్‌లోని కుషిమా ప్రిఫెక్చర్ ప్రాంతం వాసులు. 57 మీటర్ల ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహాన్ని 33 సంవత్సరాల క్రితం నిర్మించారు. బోలుగా ఉండే ఈ విగ్రహం భుజం వరకు వలయాకారంలో మెట్లను ఏర్పాటు చేశారు. చిన్న బిడ్డను ఎత్తుకున్నట్లు ఉండే ఈ విగ్రహం వద్ద జనాలు తమ పిల్లలను కాపాడమని.. సుఖప్రసవాలు అయ్యేలా చూడమని వేడుకుంటారు. జపాన్ అంటేనే భూకంపాలకు నిలయంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో గత ఫిబ్రవరిలో సంభవించిన భూకంపానికి బౌద్ధ మాత విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. దీంతో విగ్రాహానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఈ భారీ మాస్కును తయారుచేసి బౌద్ధ మాతకు ధరింపజేసి..కరోనా నుంచి మా బిడ్డలను కాపాడు తల్లీ అంటూ ప్రార్థనలు చేశారు. చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! -
అధికార మదం.. డబ్బుల్ని పోలీసులపైకి విసిరికొట్టిన ఎమ్మెల్యే
రూర్కీ: అధికార మదంతో ఓ ఎమ్మెల్యే పోలీస్ అధికారిపై డబ్బులు విసిరికొట్టిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఛలానా కట్టమన్న అధికారులపై తన ఆక్రోశం వెల్లగక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ బత్రా ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి షికారుకు వెళ్లాడు. ఆ టైంలో ముస్సోరి దగ్గర మాల్ రోడ్లో ఆయన కారును పోలీసులు ఆపారు. కొవిడ్ రూల్స్ ప్రకారం..బయట తిరిగే టైం ముగియడంతో పాటు ఆ టైంలో బత్రా మాస్క్ పెట్టుకోలేదని చెబుతూ పోలీసు అధికారి ఒకరు ఛలానా రాశాడు. అయితే తాను ఎమ్మెల్యేనని, తనకే ఛలానా రాస్తారా? అంటూ అధికారులపై ఊగిపోయాడు ప్రదీప్. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం ఛలానా కట్టాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో కారులోంచి డబ్బు తెచ్చి పోలీసులపై విసిరి.. ‘ఎంత కావాలో తీసుకో!’ అంటూ.. ఎమ్మెల్యే ప్రదీప్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. pic.twitter.com/xrFPXWXf0J — ashwik (@ursashwik) June 17, 2021 ఇక అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి.. వైరల్ చేశాడు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం మొదలైంది. పోలీస్ అధికారికి ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ పోలీసుల సంఘం ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసింది. అయితే ఆ టైంలో తాను, తన కుటుంబం మాస్క్ పెట్టుకునే ఉన్నామని, ఐడీ కార్డు చూపించినా ఆ అధికారి వినలేదని, పైగా పోలీసులే తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రదీప్ చెప్తున్నాడు. ఇక ఈ ఘటనలో అధికారి తన డ్యూటీ సక్రమంగా చేశాడని, విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: గాడిదపై తిరుగుతున్నారేమో! -
వైరస్‌ను నిర్వీర్యం చేసే 3డీ ప్రింటెడ్ మాస్క్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మనం ధరించిన మాస్కును తాకగానే నిర్వీర్యమైపోతే? కోరలు తీసిన పాములా శక్తిహీనమైపోతే? సూపర్ కదా... మనకు డబుల్ రక్షణ లభించినట్లే. వైరస్‌ను సంహరించే ఔషధ మిశ్రమాలను కలగలిపి... త్రీడీ ప్రింటెడ్ మాస్కులను రూపొందించి పుణె కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ థింకర్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ. సోడియం ఓలెఫిన్ సల్ఫోనేట్ ఆధారిత రసాయనమిశ్రమం దీంట్లో వాడారు. ఇది వైరస్ పైపొరను ధ్వంసం చేస్తుంది. ఈ మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు నిర్ణయించింది. ‘‘ఇళ్లలో తయారవుతున్న మాస్కులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ వీటి నుంచి సరైన రక్షణ లేదు. ఇన్ఫెక్షన్ నివారణకు మరింత సమర్థంగా పనిచేసే మాస్కుల రూపకల్పనపై దృష్టి సారించి 3డీ ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును అభివృద్ధి చేశాం. ఔషధ మిశ్రమాలను మాస్కుపై పైపూతగా చేర్చి వినూత్నంగా మాస్కు రూపొందించాం. ఈ మాస్కులు వైరస్ నుంచి అదనపు రక్షణను అందిస్తాయి. ఈ మాస్కులు బ్యాక్టీరియాను 95 శాతం నిరోధిస్తాయని పరీక్షల్లో వెల్లడైంది’’ అని థింకర్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ శీతల్‌కుమార్ జాంబాద్ వివరించారు. కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న విధానాలు రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ 2020 మేలో పరిశోధనలను చేపట్టడానికి థింకర్ టెక్నాలజీస్‌కి నిధులను సమకూర్చింది. -
ఇంట్లో మాస్కు ధరించకపోతే కరోనా రిస్కు
వాషింగ్టన్: ఇంట్లోనే ఉంటున్నాంకదా మాస్కు ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అలా చేయడం కరోనాను చేజేతులా ఆహ్వానించడమే అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఆరుబయటి కంటే ఇంట్లో, ఆఫీసుల్లో, సమావేశపు గదుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని చెబు తున్నారు. మాస్కు ధరించకుండా ఇంట్లో ఇతరుల తో మాట్లాడితే సార్స్–కోవ్–2 వైరస్ ముప్పు ఎన్నోరెట్లు ఎక్కువగా పొంచి ఉంటుందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ వివరాలను జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో (ఇన్డోర్) ఉన్నప్పుడు కూడా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా ఉత్తమమని వెల్లడయ్యింది. మాట్లాడుతునప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తుంటాయి. ఇందులో కంటికి కనిపించని వివిధ పరిమాణాల్లోని సూక్ష్మమైన వైరస్ రేణువులు ఉంటాయి. చిన్న పరిమాణంలోని రేణువులు గాలిలో ఎక్కువ సేపు ఉండలేవు. కాస్త పెద్ద పరిమాణంలోని వైరస్ డ్రాప్లెట్స్ జీవిత కాలం ఎక్కువేనని, ఇవి గాలిలో చెప్పుకోదగ్గ దూరం వరకూ త్వరగా వ్యాప్తి చెందుతా యని అధ్యయనంలో గుర్తించారు. మాట్లాడుతున్నప్పుడు నోటిలోంచి వెలువడే వైరస్ రేణువులు కొన్ని నిమిషాలపాటు గాల్లోనే ఎగురుతూ ఉంటాయని, పొగలాగే ఇవి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయని యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్, డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రతినిధి, అధ్యయనకర్త అడ్రియాన్ బాక్స్ చెప్పారు. భవనాల్లో(ఇండోర్) గాలి త్వరగా బయటకు వెళ్లదు కాబట్టి కరోనా రిస్కు అధికంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించారు. అమెరికాలో బార్లు, రెస్టారెంట్లు కరోనా వ్యాప్తికి కేంద్రాలు మారాయని గుర్తుచేశారు. మాట్లాడుతున్నప్పుడు కచి్చతంగా మాస్కు ధరించాలని చెప్పారు. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా, బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. -
వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే!
కరోనా వైరస్ రాకతో ప్రపంచంలోని అందరి జీవితాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారిన పడకుండా మాస్క్ ధరించడమే శ్రీ రామ రక్ష..! అని పలువురు పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. దీంతో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా మాస్క్‌ను ఎల్లప్పుడు ధరిస్తూనే ఉన్నారు. కాగా మానవుల జీవితాల్లో మాస్క్ అనేది ఒక భాగమైంది. మాస్క్‌తో కొంతమందికి చికాకు కల్గిస్తున్నా.. కచ్చితంగా ధరిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకొని ధరిస్తున్నారు. మాస్క్ ధరించడంతో కొంతమందికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. మాస్క్ ఉందని గ్రహించకుండా మనలో కొంతమంది టీ, కాఫీ తీసుకుంటాం. అబ్బా..ఈ మాస్క్ ఒకటి ఉంది కదా అని చెప్పి తెరుకుంటాం. కాగా మాస్క్ ధరించడంతో ఓ వ్యక్తికి వింత సంఘటన ఎదురైంది. తన ఇంట్లో ఉన్న తోటలో మాస్క్ పెట్టుకొని సన్‌బాత్‌కు వెళ్లగా.. తిరిగి ఇంట్లోకి వచ్చి మాస్క్ తీసి అద్దంలో తన మోహాన్ని చూసుకొని నిర్ఘాంతపోయాడు. అతని మోహం మీద మాస్క్ ముద్ర అలాగే వచ్చింది. ఈ వీడియోను అతడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాకుండా సన్‌బాత్ చేసేటప్పుడు కచ్చితంగా మాస్క్ తీయకపోతే నాకు జరిగిందే మీకు జరుగుతుందనీ హెచ్చరించాడు. కాగా ఈ వీడియోను ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాంప్మ్యాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. నేను ఈ వీడియోను చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను సుమారు 20 లక్షల మంది వీక్షించారు. వీడియోను చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతూ షేర్ చేస్తున్నారు. Public Service Announcement: Don’t forget to take you facemask off when sunbathing 😭😭💀 pic.twitter.com/XLcSxepgfD — Theo Shantonas (@TheoShantonas) June 7, 2021 -
మొలకెత్తే మాస్క్‌పై అమెరికా మీడియా ఆసక్తి..
న్యూఢిల్లీ: కరోనా కాలంలో మాస్క్ మానవుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అయితే మనం వాడుతున్న మాస్క్‌లను ఎప్పుడో ఒకసారి పడేయాలి. దాని వల్ల భారీగా చెత్త పేరుకుపోతుంది. ఫలితంగా మరో కొత్త సమస్య. దీనికి చెక్ పెట్టే క్రమంలో రూపొందించిందే మొలకెత్తే మాస్క్. వాడిన తర్వాత పడేస్తే.. ఈ మాస్క్‌లు మొలకెత్తుతాయి. ఫలితంగా ఇవి మనుషులను కాపాడటమే కాక.. పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తాయి. ఇక ఈ మొలకెత్తే మాస్క్‌ల సృష్టికర్త భారతీయుడే కావడం గర్వకారణం. ప్రస్తుతం ఈ మొలకెత్తే మాస్క్‌లు అంతర్జాతీయ సమాజంలో హాట్‌టాపిక్‌గా మారాయి. వీటిపై అమెరికా మీడియా ఆసక్తి కనబరుస్తోంది. ఆ వివరాలు.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన నితిన్ వాస్ పర్యావరణానికి మేలు చేసే ‘పేపర్ సీడ్ మాస్క్’ తయారు చేశారు. మంగళూరు నగర శివారులోని కిన్నిగోళికి అనుబంధమైన పక్షితీర్థం ఆయన స్వగ్రామం. మాస్క్ తయారాలో కాటన్ గుడ్డను పల్ప్‌గా మార్చి షీట్లుగా మారుస్తారు. సుమారు 12 గంటల పాటు ఆరబెట్టి మాస్క్ తయారు చేస్తారు. మాస్క్ వెనుక భాగాన పలచటి కాటన్ గుడ్డ వేశారు. మాస్క్ దారాలను సైతం పత్తితోనే రూపొందించారు. కాటన్ షీట్లో తులసితో పాటు పదికిపైగా ఔషధ, కూరగాయల విత్తనాలను ఉంచారు. ఉపయోగించిన తర్వాత ఈ మాస్క్‌ను పడేసిన ప్రాంతంలో మొక్కలు మొలకెత్తుతాయి. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మాస్క్‌పై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పూర్తిగా చేతితో రూపొందించిన ఈ మాస్క్ ధర కేవలం 25 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ ధరలో ఎకో ఫ్రెండ్లి మాస్క్‌లు అభివృద్ధి చేసిన నితిన్ వాస్ గురించి తెలుసుకునేందుకు అమెరికన్ మీడియా ఆసక్తి చూపుతోంది. అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ(ఏబీసీ) వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. దక్షిణాఫ్రికాలోని అవర్మనీలో రెండు రోజుల్లో ఇంటర్వ్యూ ప్రసారం చేయనున్నట్టు ఏబీసీ పేర్కొంది. నితిన్ వాస్‌ను అభినందిస్తూ ఉపముఖ్యమంత్రి అశ్వత్థనారాయణ పోస్టు చేశారు. చదవండి: షాకింగ్: మాస్క్ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు -
షాకింగ్: మాస్క్ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు
లండన్: మహమ్మారి వైరస్ రాకుండా ముందస్తుగా ప్రపంచం మొత్తం మాస్క్ ధరిస్తున్నారు. కొందరు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇప్పుడు ప్రతిచోట ‘మాస్క్ ధరిస్తేనే అనుమతి’ అనే బోర్డులు విధించారు. మాస్క్ లేని వారిని అనుమతించడం లేదు. అయితే ఒక షాపింగ్‌మాల్ వద్ద మాస్క్ లేకుండా వచ్చిన మహిళ బీభత్సం సృష్టించింది. మాస్క్ లేదని అడిగిన సెక్యూరిటీ గార్డుపై ఉమ్మేసి పరుగులు పెట్టిన ఘటన వైరల్‌గా మారింది. ఈ సంఘటన యూకేలోని లండన్‌లో జరిగింది. లండన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు ఇద్దరు మహిళలు వచ్చారు. అయితే వారు మాస్క్ ధరించకపోవడంతో వారిని సెక్యూరిటీ గార్డు నిలువరించాడు. మాస్క్ ధరించి రావాలని సూచించాడు. దీంతో ఆ మహిళలు సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగారు. ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. లోపలకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అతడిని దుర్భాషలాడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఆ ఇద్దరిలోని ఓ మహిళ దూరంగా వచ్చినట్టు చేసి వెంటనే సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి ముఖంపై ఉమ్మేసి పరుగులు పెట్టింది. షాక్‌కు గురయిన సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను పట్టుకునేందుకు ఉరుకులు పెట్టారు. చివరకు ఆమె చిక్కింది. ఆమెపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించడం వదిలేసి తనకు తానే ఆమె ఇబ్బందులను కొని తెచ్చుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోనిదే కాక సెక్యూరిటీ గార్డుపై ఉల్టా దాడి చేసుడు ఏందమ్మా? అని ప్రశ్నిస్తున్నారు. -
మాస్క్ ధరిస్తే రూ.350 కట్టాలంట !
కాలిఫోర్నియా: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేఫ్‌లో మాస్క్ ధరిస్తే ఫైన్ కట్టాలంట. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఓ కేఫ్ యజమాని ఈ వింత రూల్‌ని పెట్టాడు. అదేంటి ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అల్లాడిపోతూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తుంటే ఇక్కడ మాత్రం ఇలాంటి రూల్ పెట్టారని అనుకుంటున్నారా? అసలు ఆ కేఫ్ యజమాని కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం. ఓ కేఫ్ యజమాని తన కస్టమర్లలో మాస్క్ ధరించిన వారి నుంచి బిల్లుపై 5 డాలర్లు (సుమారు 350 రూపాయలు) అదనంగా కట్టించుకుంటున్నాడు. దీనికి ఓ కారణం ఉందని ఆ యజమాని అంటున్నాడు. వారు ఈ మొత్తాన్ని గృహహింస బాధితులకు సహాయపడే స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో వీరు చేస్తున్న మంచి పనిని కస్టమర్లు సైతం స్వాగతిస్తున్నారు. అంతే గాక అదనుపు బిల్లు చెల్లించడంలోనూ వెనకాడటం లేదు. ‘మొదట్లో 5 డాలర్లను కొంతమంది కస్టమర్లు చెల్లించగా, మరికొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని’ కేఫ్ యజమాని క్రిస్ కాజిల్మాన్ ఎన్బిసి న్యూస్‌కు చెప్పారు. Hey #medtwitter, leave Fiddleheads Cafe in Mendocino, CA a review on Google and Yelp and tell them what you think. pic.twitter.com/8qkYTtILhM — Optimistic Radiologist (@responsibleMDs) May 29, 2021 చదవండి: బీప్: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్ లెక్చరర్‌కు..