వైరల్‌: మాస్క్‌ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! | Take Your Mask Off While Sunbathing This Man Learnt His Lesson | Sakshi
Sakshi News home page

వైరల్‌: మాస్క్‌ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే!

Published Tue, Jun 8 2021 6:47 PM | Last Updated on Tue, Jun 8 2021 6:54 PM

Take Your Mask Off While Sunbathing This Man Learnt His Lesson - Sakshi

కరోనా వైరస్‌ రాకతో ప్రపంచంలోని అందరి జీవితాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ బారిన పడకుండా మాస్క్ ధరించడమే శ్రీ రామ రక్ష..! అని పలువురు పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. దీంతో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా మాస్క్‌ను ఎల్లప్పుడు ధరిస్తూనే ఉన్నారు. కాగా మానవుల జీవితాల్లో మాస్క్‌ అనేది ఒక భాగమైంది. మాస్క్‌తో కొంతమందికి చికాకు కల్గిస్తున్నా.. కచ్చితంగా ధరిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకొని ధరిస్తున్నారు.

మాస్క్‌ ధరించడంతో కొంతమందికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. మాస్క్‌ ఉందని గ్రహించకుండా మనలో కొంతమంది టీ, కాఫీ తీసుకుంటాం. అబ్బా..ఈ మాస్క్‌ ఒకటి ఉంది కదా అని చెప్పి తెరుకుంటాం. కాగా మాస్క్‌ ధరించడంతో  ఓ వ్యక్తికి వింత సంఘటన ఎదురైంది. తన ఇంట్లో ఉన్న తోటలో మాస్క్‌ పెట్టుకొని సన్‌బాత్‌కు వెళ్లగా.. తిరిగి ఇంట్లోకి వచ్చి మాస్క్‌ తీసి అద్దంలో తన మోహాన్ని చూసుకొని నిర్ఘాంతపోయాడు. అతని మోహం మీద మాస్క్‌ ముద్ర  అలాగే వచ్చింది.  ఈ వీడియోను అతడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అంతేకాకుండా సన్‌బాత్‌ చేసేటప్పుడు కచ్చితంగా మాస్క్‌ తీయకపోతే నాకు జరిగిందే మీకు జరుగుతుందనీ హెచ్చరించాడు. కాగా ఈ వీడియోను ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాంప్‌మ్యాన్‌ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. నేను ఈ వీడియోను చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను సుమారు 20 లక్షల మంది వీక్షించారు. వీడియోను చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతూ షేర్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement