వైరల్‌: ఈ బుడ్డోడి ఐడియా భలే ఉంది..! | Viaral Video Of Small Boy Wears Mask With Eating Lollipop | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఈ బుడ్డోడి ఐడియా భలే ఉంది..!

Published Sat, Nov 21 2020 2:30 PM | Last Updated on Sat, Nov 21 2020 6:25 PM

Viaral Video Of Small Boy Wears Mask With Eating Lollipop - Sakshi

కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ముఖానికి మాస్కు ధరించడం అనివార్యం అయ్యింది. చిన్న పెద్దా తేడా లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ మాస్కులు ధరించిన సమయంలో మనకు నచ్చిన వాటిని తినడానికి ఇబ్బంది తలెత్తుతున్న విషయం తెలిసిందే. చేతులతో మాస్కును తీసి తినడం, తాగడం కానీ చేయాల్సి వస్తోంది. అయితే ఇది కష్టంగా భావిస్తున్న కొంతమంది కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. చదవండి: మ్యాగీ విత్‌ పెరుగు ట్రై చేశారా?!

ఈ క్రమంలో ఓ చిన్న పిల్లవాడు ముఖానికి సర్జికల్‌ మాస్కు ధరించే మందే తనకు నచ్చిన లాలిపాప్‌ను మాస్కు బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ఇటు మాస్కు పెట్టుకొని, అటు ఎంచక్కా తన చాక్లెట్‌ను తింటూ ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను లతా అనే మహిళ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు బుడ్డోడి ఐడియా భలే ఉందని ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న పిల్లవాడిని అంత పెద్ద ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. మేము కూడా ఇక మీదట ఇలా ప్రయత్నిస్తామని సరదా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఫేస్‌మాస్క్‌లు చోరీ :  సంచలన తీర్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement