facemask
-
ఆ రోజులు మళ్లీ వద్దు.. మాస్క్ పెట్టుకోండయ్యా..!!
-
తప్పక ఫేస్‌మాస్క్ ధరించండి.. ఫొటోలు!
ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా, డెల్టా ప్లస్... ఇలా మహమ్మారి కరోనా అనేక రూపాలు మార్చుకుంటూ మానవాళిని వణికిస్తోంది. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడం, మరోవైపు థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కు ధరించడం తప్పనిసరి. ►కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా మాస్కు అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించకుండా ఆపేస్తుంది. ►ప్రపంచవ్యాప్తంగా సర్జికల్, రిస్సిరేటర్, క్లాత్ ఫేస్ కవరింగ్ అనే మూడు రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ►ఆపరేషన్ థియేటర్లో సర్జరీ సమయంలో పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా సర్జికల్ మాస్కులు వాడతారు. ►గాలిని శుద్ధి చేసే రిస్పిరేటర్లను కూడా రోగుల కోసం ఉపయోగిస్తారు. ►అయితే, కరోనా కాలంలో సామాన్య ప్రజలు కూడా సర్జికల్ మాస్కులను ఉపయోగిస్తున్నారు. ►ఇక ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రాలతో చాలా మంది క్లాత్ మాస్కులు తయారు చేసుకుంటున్నారు. ►చాలా మంది ఫేస్‌మాస్కుతో పాటు కళ్ల నుంచి వైరస్ లోపలికి ప్రవేశించే వీల్లేకుండా గాగుల్స్ ధరిస్తున్నారు కూడా. ►ఏదైమైనా కరోనా కాలంలో చికిత్స కంటే నివారణే మేలు అన్న చందంగా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. తప్పక వ్యాక్సిన్ వేయించుకోండి. -
పూల వ్యాపారి స్మార్ట్ ఆలోచన.. ఫిదా అవుతున్న వధూవరులు
సాక్షి, చెన్నై: కరోనా కష్టకాలంలో తప్పనిసరిగా ధరించాల్సిన ఫేస్ మాస్క్‌ల కష్టాలగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ, మాస్క్ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా కోవిడ్-19 మహమ్మారి ఉధృతిని అడ్డుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి పీటల మధ్య ముసి ముసి నవ్వులతో మురిసిపోవాల్సిన వధూవరులకు కూడా ఇది తప్పదు. అందుకే తమిళనాడుకు చెందిన ఒక పూల వ్యాపారి చాలా స్మార్ట్‌గా ఆలోచించి చక్కటి మాస్క్‌లను రూపొందించారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా స్మార్ట్‌గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. తమిళనాడులోని పూల వ్యాపారి ఈ విషయాన్ని నిరూపించారు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో పట్టుచీరకు మ్యాచింగ్‌గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్‌లను ధరించడం చూశాం. కానీ ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు. ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా ఉంటాయంటున్నారు. Tamil Nadu | Mohan, a flower vendor in Madurai makes floral masks exclusively for brides, grooms to raise awareness about COVID-19 "Despite govt orders, people don't wear masks at weddings. I make these floral masks to encourage brides, grooms to wear them," he said (10.08) pic.twitter.com/1gJKK3S68p — ANI (@ANI) August 11, 2021 -
మాస్కుల వాడకంతో చిన్నారుల్లో ఇమ్యూనిటీ తగ్గుదల
-
సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తుందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్తు కరోలినా(యూఎన్సీ) తాజా పరిశోధనలో తేలింది. ఈ వివరాలను జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. రెండు టైట్ ఫిట్ మాస్కులు సార్స్–కోవ్–2 సైజ్ వైరస్‌ను సమర్థంగా ఫిల్టర్ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది. మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్ ప్రవేశించే అస్కారం లేదని యూఎన్సీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎమిలీ సిక్బర్ట్–బెన్నెట్ చెప్పారు. మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదని తెలిపారు. బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు. సాధారణ క్లాత్ మాస్కు 40 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 40–60 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ మరో 20 శాతం పెరుగుతుందన్నారు. సోమవారం అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు మహారాష్ట్ర - 58,924 ఉత్తరప్రదేశ్- 30,566 ఢిల్లీ - 25,462 కర్ణాటక - 19,067 కేరళ - 18,257 ఛత్తీస్‌గఢ్ - 12,345 మధ్యప్రదేశ్ - 12,248 తమిళనాడు - 10,723 గుజరాత్ - 10,340 రాజస్తాన్ - 10,262 చదవండి: వామ్మో కరోనా.. గతవారం మనమే -
మాస్కు పెట్టుకొమ్మన్నందుకు.. పార, ఇనుపరాడ్లతో
సాక్షి, నిజామాబాద్: రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా కొంతమంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అంతేకాదు జాగ్రత్తలు పాటించమన్నందుకు ఇతరులపై దాడికి కూడా వెనుకాడటం లేదు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దని చెప్పినందుకు మున్సిపల్ కార్మికులపై దాడికి యత్నించిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక గౌతంనగర్‌లో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. ‘‘నేను మాస్కు పెట్టుకోకపోతే.. మీ కేంటి’’ అంటూ పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి యత్నించాడు. ఇందుకు అతడి కొడుకు కూడా జతయ్యాడు. కాగా తండ్రీకొడుకుల ప్రవర్తనపై మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ -
వైరల్: ఈ బుడ్డోడి ఐడియా భలే ఉంది..!
కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ముఖానికి మాస్కు ధరించడం అనివార్యం అయ్యింది. చిన్న పెద్దా తేడా లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ మాస్కులు ధరించిన సమయంలో మనకు నచ్చిన వాటిని తినడానికి ఇబ్బంది తలెత్తుతున్న విషయం తెలిసిందే. చేతులతో మాస్కును తీసి తినడం, తాగడం కానీ చేయాల్సి వస్తోంది. అయితే ఇది కష్టంగా భావిస్తున్న కొంతమంది కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. చదవండి: మ్యాగీ విత్ పెరుగు ట్రై చేశారా?! ఈ క్రమంలో ఓ చిన్న పిల్లవాడు ముఖానికి సర్జికల్ మాస్కు ధరించే మందే తనకు నచ్చిన లాలిపాప్‌ను మాస్కు బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ఇటు మాస్కు పెట్టుకొని, అటు ఎంచక్కా తన చాక్లెట్‌ను తింటూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను లతా అనే మహిళ తన ట్విటర్లో పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు బుడ్డోడి ఐడియా భలే ఉందని ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న పిల్లవాడిని అంత పెద్ద ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. మేము కూడా ఇక మీదట ఇలా ప్రయత్నిస్తామని సరదా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఫేస్‌మాస్క్‌లు చోరీ : సంచలన తీర్పు Intelligent boy 😍😍 pic.twitter.com/AKP6PBMQcM — Latha (@LathaReddy704) November 21, 2020 -
ఫేస్‌మాస్క్‌లు చోరీ : సంచలన తీర్పు
దుబాయ్: ఒక దొంగతనం కేసులో దుబాయి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఫేస్ మాస్కులను ఎత్తుకుపోయిన గ్యాంగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష, 1.5 దిర్హామ్‌ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు జైలు జీవితం అనంతరం తర్వాత నిందితులను దేశం నుంచి బహిష్కరించాలదుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆదేశించింది. (కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇవ్వొద్దు : డబ్ల్యూహెచ్‌వో) కరోనా మహమ్మారి కాలంలో ఫేస్ మాస్క్‌లు చాలా అవసరమైన వస్తువుగా మారిపోయాయి. దీంతో మాస్క్‌ల చోరీపై దృష్టి పెట్టిందో గ్యాంగ్. దుబాయిలో నివసిస్తున్న ఆరుగురు పాకిస్థానీలు అల్ రషీడియాలోని ఒక వేర్‌హౌస్‌లోకి అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్‌లు (రూ.30.28 లక్షలు) విలువ చేసే 156 బాక్సుల ఫేస్‌మాస్క్‌లను దొంగిలించారు. స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని గిడ్డంగి నుంచి 150,000 దిర్హామ్‌ల విలువైన 1000 ఫేస్ మాస్క్‌లున్న156 బాక్స్‌లు చోరికి గురైనట్టు గుర్తించిన 38 ఏళ్ల చైనా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్18 న ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొద్ది రోజుల్లోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాము దొంగిలించిన మాస్క్‌లను బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు నిందితులు అంగీకరించారు. తాము గతంలో కూడా అనేక ఇతర దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పు వెలువరించింది. (అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం) -
నో మాస్క్ , నో ఫ్లై : డీజీసీఏ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విమాన ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. మాస్కు ధరిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తేల్చి చెప్పింది. అంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సబ్బందికి అధికారం ఉందని వెల్లడించారు. గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందించవచ్చు. అలాగే అంతర్జాతీయ విమానాలు, చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్లు కూడా తమ ప్రయాణీకులకు ప్రామాణిక పద్ధతుల ప్రకారం వేడి భోజనం, ఇతర పానీయాలను అందించేందుకు అనుమతించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ఆహారం లేదా పానీయాలను అందిస్తున్నప్పుడు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని తెలిపింది. అలాగే ప్రతీసారి సిబ్బంది హ్యాండ్ గ్లౌజులు ధరించాలని పేర్కొంది. ప్రయాణ ప్రారంభంలో ప్రయాణీకులకు డిస్పోజబుల్ ఇయర్ ఫోన్లు లేదా శుభ్రపరిచిన , శానిటైజ్ చేసిన హెడ్ ఫోన్లు అందిస్తారని తెలిపింది. కాగా కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దాదాపు మూడు నెలల తరువాత మే 25న దేశీయ విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమైనా, భోజనం సరఫరాకు అనుమతి లేదు. -
మాస్క్ మంచిదేగా !
బ్యూటిఫుల్ స్కార్ఫ్..పెంటాస్టిక్ పేస్‌మాస్క్ బైక్ ప్రయాణాల్లో ఉపయోగం దుమ్ము, ధూళి నుంచి రక్షణ ఆసక్తి చూపుతున్న యువత కరీంనగర్ బిజినెస్ : రయ్‌మంటూ బైక్‌లపై దూసుకెళ్లే యువత గమ్యస్థానం చేరే వరకు ముఖాలు మసిబారిపోతున్నాయి. ఆఫీస్‌కు, కాలేజీలకు వెళ్లేందుకు అందంగా ముస్తాబై బైక్‌పై వెళ్తుంటే ముందు వెళ్లే వాహనం నుంచి వచ్చే పొగ, రోడ్డుపై వచ్చే దుమ్ముతో ముఖాలు మసకబారిపోతుంటాయి. అయితే వీటన్నింటినికి చెక్ పెట్టేందుకు యువకులు ఫేస్‌మాస్క్‌లు, ఆడవాళ్లు స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. ఎండ, చలి, పొగ, దుమ్ము, ధూళీ నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. ఫుల్స్కార్ఫ్, హాఫ్స్కార్ఫ్, రైడర్మాస్క్లు, నింజా, మల్టీపర్పస్ స్నఫ్, బైకర్స్, అగస్టా, ఫేస్ సేఫ్, ఫేస్రిచ్ వంటి పేర్లతో వివిధ మోడళ్లలో లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తుండడంతో గిరాకీ కూడా బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు. స్కార్ఫ్‌తో రక్షణగా మహిళలు, యువతులు స్కార్ఫ్ కట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు చాలా మంది ఎండ నుంచి తట్టుకునేందుకు, చలి నుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కవచంగా పనిచేస్తుందంటున్నారు యూత్. మహిళలకు ప్రత్యేకంగా రకరకాల డిజైన్లలో లభిస్తుండడంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినిలు, ఉద్యోగులు ఎక్కువగా స్కార్ఫ్ వాడుతున్నారు. వీటి ధరలు రూ.100 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉన్నాయి. రైడర్మాస్క్లతో రయ్..రయ్ కుర్రకారు రైడర్మాస్క్లతో రయ్మంటున్నారు. ఇవి పలురకాల రంగులలో స్పోర్ట్స్ రైడర్స్ ఉపయోగించే లా ఉంటాయి. ఇందులో రెండు రకాలు.. సింగిల్‌కలర్, మల్టీకలర్స్. ముఖానికి గరుకుగా ఉండి ఇబ్బందిపెట్టకుండా ఉండే సాఫ్ట్క్లాత్తో వీటిని తయారు చేస్తారు. వీటి ధరలు దాదాపు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. నింజామాస్క్ ముఖానికి నిండుగా ఉంటూ పైభర్ క్లాత్‌తో నింజా మాస్క్‌లు తయారవుతాయి. ఇది ముఖాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీని ధర దాదాపు రూ.120 నుంచి రూ.150 వరకు ఉంది. బైకర్స్ వీటిని హాఫ్ మాస్క్లని కూడా అంటారు. కేవలం ముక్కు, చెవులను కప్పేందుకు ఉపయోగపడతాయి. కొందరికి హెల్మెట్ ధరించే ఇష్టం లేక రుమాల్, హ్యాండ్కీలను కట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ మాస్కులు చాలా ఉపయోగం. వీటి ధరలు నాణ్యతను బట్టి రూ.90 నుంచి రూ.120 వరకు ఉన్నాయి. మల్టీపర్పస్ స్నఫ్ ఇవి కేవలం ఒకే రకాలుగా కాకుండా వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటే స్నఫ్ 8 రకాలుగా ముఖాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడుతుంది. హాఫ్, ఫుల్, రౌండ్ మోడళ్లుగా వాడుకోవచ్చు. అగస్టాతో సేఫ్ ఇవి దుమ్ము, దూళి నుంచి రక్షణకు ప్లాస్టిక్ మూత ఉంటుంది. చాలా దుమ్ము, దూళి కలిగిన ప్రదేశాల్లో మట్టి రోడ్లపై రక్షణగా ఉపయోగపడతాయి. వీటి ధరలు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. నగరంలో దుకాణాలు నగరంలోని పలు ప్రదేశాల్లో మాస్క్‌ల దుకాణాలు నగర ప్రజలకు స్వాగతం పలుకుతున్నాయి. బస్టాండ్‌లో, బస్టాంట్వెలుపల, టవర్‌సర్కిల్, కొర్డురోడ్, రాంనగర్తోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న టోపీల దుకాణాలు, ఫుట్‌పాత్ షాపులు, మంచిర్యాల రోడ్, గోదావరిఖనిరోడ్, పద్మనగర్ శివారుల్లో ఫుట్‌పాత్ దుకాణాల్లో లభిస్తున్నాయి. రక్షణగా.. – రాజు, బీటెక్ విద్యార్థి మనం ఎంత అందంగా ముస్తాబైన రోడ్డుపై ప్రయాణిస్తే పది నిమిషాల్లో ముఖం వాడిపోతుంది. ఎండ, దుమ్ము, ధూళి , పొగ నుంచిరక్షణగా ఈ మాస్క్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లలో లభిస్తున్నాయి. దుమ్ము ధరిచేరకుండా – సంతోష్‌చారి , వ్యాపారి పనిమీద బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తాను. అన్ని కాలాల్లో చాలా ఉపయోగం. డస్ట్ ఎలర్జీ ఉన్న వారు ఈ మాస్క్‌లు ధరించి ధైర్యంగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు బైక్‌లపై మాస్క్‌లు ధరిస్తున్నారు.