ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విలయ తాండవం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు మహరాష్ట్ర విలవిలలాడుతోంది. ముఖ్యంగా ముంబై నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతీ రోజూ నమోదవుతున్న కేసులతో పాటు మరణాలు అదే స్థాయిలో పెరుగడం ముంబై వాసులను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై నగర మేయర్ కిషోర్ పెడ్నెకర్ కరోనా నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని వేడుకున్నారు.
ముంబై నగరం వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఈ క్రమంలో జనాభా తాకిడి కూడా అధికమే. అంతటి జనాభా ఉన్నప్పుడు అందులో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది అందరినీ ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుతం ముంబైలో కేసుల పెరుగుదలకు ఇదొక కారణమనడంలో సందేహం లేదు. ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంకా కొందరు నిర్లక్ష్యంగా మాస్క్‌లు ధరించకపోవడం, అవసరం లేకపోయినా బయట సంచరించడం లాంటివి చేస్తూ కేసుల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ ముంబై వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. డబుల్ మాస్క్‌లు పెట్టుకోండి. అవసరం ఉంటేనే బయటకి రండి, లేదంటే రాకండి.. అని వేడుకున్నారు.
( చదవండి: శభాష్ ప్యారే ఖాన్: రూ.కోటితో ఆక్సిజన్ ట్యాంకర్లు )
I request everyone with folded hands to wear a mask, that too double masks. People are requested to not step out of their houses unnecessarily: Mumbai Mayor Kishori Pednekar#COVID19 pic.twitter.com/zyjTAPew6x— ANI (@ANI) May 1, 2021
Comments
Please login to add a commentAdd a comment