mayor
-
మేయర్ అనే కాదు.. మహిళా అని కూడా చూడకుండా..
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
గ్రేటర్ మేయర్ లవ్‌స్టోరీ అలా మొదలైంది..!
నాకు క్రికెట్ అంటే ఇష్టం.. మా ఆయన సాయిరెడ్డికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం.. క్రీడా మైదానంలోనే తమ ప్రేమకు పునాది పడిందని హైదరబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చారు.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రేమ సంగతులు పంచుకున్నారు.. నిత్యం స్పోర్ట్స్ స్టేడియంలో కలుసుకునే మేం మా చదువులు అయ్యాకే పెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా డిగ్రీ, పీజీ అయ్యే వరకు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా నాన్నకు నేను గారాలపట్టీ కావడం వల్ల నా ఇష్టాన్ని ఆయన కాదనలేక పోయారు. మా ఆయన తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా అంతా మా ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. నేను క్రికెట్ బాగా ఆడేదాన్ని, బాబీ బాస్కెట్ బాల్ ఆటగాడు.. అలా క్రీడా మైదానాల్లో తరచూ కలుసుకునేవాళ్లం.. మా ప్రేమ విషయాన్ని మా ఇద్దరి ఇళ్లలో చెప్పాం. మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమతో నా ప్రేమను కాదనలేకపోయారు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోయాం.. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పగానే గో ఏ హెడ్ అంటూ ప్రోత్సహించారు. మాదేమో పొలిటికల్ ఫ్యామిలీ.. మా ఆయనదేమో బిజినెస్ ఫ్యామిలీ.. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా బాబీ నన్ను ఇబ్బంది పెట్టకపోగా రాజకీయాల్లో వెళ్లేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మేం ఎంతో ప్రేమగా ఉంటామంటూ తన భర్తను తాను బాబీ అని.. తననేమో విజ్జి అని ప్రేమగా పిలుచుకుంటామంటూ తమ లవ్ జర్నీ చెప్తూ మురిసిపోయారు. (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
chandigarh: మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
చండీగఢ్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. బీజేపీకి చెందిన హర్‌ప్రీత్ కౌర్ బాబ్లా మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు మొత్తంగా 17 ఓట్లు వచ్చాయి. మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు క్రాస్ ఓట్ చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 13, కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 6. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చండీగఢ్ మేయర్ ఎన్నికల(Chandigarh Mayoral Election) కేసులో సుప్రీంకోర్టు పంజాబ్- హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్‌ను స్వతంత్ర పరిశీలకునిగా నియమించింది. ఈసారి చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని ఆ సమయంలో కోర్టు చెప్పింది.గత ఏడాది ఫిబ్రవరి 20న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక తీసుకుంది. నాడు సుప్రీంకోర్టు(Supreme Court) ఓట్ల లెక్కింపును తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించి, వీడియో చూసిన తర్వాత ఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్‌ను మందలించి, షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఇది కూడా చదవండి: ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్ సందేహం -
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్‌రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
మేయర్‌పై అవిశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్‌పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారినందునే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్‌పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంతకీ ఏం జరగనుంది? మేయర్‌పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ.. నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్ఎస్కు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీలు కలిసి వచ్చేనా? అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. -
గుంటూరు మేయర్, కమిషనర్ మధ్య వివాదం
-
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు! అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు! నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి. సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూ ఇయర్ వేడుకల్లో బడంగ్‌పేట మేయర్ పారిజాత
రంగారెడ్డి: బడంగ్‌పేట మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశారు. మంగళవారం సాయంత్రం ఆల్మాస్గూడలో బోయపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. మేయర్ పారిజాత సమక్షంలో జరిగిన వేడుకల్లో అసోషియేషన్ సభ్యులు హుషారుగా గడిపారు. పలువురికి సన్మానాలు చేసి ఆమె బహుమతులు అందజేశారు. అలాగే కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. మరోవైపు కార్పొరేటర్ సాంరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన సేవల్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఎ. జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పి.కవిత, కోశాధికారి సీహెచ్ వినోబా చారి తదితరులు పాల్గొన్నారు. -
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్‌బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
నిజామాబాద్ మేయర్ భర్త చంద్రశేఖర్‌పై దాడి
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
సాక్షి ఎడిటర్ పై కేసు.. విశాఖ మేయర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..మేయర్ సహా 15 మంది మృతి
బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి -
మేయరా...అయితే మాకేంటి?
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్‌కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్‌ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.బీసీ మహిళను అవమానించారు ‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్‌ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్‌ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్‌ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ -
‘నువ్వు మేయర్ అయితే నాకేంటి? ఏం తమాషాలు చేస్తున్నావా?’
చిత్తూరు అర్బన్: గాంధీ జయంతి రోజే నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్‌కు అవమానం జరిగింది. నడిరోడ్డుపై కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజలు చూస్తుండగానే మహిళా మేయర్ ఆముదపై ట్రాఫిక్ సీఐ నిత్యబాబు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, ఏకవచనంతో రెచి్చపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఓ దశలో మేయర్‌ను కొట్టడానికి మీదిమీదికి వెళుతున్నాడేంటి అంటూ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టారు.బుధవారం మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచడానికి మేయర్ ఆముద, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు అధికారులు వచ్చారు. అధికారుల వాహనాలతో పాటు ఎమ్మెల్యే వాహనాలు రోడ్డుకు ఓవైపు పార్కింగ్ చేశారు. మేయర్ వాహనానికి స్థలం లేకపోవడంతో మరోవైపు పార్కింగ్ చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సీఐ నిత్యబాబు.. మేయర్ కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పాడు.కార్యక్రమం అయిపోగానే వెళ్లిపోతామని మేయర్ డ్రైవర్ చెప్పినా సీఐ అంగీకరించలేదు. దీంతో డ్రైవర్ కారును కొద్దిసేపు పీసీఆర్ కళాశాల చుట్టూ తిప్పి.. కార్యక్రమం అయిపోవస్తుండటంతో కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. మేయర్ కారులోకి ఎక్కి, బయల్దేరబోతుండగా సీఐ మళ్లీ వచ్చారు. కారు అద్దాలను బాదుతూ బండి తీయాలంటూ రచ్చ చేశారు.ఇదీ చదవండి: ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్లోపల మేయర్ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్ వాహనం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని ప్రశి్నంచారు. దీంతో సీఐ మరింతగా రెచి్చపోయారు. ‘నువ్వు మేయరైతే నాకేంటి? డ్రైవర్‌తో మాట్లాడుతుంటే నువ్వు వస్తావెందుకు? ఏం తమాషా చేస్తున్నావా?’ అంటూ ఏక వచనంతో సంబోధిస్తూ ఓ దశలో మేయర్‌పైకి సీఐ దూసుకెళ్లారు. -
పెదవుల అందం.. పదవికి చేటు!
ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్ను శాసించే మేయర్‌కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి! సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్‌స్టిక్ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్ మాధవి బదిలీ ఈ లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్ ఆర్ ప్రియకు దఫేదార్‌గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్ ఆర్.ప్రియతో సమానంగా మాధవి లిప్‌స్టిక్ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.మేయర్ వేసుకునే రంగులోనే లిప్‌స్టిక్‌ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్‌స్టిక్ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్ వేసుకునే లిప్‌స్టిక్ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు. తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్‌కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు. -
అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్‌గా హాజరైన అనంతపురం మేయర్ మహ్మద్ వాసీం.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్లో మేయర్ వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది.ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు -
కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ కడపలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు పాల్పడ్డారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గత మూడు రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వెయ్యాలని టీడీపీ నేతలను మాధవి రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో ఇవాళ టీడీపీ నేతలను మేయర్ ఇంటి వద్దకు పంపించి చెత్తను వేయాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతలు చేస్తున్న చెత్త పాలిటిక్స్‌పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టి రాజకీయాలు చేయవద్దని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెచ్చగోట్ట రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మేయర్ ఆగ్రహంతన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు ధర్నాకు దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చెత్త పై టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన ఇంటి ముందు చెత్త వేసేలా ఎమ్మెల్యే చేయడం దుర్మార్గం. హుందాగా వ్యవహరించాలని గతంలోనూ ఆమెను మేం కోరాం. గెలిచిన మూడు నెలలకే ఇలాంటి నీచపు రాజకీయాలా?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. టీడీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఇంటికొచ్చి చెత్త వేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో అల్లర్లు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి ముందు చెత్త వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి. -
మేయర్ విదేశీ యాత్ర దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్‌రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.వెలుగుచూసిందిలా..వాస్తవానికి మేయర్ సునీల్‌రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్‌రావు తనకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్చార్జి మేయర్‌గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు. మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్మేయర్పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్‌ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.6న ఇండియాకు: మేయర్తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్‌రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. -
నమ్మక ద్రోహం
పదేళ్ల రాజకీయ జీవితం.. ముచ్చటగా మూడు పారీ్టలు.. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నిక.. మూడేళ్లకే అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలు.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరిక.. వైఎస్సార్ సీపీలోనూ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నిక.. నాలుగేళ్లకు అప్పటి ఎమ్మెల్యేతో విబేధాలు.. మళ్లీ తెలుగుదేశం పారీ్టలో మంగళవారం చేరడం.. ఇదీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పొలిటికల్ ప్రొఫైల్. పదవుల కోసం పారీ్టలో చేరడం, మళ్లీ పారీ్టకి వెన్నుపోటు పొడవటం, మళ్లీ ఇంకో పారీ్టలో చేరడం.. షాడో మేయర్ పెదబాబుకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో రెండోసారి టీడీపీలో చేరుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2019లో హైకోర్టు కేసులతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడి, 2021లో జరిగింది. మొత్తం 50 డివిజన్లకుగాను 47 డివిజన్లలో అప్పటి వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు టీడీపీని వీడి మేయర్ నూర్జహాన్ దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఇబ్బందులు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయని, టీడీపీలో వేధింపులు బాగా ఉన్నాయని చంద్రబాబునాయుడుకు చెప్పినా పట్టించుకోలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం, రాజకీయంగా నూర్‌బాషా సామాజికవర్గానికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని యోచనతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చి రెండో పర్యాయం మేయర్‌గా ఎంపిక చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ అంతా బాగానే నడిచింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో విబేధాలు ఉన్నాయని అందరికీ చెబుతూ నిత్యం ఆయనతోనే సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవారు. కట్ చేస్తే.. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమిపాలు కావడంతో పదవి కోసం తెలుగుదేశం బాట పట్టారు. దీనిపై నగరంలో తీవ్ర చర్చ సాగుతోంది. పదేళ్ల ప్రస్ధానంలో మూడు పారీ్టలు మూడోసారి పార్టీ మారుతున్న లీడర్లు అంటూ ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్లతో రహస్య భేటీ ‘మంగళవారం టీడీపీలో చేరుతున్నాను.. మీరందరూ కూడా టీడీపీలోకి వస్తే మనకు ఉన్న రెండేళ్ల పదవీకాలం బాగా వాడుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే నష్టపోతారు.. వచ్చేవాళ్లు రండి.. తరువాత జరిగే పరిణామాలకు నేనేమి బాధ్యుడిని కాదు’ అంటూ రెండు రోజుల క్రితం తన నివాసంలో కార్పొరేటర్లతో భేటీ నిర్వహించి తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటించడంతో పాటు కార్పొరేటర్లను పరోక్షంగా హెచ్చరించారు. ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రెండు పర్యాయాలు ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మంచెం మైబాబుకు అవకాశం ఇచ్చారు. అలాగే రాజకీయంగానూ పార్టీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారం కోల్పోగానే జంపింగ్ నేతల జాబితాలో చేరారు. ఇక మరో నేత ఏలూరు నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ కుమార్తెకు పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వడం, అలాగే స్మార్ట్ సిటీ చైర్మన్‌గా నియమించారు. సాంకేతిక కారణాలతో స్మార్ట్ సిటీ రద్దయిన క్రమంలో ఇడా చైర్మన్‌గా బొద్దాని శ్రీనివాస్‌కు అవకాశం కలి ్పంచారు. నామినేట్ పదవితో పాటు ఐదేళ్ల పాటు నగర పార్టీ అధ్యక్షుడిగా ప్రాధాన్యం ఇచ్చినా ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీ బాటపట్టారు. మంగళవారం మేయర్ దంపతులతో పాటు బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబులు టీడీపీలో చేరనున్నారు. -
బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం... బుధవారం ఉదయం 10.35 గంటలు⇒ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.⇒ అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు. ⇒ అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్ మండిపడ్డారు. ⇒ ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని సీరియస్ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.‘ఫేస్ రికగ్నిషన్’ అమలు చేస్తాం.. తనిఖీల అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్‌ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు. ఇది ఇక్కడ మామూలే.. మేయర్ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్ టైమ్’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్‌బ్రేక్ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది. నిజంగా చర్యలుంటాయా ? మేయర్ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్ కార్యాలయానికే తెలియాలి. బయోమెట్రిక్ ఉత్తుత్తిదేనా ? కారి్మకులతోపాటు కమిషనర్ దాకా బయోమెట్రిక్ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన మేయర్..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జోన్లు..సర్కిళ్లలో.. ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు. సర్క్యులర్ జారీ మేయర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్‌గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. -
అరుదైన గౌరవం.. రష్యా లైబ్రరీలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం పుస్తకం
-
బ్రిక్స్ మేయర్ల సదస్సుకు అనంతపురం మేయర్
జూన్ 21న రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న వివిధ దేశాలకు చెందిన మేయర్ల సదస్సుకు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం ఏకైక నగరం కావడం విశేషం. దేశంలో జైపూర్, కాలికట్, త్రిస్సూర్ మరియు నాగర్ కోయిల్ నుండి మేయర్లు పాల్గొంటున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు అందిన సంక్షేమం.. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రదర్శించారు. అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం. ప్రపంచ వ్యాప్తంగా 50 మంది మేయర్లు రష్యా బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు.ఏపీ నుంచి బ్రిక్స్ సమావేశాల్లో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం ఒక్కరే పాల్గొన్నారు. గత ఐదు సంవత్సరాల వ్యవధిలో అనంతపురం నగరపాలక సంస్థ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరిగిన గ్రామ స్వరాజ్యం వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని తయారు చేసిన మేయర్ మహమ్మద్ వాసీం... దానిని రష్యాలోని కజాన్ నగరంలో ఉన్న లైబ్రరీకి అందజేశారు. -
జగనన్న వల్లే నాకు ఈ అవకాశం
-
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
అనంతపురం మేయర్‌కు అరుదైన గౌరవం
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా..అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్ కోయిల్ మేయర్లు ఉన్నారు. అనంతపురం మేయర్‌కే ఎందుకంటే.. అనంతపురానికి, రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ఆ∙అంశాలు ఇటీవల కజాన్‌లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచి్చ.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి. కాగా, అనంతపురం నగరాన్ని సందర్శించిన రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం నగరాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది అని మేయర్ అన్నారు. -
‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్
ఓ నగర మేయర్ మున్సిపల్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అంటూ సదరు అధికారిపై ఫైల్‌ను విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే సమావేశంలో ఓ అధికారిపై ఫైలు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక జోన్-3 జోనల్ ఇంజనీర్ నుల్లా శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో ప్రమీలా పాండే సదరు అధికారిపై మండిపడినట్లు సమాచారం. ఇంజనీర్ తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదే విషయంలో మేయర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచేయబోయారు. చేతిలో ఫైల్ని సదరు అధికారిపై విసిరేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..పలువురు నెటిజన్లు మేయర్‌కు అండగా నిలుస్తోన్నారు. #WATCH | Uttar Pradesh: Kanpur Mayor Pramila Pandey throws a file at an officer during a meeting of officials held on drain cleaning and other issues in the Kanpur Municipal Corporation office. pic.twitter.com/rsrEQHBveg— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2024 -
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
-
బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
ఉప్పల్: ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్లీ టూర్ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఏకంగా బ్యాంకాక్ ఎగిరిపోయారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ.. శివారు కార్పొరేషన్ అయిన పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా ఈ నెల 6న కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించగా వచ్చే నెల 5న తీర్మానం తేదీని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ వారిని వెంబడిస్తూ కాంగ్రెస్ నేతల తీరుతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఏకంగా మీడియా, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. కాగా.. తమ మద్దతుదార్లయిన కార్పొరేటర్లకు విదేశీ టూర్‌ను ఆఫర్ చేశారు. అంతా ఆశ్చర్యపోయేలా కాస్ట్లీ టూర్‌కు తీసుకెళ్లడంతో ఆయా పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇంత ఖరీదైన టూర్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఏకంగా కార్పొరేటర్లను, వారి భర్తలను విదేశీ పర్యటనకు తీసుకెళ్లి ఆనంద డోలికల్లో ముంచెత్తడం గమనార్హం. -
లండన్ మేయర్‌గా మూడోసారి సాదిక్ ఖాన్
లండన్: పాక్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్(53) లండన్ మేయర్‌గా భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. మొత్తం ఓట్లలో 43.8 శాతం అంటే 10,88,225 ఓట్లు సాదిక్ ఖాన్‌కు పడగా కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన ప్రధాన ప్రత్యర్ధి సుసాన్ హిల్‌కు 8,11,518 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన ఢిల్లీలో జన్మించిన వ్యాపారవేత్త తరుణ్ గులాటి ఓట్ల వేటలో విఫలమయ్యారు. మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడ్డారు. లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. నాలుగేళ్ల పదవీ కాలానికిగాను 2016, 2020 ఎన్నికల్లో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
పార్టీ మారినా.. నో ఫియర్!!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు. మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మారనున్న బలాబలాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత, శోభన్‌రెడ్డిలు సైతం కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్ఎంసీ మేయర్‌గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్‌లో చేరతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని చెబుతున్నారు. తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. -
ఆంధ్రా అమ్మాయి... జవహర్‌నగర్ మేయర్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన శాంతి తెలంగాణ రాష్ట్రంలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎంపికయ్యారు. ఆమె బాపట్ల మండలం, ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్య అభ్యసించారు. 2000లో తెనాలి మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన కోటేష్గౌడ్తో వివాహమైంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన మహిళ శాంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ఛండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ!
పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత కుల్జీత్ సంధు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. డిప్యూటీ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి రాజిందర్ కుమార్ శర్మ గెలుపొందారు. మీడియా దగరున్న సమాచారం ప్రకారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. గతంలో మేయర్ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రిసైడింగ్ అధికారిని కోర్టు మందలించింది. అనంతరం డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరు ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్, ఆప్‌లకు 20 మంది కౌన్సిలర్లు ఉండేవారు. వీరిలో ముగ్గురు బీజేపీలో చేరడంతో ‘ఇండియా కూటమి’ కౌన్సిలర్ల సంఖ్య 17కు తగ్గింది. అదే సమయంలో బీజేపీకి అకాలీ, కిరణ్ ఖేర్ మద్దతు పలకడంతో ఆ పార్టీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. -
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్‌కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్‌కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు. -
వలస పక్షి ఖబడ్ధార్...షర్మిలపై ఫైర్
-
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మేయర్ పదవికి భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పోటీ పడనున్నారు. మే 2వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలో వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో, 2016 నుంచి లండన్ మేయర్‌గా కొనసాగుతున్న పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఢిల్లీలో జన్మించిన తరుణ్ గులాటి(63) స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా లండన్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో భారత్ పర్యటన సమయంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా, ప్రాపర్టీ వ్యాపారి శ్యామ్ భాటియా(62) మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తాజాగా ప్రకటించారు. గులాటి ఎన్నికల ట్యాగ్ లైన్ ‘విశ్వాసం–అభివృద్ధి’కాగా, భాటియా ‘అంబాసిడర్ ఆఫ్ హోప్’ట్యాగ్‌లైన్‌తో ముందుకు వెళ్తున్నారు. చదవండి: ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు! -
చివరి దాకా బీఫారం కోసం కొట్లాడతా
హైదరాబాద్: బీఫారం కోసం చివరి వరకు అధిష్టానంతో కొట్లాడతానని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలోని గడపగడపకూ తిరిగి పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. పార్టీ నిర్ణయం తనను, కార్యకర్తలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హైకమాండ్ వద్ద తన పేరు ఖరారైనప్పటికీ మన బలం చూసి ఇతరులు భయపడి టికెట్ రాకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. చివరివరకు అధిష్టానం తనను గుర్తించి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తులు మోసం చేశారు తప్ప పార్టీ ఎప్పుడు మోసం చేయలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 20 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ కన్న తల్లిలాంటిదని, కట్టె కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని పారిజాత స్పష్టం చేశారు. -
విశ్వనగరమే ధ్యేయంగా ముందుకు..
మాదాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.15 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్దికేంద్రం(ఎస్టీపీ)ను సోమవారం మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీపీతో దుర్గంచెరువు ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. అలాగే మురుగు నీటి నుంచి చెరువులకు విముక్తి లభిస్తుందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎల్ఎండీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. దీనికోసం రూ. 3866.21 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్‌రెడ్డి, మంజుల రఘునాథ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగారావు పాల్గొన్నారు. దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు పొడవులో..మ్యూజిక్‌కి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. -
మంత్రి సబితారెడ్డికి పోటీగా బరిలో మేయర్ పారిజాత?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు చల్లానర్సింహారెడ్డి సహా సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొత్త మనోహర్‌రెడ్డి ఇటీవల కర్ణాటక వెళ్లారు. డిప్యూటీ సీఎంతో పై రవీ చేయించారు.అయినా అధిష్టానం మాత్రం చిగురింతవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అభ్యర్థి పేరు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. సర్పంచ్‌గా మొదలైన ప్రస్థానం చిగురింత పారిజాత మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మంత్రి సబితారెడ్డి ఆశీస్సులతో బడంగ్పేట్ మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఆమెకు గతంలో బాలాపూర్ సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే అధికార బీఆర్ఎస్ను వీడి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రికి పోటీగా బరిలో నిలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల తుక్కుగూడ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ ఏర్పాట్లు కూడా మేయర్ దంపతులే చూసుకున్నట్లు తెలిసింది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో వీరికి మంచి పట్టుంది. -
తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..
తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్‌గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్‌గా రికార్డ్‌కెక్కారు. అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. సచిన్ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది. ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక.. -
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం.. మునేశ్ గుర్జర్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేశ్ గుర్జర్‌కు బిగ్ షాక్ తగిలింది. గుర్జర్‌పై రాజస్థాన్ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మేయర్ మునేశ్ గుర్జర్ భర్త సుశీల్ గుర్జర్ ఓ భూమి లీజ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్ మునేశ్ గుర్జర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్ 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. Breaking News: Mayor Munesh Gurjar निलंबित। कहा, 'कांग्रेस के बड़े नेता ने साज़िश कर फंसाया है'! pic.twitter.com/AajGDCt6IO — Rajasthan Tak (@Rajasthan_Tak) August 6, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..? -
రష్యాలో విషాదం: వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి!
రష్యాలోని మాస్కోలో ఒక షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు. టాస్ అనే వార్తా సంస్థకు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొందని మేయర్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక.. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్లోని పైపు పగిలిపోవడంతో మాల్లోని కొంత భాగంలోకి వేడినీరు ప్రవేశించింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. మరో 20 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వైద్య అధికారి.. టాస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైపు పగిలిపోవడంతో పది మంది వేడి నీళ్ల బారిన పడ్డారని, వారిలో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు ఈ ఉదంతంపై రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. నలుగురు నిందితులపై గ్రూప్ క్రిమినల్ కేసు పెట్టామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి యులియా ఇవనోవా మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించింది. ఇది కూడా చదవండి: బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు -
ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతేనే బయటకు రండి
హిమాయత్‌నగర్: నగర ప్రజల ప్రాణాలను రక్షించడమే తమకు అత్యంత ప్రధానమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సెలవులు ఉన్నాయి కదా అని ఎవరూ బయటకు రావొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రీవెన్స్, ట్విట్టర్, టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 429 రెస్క్యూ టీంలు పని చేస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మేయర్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫోన్ కాల్స్, ఇతర ఫిర్యాదుల పట్ల సిబ్బంది పనితీరు ఎలా ఉందనే విషయాల్ని ఆమె దాదాపు గంట సేపు సమీక్షించారు. రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు విస్తారమైన వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 946. వీటిలో శిథిలావస్థ భవనాలు, చెట్లు విరిగి పడిపోవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం, మ్యాన్‌హోల్స్ నుంచి నీరు పొంగడం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. వీటిని తమ సిబ్బంది పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. నాలా పరీవాహక ప్రాంతాల వద్ద ఎస్ఎన్డీపీ కింద రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు జరిగాయన్నారు. ఇంకా ఆరు చోట్ల మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 429 రెస్క్యూ టీంలు వర్షాల కారణంగా ప్రజల అవసరాలు తీర్చేందుకు, ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేందుకు 429 రెస్క్యూ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ధ్వంసమైన రోడ్లను బాగు చేసేందుకు సీఆర్ఎంపీకి చెందిన 29 టీంలు పని చేస్తున్నాయని మేయర్ తెలిపారు. లోతట్టు ప్రాంతమైన గాజులరామారాం వద్ద నిలిచిపోయిన నీరును తొలగించేందుకు తమ సిబ్బంది పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► విద్యాసంస్థలకు, ప్రైవేటు సెక్టార్లకు, ఇతరత్రా కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో.. కొందరు బయటకు వచ్చేందుకు ఇష్టపడతారని.. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని.. ఇళ్లల్లోనే సేఫ్‌గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి సూచించారు. వారం తర్వాత వారిపై సీరియస్ యాక్షన్ నగరంలో ఇప్పటి వరకు 483 శిథిలావస్థ భవనాలను గుర్తించామన్నారు. కూల్చేందుకు వెళ్లిన క్రమంలో మరమ్మతులు చేసుకుంటామని వాటి యజమానులు కోరడంతో కొంత గడువు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ నోటీసులు ఇచ్చామని, ఇప్పటికే 87 భవనాలను కూల్చివేశామని మేయర్ తెలిపారు. 92మంది రిపేర్ చేసుకోగా, 135 మంది ఖాళీ చేశారని, 19 భవనాలను సీజ్ చేశామని, 150 ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన యజమానులు వారంలో రిపేర్ చేసుకోకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. -
వైఎస్ఆర్ సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కింది
-
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్‌గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
బర్మింగ్హమ్ లార్డ్ మేయర్‌గా బ్రిటిష్ ఇండియన్
లండన్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నగర లార్డ్ మేయర్‌గా బ్రిటిష్–ఇండియన్ కౌన్సిలర్ చమన్‌లాల్ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్హమ్ తొలి బ్రిటిష్–ఇండియన్ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్ లాల్ భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని పఖోవాల్ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్ హర్నామ్‌సింగ్ బంగా 1954లో ఇంగ్లాండ్‌కు వలస వచ్చారు. బర్మింగ్హమ్లో స్థిరపడ్డారు. చమన్‌లాల్ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్‌తో కలిసి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్‌హమ్‌లోనే నివసిస్తున్నారు. చమన్ లాల్ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్‌లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. -
ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!
ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆరు పదుల వయసు దాటిన ఆయన తాజాగా పట్టుమని 20 ఏళ్లు కూడా లేని మైనర్‌ను మనువాడాడు. 65 ఏళ్ల మేయర్.. 16 ఏళ్ల పాపను పెళ్లాడటమే కాకుండా పిల్లనిచ్చిన అత్తకు ఏకంగా ప్రభుత్వ శాఖలో పదోన్నతి కూడా కల్పించాడు. ఈ వింత పెళ్లి బ్రెజిల్ దేశంలో వెలుగుచూసింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ పెళ్లి వ్యవహారం మేయర్‌ను ఇరకాటంలో పడేసింది. వివరాలు.. దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది! కాగా బ్రెజిల్లో అమ్మాయిల కనీసం వివాహ వయసు 16 ఏళ్లు. అక్కడి చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన యువతులు తల్లిదండ్రుల అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. తాజాగా మేయర్ సదరు అమ్మాయికి ఏప్రిల్ 11న, 16 ఏళ్లు నిండటంతో మరుసటి రోజే అంటే ఏప్రిల్ 12న ఆమెను పెళ్లాడాడు. అంతేగాక అప్పటికే విద్యాశాఖలో తక్కువ జీతంతో పనిచేస్తున్న వధువు తల్లిని సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు. ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్ సీమా ఆరోపించింది. దీంతో మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కాగా దేహైనీకి ఇది మూడో వివాహం. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కొత్త భార్యకు పదహారేళ్లే కావడంతో ఆమె కాలేజీకి వెళ్తోంది. చదవండి: వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..! -
అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి
సాక్షి,బళ్లారి: బళ్లారి నగర మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. బుధవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్, ఉపమేయర్ ఎన్నిక జరిగింది. రెండో అవధి కింద నగర మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు, ఉపమేయర్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4వ కార్పొరేటర్ త్రివేణి సూరి, 7వ కార్పొరేటర్ ఉమాదేవి శివరాజ్, 35వ వార్డు కార్పొరేటర్ కుబేరాతో పాటు బీజేపీకి చెందిన 16వ వార్డు కార్పొరేటర్ నాగరత్న ప్రసాద్‌లు మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ముగ్గురిలో హైకమాండ్, స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర 4వార్డు కార్పొరేటర్ త్రివేణి ఎంపికకు కార్పొరేటర్లతో కలిసి మద్దతు సూచించడంతో పార్టీ సూచన మేరకు పోటీలో నిలిచిన కుబేరా, ఉమాదేవిలు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీ తరఫున బరిలో నాగరత్న ప్రసాద్ ఇక మేయర్ స్థానానికి కాంగ్రెస్ తరపున త్రివేణి సూరి, బీజేపీ తరపున నాగరత్న ప్రసాద్ పోటీలో ఉండగా ఎన్నికల అధికారి, నగర కమిషనర్, అధికారులు ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి త్రివేణి సూరికి సిటీ కార్పొరేషన్‌లోని 39 వార్డులకు గాను 21 మంది కాంగ్రెస్, 5 మంది స్వతంత్ర కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్‌ల ఓటు హక్కుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 28 మంది చేయి ఎత్తి మద్దతు తెలిపారు. ఇక 13 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప ఓటు హక్కుతో బీజేపీ అభ్యర్థినికి 16 మంది మద్దతు దక్కింది. దీంతో మేయర్‌గా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కమేలా త్రివేణి సూరి ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపమేయర్‌గా జానకి ఏకగ్రీవం ఇక ఉపమేయర్ స్థానానికి ఒకే ఒకరు 33వ కార్పొరేటర్ జానకి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆమె ఉపమేయర్‌గా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ స్థానం కోసం ఉదయం నుంచి ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు పోటీ చేయడంతో చివరి క్షణం వరకు ముగ్గురు తమకే మేయర్ స్థానం కావాలని భీష్మించుకుని కూర్చొన్నారు. అయితే ఎట్టకేలకు కుబేరా, ఉమాదేవిల నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. నూతన మేయర్, ఉపమేయర్లను ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికారులు, కార్పొరేటర్లు అభినందించారు. చిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై న త్రివేణి బళ్లారి నగర మేయర్‌గానే కాకుండా రాష్ట్రంలోని మహానగర పాలికెల్లో ఇప్పటి వరకు అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి రికార్డు సృష్టించారు. 10వ తరగతి స్థానిక సెయింట్‌ఫిలోమినా స్కూలులో పూర్తి చేసిన అనంతరం పారా మెడికల్ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా తల్లిదండ్రుల సూచనతో 21 ఏళ్లకే 4వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికై న త్రివేణి 23వ ఏట బళ్లారి నగర ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో చిన్న వయస్సులో త్రివేణి సూరికి అదృష్టం వరించి మేయర్ స్థానం దక్కించుకున్నారు. పలువురు ప్రముఖులు పోటీ చేసినా ఆమెనే మేయర్ పదవి వరించింది. తల్లీకూతుళ్లిద్దరినీ వరించిన మేయర్ పదవి మరో విశేషం ఏమిటంటే నూతన మేయర్‌గా ఎన్నికై న త్రివేణి తల్లి సుశీలబాయి కూడా 2018–19లో నగర మేయర్‌గా పని చేశారు. తల్లీకూతుళ్లిద్దరినీ మేయర్ పదవి వరించడం నగరంలో చర్చనీయాంశమైంది. అనంతరం నూతన మేయర్ విలేకరులతో మాట్లాడుతూ నగర మేయర్ అవుతానని తన కలలో కూడా ఊహించలేదన్నారు. తన తండ్రి ప్రోత్సాహంతో గతంలో తన తల్లి సుశీలాబాయి ఐదేళ్లు కార్పొరేటర్‌గా, ఒక ఏడాదిపాటు నగర మేయర్‌గా సేవ చేసిందని గుర్తు చేశారు. మళ్లీ తండ్రి కమేలా సూరి తనను రాజకీయాల్లోకి రావాలని సూచించడంతో ఉద్యోగానికి వెళ్లకుండా నగర కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రస్తుతం మేయర్ పట్టం వరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో మేయర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మేయర్ తండ్రి సూరి మాట్లాడుతూ గతంలో తన భార్యకు, ప్రస్తుతం తన కుమార్తెకు మేయర్ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. -
విశాఖకే తలమానికం
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో జీ–20 సదస్సు నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నట్టు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. జీ–20 సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పర్యాటకులకు కల్పించిన సౌకర్యాలపై బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇక్కడి ప్రజలు తరఫున కృతజ్ఞతలు. జీ–20 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అద్భుతం. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. షీలానగర్ నుంచి ఎన్ఏడీ, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు కోట్లాది రూపాయలతో సుందరీకరణ పనులతో పాటు రోడ్లు, విద్యుత్ అలంకరణ, ఆకర్షణీయమైన పెయింటింగ్ పనులు చేపట్టాం. సాగరతీరంలో కోస్టల్ బ్యాటరీ నుంచి రాడిసన్ హోటల్ వరకు విశాఖ తీర అందాలు అతిథులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. ఆర్.కె.బీచ్, సాగర్‌నగర్, గుడ్లవానిపాలెం, సీతకొండ తదితర ప్రాంతాల్లో వ్యూ పాయింట్లను అతిథులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా రూపొందించాం. ప్రాంతాలు తెలిపే సూచిక బోర్డుల ఏర్పాటు, వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించాం. ఎక్కడా వ్యర్థాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా పలు ప్రాంతాలను తీర్చిదిద్దాం.’అని మేయర్ వివరించారు. ప్రజల భాగస్వామ్యం కావాలి ‘జీ–20 సదస్సు విశాఖకే తలమానికం. విశాఖ నగర పౌరులుగా గొప్ప కార్యక్రమంలో భాగస్వాములవుదాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుదాం. దేశ విదేశీ ప్రతినిధులకు మన సంస్కృతి, సంప్రదాయాలను చూపిద్దాం.’అని మేయర్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ‘యోగా ఆల్ పేరిట వైఎస్సార్ సెంట్రల్ పార్క్, వుడా పార్కులో యోగా తరగతులు నిర్వహించాం. ‘మాక్ జీ–20 కాన్క్లేవ్’పేరిట బుధవారం విద్యార్థులతో సదస్సు చేపట్టాం. 24న సాగరతీర స్వచ్ఛత పేరిట బీచ్ క్లీనింగ్, 25న చిత్రలేఖనం పోటీలు, 26న వైజాగ్ సిటీ మారథాన్, వైజాగ్ కార్నివాల్ పేరిట థింసా, కోలాటం, వీరనాట్యం, కూచిపూడి వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ముడసర్లోవలోని సోలార్ ప్రాజెక్టు, కాపులుప్పాడలోని జిందాల్ రీసైక్లింగ్ ప్లాంట్, జీవీఎంసీలోని కమాండ్ కంట్రోల్ ఆపరేషన్, తాగునీటి ప్రాజెక్టు, కై లాసగిరి, ఆర్కేబీచ్ తదితర ప్రాంతాలను తిలకించనున్నారు’అని మేయర్ తెలిపారు. కోట్లాది రూపాయలతో నగర సుందరీకరణ ‘రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జీ–20 సదస్సుకు సంబంధించి కోట్లాది రూపాయలతో చేపట్టిన సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జోన్–1 పరిధిలో రూ.412.86 లక్షలతో 20 పనులు, జోన్–2 పరిధిలో రూ.1353.77 లక్షలతో 73 పనులు, జోన్–3 పరిధిలో 1371.62 లక్షలతో 59 పనులు, జోన్–4 పరిధిలో 1908.65 లక్షలతో 35 పనులు, జోన్–5 పరిధి–ఏలో 752.44 లక్షలతో 33 పనులు, బిలో రూ.169.91 లక్షలతో 11 పనులు, జోన్–8 పరిధిలో రూ.1908.89 లక్షలతో 27 అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఇందులో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. విద్యుత్‌కు సంబంధించి రూ.1168.47 లక్షలతో 56 పనులు, మెకానికల్‌కు సంబంధించి 287.41 లక్షలతో 4 పనులు, పీడీ–1కి సంబంధించి రూ.932.25 లక్షలతో 12 పనులు, పీఎల్ అండ్ సీకి సంబంధించి రూ.878.99 లక్షలతో 53 పనులు జరుగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 70 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి’ అని మేయర్ వివరించారు. హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు ‘జీ–20 సదస్సుకు విశాఖ వేదికగా నిలవడం సంతోషంగా ఉంది. ఈ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. విదేశాంగ మంత్రులు, రాయబారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండు స్టార్ హోటళ్లలో సమ్మిట్ జరగనుంది. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్ హాటళ్లలో 300 గదులు బుక్ చేశారు. హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు.’ అని మేయర్ వివరించారు. -
మహిళా దినోత్సవ సందర్భంగా చిత్తూరు మేయర్ పై స్పెషల్ స్టోరీ
-
మేయర్ ఇంట్లో 5000 వీధి కుక్కల్ని వదలాలి: RGV
-
Shelly Oberoi: మేయర్ పీఠంపై మాజీ ప్రొఫెసర్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆప్. డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో.. ఆప్ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ రెండు నెలలపై సభ్యుల ఆందోళనతో, ఎల్జీ నిర్ణయంతో.. మేయర్ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఊరటతో ఆప్ విజయం సునాయసమైంది. ఆ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్.. బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఆమె నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. షెల్లీ ఒబెరాయ్(39).. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో ఉన్నత డిగ్రీ పూర్తి చేశారు. ఐఐఎం కోజికోడ్(కేరళ)లో మేనేజ్మెంట్ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా గతంలో పని చేసిన ఆమె.. మొట్టమొదటిసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్(86వ వార్డ్) నుంచి ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. 2013-14 నుంచి ఆప్‌లో కొనసాగుతున్న ఆమె.. 2020లో మహిళా మోర్చా విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రచార సమయంలో షెల్లీ ఒబెరాయ్ జనాల్లోకి వెళ్లిన తీరుపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. షెల్లీ ఒబెరాయ్ తండ్రి సతీష్ కుమార్ వ్యాపారవేత్త. తల్లి సరోజ్ గృహిణి. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. కిందటి నెలలో మేయర్ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనే తాజాగా ఆప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ::సాక్షి ప్రత్యేకం -
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీ మేయర్‌గా ఆప్ నేత షేల్లీ ఒబెరాయ్(39) ఎన్నికయ్యారు. ఇక, మేయర్ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్‌కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం, ఆప్ నేతలు ఒబెరాయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. గెలుపు అనంతరం షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఈ సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ సభ గౌరవాన్ని కాపాడుతారని, సజావుగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ గెలుపుపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది. గూండాయిజం ఓడిపోయింది. ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైనా షెల్లీ ఒబెరాయ్‌కు అభినందనలు. తర్వాత, అలె ఇక్బాల్ డిప్యూటీ మేయర్ అవుతారు. మోసపూరితంగా వ్వహరించి బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోవాలని రాజకీయం చేసింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి. షెల్లీ ఒబెరాయ్ వివరాలు ఇవే.. షెల్లీ ఒబెరాయ్(39).. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. ఈ క్రమంలోనే మేయర్‌గా ఎన్నికవడం విశేషం. ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు. #WATCH | Aam Aadmi Party's Shelly Oberoi elected as the new mayor of Delhi. pic.twitter.com/wAd8WNUFwx — ANI (@ANI) February 22, 2023 -
బాలుడి ప్రాణానికి బాధ్యులు ఎవరు..?
-
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఏపీకి మరో 20 ఏళ్ళు సీఎం వైఎస్ జగనే ఉంటారు : బంగి అనంతయ్య
-
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్‌గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్‌ను ఉప మేయర్‌గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్‌గా, ఉప మేయర్‌గానూ సేవలందించారు. మేయర్‌గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆర్మ్‌స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! -
కిషన్ రెడ్డి కేంద్ర నిధులు తేలేకపోయారు: మేయర్ విజయలక్ష్మి
-
రచ్చ రచ్చగా GHMC కౌన్సిల్ సమావేశాలు
-
చర్చ లేదు రచ్చే.. రసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం..
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఎలాంటి చర్చ లేకుండా రచ్చతోనే అర్ధాంతరంగా ముగిసింది. గందరగోళం.. రసాభాసలతో, సభ్యుల సస్పెన్షన్లు ఉంటాయో, ఉండవో కూడా తెలియని అయోమయంతో అభాసుపాలైంది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికి సభనే ముగించారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆద్యంతం రచ్చే అయింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2023–24)సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, నగర ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సాధారణ సమావేశం రెండూ ఒకేరోజు ఏర్పాటు చేశారు. అజెండా మేరకు తొలుత బడ్జెట్ సమావేశంలో భాగంగా మేయర్ బడ్జెట్ ప్రతిలోని వివరాలు చదవడం ప్రారంభించగానే బీజేపీ సభ్యులు అడ్డుకొని పోడియం వైపు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలపై పట్టుబట్టడంతో.. ► తొలుత బడ్జెట్ బదులు ప్రజల సమస్యలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని పట్టుబట్టారు. గందరగోళంతో మేయర్ సభను పదినిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక సైతం వారు ఆందోళన కొనసాగిస్తుండగానే మేయర్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేవారి చేతులెత్తాలని చెప్పి, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులను పరిగణనలోకి తీసుకొని ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దాన్ని అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు మేయర్ పోడియం ముందు బైఠాయించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.గందరగోళం తీవ్రంగా మారడంతో మరోసారి సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.50 గంటలకు సమావేశం ప్రారంభమయ్యాక సైతం అదే సీన్ పునరావృతమైంది. బీజేపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. బడ్జెట్‌పై చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారంటూ పట్టుబట్టారు. ► ఆమోదం పొందాక తిరిగి చర్చ ప్రశ్నే లేదని, ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తానని, తొలుత మీకే అవకాశమిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ప్రశ్నల కోసం పేర్లు పిలవగా ఒకరిద్దరు బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు లేచి మాట్లాడారు. వారు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ ఆందోళన ఆగలేదు. వీధిదీపాలు వెలగడం లేవని ఎంఐఎం.. అభివృద్ధి కార్యక్రమాలకు ఢిల్లీ వారు నగరానికి అవార్డులిస్తున్నా, గల్లీ వారికి కనిపించడం లేవని బీఆర్ఎస్ ప్రస్తావించాయి. బీజేపీ సభ్యులెంతసేపటికీ పోడియం దిగి రాకపోవడం.. గందరగోళ పరిస్థితి సద్దుమణగకపోవడంతో రెండు మూడు పర్యాయాలు సస్పెన్షన్ హెచ్చరికలు చేసిన మేయర్ 12.11 గంటలకు పోడియంవద్ద ఉన్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు, మేయర్, కమిషనర్ తమ సీట్లనుంచి లేచి వెళ్లిపోయారు. తిరిగి 12.44 గంటలకు సీట్లోకి వచి్చన మేయర్ మాట్లాడుతూ ‘మంచిగా చెబుతున్నా కూర్చోండి. చర్చిద్దాం’ అన్నా పోడియంను చుట్టుముట్టిన వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. రూ. 6224 కోట్లతో బడ్జెట్ ఆమోదం 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.6224 కోట్ల బడ్జెట్ మెజారిటీ సభ్యులతో సభ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదించారు. బీజేపీ, కాంగ్రెస్ ధర్నాలు.. ప్రజా సమస్యలపై చర్చించాలని, అభివృద్ధి పనులి్నచేపట్టాలనే డిమాండ్లతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వేర్వేరుగా ఆందోళనలు, ధర్నాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ జీహెచ్ఎంసీ’ ప్లకార్డులను ప్రదర్శించారు. బీజేపీ సభ్యులు మేయర్ ప్రవేశ ద్వారం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. సస్పెన్షన్ ఉంటుందా.. ? జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం లేనట్లు మునిసిపల్ వ్యవహారాల నిపుణుడొకరు పేర్కొన్నారు. సభను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే అందుకు కారణమైన వారిని బయటకు పంపించడమో, లేక సభనే ముగించడమో మినహా సభ్యులను సస్పెండ్ చేయడమన్నది ఉండదని, గతంలో సైతం ఎలాంటి సస్పెన్షన్లు లేకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేయర్ తెలిసో, తెలియకో సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించాక పునరాలోచనలో పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నయాపైసా తెప్పించని కిషన్‌రెడ్డి: మేయర్ విజయలక్ష్మి సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలకూ ఒక్క పైసా తేలేకపోయారన్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు ఇప్పించలేక పోయారన్నారు. బీజేపీ సభ్యులు బడ్జెట్ గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ చర్చించకపోవడంతో వారికి సమస్యలపై పట్టింపు లేదని వెల్లడైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీల ద్వారా జీహెచ్ఎంసీ నిధులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. బీజేపీ వారికి మాట్లాడేందుకు విషయం లేనందునే గందరగోళానికి దిగారని ఆరోపించారు. మహిళా మేయర్‌ను అని కూడా చూడకుండా పోడియంను చుట్టిముట్టి అగౌరవంగా ప్రవర్తించారన్నారు. జీహెచ్ఎంసీకి కేంద్ర మంత్రి నిధులిస్తారా? హెచ్ఎంసీలో పాలన గాడి తప్పింది. నిధులెలా వస్తున్నాయో.. ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ వసూలైన నిధుల్ని అక్కడ వినియోగించాలి. పాతబస్తీ నుంచి ట్యాక్సుల రూపేణా ఎంత వసూలవుతుందో.. ఎంత ఖర్చు చేస్తున్నారో, అలాగే న్యూసిటీనుంచి ఎంత వసూలవుతుందో, ఎంత వెచి్చస్తున్నారో వెల్లడించాలి. హైటెక్‌సిటీలో హంగులు తప్ప ఇంకెక్కడా ఏమీ లేదు. గోడలకు రంగులేసి విశ్వనగరం చేస్తున్నామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఇండిపెండెంట్ బాడీ. ఎలా నడపాలో చేతగాక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రస్తావిస్తూ నిధులివ్వలేదనడం విడ్డూరంగా ఉంది. – బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు చదవండి: Roundup 2022: నిషా ముక్త్ షహరే.. డ్రగ్ ఫ్రీ సిటీ దిశగా! -
మేయర్ ను అడ్డుకున్న పార్టీ కార్యకర్తలు
-
కాలేజ్‌కి వెళ్లే యువకుడు మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించాడు
యూఎస్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా 18 ఏళ్ల యువకుడు జైలెన్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. అమెరికాలో అర్కాన్సాస్‌లోని ఒక చిన్నపట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్‌గా ఎన్నికైన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఈ మేరకు స్మిత్ మంగళవారం అమెరికాలోని ఒక చిన్న పట్టణం ఎర్లేకు మేయర్‌గా ఎన్నికయ్యారు. అతను తన ప్రత్యర్థి పారిశుధ్య విభాగంలోని సూపరింటెండెంట్ నేమీ మాథ్యూస్‌ను 235 భారీ మెజార్టీ ఓట్లతో ఓడించాడు. స్మిత్ ఈ ఏడాదే స్కూల్ నుంచి పట్టుభద్రుడయ్యాడు. అర్కాన్సాస్లో మిస్సిస్సిప్పి నదికి పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న ఎర్లే పట్టణంలో సుమారు 1,831 మంది జనాభా ఉంది. ప్రచారంలో స్మిత్ ప్రజా భద్రతను మెరుగుపర్చడం, పాడుబడిని గృహాలు, భవనాలను పునరుద్ధరించడం వంటి ప్రణాళికలను అభివృద్ధిపరుస్తున్నాని హామీతో ఈ మేయర్ పదవికి ఎన్నికయ్యారు. (చదవండి: తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్ రావడంతో..) -
ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు
సాక్షి, అనంతపురం: లండన్‌లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్‌బ్లాక్‌మెన్‌ను అనంతపురం మేయర్ వసీం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచినా ఆయన చాలా నిరాడంబరంగా తనతో గంటపాటు ముచ్చటించారని మేయర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందించి వివరించానన్నారు. సచివాలయ – వలంటీర్ వ్యవస్థ, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన కితాబునిచ్చారన్నారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారని ప్రశంసించారన్నారు. లండన్‌లోని కట్టడాలు, కొత్త ఆలోచనలను అనంతపురం నగరపాలక సంస్థలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. చదవండి: (అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం) -
US midterm elections 2022: లాస్ ఏంజెలిస్ మేయర్‌గా నల్లజాతి మహిళ
లాస్ ఏంజెలిస్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. 40 లక్షల జనాభా ఉన్న లాస్ఏంజెలిస్ను పలు సమస్యలు చుట్టుముట్టిన వేళ రిపబ్లికన్ అభ్యర్థి, కుబేరుడు రిక్ కరుసోపై డెమొక్రటిక్ మహిళా అభ్యర్థి కరీన్ బాస్ దాదాపు 47,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్ బాస్ గెలుపు దాదాపు ఖరారైనట్లే. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. -
మజ్లిస్ ఎంపీతో ‘బండి’కి ఏం పని?
కరీంనగర్: ‘ఔరంగాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు ఏం పని? అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో చెప్పాలి’ అని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో మాటల యుద్ధాలే ఉండాలి తప్ప ప్రత్యక్ష దాడులకు తావులేదన్నారు. ఎమ్మెల్సీ కవిత సీఎం కూతురు అయినందునే ఆమెను లక్ష్యంగా చేసుకొని ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్‌పైనా అనేక ఆరోపణలు ఉన్నాయని, అలాగని టీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి ముందు ధర్నా చేశాయా? అని ప్రశ్నించారు. ఔరంగాబాద్ మజ్లిస్ ఎంపీ ఇంతియాజ్ జలీల్‌ను బండి సంజయ్ ఎందుకోసం కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఇంతియాజ్ జలీల్‌కు బండి సంజయ్ చార్మినార్ ప్రతిమను అందిస్తున్న ఫొటోను విలేకరుల ముందు ప్రదర్శించారు. కరీంనగర్ ప్రజలను విభజించాలనుకోవడం దుర్మార్గమన్నారు. -
‘డబుల్’తో సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన 7.09 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని, కులం, మతం, వయసు, ఓటరు గుర్తింపు కార్డు వివరాల సేకరణ మాత్రమే జీహెచ్ఎంసీ చేపట్టిందని ఆమె తెలిపారు. ఆయా వివరాలను సేకరించి పూర్తి సమాచారంతో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ ప్రసంగంలో ప్రధాన అంశాలివీ.. మురికి వాడల్లోని పేద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్లో ఏడాదికి 600 మందికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. నగరంలోని అన్ని కాలనీల్లో నూరు శాతం పచ్చదనం లక్ష్యం సాధించేందుకు, దాని ద్వారా సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల్లోని మహిళలకు ఆదాయం లభించేందుకు తొలిదశలో 3 వేల కాలనీల్లో మొక్కల పెంపకం బాధ్యతల్ని అప్పగించాం. ప్రజల రక్షణ కోసం 1456 మురికివాడలు, 975 పార్కుల్లో రూ. 20 కోట్లతో దాదాపు 8వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, సహాయ పరికరాలను 4,749 మందికి త్వరలో పంపిణీ చేస్తాం. నగరంలోని 185 చెరువుల్ని దశలవారీగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాం. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ప్రస్తుతమున్న రెండింటికి తోడు మరో రెండు చారి్మనార్, సికింద్రాబాద్‌ల వైపు ఏర్పాటు కానున్నాయి. ఎస్సార్డీపీ ద్వారా 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 6 ఆరోఓబీలు, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మరో 18 çపనులు పురోగతిలో ఉన్నాయి. వాటిలో వీలైనన్ని పనుల్ని డిసెంబర్‌లోగా పూర్తిచేస్తాం. రహదారుల నిర్వహణలో భాగంగా రూ.409 కోట్లతో 1,740 పనులు పూర్తయ్యాయి. సీఆర్ఎంపీ ద్వారా ఇప్పటి వరకు 678.41 కి.మీ రోడ్ల రీకార్పెటింగ్‌కు రూ.783.16 ఖర్చయింది. రెండు దశల్లో రూ. 49.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 34 ఆధునిక వైకుంఠ ధామాల్లో 28 పూర్తయ్యాయి. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై.. తేలేదెప్పుడు?) -
మధ్యప్రదేశ్‌లో ‘ఆప్’ పాగా.. మేయర్ పీఠం కైవసం
భోపాల్: దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మను 9,352 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ నెగ్గడం ఇదే తొలిసారి. 2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్.. తాజాగా సింగ్రౌలీ మేయర్‌గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమెకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. తాజా ఫలితాల్లో రాణి అగర్వాల్ విజయం సాధించటంతో సింగ్రౌలీ మేయగా గెలిచారు. సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆ పార్టీ కన్వినర్ అరవిందక్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆప్ నిజాయతీ రాజకీయలాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు. ఇదీ చూడండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్‌లో క్యూజోన్ ప్రావిన్స్‌లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...) -
పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!
కుత్బుల్లాపూర్: శివారు ప్రాంత రాజకీయం రసవత్తరంగా మారుతుంది.. ఇప్పటికే నగరం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు.. నగర పంచాయతిలలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారుతూ తమ అధిష్టానానికి ఝలక్ ఇస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో మేయర్ ఒక మెట్టు దిగి ప్రతి ఒక కార్పొరేటర్‌కు ఎంతో కొంత ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ► కాగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2019 జనవరి నెలలో జరిగాయి. ఈ ప్రాంతంలో మొత్తం 27 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గెలుపొందగా ఆరు గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మెజారిటీ సభ్యులు ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ రాజులు కలిసి కొలను నీలా గోపాల్‌రెడ్డిని మేయర్‌గా, డిప్యూటీ మేయర్ ధనరాజ్‌యాదవ్‌లను ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి ప్రయాణం మూడవ సంవత్సరం దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ మొదలైంది. క్యాంపు రాజకీయాలకు... ► మొత్తం 27 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా వారిలో ఏకంగా 17 మంది స్థానిక టీఆర్ఎస్ నేతతో గత నెలలో శ్రీశైలం టూర్ కి వెళ్లి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో మేయర్ భర్త గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానందలకు ఈ విషయా న్ని చేరవేశారు. క్యాంపులో ఉన్న 17 మందితో పాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు జత కలవడంతో వారి సంఖ్య ఏకంగా 20 కి చేరింది. దీంతో ‘రాజీ’ఫార్ములాకు వచ్చిన మేయర్ భర్త ఒ క్కొక్కరికి ఇంత చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి ఆ నో టా.. ఈ నోటా ఈ ఒప్పందం విషయం బహిర్గతం కావడంతో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్రంగా గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ విషయంలో తటస్థంగా ఉండడం విశేషం. గిట్టని వాళ్ల పని ఇది... ► ఈ విషయంపై నిజాంపేట మేయర్ భర్త గోపాల్ రెడ్డిని వివరణ కోరగా ఖండించారు. కొంతమంది గిట్టనివాళ్లు ఇలా చెప్పుకుంటున్నారని, తాను ఎందుకు డబ్బులు ఇస్తానని ప్రశ్నించారు. అదంతా అబద్ధపు ప్రచారమని, తాను ఎవరికీ డబ్బులు ఇస్తానని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు. -
మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు
శని ఉందని చెట్టుతోనో, పుట్టతోనో ముందు పెళ్లి చేస్తే... అది పోతుందనే సంప్రదాయం మనదగ్గరా ఉంది. కానీ మొసలిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని అనుమానంతో చూడకండి. ఈ మెక్సికన్ మేయర్ చేసుకున్నాడు. వందల ఏళ్ల పాత సంప్రదాయంలో భాగంగా అతను మొసలిని పెళ్లి చేసుకోవడమే కాదు... దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కప్పల పెళ్లిళ్లు చేస్తే, వరదపాశం వండి బండమీదపోసి తింటే.. వరదలు పారే వర్షాలు కురుస్తాయని మన దగ్గర కొన్ని నమ్మకాలున్నాయి కదా! అలా మెక్సికోలోనూ ఓ పాత పద్ధతి ఉంది. అక్కడ గ్రామ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే... వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని, చేపలు సమృద్ధిగా దొరుకుతాయని నమ్మకం. ఇంకేముంది.. ఈ ఏడు కూడా అలాగే జరగాలని సాన్ పెడ్రో హామెలుల గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మేయర్ విక్టర్ హ్యూగో సోసాకు కూడా మొసలితో పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి కూతురు మొసలిని... పెళ్లి దుస్తుల్లో అందంగా అలంకరించారు. తెల్లని ముసుగును కూడా కప్పారు. సంప్రదాయ సంగీతం, మేళ తాళాలు, నృత్యాల మధ్య వధువును వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వరుడు మేయర్, వధువు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ గ్రామం అన్నింటా సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేశాడు. ఇక వేడుక మొత్తం ఆ మొసలి పెళ్లికూతురిని ముద్దు పెడుతూనే ఉన్నాడు ఆ మేయర్. మరి ముద్దులు పెడుతుంటే ఆ మొసలి అతడిని ఏమీ అనలేదా అన్న అనుమానం వస్తోంది కదూ! ఫొటో జాగ్రత్తగా చూడండి దాని మూతిని తాడుతో కట్టేశారు. చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu — Reuters (@Reuters) July 1, 2022 -
Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్‌తో పాటు 23వ కార్పొరేటర్ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా సోమవారం హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. -
TS: బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్
Badangpet Mayor Chigirintha Parijatha Narasimha Reddy: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో గులాబీ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
గులాబీకి గుడ్‌బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్‌బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎల్బీనగర్లోనూ... ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. టీకేఆర్ను బుజ్జగించిన కేటీఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఆయన కోడలు తీగల అనితా హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డిలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. (చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’) -
జోష్‌లో వంతెన ఓపెనింగ్.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు
Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ జోస్ లాయిస్ ఉరియో స్టెగుయ్కు ఊహించని షాక్ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్ సహా సిటి కౌన్సిల్ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk — Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022 సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లండన్‌లో తొలి దళిత మేయర్‌గా మొహిందర్ కె.మిధా
లండన్: భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తద్వారా యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు. మొహిందర్ కె.మిధా ఎన్నిక పట్ల లేబర్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమనియూకేలోని ‘ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్’ చైర్మన్ సంతోష్‌దాస్ చెప్పారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మిధాను 2022-23 తదుపరి ఏడాది కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి.