జైపూర్: జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సౌమ్య గుర్జార్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం రాత్రి కమిషనర్ యగ్యా మిత్ర సింగ్ దియో ఓ సమావేశాన్ని నిర్వహించగా, దానికి మేయర్ సౌమ్య గుర్జార్, కౌన్సిలర్లు అజయ్‌సింగ్ చౌహాన్, పరాస్ జైన్, శంకర్ శర్మలు హాజరయ్యారు. సమావేశంలో వచ్చిన వాదనలో కమిషనర్‌పై వీరు భౌతికంగా బలప్రయోగం చేయడంతో యగ్యా మిత్ర సమావేశాన్ని మధ్య లోనే నిలిపేసి వెళ్లిపోయారు.
ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే ఓ కంపెనీకి సంబంధించి వీరి మధ్య వాగ్వివాదం జరిగిన ట్లు సమాచారం. తొలగింపుకు గురైన వారిలో శంకర్ శర్మ ఇండిపెండెంట్ కాగా, మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందినవారే. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో రాష్ట్ర బీజేపీ ఈ చర్యపై మండిపడింది. మేయర్ పీఠాన్ని తాము గెలవడంతో కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment