Suspended
-
దక్షిణ కొరియా డీప్‌సీక్ డౌన్లోడ్ నిలిపివేత
సియోల్: చైనాకు చెందిన కృత్రిమ మేథ అంకుర సంస్థ డీప్‌సీక్‌కు చెందిన చాట్‌బాట్ యాప్‌ల డౌన్‌లోడ్‌ను తమ దేశంలో తాత్కాలికంగా నిలిపేసినట్టు దక్షిణ కొరియా అధికారులు సోమవారం ప్రకటించారు. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి స్థానిక వెర్షన్ల డీప్‌సీక్ యాప్‌లను శనివారం సాయంత్రం తొలగించామని వెల్లడించారు.యాప్‌ను తిరిగి ప్రారంభించే ముందు వినియోగదారుల భద్రతను పెంచడానికి తమతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తాజాగా డీప్‌సీక్ అంగీకారం తెలిపిందని దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార పరిరక్షణ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే తమ ఫోన్లలో డీప్‌సీక్‌ను డౌన్లోడ్ చేసుకున్న లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో ఉపయోగించే వినియోగదారులు యథాతథంగా తమ యాప్‌ను వినియోగించుకోవచ్చు.ఏఐ మోడల్ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆందోళనల నడుమ అనేక దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు డీప్‌సీక్‌ను తమ నెట్‌వర్క్‌ల నుంచి తొలగించాయి. ఉద్యోగులు తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఈ చాట్‌బాట్ సేవలను పొందకూడదని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీచేశారు. అయితే జనవరి నాలుగోవారం నాటికే దక్షిణ కొరియాలో 12 లక్షల మంది మొబైల్ వినియోగదారులు డీప్‌సీక్‌ను వినియోగిస్తున్నారు. -
కీచక ఐపీఎస్: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
సాక్షి, చెన్నై: చెన్నై ట్రాఫిక్ విభాగంలో ఐపీఎస్ అధికారి కీచకుడయ్యాడు. మహిళా పోలీసును లైంగికంగా వేధించడంతో ఆమె డీజీపీ శంకర్ జివ్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్‌ను సస్పెండ్ చేశారు. విశాఖ కమిటీ విచారణకు ఆదేశించారు. గతంలో మహిళా ఐపీఎస్‌కు డీజీపీ స్థాయి అధికారి ఒకరు వేధింపులు ఇవ్వడం, ఐజీ స్థాయి అధికారి తన సహచర అధికారిణికి వేధింపులు ఇవ్వడం వంటి ఘటనలు తమిళనాట పోలీసు యంత్రాంగంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక చోట కింది స్థాయి అధికారులపై వేధింపుల పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో గురువారం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ఒకరు డీజీపీ శంకర్ జివ్వాల్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొంటున్న వేదింపు గురించి ఆయనకు వివరించారు. చెన్నై కమిషరేట్‌లో ఏడవ అంతస్తులో›ట్రాఫిక్ జాయింట్ కమిషననర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి డి. మహేశ్‌కుమార్ ఈ వేదింపులకు గురి చేసినట్టు ఫిర్యాదు చేయడం తక్షణం, విచారణ జరగడం జరిగింది. విచారణలో ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో తక్షణం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసును డీజీపీ సీమా అగర్వాల్, ఐపీఎస్ అధికారిణులతో కూడిన విశాఖ కమిటికి అప్పగించారు. ఈ కమిటీ తన విచారణపై దృష్టి పెట్టింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మహేశ్కుమార్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
AP: ఒంటరి మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్
సాక్షి, శ్రీ సత్యసాయి: పోలీసు స్టేషన్లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.జరిగింది ఇది..బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.అనంతరం పోలీస్ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్లబోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వివరించింది.వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో, ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సీఐ రామయ్యపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. -
కాంగ్రెస్.. ‘ఢీ’ఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎసీ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అసెంబ్లీ తరహాలో మార్షల్స్‌తో సభ్యులను బలవంతంగా బయటకు పంపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య జరిగిన వివాదంతో సభాధ్యక్ష స్థానంలోని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దాంతో వారు కార్పొరేటర్లను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. అనంతరం రామ్‌గోపాల్‌పేట పీఎస్‌కు తరలించి, సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. దాదాపు మూడు గంటల వ్యవధిలో సభ నాలుగుసార్లు వాయిదా పడింది. ఆరంభం నుంచే.. సమావేశం ఆరంభం నుంచే రసాభాస చోటు చేసుకుంది. ఉదయం 10.35 గంటలకు సభ ప్రారంభం కాగా 10.40 గంటలకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభిద్దామని మేయర్ అన్నారు. తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం చెలరేగడంతో 10.50 గంటలకు మేయర్ సభను వాయిదా వేశారు. ఈ సమయంలోనూ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ జూటా అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక సైతం గందరగోళం ఆగలేదు. ఎలాంటి చర్చ లేకుండానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) రూ. 8440 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినట్లు (డీమ్డ్ టూ అప్రూవ్ అంటూ) మేయర్ ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పిందిలా.. బీఆర్ఎస్ సభ్యుల చేతుల్లోని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డుల్ని కాంగ్రెస్ సభ్యులు బాబా ఫసియుద్దీన్, సీఎన్‌రెడ్డి తదితరులు చించివేశారు. బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్ వారు మేయర్ పోడియంపైకి విసిరారు. పోడియం వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ సభ్యులు వారికి అడ్డు నిల్చున్నారు. కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రెండు పార్టీల మధ్య తోపులాట పెరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఒక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింధు, శాంతి, పద్మా వెంకట్‌రెడ్డి, విజయ్కుమార్గౌడ్లను బయటకు పంపించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీంతో బయటకు పంపిన తమ సభ్యులను లోనికి తీసుకురావాల్సిందేనని, లేనిదే తాము చర్చలో పాల్గొనమని బీఆర్ఎస్ సభ్యులు మన్నె కవితారెడ్డి తదితరులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ సభ్యులందరినీ బయటకు తీసుకెళ్లాల్సిందిగా మేయర్ ఆదేశించడంతో 33 మంది సభ్యులను మార్షల్స్ బలవంతంగా ఎత్తుకెళ్లారు. బయటకెళ్లిన వారు నిరసన ప్రదర్శనకు దిగగా జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి రామ్‌గోపాల్‌పేట పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ బలంతోనే మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి తమనే బయటకు పంపించడం దారుణమని ఆ పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్ 420 అంటూ, బీఆర్ఎస్ వాళ్లు సీఎం రేవంత్‌రెడ్డి 420 అంటూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్లకార్డులు పట్టుకొచ్చారు. సభ ప్రారంభానికి ముందు బీజేపీ సభ్యులు శ్రవణ్, తదితరులు తమకు బడ్జెట్ కేటాయించడం లేదంటూ, మేయర్ ఎంట్రన్స్ వద్ద యాచకుల మాదిరిగా చిప్పలు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. బాబా ఫసి యుద్దీన్ భారత్ జోడో యాత్ర టీషర్ట్ వేసుకొని రావడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 శాతం ఆదాయం అధికారులకే.. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్, సంబంధిత అధికారులు బదులిచ్చారు. వీధిదీపాల సమస్యలు త్వరలో తీరుతాయని, చెత్త సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలున్నాయని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి తెలిపారు. మేయర్‌తో కలిసి అన్నిడివిజన్లలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బల్దియాలో అనసరంగా ఎందరో అధికారులున్నారని, 70 శాతం జీహెచ్ఎంసీ ఆదాయం వారి జీతభత్యాలకే పోతుండగా, వారి ద్వారా ఒరుగుతున్నదేమీ లేదని కాంగ్రెస్ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ జీహెచ్ఎంసీ తీరును ఎండగట్టారు. అవసరమైన పారిశుధ్యం వంటి పనులకు మాత్రం సిబ్బంది లేరన్నారు. సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఇలంబర్తి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ చర్య దుర్మార్గం: కేటీఆర్ జీహెచ్ఎసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా? అని ఆయన ప్రశ్నించారు.రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే : మంత్రి పొన్నం జీహెచ్ఎఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు. -
బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ట్విటర్ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్‌లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్ ఈ ట్విటర్ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్ట్‌లపై ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా.. స్వర భాస్కర్ విషయానికొస్తే సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
మద్యం తాగి.. విద్యార్థులపై దాడి
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం జయరాజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. జయరాజ్ సోమవారం తనవెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ తీసుకుని పాఠశాల టాయిలెట్లోకి వెళ్లారు. మద్యం బాటిల్ తీసుకుని వెళుతుండటాన్ని విద్యార్థులు గమనించి బాత్రూం దగ్గరకు వెళ్లి చూశారు.దీంతో హెచ్ఎం కోపంతో ఊగిపోతూ ప్లాస్టిక్ పైప్‌తో విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టాడు. కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. హెచ్ఎం మద్యం మత్తులో ఊగుతుండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో–2 జగన్నాథం అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు హెచ్ఎంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలకు తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌పాల్ ఉత్తర్వులిచ్చారు. -
నెల పాటు ర్యాపిడో సేవలు బంద్
అహ్మదాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ర్యాపిడో (Rapido) సేవలను 30 రోజుల పాటు నిలిపివేసింది. రిక్షా అసోసియేషన్ల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ర్యాపిడో కంపెనీకి RTO పలుసార్లు నోటీసులు జారీ చేస్తూ.. వస్తున్న ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కోరింది. కానీ సంస్థ దీనికి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం.. వాణిజ్య అవసరాల కోసం ప్రయాణీకులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. దాని కార్యకలాపాలలో ఉపయోగించే వాహనాలకు తప్పనిసరి బీమా కూడా అవసరం. ఈ రెండు నియమాలను ర్యాపిడో ఉల్లంఘించినట్లు కనుగొనబడింది.ర్యాపిడో బైక్ సర్వీస్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడంతో నిబంధనల ఉల్లంఘించినట్లు ఆటో యూనియన్లు ఆర్టీఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో సంస్థ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.అహ్మదాబాద్ ఆర్టీవో అధికారి 'జేజే పటేల్' (JJ Patel) మాట్లాడుతూ.. ఆర్టీవో కేవలం ర్యాపిడో త్రీ-వీలర్ ఆటో రిక్షాలకు మాత్రమే అగ్రిగేటర్ లైసెన్స్‌ను జారీ చేసింది. కానీ వారు తమ ఆన్లైన్ యాప్ ద్వారా నాన్-ట్రాన్స్పోర్ట్ టూ-వీలర్ వాహనాలను ఉపయోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు. అంతే కాకుండా డాక్యుమెంట్స్ గడువు ముగిసిన తర్వాత కూడా వారు వాహనాలను నడపడం కొనసాగించారు. దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడింది. కాబట్టి, మేము 30 రోజుల పాటు రాపిడో సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిబంధలనలు ఉల్లంగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.ర్యాపిడో సేవలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా కొన్ని నియమాలను సంస్థ ఉల్లంఘించిందనే కారణంగా ఢిల్లీ హైకోర్టు ర్యాపిడో సేవలను కొన్ని రోజులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్ ఆర్టీవో ర్యాపిడో సేవలను 30 రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.చాలామంది ర్యాపిడో సేవలను ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పకుండా, నియమాలను పాటించాలి. అప్పుడే ప్రజలకు సురక్షితమైన సేవలను అందించగలుగుతారు. నియమాలను ఉల్లంగిస్తే.. ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. కాబట్టి ర్యాపిడో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.ర్యాపిడో సర్వీస్ ఉపయోగాలుదేశంలోని ప్రధాన నగరాల్లో ర్యాపిడో సేవలను మంచి ప్రజాదరణ పొందాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. చాలా మంది ర్యాపిడో బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. రోజువారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి వాటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్చాలామందికి ఉపాధిర్యాపిడో సర్వీస్ కారణంగా దేశంలో చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కొక్కరు నెలకు వేలల్లో సంపాదించుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి ఈ బైక్ సర్వీస్ ద్వారానే నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు ఈ మధ్యకాలంలోనే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే బైక్ నడుపుకుంటూనే చాలామంది మంచి ఆదాయం సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది. -
‘ఉత్తమ’ టీచర్.. చెత్త పనులు
మంచిర్యాల అర్బన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. అభంశుభం తెలి యని బాలి కల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం మంగళ వారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఓ పాఠశాలలో ఎస్ఏ(తెలుగు) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.సత్యనారాయణ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ప్రధానోపా ద్యాయురాలితో పాటు డీఈవో యాదయ్యకు సమాచారం అందించారు. ఆయన మంగళవారం ఎంఈవో, సెక్టోరల్ అధికారులను విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో విచారణ చేప ట్టారు. సత్యనారాయణ అసభ్యకరంగా తాకుతు న్నాడని, కళ్లు మూసుకుని ధ్యానం చేయాలంటూ సెల్ఫోన్లో చిత్రీ కరించాడని బాలికలు పేర్కొన్నారు. మాటల్లో చెప్పరాని విషయా లను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. విచారణ అధికారులు వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని బయటకు రావాలని తల్లిదండ్రులు పదేపదే పిలి చినా రాకపోవడంతో ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. కాగా, సత్యనారాయణ గతంలో ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. -
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేశారని, గోడ కురీ్చలు వేయించడం వంటి చర్యలతో వేధించారని కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016 జనవరిలో భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. అదే సంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా ర్యాగింగ్ కారణంగా 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థులపై డిసెంబర్ ఒకటి వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ర్యాగింగ్‌ను ఉపేక్షించేది లేదని కళాశాల డైరెక్టర్ రమేశ్ తెలిపారు. -
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్‌నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్‌తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఇజ్రాయెల్‌పై ట్వీట్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్స్ ఖాతా సస్పెండ్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.ఇక ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. -
భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన!
Dana Cyclone Updates:తీవ్ర తుఫానుగా ‘దానా’ వాయువ్య బంగాళాఖాతంలో కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 260 కి.మీ, ధమర (ఒడిశా)కి 290 కి.మీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు వాతావరణ అధికారుతెలిపారు.దానా తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. ఈ రాత్రి (గురువారం) అత్యధిక వేగంతో గాలి వీస్తుందని చెప్పారు.‘‘ దానా తుపాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారింది. ఇది గత 6 గంటల్లో 12 కి.మీ/గంట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతం వాయువ్య దిశలో తీవ్ర తుపానుగా కదులుతోంది’’అని అన్నారు.#WATCH | Bhubaneswar, Odisha | On cyclone 'Dana', Director IMD, Manorama Mohanty says, "The cyclone Dana has intensified into a severe cyclonic storm in last midnight and it is moving north-westward with the speed 12km/hr during last 6 hours and now it is lying over central and… pic.twitter.com/Cff2mVTNgh— ANI (@ANI) October 24, 2024దానా తుపాను భయపెడుతున్న నేపథ్యంలో తీరం దాటకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా , ధమ్రా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. మరోవైపు.. దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు(శుక్రవారం) ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేసింది.#CycloneDanaLies around 200kms off #Odisha coast at 5.30 am IST on 24th Oct. It is likely to landfall today evening/night (a tough time for relief personnel due to darkness) as a very severe cyclonic storm with expected windspeed of 120 kmph.Take care.@Windycom @zoom_earth pic.twitter.com/6PxsR7MGnS— Prof RV (@TheTechocrat) October 24, 2024 ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఒడిశాలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 120 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ దానా తుపాను ఒడిశాలోని సగం జనాభా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.It appears that #Dana is approaching #Cyclone strength and Category 2+ is on the cards as it approaches #India. Hopefully dry air will weaken it before landfall#wx #wxtwitter #tropicswx #CycloneDana #CycloneAlert pic.twitter.com/R8McN71Fnv— Hurricane Chaser Chase (@hurricane_chase) October 24, 2024 ఈ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కి.మీల దూరంలో, ధమర (ఒడిశా)కి 360 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈ తుపాను ఒడిశాలోని భిటార్కనికా నేషనల్ పార్క్ , ధామ్రా ఓడరేవుల మధ్య తీరం దాట వచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.In view of Cyclone DANA's impact on the coastal region of West Bengal, including Kolkata, it has been decided to suspend the flight operations from 1800 IST on 24.10.2024 to 0900 IST on 25.10.2024 due to predicted heavy winds and heavy to very heavy rainfall at Kolkata. pic.twitter.com/jhd4E7S3NS— Kolkata Airport (@aaikolairport) October 23, 2024 మరోవైపు.. దానా తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదినీపూర్, ఝర్గ్రామ్, కోల్‌కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా విమానాశ్రయం గురువారం సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.🚨 Breaking NewsDon't be alarmed by potential storm 'seeds'.Be careful,be safe. Life is precious.I strongly believe that we all can successfully face the storm this time together as before. #EveryLifeIsPrecious #CycloneDana #Odisha#CycloneDana#BRICS2024 pic.twitter.com/a4bGjDLG3L— Akhilesh Yadav (@Akhiles61939129) October 24, 2024 అదేవిధంగా భువనేశ్వర్ విమానాశ్రయం ఈరోజు సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలో, బుధవారం సాయంత్రం నాటికి సుమారు 3 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్ 1.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
గుప్తనిధి, బంగారం అంటూ రూ. 17 లక్షలు స్వాహా చేసిన డీస్పీ సారు!
కామారెడ్డి క్రైం: ఎవరైనా మోసం చేస్తే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. అయితే బాధితు లకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే దొంగ బంగారం పేరిట డబ్బులు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన డీఎస్పీ మదన్‌లాల్ ఏడు నెలల క్రితం కామారెడ్డి డీసీఆర్బీ విభాగానికి బదిలీపై వచ్చాడు. జిల్లా పోలీస్ కార్యాలయానికి సమీపంలోని ఓ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని నివసిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన వ్యక్తికి తవ్వకాల్లో గుప్త నిధులు లభించాయని, రూ.6 లక్షలకే కిలో చొప్పున బంగారాన్ని ఇప్పిస్తానని నమ్మించాడు. తాను పోలీసునని, అంతా చూసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు వ్యక్తి.. రూ. 17 లక్షలకుపైగా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు 15 రోజుల క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించాడు. దీంతో ఈనెల 6న డీఎస్పీ మదన్‌లాల్‌ను ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అంతేకాకుండా దేవునిపల్లి ఠాణా లో ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు జరిగిన ఘ టనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రాష్ట్ర అధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో డీఎస్పీ మదన్‌లాల్‌ను సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో డీఎస్పీతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా గతంలో సదరు డీఎస్పీ పనిచేసిన ఇతర చోట్ల కూడా ఫిర్యాదులు ఉన్నాయని సమాచారం. జిల్లాకు వచ్చిన తర్వాత కూడా మాయమాటలు చెప్పి చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గుర్రంపోడు ఎస్ఐ సస్పెన్షన్
గుర్రంపోడు/హైదరాబాద్: హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన గుర్రంపోడు ఎస్ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. వివరాలివి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆగస్టు 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జాల రజిత (32) కేసును తొలుత ఆత్మహత్యగా నమోదు చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.దీనిపై ఎస్పీ శరత్చంద్ర పవార్.. ఏఎస్పీ రాములునాయక్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రధాన నిందితుడు రాములుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినప్పటికీ.. మిగతా నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఎస్ఐ.. కానిస్టేబుల్ (నంబర్ 3524) ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య కేసు నమోదు చేయడంతోపాటు సహ నిందితులైన రాములు భార్య జాల పార్వతమ్మ, అన్న కుమారుడు జాల వెంకటయ్యను పోలీసు ఉన్నతస్థాయి విచారణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలో ముగ్గురు పాల్గొన్నట్లు తేలింది.ఏ2, ఏ3 నిందితులను రక్షించే ప్రయత్నం జరిగినట్లు తేలడంతో ఎస్ఐపై చర్య తీసుకున్నారు. గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం ఎస్ఐ నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఫారెస్ట్ ఆఫీస్‌లో లిక్కర్ పార్టీ.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి, జగిత్యాల జిల్లా: దసరా వేడుకలకు అటవీశాఖ కార్యాలయాలన్నే బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేసిన అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దసరాకు ఒక రోజు ముందు నుంచే కార్యాలయంలో మందు పార్టీతో పాటు, అడవి జంతువుల మాంసంతో అధికారులు విందు చేసుకున్నారు. చిత్రీకరిస్తున్న మీడియాపైనా అధికారులు చిందులు తొక్కారు మీడియా కథనాలతో అటవీ శాఖ అధికారులు స్పందించారు.విచారణ చేపట్టిన అటవీశాఖ.. జగిత్యాల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్‌తో పాటు, ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వాచర్ లక్ష్మణ్‌ను విధుల నుంచి తొలగించింది.ఇదీ చదవండి: TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ -
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
ఆలయంలోనికి చెప్పులతో వచ్చిన అధికారి సస్పెండ్
మీర్జాపూర్: యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.ఆలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలోని వివరాల ప్రకారం విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్‌తో సహా ఆలయంలోనికి ప్రవేశించారు. ఇది కలకలం సృష్టించింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని చూసి, తాను ఆలయంలో నుంచి బయటకు పంపించివేశానని తెలిపారు. ఇది కూడా చదవండి: దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు -
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్‌కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
జత్వాని ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
-
స్కూల్ ప్రిన్సిపాల్ ఓవరాక్షన్ .. నాన్‌వెజ్ తీసుకొచ్చాడని విద్యార్ధి సస్పెండ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అయిదేళ్ల విద్యార్ధిని క్లాస్‌లోకి మాంసాహారం తెచ్చాడని అతడిని సస్పెండ్ చేవారు. ఈ ఘటన అమ్రోహాలోని ఓ ప్రవేటు పాఠశాలలో వెలుగుచూసింది. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు హిల్టన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న నర్సరీ విద్యార్ధి తన లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని పాఠశాలకు తీసుకొచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపల్ బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసింది. పాఠశాలలకు మాంసాహారం తీసుకొచ్చే పిల్లలకు మంచి బుద్దులు చెప్పడం తమకు ఇష్టం లేదని ఆమెతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగారు. అంతేగాక విద్యార్థి తరుచుగా మాంసాహారాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. మాంసాహారం తినేలా చేయడం వల్ల అందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకుంటున్నాననని, తాను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్లు తనతో విద్యార్ధి చెబుతున్నాడని ఆరోపించారు. ప్రిన్సిపల్ మాటలపై స్పందించిన విద్యార్ధి తల్లి తన క్లాస్‌లోని విద్యార్థులు కేవలం హిందూ-ముస్లిం’ అంటూ వేరు చేసి మట్లాడుతున్నారని చేస్తున్నారంటూ తన కొడుకు గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పింది. తన బిడ్డను అతని తరగతిలో కూర్చోనివ్వడం లేదని మహిళ ఆరోపించింది. అయితే దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థికి చదువు నేర్పడం ఇష్టం లేదని, అతన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.విద్యార్ధి తల్లి, ప్రిన్సిపల్ మధ్య సంభాషణను వీడియో రికార్డు చేయడంతో.. వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని, పాఠశాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమ్రోహి ముస్లిం కమిటీ.. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. అమ్రోహా ప్రాథమిక విద్యాశాఖాధికారి మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. టీడీపీ నుంచి ఆదిమూలం సస్పెండ్
సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ షాక్ తగలింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందునే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. తాను వేధింపులకు గురి చేసిన విషయం ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేశాను. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని బాధితురాలు డిమాండ్ చేసింది...ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు అని కన్నీరు పెట్టుకుంది. -
గుడ్లవల్లేరు విద్యార్థులను బెదిరించిన ఎస్ఐ శిరీష బదిలీ
-
దర్శన్‌కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్‌గా మారడంతో జైల్లో దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్‌కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్‌పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత హత్య ఘటన.. సీఐ, ఎస్ఐ సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: సీతారామాపురంలో వైఎస్సార్సీపీ నేత సుబ్బారాయుడు హత్య ఘటనపై డీఐజీ సీరియస్ అయ్యారు. నంద్యాల రూరల్ సీఐ శివ కుమార్‌రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ఉన్నప్పటికీ సీఐ, ఎస్ఐ నిర్లక్ష్యం వహించారని అభియోగం. పోలీసుల అలసత్వం వల్లే వైఎస్సార్సీపీ నేత హత్య జరిగిందని నిర్థారణ అయ్యింది. మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. -
దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
సనత్‌నగర్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
సనత్‌నగర్: సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్‌రెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచి్చన మహిళతో చాటింగ్ చేస్తూ అసభ్యకర మెసేజ్‌లు పంపించడంపై ఇన్స్పెక్టర్పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడు నెలల క్రితం సనత్‌నగర్ ఇన్స్పెక్టర్గా పురేందర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో పురేందర్‌రెడ్డి ఆమెతో ఫోన్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ‘నువ్వు అందంగా ఉన్నావు.. నేను చెప్పిన చోటికి రావాలి’ అంటూ అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపించారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అభ్యంతరకరంగా చేసిన చాటింగ్ సందేశాలను ఆధారాలతో కమిషనర్‌కు ఆమె చూపించారు. దీంతో ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో దుష్ప్రవర్తనను సహించేది లేదన్న బలమైన సందేశాన్ని సీపీ పంపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే పౌరులకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేలా ఒక భరోసా కలిగించేలా సీపీ చర్యలు తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. నూతన ఇన్స్పెక్టర్గా శ్రీనివాసులు.. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా కె.శ్రీనివాసులును నియమిస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు.. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శనివారం సాయంత్రం సనత్‌నగర్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. -
తుపాకీతో రైతులను బెదిరింపు.. పూజా ఖేద్కర్ తల్లి అరెస్ట్
ముంబై: అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. భూ వివాదంలో రైతులను తుపాకీతో బెదిరించిన పూజా తల్లి మనోరమ అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నారన్న ఆరోపణల కింద ఆమెను గురువారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజులుగా పూజాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఇటీవల ూణే జిల్లాలోని ముల్షి గ్రామంలో భూ వివాదంపై స్థానిక రైతులతో ఆమె పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా పుణెలో అదనపు కలెక్టర్‌గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్‌లకు ఈ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది.మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.పూజాపై వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది. ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్
సాక్షి టాస్క్‌పోర్స్: టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూశాం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజారులో ఓ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్ కటింగ్ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్‌కే హుకుం జారీ చేసి కూటమి నేతల విపరీత ధోరణిని మరోసారి బయట పెట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని వినియోగదారులకు అందించేందుకు పౌర సరఫరాల శాఖ కడప రైతు బజార్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ స్టాల్ ఓపెనింగ్‌కు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జేసీ గణేష్‌కుమార్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప ఆర్డీవో, డీఎస్వోలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులంతా ఉదయం 9.30 గంటలకే కడప రైతు బజార్‌కు చేరుకున్నారు. మరో 10 నిమిషాల్లో కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్‌ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఇంతలోనే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు. ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతు బజార్లో స్టాల్‌ను ఓపెనింగ్ చేయవద్దని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే మేడం హైదరాబాదులో ఉన్నారని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో కలెక్టర్ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు. ఆ వెంటనే రైతు బజార్ సిబ్బంది ప్రారంభోత్సవం బ్యానర్లు, రిబ్బన్లు తొలగించారు. శుక్రవారంనాటి ప్రారంభోత్సవానికి మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ స్టాల్ గురించి అధికారులు ముందుగానే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తెలిపి, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే తనకు వీలు కాదని, కలెక్టర్‌తో ఓపెనింగ్ చేయించుకోండని ఆమె చెప్పారని తెలిసింది. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించడంతో ఇదేమి ధోరణి అని అధికారులు, వినియోగదారులు ముక్కున వేలేసుకున్నారు. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు!
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్షా తండ్రి, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) నేత రాజేష్ షాపై పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యారు.ఆయన కుమారుడు మిహిర్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో కారు నడుపుతూ వర్లీ ప్రాంతంలో బైక్‌ను ఢీకొట్టడంతో కావేరీ నఖ్వా అనే మహిళ చనిపోగా ఆమె భర్త గాయపడటం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మిహిర్‌ను ముంబైలోని విరార్ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని తల్లి, ఇద్దరు చెల్లెళ్లను మరో 10 మందితో కలిసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే పోలీసుల విచారణలో.. ప్రమాద సమయంలో తాను బీఎండబ్లయూ కారు నడుపుతున్నట్లు మిహిర్ అంగీకరించాడు. కానీ తాను తాగినట్లు వచ్చిన ఆరోపణలనుఅతడు కొట్టేసినట్లు తెలుస్తోంది.పోలీసుల విచారణలో ప్రమాదం ముందు మిహిర్ తన స్నేహితులతో కలిసి వైస్ గ్లోబల్ తపాస్ బార్లో మద్యం తాగి బిల్ ఏకంగా 18 వేలు చేసినట్లు తేలింది.మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు .తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు.కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. ఇక మిహిర్‌కు మద్యం సరఫరా చేసన బార్ యజమానిని అరెస్ట్ చేయడంతోపాటు బార్‌ను మూసేశారు. మిహిర్ తండ్రిని, స్నేహితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. -
వివాదానికి తెర.. వెనక్కి తగ్గిన దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో వైద్యులు- ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన వైద్యుల లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.సమ్మె చేస్తున్న వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య మంత్రి చౌ క్యో హాంగ్ తెలిపారు. వారు తిరిగి విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎన్ని వేల మంది వైద్యులు విధుల్లోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అత్యవసర చికిత్సలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు చికిత్స అందించే వైద్యుల కొరతను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌ క్యో హాంగ్ పేర్కొన్నారు. కాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలన్న ప్రభుత్వ యోచనకు నిరసనగా ఫిబ్రవరి నుంచి మెడికల్ ట్రైనీలుగా పనిచేస్తున్న 13వేల మంది జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్స్ సమ్మెకు దిగారు. ఇది ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రభుత్వ ప్రణాళికకు మద్దతుగా మేలో సియోల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో సమ్మెకు దిగిన వైద్యులకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆ దరిమిలా ఆసుపత్రుల్లో విధుల నిర్వహణకు తిరిగివచ్చే వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు 2035 నాటికి 10 వేల మంది వైద్యులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికారులు తెలిపారు.అయితే దేశంలో వైద్య విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో, ఇది అంతిమంగా దేశంలోని వైద్య సేవలపై ప్రభావం చూపుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో అత్యధిక వేతనం పొందే వృత్తులలో వైద్య వృత్తి ఒకటి. వైద్యుల సంఖ్య పెరిగితే తమ ఆదాయాలు తగ్గిపోతాయని పలువురు వైద్యులు ఆందోళన చెందున్నారు. -
స్పీకర్ పదవిపై వీడని సస్పెన్స్
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎవరుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో బీజేపీ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ నెల 26న జరిగే స్పీకర్ ఎన్నికకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 293 మంది ఎంపీలతో ఎన్డీఏ సంకీర్ణానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్డీఏ తమ స్పీకర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అయితే విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీపడే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోందని విశ్వసనీవర్గాలు తెలిపాయి. స్పీకర్‌పై ఎలాంటి తుది నిర్ణయాన్ని తమకు తెలుపలేదని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీజేపీ నాయకత్వం తనతో సంప్రదింపులు జరిపిందని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడొకరు తెలిపారు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. బీజేపీ తమ అగ్రనేతలందరికీ మునుపటి శాఖలే కేటాయించి.. కొనసాగింపును భూమికగా ఎంచుకున్నందున 17వ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కొనసాగించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎన్డీఏ వైఖరిని బట్టి స్పీకర్ పోస్టుకు తమ అభ్యరి్థని పోటీకి నిలుపడంపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం సంప్రదాయంగా వస్తోందని, బీజేపీకి అందుకు ముందుకు రాకపోతే పోటీచేయక తప్పదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. కొత్త స్పీకర్‌పై ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి విపక్షాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, అలా జరపని పక్షంలో తాము స్పీకర్ పదవికి పోటీ పెడతామని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ సోమవారం విలేకరులతో అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది మాకు తెలిపిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమికి చెందిన నాయకుడొకరు అన్నారు. బలహీనవర్గాలకు చెందిన అభ్యరి్థని పోటీపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలముంది. -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్ అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లేష్, నరేష్ అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు.ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచి్చన ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
అయోధ్యకు విమానాలు బంద్
-
‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఆమెప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. హేమ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసే విషయమై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ΄్యానెల్ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారట. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ‘మా’ కార్యదర్శి రఘుబాబు ఓ లేఖ విడుదల చేశారు.మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల నివేదికలో నిర్ధారణ కావడంతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు ‘మా’ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు, విచారణ తేలేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందన్నట్లు హేమకు ‘మా’ లేఖ పంపినట్లు తెలిసింది. -
ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు పై అనర్హత వేటు
సాక్షి, అమరావతి: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు.లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న రఘురాజు తెరచాటు, వెన్నుపోటు రాజకీయా గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. -
చంద్రగిరి DSPపై వేటు
-
చంద్రగిరి DSPపై వేటు
-
చంద్రగిరి DSPపై వేటు
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు సస్పెండ్
బెంగళూరు: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా పోలీసు శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్‌కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ ఉన్నారు. అయితే, వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ నిరక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు హేమా, ఆషీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు బహిర్గతమైంది. వీరి బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. పార్టీలో 150 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. -
సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు
-
ఎంఆర్‌సీరెడ్డి సస్పెండ్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి ఎంఆర్సీ రెడ్డి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ వేటు నిర్ణయం ప్రకటించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్సీ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్‌రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్‌రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌ను జేడీఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు ప్రజ్వల్ సస్పెన్షన్‌పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్‌ను సస్పెండ్‌చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్చేస్తున్నాం’ అని సస్పెన్షన్ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్‌ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్‌గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
Hyderabad: మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
సైదాబాద్: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్‌సదన్ డివిజన్లోని సుబ్రమణ్యనగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సిద్ధిపేట: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
మృత ఉద్యోగికి ఎన్నికల డ్యూటీ.. అధికారి సస్పెండ్!
లోక్‌సభ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో వింతవైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ కమిషనర్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రచయితా అవస్థి.. మరణించిన ఒక మహిళా ఉద్యోగిని ఎన్నికల విధులకు కేటాయించారు. అలాగే ఆమె చేయాల్సిన పనులను కూడా సంబంధిత రిపోర్టులో పేర్కొన్నారు. తరువాత ఎన్నికల ఉద్యోగుల డేటా బేస్‌ను ఎన్నికల కార్యాలయానికి పంపారు. అయితే దీనిలో చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా ఉందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులను విచారించారు. చివరికి ఇది అసిస్టెంట్ కమిషనర్ రచయితా అవస్థి తప్పిదమని తేలింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, అసిస్టెంట్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి దీపక్ సక్సేనా హెచ్చరించారు. -
Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా ఎన్.వాణి నియామకాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాణిని డీఎంఈగా నియమించడాన్ని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. సర్వీసులో తనకంటే జూనియర్‌ను ఇన్ఛార్జిగా నియమించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇన్‌ఛార్జి ప్రాతిపదికన కాకుండా అదనపు బాధ్యతలు లేదా శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టు భర్తీ చేయాలని తెలిపింది. నిబంధనల మేరకు కొత్త డీఎంఈను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చదవండి: విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలో పాలిసెట్ వాయిదా -
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హసరంగ ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను బలవంతంగా లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్‌లో హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్ సందర్భంగా కూడా గత సిరీస్‌లో (ఆఫ్ఘనిస్తాన్) చేసిన తప్పిదాల కారణంగా అతను సస్పెండయ్యాడు. 26 ఏళ్ల హసరంగ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అతను కేవలం నాలుగు టెస్ట్‌ల్లోనే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో హసరంగకు మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ ఫార్మాట్లో అతను కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు హసరంగా తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. -
ఢిల్లీ ఎస్సై అత్యుత్సాహం
న్యూఢిల్లీ: శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల వేళ ఉత్తర ఢిల్లీలోని కిక్కిరిసిన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లింలపై ఒక పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించాడు. రోడ్డు దిగ్బంధం చేయొద్దని తిడుతూ వీరావేశంతో కొట్టడం మొదలెట్టాడు. తన్నుతూ అక్కడి వారిని పక్కకు నెట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మసీదు జనంతో నిండిపోవడంతో రోడ్డుపై నమాజ్ చేయాల్సి వచి్చందని కొందరు ఆ సబ్ఇన్స్పెక్టర్ మనోజ్‌కుమార్ తోమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నమాజ్ చేయొద్దని ఒక పోలీసు నెమ్మదిగా వారిస్తుండగా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సబ్ఇన్స్పెక్టర్ కొట్టడాన్ని ముస్లింలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సైను సస్పెండ్చేయాలటూ స్థానిక ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ నార్త్ డెప్యూటీ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాలిచ్చారు. -
ప్రణీత్ రావు చేసిన నిర్వాకమిది!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో విచారణాంతరం ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు.. సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబీ Special Intelligence Bureau (SIB)లోని ఎస్వోటీ లాగర్ రూమ్‌లో ప్రణీత్‌రావు విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు రాగానే లాగర్ రూమ్ ధ్వంసానికి ప్రణీత్ రావు వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. ఎస్ఐబీలోని ఎస్వోటీ ఆపరేషన్‌కు హెడ్‌గా ఉన్న ప్రణీత్ రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాల వ్యవహారాలతో పాటు మావోయిస్టులు.. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణీత్ రావు పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్ ల తో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. ఆ సమయంలో ఎస్వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారాయన. అంతేకాదు.. లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపివేసి మరి ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ డాటా రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్‌లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారాయన. అయితే.. ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఆయన బంధువుగా.. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
UK:మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ సస్పెండ్
లండన్: బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ.. తన సొంతపార్టీ ఎంపీ, మాజీ డిప్యూటీ చైర్మన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. లండన్ మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ లీ అండర్సన్‌ను ప్రధానమంత్రి రిషి సునాక్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం కన్జర్వేటివ్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇస్లామిస్టుల ప్రభావం ఉందని, వారి నియంత్రణలో ఆయన ఉన్నారని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎంపీ లీ అండర్సన్ అన్నారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాన మంత్రి రిషి సునాక్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితమైనవి అని వెంటనే క్షమాపణలు చేప్పాలని పెద్దఎత్తన డిమాండ్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి లీ అండర్సన్ నిరాకరించారు. ‘లండన్ మేయర్‌పై లీ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పడానికి నిరాకరించారు. దీంతో పార్టీ చీఫ్ విప్.. ఆయన్ను ఎంపీ పదవిపై సప్పెన్షన్ విధించారు’ అని అధికార ప్రతినిధి టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ దేశం.. గాజాపై దాడులు చేయటం ప్రారంభించినప్పటి నుంచి బ్రిటన్‌లో ఇస్లాంపై ద్వేషం, యూదులపై వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకోవటం పెరిగినట్లు తెలుస్తోంది. -
ఏపీ ఎమ్మెల్యేల ‘అనర్హత’పై ఉత్కంఠ
-
ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఆపరేషన్లు నిర్వహించాల్సిన థియేటర్లో ప్రీవెడ్డింగ్ షూట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఉన్నతాధికారులు ఓ వైద్యుడిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే భరంసాగర్ ఏరియా జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఒక వైద్యుడు ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాడు. ఇది వైరల్‌గా మారి వివాదాస్పదమైంది. ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించిన వైద్యుడిని సర్వీసు నుంచి తొలగించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత వైద్యులు, సిబ్బందికి సూచించారు. Prewedding shoot reaches Operation Theatre in #Karnataka. Doctor under NHM sacked after video of his pre-wedding shoot in OT of a government hospital goes viral. https://t.co/qNykToeJlw — South First (@TheSouthfirst) February 10, 2024 -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్ చేశారు. -
ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ కార్యకర్తపై అమనుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ కొన్నిరోజులుగా వ్యవసాయ వర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టుకు భూకేటాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 23న వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాజరయ్యారు. ఆందోళన విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని, నిరసన తెలుపుతున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకుని ముందుకు పరుగెత్తారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఝాన్సీ జుట్టుపట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కిందపడిపోయింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతోపాటు 15మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. -
పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ సస్పెండ్
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఏడాది గడవకుండానే.. రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్ఎహెచ్ఓలు పహాడీషరీఫ్ పీఎస్‌లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు. ►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్‌రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ► అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కొనసాగారు. ► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్‌పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్హెచ్ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
ప్రధాని మోడీపై పిచ్చి కామెంట్స్..ముగ్గురు మంత్రులు సస్పెండ్
-
Cyberabad: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు కమిషనర్ అవినాష్ మహంతి. తాజాగా కేపీహెచ్‌బీ పరిధిలో సీఐ వెంకట్, ఆర్జీఐ సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీపీ వీరిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పరిధిలో ఓ కేసులో ఎంక్వయిరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టడమే కాకుండా థర్ద్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు బాధితుడి కుటుంబ సభ్యులు. తీవ్రమైన గాయాలతో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. అనంతరం గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో, వెంటనే సీపీ విచారణకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వీరిని సస్పెండ్ చేశారు. ఒకే కేసులో సరిగా విచారణ చేయనందుకే శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. -
దుబాయ్ పారిపోయిన సోహిల్..పంజాగుట్ట సీఐ సస్పెండ్
-
ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తులన బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్ మార్చేసిన విషయం తెలిసిందే. వివరాల ప్రకారం.. ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్‌ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గరావును సస్పెండ్ చేశారు. Panjagutta Inspector B. Durga Rao suspended for negligence in former MLA Shakeel's son Sohail case. #Telangana pic.twitter.com/qvq11aSRNC — Mubashir.Khurram (@infomubashir) December 26, 2023 ఘటన జరిగిన రోజున (డిసెంబర్ 24న) నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది.. సోహైల్‌ను తప్పించి వేరే వ్యక్తి పేరును చేర్చారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. అధికారులు వారిపై విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావటంతో.. దుర్గారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం వ్యవహారంపై రాజకీయపరంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావటంతో.. సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది. ఇక, పరారీలో ఉన్న సొహైల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషనన్ పరిధిలోని ప్రజాభవనన్ ఎదురుగా ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’ చుట్టూ అల్లిన కట్టు కథల్ని పోలీసు ఉన్నతాధికారులు ఛేదిస్తున్నారు. ప్రమాద సమయంలో కారును బోన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్ అమీర్ నడిపినట్లు గుర్తించారు. దీనిపై తొలుత పంజగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో షకీల్ కుమారుడి పేరు లేకపోవడం, అంతకు ముందే అతను తప్పించుకున్నట్లు ప్రచారం జరగడంతో మంగళవారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో సాహిల్ పాత్రను నిర్థారించారు. పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలోనే దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది. దీంతో అతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసినట్లు డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ తెలిపారు. పోలీసుల పాత్ర రూఢీ కావడంతో పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం చేసి అక్కడే మంతనాలు... సాహిల్, అతడి స్నేహితుడితో పాటు ఇద్దరు యువతులు ఆదివారం తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో (టీఎస్ 13 ఈటీ 0777) బేగంపేట వైపు నుంచి పంజగుట్ట వైపు వస్తున్నారు. ఆ సమయంలో కారు సాహిల్ నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకు వచ్చిన కారు ప్రజాభవన్న్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీ కొట్టింది. దీంతో అవి పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కారు సైతం వాటిలో ఇరుక్కుపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాహిల్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఈ నలుగురితో పాటు అక్కడికి చేరుకున్న మరో ఐదుగురూ ప్రమాద స్థలికి సమీపంలో ఉన్నని ఓ జ్యువెలరీ దుకాణం పక్క గల్లీలో చాలాసేపు మంతనాలు జరిపారు. ఈ లోగా విషయం తెలుసుకున్న పంజగుట్ట ఇనన్‌స్పెక్టర్ దుర్గారావు ఆ ప్రాంతానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తుండగా... పక్కనే గల్లీలో మంతనాలు జరుపుతున్న వారు తారసపడ్డారు. వారిని ప్రశ్నించగా సాహిల్ అది తన వాహనామేనని, తానే నడుపుతుండగా ప్రమాదం జరిగిందని అంగీకరించారు. దీంతో కారులో ప్రయాణించిన మిగిలిన ముగ్గురి వివరాలు నమోదు చేసుకున్న ఆయన సాహిల్‌ను పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసులో ప్రస్తావన లేకపోవడంతో... అనంతరం సాహిల్‌ను ఓ హోంగార్డుకు అప్పగించి పక్కనే ఉన్న ట్రాఫిక్ ఠాణాలోకి తీసుకువెళ్లి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించాలని సూచించారు. అప్పటికే సాహిల్ తన వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న అబ్దుల్ ఆరిఫ్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మరో డ్రైవర్ సోహైల్‌ను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించాడు. సాహిల్ వెళ్లేటప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్దుల్ ఆరిఫ్, సోహైల్‌లు సాహిల్‌ను తప్పించారు. సాహిల్, సోహైల్ అక్కడి నుంచి మరో కారులో పారిపోగా... వెంటనే అప్రమత్తమైన హోంగార్డు ఆరిఫ్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించాడు. పంజగుట్ట ట్రాఫిక్ ఠాణాలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బి.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో సాహిల్, సోహైల్‌ల పేర్లు, పరారైన ప్రస్తావన సహా ఏ అంశాన్నీ పేర్కొనకుండా ఆరిఫ్ మాత్రమే కారకుడైనట్లు ఆరోపణలు చేశారు. పోలీసులు కారును స్వాధీనం చేసుని పంజగుట్ట ఠాణాకు తరలించారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే అధికారులు మాజీ ఎమ్మెల్యే కుమారుడైన సాహిల్‌ను తప్పించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. డీసీపీ స్వయంగా విచారణ చేయడంతో... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం రంగంలోకి దిగిన ఆయన పంజగుట్ట ఠాణాకు వచ్చి విచారణ చేపట్టారు. ఘటనాస్థలి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సైతం పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే సాహిల్ పాత్ర వెలుగులోకి వచ్చింది. అతడి సూచన మేరకే వారి ఇంట్లో పని చేసే ఆరిఫ్ ఠాణా వద్దకు వచ్చాడని, సోహైల్‌తో కలిసి అతడిని తప్పించి, తానే ప్రమాదం చేసినట్లు పోలీసులకు చెప్పాడని గుర్తించారు. ఆరిఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అధికారులు... సాహిల్‌పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబం వద్దకు పారిపోయినట్లు గుర్తించి ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ సెలవులో ఉండటంతో ఎస్సార్‌నగర్ ఏసీపీ వైవీ రావ్‌కు ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీసీపీ మంగళవారం పంజగుట్ట ఠాణాకు చెందిన అధికారులను తమ కార్యాలయానికి పిలిపించి సమీక్ష నిర్వహించడంతో పాటు తీవ్రంగా మందలించారు. ఓ దశలో పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు లో బీపీతో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చివరకు కేసు నమోదు తదితర అంశాల్లో ఆయన పాత్ర తేలడంతో కొత్వాల్‌కు నివేదించారు. ఆయన ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సాహిల్ కేసులో 17 సెక్షన్ల కింద ఆరోపణలు... కారు ప్రమాద ఘటనలో సూత్రధారిగా ఉన్న సాహిల్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చిన పంజగుట్ట పోలీసులు అతడి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ప్రాథమికంగా ఆదివారం తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులు ఆరిఫ్పై (ఐపీసీ), మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్), ప్రజా ఆస్తుల పరిరక్షణ చట్టంల్లోని (పీడీపీపీ) మూడు సెక్షన్ల (274, 189, 3) కేసు నమోదు చేశారు. అయితే ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో కేవలం పీడీపీపీలోని సెక్షన్ మినహాయిస్తే మిగిలిన రెండూ సరైనవి ప్రయోగించలేదని గుర్తించారు. దీంతో ఆరిఫ్ రిమాండ్ రిపోర్టులో సాహిల్ పేరుతో పాటు ఈ ఐపీసీ, ఎంవీ యాక్ట్ల్లోని మరో 14 సెక్షన్లను జోడించారు. తొలుత నమోదు చేసిన ఐపీసీలోని 274, ఎంవీ యాక్ట్‌లోని 189 సెక్షన్లు తొలగించారు. వీటికి బదులుగా వీరిద్దరిపై పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్ 3తో పాటు ఐపీసీలోని 308, 419, 279, 201, 203, 212, 213, 214, 182, 109, 34తో పాటు ఎంవీ యాక్ట్‌లోని 184, 185, 187, 188, 205లను జోడించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సాహిల్‌తో పాటు అతడి తండ్రి షకీల్ పేర్లనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై వారం రోజులపాటు సస్పెండ్ చేశారు అధికారులు. ఈ విషయంపై యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ రమేష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని తెలిపారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడారని హాస్టల్లోనూ మరోసారి ఇంట్రడక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సస్పెన్సన్‌కు గురైన వారిలో పీజీ చదువుతున్న 28, కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. వారం రోజులపాటు సస్పెన్డ్ చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు. అయితే అర్ధరాత్రి హాస్టల్ రూమ్‌కు పిలిచి సీనియర్లు వేధించారని జూనియర్లు చెబుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను ర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. చదవండి: HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత -
సస్పెన్షన్ కోసం వాళ్లే అభ్యర్థించారు: జోషి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వం అనుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సభకు అంతరాయం కలిగించిన కొందరు ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తమను కోరారని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీలను సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ప్లకార్డులతో రావొద్దని కోరాం. చర్యలుంటాయని ముందుగానే వారికి చెప్పాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. క్రమశిక్షణారాహిత్యం కింద తమను కూడా సస్పెండ్ చేయాలంటూ మిగతా వారు కూడా కోరారు. కాంగ్రెస్ స్థాయి అంతగా దిగజారింది. లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ సభ్యులు 46 మంది మొత్తం 146 మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు’అని మంత్రి చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు క్రిమినల్ బిల్లుల్లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందని ఆయన చెప్పారు. -
Winter Parliament Session 2023: లోక్‌సభ నిరవధికంగా వాయిదా
లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే దిగువ సభ వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సెషన్‌ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ముగించాల్సి ఉంది. పార్లమెంట్ నూతన భవనంలో పూర్తిస్థాయిలో జరిగిన తొలి సెషన్ ఇదే. ఈసారి సభలో 74 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మొత్తం 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగాయి. లోక్‌సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడం, రంగుల గొట్టాలు ప్రయోగించడం వంటివి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో రికార్డు స్థాయిలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. ప్రశ్నలకు లంచాలు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. -
పార్లమెంట్లో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు..
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు డీకే సురేష్, దీపక్ బజి, నకుల్‌నాథ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభలో నిరసనకు దిగొద్దంటూ ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉభయసభల్లో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీల సంఖ్య146కు చేరింది. మరోవైపు తమ ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు నిరసనలను తీవ్రం చేస్తునే ఉన్నాయి. కాగా డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు పట్టుబట్టిన చేసిన విషయం తెలిసిందే. సభ్యుల నినాదాలతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిరసనలతో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుండటంతో డిసెంబర్ 14 నుంచి ఇప్పటి వరకు 146 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. చదవండి: జైల్లో కూడా కేజ్రీవాల్ విపాసన చేయవచ్చు: బీజేపీ సెటైర్లు -
లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు
ఢిల్లీ: పార్లమెంట్లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.. -
పార్లమెంట్లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈరోజు లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన లోక్‌సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU — ANI (@ANI) December 18, 2023 సస్పెన్షన్‌పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG — ANI (@ANI) December 18, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్‌ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. పార్లమెంట్లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్‌లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. అయితే..పార్లమెంట్లో ఆగంతుకులు చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో అలజడికి సూత్రదారి? వైరల్ చేయాలని వీడియోలను షేర్ చేసి.. -
ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీని శనివారం బహుజన్ సమాజ్ పార్టి(బీఎస్పీ) సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ మీరు ఎలాంటి ప్రకటన చేయరాదని, ఎటువంటి చర్య తీసుకోవద్దని చాలాసార్లు మౌఖికంగా చెప్పాం. అయినప్పటికీ మీరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం మానలేదు. అందుకే, పార్టీ ప్రయోజనాల రీత్యా మిమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా డానిష్ అలీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
సీఐ అంజిత్ రావు సస్పెండ్
-
పోస్టల్ బ్యాలెట్ వివాదం.. నోడల్ అధికారి సస్పెన్షన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి నోడల్ అధికారిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. బాలాఘాట్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ముందే పోస్టల్ బ్యాలెట్లను తెరిచినందుకు సంబంధించి పోస్టల్ నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజన్ మంగళవారం తెలిపారు. సస్పెండ్ అయిన అధికారిని తహసీల్దార్ హిమ్మత్ సింగ్‌గా గుర్తించారు. ‘బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్రమబద్ధీకరించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ఇది జరిగింది. సమయానికి ముందే బ్యాలెట్ బాక్స్ తెరవడంలో విధానపరమైన లోపం సంభవించింది. దీనికి బాధ్యుడైన పోస్టల్ నోడల్ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది’ అని ఎన్నికల ప్రధాన అధికారి రాజన్ చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను ఓటు వేయడానికి అనుమతించడం లేదన్న రాజకీయ పార్టీల ఆరోపణపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో సుమారు 3.23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సీఈవో రాజన్ తెలిపారు. డిసెంబరు 3న రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
చండీగఢ్: గత ఏడాది జనవరిలో పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతలో లోపాలకుగాను మొత్తం ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వీరిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి గతంలోనే సస్పెండ్ అవగా తాజాగా ఆరుగురిని పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని భద్రతలో లోపాలపై సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ మొత్తం ఏడుగురు పోలీసు అధికారులను బాధ్యులుగా తేల్చింది. వీరందరినీ సీఎం భగవంత్‌మాన్ సింగ్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ నెల 22న సస్పెండ్ చేసింది. వీరిలో అప్పటి ఫిరోజ్‌పూర్ ఎస్పీ గుర్బీందర్ సింగ్ గతంలోనే సస్పెండ్ అయ్యారు. తాజాగా ఆరుగురు అధికారులు వేటుకు గురయ్యారు. గతేడాది జనవరి 5న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రచారం కోసం పంజాబ్ వెళ్లారు. ఎన్నికల ర్యాలీకి వెళుతున్న ఉన్న ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్‌పై 20 నిమిషాల పాటు ఎటూ కదలకుండా నిలిచిపోయింది. రైతు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులు ప్రధాని కాన్వాయ్కి ట్రక్కులను అడ్డంగా పెట్టారు. ఈ ఘటనపై అప్పట్లో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి తన టూర్ షెడ్యూల్‌ను చివరి నిమిషంలో మార్చుకోవడం వల్లే సమస్య వచ్చిందని అప్పటి సీఎం చన్నీ తెలిపారు. ఇదీచదవండి..సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి -
TS: టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టూరిజం ఎండి మనోహర్‌ను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట తిరుమలకు వెళ్లిన మనోహర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు తీసుకుంది. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ అధికారులు ప్రొటోకాల్ పాటించనవసరం లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం ఈసీఐకి సీఈవో వికాస్ రాజు నివేదిక పంపారు. ఈ రిపోర్ట్ ఆధారంగా మనోహర్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. -
రాజస్తాన్‌లో అమానుషం
జైపూర్: రాజస్తాన్‌లోని దౌసాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్స్పెక్టర్పై జనం దాడి చేసి, కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్‌పై బీజేపీ దుమ్మెత్తి పోసింది. లాల్సోత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడిన సబ్ ఇన్స్పెకర్ భూపేంద్ర సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకువచ్చి, దారుణానికి పాల్పడినట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఎస్ఐ భూపేంద్ర సింగ్‌ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు, కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్‌పై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఇది కూడా కాంగ్రెస్ గ్యారంటీయే: బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాలికలను కాపాడాలి (బేటీ బచావో) అని నినదిస్తుండగా రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ సర్కారు మాత్రం రేపిస్టులను కాపాడాలి(రేపిస్టు బచావో) అని అంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఘటన రాజస్తాన్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే అవమానకరమని విమర్శించారు. పోలీసులు, ఇతర అధికారులు మహిళలు, బాలికలపై పాల్పడిన అఘాయిత్యాలకు సంబంధించిన అనేక ఘటనలను పూనావాలా ఉదహరించారు. ఎన్నికల వేళ కూడా రేపిస్టులు ఎంతో ధీమాతో ఉన్నట్లు దీనితో అర్థమవుతోందని ఆరోపించారు. తాజా ఘటన కూడా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీయేనని వ్యాఖ్యానించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. దారుణాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఉమేశ్ మిశ్రాను ఆయన ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం చేతకానితనంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..
దుబాయ్: శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది. భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు. అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్‌కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం. -
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతకు బిగ్ షాక్
జైపూర్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సందర్బంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రచారంలో హద్దులు మీరడంతో పార్టీలు వారిపై చర్యలకు దిగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందీప్ దయమాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సందీప్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. అయితే, రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. Sandeep Dayma, BJP leader who called for destroying Masjids& Gurdwaras, has been expelled Reflects 'tushtikaran' of Sikhs, but not of Muslims BJP will become a national party only when it stops 'tushtikaran' of Hindus, Buddhists, Jains and Sikhs and treats everyone equally pic.twitter.com/WnGgT3Fezk — Ashok Singh (@AshokSGarcha) November 5, 2023 కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సందీప్ దయమా ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, గురుద్వారాలను ఉద్దేశించి సందీప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకుంది. మరోవైపు.. సందీప్ వ్యాఖ్యలపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్, ఇతర పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సందీప్ దయమాను పార్టీ నుంచి బహిష్కరిస్తూ రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ నిర్ణయం తీసుకున్నారు. -
అరరే... ఎంత పనైపాయే!
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ అయింది. ఈ రీల్లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్ గన్ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్సింగ్ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు.