నెల పాటు ర్యాపిడో సేవలు బంద్ | RTO Suspends Rapido Operations in Ahmedabad | Sakshi
Sakshi News home page

నెల పాటు ర్యాపిడో సేవలు బంద్

Published Thu, Jan 9 2025 3:00 PM | Last Updated on Thu, Jan 9 2025 4:33 PM

RTO Suspends Rapido Operations in Ahmedabad

అహ్మదాబాద్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ర్యాపిడో (Rapido) సేవలను 30 రోజుల పాటు నిలిపివేసింది. రిక్షా అసోసియేషన్ల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ర్యాపిడో కంపెనీకి RTO పలుసార్లు నోటీసులు జారీ చేస్తూ.. వస్తున్న ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కోరింది. కానీ సంస్థ దీనికి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం.. వాణిజ్య అవసరాల కోసం ప్రయాణీకులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. దాని కార్యకలాపాలలో ఉపయోగించే వాహనాలకు తప్పనిసరి బీమా కూడా అవసరం. ఈ రెండు నియమాలను ర్యాపిడో ఉల్లంఘించినట్లు కనుగొనబడింది.

ర్యాపిడో బైక్‌ సర్వీస్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడంతో నిబంధనల ఉల్లంఘించినట్లు ఆటో యూనియన్లు ఆర్‌టీఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో సంస్థ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అహ్మదాబాద్‌ ఆర్టీవో అధికారి 'జేజే పటేల్' (JJ Patel) మాట్లాడుతూ.. ఆర్టీవో కేవలం ర్యాపిడో త్రీ-వీలర్ ఆటో రిక్షాలకు మాత్రమే అగ్రిగేటర్ లైసెన్స్‌ను జారీ చేసింది. కానీ వారు తమ ఆన్‌లైన్ యాప్ ద్వారా నాన్-ట్రాన్స్‌పోర్ట్ టూ-వీలర్ వాహనాలను ఉపయోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు. అంతే కాకుండా డాక్యుమెంట్స్ గడువు ముగిసిన తర్వాత కూడా వారు వాహనాలను నడపడం కొనసాగించారు. దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడింది. కాబట్టి, మేము 30 రోజుల పాటు రాపిడో సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిబంధలనలు ఉల్లంగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.

ర్యాపిడో సేవలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా కొన్ని నియమాలను సంస్థ ఉల్లంఘించిందనే కారణంగా ఢిల్లీ హైకోర్టు ర్యాపిడో సేవలను కొన్ని రోజులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్‌ ఆర్టీవో ర్యాపిడో సేవలను 30 రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

చాలామంది ర్యాపిడో సేవలను ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పకుండా, నియమాలను పాటించాలి. అప్పుడే ప్రజలకు సురక్షితమైన సేవలను అందించగలుగుతారు. నియమాలను ఉల్లంగిస్తే.. ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. కాబట్టి ర్యాపిడో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

ర్యాపిడో సర్వీస్ ఉపయోగాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో ర్యాపిడో సేవలను మంచి ప్రజాదరణ పొందాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. చాలా మంది ర్యాపిడో బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. రోజువారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి వాటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్

చాలామందికి ఉపాధి
ర్యాపిడో సర్వీస్ కారణంగా దేశంలో చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కొక్కరు నెలకు వేలల్లో సంపాదించుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి ఈ బైక్ సర్వీస్ ద్వారానే నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు ఈ మధ్యకాలంలోనే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే బైక్ నడుపుకుంటూనే చాలామంది మంచి ఆదాయం సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement