జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. అంతే కాకుండా అవి టారిఫ్‌లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలకు సూపర్ ప్లాన్లను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 14 నెలల వ్యాలిడిటీతో ఓ ప్లాన్ అందించడం ప్రారంభించింది.
14 నెలల ప్లాన్
ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవలను ప్రారంభించనే లేదు. అయితే ప్రస్తుతం చాలామంది బీఎస్ఎన్ఎల్ సేవలకు మారిపోవడానికి ప్రధాన కారణం తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం.
ఇప్పుడు పరిచయం చేసిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ 14 నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ కేవలం 13 నెలలు లేదా 395 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేది. ఇప్పుడు దీనిని ఒక నెల పెంచి 14 నెలల వ్యాలిడిటీకి మార్చారు. అంటే ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 425 రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట.
ప్రయోజనాలు
రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా లోకల్, రోమింగ్ కాల్స్‌తో సహా అపరిమిత కాల్‌లను ఆస్వాదించవచ్చు. 425రోజులు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం 850 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ డేటా పూర్తయిపోయినప్పటికీ.. 4kbps వేగంతో అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితం.
జియో, ఎయిర్‌టెల్ (Airtel) వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తరువాత.. చాలామంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారిపోయారు. ఆ తరువాత రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కొంత తగ్గించడంతో.. కొందరు మళ్ళీ జియో, ఎయిర్‌టెల్ వైపు తిరిగారు. ప్రస్తుతం జియో కూడా వార్షిక ప్లాన్స్ రూ. 3,599 ధరతో అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.
ఇదీ చదవండి: రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!
జియో (Jio) వార్షిక ప్లాన్ (రూ.3599)తో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ (రూ. 2399) చాలా తక్కువ. కాబట్టి ధరలను దృష్టిలో ఉంచుకుని యూజర్లు తమకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 14 నెలల ప్లాన్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment