new plan
-
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్
రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతున్నకొద్దీ కస్టమర్లు టెన్షన్ పడుతూ ఉంటారు. అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు రీచార్జ్ చేసుకుందామంటే ధర ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్లను పరిచయం చేస్తోంది.ప్రైవేట్ టెలికాం సంస్థలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్ల కోసం అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. లక్షల మంది వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్లను చేర్చింది. తాజాగా 105 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.105 రోజుల వ్యాలిడిటీ ప్లాన్బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు అధిక వ్యాలిడిటీని అందిస్తూ రూ. 666 ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 105 రోజుల పాటు ఏదైనా నెట్వర్క్కి అపరిమిత కాలింగ్ ఉంటుంది. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా చెల్లుబాటు వ్యవధికి మొత్తం 210 జీబీ డేటాను అందిస్తోంది. అంటే రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటాకు సమానం. ఈ ధరతో ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీల్లో విస్తృతమైన వ్యాలిడిటీ ప్లాన్లు లేవు. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ'
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఇటీవల భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అంబానీ 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో ఓ ప్లాన్ తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం రూ.319 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ రోజు (ఆగష్టు 2) ప్లాన్ యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 1వరకు యాక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ మీరు సెప్టెంబర్ 2న రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ ఫీచర్స్ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. లిమిటెడ్ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు గరిష్టంగా 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందించాలని కోరింది. దీనికి స్పందించిన జియో రూ.296, రూ.259 ప్లాన్లను విడుదల చేసింది. రూ.296 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 30 రోజుల పాటు 25GB డేటా ఉన్నాయి. అదే విధంగా రూ.259 ప్లాన్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. -
సైలెంట్‌గా వచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్! అధిక వ్యాలిడిటీతో..
అధిక వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ తో ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.279 విలువైన ఈ ప్లాన్ ను సైలెంట్‌గా వెబ్సైట్లో చేర్చేసింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.సాధారణంగా చాలా రీచార్జ్ ప్లాన్లు 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ రూ .279 ప్లాన్ 45 రోజుల వాలిడిటీతో వస్తుంది. కాబట్టి, 15 రోజులు చెల్లుబాటు అదనంగా లభిస్తుంది. అధిక వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.ఇక అధిక వ్యాలిడిటీ ఉన్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే రూ .279 ప్లాన్ కూడా చాలా తక్కువ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 2 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ డేటాను పొందాలనుకుంటే, ప్రత్యేక డేటా వోచర్లలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తన చాలా ప్లాన్లతో ఇచ్చినట్లుగా ఇందులో ఉచిత అపరిమిత 5జీ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
జియో కొత్త ప్లాన్.. అదనపు డేటాతోపాటు 14 ఓటీటీలు ఫ్రీ!
Reliance Jio new plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లకు పేరుగాంచిన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన, సరసమైన ప్లాన్లను అందిస్తోంది. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. జియో తాజాగా 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదనపు డేటాతోపాటు 14 ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్ అందిస్తోంది. జియోకి సంబంధించిన ఓటీటీలతోపాటు అనేక ఇతర ఓటీటీల ఉచిత ప్రయోజనాలను అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రూ. 1198 ప్లాన్ వివరాలు రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 84 రోజుల పాటు 168జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఉచిత ఓటీటీలు ఇవే.. ఓటీటీలు చూడడాన్ని ఇష్టపడే వారి కోసం జియో రూ. 1198 ప్లాన్ 14 ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్లు అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, జియో టీవీ యాప్ ద్వారా Hoichoi, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 10 సూత్రాల అమలు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా పూర్తిచేస్తోంది. షెడ్యూల్ వెలువరించకముందే.. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోనూ త్వరలోనే పోల్ ప్రిపేరేషన్‌పై రివ్యూ మీటింగ్ పెట్టనుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సమర్ధ ఎన్నికల నిర్వహణకు పది సూత్రాలను అమలు చేయనుంది. ఈసీ టెన్–కమాండ్‌మెంట్స్‌తో ఉల్లంఘనలకు చెక్‌పెట్టి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు వీలుకలగనుంది. (నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్–సాక్షిటీవీ, న్యూఢిల్లీ అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్) 1.ఓటర్ల తొలగింపు అంశం ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫోకస్పెట్టింది. కేవలం ఫాం–7 రిసీవ్ అయిన తర్వాతే ఓటు తొలగింపు ఉండాలని స్పష్టం చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్ తనిఖీ లేకుండా సుమొటాగా ఓటు తొలగించవద్దని పేర్కొంది. ఓటరు చనిపోతే, డెత్ సర్టిఫికెట్ అందిన తర్వాతే ఆ ఓటును డిలీట్ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది. అలాగే మొత్తం తొలగించిన ఓట్లలో పదిశాతం ఓట్లను ర్యాండమ్‌గా సిస్టం ద్వారా ఎంపిక చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో తొలగించిన ఓట్లు రెండుశాతానికి మించితే వాటిని ఈఆర్ఓ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. ఓటరు చనిపోయిన సందర్భాల్లో మినహా ఇతర కారణాలుంటే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతే ఓటు తొలగింపు ఆదేశాలు ఇవ్వాలి. 2. ఎన్నికల ఖర్చుపై 20శాఖల నిఘా ఎన్నికల సమయంలో పెరిగిపోతున్న ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కో–ఆర్డినేషన్‌లో ఈడీ, ఐటి, రెవెన్యూ ఇంటలిజెన్స్, జిఎస్టీ, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, సిఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, పోస్టల్, ఆర్బిఐ, ఎస్ఎల్బిసి, ఎన్‌సిబి, రైల్వే, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ పనిచేయనున్నాయి. ఈ శాఖలన్నీ ఎవరికి వారు ఒంటరిగా పనిచేయకుండా, సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల, పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు. సరిహద్దుల గుండా వెళ్లే మద్యం, నగదు, ఉచితాలు, డ్రగ్స్ తదితర అంశాలపై మరింత ఫోకస్ ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లపై కన్నేసి ఉంచుతారు. లిక్కర్ కింగ్‌పిన్స్, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు లోనుచేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు. 3. సీ విజిల్‌తో 50 నిమిషాల్లోనే యాక్షన్.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం సీ–విజిల్ యాప్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. ఎవరైనా పౌరుడు ఎన్నికల కోడ్‌ఉల్లంఘనపై సీ–విజిల్ యాప్‌లో ఫోటో, వీడియో, ఇతర సమాచారం అప్లోడ్ చేయాలి. ఆ వెంటనే ఆ సమాచారం డిస్ట్రిక్ కంట్రోలర్‌కు చేరుతుంది. చేరిన అయిదు నిమిషాల్లోనే ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం ఫ్లయింగ్ స్కాడ్‌కు అప్పగిస్తారు. 15 నిమిషాల వ్యవధిలో ఎలక్షన్కోడ్ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేస్తారు. మరొక 30 నిమిషాల్లోనే ఫిర్యాదుదారుకు తాము తీసుకున్న చర్యల సమాచారాన్ని పంపిస్తారు. అంటే ఫిర్యాదు చేసిన 50 నుంచి 100 నిమిషాల్లోనే వాటిపై యాక్షన్ తీసుకునేలా సి–విజిల్ తయారు చేశారు. 4. ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటరు సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేయవచ్చు. ఓటరు లిస్ట్‌లో పేరు తనిఖీ చేసుకోవచ్చు. పోలింగ్ బూత్ వివరాలు, బిఎల్ఓ, ఈఆర్ఓ డిటెయిల్స్, ఎన్నికల ఫలితాలు, ఈవిఎంల సమాచారం, ఓటరు కార్డు డౌన్లోడింగ్ తదితర సేవలన్నీ ఈ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. 5. సువిధ పోర్టల్.. నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు కోసం అభ్యర్థులు సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతుల కోసం ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. 6. సక్షం యాప్.. వికలాంగులు, వలస ఓటర్లు, తప్పుల సవరణల కోసం వికలాంగులు, వలస ఓటర్ల కోసం ఈసీ సక్షం యాప్‌ను తయారుచేసింది. ఓటరు జాబితాలో కరెక్షన్ల కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓటింగ్ సమయంలో వీల్‌చైర్ అవసరమైతే రిక్వెస్ట్ ను ఈ యాప్ ద్వారా పంపాలి. 7. కెవైసీ యాప్ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవడానికి కెవైసి యాప్ ను రూపొందించారు. ఇందులో అభ్యర్థుల నేర చరిత్ర సహా ఇతర వివరాలను ఉంచుతారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్సైట్లో, సోషల్ మీడియాలో పెట్టాలి. 8. యూత్ ఓటింగ్ పెరిగేలా.. యువత ఓటింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులకు ఓటింగ్‌కు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చివరి మైలులో ఉన్న గ్రామాలలో సైతం సజావుగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా చర్యలుండాలి. 9.సరిహద్దులో చెక్పాయింట్లు ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పొలీస్, ఎకైజ్, ట్రాన్స్పోర్ట్, స్టేట్ ఫారెస్ట్ డిపార్టు మెంట్ల ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులలో నిఘా ఉంటుంది. 10. ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో నమోదు, తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారులు తప్పనిసరిగా చెక్చేయాలి. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి. పోలింగ్ పనులకు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించొద్దు. పార్టీ క్యాంపెయిన్ మెటీరియల్ వాహనాల సంఖ్య ఒకటి నుంచి నాలుగుకు పెంపు. ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు. -
ఆ పాపులర్ ‘జియో ప్లాన్’ ఇక లేదు
Reliance Jio New Plan: ఆధునిక కాలంలో ఎక్కువమంది వినియోగించే నెట్‌వర్క్‌లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఒకటని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు సంస్థ ఇప్పటి వరకు అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 119 ప్లాన్ నిలిపివేసి, ఆ స్థానంలో రూ. 149 ప్లాన్ తీసుకువచ్చింది. సాధారణంగా రూ. 119తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాకుండా, ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, 100 మెసేజులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ స్థానంలో కొత్త ప్లాన్ పుట్టుకొచ్చింది. రూ. 119 స్థానంలో వచ్చిన రూ. 149 ప్లాన్ వ్యాలిడిటీ ఇప్పుడు 20 రోజుల వరకు ఉంటుంది. అలాగే రోజుకి 1 జీబీ డేటాతో సహా 100 మెసేజిలు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు జియో టీవీ యాప్, జియో సినిమాల్లో కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఇదిలా ఉండగా.. ఇటీవల జియో తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో మొదటిసారి రెండు ప్లాన్స్ లాంచ్ చేసింది. దీంతో ఒక ప్లాన్ రూ. 1099 (84 రోజుల వ్యాలిడిటీ) కాగా, మరో ప్లాన్ రూ. 1499 (84రోజుల వ్యాలిడిటీ). ఈ రెండింటిలోనూ వినియోగదారుని లభించే డేటా ప్యాక్ వేరువేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మొబైల్స్ ప్లాన్ ధర రూ. 149 కాగా, బేసిక్ ప్లాన్ ధర రూ. 199గా ఉంటుంది. -
వందేళ్ల వరకు ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు. అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు. వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. -
దిమ్మ తిరిగి బొమ్మ కనపడేసరికి చంద్రబాబు కొత్త నాటకం
-
జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?
హైదరాబాద్: బ్రాడ్‌బ్యాండ్ సంస్థ రిలయన్స్ జియో ఫైబర్ కొత్తగా నెలకు రూ. 398 ప్లాన్‌ను ఆవిష్కరించింది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ప్రకారం 750 పైచిలుకు లైవ్ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్ వంటి 14 ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్ పొందవచ్చని పేర్కొంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలను పొందవచ్చని జియో ఫైబర్ వివరించింది. అలాగే మాన్సూన్ ఆఫర్ కింద కస్టమర్లు ఉచిత 4కే సెట్–టాప్ బాక్స్‌తో పాటు ఉచిత గిగా ఫైబర్ రూటర్‌ను కూడా అందుకోవచ్చని తెలిపింది. వీటి మొత్తం విలువ రూ. 10,000 ఉంటుంది. అదనంగా జీరో ఇన్స్టాలేషన్ చార్జీలు, జీరో డిపాజిట్ సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నట్లు జియో ఫైబర్ పేర్కొంది. ఈ ఆఫర్ కోసం 6 నెలల వ్యవధికి ముందస్తు రీచార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
యూజర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ వచ్చేసింది!
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్‌లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్సైట్లో లేదా యాప్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్‌తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్‌ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్‌ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) -
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!
మనదేశంలో ప్రముఖ టెలికాం సర్వీసులైన జియో, ఎయిర్ టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పుట్టుకొస్తున్నాయి. 5జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలతో పోటీ పడటంలో వోడాఫోన్ ఐడియా కొంత వెనుకపడ్డాయి. ఈ కారణంగా ఈ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వోడాఫోన్, ఐడియా కొత్త ప్లాన్లు, ఆఫర్స్ తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువగా జియో సేవలకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించడానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 5జీబీ డేటా ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆఫర్ కింద రూ. 299తో గానీ అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్ పొందవచ్చని వోడాఫోన్ ఐడియా ప్రకటించాయి. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న మూడు రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 199 నుంచి రూ. 299 మధ్య ఉన్న వివిధ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వారికి 2జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ డేటాతో మీరు వీఐ మూవీస్, టీవీ, వీఐ మ్యూజిక్, వీఐ గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ మొదలైనవి వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించి, దీని ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ అందించింది. ఇందులో అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఓటీటీ బెనిఫీట్స్ వంటివి ఇందులో అందుబాటులో ఉండేవి, దీనికి ఆశించినంత ఆదరణ లేకపోవడం వల్ల సంస్థ దీనిని నిలిపివేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!
అమెజాన్ ప్రైమ్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల వల్ల ప్రారంభ ప్లాన్ ధరలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అమెజాన్ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధరలను అధికం చేసింది. ఇందులో నెల, మూడు నెలల ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే రూ. 179 ఉన్న అమెజాన్ నెల వారీ మెంబర్షిప్ ఇప్పుడు రూ. 299 కి చేరింది. అంటే ఈ ధర ఒక్క సారిగా రూ. 120 పెరిగింది. దీని ప్రకారం కొత్త అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఖచ్చితంగా రూ. 299 చెల్లించాల్సిందే. ఇక మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే, రూ. 499 గా ఉన్న మూడు నెలల ప్లాన్ ఇప్పుడు రూ. 599కి చేరింది. ఈ ధరలు కూడా రూ. 140 వరకు పెరిగాయి. ముందుగానే నెల, 3నెలలు ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు, ఆటో రెన్యూవల్ సెట్ చేసుకున్న వారు పాత ధరలకే ఈ ప్లాన్స్ పొందవచ్చు. ఇవి 2024 జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత కొత్త ధరలు వర్తిస్తాయి. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) కొత్తగా అమెజాన్ ప్రైమ్ పొందాలనుకునే వారు కొత్త ధరలకే సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు, సినిమాలు టీవీషోలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ లో షాపింగ్ బెనిఫీట్స్ కూడా లభిస్తాయి. అంతే కాకుండా అమెజాన్ మ్యూజిక్ ఉచితంగానే ఎంజాయ్ చేయవచ్చు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
‘జీవో 111’ ట్రబుల్ వన్.. ఆ 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిన 111 జీవోను రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావస్తున్నా.. నేటికీ అడుగు ముందుకుపడలేదు. ప్రస్తుతం రాజధాని దాహార్తిని తీర్చేందుకు ఈ జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచి్చన 111 జీవోను రద్దు చేస్తూ గతేడాది ఏప్రిల్ 19న జీవో నంబర్ 69ను విడుదల చేసింది. జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని ప్రకటించింది. కానీ నేటికీ ఆయా గ్రామాలు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం జీవసంరక్షణ మండలి(బయో కన్జర్వేషన్ జోన్)లోనే కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఆంక్షలే ఇప్పటికీ అమలులో ఉండడంతో నిర్మాణదారులకు ఇక్కట్లు తప్పడంలేదు. చిత్తశుద్ధిలేని కమిటీ.. కొత్త మాస్టర్ ప్లాన్‌ను సాధ్యమైనంత త్వరగా రూపొందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందుకోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని వేసింది. పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీ.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను కూడా ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని అలాగే ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలను రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, మురుగునీటి నిర్వహణ ప్లాంట్ల (ఎస్టీపీలు) ఏర్పాటు, నిధుల సమీకరణ, లేఅవుట్లు, నిర్మాణాల అనుమతికి సంబంధించిన విధివిధానాలతో పాటు న్యాయపరమైన అంశాలనూ పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు తొలిసారి భేటీ అయిన కమిటీ కేవలం ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించింది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో జీవో 69 అమలుపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణదారులకు ఇక్కట్లు.. జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఆయా భూముల్లో ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు తక్కువ ధరకు పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇవే కాకుండా అనధికారిక లే–అవుట్లూ వేల సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం 111 జీవో ఎత్తివేసినందున నిర్మాణాలపై ఆంక్షల్లేవని భావించి అనుమతుల కోసం స్థానిక పట్టణ, పంచాయతీలను ఆశ్రయిస్తున్న రియల్టర్లు/భవన నిర్మాణదారులకు నిరాశే మిగులుతోంది. పర్మిషన్లు జారీ చేయకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, 111 జీవో ఇంకా మనుగడలోనే ఉందని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో 69 జీవో అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు ఏదైనా నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోసం వెళితే ఆంక్షల నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అదే పలుకుబడి ఉన్న నాయకులు, ఆమ్యామ్యాలు సమర్పించుకునే డెవలపర్లకైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జియో మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం! జియో యూజర్లకు.. స్పెషల్ ఆఫర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో, కస్టమర్లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్‌ను పొందచ్చు. రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్‌లో.. రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్‌లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్‌కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్‌తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్‌లో జత చేసింది రిలయన్స్ జియో. ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపించేందుకు ఉగ్రవాదులకు ముడుపులిచ్చారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(70) ఆరోపించారు. ఇప్పటికే తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో ఈ కొత్త పథకం వేశారని పేర్కొన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు జర్దారీ వద్ద చాలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా కుట్రలో జర్దారీతోపాటు మరో ముగ్గురికి కూడా భాగముందని ఇమ్రాన్ విమర్శించారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక తిరిగి పోరాటం మొదలుపెట్టడం ఖాయమన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఇమ్రాన్ అన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. -
ఎగాన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
ఓట్లేయండి.. పేర్లు మారుస్తాం.. తెలంగాణలో కమలం పార్టీ కొత్త వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పట్టణాల పేర్ల మార్పుపై కమలం పార్టీ దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ ప్రచార వ్యూహంలో ఇది కూడా ఓ భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే టీఎర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణలో మరికొన్ని పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్‌నగర్ పేరును పాలమూరుగా, వికారాబాద్‌ను గంగవరంగా, భైంసాను మైసాగా, కరీంనగర్ పేరును కరినగర్‌గా మారుస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే సంఘ్ పరివార్ క్షేత్రాలు ఈ పట్టణాలను ఇదే పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. మరి ఊరి పేర్ల నినాదంతో ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వచ్చే ఏడాది తేలిపోనుంది. చదవండి: ‘కాంగ్రెస్ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్‌నే’ -
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ సుఖ్ సమృద్ధి
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుఖ్ సమృద్ధి పేరుతో దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రహిత గ్యారంటీ ఇన్‌కం లేదా ఏక మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్ పొందవచ్చు. పాలసీ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని కూడబెట్టుకోవడానికి, సేకరించిన కార్పస్‌ను ఉపసంహరించుకోవడానికి సేవింగ్స్ వాలెట్ వీలు కల్పిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా కస్టమర్లకు అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతోపాటు ఆదాయ కాలంతో సహా పాలసీ మొత్తం వ్యవధిలో లైఫ్ కవర్ కొనసాగుతుంది. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
పని వారి కోసం ‘సిప్’
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ వినూత్నంగా ‘సహ్యోగ్’ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమకు సాయపడే సిబ్బంది పేరిట సిప్ ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రోజువారీ మన జీవితాలను సౌకర్యవంతం చేయడం కోసం డ్రైవర్లు, వంట మనుషులు, గార్డెనర్లు, ఇంట్లో పనులు చేసే వారు ఎంతో సాయపడుతుంటారని.. వారికి సైతం జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పేర్కొంది. ఇతరుల మాదిరే వారికి సైతం రిటైర్మెంట్, పిల్లల విద్య తదితర లక్ష్యాలుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. చదవండి: రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! -
ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్‌లో బోలెడు ప్రయోజనాలను అందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లో.. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH ప్రయోజనాలను ఒక రీచార్జ్‌తో కస్టమర్లకు సొంతం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్‌ను ఎయిర్టెల్ బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఒకే బిల్లులో ఫైబర్, డీటీహెచ్ మొబైల్‌తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ సర్వీసులను కలిపేందుకు ఎయిర్టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్స్టాలేషన్ ఖర్చులతో పాటు జీవితకాలపు ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు. వీటిని రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్లతో అందిస్తోంది. వీటిపై ఓ లుక్కేద్దాం! రూ. 699 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఇది ఎయిర్టెల్ అందించే ఎంట్రీ-లెవల్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు DTH కనెక్షన్లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar), సోనీ లివ్( Sony Liv), Airtel XStream యాప్‌తో పాటు మరో 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్లాన్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందించదు, కాబట్టి దీనిని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 899 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 105 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో రెండు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లను అందిస్తోంది ఎయిర్టెల్. ఈ ఆఫర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీంతో పాటు 12 ఇతర యాప్‌లకు సబ్స్క్రిప్షన్, రూ. 350 విలువైన (డీటీహెచ్) DTH టీవీ ఛానెల్‌లు ఉన్నాయి. రూ. 1098 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 100Mbps స్పీడ్‌తో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. 75 GB ఇంటర్నెట్తో పాట అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. రూ. 1099 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ సబ్స్క్రిప్షన్ ల్యాండ్‌లైన్ ద్వారా అపరిమిత కాలింగ్, ఫైబర్‌పై 200Mbps వరకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మరో 13 యాప్‌లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్‌లకు కూడా కస్టమర్లు యాక్సెస్ పొందుతారు. రూ. 1599 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: అన్లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో డీటీహెచ్ కనెక్షన్ వస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, మరిన్ని OTT ప్రయోజనాలు ఉంటాయి. రూ. 1799 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్‌లో ఫైబర్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో కూడిన ల్యాండ్‌లైన్ వస్తుంది అది కూడా గరిష్టంగా 200Mbps స్పీడ్‌తో ఉపయెగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 190GB డేటా , 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో అపరిమిత కాలింగ్ ఉంది. అదనంగా OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ఇతర సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. రూ. 2299 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ : ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు పొందవచ్చు. అంతేనా ఇంకా రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, (Airtel Xstream) మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
బోలెడు బెనిఫిట్స్‌తో ఎల్ఐసీ కొత్త పాలసీ!
హైదరాబాద్: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన్ వర్ష’ బీమా ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 866) ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని), నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్‌పాలసీ అని ఎల్ఐసీ ప్రకటించింది. జీవిత బీమా రక్షణ, పొదుపులను ఈ ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తోంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఏక మొత్తంలో హామీ మేరకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్ 2023 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. 10, 15 ఏళ్ల కాలాన్ని పాలసీ టర్మ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.1.25 లక్షలు కాగా, గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 ఏళ్ల వయసున్న చిన్నారి వయసు నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్‌లో ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ ప్లాన్‌కు అనుబంధంగా తీసుకునేందుకు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
‘సోలార్’కు రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు మన దేశం పెద్ద పీట వేస్తుండడం తెలిసిందే. మన దేశ సౌర ఇంధన రంగానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఇప్పుడు అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. దీంతో దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది. భారీగా ఆదా..: తాజా ప్రోత్సాహకాలతో ఏటా రూ.1.4లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో అన్నారు. ఎగుమతుల రూపంలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు వస్తాయన్నారు. ఉచిత విద్యుత్ అంశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు సింగ్ స్పందించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి, బడ్జెట్ నుంచి చెల్లించొచ్చన్నారు. కానీ, చాలా రాష్ట్రాల బడ్జెట్లో ఇందుకు నిధుల్లేవంటూ, అవి రుణాలు తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నాయన్నారు. ఈ భారం తదుపరి తరాలపై పడుతుందన్నారు. రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నేషనల్ లాజిస్టిక్స్ విధానానికి ఆమోదం న్యూఢిల్లీ: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది. పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. సెమీకండక్టర్ పీఎల్ఐలో మార్పులు సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్వర్క్ చైన్‌లో చిప్ ఫ్యాబ్‌లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సెమీకండక్టర్ స్కీమ్ మరింత పటిష్టవంతం లక్ష్యంగా తాజా మార్పులు జరిగినట్లు వెల్లడించారు. భారత్‌లో సెమీకండక్టర్స్, డిస్ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. -
ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్
ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా స్మార్ట్ ఇన్‌కం ప్లాన్‌ను ఆవిష్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ సంజయ్ తివారీ తెలిపారు. సాధారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు, ఒకవేళ అప్పటికే రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకున్నా సరిపోకపోవచ్చని, స్థిరంగా మరో ఆదాయం కూడా ఉంటే సహాయకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాన్‌లో ఎన్హాన్స్డ్ ఇన్‌కం, ఎన్హాన్స్డ్ మెచ్యూరిటీ అని రెండు వేరియంట్స్ ఉంటాయని తివారీ తెలిపారు. ప్రీమియం చెల్లింపు వ్యవధితో పోలిస్తే పాలసీదారు ఆదాయం పొందే వ్యవధి రెట్టింపుగా ఉండటం, జీవిత బీమా కవరేజీ తదితర ప్రయోజనాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి తోడ్పడగలవన్నారు. చదవండి: తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు..