
భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి విదేశీ సంస్థలకు షాకిస్తూ విఐపీ సబ్‌స్క్రిప్షన్ పేరుతో ఓ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్తో విఐపి ప్లాన్ను హాట్‌స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్, ఈ ఏడాది మేలో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఇందులో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది. వివో ఐపిఎల్, ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌స్టార్ విఐపి టారిఫ్ కింద వీక్షించవచ్చు. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమేనన్నమాట.
హాట్ స్టార్ విఐపి సబ్‌స్క్రైబర్స్‌కి స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ ప్రసారం చేసే సీరియల్స్‌ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం మరో విశేషం. అలాగే ఇప్పటికే చందాదారులుగా వున్నవారు ఈ ప్లాన్‌తో అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, హాట్‌స్టార్ స్పెషల్స్ లేబుల్స్ కింద లభ్యమయ్యే వీడియోలు మాత్రమే ఈ హాట్‌స్టార్ విఐపి ప్లాన్ ఆఫర్ పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా అమెరికాకు చెందిన అన్ని టీవీ షోలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఈ ఆఫర్‌కి వర్తించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment