Hot Star
-
ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా
ఒకప్పడు తెలుగులో టాప్ హీరోయిన్గా మెప్పించిన ఇలియానా బాలీవుడ్లో కూడా మెప్పించింది. హ్యాపీ ఎండింగ్, రైడ్ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్లో కూడా తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే, సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇలియానా సుమారు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో 'దో ఔర్ దో ప్యార్'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాలో నోరా పాత్రలో చాలా బోల్డ్‌గా ఇలియానా మెప్పించింది. షిర్షా గుహా ఠాకూర్తా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'దో ఔర్ దో ప్యార్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
రేవ్ పార్టీపై మంచు లక్ష్మీ కామెంట్
హారర్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలలో నటించిన 'యక్షిణి' వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఉంది. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అయితే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది.తాను ముంబైకి షిఫ్ట్ కావడంతో అందరూ బాలీవుడ్‌కు వెళ్లానని భావించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. నేను ముంబై మాత్రమే వెళ్లాను. హైదరబాద్ నా ఇల్లుతో సమానం. నేను ఏ భాషలో అయినా నటిస్తాను. హాలీవుడ్లో నటించిన తర్వాత టాలీవుడ్,కోలీవుడ్‌లో చేశాను. అందులో తప్పేముంది. నా కూతురుతో పాటు నా భవిష్యత్ కోసమే ముంబై వెళ్లాను. అని మంచు లక్ష్మీ చెప్పింది.బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని మంచు లక్ష్మీ తెలిపింది. ఆ పార్టీకి వెళ్లిన వాళ్లు ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పింది. పార్టీకి వెళ్లిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సమస్య పార్టీకి వెళ్లిన వ్యక్తులది మాత్రమేనని ఆమె తెలిపింది. దానిలో అందరికీ ఏం సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించింది. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్‌స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్‌కు దక్కుతాయి. ఈ డీల్ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్‌స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష పోటీకి చెక్! జియోకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్‌స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్‌స్టార్‌నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్‌స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రెండింటిలో టెన్షన్.. ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కస్టమర్లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్‌తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట! ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..! -
‘ఆసియా’ పోరుకు రంగం సిద్దం
ముల్తాన్: ప్రపంచ కప్ పోరుకు ముందు మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సమరంలో ఆరు జట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు వరల్డ్ కప్‌కు ముందు ఇది ట్రయల్‌గా ఉపయోగపడనుండగా... వరల్డ్ కప్ బరిలో లేని నేపాల్ ఆరో టీమ్‌గా తన ఉనికిని ప్రదర్శించే ప్రయత్నం చేయ నుంది. అన్నీ జట్లూ సహజంగానే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా... ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కనీసం రెండు సార్లు ఇరు జట్లు తలపడే అవకాశం ఉండగా, ఫైనల్ చేరితే మరోసారి దాయాదుల మధ్య పోరును చూడవచ్చు. నేడు సొంతగడ్డపై జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు రోహిత్ కుమార్ సారథ్యంలోని నేపాల్‌తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్–4 దశలో మిగిలిన మూడు టీమ్‌లను ఎదుర్కొన్న తర్వాత టాప్–2 టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి. ఫేవరెట్‌గా రోహిత్ బృందం... ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్ జరగ్గా అప్పుడు రాబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కు సరిగ్గా నెల రోజుల ముందు వన్డే ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తుండగా... వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతుంది. భారత జట్టు ఇటీవల ప్రదర్శన, వ్యక్తిగతంగా ఆటగాళ్ల రికార్డులు, టీమ్ కూర్పును బట్టి చూస్తే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉండగా, అఫ్గానిస్తాన్ కూడా సంచలనాలు ఆశిస్తోంది. అధికారికంగా ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ బోర్డుకే ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లలో 4 మాత్రమే పాకిస్తాన్లో జరుగుతుండగా, శ్రీలంక 9 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు వాన కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది. -
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్.. 10 సెకన్లకు 30 లక్షలు!
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023ను క్యాష్ చేసుకోనేందుకు అధికారిక బ్రాడ్ కాస్టర్ డిస్నీస్టార్ సిద్దమైంది. ఐపీఎల్ 2023 హక్కులు కోల్పోయి నష్టాలు చవిచూసిన హాట్‌స్టార్.. వాటిని పూడ్చే పనిలో పడింది. ఆక్టోబర్ 5 నుంచి జరగనున్న ఈ మెగా ఈవెంట్‌ను డిస్నీస్టార్ మీడియా ప్లాట్ ఫామ్స్ స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ ప్రసారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగా టోర్నీ అడ్వర్టైజమెంట్స్‌కు సంబంధించిన రేట్ కార్డ్‌ను డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించిందని ఎక్స్ఛేంజ్4మీడియా పేర్కొంది. అయితే వన్డే ప్రపంచకప్ 2023లోని మ్యాచ్‌లు అన్నింటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించిన హాట్‌స్టార్.. అడ్వర్టైజ్మెంట్ రేట్స్‌ను మాత్రం భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో కోప్రజెంటర్స్ అడ్వర్టైజింగ్ స్లాట్ ఫీజు రూ. 150 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అసోసియేట్ స్పాన్సర్స్ స్లాట్ ఫీజు రూ. 88 కోట్లుగా ఉంచిందని సమాచారం. పవర్డ్ బై స్పాన్సర్ కావాలనుకునే బ్రాండ్లు రూ. 75 కోట్లు చెల్లించాలి. అదేవిధంగా ఆసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ను ఎంచుకునే వారు మాత్రం రూ. 40 కోట్ల బడ్జెట్‌ను అందించాల్సి ఉంటుంది. భారత్-పాక్ మ్యాచ్‌కు ప్రత్యేక ధర.. ఇక ప్రపంచక్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు రేట్లను ప్రత్యేకంగా హాట్‌స్టార్ నిర్ణయించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 10 సెకన్ల యాడ్ కు రూ. 30 లక్షల ధర ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్‌గా ఈ ప్రపంచకప్ ద్వారా మొత్తం 1000 కోట్లను ఆర్జించాలని డిస్నీ హాట్‌స్టార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ -
ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు. -
భీమ్లా నాయక్‌కు ఓటీటీల పోటీ, భారీ డీల్‌కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టిస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంతో భీమ్లా నాయక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే థియేట్రికల్ రిలీజ్ అనంతరం ప్రతి కొత్త సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ చిత్రాలు పోస్ట్ రిలీజ్‌కు కళ్లు చెదిరే డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో పుష్ప, అఖండ తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే రిలీజ్‌కు ముందే భీమ్లా నాయక్ డిజిటల్ రిలీజ్‌కు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. మేకర్స్ కళ్లు చెదిరే డీల్‌కు భీమ్లా నాయక్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయట. ఫైనల్‌గా ఈ సినిమాను ఆహాతో కలిసి డిస్నీప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని చెబుతున్నారు. రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ రైట్స్‌ను దక్కించుకున్నాయనే వార్త ఆసక్తిని సంతరించుకుంది. దీంతో ఈ మూవీ మేకర్స్‌తో భారీగా ఓప్పందం కుదుర్చుకున్నాయని, కళ్లు చేదిరే డీల్‌కు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మూవీ థియేటర్లో విడుదలైన 50 లేదా 30 రోజుల తర్వాత ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు. కాగా మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్తి మీనన్లుఏ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాని సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. -
ఈసారి నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో బిగ్‌బాస్, కొత్త లోగో వచ్చేసిందిగా..
‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ ఇప్పుడు 24 గంటల వినోదాన్ని నేరుగా బిగ్‌బాస్ హౌస్ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా అందిస్తామని వాగ్ధానం చేస్తుంది. ఈ వినోద అద్భుతం త్వరలోనే మీ అరచేతుల్లోకి రాబోతుంది. అత్యంత ఆసక్తిని పెంచే హౌస్‌మేట్స్‌తో బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుంది. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే.. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఈరోజు(బుధవారం) లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్లో విడుదల చేసింది. ఈ లోగో ఓ శక్తివంతమైన కళాఖండంలా ఉంటుంది. నీలం, ఎరుపు రంగులు శక్తిని తెలుసుకోవాలనే ఆసక్తికి ప్రతీకలుగా నిలువడమే కాదు, యూనివర్శల్ టచ్‌నూ అందిస్తాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ సంవత్సరం అతి పెద్ద వినోద అధ్యాయానికి మీ కోసం తెరతీయబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కోసం సిద్ధమైపోండిక. -
డిజిటల్ స్ట్రీమింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది
‘‘ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాలీవుడ్‌లోనూ ఎన్నో ఒరిజినల్ ప్రొడక్షన్స్ క్రియేటివ్‌గా కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని నాగార్జున అన్నారు. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో తెలుగు ఒరిజినల్ డ్రామా సిరీస్ ‘పరంపర’, నాగార్జున హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ త్వర లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సునీల్ రాయన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలో ది బెస్ట్ కంటెంట్ ఇచ్చేందుకు ముందుంటాం. ‘‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో తెలుగు ఇండస్ట్రీ అసోసియేట్ అవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ అంబాసిడర్, హీరో రామ్‌చరణ్. ‘పరంపర, 9 అవర్స్, ఝాన్సీ, బిగ్ బాస్ లైవ్’ వంటి వాటిని దేశవ్యాప్తంగా చూపించబోతున్నాం’’ అన్నారు ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సునీల్ రాయన్. -
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోనే తాప్సీ, విజయ్ సేతుపతి మూవీ..
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అనబెల్ సేతుపతి’. హార్రర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కుత్ను ఈ చిత్రానికి దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి రాయల్ లుక్‌లో కనిపించగా, తాప్సి గౌను ధరించి రాణిలా ఆకట్టుకుంది. చదవండి: కమల్ హాసన్ పాటకు విజయ్ సేతుపతి, నయనతార, సమంత స్టెప్పులు! అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా సెప్టెంబరు 17న ‘అనబెల్.. సేతుపతి’ స్ట్రీమింగ్ కానుందని స్పష్టం చేశారు. కాగా ప్రముఖ దర్శకుడు సుందరాజన్ తనయుడు దీపక్ సుందర్ రాజన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఎప్పడూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే విజయ్, తాప్సీలు తొలిసారిగా జతకట్టడంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ఫొటోషూట్‌కు వెళ్లిన మోడల్‌పై చిరుతల దాడి స్వరా భాస్కర్ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు -
వీడియో ఓటీటీ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ వీడియో ఓటీటీ (ఓవర్ ది టాప్) మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. నెట్‌వర్క్‌లు మెరుగుపడటం, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021లో 1.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న వీడియో ఓటీటీ మార్కెట్ పరిమాణం 2025 నాటికి 4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాలు .. ప్రాంతీయ భాషల్లో మాట్లాడే జనాభా మొదలైన అంశాలు ఓటీటీ ప్లాట్‌ఫాం వృద్ధికి తోడ్పడనున్నాయని తెలిపింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి టాప్ ఫేవరెట్స్‌తో పాటు పలు స్థానిక, ప్రాంతీయ సంస్థలు కూడా ఓటీటీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొంది. సోనీలైవ్, ఊట్, జీ5, ఇరోస్నౌ, అల్ట్బాలాజీ, హోయ్‌చొయ్, అడ్డా టైమ్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. -
Luca Review: అందమైన అనుభవం
క్వాలిటీ యానిమేటెడ్ చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించడం పిక్సర్కు కొత్తేం కాదు. డిస్నీ వాళ్లతో చేతులు కలిపాక.. కథాబలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన చిత్రమే ‘లూకా’. ఒక వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న సినిమా రీసెంట్గా డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది. టైటిల్: లూకా ఓటీటీ: డిస్నీఫ్లస్ హాట్‌స్టార్ డైరెక్టర్ : ఎన్రికో కాసరోసా కాస్టింగ్: జాకోబ్ ట్రెంబ్లె, జాక్ డైలాన్ గ్రేజర్, ఎమ్మా బెర్మన్, మార్కో బెర్రిసిల్లా, సవేరియో రొయిమోండో(వాయిస్ ఓవర్) మ్యూజిక్: డాన్ రోమర్ రన్ టైం: గంటా 35 నిమిషాలు కథ.. లూకా పగురో.. ఒక సీ మాంస్టర్కుర్రాడు. రాను రాను సముద్రం అడుగున జీవనం అతనికి బోర్‌గా అనిపిస్తుంది. భూమ్మీద బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతుహలం ఆ కుర్రాడిలో రోజురోజుకీ పెరిగిపోతుంటుంది. అయితే తల్లిదండ్రులు(సీ మాంస్టర్లు) మాత్రం వద్దని గట్టిగానే హెచ్చరిస్తారు. ఓరోజు చెప్పాపెట్టకుండా భూమ్మీదకు బయలుదేరుతాడు. నీటి నుంచి ఒడ్డుకు వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నప్పుడు మరో సీ మాంస్టర్కుర్రాడు అలబర్టో స్కోఫానో తారసపడతాడు. తాను చాలాసార్లు భూమ్మీదకు వెళ్లానని చెప్పి.. తనతో పాటు రమ్మని తీసుకెళ్తాడు అలబర్టో. ఆ ఇద్దరూ కలిసి తీర ప్రాంతం పోర్టోరోసోపై అడుగుపెడతారు. తమకున్న విచిత్ర గుణంతో ఆ ఇద్దరూ వెంటనే మనుషుల్లా మారిపోతారు. ఆ ఊరిలో ఆ పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? లూకా ఊహకు తగ్గట్లే భూమ్మీద ఉంటుందా? మనుషులకు వాళ్ల నిజస్వరూపాలు తెలుస్తాయా? చివరికి లూకా ఏమవుతాడు? అనేది మిగతా కథ.. విశ్లేషణ లూకా ఒక ఫాంటసీ కథ. ఇటలీ జానపద కథలు, పిల్లల పుస్తకాల్లో కనిపించే సీ మాంస్టర్ కథల ఆధారంగా దర్శకుడు ఎన్రికో కాసరోసా అల్లుకున్న కథ. ఈ సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది..లూకా పడే పాట్లు నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా విరుద్ధ మనస్తత్వాలున్న ఆ పిల్లల మధ్య స్నేహం.. భావోద్వేగాల్ని పుట్టిస్తుంది. సున్నితంగా ఉండే లూకా.. సముద్రంలో వెళ్లే బోట్ల నుంచి సామాన్లు దొంగతనం చేసేంత తెగింపు ఉన్న అలబర్టో మధ్య స్నేహం కథకు ప్రధాన బలం. వీళ్ల సాహసాలు, వీళ్ల స్నేహాన్నే నమ్ముకున్న చిన్నారి గియులియా, సీ మాంస్టర్లంటే రగిలిపోయే ఒడ్డున ఉండే మనుషులు, వెస్పా బండి మీద ప్రయాణం కోసం ఉవ్విళ్లూరే లూకా-అల్బర్టోలు.. వాళ్లని తరిమే బామ్మలు, లూకా కోసం పరితపించే తల్లిదండ్రులు(సీ మాంస్టర్లు), ఒంటరి తండ్రి బాగోగుల కోసం తల్లడిల్లే అలబర్టో.. ఇలా పాత్రల తీరుతెన్నులు కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఇక సంక్లిష్టమైన కథల్ని కదిలే బొమ్మల ద్వారా అందంగా చూపించడంలో పిక్సర్ మరోసారి సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. టెక్నికల్ కోణంలో.. లూకాకు ప్రధాన బలం విజువల్స్. 50, 60వ దశకాల్లో ఇటలీ సుందర దృశ్యాలు(యానిమేటెడ్) ఆకట్టుకుంటాయి. విజువల్ టీం ఆరు నెలలపాటు గ్రౌండ్‌వర్క్ చేసి పడ్డ కష్టం అలరిస్తుంది.. ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక క్యారెక్టరైజేషన్ డిజైన్లు, వాటికి తగ్గ ఆర్టిస్టుల వాయిస్ ఓవర్.. అన్ని ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్గా అందించాయి. డాన్ రోమర్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అయితే గత పిక్చర్ సినిమాలతో పోలిస్తే.. లూకాలో స్టోరీ టెల్లింగ్ కొంత వీక్‌గా అనిపిస్తుంది. ఇక దర్శకుడు కాసారోసాకు ఇది తొలి సినిమా. జెనోవాలో తన చిన్ననాటి స్నేహితుడితో పంచుకున్న అనుభవాల నుంచే ఈ కథను రాసుకున్నాడు. అందుకు తగ్గట్లే ఫ్రెండ్షిఫ్ థీమ్‌ను బలంగా చూపించడంతో ఈ ‘డబుల్ లైఫ్’ లూకా వ్యూయర్స్‌కి అందమైన అనుభవాన్ని అందిస్తూ ఆకట్టుకోగలుగుతోంది. -
నవంబర్ కథేంటి?
‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ఈ సిరీస్ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. తండ్రీ–కూతురు చుట్టూ తిరిగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. చేయని తప్పుకు శిక్ష అనుభవించే తండ్రి, అతన్ని కాపాడుకునే కూతురిగా తమన్నా కనిపించనున్నారు. నూతన దర్శకుడు రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ‘‘నేను చేసిన ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్‌లో ‘నవంబర్ స్టోరీ’ ఒకటి. మీ అందరికీ ఈ సిరీస్‌ను త్వరగా చూపించాలని ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేసిన సందర్భంగా తమన్నా అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. -
బ్రాడ్ కాస్టింగ్ నియమాలు అతిక్రమిస్తే శిక్షలు తప్పవు
-
యూట్యూబ్ ఛానల్స్ పెట్టేందుకు నో ఛాన్స్...
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం సంతకం చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ తదితర పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టాలు లేదా స్వతంత్ర ప్రతిపత్తిగల అధికారిక సంస్థ ఏర్పాటుకాని నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రెస్ కౌన్సిల్ ప్రస్తుతం ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ నియంత్రిస్తోంది. ఇదేవిధంగా వార్తా ప్రసార చానళ్లను న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) మానిటర్ చేస్తోంది. సినిమాల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కి అధికారాలుండగా.. ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది. పిటిషన్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నియంత్రణపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా గత నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను కోరింది. స్వతంత్ర సంస్థ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించే అంశంపై కేంద్రం, సమాచార ప్రసార శాఖ, దేశీ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్స్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పరిధిలో న్యూస్ పోర్టల్స్‌తోపాటు.. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర స్ట్రీమింగ్ సర్వీసుల సంస్థలు వస్తాయి. వీటిని ఇంటర్నెట్ లేదా ఆపరేటర్ల నెట్వర్క్ ద్వారా వీక్షించేందుకు వీలుంటుంది. కాగా.. ఓటీటీ లేదా వివిధ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫిల్ములు, సిరీస్‌ల తయారీదారులు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందకుండానే కంటెంట్‌ను విడుదల చేస్తున్నట్లు పిటిషన్లో ఫిర్యాదుదారు పేర్కొన్నారు. -
ఓటీటీలో సడక్ 2
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సడక్ 2’. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేశారు. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘సడక్’కి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆలియా, సంజయ్ దత్ లుక్స్‌ను విడుదల చేశారు. నేడు ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ
ప్రస్తుతం ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే వినోదాన్ని హోమ్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేసింది ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ డిస్నీ హాట్‌స్టార్. ‘బాలీవుడ్‌కీ హోమ్డెలివరీ’ అంటూ ఏడు హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’, అజయ్ దేవగన్ ‘భూజ్’, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్బుల్’, సంజయ్ దత్ ‘సడక్ 2’, సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ ‘దిల్ బేచారా’, విద్యుత్ జమాల్ ‘ఖుదా హాఫీజ్’, కునాల్ కేము ‘లూట్ కేస్’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. జూలై నుంచి అక్టోబర్ నెలవరకూ ఈ సినిమాలను ప్రసారం చేయనున్నట్టు హాట్‌స్టార్ తెలిపింది. ఇందులో ‘దిల్ బేచారా’ మొదటిగా జూలై 24న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ‘బాలీవుడ్‌కీ హోమ్డెలివరీ’ సంబంధించి అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ను హోస్ట్ చేశారు వరుణ్ ధావన్. ఈ ఈవెంట్‌కి తమని ఆహ్వానించలేదని విద్యుత్ జమాల్, కునాల్ కేము ట్వీటర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. -
కొత్త ప్రయాణం
నటిగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు తమన్నా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేశారు. కొన్నిసార్లు స్పెషల్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు నటిగా ఓ కొత్త జర్నీ ఆరంభించారని తెలిసింది. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తమన్నా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వికడన్ టెలీవిస్తాస్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్ ఏ జానర్లో ఉండబోతోంది? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో ‘బోల్ చుడియా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తమన్నా. తమిళంలో ఓ సినిమా కూడా కమిట్ అయ్యారు. -
హాట్‌స్టార్ బంపర్ ఆఫర్ : రోజుకు ఒక రూపాయే
భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి విదేశీ సంస్థలకు షాకిస్తూ విఐపీ సబ్స్క్రిప్షన్ పేరుతో ఓ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్‌తో విఐపి ప్లాన్‌ను హాట్‌స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్, ఈ ఏడాది మేలో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది. వివో ఐపిఎల్, ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌స్టార్ విఐపి టారిఫ్ కింద వీక్షించవచ్చు. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమేనన్నమాట. హాట్ స్టార్ విఐపి సబ్‌స్క్రైబర్స్‌కి స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ ప్రసారం చేసే సీరియల్స్‌ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం మరో విశేషం. అలాగే ఇప్పటికే చందాదారులుగా వున్నవారు ఈ ప్లాన్‌తో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, హాట్‌స్టార్ స్పెషల్స్ లేబుల్స్ కింద లభ్యమయ్యే వీడియోలు మాత్రమే ఈ హాట్‌స్టార్ విఐపి ప్లాన్ ఆఫర్ పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా అమెరికాకు చెందిన అన్ని టీవీ షోలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఈ ఆఫర్‌కి వర్తించకపోవడం గమనార్హం. -
8 వారాలు ఆగాల్సిందే
సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్) కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నప్పటికీ ఆన్లైన్లో ఉండటంతో రెవెన్యూ పరంగా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ నాలుగు వారాల సమయాన్ని ఎనిమిది వారాలకు పొడిగించాలని తెలుగు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ‘‘ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం అని రిలీజ్ అయిన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సినిమాను ఆన్లైన్లో పెట్టడంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. -
ఐపీఎల్ ఫైనల్ ‘ఫిక్స్’ చేశారా?
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో ఫైనల్లో చైన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొట్టబోతున్నాయి.. అదేంటీ కోల్‌కతా నైట్‌రైడర్ ఎపుడు, ఎలా ఫైనల్‌కి వెళ్లిందనుకుంటున్నారా? హాట్ స్టార్ రూపొందించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇదే సందేహం వస్తుంది. ఇంతకీ సదరు వీడియోలో ఏముందంటే.. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నట్టు రూపొందించారు. క్వాలిఫయర్-1లో విజయం సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మాత్రమే ఇప్పటి వరకు ఫైనల్ చేరుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుని.. వాంఖేడే స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అలాంటపుడు క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగకుండానే హాట్‌స్టార్ కోల్‌కతా జట్టు ఫైనల్ చేరినట్లు వీడియో రూపొందించడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. రెండవ ఫైనలిస్ట్ కోల్‌కతా అని ఎలా చెబుతారని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని విపరీతంగా కామెంట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు. -
మూవీ స్పైసీ.. ప్లీజ్ సీ
హేట్ స్టోరీతో హాట్‌స్టార్‌గా ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన జరీనాఖాన్ సిటీకి వచ్చింది. హీరో శర్మాన్‌జోషి తదితరులతో కలిసి సిటీలోని పలు షోరూంలలో సడన్‌గా మెరిసి మురిపించింది. బంజారాహిల్స్‌లోని సర్వీ హోటల్లో సందడి చేసింది. బేగంపేట్‌లోని క్రీమ్‌స్టోన్ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వచ్చి హీటెక్కించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘హేట్‌స్టోరీ-3’ ఒక స్పైసీ మూవీఅని చెప్పింది. ఇందులో ఫైట్స్, అఫైర్స్, థ్రిల్స్ ఇబ్బడిముబ్బడిగా ఉంటాయంది. సినిమాకు అవసరం కాబట్టి బోల్డ్‌గా నటించానని చెప్పారు. హేట్‌స్టోరీ-1, 2లను హిట్ చేసినట్టే మూడో సీక్వెల్‌ని కూడాఆదరించాలని ప్రేక్షకుల్ని కోరారు. హీరో శర్మాన్‌జోషి మాట్లాడుతూ తనకు నచ్చిన నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. షూటింగ్ కోసం గతంలో నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. - సాక్షి, వీకెండ్ ప్రతినిధి