మలయాళీ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) నటించిన లేటేస్ట్ మూవీ 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ ఈ చిత్రంలో కనిపించారు.
(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)
బరోజ్ 3డీ కథేంటంటే..
ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment