
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్‌బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయినా హార్ట్‌బీట్ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
ఈనెల 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
The wait ends with a beat.. Save the date May 22 ❤️❤️🩺#HotstarSpecials Heart Beat Season 2 Streaming from May 22 only on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar… pic.twitter.com/cLIci1QpOb
— JioHotstar Tamil (@JioHotstartam) May 10, 2025