JioHotstar
-
జియో కొత్త ప్లాన్.. జియోహాట్‌స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్‌గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
జియో హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా?
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్లను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. వీటిలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకురాగా, డిస్నీ+ హాట్‌స్టార్‌కు బదులుగా జియోహాట్‌స్టార్‌ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియోఫైబర్ ప్లాన్లను అప్డేట్ చేసింది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్తో పాటు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియోఫైబర్ ప్లాన్లుజియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్‌తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లుజియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్ స్టార్ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది. -
జియో హాట్‌స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్న జియోస్టార్, జియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను పరస్పరం విలీనం చేస్తూ సమగ్ర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్(JioHotStar)’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ విలీనంతో దేశంలోని తమ వినియోగదారులకు వినోదం, క్రీడలతోపాటు మరెన్నో ఎంటర్టైన్మెంట్ సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థల అధికారులు తెలిపారు.సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఇలా..జియో హాట్ స్టార్ హైబ్రిడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాలీవుడ్ సినిమాలు మినహా ప్రతి నెలా పరిమిత గంటల పాటు వినియోగదారులు కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతకుమించి వీక్షించాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐపీఎల్‌ను జియో, హాట్స్టార్లు ఫ్రీగా అందించేవి. కానీ మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించాలంటే మాత్రం ఇకపై ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలతో కేవలం మొబైల్ మాత్రమే వీక్షించాలంటే త్రైమాసికానికి రూ.149 నుంచి సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ త్రైమాసికానికి రూ.499గా నిర్ణయించారు. రెండు డివైజ్‌లకు సపోర్ట్ చేసేలా రెండు సూపర్ ప్లాన్ల(యాడ్ బేస్)ను తీసుకొచ్చింది. దీనికి త్రైమాసికానికి ధర రూ.299. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499గా నిర్ణయించారు.ప్రస్తుత వినియోగదారులపై ప్రభావంజియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను ప్రస్తుతం వాడుతున్న చందాదారులు జియో హాట్‌స్టార్‌కు మారుతారు. జియో సినిమా ప్రీమియం చందాదారులు తమ ప్లాన్ల మిగిలిన కాలవ్యవధి కోసం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రైబర్లు మూడు నెలలపాటు అదే ప్లాన్‌లో కొనసాగి తర్వాత జియో హాట్‌స్టార్‌కు మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: యాప్ స్టోర్‌లో టిక్‌టాక్ పునరుద్ధరణ!జియో హాట్‌స్టార్‌లో కంటెంట్..డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, హెచ్‌బీఓ, పారామౌంట్.ప్రాంతీయ, బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్ అండ్ రియాలిటీ షోలు, డ్రామా, థ్రిల్లర్స్, ఎంగేజింగ్ రియాలిటీ కంటెంట్.ఐపీఎల్, డబ్ల్యుపీఎల్, ఐసీసీ ఈవెంట్లు వంటి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి ప్రపంచ క్రీడా ఈవెంట్లు. -
అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: చిన్నారుల ఆఫర్
కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్ డొమైన్‌ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.నిజానికి జియో హాట్‌స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్‌ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్‌ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్‌ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..చిన్నారులు ఇచ్చిన ఆఫర్‌కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్‌ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్‌ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్‌స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు.