
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.
జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్లోని ప్రతి మ్యాచ్‌ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.
ఫ్రీ జియో హాట్‌స్టార్ ప్లాన్లు ఇవే..
రూ.100 ప్లాన్: ఇది డేటా యాడ్‌ఆన్ ప్లాన్. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.
రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.
రూ.949 ప్లాన్: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్ ప్లాన్. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్, ఓటీటీ, ఇతర టెలికమ్ బెనిఫిట్లు ఆనందించవచ్చు.