special offer
-
రూ.149కే కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్ - వివరాలు
2024 ప్రారంభంలోనే కేఎఫ్‌సీ 'లంచ్ స్పెషల్' అనే కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద కేఎఫ్సీలో ఇష్టమైన వాటిని బుక్ చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ.149 మాత్రమే కావడం విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేఎఫ్‌సీ అందించే ఓ స్పెషల్ ఆఫర్ 149 రూపాయలతో ప్రారంభమవుతుంది. వినియోగదారులు లాంగర్ బర్గర్లు, రోల్స్ లేదా రైస్ బౌల్జ్తో పాటు ఐకానిక్ హాట్ & క్రిస్పీ చికెన్, పెరి పెరీ చికెన్ స్ట్రిప్స్ లేదా ఫ్రైస్‌తో పాటు రిఫ్రెష్ డ్రింక్స్ వంటి వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి ధరలు వివిధ రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ అనేది అన్ని కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా 5X సేఫ్టీ ప్రామిస్ ఆఫ్ శానిటైజేషన్, స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ టీమ్‌లతో ఉంటుంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా రెస్టారెంట్‌లోని అన్ని ప్రాంతాలు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుతారు. సంస్థ రైడర్ల ఆరోగ్య పరిస్థితులను కూడా క్రమం తప్పకుండా నోటీస్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కస్టమర్ ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ కోసం కేఎఫ్‌సీ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. -
వైజాగ్–సింగపూర్ రూ. 6,300కే విమాన టికెట్
ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన బడ్జెట్ విమానయాన సంస్థ స్కూట్ తాజాగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. వైజాగ్ తదితర నగరాల నుంచి సింగపూర్‌కు అత్యంత తక్కువ రేటు రూ. 6,300 నుంచి (వన్–వే) ఫ్లయిట్ టికెట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ సేల్ సెపె్టంబర్ 1 వరకు అయిదు రోజుల పాటు ఉంటుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ప్రాంతాన్ని బట్టి డిసెంబర్ 14 వరకు ఈ టికెట్లను వినియోగించుకోవచ్చు. -
రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..
సాక్షి, సిటీబ్యూరో: బస్సు ప్రయాణీకులకు బంపరాఫర్. ఇంటర్–సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలందించే న్యూగో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇండోర్– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్ కోసం న్యూగో వెబ్సైట్ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్ అప్లికేషన్లలోనూ బుకింగ్ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు. ఇది కూడా చదవండి: ఒకే నెలలో ఇన్ని పరీక్షలా? -
ఈ స్పెషల్ ఆఫర్‌కు శ్రీలీల ఓకే చెబుతుందా..?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు ‘పుష్ప: ది రూల్’ సినిమాలో యాక్ట్ చేసే ఓ స్పెషల్ ఆఫర్ వచ్చిందట. కథ రీత్యా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు స్కోప్ ఉందట. ఈ పాటలో శ్రీలీల అయితే బాగుంటుందని సుకుమార్ అండ్ కో ఆమెనును సంప్రదించారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి.. ఈ స్పెషల్ ఆఫర్‌కు శ్రీలీల ఊ అంటారా..? ఊహూ అంటారా? అనేది తెలియాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఇక ‘పుష్ప’ చిత్రం తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ లోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊహూ అంటావా మావ..’ పాటకు సమంత అదిరిపోయే స్టెప్పులు వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప:ది రూల్’ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ . ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా
సాక్షి,ముంబై: ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎ ట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పలు ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. మరీ ముఖ్యంగా రూ. 10వేల తగ్గింపుతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 కంటే బిగ్ డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చింది. అంతేకాదు 3.26 అంగుళాల అతిపెద్ద వెర్టికల్ కవర్ స్క్రీన్ డిస్ప్లే ఎపుడూ ఆన్‌లోనే ఉంటుందట. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 89,999గా ఉంనుంది. అయితే క్యాష్‌బ్యాక్‌లు ,ఇతర ప్రోత్సాహకాల ద్వారా కస్టమర్లు దీన్ని రూ. 79,999 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఒప్పో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్ ,మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్స్‌లో మార్చి 17, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబి ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ , అమెక్స్పై కస్టమర్లు రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్, 9 నెలల వరకు నో-కాస్ట్ EMIని ఆస్వాదించవచ్చు. అలాగే ఒప్పో కస్టమర్లు రూ. 5000 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో రూ. 2000 వరకు తగ్గింపు లభ్యం. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫీచర్లు 6.8-అంగుళాల e6 ఫోల్డింగ్ డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ColorOS 13 ఆండ్రాయిడ్ 13 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 50+ 8(ఫిక్స్డ్-ఫోకస్ అల్ట్రావైడ్ షూటర్) ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 32ఎంపీ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,300mAh బ్యాటరీ -
ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. మహిళల కోసం స్పెషల్ ఆఫర్: ఎక్కడో తెలుసా?
సమ్మర్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ మాదిరిగానే రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వండర్లా ఒక ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే. ఇందులో భాగంగానే ఆ రోజు ఒక టికెట్ కొంటె మరో టికెట్ ఉచితంగా పొందవచ్చు. వండర్లా ఎంట్రీ టికెట్ జిఎస్టితో కలిపి రూ. 999. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ధరకు మహిళలు రెండు టికెట్స్ పొందవచ్చు. మహిళలు సరదాగా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికి ఈ రోజులలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మార్చి 8న 10 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులను అనుమతించరు. మార్చి 8న సరదాగా గడపాలనుకునే మహిళలు ఈ ఆఫర్‌తో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ రుగు పురుషులు బుక్ చేసుకుంటే అనుమతించబడదు. బుక్ చేసుకున్న ఏ టికెట్ అయినా రద్దు చేస్తారు. వండర్లా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరిస్తుంది. పరిశుభ్రత, భద్రతలను దృష్టిలో ఉంచుకుని అతిథులు రైడ్లు, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలలో భౌతిక దూరాలు వంటివి పాటించాల్సిన అవసరం ఉంది. వండర్‌లాలోని మొత్తం సిబ్బంది మాస్క్‌లు ధరించడం తప్పనిసరి, అన్ని రైడ్లు, రెస్టారెంట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లు అందించబడుతుంది. మొత్తానికి సమ్మర్ సీజన్లో మహిళలు ఎంజాయ్ చేయడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. -
IndiGo Special offer: రూ.2వేలకే విమాన టికెట్!!
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్‌లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఏ ఆఫర్లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్ఎస్బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. -
ఓయో బంపరాఫర్..విద్యార్థినులకు మాత్రమే!
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్ అందిస్తుంది. అందులో వైఫై, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జ్యూమర్) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు. విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్ పొందాలంటే! ♦ఓయో యాప్‌ను డౌన్లోడ్ చేయాలి ♦ఆ యాప్‌లో నియర్ బై ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ♦ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేస్తే ఎగ్జామ్ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఓయో రూమ్స్ లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఓయో రూమ్స్ హోటల్‌ను సెలక్ట్ చేసుకొని 'నీట్ జేఎఫ్' కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి ♦ఆ తర్వాత బుక్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి 40శాతం పేమెంట్ చేసి ఓయో రూంను వినియోగించుకోవచ్చు. -
TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. బస్ టికెట్ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు తిరుమలకు వెళ్లే భక్తులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు. కాగా, తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ.. శ్రీవారి దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పించింది. టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఈ దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం కలదు. అయితే, బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకోవాలి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది. ఇక, టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు వివరించారు. www.tsrtconline.in ఆన్లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చు. కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు -
విస్తారా ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్.. రూ.977కే ఫ్లయిట్ జర్నీ!
విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్‌ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్‌కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్‌లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది. విస్తారా వెబ్సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. (చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!) -
SBI: కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే... కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్ కారు రుణం డిజిటల్‌గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది. రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత. ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది. -
బిగ్ బజార్ బంపర్ ఆఫర్: రూ. 1500 షాపింగ్ చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్
ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్ చైన్ బిగ్ బజార్ గుడ్ న్యూస్ తెలిపింది. తన వినియోగదారుల కోసం బిగ్ బజార్ 2021 మే 22 నుంచి మే 31 వరకు 'బిలీవ్ ఇట్ ఆర్ నాట్' ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద రూ.1500ల షాపింగ్ చేసిన వారికి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ / పూర్తి లాక్డౌన్ విధించినందున బిగ్ బజార్ వినియోగదారులు బిగ్ బజార్ ఆన్లైన్ యాప్‌లో లేదా బిగ్‌బజార్‌లోని స్టోర్ షాపులో షాపింగ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందగలరు. బిగ్ బజార్ ఆన్లైన్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన వాటిపై కూడా రూ.1000 క్యాష్‌బ్యాక్, బుక్ చేసిన 2 గంటలలో హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. "ఇంటి నుంచి షాపింగ్ చేయవచ్చు లేదా కరోనా మార్గదర్శకాల ప్రకారం వారు తమ సమీప దుకాణాన్ని సందర్శించవచ్చు" అని ఫ్యూచర్ గ్రూప్ గ్రూప్ సీఎమ్ఓ, డిజిటల్, మార్కెటింగ్, ఈ-కామర్స్ పవన్ సర్దా అన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో స్టోర్స్ కలిగి ఉన్న బిగ్ బజార్ ఫ్యూచర్ గ్రూప్ చెందింది. ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు, సిట్-డౌన్ చెక్ అవుట్స్, స్మార్ట్ కస్టమర్ సర్వీస్ వంటి ఆవిష్కరణలతో ఉన్నతమైన షాపింగ్ అనుభవాలను బిగ్ బజార్ అందిస్తుంది. చదవండి: ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే.. -
కస్టమర్లకు యప్ టీవీ మెగా ఆఫర్
ముంబై: కరోనా వైరస్ దెబ్బతో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లోనే సినిమాలు, కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో(ఆన్లైన్) ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన యప్ టీవీ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలో వినోధం కోరుకునే వారికి యప్ టీవీ 24జులై నుంచి జులై 28వరకు ఐదు రోజుల కాలపరిమితితో ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్ ప్రకటించిన రోజులలో యప్ టీవీ ద్వారా అందించే సినిమాలు, అన్ని కార్యక్రమాలకు ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం తెలుగులో విశేషాధారణ పొందిన జబర్దస్త, క్యాష్ లాంటి కార్యక్రమాలతో యప్ టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలమాళం, బెంగాళీ, కన్నడ, మరాఠి తదితర భాషలలో తక్కువ ప్యాకేజీతో కస్టమర్లను అలరిస్తోంది. అయితే వివిధ దేశాలలో యూప్ టీవీ వివిధ ప్యాకేజీలతో ప్రకటించింది. యూప్ టీవీలో క్లాసికల్ సినిమాల నుంచి ప్రస్తుత బ్లాక్‌బ్లస్టర్ సినిమాల వరకు 3,000సినిమాలు యప్ టీవీ అందిస్తోంది. వివిధ దేశాలలో యప్ టీవీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు ఆస్ట్రేలియాలో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు న్యూజిలాండ్‌లో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు యూకేలో సంవత్సర ప్యాకేజీ 69.99డాలర్లు యూరప్‌లో సంవత్సర ప్యాకేజీ 69.99డాలర్లు యూఎస్ఏ సంవత్సర ప్యాకేజీ 99.99డాలర్లు -
మొబైల్ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఈ రీచార్జ్ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్‌తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది. -
బిగ్ సీలో సంక్రాంతి ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైల్స్‌పై అన్ని బ్యాంక్‌ల కార్డ్‌ల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్, అన్ని వివో మోడల్స్‌పై సర్ప్రైజ్ గిఫ్ట్‌లను అందిస్తోంది. దీంతో పాటు ఒప్పో ఎఫ్9 ప్రొ కొంటే రైస్ కుక్కర్ ఉచితం, రూ.1,590 కార్బన్న్కే3 బూమ్ మ్యాక్స్ సెల్‌ఫోన్‌పై రూ.2,500 విలువ గల ఫ్యాన్ ఉచితంగా అందుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎక్కాల్సిన రైల్వేస్టేషన్‌ను మార్చుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) బుక్ చేసుకున్న టికెట్లో ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకునే వీలును కల్పించింది. ఈ ప్రకటనతో ఇక ప్రయాణీకులు చివరి సమయాల్లో అనువుగా ఉండే స్టేషన్‌కు ప్రయాణాన్ని మార్చుకోవచ్చు. సాధారణంగా టికెట్ బుకింగ్ సమయంలో మనం ఎక్కాల్సిన స్టేషన్, చేరాల్సిన స్టేషన్ వివరాలను ముందుగానే ఇస్తాం. అయితే, తాజా నిర్ణయంతో ప్రయాణీకులు ఎక్కాల్సిన స్టేషన్‌ను ప్రయాణ తేదీకి ఒక్కరోజు ముందు వరకూ మార్చుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సివుంటుంది. ఒక టికెట్‌పై ఒకసారి మాత్రమే మార్పులకు అవకాశం ఉంటుంది. కరెంట్ బుకింగ్, వికల్ప్, ఐ టికెట్ ద్వారా బుక్ చేసుకున్న వాటికి ఇది వర్తించదని ఐఆర్సీటీసి పేర్కొంది. స్టేషన్ మార్చుకోవాలంటే... ఐఆర్సీటీసీ యాప్‌లో బుకింగ్ హిస్టరీకి వెళ్లాలి. బుక్ చేసుకున్న టికెట్‌ను క్లిక్ చేయాలి. చేంజ్ బోర్డింగ్ పాయింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎక్కాల్సిన(మార్చుకోవాల్సిన) రైల్వేస్టేషన్‌ను ఎంచుకోవాలి. Want to #board #train from another #station but #ticket has been booked? Change your boarding station right from #IRCTC #eTicketing website. Just log on to https://t.co/s3mX8V8YUd or download IRCTC Rail Connect App:https://t.co/Rc3TO3JkVu pic.twitter.com/7tutd8W62r — IRCTC (@IRCTCofficial) April 27, 2018 -
ఎయిర్ ఏషియాతో.. చౌక ప్రయాణం
మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలోయ్.. ఎప్పుడూ ఉరుకులూ, పరుగులూ, టెన్షన్లేనా..? కాంక్రీట్ జంగిల్లో, ఇరుకు గదుల్లో రోబోల్లా ఉండాల్సిందేనా..? ఇక చాలు.. అటువంటి బిజీ లైఫ్‌కి కాస్త విరామం ఇవ్వండి. హాయిగా ప్రపంచాన్ని చుట్టేసి రిలాక్స్ అవ్వండి. ఇంతకీ ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అనుకుంటున్నారా.. అబ్బే ఏం లేదండీ మీలాంటి వారి కోసమే ఎయిర్ ఏషియా 'బీట్దబడ్జెట్' పేరిట కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకుని కాస్త రీచార్జ్ అవుతారనే మా చిన్ని సలహా. తప్పక పాటించి టికెట్లు బుక్ చేసేస్తారు కదూ. కౌలాలంపూర్ నవీనతకు, సంస్కృతికి, సహజమైన ప్రకృతి అందాలకు నెలవైన కౌలాలంపూర్‌ను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. అక్కడి మడ అడవుల్లోని వృక్ష, జంతుజాలాలను, వన్య ప్రాణులను చూస్తే చాలు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. పొద్దంతా బీచ్‌లలో సేదతీరి, రాత్రి విశ్రాంతి పొందే వీక్షకులతో నగరం ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. కెడాయ్ ద్వీప సమూహానికి చెందిన లాంగ్ కావి ద్వీపం భూతల స్వర్గంలా మనసును రంజింపజేస్తుంది. బీచ్‌లలో స్కూబా డైవింగ్ చేయొచ్చు. మరో అద్భుతమైన ప్రదేశం జోహార్‌లోని లెగోలాండ్. ఇక్కడ సరసమైన ధరలకే షాపింగ్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ భోజన ప్రియులను అలరించేందుకు రెస్టారెంట్లు, ఉల్లాసంగా గడిపేందుకు థీమ్ పార్కులు ఉన్నాయి. సో మీ ట్రిప్‌లో కౌలాలంపూర్ ఉండేలా చూసుకోండి మరి. సింగపూర్.... గార్డెన్ సిటీగా ప్రసిద్ధి పొందిన సింగపూర్‌లో విభిన్న జాతుల వ్యక్తులు మీకు తారసపడతారు. ఠీవీ ఉట్టిపడేలా రాజమార్గాలతో నిండిన నగరం తన అందాలతో కనువిందు చేస్తుంది. ఆకాశహార్మ్యాలు, వలస కాలనీలు, వీధి మార్కెట్లు, పురాతన హిందూ, బౌద్ధ మతాలకు చెందిన ఆలయాలతో అలరారే సింగపూర్‌ను చూసి తీరాల్సిందే. సుమారు 1000 విభిన్న జీవ జాతులతో నిండిన నేషనల్ ఆర్కిడ్ గార్డెన్, అద్భుతమైన మెరీనా బే సాండ్స్ రిసార్ట్, అత్యాధునిక హంగులతో నిర్మితమైన చంగీ అంతర్జాతీయ విమానాశ్రయం, అందులో ఉన్న బటర్ ఫ్లై గార్డెన్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. బాలీ.... ప్రకృతి రమణీయ దృశ్యాలకు చిరునామా బాలీ ద్వీపం. కొండలు, ఇసుక బీచ్‌లు, పంటపొలాలు, అగ్ని పర్వతాలతో భూతల స్వర్గాన్ని తలపించే బాలీతో మీరు లవ్‌లో పడటం గ్యారెంటీ. సాయంత్రం వేళ 'కుటా' బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడా సందర్శించాల్సిన ప్రదేశం బాలీ సాంస్కృతిక రాజధాని ఉబుద్. ఇక్కడి ఆలయాలను దర్శిస్తూ, బాలీసంస్కృతిని ఎంజాయ్ చేస్తూ గడిపేయొచ్చు. మనోల్లాసం, ప్రశాంతత కోరుకునే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. మనీలా.... 'ప్యారిస్ ఆఫ్ ఏషియా' గా పిలుచుకునే మనీలా ప్రపంచంలోని టూరిస్ట్ ఫ్రెండ్లీ ప్రదేశాల్లో ఒకటి. దక్షిణాసియా, యూరోపియన్ సంస్కృతుల సంగమంతో ఆశ్చర్యానికి గురిచేసే మనీలా ప్రకృతి అందాలు, చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవు. ఉల్లాసంగా గడపడానికి, షాపింగ్ చేయాలనుకునే వారు అత్యంత విలాసవంతమైన మాల్ ఆఫ్ ఏషియాకు వెళ్లి తీరాల్సిందే. కుటుంబంతో కలిసి ఓషన్ పార్క్, మౌంటేన్ పినాటుబో సందర్శించి మీ డైరీలో ఈ అందమైన జ్ఞాపకాలను పదిలపరుచుకోండి. హో చి మిన్ సిటీ..... వియత్నాంలోని అత్యంత సుందర ప్రదేశం. పురాతన, నవీన సంస్కృతులతో విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రదేశాలు, మ్యూజియాలు, మార్కెట్లు, రెస్టారెంట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. సిటీ చరిత్రను ప్రతిబింబించే హో చి మిన్ మ్యూజియం చూడదగ్గ ప్రదేశం. అలసిపోతే రిలాక్స్ అవటానికి, మీలో చైతన్యం నింపటానికి స్పాలు అందుబాటులో ఉంటాయి. సైకిల్, టాక్సీలను ఆశ్రయించి సిటీ అంతా చుట్టేస్తూ పనిలో పనిగా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ఫుకెట్..... థాయ్‌లాండ్‌లోని అతి పొడవైన సుందర ద్వీపం. సముద్ర తీరాన తాటి చెట్లతో నిండిన బీచ్‌లతో ఆహ్లాదాన్ని పంచుతుంది. సెయిలింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. రాత్రివేళ వెన్నెల్లో తెల్లని ఇసుక తిన్నెల్లో సేదతీరుతూ, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపేందుకు అత్యంత అనువైన ప్రదేశం. మానసిక ప్రశాంతత పొందాలంటే మీ లిస్ట్‌లో ఫుకెట్ పేరు ఉండి తీరాల్సిందే. బ్యాంకాక్..... థాయ్ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ఆకాశహార్మ్యాలు, చారిత్రక కట్టడాలు, విలాసవంతమైన డైనింగ్ హాల్స్, తెల్లని ఇసుకతో కూడిన బీచ్ అందాలకు చిరునామా ఈ నగరం. సియామ్ వాటర్ పార్కు, ద గ్రాండ్ ప్యాలెస్, త్రీ డైమెన్షనల్ సాంకేతికతో కూడిన ఆర్ట్ ఇన్ ప్యారడైజ్ వంటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు బ్యాంకాక్ సొంతం. ఒకే చోట 1500 స్టాల్స్‌తో షాపింగ్ ప్రియులను అలరించేందుకు చాటుచక్ మార్కెట్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం టికెట్ బుక్ చేసేయండి. న్యూజిలాండ్..... పర్వతాలు, వర్షారణ్యాలు, హిమనీనదాలు, నదులతో ఓలలాడే ప్రకృతి అందాలు వీక్షకులను కట్టిపడేస్తుంది న్యూజిలాండ్. స్కైడైవింగ్, జెట్ బోటింగ్, మౌంటేన్ బైకింగ్, బంగీ జంప్ చేయాలనుకునే వారికి సరైన గమ్యస్థానం న్యూజిలాండ్. ప్రపంచంలోని భూఉష్ణ మండలంలో ఒకటైన 'రొటోరా'కు వెళితే వేడి నీటి బుగ్గలు, మట్టి కుంటలు చూడవచ్చు. రుచికరమైర భోజనం కోసం 'నేపియర్' కు వెళ్లాలి. న్యూజిలాండ్‌లోని అతి పెద్దదైన ఆక్లాండ్ సిటీ బీచ్‌లు, ద్వీపాలు, అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. తమ ట్రిప్‌ను సాహసయాత్రగా మార్చుకోవాలనుకునేవారు ఆక్లాండ్ను ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే. ఆస్ట్రేలియా..... ఒకప్పుడు బ్రిటీష్ వలస కాలనీగా విరాజిల్లి రాణిగారి దర్పానికి ప్రతిబింబంగా నిలిచింది. అద్భుతమైన బీచ్‌లకు, దట్టమైన వర్షారణ్యాలకు ప్రసిద్ధి. సముద్ర తీరాన ఎంజాయ్ చేయాలనుకునేవారు గ్రేటర్ బారియర్ రీఫ్ వెళ్లి, అక్కడి వన్యప్రాణులను వీక్షించాల్సిందే. సహజమైన సున్నపు రాళ్ల గనులను చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. ఆడవారికి ఎంతో ప్రియమైన రత్నాలు అక్కడి జెమ్ మార్కెట్లలో విరివిగా లభిస్తాయి. అడిలైడ్‌ను కూడా సందర్శిస్తేనే మీ ట్రిప్ పూర్తైన తృప్తి కలుగుతుంది. -
అచ్చం జియోనే: ఎయిర్టెల్ కొత్త ఆఫర్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు ఓ సరికొత్త స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ అచ్చం రిలయన్స్ జియో ప్లాన్ రూ.399 మాదిరిగానే ఉంది. ఎయిర్టెల్ నేడు ప్రకటించిన స్పెషల్ ఆఫర్ కింద రూ.399కు రోజుకు 1జీబీ డేటాను 84 రోజుల పాటు తన ప్రీపెయిడ్ యూజర్లకు అందించనున్నట్టు తెలిపింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ప్రకారం ఈ ఆఫర్ కేవలం 4జీ సిమ్‌తో 4జీ హ్యాండ్సెట్ వాడేవారికేనని తెలిసింది. ఈ ఆఫర్‌ను ఓ స్పెషల్ కోసం, కమర్షియల్ లేదా ఎంటర్ప్రైజ్ ఉద్దేశ్యాన్న అందుబాటులో ఉంచడం లేదని, ఏ ఇతర ప్లాన్‌తో దీన్ని కలుపవద్దని ఎయిర్టెల్ పేర్కొంది. డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం కలిగి ఉంది. అంతేకాక మరో ప్లాన్‌ను కూడా ఎయిర్టెల్ ఆఫర్చేస్తోంది. రూ.244తో రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కింద కేవలం ఎయిర్టెల్ నెట్వర్క్ కస్టమర్లకు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయముంటుంది. టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోకి కౌంటర్ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజాలు ప్లాన్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్ వంటి సంస్థలు తమ యూజర్లను కాపాడుకోవడానికి కొత్త ప్రకటిస్తూనే ఉన్నాయి. జియో తెరతీసిన ధరల యుద్ధంలో టెలికాం కంపెనీలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, ఐడియా కంపెనీలు భారీగా కుదేలవుతున్నాయి. కాగ, గత నెలలో జీరోకే జియో ఫోన్‌ను లాంచ్ చేసి, మరింత పోటీ వాతావరణానికి జియో తెరతీసింది. -
బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్
అనంతపురం రూరల్: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఐటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు అన్లిమిటెడ్ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు. స్పెషల్ టారిఫ్ వోచర్ రూ.333తో రీచార్జ్ చేసుకునే కొత్త కష్టమర్లతో పాటు, పాత కష్టమర్లకు సైతం నేటి నుంచి మూడు రోజుల పాటు అన్లిమిటెడ్ డేటా ఆఫర్ ఉంటుందన్నారు. అనంతరం రోజుకు 3 జీబీ డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని చెప్పారు. -
కాగ్నిజెంట్‌లో స్వచ్ఛంద విరమణ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే కొందరు పైస్థాయి ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం హోదాను బట్టి ‘వాలంటరీ సెపరేషన్ ఇన్సెంటివ్’ కింద తొమ్మిది నెలల దాకా జీతాన్ని పరిహారంగా చెల్లించనుంది. సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు ఆరు నెలలు, డైరెక్టర్స్ తొమ్మిది నెలల జీతం పరిహారంగా పుచ్చుకుని కంపెనీ నుంచి తప్పుకునే ఆప్షన్ ఇచ్చింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంచి డైరెక్టర్ స్థాయి దాకా ఉన్న మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు ఈ స్వచ్ఛంద ఆఫర్ ఇస్తున్నట్లు, అర్హతను బట్టి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని కాగ్నిజెంట్ ప్రతినిధి తెలిపారు. ఎంత మంది ఉద్యోగులకు ఇది వర్తించవచ్చు, ఆఫర్ వివరాలు మొదలైనవి వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. స్వచ్ఛందంగా వైదొలగాలనుకుంటున్న ఎగ్జిక్యూటివ్స్ మే 12లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని, తదుపరి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగ్నిజెంట్‌లోని సుమారు 2.6 లక్షల మంది ఉద్యోగుల్లో సింహభాగం భారత్‌లోనే ఉన్నారు. అత్యుత్తమ ఆర్థిక పనితీరుతో ముందుకెళ్లిన సంస్థ వృద్ధి గత కొన్నాళ్లుగా మందగిస్తోంది. గత సంవత్సరం వృద్ధి అంచనాలను మూడు సార్లు సవరించిన కాగ్నిజెంట్ ఆదాయాలు 8.6 శాతం వృద్ధితో 13.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, 2017 సంవత్సరానికి గాను ఆదాయం 14.5–14.84 బిలియన్ డాలర్లుగా ఉండగలదని కాగ్నిజెంట్ గైడెన్స్ ఇచ్చింది. జనరల్ మోటార్స్‌లోనూ..: మరోవైపు జనరల్ మోటార్స్ ఇండియా సైతం హలోల్ ప్లాంట్‌లోని ఉద్యోగులకు తాజాగా మళ్లీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆఫర్ పరిశీలిస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేయడం దీనికి కారణం. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్
డాబాగార్డెన్స్: బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తతం చేయనున్నట్టు సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ నళినీ వర్మ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు టెండర్ల స్టేజీలో ఉందని ఆమె వెల్లడించారు. సరికొత్త ల్యాండ్‌లైన్ ప్లాన్‌తో పాటు కొత్త ల్యాండ్ లైన్ కనెక్షన్‌కు సంబంధించి ఆమె మంగళవారం డాబాగార్డెన్స్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. కొత్త ప్లాన్‌కింద కేవలం రూ.49లకే కొత్త ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఉచిత బీఎస్ఎన్ఎల్ సిమ్ అందిస్తున్నట్టు చెప్పారు. టెలిఫోన్‌కు మాత్రం రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్లాన్‌లో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఉచిత నైట్‌కాలింగ్ సదుపాయం ఉంటుందని, ఆదివారాల్లో కూడా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 90 రోజుల వరకు మాత్రమే ఉంటుందని వివరించారు. రూ.470లకే రెంట్ ఫ్రీల్యాండ్లైన్, ఫ్రీ నైట్ కాలింగ్(అన్ని నెట్‌వర్క్‌లకు) రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటలకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఆదివారం అపరిమిత ఉచిత కాలింగ్, సెక్యూరిటీ డిపాజిట్ రద్దు, ఉచిత ఇన్స్టాలేషన్, బంధం స్కీం ద్వారా రోజూ ల్యాండ్‌లైన్‌కు 20 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలకు సమీపబీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో, లేదా టోల్‌ఫ్రీ నెంబరు 18003451500 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు టాటా మోటార్స్ ఆఫర్..
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ పేరుతో టాటా మోటార్స్ ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగ వర్గంలో కస్టమర్ బేస్ పెంపు లక్ష్యంగా ఈ సంస్థ ఈ ఆఫర్‌ను రూపొందించింది. టాటా మోటార్స్ పాసింజర్ కార్ల కొనుగోలుకు సంబంధించి అదనపు నగదు రాయితీలు, వారెంటీ కాలం పొడిగింపు, మెయిన్టినెన్స్, యాక్ససరీస్ ప్యాకేజ్ వంటి పలు ప్రయోజనాలకు కల్పించడం ఈ ఆఫర్ ఉద్దేశం. ఈ పథకం కింద టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఫైనాన్స్ సదుపాయం పొందడానికి కూడా వీలుంటుంది. ఈ ఆఫర్ కంపెనీని కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందన్న విశ్వాసాన్ని పాసింజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ పేర్కొన్నారు. అయితే ఈ ఆఫర్ తాజాగా ఆవిష్కరించిన టాటా టియాగోకు వర్తించదు. -
రూ. 511 నుంచే విమాన టికెట్లు!
రిటర్న్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించడంతో స్పైస్ జెట్ కూడా మళ్లీ ఆఫర్ల వ్యవహారంలోకి దిగింది. తన 11వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల సేల్ ప్రకటించింది. స్వదేశీ విమాన టికెట్లను రూ. 511 నుంచి (బేస్ఫేర్ మాత్రమే), విదేశాలకు వెళ్లే విమానాల్లో టికెట్లను రూ. 2,111 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బుకింగ్స్ మంగళవారం నుంచి మొదలై గురువారం (మే 19) వరకు ఉంటాయి. ఆరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ ప్రకటించింది. అలా బుక్ చేసుకున్న టికెట్లతో స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగాను, విదేశీ ప్రయాణాలు అయితే జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. కేవలం స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. అయితే, ఈ ఆఫర్లో టికెట్లు పరిమితంగా ఉన్నాయని, అందువల్ల ముందు వచ్చినవాళ్లకు ముందు అనే పద్ధతిలోనే వీటిని కేటాయిస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. -
ఎయిర్ఏషియా ప్రత్యేక ఆఫర్
బెంగళూరు: ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్ఏషియా ఇప్పటి వ రకూ 2.5 మిలియన్ల ప్రయాణికులను చేరవేసినట్లు సంస్థ ఉన్నతాధికారి అమర్ అబ్రోల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎయిర్ఏషియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కౌలాలంపూర్ , బ్యాంకాక్, బాలి, ఫుకెట్, సింగపూర్, మెల్బోర్న్, అక్లాండ్ వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి తిరుగు ప్రయాణంలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ పేర్కొంది. టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ నెల 18 చివరి తేదీ కాగా, ఆగస్టు 1 నుంచి నవంబరు 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
ఎయిర్టెల్ మొబైల్ డేటా బ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీనికింద.. కస్టమర్లు రాత్రి వేళ ఉపయోగించే మొబైల్ డేటాలో సగభాగాన్ని మర్నాడు వారి ఖాతాకే తిరిగి క్రెడిట్ చేయనుంది. అలాగే, తమ మొబైల్ యాప్ వింక్‌పై నెలకు అయిదు సినిమాలు, అపరిమితంగా పాటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెస్తోంది. దీనికి డేటా చార్జీలు వర్తిస్తాయి. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రకటించిన డేటా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వారం రోజుల్లో పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు కూడా వర్తింపచేయనున్నట్లు డెరైక్టర్ (కన్జూమర్ బిజినెస్ విభాగం) శ్రీని గోపాలన్ తెలిపారు. రాత్రి 12 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య వినియోగించే డేటాలో 50% పరిమాణాన్ని ప్రతిరోజూ కస్టమర్ల ఖాతాలో తిరిగి జమ చేయనున్నట్లు వివరించారు.