Actress Sree Leela In Talks For Allu Arjun Pushpa 2 Item Song, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Offer To Sreeleela: ఈ స్పెషల్‌ ఆఫర్‌కు శ్రీలీల ఓకే చెబుతుందా..?

Published Mon, Jul 31 2023 5:54 AM | Last Updated on Mon, Jul 31 2023 11:27 AM

Actress Sree Leela in talks for Pushpa 2 item song - Sakshi

యంగ్‌ బ్యూటీ శ్రీలీలకు ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో యాక్ట్‌ చేసే ఓ స్పెషల్‌ ఆఫర్‌ వచ్చిందట. కథ రీత్యా ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌కు స్కోప్‌ ఉందట. ఈ పాటలో శ్రీలీల అయితే బాగుంటుందని సుకుమార్‌ అండ్‌ కో ఆమెనును సంప్రదించారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. మరి.. ఈ స్పెషల్‌ ఆఫర్‌కు శ్రీలీల ఊ అంటారా..? ఊహూ అంటారా? అనేది తెలియాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు.

ఇక ‘పుష్ప’ చిత్రం తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్‌’ లోని స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊహూ అంటావా మావ..’ పాటకు సమంత అదిరిపోయే స్టెప్పులు వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.  హీరో అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప:ది రూల్‌’ను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్  ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ . ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement