
సమ్మర్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ మాదిరిగానే రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వండర్‌లా ఒక ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే. ఇందులో భాగంగానే ఆ రోజు ఒక టికెట్ కొంటె మరో టికెట్ ఉచితంగా పొందవచ్చు.
వండర్‌లా ఎంట్రీ టికెట్ జిఎస్‌టితో కలిపి రూ. 999. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ధరకు మహిళలు రెండు టికెట్స్ పొందవచ్చు. మహిళలు సరదాగా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికి ఈ రోజులలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మార్చి 8న 10 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులను అనుమతించరు.
మార్చి 8న సరదాగా గడపాలనుకునే మహిళలు ఈ ఆఫర్‌తో ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ రుగు పురుషులు బుక్ చేసుకుంటే అనుమతించబడదు. బుక్ చేసుకున్న ఏ టికెట్ అయినా రద్దు చేస్తారు. వండర్‌లా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరిస్తుంది.
పరిశుభ్రత, భద్రతలను దృష్టిలో ఉంచుకుని అతిథులు రైడ్‌లు, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలలో భౌతిక దూరాలు వంటివి పాటించాల్సిన అవసరం ఉంది. వండర్లాలోని మొత్తం సిబ్బంది మాస్క్‌లు ధరించడం తప్పనిసరి, అన్ని రైడ్‌లు, రెస్టారెంట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్‌లు అందించబడుతుంది. మొత్తానికి సమ్మర్ సీజన్‌లో మహిళలు ఎంజాయ్ చేయడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది.