
సాక్షి, హైదరాబాద్: ఉగాది సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగ నేపథ్యంలో మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగిస్తున్నట్లు మైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది.
కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్‌లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు.
మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది.