Hyderabad Metro Rail
-
రెండో దశ మెట్రోకు లైన్ క్లియర్
-
మెట్రో రెండో దశ పనులకు గ్రీన్‌సిగ్నల్.. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరుగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లుగా ఉండనుంది.హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ పనులు జరుగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా(30 శాతం) రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా(18 శాతం) రూ.4,230 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే, అప్పుగా రూ.11,693 కోట్లు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్లు(52 శాతం నిధులు) సేకరించనున్నారు.కారిడార్లు ఇలా.. కారిడార్-4లో నాగోల్-శంషాబాద్(36.8 కి.మీ)కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట. కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయాణగుట్ట. కారిడార్-7లోమియాపూర్-పటాన్చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ.(40 కిలోమీటర్లు). -
కేంద్రం అనుమతిస్తేనే.. మెట్రో రెండో దశకు కదలిక
హైదరాబాద్ మెట్రో రెండో దశకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం అనుమతి తప్పనిసరిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆమోదం కీలకంగా మారింది. మొదటి దశ ప్రాజెక్టు అనంతరం రెండో దశకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ.. ఇప్పటికే తీవ్ర జాప్యం నెలకొంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాప్యం కారణంగా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. నగరంలో రెండోదశ ఏడెనిమిదేళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం గమనార్హం. కేబినెట్ ఆమోదంతో ఒక అడుగు ముందుకు పడింది కానీ ఇప్పుడు కేంద్రం అనుమతితో పాటు నిధుల కేటాయింపే కీలకంగా మారింది. 2029 నాటికి పూర్తయ్యే అవకాశం.. భాగ్య నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ అనివార్యంగా మారింది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు తీస్తోంది. నిత్యం సుమారు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే 8 లక్షల మంది మెట్రోల్లో పయనించే అవకాశం ఉంది. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చేపట్టిన మెట్రో మొదటి దశ నిర్మాణానికి రూ.22 వేల కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రస్తుత రెండో దశకు రూ.24, 269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌ను రూపొందించింది. 5 కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్రం సకాలంలో అనుమతించి నిధులు కేటాయిస్తే 2029 నాటికి రెండో దశ పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం జరిగితే ఈప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆమోదంతో పాటు నిధుల కేటాయింపు తప్పనిసరి.9వ స్థానానికి.. మెట్రో రెండో దశలో ఆలస్యం కారణంగా ఢిల్లీ తర్వాత రెండో స్థాననంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయినట్లు రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్‌ను అధిగమించాయి. రెండో దశ నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాల్సిన ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గం నిలిచిపోయింది. ప్రస్తుతం దాన్ని రెండో దశలో కలిపి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా భావించి కార్యాచరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24.269 కోట్లలో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు.5 కారిడార్లలో రెండో దశ..నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ) రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ (11.6 కి.మీ) ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ) మియాపూర్–పటాన్చెరు (13.4కి.మీ) ఎల్బీనగర్–హయత్ నగర్ (7.1 కి.మీ.) -
మెట్రో రైలు రెండో దశపై మరో అడుగు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు రెండో దశపై మరో అడుగు పడింది. దీనికి శనివారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఇక కేంద్రం నుంచి అనుమతి లభించడమే తరువాయి కానుంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును ఆమోదించి నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.24 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్రాల అనుమతితో పాటు సకాలంలో నిధులు లభిస్తే నిర్ణీత గడువులోగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టనుందని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీతో కలిపి మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మెట్రో రెండో దశకు ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌ను రూపొందించి ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే.భూగర్భంలో మెట్రో రైలునాగోలు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి జాతీయ హైవే మార్గంలో సాగుతుంది. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లు ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టుస్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. అలాగే రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు కొత్తగా నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు (బ్లూ లైన్ పొడిగింపుగా) ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో సుమారు 8 స్టేషన్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.పాతబస్తీ మెట్రో చాంద్రాయణగుట్ట వరకు....జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్‌లైన్ పొడిగింపుగా ఆరో కారిడార్‌ను విస్తరించనున్నారు. గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు ఉంటుంది. -
మెట్రో రెండో దశకు మోక్షమెలా?
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, మెట్రో రెండో దశ ప్రాజెక్టులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సేకరణ సవాల్‌గా మారింది. రూ.వేల కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, జైకా వంటి సంస్థల నుంచి రుణాలు అందాలి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫోర్త్‌సిటీ, హయత్‌నగర్ తదితర 5 కారిడార్లలో మెట్రో రెండో దశ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇటీవల డీపీఆర్‌ను వెల్లడించింది. దాదాపు రూ.24,237 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి లభించే ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కొద్ది నెలల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రెండోదశ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయించనుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గడువులోగా పూర్తయ్యేనా? 👉 ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో కొత్తగా మరో 5 మార్గాల్లో మెట్రో విస్తరించనున్నారు. మొదట ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు పూర్తి చేయాలనేది లక్ష్యం. దశలవారీగా 2029 నాటికి అన్ని కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ లక్ష్యానికి అనుగుణంగా నిధులు లభించడమే ప్రధానం. నిధుల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 👉 ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 15 శాతం (రూ.3,635 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం (రూ.9,210 కోట్లు) చొప్పున నిధులు కేటాయించాలి. మిగతా 50 శాతం నిధుల్లో 45 శాతం వరకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించారు. 5 శాతం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిధులు సేకరించనున్నారు. ఇప్పటికే మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం జైకా వంటి సంస్థలతో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. మరికొన్ని బ్యాంకుల నుంచి కూడా రుణాల సేకరణపై దృష్టి సారించినట్లు అధికారులు చెప్పారు. సకాలంలో బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు లభిస్తేనే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని ఒక అధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పుడు మెట్రో రెండో దశ నిధుల సేకరణే సవాల్‌గా మారింది.పెరిగిన రూట్ కిలోమీటర్లు.. 👉రెండో దశ మెట్రో ప్రాజెక్టును మొదట 78 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. కానీ.. రెండు, మూడు దఫాలుగా ప్రాజెక్టును వివిధ మార్గాల్లో పొడిగించారు. దీంతో ప్రస్తుతం ఇది 116.2 కిలోమీటర్లతో అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి పీ–7 రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన రూట్‌ను తాజాగా మార్చారు. ఆరాంఘర్ నుంచి కొత్త హైకోర్టు మీదుగా మళ్లించారు. రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మొదట ప్రతిపాదించిన రూట్‌ను సైతం ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ వరకు పొడిగించడంతో రెండో దశ రూట్ కిలోమీటర్లు పెరిగాయి. కొత్తగా ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని కూడా ఈ రెండో దశలోనే ప్రతిపాదించారు. 👉 ఓల్డ్‌సిటీ రూట్లో మొదట ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించగా.. దాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇలా అన్ని వైపులా అదనంగా పొడిగించడంతో రెండో దశ పరిధి బాగా విస్తరించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిపాదిత ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కొత్త లైన్ కోసం రూ.8000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఈ లైన్ మినహాయించి మిగతా లైన్లకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. రెండో దశ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 24,237 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫోర్త్‌సిటీతో కలిపితే ఇది రూ.32,237 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం 5 రూట్లకే డీపీఆర్ పూర్తయిన దృష్ట్యా ఈ మార్గాల్లో మెట్రో రెండో దశ చేపట్టాల్సి ఉంది. -
HYD: మియాపూర్‌లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
అటెన్షన్ ప్లీజ్.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ముఖ్యగమనిక
హైదరాబాద్, సాక్షి: పండుగ వేళ ప్రయాణికులకు తీపివార్త చెబుతుందనుకున్న హైదరాబాద్ మెట్రో యాజమాన్యం.. షాకిచ్చింది. అయితే అది టికెట్ ఛార్జీల విషయంలో కాదు. మెట్రో ద్వారా దూర ప్రయాణం చేస్తూ వందల మందికి ఊరట ఇస్తున్న పార్కింగ్ విషయంలో..నగరంలో నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లు కీలక గమ్యస్థానాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు స్టేషన్లో ఇక ఫ్రీ పార్కింగ్ కనిపించదు. ఈ మేరకు మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నాగోలు, మియాపూర్ స్టేషన్లలో పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయనున్నారు. టూ వీలర్‌కు, ఫోర్ వీలర్‌కు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించనున్నారు. అయితే ఈ ఫీజు నామమాత్రంగానే ఉంటుందని, ప్రయాణికుల వాహనాల భద్రత కోసమే వసూలు చేస్తున్నట్లు చెబుతోంది. హైదరాబాద్‌లో చాలా మెట్రో స్టేషన్లకు పార్కింగ్ సమస్య ఉంది. అయితే కొన్ని స్టేషన్ల వద్ద ఆ సదుపాయం ఉండగా.. పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. -
116 కి.మీ. 80స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమరి్పంచనున్నట్లు తెలిపారు.ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ డీపీఆర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్ మెట్రో భవన్లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ట్రాఫిక్ అధ్యయనం ‘రెండోదశకు సంబంధించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోప్రస్తుతం ట్రాఫిక్ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్పోర్ట్ రూట్‌కు సంబంధించి అలైన్మెంట్లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..’అని ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భూగర్భంలో మెట్రో రైల్ నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్పోర్ట్ స్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు కొత్తగా లైన్ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.⇒ ఆరో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్íÙఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు. రోడ్ల విస్తరణ ⇒ ప్రస్తుతం దారుల్íÙఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి. ⇒ ఏడవ కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించనున్నారు. మియాపూర్ నుంచి ఆలి్వన్ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ⇒ ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న 8వ కారిడార్ 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. 9వ కారిడార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. ⇒ రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)కారిడార్ – 4 నాగోల్ – ఎయిర్పోర్ట్ 36.6కారిడార్ – 5 రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ 11.6కారిడార్ – 6 ఎంజీబీఎస్ –చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5కారిడార్ – 7 మియాపూర్ – పటాన్చెరు 13.4కారిడార్ – 8 ఎల్బీనగర్–హయత్ నగర్ 7.1కారిడార్ – 9 ఎయిర్పోర్ట్– ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) 40 -
హైదరాబాద్ మెట్రో X అకౌంట్ హ్యాక్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ఎలాంటి లింకులపై క్లిక్ చేయొద్దని.. తమ ఎక్స్ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.⚠️ Important Notice: Our official Twitter/X account (@ltmhyd) has been hacked. Please avoid clicking any links or engaging with posts until further notice. We're working on it and will update you soon. Stay safe! #landtmetro #metroride #mycitymymetromypride #hyderabadmetro… pic.twitter.com/NiNyNNlN1M— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 19, 2024 -
మ్యూజిక్ ఫ్రెండ్లీ.. మెట్రో మెడ్లీ..
ప్రపంచ సంగీత దినోత్సవంలో భాగంగా మెట్రో స్టేషన్లు సంగీత ప్రదర్శనలకు వేదికలుగా మారనున్నాయి. ప్రయాణాలను ఆహ్లాదకరమైన అనుభవాలుగా మారుస్తూ... బుధవారం నుంచి శనివారం వరకూ విభిన్న సంగీత ప్రదర్శనలతో ప్రయాణికులను ఆకట్టుకోనుంది. ‘మెట్రో మెడ్లీ’ పేరిట గోథే–జెంత్రమ్ సహకారంతో మ్యూజికల్ ఫెస్ట్ బస్కింగ్ ఫార్మాట్లో ఉంటుంది. దీని కోసం 200 మంది ఔత్సాహిక సంగీతకారుల నుంచి అనుభవజు్ఞలైన నిపుణుల వరకూ 20 గ్రూపులుగా విభజించారు. ఈ కళాకారులు జాజ్ క్లాసికల్ నుండి బాలీవుడ్ హిట్ల వరకూ విభిన్న రకాల సంగీత శైలులను ప్రదర్శిస్తారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, పరేడ్ గ్రౌండ్, ఎంజిబిఎస్, ఉప్పల్ సహా ఏడు మెట్రో స్టేషన్లను ఎంపికచేశారు. సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఔత్సాహిక సంగీత కళాకారులకు బహిరంగ వేదికలను అందించడమే ఈ ప్రదర్శనల లక్ష్యం. -
ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉందిప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది. -
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ అధ్యక్షుడు, శాశ్వత డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజూ సుమారు 4.80 లక్షల మంది మెట్రో ప్రయాణికులు ఉన్న ట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహి ళా ప్రయాణికులు బాగా తగ్గారని వివరించారు. ప్రయాణికులు పెర గకపోవడం వల్ల వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లు ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నష్టాల వల్ల 2026 నాటికి హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగాలని భావి స్తున్నట్లు ఆయన వెల్లడించారు.పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్ట్ ను నిర్మించడం తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థకు 64 ఏళ్ల పాటు మె ట్రోలో భాగస్వామ్యం ఉంటుంది. అయినప్పటికీ మహాలక్ష్మి పథకం వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు మెట్రో నుంచి తప్పుకో వాలని భావించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్‌రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్, జూబ్లీ బస్‌స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
నాగోల్‌లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్‌లో కొత్తగా ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్‌కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్‌ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్‌పేట కారిడార్‌లో నాగోల్‌కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్‌మెంట్‌పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్‌ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్‌రింగ్‌రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్‌ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్‌పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్‌పాస్‌తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్‌కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్‌పేట మీదుగా ఎల్బీ నగర్‌కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. ♦ బైరామల్‌గూడ, సాగర్‌రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్‌మెంట్‌ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగ నేపథ్యంలో మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగిస్తున్నట్లు మైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది. కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది. -
#HYD Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులపై అదనంగా భారం పడనుంది. కాగా, హైదరాబాద్‌వాసులకు మెట్రో రైలు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అధికారులు షాకిచ్చారు. BREAKING: #Hyderabad Metro Rail officials took a crucial decision due to the increase in traffic. 10% discount on metro card along with Rs.59 holiday card has been cancelled. On the other hand, the demand for metro travel has increased with the intensity of the summer. — Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) April 7, 2024 మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్‌ను పూర్తిగా రద్దుచేశారు. తాజాగా మరోసారి అదేవిధానాన్ని అమలుచేస్తున్నారు. -
మెట్రో కొత్త లైన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
-
మెట్రో, ఫార్మాసిటీపై కీలక ప్రకటన..!
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
-
Hyderabad: నేడు అర్ధరాత్రి వరకు మెట్రో
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వివిధ కారిడార్లలో ఆఖరి సర్విసు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున ఒంటిగంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే నగరవాసులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మద్యం సేవించి మెట్రో రైళ్లలో, స్టేషన్లలో ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులతో పాటు,మెట్రో సెక్యూరిటీ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారని చెప్పారు. మెట్రో రైళ్ల నిర్వహణకు ప్రయాణికులు సహకరించాలని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి కోరారు. -
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ హంగామా
సాక్షి, హైదరాబాద్: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై హంగామా సృష్టించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొందనే మెట్రో రైలులో హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారికి మెట్రో ప్రయాణీకులే షాకిచ్చారు. సీబీఎన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్న ఓ మధ్య వయస్కుడు మాట్లాడుతూ... ‘ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఏం చేయాలో అది చేయండి. అంతేకానీ ఊరికే అరచి ఏం ఉపయోగం’’ అని ప్రశ్నించడంతో వారు ఖంగు తిన్నారు. అయితే టీడీపీ వర్గం వారు అక్కడితో ఆగిపోలేదు.. ‘‘ఏం చేయమంటారు’’ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి కూడా అతడు ఓపికగా బదులిచ్చాడు. ‘‘న్యాయపోరాటం ఒకటి నడుస్తోంది కదా...’’ అని సమాధానమిచ్చారు. టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొంతమంది మియాపూర్నుం నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైలులో ప్రయాణిఒంచారు. దారిపొడవునా నినాదాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించాలన్నది వారి ఉద్దేశం. మియాపూర్‌లో మెట్రోరైలు ఎక్కే సమయంలోనూ టీడీపీ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అందరినీ ఒకేసారి వదలడం లేదంటూ పేచీ పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలను మాత్రమే లోనికి వదిలే క్రమంలో ఇతరులు పలువురు ఇబ్బందులకు గురయ్యారు. మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు మెట్ల వద్ద ఉన్న డోర్‌ను కాసేపు క్లోజ్ చేయడంతో.. చిన్నపిల్లలతో అరగంటపాటు మహిళలు, ఇతర ప్రయాణికులు మెట్లపై నిల్చునున్నారు. దీంతో అసహనానికి గురైన కొందరు మహిళా ప్రయాణికులు ఇదేంటి అంటూ పోలీసులను నిలదీశారు. ఇక ప్లకార్డులతో మెట్రో కింద ఫోటోలకు ఫోజులిచ్చిన కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ‘Let’s Metro for CBN’ protest by travelling from Miyapur-LB Nagar was held in #Hyderabad metro by supporters of Chandrababu Naidu, by wearing black t-shirts. Police and passengers stopped them from causing inconvenience to public pic.twitter.com/KxIx0vTKN6 — Naveena (@TheNaveena) October 14, 2023 -
మెట్రో మూడో దశ రయ్ రయ్
హైదరాబాద్: మెట్రో రైల్ మూడో దశ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగరానికి నలువైపులా, ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో నిర్మించనున్న మెట్రో మూడో దశపైన ప్రాథమిక, సవివర నివేదికల కోసం శనివారం కన్సల్టెన్సీలను నియమించారు. సాంకేతికంగా అత్యధిక మార్కులు పొందిన ఆర్వీ అసోసియేట్స్‌కు 2 ప్యాకేజీలను అప్పగించగా, ఆ తర్వాత స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థకు మరో రెండు ప్యాకేజీలను అప్పగించినట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ● గత నెలలో కన్సల్టెన్సీల నియామకానికి టెండర్లను ఆహ్వానించగా 5 సంస్థలు బిడ్లను సమర్పించాయి. వీటిలో ఆర్వీ అసోసియేట్స్, సిస్ట్రా, యూఎంటీసీ, రైట్స్ అనే 4 సంస్థలు సాంకేతిక అర్హతను సాధించాయి. అనంతరం ఈ నాలుగింటి ఆర్థిక బిడ్లను ఆగస్టు 30న మెట్రో రైల్ భవన్లో తెరిచారు. ఆర్వీ అసోసియేట్స్ సాంకేతికంగానే కాకుండా తక్కువ ఆర్థిక బిడ్లను సమర్పించి ముందంజలో ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన రెండు ప్యాకేజీలను అతితక్కువ ఆర్థిక బిడ్‌తో పాటు సాంకేతిక అర్హత పొందిన సిస్ట్రా సంస్థకు ఇచ్చినట్లు చెప్పారు. ● ఈ రెండు కన్సల్టెన్సీ సంస్థలు వచ్చే రెండు నెలల్లో ట్రాఫిక్ సర్వేలు, రవాణా రద్దీ అంచనాలు, ట్రాఫిక్ అంచనాలు, పలు రకాల రవాణా వ్యవస్థల విశ్లేషణ వంటి వివిధ అధ్యయనాలు పూర్తి చేసి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ నివేదిక (పీపీఆర్)లను సమర్పించాలి. ఆ తర్వాత మూడు నెలల్లో మెట్రో రైలు అలైన్‌న్‌మెంట్, వయాడక్ట్/భూ ఉపరితల మార్గం/భూగర్భ మార్గం వంటి ఆప్షన్లు, స్టేషన్లు, డిపోలు, రైల్వే విద్యుత్ ఏర్పాట్లు, సిగ్నలింగ్, రైల్వే సమాచార వ్యవస్థ, రైలు బోగీలు, పర్యావరణం,సామాజిక ప్రభావం, ఆదాయ వ్యయ అంచనా, చార్జీల పట్టిక , ప్రాజెక్టు అమలు విధానం వంటి విషయాలపై సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్)లను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కన్సల్టెన్సీ సంస్థలను వివిధ కారిడార్లలో సత్వరమే సర్వే పనులను ప్రారంభించాలని నిర్దేశించినట్లుగా ఎండీ తెలిపారు. నగరానికి నలువైపులా.. నగరానికి నలువైపులా నిర్మించతలపెట్టిన మెట్రో మూడో దశలో మొత్తం 12 కారిడార్లలో 278 కిలోమీటర్లలో మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్టీఎస్) అందుబాటులోకి రానుంది. భారీ నిధులతో చేపట్టనున్న మెట్రో మూడోదశ ప్రాజెక్టు నిర్మాణంలో టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ సంస్థలు, విభాగాల భాగస్వామ్యం కూడా ఉంది. ఈ ప్రాజెక్టులో 8 కారిడార్లలో మెట్రో విస్తరణ చేపట్టనుండగా, ఔటర్ మార్గంలోని మరో 4 కారిడార్లలో కొత్తగా నిర్మించనున్నారు. మూడో దశ మెట్రోను మొత్తం 4 ప్యాకేజీలుగా నిర్మించేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రణాళికలను సిద్ధం చేసింది. నాలుగు ప్యాకేజీలుగా మెట్రో నిర్మాణం.. 1) మొదటి ప్యాకేజీలో బీహెచ్ఈఎల్–పటాన్చెరు–ఓఆర్ఆర్–ఇస్నాపూర్ (13కి.మీ), ఎల్బీనగర్– హయత్‌నగర్– పెద్దఅంబర్‌పేట్ (13 కి.మీ), ఓఆర్ఆర్ పటాన్చెరు ఇంటర్చేంజ్–కోకాపేట్–నార్సింగ్ ఇంటర్చేంజ్ (22 కి.మీ) 2) రెండో ప్యాకేజీలో శంషాబాద్ జంక్షన్ మెట్రో స్టేషన్– కొత్తూరు–షాద్‌నగర్ (28కి.మీ), శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ స్టేషన్– తుక్కుగూడ ఓఆర్ఆర్– మహేశ్వరం ఎక్స్‌రోడ్–ఫార్మాసిటీ (26 కి.మీ.) శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్– తుక్కుగూడ–బొంగుళూరు–పెద్ద అంబర్పేట్ ఇంటర్చేంజ్ (40 కి.మీ) 3) మూడో ప్యాకేజీలో ఉప్పల్ క్రాస్‌రోడ్–ఘట్కేసర్ ఓఆర్ఆర్–బీబీనగర్ (25 కి.మీ.), తార్నాక ఎక్స్‌రోడ్– ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ (8 కి.మీ), ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట్ ఇంటర్చేంజ్– ఘట్కేసర్– శామీర్‌పేట్– మేడ్చల్ ఇంటర్చేంజ్ (45 కి.మీ) 4) నాలుగో ప్యాకేజీలో జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ లేదా మెట్రో రైల్, ప్యారడైజ్– కండ్లకోయ డబుల్ ఎలివేటెడ్ / మెట్రో (12 కి.మీ), ఓఆర్ఆర్ మేడ్చల్ ఇంటర్చేంజ్–దుండిగల్–పటాన్చెరు ఇంటర్చేంజ్ (29 కి.మీ) -
పాతబస్తీ మెట్రో మార్గంపై డ్రోన్ సర్వే
హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్ మెట్రో రైల్ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఆదివారం డ్రోన్ సర్వే చేపట్టింది. మెట్రో అలైన్మెంట్లో భాగంగా పలు చోట్ల రోడ్డు విస్తరణ చేపట్టవలసి ఉంటుంది. ఈ క్రమంలో మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్ నిరి్మంచేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు సాధారణ సర్వేతో పాటు, ఈ డ్రోన్ సర్వేను ప్రారంభించారు. డ్రోన్ నుంచి సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలు, రియల్ టైమ్ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయా కట్టడాల కొలతలను కచి్చతంగా అంచనా వేయనున్నారు. దారుల్ఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు ఉన్న 103 కట్టడాల పరిరక్షణ కోసం ఈ డ్రోన్ సర్వే దోహదం చేయనుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పులు,తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. మతపరమైన/సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారు.నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. త్వరలో భూసామర్ధ్య పరీక్షలు.... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభించనున్నట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా నుంచి ఈ పరీక్షలను ప్రారంభించనున్నారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ఈ మార్గంలో పనులను ప్రారంభించింది. ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చారి్మనార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐదు స్టేషన్లు... ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి నుంచి దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి.ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని పేర్కొన్నారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు. 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక, మెట్రో రైల్ భవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: లోక్‌సభలో బండి సంజయ్ భావోద్వేగ కామెంట్స్ -
లేటెస్ట్ రికార్డ్ - హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులు ఎన్ని లక్షలంటే?
హైదరాబాద్, 4 జూలై, 2023: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) 3 జూలై 2023, సోమవారం నాడు 5.10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ రికార్డు సంఖ్య పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన, అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం, ఆమోదాన్ని సూచిస్తుంది. ఈ మైలురాయిని సాధించినందుకు హెచ్ఎమ్ఆర్ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపిన.. L&TMRHL, MD & CEO, శ్రీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ఇది నిజంగా ఒక ముఖ్యమైన సందర్భం, మా విలువైన ప్రయాణికులకు మేము ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) కొవిడ్-19 సమయంలో ప్రయాణికుల సంఖ్య కొంత మందగించినా.. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి నిరంతర సహకారం, మద్దతు వల్ల నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడం మాకు సాధ్యపడిందని అన్నారు.