ఉచిత బస్సు ప్రయాణంతో నష్టాలు
2026 నాటికి వైదొలుగుతాం
ఎల్ అండ్ టీ మెట్రో డైరెక్టర్ శంకర్ రామన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ అధ్యక్షుడు, శాశ్వత డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజూ సుమారు 4.80 లక్షల మంది మెట్రో ప్రయాణికులు ఉన్న ట్లు పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహి ళా ప్రయాణికులు బాగా తగ్గారని వివరించారు. ప్రయాణికులు పెర గకపోవడం వల్ల వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లు ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నష్టాల వల్ల 2026 నాటికి హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగాలని భావి స్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్ట్ ను నిర్మించడం తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థకు 64 ఏళ్ల పాటు మె ట్రోలో భాగస్వామ్యం ఉంటుంది. అయినప్పటికీ మహాలక్ష్మి పథకం వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు మెట్రో నుంచి తప్పుకో వాలని భావించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment