Free bus travel
-
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ అధ్యక్షుడు, శాశ్వత డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజూ సుమారు 4.80 లక్షల మంది మెట్రో ప్రయాణికులు ఉన్న ట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహి ళా ప్రయాణికులు బాగా తగ్గారని వివరించారు. ప్రయాణికులు పెర గకపోవడం వల్ల వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లు ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నష్టాల వల్ల 2026 నాటికి హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగాలని భావి స్తున్నట్లు ఆయన వెల్లడించారు.పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్ట్ ను నిర్మించడం తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థకు 64 ఏళ్ల పాటు మె ట్రోలో భాగస్వామ్యం ఉంటుంది. అయినప్పటికీ మహాలక్ష్మి పథకం వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు మెట్రో నుంచి తప్పుకో వాలని భావించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. -
ఉచిత ప్రయాణంపై పిల్.. ప్రయోజనం లేదన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్ దాఖలు చేసిన పిటీషన్లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్: జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన వస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసిన 70శాతం వరకు మహిళలే కనిపిస్తున్నారు. పలు రూట్లలో బస్ సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వెల్లువెత్తుతున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా భద్రాచలంలో ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. క్రిస్మస్ పండగ కావడంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు. ఈ క్రమంలో సీటులో కూర్చునే విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. చివరికి మిగిలిన మహిళలు సర్ధిచెప్పడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఏదో విషయంలో గొడవ పడిన కొదరు మహిళలు బస్సు దిగి దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్: పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు
-
ఫ్రీ బస్సు ప్రయాణం..ఆటో డ్రైవర్ల కష్టాలు
-
మహిళలకు ఫ్రీ జర్నీ పథకానికి అనూహ్య స్పందన
-
రైట్ రైట్ అంటున్న మహిళలు
-
రెండు రోజుల్లోనే రెండు హామీలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
-
నేటి నుంచి తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
-
అధికారంలోకొస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే పేదలు ఇళ్లు కట్టుకొనేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా నేత కంది శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ ఎన్నికల హామీలను వెంటనే నెరవేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్‌తోపాటు షాద్‌నగర్, ఉప్పల్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఈరోజు పుట్టినవారికి 12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నేడు (పంద్రాగస్టు) జన్మించిన బాలబాలికలకు 12 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు నేడు(సోమవారం) బస్సులో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ఉచిత మెడికల్ చెకప్‌లతోపాటు 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామన్నారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని తెలిపారు. హైదారాబాద్, ఖమ్మం, నిజామాబాద్ బస్టాండ్‌లో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
కరోనా ట్రీట్మెంట్ ఫైల్‌పైనే స్టాలిన్ తొలి సంతకం
చెన్నె: అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకుని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ముతువేల్ కరుణానిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తన తండ్రి స్మృతిస్థలి వద్ద కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా తొలి సంతకాలు వేటిపై చేశారనే ఆసక్తి అందరిలో ఉంది. మహమ్మారి కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి స్టాలిన్ తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద మే, జూన్ నెలలకు సంబంధించి రూ.4 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది. రెండు విడతలుగా ఆ సహాయం అందించనున్నారు. 2.7 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ బీమా ఉన్న వారందరికీ కరోనా చికిత్సకయ్యే ఖర్చంతా భరిస్తుందనే ఫైల్‌పై స్టాలిన్ సంతకం చేశారు. సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణానికి సంబంధించిన ఫైల్‌పై సీఎంగా స్టాలిన్ సంతకం చేశారు. మే 8వ తేదీ నుంచి మహిళలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పాల ధర తగ్గింపుపై స్టాలిన్ సీఎంగా సంతకం చేశారు. మే 16 నుంచి లీటర్‌పై మూడు రూపాయలు తగ్గనున్న ధర. ‘మీ నియోజకవర్గ ముఖ్యమంత్రి’ అనే సరికొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. దీనిపై ఐదో సంతకం చేశారు. ప్రజల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్ణయం. వంద రోజుల్లోపు ఆ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి. చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..? ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
► ఏర్పాట్లు పూర్తి నేడు విజయవాడలో 86 కేంద్రాల్లో పరీక్షలు ► నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ► జిల్లా నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ► బస్టాండ్, రైల్వేస్టేషన్లో హెల్ప్ డెస్క్‌లు ► వివాహాల సీజన్‌కు చివరి ముహూర్తం ► ఇదేరోజు కావటంతో పెరగనున్న ట్రాఫిక్ రద్దీ సాక్షి, విజయవాడ : ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందించటానికి విజయవాడ కమిషనరేట్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాయటానికి వచ్చే విద్యార్థులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. పోలీసులు యథావిధిగా సెంటర్ల వద్ద బందోబస్తు మొదలుకొని పరీక్షా కేంద్రాల మార్గంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వరకు అన్నింటినీ పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంత విద్యార్థుల సౌకర్యం కోసం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే ఇవి పనిచేయనున్నాయి. ఎంసెట్ కన్వీనర్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఉచిత రవాణా ఆర్టీసీ అధికారులు ఎంసెట్ విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారు. నగరంలోని పరీక్షా కేంద్రాల రూట్లకు ఆర్టీసీ సిటీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. 400 సిటీ బస్సులు నగరంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంసెట్ విద్యార్థులు హాల్‌టిక్కెట్ చూపించి వాటిలో ప్రయాణం చేయవవచ్చు. జిల్లా నుంచి వచ్చే విద్యార్థులు కూడా హాల్‌టిక్కెట్ చూపించి బస్సులో ఉచితంగా విజయవాడకు చేరుకోవచ్చు. ఆర్టీసీ ఆర్ఎం రామారావు ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం నుంచి ఆర్ఎంతో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షించనున్నారు. శుభకార్యాలకూ చివరి ముహూర్తం... వివాహాలు తదితర శుభకార్యాలకు ఈ సీజన్లో శుక్రవారం చివరి ముహూర్తం. నగరంలో సుమారు 120కి పైగా వివాహాలు జరగనున్నాయి. ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో వివాహాల ఊరేగింపులపై నిషేధం విధించారు. విద్యార్థులు రెండు గంటలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో రెగ్యులర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు అదనంగా మరికొంత మందిని నియంత్రణకు కేటాయించారు. ఉదయం ఇంజినీరింగ్.. మధ్యాహ్నం మెడిసిన్.. విజయవాడలో శుక్రవారం 86 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ (ఇంజినీరింగ్, మెడిసిన్) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికి జిల్లాలో 42,224 మంది విద్యార్థులకు ఉన్నత విద్యామండలి హాల్ టికెట్లు జారీ చేసింది. ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 86 పరీక్ష కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. -
చెన్నైలో వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం
చెన్నై: తమిళనాడు రాజధానిలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలో 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం జయలలిత గురువారం ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. నెలలో పదిసార్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.