సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్‌లో పేర్కొన్నారు.
కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్ దాఖలు చేసిన పిటీషన్‌లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది.
పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment