సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండేళ్లకోసారి జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కారర్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మికక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది.
అంతకు ముందు 2016లో ఎన్నికలు జరిగాయని, 2018లో ఆ సంఘం కాల పరిమితి ముగిసిందని వెల్లడించింది. వెంటనే టీఎస్‌ఆరీ్టసీ సంఘం ఎన్నికలు నిర్వహించేలా సర్కార్‌ను ఆదేశించాలని ఎంప్లాయీస్ యూనియన్ నేత కె.రాజిరెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా.. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.
చదవండి: విమాన ప్రయాణికులు @ 2.1కోట్లు
Comments
Please login to add a commentAdd a comment