సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోనే ఉన్న నౌబత్ పహాడ్‌లో నివసించే నిరుపేద మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అక్కడి ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.
మహానగరం చెంతనే ఉన్నా.. కనీస సౌకర్యాలు లేక మహిళలు దీన స్థితిలో బతుకుతున్నా ని, బహిర్భూమికి సూర్యోదయానికి ముందే చుట్టూ ఉన్న కొండల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని.. మరుగుదొడ్లు కూడా లేక దయనీయంగా బతుకు వెళ్లదీస్తున్నారని పేర్కొంటూ ఓ పత్రికలో కథనం ప్రచు రితమైంది. దీనిపై జస్టిస్ వినోద్‌కుమార్ రాసిన లేఖను హైకోర్టు టెకెన్ అప్ పిల్‌గా విచార కు స్వీకరించింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదన లు విన్న ధర్మాసనం.. స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment