notice issued
-
పేటీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’కు (ఓసీఎల్) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్ శేఖర్ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్ ఇంటర్నెట్, నియర్‌బై ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ నోటీసు జారీ చేశారు. నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్ సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్ సబ్సిడరీ అయిన లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేటు లిమిటెడ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది. పేటీఎం షేరు ఎన్ఎస్ఈలో 4% పడి, ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది. -
మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మాటలు, విమర్శలపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఎన్నికల కోడ్ అతిక్రమించి ఎవరైనా మాట్లాడితే వారికి నోటీసులు ఇస్తోంది. కొందరిపై ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. నిన్న(మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై వ్యాఖ్యలకు రేపు ఉదయం 11 గంటల వరకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌లపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు. -
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్‌యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్‌లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేసి.. విచారణకు రావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో సుమన్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు బాల్క సుమన్‌పై కాంగెస్ పార్టీ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేడు పోలీసులు బాల్క సుమన్ నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన పోలీసు నోటీసులపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. చదవండి: సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు -
అయిదుగురు కలెక్టర్లకు ఈడీ నోటీసులపై హైకోర్టు స్టే
చెన్నై: తమిళనాడులోని అయిదు జిల్లాల కలెక్టర్లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమ అధికార పరిధిలోని ఇసుక అక్రమ తవ్వకాల కేసులో అయిదు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు అయిదుగురు కలెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణకు పిలవవద్దని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 4,500 కోట్లు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలతో సహా పలు రహస్య మార్గాల ద్వారా అక్రమ నిధులు దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా తమ అధికార పరిధిలో ఇసుక మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి అరియలూరు, వేలూరు, తంజావూరు, కరూర్, తిరుచిరాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు జారీ చేసింది. చదవండి: Uttarakhand: రెస్క్యూ బృందాలకు 3 మీటర్ల దూరంలో కార్మికులు ఆయా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలతో వివిధ తేదీల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కలెక్టర్ల తరపున రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి కె. నంతకుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని తన పిటిషన్లో కోరారు. దీనిపై తొలుత సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈడీ సమన్లపై నేడు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి బెంచ్ వాయిదా వేసింది. కాగా ఈడీ నేరుగా జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో సహయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈడీ అభ్యర్థించగలదని పేర్కొంది. ఈడీకి అపరిమిత అధికారం పార్లమెంట్ ఇవ్వలేదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నేరాలను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదని తెలిపింది. ఇదిఫెడరలిజానికి విరుద్దని పేర్కొంది. అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచినట్లు దర్యాప్తు సంస్థ చేబుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) విచారణకు సంబంధించి ఎవరికైనా సమన్లు ఇచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. -
అస్సాం సీఎం శర్మకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారం సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమాంత శర్మ మాట్లాడుతూ..‘ఒక చోటికి ఒక అక్బర్ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్లను పిలుస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించివేయాలి. అలా చేయలేకపోతే కౌశల్య మాత పుట్టిన ఈ నేల అపవిత్రమవుతుంది’ అంటూ రాష్ట్ర కేబినెట్లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్ అక్బర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తమకు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
నిబంధనల ప్రకారమే గేమింగ్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేíÙంచిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించేలా సవరించిన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన చట్ట సవరణలను పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది. అప్పటి నుంచి డ్రీమ్11 వంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, డెల్టా కార్ప్ వంటి కేసినో ఆపరేటర్లకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగర్వాల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 16,800 కోట్ల మేర పన్నులు కట్టాల్సి ఉందంటూ డెల్టా కార్ప్‌కు గత వారం నోటీసులు జారీ అయ్యాయి. రూ. 21,000 కోట్లు రాబట్టుకునేందుకు ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు గతేడాది షోకాజ్ నోటీసులు వచ్చాయి. వీటిని కర్ణాటక హైకోర్టు కొట్టేయగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 10న దీనిపై తదుపరి విచారణ జరగనుంది. -
రామోజీ, శైలజాలకు బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీళ్లలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది. విచారణ 18కి వాయిదా.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు.. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండటం మరో విశేషం. ఈ రెండు కోర్టులిచ్చిన ‘రిటర్న్’ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టులో గత వారం క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై సోమవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ -
హైదరాబాద్‌లోనే ఇంత దయనీయమా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోనే ఉన్న నౌబత్ పహాడ్‌లో నివసించే నిరుపేద మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అక్కడి ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. మహానగరం చెంతనే ఉన్నా.. కనీస సౌకర్యాలు లేక మహిళలు దీన స్థితిలో బతుకుతున్నా ని, బహిర్భూమికి సూర్యోదయానికి ముందే చుట్టూ ఉన్న కొండల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని.. మరుగుదొడ్లు కూడా లేక దయనీయంగా బతుకు వెళ్లదీస్తున్నారని పేర్కొంటూ ఓ పత్రికలో కథనం ప్రచు రితమైంది. దీనిపై జస్టిస్ వినోద్‌కుమార్ రాసిన లేఖను హైకోర్టు టెకెన్ అప్ పిల్‌గా విచార కు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదన లు విన్న ధర్మాసనం.. స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 5గంటలలోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ విధుల్లో చేరకుంటే శాశ్వతంగా తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు. ఈ క్రమంలో రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు.. జూనియర్ సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఇది కూడా చదవండి: TSRTC: చరిత్రలో తొలిసారి.. లాభాల్లోకి 45 డిపోలు.. గట్టెక్కించిన శుభ ముహూర్తాలు -
కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌కు అహ్మదాబాద్ కోర్టు నోటీసులు.. కారణం ఇదే..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంపై కేజ్రీవాల్‌కు మరోసారి షాక్ తగిలింది. ఈ వివాదంపై తాజాగా కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజయ్‌కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23వ తేదీలోపు సమాధాని ఇవ్వాలన్ని నోటీసుల్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా గుజరాత్ యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయేశ్‌భాయ్ చోవాటియా ఆదేశించారు. ఇక, అంతకుముందు.. ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే.. వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికెట్ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో అని అన్నారు. ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా! అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ నిరూపించిందన్నారు. -
పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఈటలకు బిగ్ షాక్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పేపర్ లీకేజీల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పలు ట్విస్టుల మధ్య బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు. వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్ అనే వ్యక్తి పేపర్‌ను మొదట ఈటలకు వాట్సాప్‌లో పంపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈటలకు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, బండి సంజయ్‌కు పేపర్ పంపే కంటే ముందే.. ఈటలకు ప్రశాంత్ పేపర్ పంపించాడని అన్నారు. అంతకుముందు.. ఈటలకు కూడా ఈ పేపర్లను పంపించారని వరంగల్ సీపీ వ్యాఖ్యానించారు. -
రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరోసారి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళ్‌హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద మళ్లీ నోటీసులు అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. కాగా, అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
‘వార్ రూమ్’ కేసులో ప్రధాన నిందితుడికి నోటీసులు.. కానీ ఇక్కడో ట్విస్ట్!
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ సోదాల కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుకి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే, సునీల్ కనుగోలు నోటీసీ కాపీని అందుకున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి సంతకం చేయడం గమనార్హం. తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని గతంలోనే పోలీసులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ పోస్టులులు పెట్టారని ఆరోపణ వచ్చాయి. దానిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు టీంలోని ముగ్గురు సభ్యులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఐపీసి సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు టీం మీద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ‘ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్ చేస్తా’ పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు -
శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. ఆ కేసులో కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్‌కు క్లీన్చిట్ ఇవ్వటంపై హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ పోలీసులు. థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఢీకే శర్మ.. పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్‌కు పంపి ఉంటారని థరూర్ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఇదీ కేసు.. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం సృష్టించింది. తొలుత హత్య కోణంలో దర్యాప్తు జరిపినా.. చివరకు ఆత్మహత్యగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు.. 2021, ఆగస్టులో ఆ అభియోగాలను కొట్టివేస్తూ థరూర్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. ఇదీ చదవండి: రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ -
ఎమ్మెల్యేల ఎర కేసు: మరో ఐదుగురికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో అయిదుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. రిమాండ్ పొడిగింపు ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణకు నందకుమార్ భార్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. -
మంత్రి జగదీష్ రెడ్డికి షాకిచ్చిన ఎన్నికల సంఘం.. నోటీసులు జారీ!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మునుగోడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పొలిటికల్ నేతలు ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఇక, పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా, తాజాగా మంత్రి జగదీష్ రెడ్డికి అనుకోని షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మంత్రి జగదీష్‌రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. రేపు(శనివారం) మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. -
పవన్ కల్యాణ్ కు పోలిసుల నోటీసులు
-
బండి సంజయ్‌కు షాక్.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్!..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారని వర్దన్నపేట ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శాంతి భద్రతల దృష్ట్యా నోటీసులు జారీ చేశామని తెలిపారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చదవండి: అరెస్టుపై బండి సంజయ్ సూటి ప్రశ్న.. ఫోన్ చేసి ఆరా తీసిన అమిత్ షా మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్, బీజేపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. తమ పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నారో.. అక్కడి నుండే మళ్లీ మొదలుపెడతానని సవాల్ చేశారు. కచ్చితంగా భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ హైకోర్టుకు బీజేపీ ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ న్యాయ పోరాటానికి దిగింది. పాదయాత్రను నిలిపి వేయాలని పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తరుపున హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.దీంతో రేపు మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఓవైపు పోలీసుల నోటీసులు మరోవైపు బీజేపీ నేతల ప్రకటనలతో బండి సంజయ్ యాత్ర ముందుకు సాగుతుందా? లేక బ్రేక్ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బీజేపీ నాగోల్‌లో అమరుల యాదిలో అనే సభను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన స్కీట్ వ్యవహారంలో రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయంలో నాలుగు రోజుల క్రితం జిట్టా బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు. చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్ పిలిపించి యువకుడిపై యువతి దాడి -
10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు
సాక్షి, చెన్నై: ఆహార సరఫరా రంగంలో ప్రముఖంగా ఉన్న జుమోటోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు కన్నెర్ర చేశారు. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలివరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు గురువారం నోటీసులు జారీ చేశారు. వినియోగదారుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే ఆహార పదార్థాలను జుమోటో ప్రతినిధులు ఇళ్లు, కార్యాలయాలు అంటూ ఎక్కడికైనా సరే తీసుకెళ్లి అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వినియోగదారుడికి మరింత చేరువయ్యే విధంగా ఆర్డర్‌ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రకటనను జుమోటో వర్గాలు తాజాగా చేశాయి. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..! దీంతో కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారో..? అనే చర్చ బయలుదేరింది. చెన్నై వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న సంకేతాలు కూడా వినిపించాయి. పది నిమిషాల్లో వినియోగ దారుడికి ఆహార పదార్థాలు అందించాల్సి ఉండటంతో, ఆ ప్రతినిధులు తమ వాహనాల్లో అతివేగంగా దూసుకెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించక తప్పదు. దీనిని పరిగణించిన చెన్నై ట్రాఫిక్ పోలీసు వర్గాలు జుమోటోకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. చదవండి: జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..! సాధ్యమంటోన్న కంపెనీ సీఈవో -
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
నర్సీపట్నం/నల్లజర్ల/: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌ని దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఆయనకు 41(ఎ) నోటీసు ఇచ్చేందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. తాడేపల్లిగూడెం సీఐ రఘు ఇద్దరు ఎస్ఐలతో కలిసి ఉదయాన్నే అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. చదవండి: బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా? అయ్యన్నతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో 3 గంటల పాటు నిరీక్షించారు. అయ్యన్నకి ఫోన్ కలపాలని ఆయన పీఏకు సీఐ సూచించగా.. స్విచ్ఛాఫ్ వస్తోందని పీఏ ఆయనకు బదులిచ్చాడు. అయ్యన్న ఎంతకూ రాకపోవడంతో చివరకు ఆయన ఇంటి గోడకు 41(ఎ) నోటీసు అంటించారు. అయ్యన్న మెయిల్ అడ్రస్‌కు నోటీసు ఫార్వర్డ్ చేసి, మరో 2 నోటీసులను పీఏకి ఇచ్చారు. టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ఉత్పత్తి తయారైన దేశం గురించిన వివరాలను సరిగ్గా పేర్కొనకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ–కామర్స్ కంపెనీలకు గడిచిన ఏడాది కాలంలో 202 నోటీసులు పంపినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. నిర్లక్ష్యం ఇక్కడే ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఉపకరణలు, దుస్తులు మొదలైన ఉత్పత్తుల విషయంలో ఇలాంటి ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన విషయంలో మొత్తం 217 నోటీసులు జారీ కాగా వీటిలో 15 నోటీసులు.. ఎక్స్పైరీ తేదీ, తయారీదారు .. దిగుమతిదారు చిరునామాలను సరిగ్గా పేర్కొనకపోవడం వంటి అంశాలకు సంబంధించినవి. మిగతా నోటీసులు.. ఆయా ఉత్పత్తులు ఏ దేశం నుంచి వచ్చినవో ఈ–కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాంలలో సరిగ్గా చూపకపోవడం వల్ల జారీ చేసినవి. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు జారీ చేసినది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. భారీ జరిమానా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో కంపెనీలు చట్టబద్ధంగా నడుచుకోవాలని, వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ తెలిపారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 76 కంపెనీల నుంచి రూ. 42,85,400 జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఈ దాఖిల్ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) ద్వారా వచ్చిన పలు ఫిర్యాదులను గడిచిన కొన్ని నెలల్లో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ–దాఖిల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని లీనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఒక వినియోగదారుడు రూ. 127.46 మొత్తానికి సంబంధించి ఒక రెస్టారెంటుపై ఇదే విధంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...! -
రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్, హరియాణా,యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కమిషన్ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తోందని తెలిపింది. శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ లెక్కించి అక్టోబర్ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్-19 ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది. గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. చదవండి: మళ్లీ రైతు రక్తం చిందింది.. సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది: రాహుల్ ఫైర్ -
దళిత బంధుపై తెలంగాణ సర్కార్‌కు ఎస్సీ కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్సీ కమిషన్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. 'దళిత' పదం స్థానంలో 'అంబేడ్కర్' పదం చేర్చాలంటూ పిటిషర్ కోరాడు. విచారణ చేపట్టిని కమిషన్... దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం నోటీసులు ఇచ్చింది. -
ట్విటర్‌కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు
హైదరాబాద్: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కేంద్రం నోటీసులు ఇవ్వగా, తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్విటర్‌కు నోటీసులు జారీ చేశారు. ఫేక్ వీడియో సర్క్యులేట్ కేసులో నోటీసులు పంపినట్లు హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి మీరాచోప్రా ఫిర్యాదుపై ట్విట్టర్ వెంటనే స్పందించాలంటూ నోటీసులు పంపినట్లు సమాచారం. కాగా, జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కూడా మంగళవారం రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చదవండి: ట్విటర్‌కు మరో షాక్, కేసు నమోదు -
కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోండి
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నూతన ప్రైవసీ విధానం–2021ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్ యాజమాన్యాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్› అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటీసు జారీ చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పుల పట్ల ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాచార విధానంలోని పవిత్రమైన విలువలను, డేటా సెక్యూరిటీని, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను దెబ్బతీసేలా ఈ నూతన పాలసీ ఉందని పేర్కొంది. కొత్త పాలసీని అమలు చేస్తున్న తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పౌరుల ప్రయోజనాలను, హక్కులను ఉల్లంఘించేలా కొత్త పాలసీ ఉందని తేల్చిచెప్పింది. నోటీసుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని వాట్సాప్ యాజమాన్యానికి కేంద్ర ఐటీ శాఖ సూచించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. సమస్యాత్మకం, బాధ్యతారాహిత్యం భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త ప్రైవసీ పాలసీని ఎలా తీసుకొచ్చారని వాట్సాప్‌ను కేంద్రం నిలదీసింది. దేశ పౌరుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్న దృష్ట్యా.. భారత చట్టాల ప్రకారం వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి వీలున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. ప్రైవసీ విధానం విషయంలో యూరప్ వినియోగదారులు, భారతీయ వినియోగదారుల మధ్య వివక్ష చూపడం ఏమిటని వాట్సాప్‌ను కేంద్రం ప్రశ్నించింది. నిత్య జీవితంలో ఎంతోమంది భారతీయులు సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని గుర్తుచేసింది. దీన్ని అలుసుగా తీసుకొని భారతీయ వినియోగదారుల విషయంలో అనుచితమైన నియమ నిబంధనలు విధించడం సమస్యాత్మకమే కాదు బాధ్యతారాహిత్యం కూడా అని ఐటీ శాఖ ఉద్ఘాటించింది. యూరప్ వినియోగదారుల విషయంలో ఇలాంటి అనుచిత నియమ నిబంధనలు లేవని పేర్కొంది. నూతన ప్రైవసీ పాలసీ ప్రకారం.. భారతీయ వినియోగదారుల సమాచారాన్ని వాట్సాప్ యాజమాన్యం తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు చేరవేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిరంగం కావడం తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించడానికి మే 15న గడువుగా విధించిన వాట్సాప్ తర్వాత దాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తర్వాత మరో మెలిక పెట్టింది. పాలసీని ఆమోదించాల్సిందిగా కొన్నాళ్లపాటు రిమైండర్లు పంపుతామని... అప్పటికీ ఓకే చెప్పకపోతే సదరు వినియోగదారుడికి క్రమేపీ చాటింగ్, వాయిస్‌కాల్స్, వీడియో కాల్స్ సేవలను నిలిపివేస్తామని తమ వెబ్సైట్లో పేర్కొంది. అయితే దీనికి నిర్దిష్ట గడువేమీ చెప్పకపోవడం గమనార్హం. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. -
మమతకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బుధవారం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు 48 గంట ల్లోగా స్పందించాలని ఆదేశించింది. హూగ్లీ జిల్లాలో ని తారకేశ్వర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ.. ముస్లింలంతా టీఎంసీకే ఓటేయాలని, వేర్వేరు పార్టీలకు వేసి ఓట్లను చీల్చవద్దని కోరారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దాంతో, ఆ వ్యాఖ్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈసీ మమతకు నోటీసు జారీ చేసింది. ‘మైనారిటీల కోసం ఐక్యశ్రీ పథకం ప్రారంభించాం. 2.35 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చాం. మైనారిటీ సోదర, సోదరీమణులకు చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మైనారిటీ ఓట్లను చీల్చకండి. బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ సైతాను మాటలను నమ్మకండి. అతడు హిందూ, ముస్లిం ఘర్షణలు చెలరేగాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నో చేస్తుంటాడు. బీజేపీ రహస్య మిత్రుల్లో అతడు ఒకడు. ఇటు సీపీఎం, బీజేపీ నేతలు మైనారిటీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ ఇచ్చిన డబ్బులు పంచుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడ్తారు. నా హిందూ కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నా. బీజేపీ మాటలు విని హిందూ, ముస్లింలుగా మీరు విడిపోవద్దు’ అని మమత ప్రసంగించారని బీజేపీ పేర్కొంది. -
శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని... ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టి శ్యామ్ కె.నాయుడితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేసి మోసగించాడని శ్రీసుధ గతంలో అతనిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడు నకిలీ పత్రాలతో బెయిల్ తెచ్చుకున్నాడని శ్రీసుధ ఆరోపించింది. పెళ్లి పేరుతో నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మేలో శ్రీసుధ మొదటిసారి హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కె నాయుడిని అరెస్ట్ చేయగా రెండు రోజుల్లోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఈ కేసులో శ్యామ్ కె. నాయుడి తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా బెయిల్ పొందాడని శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో అతని బెయిల్ కూడా రద్దయినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై గత నెలలో మరోసారి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీసుధ. ఇప్పటివరకూ అతన్ని అరెస్ట్ చేయలేదని ఆమె ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు... కొద్ది రోజుల క్రితం నటి శ్రీసుధ, శ్యామ్ కె నాయుడిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ఢీకొట్టించి హత్యాయత్నం చేశారని... ఈ కుట్ర వెనుక శ్యామ్ కె నాయుడు ఉన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తాను శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసుకు, ఈ యాక్సిడెంట్‌కు లింకు ఉందని ఆరోపించారు. తనను అడ్డు తొలగించుకునేందుకు యాక్సిడెంట్ చేసి చంపేసేలా కుట్ర చేసి ఉంటాడని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: నాపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాకు మార్చండి -
అభిషేక్ బెనర్జీ భార్య, మరదలికి సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకం, దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని పేర్కొంది. సీబీఐ బృందం కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ భార్య, మరదలి నివాసాలకు వెళ్లి, నోటీసు అందజేసింది. పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ గత ఏడాది నవంబర్‌లో పలువురిపై కేసు నమోదు చేసింది. నిందితుల్లో ఈసీఎల్ జనరల్ మేనేజర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఇన్చార్జి తదితరులు ఉన్నారు. ఈ వ్యవహారంతో రుజీరా బెనర్జీకి, మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు సహకరించాలంటూ తాజాగా నోటీసు జారీ చేసింది. సోమవారం విచారించే అవకాశం ఉందని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. అలాగే పశువుల స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన వినయ్ మిశ్రాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు తన భార్యకు సీబీఐ నోటీసు ఇవ్వడం పట్ల అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కేసులతో తమను బెదిరించలేరని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ నుంచి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయని, ఇప్పుడు సీబీఐ, ఈడీ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయని విమర్శించింది. బొగ్గు దొంగతనం కేసులో సీబీఐ విచారణను తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
సుజనా చౌదరికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు ఈడీ నోటీసులు అందించింది. డొల్ల కంపెనీలతో సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. రూ.5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలపై ఈడీ కేసులు నమోదు చేసింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. ఇప్పటికే ఆయనపై మూడు ఎఫ్ఐఆర్లు సీబీఐ నమోదు చేసింది. వీటి ఆధారంగా 2018లో సుజనాపై ఈడీ సోదాలు జరిపింది. 126 షెల్ కంపెనీలు సృష్టించి సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆధారాలు సేకరించింది. వాటిలో సెంట్రల్ బ్యాంకును రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.159 కోట్లు సుజనా మోసం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ కేసులు విచారిస్తున్న చెన్నెలోని సెషన్స్ కోర్టు నోటీసులు పంపించింది. -
అల్టిమేటం: ‘ఘాజీపూర్’ ఖాళీ చేయండి
ఘజియాబాద్: ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న నిరసన కేంద్రం నుంచి వెళ్లిపోవాలని ఘజియాబాద్ అధికారులు రైతులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రిలోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అక్కడ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మాహుతి అయినా చేసుకుంటా. కానీ ఇక్కడి నుంచి కదలను. నిరసనను ఆపను’ అని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు సాయుధ గూండాలు ఇక్కడికి వచ్చారని ఆందోళన వెలిబుచ్చారు. దాంతో ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఘాజీపూర్ సరిహద్దు వద్ద తికాయత్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ నవంబర్ 28 నుంచి నిరసన తెలుపుతోంది. ‘ఖాళీ చేయాలని ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ రైతులను ఆదేశించారు’ అని అధికారులు చెప్పారు. ‘శాంతియుత నిరసనలు చట్టబద్దమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా, రైతు నిరసనకారులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఏదేమైనా మా నిరసన కొనసాగిస్తాం’ అని తికాయత్ స్పష్టం చేశారు. నోటీసులకు భయపడం ఢిల్లీ పోలీసులు పంపిస్తున్న నోటీసులకు భయపడబోమని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. జనవరి 26 నాటి అల్లర్లను కారణంగా చూపి రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడం. వాటికి జవాబిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరసన కేంద్రాల నుంచి రైతులను వెనక్కు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టి, పాల్వాల్ నిరసన కేంద్రం నుంచి రైతులను పంపించివేసేందుకు కుట్ర చేశారు’ అని సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఘాజీపూర్ సహా నిరసన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలను నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్లు, బైక్‌లతో దాదాపు 16 కిలో మీటర్లు ఈ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల జెండాలకు బదులుగా కేవలం త్రివర్ణ పతాకాలు పట్టుకుని రైతులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నామ్ సింగ్.. తదితరులు తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించారని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణకు ఇది తమ జవాబని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని తాము గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించరని స్పష్టం చేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపించింది. అయితే, జనవరి 26 నాటి ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు వెనక్కు వెళ్లిపోవడం వల్ల అలా కనిపిస్తోందని రైతు నేతలు తెలిపారు. ‘మాలో స్ఫూర్తి దెబ్బతినలేదు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి బల్దేవ్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యమం తొలిరోజు నుంచి ఉన్నవారిలో కొందరు వెనక్కు వెళ్లారని, వారి కుటుంబసభ్యుల్లో నుంచి కొందరు త్వరలో ఇక్కడకు వస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంటుకు పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేశామని రైతు నేతలు వెల్లడించారు. జనవరి 26నాటి అల్లర్లు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనని రైతు నేత గుర్జీత్ సింగ్ ఆరోపించారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతబలగాలు మోహరించాయి. యూపీలోని బాఘ్పట్ నిరసన కేంద్రంలో ఆందోళనలు ముగిశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం డిసెంబర్ 19 నుంచి ఇక్కడ నిరసనలు సాగుతున్నాయి. పోలీసులకు అమిత్ షా పరామర్శ జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. శుశ్రుత్ ట్రామా సెంటర్, తీరత్ రామ్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవలతో కలిసి హోం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 400 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. రైతు నేతలపై లుక్ఔట్ నోటీసులు గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక కుట్ర, నేరపూరిత ప్రణాళిక ఉన్నాయని, పరేడ్ మార్గంపై కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించాలని ముందే నిర్ణయించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు గానూ వారిపై చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీ హింసాకాండపై నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతు నేతలపై పోలీసులు ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు. ఆ నాయకులు తమ పాస్‌పోర్ట్‌లను కూడా సరెండర్ చేయాల్సి ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజధానిలో జరిగిన హింసాకాండ దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని భావిస్తున్న పోలీసులు.. ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో బాధ్యులపై దేశద్రోహం ఆరోపణలను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. వారిపై ఐపీసీలోని 124ఏ(దేశద్రోహం) సెక్షన్ కింద కూడా ఆరోపణలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట ఘటనలపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మాజీ గ్యాంగ్‌స్టర్ లఖా సిధానియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ల్లో రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ చాందునీ, కుల్వంత్ సింగ్ సంధూ, జోగిందర్ సింగ్ ఉగ్రహ, మేథా పాట్కర్ తదితర 37 మంది నాయకుల పేర్లు ఉన్నాయి. రాజ్యాంగ బద్ధతపై సుప్రీం నోటీస్‌లు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త సాగు చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించే 14, 15, 21 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్ తన పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఆ చట్టాలను అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమై నవిగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. తప్పుడు ప్రచారం: దీప్ సిద్ధూ ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రైతు నేతలు తనను బాధ్యుడిని చేయడంపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మండిపడ్డారు. ఎర్రకోటపై సిక్కు మత జెండాను ఎగరేసిన ఆందోళనకారుల్లో దీప్ సిద్దూ ఉన్నారు. ఎర్రకోట వైపు వెళ్లాలని యువ రైతులు వారికి వారే నిర్ణయించుకున్నారని వివరించారు. పోలీసులు, రైతు నేతలు అంగీకరించిన మార్గాన్ని చాలా మంది అనుసరించలేదన్నారు. ఢిల్లీ లోపల ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని చెప్పి రైతు నేతలు తమను పిలిపించారని అక్కడి వారు తనకు చెప్పారన్నారు. రైతు నేతలు తనను బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తి అని విమర్శించడంపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యక్తి కానీ, ఆరెస్సెస్ వ్యక్తి కానీ ఎర్రకోటపై సిక్కు మత ‘నిషాన్సాహిబ్’ జెండా ఎగరేస్తాడా?’ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ప్రశ్నించారు. తాను చేరుకునేటప్పటికే ఎర్రకోట గేట్ విరిగిపోయి ఉందన్నారు. -
బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ ‘పోక్సో’ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చిచెబుతూ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిందితుడికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది. నాగపూర్ ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ‘యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ హాజరై నాగపూర్ ధర్మాసనం తీర్పు వివరాలను తెలియజేశారు. గతంలో ఏ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదని, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కంగనా రనౌత్‌కు బీఎంసీ మరో షాక్
న్యూఢిల్లీ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముంబై కార్యాలయాన్ని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూలగొట్టిన కొద్దిరోజులకే బీఎంసీ నుంచి ఫైర్‌బ్రాండ్ నటికి మరో నోటీసు అందింది. ఖర్‌లోని ఆమె ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బీఎంసీ ఈ నోటీసులు జారీ చేసింది. పాలీహిల్‌లోని ఆమె కార్యాల్యం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఖర్ వెస్ట్ ప్రాంతంలోని భవనంలో కంగనా ఐదో అంతస్తులో ఉంటున్నారు. ఈ భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 9న కంగనా ముంబైకి చేరుకునేందుకు సిద్ధమైన క్రమంలో ఆమె కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజయ్ రౌత్ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించేందుకు కంగనా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు. చదవండి : మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా భేటీ -
మనీష్ మల్హోత్రాకు బీఎంసీ నోటీసులు
ముంబై: బాద్రాలోన కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిన్న బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ) అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రాకు బీఎంసీ సివిక్ బాడీ నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణం, ఇతర నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీఎంసీ గురువారం నోటిసులు జారీ చేసింది. కంగనా పాలి హిల్స్ కార్యాలయం పక్కనే మనీష్ భవనం కూడా ఉంది. సెక్షన్ 351 కింది బీఎంసీ ఈ నోటిసులు జారీ చేసింది. ఇందులో ముంబై మున్పిపల్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా మనీష్ భవన నిర్మాణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక దీని కట్టడంలో నాలుగు ఉల్లంఘనలు ఉన్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది. (చదవండి: ‘క్వీన్’ ఆఫీస్‌లో కూల్చివేతల) మొదటి అంతస్తును ఇటుక రాతితో రెండు గోడలు అక్రమంగా నిర్మించి క్యాబిన్లుగా పార్టిషన్స్ చేశారని, రెండవ అంతస్తులో గోడలను ఆనధికారికంగా నిర్మించడమే కాకుండా, అదే అంతస్తులో టెర్స్ మీద సిమెంట్ షీట్ పైకప్పు, సెడ్‌లను నిర్మాణాం, అలాగే టేర్స్‌పై ఉక్కు రాడ్లు, సిమెంట్ షీట్‌ను పైకప్పు నిర్మించినట్లు నోటీసులలో వివరించారు. అయితే కంగనా కార్యాలయాన్ని ముంబై హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చిట్లు బీఎంసీ ఇవాళ స్పష్టం చేసింది. అంతేగాక కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉన్నతాధికారులను ఇవాళ ఉదయం ప్రశ్నించారు. కాగా గత కొద్ది రోజులుగా శివసేనకు, కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో కంగనా ముంబైని పీఓకేతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటీసు
జైపూర్ : బీజేపీలో చేరితే తనకు 35 కోట్ల రూపాయలు అందచేస్తానని ప్రలోభాలకు గురిచేశారని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు రెబెల్ నేత షాక్ ఇచ్చారు. తనపై ముడుపుల ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్‌కు పైలట్ బుధవారం లీగల్ నోటీసులు పంపారు. తమ నేతపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారని పైలట్ వర్గీయులు నిర్ధారించారు. కాగా పైలట్ తనతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారేందుకు మీకు ఎంత మొత్తం కావాలని అడిగారని, 35 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారని గిరిరాజ్ సింగ్ మంగళవారం తిరుగుబాటునేతపై ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బేరసారాలు సాగుతున్నాయని..తాను ఇలాంటి పనికి పాల్పడలేనని వారికి చెప్పానని..రెండు మూడు సార్లు పైలట్‌తోనూ మాట్లాడానని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపణలను సచిన్ పైలట్ తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలని, తన ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రితో పాటు, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు పైలట్ సహా 18 మంది ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయస్ధానంలో విచారణ జరుగుతోంది. కాగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పైలట్ బీజేపీతో కలిసి కుట్రపన్నారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తుండగా బీజేపీతో కలిసేదిలేదని పైలట్ స్పష్టం చేస్తున్నారు. చదవండి : సచిన్ పైలట్ వర్గానికి 24 వరకు ఊరట -
ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్టీ–ఇన్ నోటీసు ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మోసపూరిత ట్వీట్లు, లింక్‌లను దర్శించిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హ్యాకింగ్‌ను అడ్డుకునేందుకు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న జో బిడెన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తదితరుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. భారత్‌లోనూ పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లోకి దుండగులు ప్రవేశించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఈఆర్టీ–ఇన్ స్పందించింది. -
బీజేపీలో చేరడం లేదు!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయం ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. సీనియర్ సీఎం గహ్లోత్, యువ తిరుగుబాటు నేత పైలట్ల మధ్య రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించినప్పటికీ.. బీజేపీలో చేరే ఆలోచన లేదని సచిన్ పైలట్ బుధవారం తేల్చిచెప్పారు. దాంతో, బీజేపీ ఆతిథ్యాన్ని స్వీకరించడం మాని సొంత గూటికి తిరిగి రావాలని పైలట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా సూచించారు. ఒకవైపు, పార్టీ గూటికి తిరిగిరావాలని కోరుతూనే.. మరోవైపు, పైలట్, ఆయన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కాంగ్రెస్ అభ్యర్థించింది. దాంతో స్పీకర్ సీపీ జోషి ఆ 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని, పార్టీని వీడి వెళ్లాలనుకునేవారు వెళ్లవచ్చని, నవ యువనేతలకు కాంగ్రెస్ పార్టీలో ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, వాటిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పెలట్పై విమర్శల వాడి పెంచారు సీఎం గహ్లోత్. అందంగా ఉండి, మీడియాతో ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడితే సరిపోదని, దేశం కోసం ఏం చేశామని కూడా ఆలోచించాలని పైలట్‌కు చురకలంటించారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని స్వయంగా సచిన్ పైలటే పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి స్పీకర్ సీపీ జోషీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పును పేర్కొంటూ, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న నిబంధనల మేరకు వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగా ఇటీవలి శాసనసభాపక్ష భేటీలకు హాజరు కాలేదని అందులో వివరించారు. దాంతో, శుక్రవారంలోగా స్పందించాలని కోరుతూ స్పీకర్ ఆ 19 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు మంగళవారమే జారీ చేశామని స్పీకర్ వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో జరిగిన శాసనసభా పక్ష భేటీకి ఈ 19 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర: పైలట్ బీజేపీలో తాను చేరబోవడం లేదని బుధవారం సచిన్ పైలట్ స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు నేతలు ఈ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం, బీజేపీని ఓడించడం కోసం ఎంతో కష్టపడ్డాను’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ‘పైలట్‌కు పార్టీ తలుపులు ఇంకా మూసుకుపోలేదు. తప్పును తెలుసుకుని, బీజేపీ మాయ నుంచి బయటకు వచ్చే జ్ఞానం అతనికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నా’ అని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండే ట్వీట్ చేశారు. బీజేపీ ఆతిథ్యం చాలు.. తిరిగి రా! బీజేపీలో చేరే ఉద్దేశం లేనట్లయితే.. పార్టీలోకి తిరిగి రావాలని పైలట్‌కు రణ్‌దీప్ సూర్జేవాలా సూచించారు. బీజేపీ ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించింది ఇక చాలంటూ వ్యాఖ్యానించారు. ‘రండి.. ఒక కుటుంబంలా కూర్చుని అన్ని అంశాలపై మాట్లాడుకుందాం’ అని పైలట్ వర్గ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. గురుగ్రామ్‌లోని హోటళ్లలో ఉన్న ఎమ్మెల్యేలను విడుదల చేయాలని పైలట్‌కు రణ్‌దీప్ సూర్జేవాలా విజ్ఞప్తి చేశారు. మళ్లీ వస్తే.. ఏమిస్తారో..! మనసు మార్చుకుని పైలట్ మళ్లీ కాంగ్రెస్‌లో క్రియాశీలం అయినా, ఆయనకు కీలక బాధ్యతలను అధిష్టానం వెంటనే అప్పగించకపోవచ్చని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కనీసం నెల రోజుల పాటైనా పైలట్ వేచి చూడాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. గహ్లోత్ ప్రభుత్వం కూలిపోయే ముప్పు స్థాయి చాలా వరకు తగ్గిందని, దాదాపు 109 మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మెజారిటీ మార్క్ అయిన 101ని సునాయాసంగా సాధించగలరని చెప్పారు. తానింకా కాంగ్రెస్ వాదినేనని పెలట్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. పార్టీ హై కమాండ్ విశ్వాసం పొందేందుకు ఆయనకు మరి కొంత కాలం పట్టవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో కాకుండా, జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘అందంగా ఉంటే సరిపోదు’ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తిరుగుబాటు నేత సచిన్‌పైలట్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతిలో పావులా మారాడని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. పైలట్ పేరు ప్రస్తావించకుండా, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని, ఆ కష్టం పైలట్ కూడా పడి ఉంటే దేశానికి మరింత సేవ చేసేవాడని వ్యాఖ్యానిం చారు. ‘అందంగా ఉండటం, మీడియాతో ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడడం సరిపోదు. దేశ సేవ పట్ల, పార్టీ భావజాలం పట్ల నిబద్ధత ఉండాలి’ అన్నారు. యువకుడిగా ఉన్న సమయంలో పడిన కష్టం కారణంగానే.. మూడోసారి సీఎం పదవి చేపట్టగలిగానన్నారు. పార్టీ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు తనకు కూడా యువతరంపై ఎంతో అభిమానం ఉందన్నారు. -
నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఇంటర్‌పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి. నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్ చేసేందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే.. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
హీరోయిన్ రష్మిక హాజరు కావాల్సిందే..
సాక్షి, బెంగళూరు: బహు భాషా హీరోయిన్ రష్మికా మందన్న నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 21న (మంగళవారం) బెంగళూరులోని ఐటీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రష్మిక నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి,పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మదన్ తెలిపారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరు అవుతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్ -
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ విషయంలో విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఎన్కౌంటర్ ఆందోళన కలిగించే అంశమని, దీనిపై చాలా జాగ్రత్తగా విచారణ జరగాలని పేర్కొంది. నిజనిర్ధారణ చేసేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్)ను ఆదేశించినట్లు తెలిపింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం త్వరలోనే హైదరాబాద్ వెళ్లి నిజనిర్ధారణ చేసి నివేదిక అందజేస్తుందని వివరించింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు అప్రమత్తంగా లేరని కమిషన్ భావించింది. నిందితుల నుంచి అవాంఛనీయ ఘటన జరుగుతుందని అప్రమత్తంగా ఉండాల్సినా అలా లేకపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని భావించింది. ‘పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడం.. సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది’అని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. -
నిర్భయ నిధుల పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్‌చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు -
జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, తూర్పుగోదావరి : రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావుకు, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు హోకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
టీడీపీ కార్యాలయానికి నోటీసులు
సాక్షి, మంగళగిరి(గుంటూరు) : ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి, ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయ భవనం నిర్మిస్తుంది. దీనిపై ఈ నెల 3వ తేదీన ‘అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం’ అనే శిర్షీకతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కి వాగు పోరంబోకు స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు కేటాయించారు. మూడు ఎకరాల 65 సెంట్లు ప్రభుత్వం కేటాయించగా, నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ 392/2 సర్వే నంబర్లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. ఈ విషయాలను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిని పరిశీలించారు. ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు. గత శుక్రవారం నిర్మాణదారులకు ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రామ్‌ప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. -
శ్రీచైతన్య విద్యాసంస్థలపై కొరడా..!
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు విద్యా శాఖాధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలను బేఖాతర్ చేస్తూ టాలెంట్ టెస్టులను నిర్వహించడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, నిర్వాహకుల నుంచి వచ్చిన వివరణ అనంతరం క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. దసరా సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక తరగతుల పేరుతో పదో తరగతి విద్యార్థులను సైతం పాఠశాలలకు పిలిపించివద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ క్యాలెండర్‌కు అనుగుణంగా దసరా సెలవులు ముగిసేంత వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రత్యేక తరగతులు వద్దని ఆదేశాలు ఇచ్చారు. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు దీనిని పెడచెవిన పెట్టారు. డీఈఓ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆదివారం టాలెంట్ టెస్టులను నిర్వహించారు. నందిగామ, మైలవరం, విజయవాడలోని మొగల్రాజపురం వంటి చోట్ల అప్పటికప్పుడు విద్యా శాఖాధికారులు వెళ్లి టాలెంట్ టెస్టులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలల వైపు ఆకర్షితులయ్యేలా పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులను నిర్వహించారని విద్యా శాఖాధికారుల పరిశీలన తేలింది. జిల్లాలోని దాదాపు అన్ని శ్రీ చైతన్య పాఠశాలల్లో టాలెంట్ టెస్టులను నిర్వహించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జిల్లాలో ఉన్న అన్ని శ్రీ చైతన్య పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, దీనిపై వివరణ కోరేందుకు సిద్ధమయ్యారు. వారు ఇచ్చిన సంజాయిషీ అనంతరం సదరు పాఠశాలల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తున్నట్లుగా గతంలో కూడా అనేకసార్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. మచిలీపట్నంలోని భాస్కరపురంలో గల పాఠశాలలో ఇదే రీతిన నిర్వహించగా గతంలో డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణమూర్తి వెళ్లి నిర్వాహకులను హెచ్చరించి విద్యార్థులను అప్పటికప్పుడు ఇళ్లకు పంపించారు. ఇలా ఎన్నిసార్లు హెచ్చరించినా శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకుల్లో మార్పు రాకపోవటమే కాకుండా, తాము ఇస్తున్న ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తుండటాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు.. శ్రీ చైతన్య పాఠశాలలన్నింటికీ ఆయా డెప్యూటీ డీఈఓల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాం. వారి నుంచి వచ్చిన సంజాయిషీ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆ సంస్థల ప్రధాన బాధ్యులకు కూడా డీఈఓ కార్యాలయం నుంచి నోటీసులు పంపిస్తాం. ఆదేశాలను ధిక్కరిస్తున్నందున దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – ఎంవీ రాజ్యలక్ష్మి, డీఈఓ -
స్వాతి సన్‌సోర్స్‌కు షాక్
సాక్షి, అనంతపురం : పరిశ్రమ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ భూములు కొట్టేసి.. ఆ స్థలాలను ఇతరులకు లీజుకిచ్చిన ‘స్వాతి సన్‌సోర్స్’ పరిశ్రమ నిర్వాహకులకు ఏపీఐఐసీ అధికారులు షాక్ ఇచ్చారు. పరిశ్రమ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారని, వాటిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని పరిశ్రమ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. సాక్షి కథనంతో అధికారుల్లో కదలిక స్వాతి సన్‌సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమ పేరుతో ఏపీఐఐసీ నుంచి తీసుకున్న స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవంతులు నిర్మిస్తున్న వైనంపై ‘అవినీతి వెలుగులు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జోనల్ మేనేజర్ గోపీకృష్ణ గురువారం పెనుకొండ సమీపంలోని స్వాతి సన్ సోర్స్ పరిశ్రమను పరిశీలించారు. ఏపీఐఐసీ నుంచి కేవలం ఒక భవన నిర్మాణానికే అనుమతులు తీసుకొని అపార్ట్మెంట్లు ఎలా నిర్మిస్తారని పరిశ్రమ నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తీసుకున్న స్థలాలను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమన్నారు. పరిశ్రమను నెలకొల్పి కార్మికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి.. అక్రమంగా భవంతులను నిర్మించి అద్దెలకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చకూడదో సమాధానం చెప్పాలని నోటీసులను జారీ చేశారు. నిర్వాహకుడి నుంచి జవాబు రాగానే 15 రోజుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. -
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాస భార్య నావెల్ సింఘాల్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. ఎలక్షన్ కమిషనర్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పలు కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె 2005లో ఎస్బీఐ నుంచి వైదొలిగింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన 11 నిర్ణయాల్లో లావాస తన అసమ్మతిని తెలియజేయగా కమిషన్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అసమ్మతిని రికార్డు చేయని ఈసీ సమావేశానికి అర్థంలేదని లావాస పేర్కొన్నారు. -
అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను శాఖ రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకు షాకిచ్చినిట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం అంబానీ భార్య నీతా అంబానీ, వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు అనేక దేశాల్లో విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం. 2019, మార్చి 28న ఆదాయ పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్తలపై దర్యాప్తు ప్రారంభించిన తరువాత 2011 లో, హెచ్ఎస్బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. 2015 లో, స్విస్ లీక్స్ గా పిలిచే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) హెచ్ఎస్బీసీ జెనీవా ఖాతాదారుల సంఖ్య 1,195 అని పేర్కొంది. 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్‌తో 14 హెచ్ఎస్బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఇవన్నీ అనేక మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో అనుసంధానించ బడ్డాయని తెలిపింది. ఈ 14 కంపెనీలలో ఒకదానిలో "అంతిమ లబ్ధిదారులు" గా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయనీ, వివిధ విదేశీ, దేశీయ సంస్థల ద్వారా ఈ సంస్థలలో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటి నివేదిక వెల్లడించినట్టు పేర్కొంది. ముంబైలోని అదనపు ఆదాయ కమిషనర్ ద్వారా బ్లాక్ మనీ (అప్రకటిత విదేశీ ఆస్తులు, ఆదాయం) టాక్స్ యాక్ట్ 2015, సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ) ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది. ఖండించిన రిలయన్స్ మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ నివేదికలను పూర్తిగా ఖండించారు. అలాగే ఐటీ శాఖ నోటీసులేవీ తమకు అందలేదని పేర్కొన్నారు. -
చిన్నారుల మృత్యువాతపై సుప్రీం దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం వంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాదనల సందర్భంగా.. గతంలోనూ ఇలాంటి మరణాలే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది మనోహర్ తెలపగా.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మరణాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇలాంటి మరణాలు ప్రతి ఏటా సంభవిస్తున్నా.. పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. బిహార్‌లో మరణించిన చిన్నారులకు రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని కోరారు. చిన్నారులు మరణించిన ముజఫర్‌పూర్ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానల్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు 100 మొబైల్ ఐసీయూ యూనిట్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారంలోగా సమాధానమివ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓటర్లను తప్పుదారిపట్టించినందుకు చత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవసి లక్మాకు ఈసీ బుధవారం నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈసీ ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఈవీఎంలోని రెండో బటన్ నొక్కితే ఓటర్లు విద్యుత్ షాక్‌కు గురవుతారని లక్మా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈవీఎంలో తొలి బటన్ నొక్కండి..రెండో బటన్ నొక్కితే మీకు విద్యుత్ షాక్ తగులుతందని చత్తీస్‌గఢ్‌లోని కంకర్ జిల్లాలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో వాణిజ్య పరిశ్రమల మంత్రి లక్మా వ్యాఖ్యానించారు. లక్మా వ్యాఖ్యలు ఈవీఎంల పనితీరుపై ఓటర్లను తప్పుదారిపట్టించేలా ఉన్నాయని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుక్మా జిల్లాలోని కొంటా స్ధానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన లక్మా 2013, మే 25న బస్తర్‌లో కాంగ్రెస్ కాన్వాయ్‌పై జరిగిన నక్సల్స్ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడిలో 27 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్సైట్లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. -
మనోహర్ పరీకర్ కుమారుడికి నోటీసులు
పనజి : ఓ రిసార్టు నిర్మాణం విషయమై బాంబే హైకోర్టు- పనాజి ధర్మాసనం గోవా సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు అభిజాత్ పరీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దక్షిణ గోవాలోని నేత్రావలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. నేత్రావలి పంచాయతీ ఉప సర్పంచి అభిజీత్ దేశాయి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ మహేష్ సోనక్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ క్రమంలో వచ్చే నెల 11నాటికి అభిజాత్ పరీకర్‌తో పాటు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి, అటవీ పరిరక్షణ ముఖ్య కార్యదర్శి ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. కాగా హైడ్‌అవే హాస్పిటాలిటీ ప్రమోటర్‌గా ఉన్న అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు కారణంగా అడవి ధ్వంసం అవుతుందని పేర్కొన్న పిటిషనర్.. ఈ నిర్మాణం అనేక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. కాగా సీఎం కుమారుడికి నోటీసులు రావడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బంధుప్రీతితో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో... ‘ ఈ ప్రాజెక్టులో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదు. అభిజాత్ పరీకర్ ఆ భూమిని కొనుగోలు చేశారు. మనోహర్ పరీకర్, ఆయన కుమారుడిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ వ్యాఖ్యానించారు. -
రతన్ టాటాకు నోటీసులు
సాక్షి, ముంబై : వాదియా గ్రూప్ చైర్మన్ నస్లీ వాదియా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో స్ధానిక కోర్టు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాతో సహా ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, సంస్థకు చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది మార్చి 25కు వాయిదా వేసింది. 2016, అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తీని తొలగించిన తర్వాత రతన్ టాటాతో పాటు ఇతరులు తన ప్రతిష్టను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ అదే ఏడాది వాదియా ఫిర్యాదు చేశారు. పలు టాటా సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బోర్డులో కొనసాగుతున్న వాదియాను 2016 డిసెంబర్ నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జరిగిన ప్రత్యేక సమావేశాల్లో వాటాదారులు తొలగించారు. మిస్ర్తీతో కలిసి వాదియా టాటా గ్రూప్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని నిందితులు ఆరోపించారని వాదియా తరపు న్యాయవాది అబద్ పోండా మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ కోర్టుకు వివరించారు. అయితే నస్లీ వాదియాను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తొలగించడంలో చట్టబద్ధమైన ప్రక్రియలను అన్నింటినీ చేపట్టామని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
అనుమతి లేకుండా నా పాటలు పాడొద్దు
నా అనుమతి లేకుండా నా పాటలు పాడారంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నోటీసులు జారీ చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇళయరాజా. ‘‘నేను కంపోజ్ చేసిన పాటలు పాడుతున్న గాయకులందరకీ ఇదే నా విన్నపం. నా పాటలు పాడొద్దని మీకు చెప్పడం లేదు. కానీ, పాడే ముందు నా అనుమతి తీసుకోండి.. తీసుకోకపోతే మాత్రం నేరం. నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. నేను ఐపీఆర్‌ఎస్(ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్‌ఎస్ వసూలు చేస్తోంది. ఇకపై అలా జరగకూడదు. ఆ ఫీజు ‘దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం’ సేకరిస్తుంది. మీరు పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు? ఉచితంగా పాడటం లేదు కదా? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం కరెక్టేనా? నాకూ వాటా రావాల్సిన అవసరం లేదా? నేను అడుగుతోంది కొంచెం డబ్బు మాత్రమే. భవిష్యత్ తరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
‘స్థానిక సంస్థల’ చట్ట సవరణలపై నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సమ్మతితోనే స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎన్నికలు నిర్వహించేలా చేసిన చట్ట సవరణలకు సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ చట్టాలకు చేసిన సవరణలు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నందున ఆ సవరణల్ని రద్దు చేయాలనే పిల్‌పై వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శులకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. -
డీఎస్ కుమారుడికి నోటీసులు
సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని శనివారం నిజామాబాద్ పోలీసులు ఆదేశించారు. శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. గత వారం రోజులుగా సంజయ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై ఇటీవల నమోదైన లైంగిక వేధింపులు కేసుపై ప్రభుత్వం విచారిస్తే తప్పకుండా సహారికరిస్తానని ఇటీవల ప్రకటించిన మాజీ మేయర్ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. తమపై లైంగిక వేధింపుల వేధింపులకు పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ కేసుతో సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం అతని కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
పాల కల్తీపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల కల్తీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది. పశు సంవర్థ్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ ఎండీ, స్టే ఫుడ్ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పాలు కాదు పచ్చి విషం ’శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన కె.నర్సింహారావు లేఖ రూపంలో హైకోర్టు ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను ఆయన పిల్ కమిటీకి నివేదించగా, కమిటీలోని మెజారిటీ న్యాయ మూర్తులు సాక్షి కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేశారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించడంతో మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. -
32మంది పోలీసులకు నోటీసులు జారీ
సాక్షి, కరీంనగర్ : అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో నిందితుడు మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. మోహన్ రెడ్డి అక్రమ దందాలో పెట్టుబడులు పెట్టిన 32మంది పోలీసులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారంతా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. సాయినగర్‌కు చెందిన తనిగెల అనిల్‌కుమార్ కుటుంబ అవసరాల దృష్ట్యా 2008లో మోహన్ రెడ్డి నుంచి రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకోసం అనిల్ తన భార్య మణిమ్మ పేరుమీద ఉన్న ఇంటిని మోహన్ రెడ్డి సూచన మేరకు కసర్ల మహేందర్ రెడ్డి పేరు మీద జీపీఏ కం సేల్‌డీడ్ రాసిచ్చాడు. ప్రతి నెల వాయిదాలు కడుతున్న సమయంలో అనిల్‌కు తెలియకుండా మోహన్ రెడ్డి...కొండబత్తిన సాంబమూర్తితో పాటు మరొకరి పేరు మీద సేల్‌డీడ్ చేశాడు. ఈ విషయమై అనిల్ ...మోహన్ రెడ్డిని నిలదీయగా అప్పు చెల్లిస్తేనే ఇంటిని ఇస్తానని చెప్పడంతో వడ్డీతో కలిపి రూ.30 లక్షలు చెల్లించాడు. అయినా మోహన్ రెడ్డి ...ఆ ఇంటిని అనిల్ భార్య పేరుమీద రిజిస్ట్రర్ చేయలేదు. అంతేకాకుండా 2012లో మోహన్ రెడ్డి...మణిమ్మ ఇంట్లోకి ప్రవేశించి...ఆమెను తుపాకీతో బెదిరించి ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో అనిల్ కుటుంబం హైదరాబాద్ వలస వెళ్లింది. తర్వాత ఇల్లు పోయిందనే మనోవేదనతో మణిమ్మ గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషయమై బాధితుడు గురువారం కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
ప్రియాంకకు ఐటీ కష్టాలు
సాక్షి, ముంబయి : గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రాను ఐటీ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ అమెరికన్ టీవీ షో క్వాంటికో సిరీస్‌లోనూ నటించిన ప్రియాంక ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంది. 2011లో ఆమెపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో గుర్తించిన అక్రమాలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఆమె అందుకున్న విలాస వస్తువులకు సంబంధించి ఆదాయ పన్నును చెల్లించాల్సి ఉందని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రియాంక చోప్రా నివాసంపై 2011లో ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి పన్నులు చెల్లించని లగ్జరీ కారు, విలాసవంతమైన వాచ్‌లను అధికారులు గుర్తించారు. ఈ బహుమతులపై ప్రియాంకను ప్రశ్నించగా తన పెర్మామెన్స్‌కు మెచ్చి ఓ కంపెనీ తనకు రూ 40 లక్షల విలువైన ఎల్వీఎంహెచ్-ట్యాగ్ వాచ్‌ను, రూ 27 లక్షల విలువైన టొయోటా ప్రియస్ కారును బహుకరించాయని వెల్లడించినట్టు తెలిసింది. ఆమె నివాసంలో అన్నిలావాదేవీలు రాసిఉన్న డైరీని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటికి వెంటనే పన్ను చెల్లించాలని కోరారు. దీనిపై ప్రియాంక ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా..వృత్తిలో భాగంగా అందుకున్న బహుమతులు ఏమైనా వాటిపై పన్ను చెల్లించాలని ఆమెను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. -
జయ మృతిపై శశికళ, అపోలో చైర్మన్‌కు సమన్లు
చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డికి కమిషన్ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. జయలలితన శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించామని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు గతంలో వెల్లడించారు. మరోవైపు జయను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆమె జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనను ఇచ్చినట్లు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా పేర్కొన్న విషయం విదితమే. అంతేకాకుండా జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో శశికళ... ఎవరినీ లోనికి అనుమతించలేదని, జయను చూడనివ్వలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. దీంతో విచారణ కమిషన్... ఇందుకు సంబంధించి ఒక్కొక్కరినీ విచారణ చేస్తోంది. తాజాగా శశికళతో పాటుగా ప్రతాప్ రెడ్డి, ప్రీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇక జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియో విడుదల చేశారు. -
విశాల్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: హీరో రాధారవి పిటిషన్ వ్యవహారంలో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు విశాల్‌కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. గత ఏడాది దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విశాల్ వర్గం గెలిచిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిని నాజర్, కార్యదర్శి పదవిని విశాల్, కోశాధికారి పదవిని కార్తీ చేపట్టారు. వీరికి ముందు నిర్వాహక బాధ్యతలను నిర్వహించిన అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అవకతవకలకు పాల్పడిన ఆరోపణపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు విశాల్ వర్గం ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి రాధారవి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పు వెలువడే వరకూ రాధారవిపై చర్యలు ఉండవని ప్రస్తుత నిర్వాహక వర్గం పేర్కొంది. అలాంటిది గత సెప్టెంబర్ 22వ తేదీన హీరో రాధారవిని సంఘ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో ఇది కోర్టు ధిక్కార చర్య అవుతుందని రాధారవి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి ఎంఎం.సుందరేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. దక్షిణ భారత నటీనటుల సంఘం తరఫున హాజరైన న్యాయవాది తగిన బదులివ్వడానికి సమయం కోరగా ఈ నెల 19వ తేదీన గానీ, అంతకు ముందుగానీ నటుడు విశాల్ కోర్టుకు హాజరై ఈ కేసు వ్యవహారంలో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
అసెంబ్లీలోకి గుట్కాలు తెచ్చారంటూ....
చెన్నైః డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. నిషేధిత గుట్కాను జులై 19న సభలోకి తీసుకువచ్చినందుకు స్టాలిన్ సహా 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.గుట్కా విక్రయాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ స్టాలిన్ సభలో గుట్కాలను ప్రదర్శించారు. అయితే నిషేధిత వస్తువును అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకురావడం, ప్రదర్శించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పీకర్ పీ ధన్పాల్ రూలింగ్ ఇస్తూ సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని నివేదించారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని స్టాలిన్ సహా 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. గుట్కాలు మార్కెట్లో ఎంత సులభంగా లభిస్తున్నాయో వెల్లడించేందుకే తామలా చేశామని డీఎంకే ఎమ్మెల్యేలు చెబుతున్నారు. -
బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటూ ఒత్తిళ్లు
ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు నోటీసు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటూ విద్యార్థులు, సిబ్బందిపై ఒత్తిడి చేసినందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం... ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు బుధవారం నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో ఇందుకు జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ర్యాన్ ఇంటర్నేషనల్... నగరంలోని పేరున్న పాఠశాలల్లో ఒకటి. ఈ పాఠశాలకు నగరవ్యాప్తంగా చాలా శాఖలున్నాయి. కాగా, బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకోవాలని విద్యార్థులు, టీచర్లపై ఈ పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ సభ్యులుగా నమోదు కాని సిబ్బందికి మార్చి నెలలో వేతనం ఇవ్వలేదని కొందరు టీచర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్కూలు డెరైక్టర్ గ్రేసీ పింటో స్పందిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని ధ్రువీకరించారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంద వ్యవహారమని ఆమె తెలిపారు. గ్రేసీ పింటో ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యద ర్శిగా ఉన్నారు. అసలేం జరిగింది... వసంత్ విహార్, మయూర్‌విహార్ ఫేజ్-3, రోహిణీలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూళ్లు సిబ్బందిఒక్కొక్కరికి ఓ ఫారం ఇచ్చి పది మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. అంతే కాకుండా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించాలని కోరుతూ సభ్యత్వ టోల్‌ఫ్రీ నంబరును వాట్సప్ సందేశం ద్వారా పంపింది. పాఠశాలలు రాజకీయాలకు ఆవాసాలుగా మారడం ప్రమాదం ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టిందనే వార్తలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వివరణ కోరారు. విద్యా శాఖ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరిందని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆ పాఠశాల యాజమాన్యం మరో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ విషయం నిజమని తేలితే స్కూలుపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పాఠశాలలు రాజకీయాలకు ఆవాసాలుగా మారడం, పిల్లలకు రాజకీయ పార్టీలో చేరమని నేర్పడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీలోనే కాదు ఏ పార్టీలోనైనా చేరవలసిందిగా విద్యార్థులకు చెప్పడాన్ని తాము వ్యతిరేస్తామని చెప్పారు. -
స్కూళ్లలో లైంగిక వేధింపులపై సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్రాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఏకేసిక్రీల ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలల్లో పిల్లలపట్ల లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నా సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదనీ, చట్టపరంగా వారి పాత్ర ఏమిటని పిటిషనర్ వినీత్ధందా ప్రశ్నించారు. పిల్లలను రక్షించాల్సిన బాధ్యత స్కూళ్ల నిర్వాహకులపై ఉందని అన్నారు. -
కోడ్ ఉల్లంఘించిన ఇండిపెండెంట్ అభ్యర్థికి నోటీసు
గుర్గావ్: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థులపై చర్యలకు ఈసీ నడుంబిగించింది. బాద్షాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖేష్ శర్మ ఎలక్షన్ అధికారి నుంచి అనుమతి తీసుకోకుండానే బహిరంగ సమావేశం నిర్వహించినందుకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పీఎస్ చౌహాన్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) మంగళవారం నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల్లో సమాధానం చెప్పాలని, సకాలంలో స్పందించకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తక్షణమే చర్యలు తీసుకొంటామని నోటీసులో హెచ్చరించారు. ఎన్నికల అధికారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ముఖేష్ శర్మ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించి బహిరంగ సమావేశం నిర్వహించినట్లు ఓ హిందీ పత్రికలో మీడియా కథనం ప్రచురితమైందని, అందుకే అతడికి నోటీసు జారీ చేసినట్లు ఆర్ఓ చెప్పారు. ఇంకా పలుచోట్ల ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోకుండానే బహిరంగ సమావేశాలు నిర్వహించనట్లు పేర్కొన్నారు. ఎన్నికల మోడల్ కోడ్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని చెప్పారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన నిర్వహించామని, అక్టోబర్ 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అభ్యర్థులు కచ్చితంగా సంబందిత ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారికి చర్యలు తీసుకోంటామని చెప్పారు. -
సోనియా, మన్మోహన్లకు అనంత కోర్టు నోటీసులు
భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆరుగురు కేంద్రమంత్రులు ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన చేపట్టారని స్థానిక న్యాయవాదులు మల్లిఖార్జున, నాగన్నలు మంగళవారం అనంతపురం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ స్వీకరించిన అనంతపురం కోర్టు ప్రతివాదులైన సోనియా, ప్రధాని, ఆరుగురు కేంద్రమంత్రులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిరసిస్తూ సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతుంది. అయిన కేంద్రం తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. విభజన బిల్లు ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ నుంచి రాష్ట్రపతికి వెళ్లింది. అయితే అసెంబ్లీ తీర్మానంతో తమకు పనిలేదని రాష్ట్ర విభజన తథ్యమని కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తుంది. ఆ నేపథ్యంలో అనంతపురానికి చెందిన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.