న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్‌ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment