కేజ్రీవాల్‌కు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్పషీ్టకరణ
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు బెయిల్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టంచేసింది. అయితే తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరిని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మరోవైపు బెయిల్ తర్వాత ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చేస్తున్న ప్రసంగాలను తప్పుబడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనలను, ప్రసంగాలను సమరి్థస్తూ కేజ్రీవాల్ తరఫు లాయర్లు చేసి వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. ‘‘ ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయంగా తోచిందో దానిని ఉత్తర్వుల రూపంలో మేం వెల్లడించాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈడీ అభ్యర్థన తిరస్కరణ
‘‘ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే జూన్ రెండో తేదీన తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోండి’’ అని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీనిపై కోర్టు..‘ అది అంతా ఆయన ఊహ మాత్రమే. ఈ విషయంలో మేం ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’’ అని ఈడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
‘‘తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరికి అడ్డుచెప్పం. తీర్పుపై విమర్శలను మేం స్వాగతిస్తున్నాం. ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏ రోజున లొంగిపోవాలనేది మా ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్. ఈ ఉత్తర్వు ద్వారానే చట్టం అమలవుతుంది’’ అని కోర్టు తెలిపింది.
‘‘ సొంత ఊహలతో బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నారు. ఆయన ఏం చేద్దామనుకుంటున్నారు? వ్యవస్థకు చెంపపెట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. ‘‘ ఆయన జూన్ రెండో తేదీన తప్పకుండా లొంగిపోవాల్సిందే. అయితే ఈ కేసు గురించి ఆయన మాట్లాడొచ్చు అనిగానీ మాట్లాడకూడదు అని గానీ మేం బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది.
అమిత్ షా సంగతేంటి?: కేజ్రీవాల్ లాయర్ ‘‘సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక ట్రీట్‌మెంట్ జరిగినట్లు అనిపిస్తోంది. ఈయన బెయిల్ ఇతరుల సాధారణ బెయిల్ మాదిరి కనిపించట్లేదు. నేనే కాదు దేశంలో చాలా మంది ఇలాగే భావిస్తున్నారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న మాటలను కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోర్టుకు గుర్తు చేశారు. ఆయన సంగతేంటి?అని ప్రశ్నించారు. ఆ విషయం జోలికి తాము వెళ్లదల్చుకోలేదని ధర్మాసనం తెలిపింది. ‘‘ ఆప్‌కు ఓటేయకపోతే జైలుకు వెళ్లక తప్పదేమో అని కేజ్రీవాల్ అనలేదు. కావాలంటే ఆమేరకు కోర్టులో అఫిడవిట్ సైతం సమరి్పస్తాం’’ అని సింఘ్వీ తెలిపారు.
మద్యం కేసులో కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ వేస్తాం: ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ దాఖలుచేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు గురువారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సందర్భంగా కోర్టుకు ఈడీ ఈ విషయం తెలిపింది. ఈడీ కేసులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చుతామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు సైతం ఈడీ తెలిపింది.
అమిత్ షా వ్యాఖ్యలు అభ్యంతరకరం: కపిల్ సిబల్
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో స్పెషల్ ట్రీట్‌మెంట్ జరిగి ఉండొచ్చని అమిత్ షా మాట్లాడటం చాలా అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీల ఉద్దేశాన్నే ప్రశ్నిస్తున్నారు. జనం ఇలా అనుకుంటున్నారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. జనం మాటను మీరు(అమిత్) నమ్మకపోతే ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం ఏమొచి్చంది? జనం మాటను మీరు నమ్మితే మీ అభిప్రాయంగానే ఇంటర్వ్యూలో చెప్పాలిగానీ జనాన్ని ఎందుకు మధ్యలో లాగుతారు?’’ అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment