No Extension
-
Supreme Court: ఎలాంటి మినహాయింపులు లేవు!
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు బెయిల్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టంచేసింది. అయితే తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరిని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు బెయిల్ తర్వాత ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చేస్తున్న ప్రసంగాలను తప్పుబడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనలను, ప్రసంగాలను సమరి్థస్తూ కేజ్రీవాల్ తరఫు లాయర్లు చేసి వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. ‘‘ ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయంగా తోచిందో దానిని ఉత్తర్వుల రూపంలో మేం వెల్లడించాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ అభ్యర్థన తిరస్కరణ ‘‘ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే జూన్ రెండో తేదీన తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోండి’’ అని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీనిపై కోర్టు..‘ అది అంతా ఆయన ఊహ మాత్రమే. ఈ విషయంలో మేం ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’’ అని ఈడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ‘‘తీర్పుపై విమర్శనాత్మకమైన సమీక్ష వైఖరికి అడ్డుచెప్పం. తీర్పుపై విమర్శలను మేం స్వాగతిస్తున్నాం. ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏ రోజున లొంగిపోవాలనేది మా ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్. ఈ ఉత్తర్వు ద్వారానే చట్టం అమలవుతుంది’’ అని కోర్టు తెలిపింది. ‘‘ సొంత ఊహలతో బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నారు. ఆయన ఏం చేద్దామనుకుంటున్నారు? వ్యవస్థకు చెంపపెట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. ‘‘ ఆయన జూన్ రెండో తేదీన తప్పకుండా లొంగిపోవాల్సిందే. అయితే ఈ కేసు గురించి ఆయన మాట్లాడొచ్చు అనిగానీ మాట్లాడకూడదు అని గానీ మేం బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. అమిత్ షా సంగతేంటి?: కేజ్రీవాల్ లాయర్ ‘‘సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక ట్రీట్మెంట్ జరిగినట్లు అనిపిస్తోంది. ఈయన బెయిల్ ఇతరుల సాధారణ బెయిల్ మాదిరి కనిపించట్లేదు. నేనే కాదు దేశంలో చాలా మంది ఇలాగే భావిస్తున్నారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న మాటలను కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోర్టుకు గుర్తు చేశారు. ఆయన సంగతేంటి?అని ప్రశ్నించారు. ఆ విషయం జోలికి తాము వెళ్లదల్చుకోలేదని ధర్మాసనం తెలిపింది. ‘‘ ఆప్‌కు ఓటేయకపోతే జైలుకు వెళ్లక తప్పదేమో అని కేజ్రీవాల్ అనలేదు. కావాలంటే ఆమేరకు కోర్టులో అఫిడవిట్ సైతం సమరి్పస్తాం’’ అని సింఘ్వీ తెలిపారు. మద్యం కేసులో కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ వేస్తాం: ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కేజ్రీవాల్, ఆప్‌పై చార్జ్‌షీట్ దాఖలుచేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సందర్భంగా కోర్టుకు ఈడీ ఈ విషయం తెలిపింది. ఈడీ కేసులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చుతామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు సైతం ఈడీ తెలిపింది. అమిత్ షా వ్యాఖ్యలు అభ్యంతరకరం: కపిల్ సిబల్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో స్పెషల్ ట్రీట్మెంట్ జరిగి ఉండొచ్చని అమిత్ షా మాట్లాడటం చాలా అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీల ఉద్దేశాన్నే ప్రశ్నిస్తున్నారు. జనం ఇలా అనుకుంటున్నారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. జనం మాటను మీరు(అమిత్) నమ్మకపోతే ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం ఏమొచి్చంది? జనం మాటను మీరు నమ్మితే మీ అభిప్రాయంగానే ఇంటర్వ్యూలో చెప్పాలిగానీ జనాన్ని ఎందుకు మధ్యలో లాగుతారు?’’ అని నిలదీశారు. -
ఐటీ రిటర్నులకు డెడ్‌లైన్ జూలై 31
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీగా ఉంటుందని, చాలా మటుకు రిటర్నులు తుది గడువులోగానే వస్తాయని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై 20 వరకూ 2.3 కోట్ల పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బజాజ్ వివరించారు. కోవిడ్ పరిణామాలు, ఐటీ పోర్టల్‌లో సమస్యలు తదితర అంశాల కారణంగా గతేడాది డిసెంబర్ 31 వరకూ గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఈసారీ అలాగే జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు నెమ్మదిగా ఐటీఆర్‌లు దాఖలు చేయొచ్చులే అని భావిస్తుండవచ్చని బజాజ్ పేర్కొన్నారు. కానీ ఈసారి డెడ్‌లైన్‌ను పొడిగించే యోచనేదీ లేదన్నారు. ప్రస్తుతం రోజువారీ 15–18 లక్షల రిటర్నులు వస్తుండగా .. రాబోయే రోజుల్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ పెరగవచ్చని వివరించారు. -
మారటోరియం పొడిగింపు : కేంద్రం, ఆర్బీఐ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కాలంలో రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని ఇక మీదట పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం, ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలలకు మించి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అఫిడవిట్లో స్పష్టం చేసింది. దెబ్బతిన్న ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమాన్ని అందించలేదని వెల్లడించింది. మారటోరియం కాలంలో 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై 'వడ్డీపై వడ్డీని' వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని, క్రెడాయ్ లాంటి సంఘాల వాదనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది. (మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా) నిర్దిష్ట సెక్టార్ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడదంటూ తాజా అఫిడవిట్లో ఆర్బీఐ, ప్రభుత్వం పేర్కొన్నాయి. మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ తెలిపింది. ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా వాదించింది. వడ్డీ మీద మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్-19 కి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపింది. ఈ నేపథ్యంలోఈ రంగ కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి. కాగా ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి అక్టోబర్ 5న ఒక వారం సమయం ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటీ శాఖ స్పందించాయి. 2018-19 సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్ ఫేక్ ఆర్డర్ అనీ, ఆగస్టు 31వ తేదీ అంటే రేపటితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుందని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్త నిజమైంది కాదని సీబీడీటీ స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాలని సూచించింది. కాగా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ–ఫైలింగ్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు. It has come to the notice of CBDT that an order is being circulated on social media pertaining to extension of due dt for filing of IT Returns. It is categorically stated that the said order is not genuine.Taxpayers are advised to file Returns within extended due dt of 31.08.2019 pic.twitter.com/m7bhrD8wMy — Income Tax India (@IncomeTaxIndia) August 30, 2019 -
'సెట్ టాప్ బాక్స్‌లపై పొడిగింపు లేదు'
ఢిల్లీ: జనవరి 31వ తేదీ లోగా పట్టణ ప్రాంత వినియోగదారులు కచ్చితంగా సెట్‌టాప్‌బాక్స్(ఎస్టీబీ) అమర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడో దశ డిజిటైజేషన్ కింద ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 31లోగా ఎస్టీబీ అమర్చుకుని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు అమర్చుకోలేని కేబుల్ వినియోగదారులు వెంటనే తమ కేబుల్ ఆపరేటర్ నుంచి ఎస్టీబీలు పొందాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది. ఎస్‌బీటీలు అమర్చుకోని వినియోగదారులకు కేబుల్ టీవీ ప్రసారాలను వీక్షించే వీలుండదని పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు తమ పరిధిలో ఈ మేరకు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరింది. జనవరి 31వ తేదీ తర్వాత ఎస్టీబీలు లేకుండా అనలాగ్ సంకేతాలు ప్రసారం కాబోవని మల్టీ సిస్టం ఆపరేటర్లు(ఎంఎస్‌వోలు), లోకల్ కేబుల్ ఆపరేటర్లు(ఎల్‌ఎస్‌వో)లకు స్పష్టం చేసింది. -
అసెంబ్లీ సమావేశాలు పొడిగించేది లేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పొడిగించేది లేదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేవలం 5 రోజులకు మాత్రమే ఈ సమావేశాలను పరిమితం చేయడం సరికాదని, అనేక అంశాలు ఉన్నందున కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైనా స్టేట్మెంట్ ఇవ్వొచ్చని ఆయన చెప్పారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో లేని అంశాలను కూడా మాట్లాడొచ్చని అన్నారు. ప్రత్యేక హోదాపై తీర్మానం కోసం స్టేట్మెంట్లో ప్రస్తావించకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం స్టేట్ మెంట్ ఇచ్చేటప్పుడు సభలో ఎవ్వరూ మాట్లాడకూడదని రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికే తమ సభ్యులు ముగ్గురు మాట్లాడారని ఆయన చెప్పారు.