అసెంబ్లీ సమావేశాలు పొడిగించేది లేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పొడిగించేది లేదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేవలం 5 రోజులకు మాత్రమే ఈ సమావేశాలను పరిమితం చేయడం సరికాదని, అనేక అంశాలు ఉన్నందున కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.
ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైనా స్టేట్మెంట్ ఇవ్వొచ్చని ఆయన చెప్పారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో లేని అంశాలను కూడా మాట్లాడొచ్చని అన్నారు. ప్రత్యేక హోదాపై తీర్మానం కోసం స్టేట్మెంట్లో ప్రస్తావించకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం స్టేట్ మెంట్ ఇచ్చేటప్పుడు సభలో ఎవ్వరూ మాట్లాడకూడదని రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికే తమ సభ్యులు ముగ్గురు మాట్లాడారని ఆయన చెప్పారు.