Andhra Pradesh Legislative Assembly
-
నేడు రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 16వ రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన పోలింగ్ ఏర్పాట్లను కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్ భారతి (ఐఏఎస్), ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరా(ఐఐఎస్)లు ఆదివారం పరిశీలించారు. వారు తొలుత సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాతో సమావేశమై పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను చంద్రేకర్ భారతి.. అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎన్నికల ప్రక్రియను అంతా వీడియో తీయించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన డ్యూటీ చార్టును పటిష్టంగా రూపొందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి నిర్దిష్ట విరామాల్లో పరిమిత సంఖ్యలో వీడియోగ్రాఫర్లను ఏ విధంగా అనుమతిస్తారు, వారు వచ్చి.. వెళ్లే మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలు, మార్గాల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. తదనంతరం కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడ సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. శాసన సభా భవనం మొదటి అంతస్తులోని ఓటర్లు వేచి ఉండే 203, 205 గదులను పరిశీలించి, ఓటర్ల సూచనల ఫ్లెక్స్ బ్యానర్లను, కరపత్రాలను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా ఏఆర్వో రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో డిప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో శ్రీనివాసశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి ఉప కార్యదర్శులు, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు రాజకుమార్, వనితా రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు?
జగన్ ప్రభుత్వంపై పడినన్ని వ్యాజ్యాలు బహుశా దేశంలోనే ఏ ప్రభుత్వం పైనా పడి ఉండవు. వాటిలో తొంభై శాతం టీడీపీకి సంబంధించినవారివేనన్నది బహిరంగ రహస్యం! చంద్రబాబు ఈ మధ్యకాలంలో పార్టీ నాయకులతో కన్నా అడ్వకేట్లతో ఎక్కువ టైమ్ గడుపుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కోర్టులలో ఇంకేమి కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చన్నదే వారి ప్రధాన చర్చ అని వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో చంద్రబాబు... రాజధాని భూముల నిర్బంధ సమీకరణకు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళ్లినా, వారిని రాక్షసులతో పోల్చేవారు. తాను యజ్ఞం చేస్తుంటే ప్రతిపక్షానికి చెందిన రాక్షసులు కోర్టుల ద్వారా అడ్డు పడుతున్నారని అనేవారు. మరి వీరిని రాక్షసులు అనాలా, వద్దా అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రాత్మకమైన చర్చనే జరిపింది. శాసన వ్యవస్థకూ, న్యాయ వ్యవస్థకూ మధ్య అంతరం ఏర్పడితే వచ్చే సమస్యలు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ డిబేట్ గొప్పదనం ఏమిటంటే ఎక్కడా న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించకుండా, చాలా జాగ్రత్తగా సమ తూకంగా నిర్వహించడం! ఏ ఒక్క న్యాయమూర్తి పేరు తీసుకోలేదు. మూడు రాజధానులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న రాజ్యాంగపరమైన లోపాలను ఎత్తి చూపారే తప్ప, ఎక్కడా న్యాయ వ్యవస్థను తూలనాడలేదు. వారు చెప్పదలిచింది చెప్పారు. అది కత్తిమీద సాము వంటిదే. అయినా విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానులపై తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభలో స్పష్టంగా చెప్పారు. న్యాయ వ్యవస్థకు ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. జగన్ తన ప్రసంగంలో న్యాయ వ్యవస్థ గొప్పదనాన్నీ, శాసన వ్యవస్థ విశిష్టతనూ తెలియజేస్తూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులకు సంబంధించిన చట్టాలను ఉపసం హరించుకున్న తర్వాత వాటిపై తీర్పు ఇవ్వడం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి చట్టం చేయరాదన్న హైకోర్టు అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఆచరణ సాధ్యం కాని గడువులు పెట్టడం, ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అడి గారు. కేంద్రం రెండుసార్లు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసి రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే ఈ డిబేట్ ఒక సంచలనం అవ్వాలి. ఇలాంటి సమస్యలు మరి కొన్ని రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు. ఒకరి పరిధిలోకి మరొకరు వచ్చినప్పుడు ఇలాంటి డిబేట్లు తప్పనిసరి అవుతాయి. అందువల్ల ఇది చారిత్రాత్మక చర్యగా శాసన వ్యవస్థలో మిగిలిపోతుంది. ఉమ్మడి ఏపీలో కూడా ఒకటి, రెండు సార్లు న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై ప్రస్తావనలు వచ్చినా, ఇంత సవిస్తరంగా చర్చ జరగలేదని చెప్పాలి. హైకోర్టు తీర్పును సమర్థించిన చంద్రబాబు నాయుడు నిర్దిష్ట ప్రశ్నలకు సమా ధానం ఇవ్వకుండా కప్పదాటు ధోరణిలో అసలు తీర్పునే వ్యతిరేకించకూడదన్నట్లు మాట్లాడారు. ఇక్కడ ఒక సంగతి గుర్తు చేయాలి. స్విస్ చాలెంజ్ పద్ధతి ద్వారా రాజధానిలో కాంట్రాక్టులు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసింది. దీనిపై కొందరు ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టువారు విచారణ చేసి కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత సవరణలు చేసి కొత్త చట్టం తెచ్చింది. దీనర్థం ప్రభుత్వం తప్పు చేసిందనే కదా? కాకపోతే కొత్త చట్టం తేవద్దని ఆనాటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం తాను చేసిన చట్టాలను ఉపసంహరించుకుని కోర్టుకు ఆ సంగతి తెలిపింది. అయినా తాము విచారణ జరుపుతామని, లేని చట్టాలపై తీర్పు ఇచ్చారు. దీనిపై చంద్రబాబుకు నిర్దిష్ట అభిప్రాయం ఉంటే చెప్పి ఉండవలసింది. ఆయన అలా చేయలేదు. తీర్పు తను కోరుకున్నట్లు ఉంది కనుక దానిని సమర్థిస్తున్నారు. సింగపూర్ సంస్థ లతో ఒప్పందం అయినప్పుడు కొన్ని దారుణమైన కండిషన్లకు ఆనాటి ప్రభుత్వం ఒప్పుకుంది. 350 కోట్ల వరకే ఆ కంపెనీలు పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఐదువేల కోట్లకుపైగా వివిధ వసతుల కోసం ఖర్చు చేస్తే, వారు ప్లాట్లు వేసి అమ్ముకుంటారట. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. సింగపూర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిదన్న వ్యాఖ్యలు కూడా వచ్చాయి. మరి వైసీపీ ప్రభుత్వం రాగానే సింగపూర్ కంపెనీలు సైలెంట్‌గా ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. ఒప్పందాలే రద్దు చేయరాదంటున్న చంద్రబాబు దీనికి ఏం జవాబిస్తారు? జగన్ కంటే ముందు మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్థంగా తమ వాదనలు వినిపించారు. ధర్మాన, బుగ్గన అయితే అనేక ‘కేస్ లా’లు చదివి శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ చొరబడకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పు లన్నీ చూడకుండానే మూడు రాజధానులపై తీర్పు ఇచ్చిందా అన్న ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండదు. చట్టాలు చేసే అధికారమే చట్టసభకు లేకపోతే ఎన్నికలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు అన్న ప్రశ్నను ఏపీ శాసనసభ వేసింది. ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు గౌరవ హైకోర్టు వారు సుమోటోగా తాము ఏ కారణంతో లేని చట్టాలపై తీర్పు ఇచ్చింది వివరణ ఇవ్వగలిగితే సమాజానికి మంచిది. లేకుంటే చట్ట సభ అడిగిన ప్రశ్నలకు న్యాయ వ్యవస్థలో జవాబులు లేవేమో అన్న అనుమానం రావచ్చు. గత మూడేళ్లలో అనేక కేసులలో వెలువడ్డ తీర్పులు వివాదాలకు అతీతంగా లేవన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. కారణం ఏమైనా ఏపీ శాసనసభలో సభ్యులు ఎవరూ హైకోర్టు వారు గత మూడేళ్లలో ఇచ్చిన వివిధ తీర్పుల మంచి చెడుల గురించి ప్రస్తావించ లేదు. కేవలం మూడు రాజధానుల కేసు, చట్టసభకు చట్టాలు చేసే అధి కారం లేదన్నంతవరకే పరిమితం అయి జాగ్రత్తగా మాట్లాడుతూనే, తమ అభిప్రాయాలను నిర్మొహ మాటంగా చెప్పారు. చంద్రబాబు మరో సంగతి చెప్పారు. జగన్ ప్రభుత్వం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలట. జగన్ రాజధానులపై తన అభిప్రాయం కొంత మార్చుకుంటే మార్చుకుని ఉండవచ్చు. కానీ అదే సమయంలో అమరావతి అభివృద్ధి కూడా తన బాధ్యత అని చెప్పారు. కానీ అమరావతి, అమరావతి అంటూ కలవరించే చంద్రబాబు గానీ, ఆయన పక్ష సభ్యులు గానీ అసలు చర్చకే హాజరు కాలేదు. కేవలం నాటుసారా మరణాలు అంటూ రోజు సభలో గొడవ చేసి, చివరికి ఈలలు, చిడతలు వేసే స్థాయికి దిగజారి వ్యవహరించారే తప్ప ఇంత కీలకమైన చర్చలో పాల్గొని తమ భావాలను వ్యక్తం చేయలేదు. ఇది వారి వైఫల్యమే. దీనిని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న ఆ గ్రామాలవారు కూడా గమనించగలగాలి. రాజీనామా చేయాల్సి వస్తే చంద్రబాబు ఎన్నిసార్లు ఆ పని చేసి ఉండాల్సింది! అసలు 1994లో ప్రజలు ఎన్టీఆర్‌ను ఎన్నుకున్నారా, చంద్రబాబునా? ఎన్టీఆర్‌ను పడగొట్టి తాను అధి కారంలోకి వచ్చిన వెంటనే ప్రజల తీర్పు కోరా ల్సింది కదా? ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్ అమలు వంటివాటిని ఎత్తివేసి నప్పుడు చంద్రబాబు రాజీనామా చేసి ప్రజల మనోగతం తెలుసుకున్నారా? 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, తదుపరి అలా అడిగిన వారిని ఆశపోతులని అన్నప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? 45 వేల బెల్టు షాపులను ప్రోత్స హించినందుకు ఎవరు రాజీనామా చేయాలి? నిజానికి చంద్రబాబే స్థానిక ఎన్నికల సమయంలో అదే ప్రజాభిప్రాయం అని విజయవాడ, గుంటూరు సభలలో ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడారు. ‘ప్రజలకు బుద్ధి ఉంటే, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని భావిస్తే వైసీపీని ఓడించా’లని పిలుపు ఇచ్చారు. ప్రజలు ఆయనను ఖాతరు చేయలేదు. టీడీపీ దారుణంగా ఓటమి పాలైంది. అయినా చంద్రబాబు మళ్లీ ప్రజల తీర్పు అంటూ పాత పల్లవే ఎత్తుకున్నారు. ఏది ఏమైనా శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఉండే సున్నితమైన రేఖ చెరిగి పోకూడదు. అలా చెరిగినప్పుడే ఇలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. రెండు వ్యవస్థలు దీనిపై ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగితే అందరికీ మంచిది. - కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
Andhra Pradesh: ఈ నెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అదే రోజున శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు బుధవారం జారీ చేశారు. ఈ నెల 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు. -
కరోనా నుంచి కోలుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్) ఉంటుంది. బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం ► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు. ► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది. అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా ► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు. ► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. 15 బిల్లులు.. 20 అంశాలు ► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి. ► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్మెంట్ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది. చర్చకు రానున్న అంశాలు ► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ. ► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు, ► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. ► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు. -
ప్రజా ప్రయోజనాల కోసమే..
చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్స్ సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అది తప్పా? ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఆలస్యం జరగకూడదు. కుట్రలతో మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ‘ద టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్..’ (మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే) అని చెప్పిన అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ సూక్తిని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకోవాలి. -సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నడుస్తున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ దీనికి కారణాలను సోదాహరణంగా వివరించారు. అసలు శాసనమండలి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? గతంలో దీన్ని సమర్థించిన పత్రికలు, టీడీపీ ఇప్పుడు ఎలా యూటర్న్ తీసుకున్నాయి? అనే అంశాలను వివరించారు. నాడు రామోజీరావు కోసం శాసనమండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేస్తే అద్భుత నిర్ణయమని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసిన ఈనాడుకు ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా మీ ద్వంద్వనీతి? అని ప్రశ్నించారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా? ‘‘అధ్యక్షా.. ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న సంగతి మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా బతికించుకోవాలా.. వద్దా? అన్న ప్రశ్న మనముందు ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పని చేయలా.. వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. భరించలేక వద్దనుకున్నాయి.. ఇప్పుడు శాసనమండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర). మండలిని భరించలేక ఈ వ్యవస్థ వద్దని పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. నాడు మాకు బలమున్నా కొనుగోలు చేసి గెలిచారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. ఇదే విషయాన్ని తొలిరోజే సభలో చెప్పా. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి ఈ చట్టసభలో అడుగుపెట్టామే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. మండలి తప్పనిసరి కాదు రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే శాసనసభలో ముగ్గురు పీహెచ్డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు, ఇద్దరు గ్రూప్ – 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది? సోమవారం శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చిస్తున్న అసెంబ్లీ కాలయాపనకే కౌన్సిల్.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండళ్లను ఏమనాలి? కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలిపై డబ్బులు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఈ మండలికి అర్హత లేదు. ఇటువంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అని అంతా ఆలోచించాలి. మండలికి శాసనసభ జవాబుదారీ కాదు. పేదలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తెచ్చిన ప్రత్యేక కమిషన్ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎలా హాని చేయాలి? బిల్లులను ఎలా అడ్డుకోవాలి? కత్తిరించాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలు చేసే అలాంటి సభ మనకు అవసరమా? అన్నది ఆలోచన చేయాలి. నాడు ఈనాడు సమర్థించలేదా..? మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్ పేపర్ ఈనాడు దాన్ని సమర్థిస్తూ సంపాదకీయాలు రాసింది. అప్పుడు ఈనాడు ఏమేం రాసిందంటే... (క్లిప్పింగ్‌లను సీఎం చదివారు) అనుభవంలో వాటి (మండళ్ల) నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. నిరర్ధకమే కాక గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది.రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచిపేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఇలా ఎంత చక్కగా రాశారు అధ్యక్షా అప్పట్లో! రామోజీ కోసం రద్దు చేశారు.. ఆనాడు మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారు అధ్యక్షా. ఆ మనిషి సాక్షాత్తూ ఈనాడు అధినేత రామోజీరావు. ఆనాటి రాజకీయాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం తెలుసు. ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలినే రద్దు చేసిన పరిస్థితి. అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప సంపాదకీయాలు రాశారు. ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుతగులుతున్నారు. అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాది మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజల అవసరాలు, ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దు కోసం తీర్మానం చేస్తున్నాం. ఆకర్ష్ అంటూ సిగ్గుమాలిన రాతలు.. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాస్తున్నాయి. ఇంత దిగజారిన రాతలు చంద్రబాబు పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లంతా చంద్రబాబు హయాంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా కనీసం నోరెత్తారా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదు? నోరెత్తకపోగా చంద్రబాబు గొప్ప రాజనీతి చాణక్యుడని, ఆయన పరిపాలన చూసి ముగ్దులై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటూ దిక్కుమాలిన కథనాలు రాశాయి. చర్చ జరగాలనే మూడు రోజులు టైం మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని టీడీపీ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మేం సమయం ఇవ్వకుంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేసేవారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో, మోదీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో చంద్రబాబు ఎన్నెన్ని యూటర్న్లు తీసుకున్నాడో గత ఐదేళ్లలో చాలా చూశాం. నిజంగా మాటలు ఎవరు మార్చారో ఒక్కసారి వీటిని చూస్తే తెలుస్తుంది (బాబు వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). అవసరం తీరిన తరువాత ఎవరినైనా వెన్నుపోటు పొడవటానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి బాబు. చంద్రబాబు యూటర్నులు కాంగ్రెస్ పార్టీ గురించి ముందు.. - కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీనా? చెత్త పార్టీ. ఇది సోనియాగాంధీ సామ్రాజ్యం కాదు. ఇది ఇటలీ కాదు ఇది ఇండియా - కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి...? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలి. అప్పుడు కూడా కసి తీరదు - సోనియా, రాహుల్ ఇంతవరకు ఒక్క మాట అయినా విభజన గురించి మాట్లాడారా? మీకు చేతకాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మీ గురించి అని అడుగుతున్నా. - ఆ మహాతల్లి (సోనియా)కి ఎక్కడ లేని డబ్బు పిచ్చి. డబ్బులు లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదు. సోనియా ఇటలీ నుంచి వచ్చింది. మన కష్టాలు తెలిసిన వ్యక్తా? కాదు. - కాంగ్రెస్‌ను ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతా. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. ఆ వెంటిలేటర్ ఎప్పుడు తీసేస్తే అప్పుడు చనిపోతుంది. - కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. నీచమైన రాజకీయాలు చేస్తోంది. æ సోనియాగాంధీ ఈ దేశానికి వచ్చి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకువచ్చిందంటే చాలా దుర్మార్గం - తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్‌తో లాలూచీ పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఉండబోదు తరువాత - కాంగ్రెస్, మేమూ కలసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. - పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. 90 శాతం డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. - మోదీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కొత్త ప్రధాని వస్తారు. - మేము కూర్చొని మాట్లాడుతున్నాం. రాహుల్‌ను కూడా ఆయన పార్టీలో చర్చించమని కోరా. మేం ఓ ఉమ్మడి వేదిక మీదకు వస్తాం. కలసి ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తాం. నరేంద్ర మోదీ గురించి ముందు.. - మోదీ సమర్థుడు. ఆయన ప్రధాని కాబోతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు. నాదీ నరేంద్రమోదీదీ విన్‌విన్ కాంబినేషన్. - అభివృద్ధి కోసం మోదీతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను. - స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ భారతదేశం ప్రతిష్టను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ. - సమర్థుడైన మోదీ నాయకత్వంలో భారతదేశం త్వరలోనే సూపర్వపర్గా తయారవుతుంది. - మోదీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. తరువాత... - గురువుకు నామాలు పెట్టింది నరేంద్ర మోదీ. తల్లిని చూడలేదు. తల్లికి బిచ్చం పెట్టనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంట. - నరేంద్రమోదీ కంటే మిగతా నాయకులంతా మెరుగైన వారే. - నరేంద్రమోదీ కరుడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. - నరేంద్ర మోదీకి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. - హుందాతనం ఏమైంది. పోలవరం ఈయన ఇచ్చాడంటాడు... ఈయన ఇచ్చేదేంటి పోలవరం. మన రాజధాని శంకుస్థాపనకు ఆయన్ని పిలిచాను. ఏం ఇచ్చారు...మట్టీ, నీళ్లు మన ముఖాన కొట్టాడు. - మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా గురించి ముందు .. - ప్రత్యేక హోదా ఇవ్వాలి ఐదేళ్లు ఇచ్చారు. నరేంద్రమోదీని కోరుతున్నా 15 ఏళ్లు ఇవ్వండి. ఐదేళ్లలో పరిశ్రమలు రావాలంటే రెండుమూడేళ్లవుతుంది. అది ప్రారంభమయ్యేలోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. తరువాత - కావాలని కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే అదేదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందండి? రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ... రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు తగ్గించేశారు. 62 శాతం నుంచి 52శాతానికి వచ్చింది. ఇక ఈఏపీ ఏంటీ... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ...మళ్లా వాళ్లు మంత్రిమండలిలో ఆమోదించాలి. - నేను మొదట అడిగింది ప్రత్యేక హోదానే. కాదు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారన్నారనుకో. నేను కాదనను కదా. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? - ప్రత్యేక హోదాతోనే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు , పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదేం... - ఈ రోజు కేంద్రం ఇచ్చిందానికి అభినందిస్తూనే...వాళ్లు ఎంతిచ్చినా తీసుకోవడం...ముందుకు పోవడం తప్పా మనకు మరో మార్గం లేదు. మళ్లీ : ప్రత్యేక హోదా మినహా మనకు మరో మార్గం లేదు. చంద్రబాబూ ఈ ప్రశ్నలకు బదులేది? - ఎస్సీ ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తెచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? - రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులు తేవడం న్యాయమా.. అన్యాయమా? - ఏ అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు? రైతులకు కౌలు (యాన్యుటి) 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా? - రాజధానిలో భూమి లేని నిరుపేదలకు జీవనభృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం అన్యాయమా? - అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మేం చేసిన తప్పా? - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా? - వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా? - స్వాతంత్య్రానికి పూర్వం 1937నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా? -
కరెంట్ కోతలపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చట్టసభల సాక్షిగా ప్రతిపక్షం విద్యుత్ అంతరాయాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అబద్ధాలు చెప్పడమే విపక్షానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి లేవనెత్తిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బదులిచ్చారు. ఈ దశలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం జోక్యం చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గా ఉందా లేదా అనేది వివరాలతో సహా చెబుతున్నాం. కనీసం ఇది కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవడంలేదు. విద్యుత్ అంతరాయాల వివరాలు ఎవరికి తెలుస్తాయి.. సంబంధిత మంత్రికి కాదా. చట్టసభలో మీరు పదేపదే అబద్ధాలు మాట్లాడుతుంటే వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి సమాచారం తెప్పించి, సభ ముందు ఉంచాలనే నేను కల్పించుకుని మాట్లాడుతున్నాను’ అని అన్నారు. విద్యుత్ వ్యవస్థను అప్పుల్లోకి నెట్టారు మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని రూ.70వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విభజన నాటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందనే విషయాన్ని వక్రీకరించారన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం విద్యుత్ లైన్లు, ఫీడర్లను పరిశీలించ లేదన్నారు. తాము ఈ పనిచేశామని, దీనివల్ల అక్కడక్కడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయన్నారు. గతేడాదితో పోలిస్తే తక్కువ ఫీడర్లు, తక్కువ గంటల్లోనే అంతరాయం నమోదైందన్న విషయాన్ని సభ ముందుంచారు. విద్యుత్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, 2021 నాటికి మరో 1600 మెగావాట్ల అదనపు ఉత్పత్తి వస్తుందని తెలిపారు. -
బెడిసికొట్టిన చంద్రబాబు ఎత్తుగడ
సాక్షి, అమరావతి: రాజధాని అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావించి టీడీపీ శాసనసభలో మరోసారి బొక్కబోర్లా పడింది. అమరావతి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం అనుసరించిన స్విస్ చాలెంజ్ విధానాన్ని సమర్థించుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఇక సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం అంటూ చేసిన వాదన కూడా ఆయన చదివి వినిపించిన లేఖతోనే నీరుగారిపోవడంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. అమరావతి అంశంలో తమ ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. పత్రాలు ఉంటే కదా.. తేవడానికి రాజధాని అంశంపై శాసనసభలో మంగళవారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్సీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఎన్నో ఏళ్ల క్రితమే తప్పుబట్టిన స్విస్ చాలెంజ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం అనుసరించడం వెనుక భారీ అవినీతి దాగుందని దుయ్యబట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రస్ అల్ ఖైమాకు చెందిన ఆన్‌రాక్ సంస్థతో స్విస్ చాలెంజ్ విధానంలోనే అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని విమర్శించారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వంతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్సార్ ప్రభుత్వం ఆన్‌రాక్ సంస్థతో స్విస్ చాలెంజ్ విధానంలో ఒప్పందం చేసుకుందని టీడీపీ నిరూపిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా’’ అని సవాల్ విసిరారు. తన ఆరోపణలను నిరూపిస్తానని అన్న చంద్రబాబు తన పక్కనే ఉన్న అచ్చెన్నాయుడుకు ఏదో చెప్పి బయటకు పంపించారు. కాసేపటికి అచ్చెన్నాయుడు ఒట్టి చేతులతో సభలోకి వచ్చారు. వెంటనే మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘‘అచ్చెన్నాయుడూ.. ఏవీ పత్రాలు? తేలేదా? ఉంటే కదా తేవడానికి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించలేదు’’ అని స్పష్టం చేశారు. దాంతో చంద్రబాబు మాట మార్చారు. వైఎస్సార్ ప్రభుత్వం ఆన్‌రాక్ సంస్థతో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుందని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘‘స్విస్ చాలెంజ్ విధానానికి, ఎంవోయూకు తేడా తెలియని చంద్రబాబు మొన్నటివరకు సీఎంగా ఉండటం మన ఖర్మ. రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు గత ఐదేళ్లు సీఎంగా ఉండటంతోనే ఎక్కువ నష్టం జరిగింది’’ అని ఘాటుగా విమర్శించారు. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వంతో టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని చంద్రబాబు చెప్పడాన్ని మంత్రి బొత్స తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదని, ఓ కంపెనీతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. వెంటనే చంద్రబాబు స్పందిస్తూ.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. ఆ లేఖలో ‘సింగపూర్ కంపెనీల కన్సార్టియం’ అని ఉండటాన్ని వైఎస్సార్సీపీ సభ్యుడు పార్థసారథి ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని బొత్స విమర్శించారు. ఎన్.జనార్థన్‌రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే.. తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు ఆయనే శంకుస్థాపన చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని బొత్స సవాల్ విసిరారు. -
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
-
వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయి?
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి నీరు లీకేజీ ఘటనపై సీఆర్డీఎ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే వైఎస్ జగన్ చాంబర్లోకి వర్షపు నీళ్లు లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలన జరిపారు. లీకేజీ ఎక్కడి నుంచి జరిగిందన్న విషయంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయంటూ రూఫ్ పైన ఫైర్ ఇంజిన్‌తో నీటిని పంప్ చేసి పరిశీలించారు. సీలింగ్ లో ఏర్పడిన లోపం కారణంగానే నీరు లీకైనట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మంగళవారంనాడు కురిసిన వర్షంతో చాంబర్ సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారడంతో.. ఆ అంశంపై శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి కూడా ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్లో వర్షపు నీరు పైనుంచి లీకై చేరింది. ఆ ఘటనపై అప్పట్లో రాద్ధాంతం చేసిన అధికార పార్టీ తూతు మంత్రపు విచారణ జరిపించింది. పైగా నీరు లీకేజీకి సంబంధించి కుట్ర ఉందని అధికార పార్టీ హైడ్రామాకు తెరలేపింది. అప్పట్లో పైపై రిపేర్లు చేసి నట్టు ప్రకటించారు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ప్రతిపక్ష నేత చాంబర్లోకి మరోసారి నీరు లీకవడం గమనార్హం. -
నేడు ప్రైవేట్ వైద్యం బంద్!
విజయవాడ : ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు సంబంధించిన మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దీనివల్ల చిన్న ఆసుపత్రులు మూతపడతాయని, ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) వ్యతిరేకించింది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు(గురువారం) వైద్యం బంద్‌కు పిలుపినిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ చట్టం ఉంది. మళ్లీ కొత్తగా కేంద్రం తెచ్చిన ఈ చట్టానికి ఎందుకు ఆమోదం తెలపాలని, ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓపీ సేవలు నిలిపివేత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం అందించనున్నారు. భవిష్యత్ కార్యచరణపై ఐఎంఎ హాల్లో వైద్యులు సమావేశం కానున్నట్లు డా.వాడ్రేవు రవి తెలిపారు. -
మనిషిని కోసుకొని తింటే..
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో టీడీపీ-బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌లు పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో గంటా.. ‘బీజేపీ అంటేనే మనుషులను కోసుకుని తినే పార్టీ’ అని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే: ఏపి విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియపై బుధవారం మండలిలో స్వల్ప చర్చ జరిగింది. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. 17 జాతీయ సంస్థలకుగానూ ఏపీ ప్రభుత్వం 3508 ఎకరాలు కేటాయించిందని, ప్రస్తుతానికి ఐదు విద్యా సంస్థల్లో క్లాసులు నడుస్తున్నాయని,అయితే శాశ్వత నిర్మాణాలు పూర్తికానందున వాటిని తాత్కాలిక భవనాల్లోనే తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. సంచలన వ్యాఖ్యలు: ‘‘బిల్డింగ్స్ లేని కారణంగా సీట్లు నిండటంలేదు. నిర్మాణాలు చేపట్టమని కేంద్రాన్ని అడిడితే స్థలం ఇవ్వలేదని సాకులు చెబుతోంది. చాలా సార్లు కేంద్ర మంత్రిని కలిసినా ఫలితంరాలేదు. అధ్యక్షా.. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఏపీపై కక్షకట్టి అన్యాయం చేస్తున్నది. కోడి కోసుకుని తింటే అది చికెన్ పార్టీ, మేకను కోసుకుని తింటే అది మటన్ పార్టీ, అదే మధ్యతరగతి మనిషిని కోసుకుని తింటే అది భారతీయ జనతాపార్టీ’’ అని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. బీజేపీ ఫైర్: తమ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి గంటాపై బీజేపీ సభ్యులు ఫైరయ్యారు. ‘‘తలుచుకుంటే మీకన్నా ఎక్కువే అనగలం. కానీ ఇది అసెంబ్లీ అన్న సంగతి మర్చిపోవద్దు. మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత అనుచితంగా మాట్లాడటం సరికాదు’’ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30,31, వచ్చే నెల 1, 5న సెలవుగా ప్రకటించారు. అలాగే 28 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నదుల అనుసంధానం బీజేపీ చొరవే: వీర్రాజు
సాక్షి, అమరావతి: కేంద్రం చొరవతోనే రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ పథకం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం శాసన మండలిలో తెలిపారు. గురువారం మండలిలో ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నదుల అనుసంధానం మొదటగా బీజేపీయే ప్రవేశ పెట్టిందని అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1998లోనే నదుల అనుసంధానం కోసం సురేష్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశరని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగానే కాలువలు తవ్వించారని వీర్రాజు పేర్కొన్నారు. పోలవరం మాదిరిగానే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఓ వారం కేటాయించాలని సూచించారు. ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి కారణం బీజేపీయేనని వీర్రాజు తెలిపారు. ఆ మండలాలను ఆంధ్రలో కలపకుంటే కేసీఆర్ పోలవరానికి అడ్డుపడేవాడని ఆయన అన్నారు. -
పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..
సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. 30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి.. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రుల భాష సరిగా లేదు ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. -
క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఉపయోగించిన మాటలు కొన్ని కులాలను కించపరిచేలా ఉన్నాయని గ్రహించినట్లు, అందుకుగానూ క్షమాపణలు కూడా చెబుతున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై నేను మండలిలో మాట్లాడాను. ఆ సందర్భంగా.. టీడీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని పదాలను వాడాను. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ మణిశంకర్ అయ్యర్ వాడిన పదాలు ఎంత వివాదాస్పదమయ్యాయో గుర్తురాగానే.. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చైర్మన్‌కు తెలిపాను. నా మాటలతో గాండ్ల కులస్తుల హృదయాలు గాయపడినందున క్షమాపణలు కోరుతున్నా’’ అని వీర్రాజు పేర్కొన్నారు. సోము ప్రకటన.. -
మరోసారి మాట మార్చిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మాట మార్చారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన... సభలో కొత్త పల్లవి అందుకున్నారు. పోలవరం నిర్మాణ పనుల్ని తాను అడగలేదని ...నీతి ఆయోగ్ సిఫార్సుతోనే కేంద్రం తనకు అప్పగించిందని చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించిందని క్యాబినెట్‌తో పాటు, అసెంబ్లీలో చెప్పుకున్న చంద్రబాబు...ఇప్పుడిలా మాట మార్చడంపై ఇతర పార్టీ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇక చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.....‘హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని అడిగారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు వెనక్కి వెళ్తోంది. నా మీద ఒక్కొక్కర్ని పంపి దాడి చేయిస్తారా?. నేను ఆగస్టు సంక్షోభం, విభజన సంక్షోభం చూశాను. ఇప్పుడు మూడో సంక్షోభం చూస్తున్నాను. సహకరిస్తామన్న మిత్రపక్షం, యుద్ధం చేస్తానంటోంది. పోలవరాన్ని నేను తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నేను తీసుకోలేదు. కేంద్రమే అప్పగించింది. రాత్రి కల వస్తే..పొద్దున్నే కొంతమంది మాట్లాడుతున్నారు. నేను భూసేకరణ, పునరావాసం డబ్బులు ఇస్తానని చెప్పలేదు. పోలవరంలో ఎవరైనా చేతులు పెడితే అవి కాలిపోతాయి. నేను ప్రాజెక్ట్ కోసం లాలూచీ పడ్డట్లు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. -
ఎన్నికలు దగ్గరపడేసరికి హోదా రాగం అందుకున్నారు
-
ప్రత్యేక హోదాపై తిరగబడ్డ తీర్మానం
-
అసెంబ్లీ: ప్యాకేజీపై చంద్రబాబు గతంలో ఏమన్నారు..
-
అసెంబ్లీ: హోదా తీర్మానంపై బాబు ఇప్పుడేమన్నారు..!
-
హోదా.. అసెంబ్లీలో అనూహ్య తీర్మానం!
-
హోదాపై యూటర్న్ : అసెంబ్లీలో తీర్మానం!
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి పిల్లిమొగ్గ వేసింది. గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటూ.. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ అదే శాసనసభ వేదికగా మరోసారి తీర్మానం చేసింది. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్న ముమ్మరం చేసిన తరుణంలో చంద్రబాబు సర్కారు హోదాపై ఈమేరకు యూటర్న్ తీసుకుంది. గతంలో ప్రత్యేక హోదా కంటే గొప్ప ప్యాకేజీని తీసుకొచ్చామంటూ.. ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి అభినందనలు తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు తీర్మానం చేసింది. ఆ విషయాన్ని, గతంలో ప్యాకేజీ గురించి చంద్రబాబు చెప్పిన గొప్పలను నిస్సంకోచంగా మరిచిపోయిన టీడీపీ సర్కారు.. ఇప్పుడు మళ్లీ హోదా మాట ఎత్తుకుంది. హోదా సాధనకు ప్రజలు ఆందోళనలకు సిద్ధమవుతుండటం, హోదా కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పోరాటాలను తీవ్రతరం చేసిన నేపథ్యంలో హోదా కోసం బాబు ప్రభుత్వం తీర్మానం చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హోదాపై తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. -
చంద్రబాబూ.. అది నిజం కాదా!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పడం అవాస్తవమని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుండానే డబుల్ డిజిట్ గ్రోత్‌ను రాష్ట్రం సాధించిందా? అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వకుండానే 24 గంటల విద్యుత్ సరఫరా వచ్చిందా? అని ప్రశ్నించారు. సాంకేతికంగా సాధ్యపడదు కాబట్టే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని గతంలో చంద్రబాబు స్వాగతించిన విషయం నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలుపాలని డిమాండ్ చేశారు. -
ఆ లేఖలు ఇచ్చింది చంద్రబాబే
-
ఆ లేఖలు ఇచ్చింది చంద్రబాబే : సోము వీర్రాజు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండుసార్లు లేఖలు ఇచ్చారని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. ఏపీ అసెంబ్లీ మండలిలో ఆయన మాట్లాడుతూ సీపీఎం మినహా అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరించాయని చెప్పారు. అంతా సమన్యాయం అన్నారే తప్ప ఏ ఒక్కరూ ఏపీకి ఏం కావాలనే విషయాన్ని అడగలేదని అన్నారు. విభజన సమయంలో ఏపీ గురించి పార్లమెంటులో మాట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. టీడీపీ ఏపీలో సమైక్య ఉద్యమం, తెలంగాణలో విభజన ఉద్యమం చేసిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ 1200 హామీలు చేసిందని, అందులో ఏ ఒక్క హామీని కూడా టీడీపీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీలు పదేళ్లలో అమలు చేయాలని ఉంటే తాము మాత్రం మూడేళ్లలోనే చాలా వరకు అమలు చేశామని చెప్పారు. బీజేపీని నిందిస్తే ఏపీకి మంచి జరగదని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. -
ఏపీ వ్యవసాయ బడ్జెట్ విశేషాలు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం రాష్ట్ర అసెంబ్లీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 19,070 కోట్లతో ఆయన వ్యవసాయ చిట్టాపద్దును సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్లోని విశేషాలు ఇవి.. రూ.19.070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం రెవిన్యూ వ్యయం రూ.18,602 కోట్లు పెట్టుబడి వ్యయం రూ.468.38 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు 4.730 కోట్లు మొక్కజొన్న ఉత్పత్తి లో దేశంలో ఏపీ రెండో స్థానం వరి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఏపీ రసాయన ఎరువుల వాడకంలో దేశంలో ఆరో స్థానం రైతులకు 100శాతం రాయితీతో సూక్ష్మపోషకాల పంపీణి నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం ఆధార్ అనుసంధానం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ఏర్పాటు బత్తాయి ఉత్పతిలో ద్వితియ స్థానం సూక్ష్మపోషకాల సవరణకు రూ.60కోట్లు అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ రుణమాఫీ కోసం 4,100 కోట్లు వేరుశనగ విత్తనాలకు 90 శాతం రాయితీ విత్తన రాయితీలు రూ.220కోట్లు పట్టు పరిశ్రమకు రూ.175 కోట్లు మత్స్యశాఖకు రూ.386 కోట్లు కరువు నివారణకు రూ. 1042 కోట్లు వ్యవసాయ మార్కెటింగ్ టెక్నాలజీకి రూ. 35 కోట్లు ఎరువు కొరత నివారణకు రూ.45 కోట్లు పశుసంవర్థనశాఖకు రూ.1225 కోట్లు మెగా సీడ్‌పార్క్‌కు రూ.100 కోట్లు పావలా వడ్డి రుణాలకు రూ.5 కోట్లు చంద్రన్న రైతు క్షేత్రాకు రూ.15 కోట్లు ప్రధాన ఫసల్ బీమా యోజన రూ.485 కోట్లు రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు వ్యవసాయ యాంత్రికరణకు రూ.258 కోట్లు -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన
-
ఏపీ అసెంబ్లీలో అసక్తికర సన్నివేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గురువారం బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా దినోత్సవాన్ని మర్చిపోయారు. ప్రత్యేకంగా మహిళా దినోత్సవంపై మాట్లాడాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరగా తన సీట్లో లేచిన ఆయన ఆ విషయం కాకుండా ఇతర విషయాలు మాట్లాడారు. విభజన అంశం నుంచి హోదా వరకు పలు కోణాల్లో మాట్లాడి ఇక సెలవు అంటూ కూర్చున్నారు. అయితే, పక్కనున్నవారు మహిళా దినోత్సవాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయగా ఏమిటీ అంటూ అడిగే ప్రయత్నం చేశారు. ఈలోగా స్పీకర్ మరోసారి ఉమెన్స్ డే అంటూ గుర్తు చేశారు. దాంతో వెంటనే లేచిన చంద్రబాబు.. ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మహిళలకు తన అభినందనలు, శుభాకాంక్షలు అన్నారు. ఈరోజు అన్నిరంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. అంతకు ముందు తమ మంత్రి పదవులకు రాజీనామాలు బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాట్లాడారు. -
‘టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం’
సాక్షి, అమరావతి : రాజ్యసభలో మొదట హోదా గళం వినిపించింది వెంకయ్యనాయుడేనని, చంద్రబాబు అప్పుడు నోరుమెదపలేదని మంత్రి పదవికి రాజీనామా చేసిన మాణిక్యాలరావు అన్నారు. ఏపీకి అండగా నిలవాలన్న తమ పార్టీని దోషిగా చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజన ద్వారానే రాష్ట్రానికి మేలు జరిగిందన్నారు. బీజేపీని నిందిస్తూ టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొడతామని చెప్పారు. తాను మంత్రి అయ్యేందుకు వెంకయ్యనాయుడే కారణమని అన్నారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నందుకే తాము రాజీనామా చేశామని చెప్పారు.మంత్రిగా తాను అవినీతికి తావివ్వలేదని తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హోదాకు దీటుగా ప్యాకేజితో ఏపీని ఆదుకునేందుకు బీజేపీ ముందుకొచ్చిందన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ సహకరిస్తారని చెప్పుకొచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా తన నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరారు. -
అసెంబ్లీ ప్రారంభం.. కామినేని వివరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టేరోజే బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేయడంతో సమావేశాలు ప్రారంభంకాగానే వారు తమ రాజీనామ లేఖలపై మాట్లాడారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మంత్రి మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను చంద్రబాబుకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామినేని మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం జరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు బీజేపీనే కారణం అన్నారు. తాను బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. తన శాఖ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పారు. -
ఏపీ అసెంబ్లీలో రక్తికట్టిన మిత్రపక్షాల చర్చ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అనేక విశేషాలు, వింత పరిణామాలు చోటుచేసుకున్నాయి. కట్టే విరుగదు..! పాము చావదు..!! అన్న చందంగా అధికార టీడీపీ సమావేశాలను రక్తికట్టించింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఆసాంతం అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీ నేతలు పరస్పరం నేను గిల్లినట్టు చేస్తా...! నువ్ ఏడ్చినట్టు చేయి...!! అన్నట్టు సాగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు ఒకవైపు మంత్రులుగా కొనసాగుతూనే మరోవైపు ప్రత్యేక హోదా కోసమంటూ ఢిల్లీలో పార్లమెంట్ బయట ప్లకార్డు ఆందోళన చేస్తున్న తరహాలోనే.. ఏపీ అసెంబ్లీలోనూ అలాంటి దృశ్యాలే ఆవిష్కరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ కోసం ఆందోళన చేస్తుండటంతో పాటు పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేసేవరకు అసెంబ్లీకి హాజరుకాబోమని ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో ఏకైక ప్రతిపక్షం లేకుండానే శాసనసభ సమావేశాలు సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. గడిచిన నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలకు పూర్తి భిన్నంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్యాకేజీ వస్తున్నప్పుడు హోదా ఎందుకని అనేక సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు ఈరోజు సభలో అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలపై 52 పేజీలతో 19 అంశాలపై రూపొందించిన వివరాలను ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంలోని మిత్రపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని సుతిమెత్తగా కోరారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో ఈ అంశాలపై వివరిస్తున్న సందర్భంలో ప్రతిసారీ ఆయన బీజేపీ సభ్యుల వైపు చూస్తూ మాట్లాడారు. గడిచిన నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లినట్టుగా చంద్రబాబు చెప్పుకున్నారు. అయితే వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా కోసమే వెళ్లినట్టుగా చెప్పుకోవడం గమనార్హం. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును ప్రకటించిన తర్వాత దాన్ని నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని అప్పట్లో పట్టుబట్టిన చంద్రబాబు అసెంబ్లీలో మాత్రం అందుకు భిన్నంగా నీతి ఆయోగ్ సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రం తీసుకుందని చెప్పుడం విశేషం. 2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి ముందు జరిగినట్టుగా ఒక కొత్త విషయాన్ని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు భీష్మించినట్టు చంద్రబాబు సభలో చెప్పుకున్నారు. నాలుగేళ్ల కిందట సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడుగానీ ఆ తర్వాత గానీ ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు వెళ్లడించలేకపోయారే చంద్రబాబు వివరించలేదు. తాను అలా హెచ్చరిక చేసినందుకే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ సమావేశంలోనే ప్రధాని మోదీ ఆ మండలాలను కలిపారని చెప్పారు. నాలుగేళ్లు గడిచినా అడుగు ముందుకు పడని పోలవరం గురించి అంత గట్టిగా హెచ్చరిక జారీ చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏడు మండలాల కోసం ఆనాడు ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని తేల్చిచెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంగానీ పార్లమెంట్ ద్వారా చేసిన విభజన చట్టంలో ఇచ్చిన హామీల విషయంలో మాత్రం అలాంటి గట్టి హెచ్చరిక ఎందుకు ఇవ్వలేకపోయారో శాసనసభలో చెప్పలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు డిమాండ్ చేసింది. తాము తప్పుకుంటే వాళ్లు దగ్గరవ్వాలని చూస్తున్నారంటూ ప్రతివిమర్శ చేశారే తప్ప ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారన్నది వాస్తవం. ఏడు మండలాల కోసం ప్రమాణ స్వీకారం చేయనని హెచ్చరించిన చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం మిత్రపక్షంగా ఉండటం పక్కన పెడితే కేంద్రంలో కనీసం మంత్రిపదవులను వదులుకోవడానికి కూడా సిద్ధపడకపోవడం గమనార్హం. అలాగే, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన మంత్రులను నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏరోజూ ఆ మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లలేదు. కానీ బుధవారం అసెంబ్లీ చర్చ సందర్భంగా మాత్రం బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అక్కడ కూర్చొని ప్రత్యేక హోదా సాధన కోసం పనిచేయాలని సూచించడం విశేషం. దాదాపు రెండున్నర గంటలకుపైగా ప్రసంగించిన చంద్రబాబు అనేక పరస్పర విభిన్నమైన రీతిలో మాట్లాడారు. కేంద్రం నుంచి రావలసిన నిధులకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికేట్లు (యూసీ) ఇవ్వని కారణంగా నిధులు విడుదల కాలేదని కేంద్రం చెబుతోందని అంటూ ఆ సర్టిఫికేట్లు ఎప్పుడు పంపిందీ చెప్పే ప్రయత్నం చేశారు. తన చేతిలో ఉన్న పత్రాలను చూస్తూ గత నెల ఫిబ్రవరిలో యూసీ సర్టిఫికేట్ పంపినట్టు చదివిన చంద్రబాబు (నెల రోజులు కూడా కాకపోవడం) ఆ తర్వాత ఎందుకనో మిగతా వివరాలు చెప్పకుండా దాటవేశారు. గడిచిన నాలుగేళ్లుగా అనేకసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఎప్పుడూ ప్రస్తావించని చంద్రబాబు బుధవారంనాడు మాత్రం ఏకంగా ఒక పుస్తకాన్ని తెచ్చి చదవడం గమనార్హం. హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లను అభివృద్ధి చేసింది తానేనని చెబుతూ వాటి నిర్మాణాలకు కేంద్రం నుంచి డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. (ఈ రెండూ చంద్రబాబు హయాంలో వచ్చినవి కాదు) నిధులు విడుదల చేయలేదంటూ కేంద్రంపై ఒకవైపు సుతిమెత్త విమర్శ చేస్తూనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ లాంటి వాటికి నిధులు అడక్కుండానే పూర్తి చేశానని చెప్పడం విడ్డూరంగా కనిపించింది. రాహుల్ గాంధీ సంతకం చేస్తారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా కల్పనపై గడిచిన నాలుగేళ్ల పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న విషయం కూడా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. సభలో బీజేపీ సభ్యులవైపు చూస్తూ "మీరు తప్పుంచుకోలేరు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు" అని బీజేపీపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. "ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తాం" అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుపైన చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారని చెబుతూ, ఆ విషయాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఆ పార్టీ నేతలకు చంద్రబాబు కర్తవ్యబోధ చేశారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని విద్యా సంస్థలు వాటి కేటాయింపులను చంద్రబాబు ప్రస్తావించారు. తిరుపతిలో తలపెట్టిన ఐఐటీ కోసం ఇప్పటివరకు వంద కోట్లిచ్చారు. మూడువేలకుపైగా కోట్లు అవసరమైన ఐఐటీకి వంద కోట్లు ఇస్తే ఇక అది పూర్తికావడానికి 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే గడిచిన నాలుగేళ్లుగా ఈ సంస్థలకు జరుగుతున్న కేటాయింపులపై ఎందుకు మాట్లాడలేకపోయారో మాత్రం సభలో ఉన్న బీజేపీ సభ్యులకు చంద్రబాబు వివరించలేదు. ఆ విషయాలను బీజేపీ నేతలు కూడా చంద్రబాబును అడగలేదు. రోజూ హాయిగా నిద్రపోతున్నా...! ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈరోజు అన్ని పార్టీలు అడుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ఎందుకు కనికరించడం లేదు అంటూ ప్రశ్నించారు. దేశంలో తానే సీనియర్ మోస్ట్ నాయకుడినని, కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లు ఏర్పాటు చేశామని పేర్కొంటూనే తాను ఎవరికీ భయపడటం లేదని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అందుకే ప్రతి రోజూ హాయిగా నిద్రపోతున్నా... అంటూ చెప్పుకొచ్చారు. (నేను పడుకోను.. మిమ్మల్ని పడుకోనివ్వను అంటూ గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు చెబుతుండేవారు) నాలుగేళ్ల తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని, ఆ కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారంటూ ఈ రకమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తారని, విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని నాలుగేళ్లు ఎదురుచూశానని, ఇప్పుడు మళ్లీ అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎదురుచూసిన చంద్రబాబు ఉన్నఫళంగా ఎందుకు అసెంబ్లీ ఈ చర్చకు తావిచ్చారో సెలవివ్వకపోవడం అధికార పార్టీ సభ్యులకు సైతం అంతుచిక్కలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలు, ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం... మాట్లాడకపోతే ఇరకాటంలో పడతామన్న ఆందోళనతోనే ఈ అంశానికి అసెంబ్లీ వేదిక చేసుకున్నట్టు కనబడుతోంది. 220 మందిలో నేనొకడిని గవర్నర్ ప్రసంగంపై చంద్రబాబు సమాధానం చెప్పడానికి ముందు మాట్లాడిన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అంటూ ఆకాశానికెత్తారు. చంద్రబాబు సమాధానం చెబుతున్నప్పుడు మధ్యలో కల్పించుకుని... తామింకా (బీజేపీ) ప్రెండ్లీ పార్టీయేననీ, అదేదో ప్రతిపక్షమైనట్టు మాట్లాడుతున్నారని (టీడీపీ సభ్యులవైపు చూస్తూ) అది సరైంది కాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి 14 వ ఆర్థిక సంఘం నిబంధనలు, హోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వంటి వివరాలు చెబుతూ మీకేం కావాలో... రావలసిన నిధుల గురించి వివరాలిస్తే ఢిల్లీకి వెళ్లి వచ్చేట్టుగా తనవంతు కృషి చేస్తానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. దేశంలో 220 మందితో ఏర్పడిన బీజేపీ జాతీయ కార్యవర్గం తాను ఒకడినని చెప్పుకొచ్చారు. -
ఏపీ ప్రజలు రోడ్ల మీదికి రారు : చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలు సున్నిత మనస్కులని, ఏదైనా కష్టం వస్తే బాధపడతారేగానీ, ఆందోళనల పేరుతో రోడ్ల మీదికి రారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేశారు. కేంద్రంతో తాడోపేడో తలేల్చుకుంటామని నిన్నంతా లీకులిచ్చిన ఆయన.. ప్రత్యేక హోదాపై మళ్లీ పాతపాడేపాడారు. పైగా కేంద్రం ఏమీ ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. పది రూపాయలు నష్టం జరిగినా ఫర్వాలేదు కానీ ఆత్మాభిమానం, హక్కును కాదన్నప్పుడు మాత్రం ఎక్కడలేని బాధ, వ్యధ కలుగుతుందని, నాలుగేళ్ల తర్వాత తనదిప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితేనని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై సీఎం సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుపడిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాబుపై బీజేపీ ఫైర్, టీడీపీ ఎదురుదాడి : ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్వపడాలి : పోలవరం, వృద్ధిరేటు, కేంద్ర సాయం తదితర అంశాలపై సీఎం మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ‘పోలవరం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న ముఖ్యమంత్రి మాటలు నిజం కాదు. నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఒక వేళ సీఎం చెప్పినట్లు బిల్లులు ఆగితే.. ఆ వివరాలు నాకివ్వండి.. నేను క్లియర్ చేయిస్తా’నని విష్ణుకుమార్ రాజు అనగా, ‘రాష్ట్రంలో ఇంత వెనుకబాటు ఉంటే, రెండంకెల వృద్ధిరేటు ఎలా చూపుతారు? అందువల్లే కేంద్రం సాయానికి వెనుకడుగు వేస్తున్నదేమో!’ అని మరో బీజేపీ సభ్యుడు అన్నారు. హోదా రాష్ట్రాలకు 2020 దాకా పన్ను మినహాయింపులు ఇచ్చారన్న సీఎం వ్యాఖ్యలకు.. ‘ అది కాలపరిమితికి లోబడి తీసుకున్న నిర్ణయమేగానీ, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు’ అని ఇంకో సభ్యుడు పేర్కొన్నారు. ఇలా బీజేపీ నేతలు మాట్లాడిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా లేచి కాసేపు ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బీజేపీకి సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు.. ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్వపడాలి : ‘‘కేంద్ర సాహాయం లేకపోయినా, ఏపీ రెండంకెల వృద్ధిరేటు (11.3 శాతం) సాధించినందుకు యావత్ దేశం గర్వపడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కారణంగా నిధులు రావడంలేదనడం సరికాదు. కోఆపరేటివ్ ఫెడరలిజంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలి. కానీ కేంద్రం మన డబ్బును తీసుకెళ్లి మధ్యప్రదేశ్‌లో ఖర్చుపెడుతోంది! 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్నారు. సరేనని మేం ప్యాకేజీకి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు కేంద్రం.. హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు 2020 దాకా పన్నుల మినహాయింపులను పొడిగించడం దారుణం’’ అని చంద్రబాబు అన్నారు. -
ఏపీ: బీజేపీ తాడో-పేడో!
సాక్షి, అమరావతి: తాజా రాజకీయ పరిణామాలు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు విషయంలో తాడో-పేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రుల రాజీనామాపై బుధవారం అసెంబ్లీ లాబీలో జోరుగా చర్చ సాగింది. టీడీపీ తెగదెంపులు చేసుకోకముందే బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు చెలరేగాయి. రాజీనామాలకు సిద్ధం కావాలని పార్టీ హైకమాండ్ నుంచి బీజేపీ మంత్రులకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి విషయంలో టీడీపీ మమ్మల్ని నిందిస్తే.. చూస్తూ ఊరుకోబోమని, ఆ పార్టీకి దీటైన జవాబు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. బీజేపీఎల్పీ సమావేశం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీఎల్పీ సమావేశమై.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. ఈ భేటీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఒకవేళ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు బీజేపీపై నిందలు వేస్తే.. ఏ విధంగా స్పందించాలనే దానిపై సమాలోచనలు చేశారు. టీడీపీ చర్యను బట్టి తమ ప్రతిచర్య ఉంటుందని, టీడీపీపై దాడి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే తమకు లేదని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఢిల్లీకి పిలుపు దేశ రాజధాని ఢిల్లీకి రావాలని బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. గురువారం ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌షా ఢిల్లీలో భేటీ కానున్నారు. టీడీపీతో పొత్తు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. -
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఏపీఅసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే న్యాయవాదుల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది
-
రూ.10 లక్షలిస్తే నన్ను కూడా చంపేస్తారు..
సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గుండాలకు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విష్ణుకుమార్ రాజు మంగళవారమిక్కడ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ రూ.10 లక్షలను ఇస్తే నన్ను కూడా చంపేస్తారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హుందాగా నిరసన చేస్తే బాగుండేది. మోదీ మెడలు వంచినట్లు ఆయన నిరసన తెలిపారు. రౌడీలను అద్దెకు తెచ్చి టీడీపీ ధర్నాలు చేయిస్తోంది. హత్యకేసులో నేరస్తుడు ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేయడమా?. అటువంటి వారికి నగర ఉపాధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించం. గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టి ప్రధానిపై నీచంగా నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. మోదీపై నిరసన చేపట్టిన వారిని అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు నమోదు చేయాలి. ఇటువంటి వ్యక్తులు ఉన్న టీడీపీ చాలా దారుణంగా ఉంది. మేము నోరు విప్పతే టీడీపీ బండారం బయటపడుతుంది. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. మేము నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి ఉంటుంది’ అని ధ్వజమెత్తారు. -
అసెంబ్లీ రద్దు చేసి హోదా కోసం పోరాడాలి
-
చాన్నాళ్లకు మళ్లీ నోరువిప్పిన మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి : వరుస కార్యక్రమాలు, సమీక్షలు, విదేశీ పర్యటనలతో బిజీబిజీగా ఉంటోన్న మంత్రి నారా లోకేశ్.. చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడారు. సోమవారం అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనంలో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. ఎల్లయ్యో, మల్లయ్యో అడిగితే చెప్పాలా? : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యమన్న లోకేశ్.. ఆ అంశంతోపాటు విభజన చట్టంలోని ఇతర హామీలపైనా కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో, ఎంత ఇచ్చిందో వాస్తవావాస్తవాలన్నీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, జరిగిన అన్యాయంపై బీజేపీ నేతలు చేసిన ‘కర్నూలు డిక్లరేషన్’ను చూసి తాను ఆశ్చర్యపోయానని మంత్రి అన్నారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధి చెందింది. అలా కాదంటూ ఎవరో ఎల్లయ్యో, మల్లయ్యో రాయలసీమ డిక్లరేషన్ పెడితే దాని గురించి నేను మాట్లాడాలా?’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. దేశానికి రెండో రాజధానిగా కర్నూలు : భారతదేశానికి దక్షిణాదిలో రెండో రాజధాని ఉండాలన్న వాదనను తాను సమర్థిస్తానని లోకేశ్ చెప్పారు. ‘మన కర్నూలును దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుంద’ని అన్నారు. టీఆర్ఎస్తో పొత్తు : ఇటీవలే తెలంగాణలో పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. పొత్తులు ఉంటాయని ప్రకటించినదానికి విరుద్ధంగా లోకేశ్ స్పందించారు. టీఆర్ఎస్తోనే పొత్తు ఉంటుందని సీఎం ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. -
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఈ సమావేశాల్లో 2018–19 బడ్జెట్‌ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఇవి 14వ అసెంబ్లీ 11వ సమావేశాలు కాగా, శాసన మండలికి 13వ సమావేశాలు. కాగా ఫార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటీషన్లపై రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటేనే ఈ నెల 6 నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేసిన విషయం విదితమే. -
బడ్జెట్ సమావేశాల్ని బహిష్కరించిన వైఎస్సార్సీపీ
-
చింతమనేనిపై వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చింతమనేనిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొటారు రామచంద్రరావు తదితరులు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కాగా టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు జైలుశిక్ష పడ్డవారిని చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రవర్తన అందరికీ తెలిసిందే అని, స్పీకర్ ఈ విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేల అనర్హతలపై ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న ఆందోళన ప్రజల్లో ఉందని, కనీసం ఎమ్మెల్యే చింతమనేనిపైన అయినా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని, అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు జడ్జిమెంట్ కాపీలను కూడా అందచేసినట్లు తెలిపారు. అప్పీల్‌తో సంబంధం లేకుండా చింతమనేనిపై అనర్హత వేటు వేయాలని అన్నారు. -
మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ డీజైన్లను ఆమోదించడంతోపాటు, 2014 పోలీస్ యాక్ట్ సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూకేటాయింపులు, రూ.4,234 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై సమావేశంలో చర్చించనున్నట్లు సచివాలయ అధికారులు తెలిపారు. -
కాపుల రిజర్వేషన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు
-
అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ బిల్లు - 2017కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కారణాలు చెప్పకుండా రిజర్వేషన్లు తీసేశారన్నారు. 2016లో కాపుల రిజర్వేషన్‌పై మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో పర్యటించిన కమిషన్ సభ్యులు కాపుల స్థితిగతులను అధ్యాయనం చేసినట్లు చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని తనను ఎవరనూ అడగలేదని అన్నారు. పాదయాత్ర చేసిన సమయంలో కాపుల కష్టాలను చూసి.. తానే రిజర్వేషన్ ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మంజునాథ కమిషన్ కాపుల రిజర్వేషన్‌పై నివేదిక అందజేసినట్లు వెల్లడించారు. కాపులు రాజకీయ రిజర్వేషన్లను కోరుకోవడం లేదని అందుకే సామాజిక, ఆర్థిక, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్‌ను కల్పిస్తున్నట్లు వివరించారు. కాపులకు రిజర్వేషన్ల ఇవ్వడం వల్ల వెనుకబడిన తరగతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. కాపుల(కాపు, తెలగ, బలిజ, ఒంటరి)ను బీసీ(ఎఫ్) కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. కాపుల రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. బీసీ(ఎఫ్) కేటగిరీలోని వారందరికీ 5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని వివరించారు. వాల్మీకీలు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. -
‘పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంది’
సాక్షి, అమరావతి : పోలవరంపై కేంద్రం పంపిన లేఖలో ఏమీ లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం అసెంబ్లీ వేదికగా ఆయన ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ప్రాజెక్టుకు పనులకు నవంబర్ 16వ తేదీన టెండర్లు పిలిచి, 30వ తేదీ వరకూ ఆన్లైన్లో ఎందుకు అప్లోడ్ చేయలేదని మాత్రమే కేంద్రం లేఖలో ప్రశ్నించినట్లు చెప్పారు. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వాన్ని కేంద్రం లేఖపై తప్పుదోవ పట్టించారని అన్నారు. తొలుత రూ. 1395 కోట్లకు ఆహ్వానించిన టెండర్లను కేవలం 14 రోజుల వ్యవధిలో 1483 కోట్లకు(88 కోట్లు పెరిగాయి) ఎందుకు పెంచారని కేంద్రం అడగటంలో తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమ ఆస్తులను ప్రజలకు పంచాల్సిన పని లేదని, వాళ్ల ఆస్తులను లాక్కోకుండా ఉంటే చాలునని అన్నారు. పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. అధికారులు వాస్తవాలు చెప్పి ఉంటే ఇంత రాద్దాంతం జరిగేది కాదని చెప్పారు. బీజేపీ ఏ కబ్జాలకు పాల్పడదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లో కేంద్రం పోలవరంను పూర్తి చేస్తుందని తెలిపారు. టెండర్‌కు 45 రోజుల గడువు ఇవ్వాల్సివుండగా.. 18 రోజులు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నారు. లోపభూయిష్టమైన టెండర్‌ను మాత్రమే ఆపమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది గానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపమని లేఖలో ఎక్కడా పేర్కొన్నలేదని చెప్పారు. -
ఉత్తమ ప్రదర్శన చంద్రబాబుదే...
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ తమ సభ్యుల పనితీరుపై తనకు తానే రేటింగ్స్, ర్యాంకింగ్స్ ఇవ్వడం నంది అవార్డులను తలపించింది. ప్రతిపక్షం లేకున్నా శాసనసభ ఘనంగా జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వడానికి టీడీఎల్పీ స్వయంగా రంగంలోకి దిగింది. 11 రోజుల్లో ఏకంగా ఎనిమిది రోజులు చంద్రబాబు ఉత్తమ ప్రదర్శనకు ఎంపికయినట్టుగా ప్రకటించింది. ఇక మంత్రి నారా లోకేష్ రెండు రోజులు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు ఒక్కో రోజు ర్యాంకింగ్‌లు దక్కించుకున్నారు. శాఖల విషయానికి వస్తే దేవినేని ఉమ, ఆదినారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు అద్భుతమని టీడీఎల్పీ ప్రకటించింది. ఈ మేరకు టీడీఎల్పీ శుక్రవారం చంద్రబాబుకు ఈ నివేదిక సమర్పించింది. -
రైతుల నెత్తిన చంద్రబాబు సర్కార్ సేకరణ కత్తి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద సేకరణ పేరుతో భూ సేకరణ ఏపీ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లును నిన్న (బుధవారం) శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013కు సవరణ చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా కొత్తగా కొన్ని క్లాజులు చేరుస్తూ.. మూడు ముఖ్యమైన క్లాజులకు ఇందులో మినహాయింపు ఇచ్చింది. కాగా రైతులకు పునరావాసంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లింపుతోనే సరిపెట్టాలని ఏపీ సర్కార్ ఈ సవరణ బిల్లు ద్వారా నిర్ణయం తీసుకుంది. రైతుల భూములు తీసుకున్నాక రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని ప్రతిపాదించింది. సంప్రదింపుల ద్వారానే పరిహారం నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టింది. గ్రామసభలు, సామాజిక ప్రభావం సర్వేలతో సంబంధం లేకుండా ఈ చట్టాన్ని సవరించడం జరిగింది. ఈ చట్టం 2014 జనవరి 1 నుంచే అమలు అవుతున్నట్లు పేర్కొంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. -
ఎక్కడైనా..ఎందుకైనా భూములు తీసుకుంటాం
-
అసెంబ్లీలో ఒప్పుకోక తప్పలేదు!
-
ఒప్పుకోక తప్పలేదు!
సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యలపై కార్పొరేట్ కాలేజీలను రక్షించేలా ప్రభుత్వపు ఉల్టాపల్టా వ్యవహారం బుధవారం అసెంబ్లీలో బట్టబయలైంది. విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చ చేపట్టాలని.. దానిపై ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఇంతకు ముందు నిర్ణయించి అజెండాలో చేర్చించింది. నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రేగడం, కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు వస్తుండడంతో.. గత కొంతకాలంగా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం రక్షిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా బయటకూడా నిలదీస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించడంతో తమ వాదనను ఏకపక్షంగా వినిపించవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో ఆ అంశాన్ని చర్చకు అజెండాలో చేర్చింది. ఈ అంశంపై ఈనెల 13వ తేదీనే సభలో చర్చ జరిపి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. అప్పట్లో అలా.. ఇప్పుడిలా.. అప్పట్లో ఆత్మహత్యలకు కారణం విద్యార్థులు, తల్లిదండ్రులే కారణమని విద్యాశాఖ నోట్ రూపొందించింది. ఆ నోట్లో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల పేరును కూడా కనీసం ప్రస్తావించకుండా విద్యాశాఖ జాగ్రత్త పడింది. అయితే అంతకు ముందురోజు ఆదివారం కృష్ణానదిలో బోటు మునిగి 22 మంది యాత్రికులు మరణించారు. దీంతో మరునాడు ప్రభుత్వం నిర్ణయించిన అజెండా ప్రకారం అసెంబ్లీ కార్యకలాపాలు సాగలేదు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చ వాయిదా పడింది. ఆ రోజున అసెంబ్లీలో చర్చలో చెప్పేందుకు విద్యాశాఖ రూపొందించిన నోట్ ‘సాక్షి ’కి చేరగా ఆ మరునాడే దాని ఆధారంగా ‘ఆత్మహత్యలకు విద్యార్థులు, తల్లిదండ్రులే కారణమట’ శీర్షికతో వార్తను ప్రచురించింది. ఈ వార్తతో ప్రభుత్వ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఆరోజున జరగాల్సిన చర్చ జరగకపోవడంతో అప్పటి నోట్లో మార్పులు చేసింది. పాత నోట్లో ఆత్మహత్యలకు కారణాల్లో యాజమాన్యాలు అన్న పదం లేకపోగా తాజాగా రూపొందించిన నోట్లో యాజమాన్యాలను చేర్చింది. ఈ కొత్తనోట్తో బుధవారం జరిగిన చర్చలో మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారు. ఈ ఆత్మహత్యలకు కారణాల్లో యాజమాన్యాలూ ఉన్నాయన్నారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ అసెంబ్లీలో చర్చ
సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ ఏపీలో 2016లో 136 మంది, 2017లో 112మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో 2017లో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియాలో ఎక్కువ చూపుతున్నారని, దీంతో మిగిలిన విద్యార్థులు కూడా దీనికి ప్రభావితమవుతున్నారని అన్నారు. విదేశాల్లో ఇలాంటి ఆత్మహత్యలను చూపించకూడదన్న నిబంధన ఉందని తెలిపారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో ఎక్కువమంది విద్యార్దులు చనిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 110మంది విద్యార్థులు చనిపోతే అందులో 15మంది మాత్రమే నారాయణ కాలేజీలో చనిపోయారని అన్నారు. కేవలం మంత్రిగా ఉన్నారనే కారణంతో నారాయణ సంస్థను తప్పుపట్టడం సరికాదన్నారు. అయితే, విద్యా సంస్థలు కూడా నిబంధనలు పాటించడం లేదని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఆదివారం కూడా సెలవు ఇవ్వడం లేదు.. పండగలు, హాలిడేలు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కూడా సెలవు ఇవ్వని విధానం మారాలని, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారాలని సూచించారు. -
టీడీపీ ఎమ్మెల్యేల అసహనం
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండా చప్పగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టపడడంలేదు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఏడురోజులు సభ జరిగితే ఒక్కరోజు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. అదే పనిగా ప్రభుత్వ భజన చేస్తుండడం, చంద్రబాబు, మంత్రులు రోజూ చెప్పిన విషయాలనే ఊకదంపుడుగా చెబుతుండడంతో ఈ సమావేశాలకు అసలు ప్రాధాన్యత లేకుండాపోయింది. ఆ పార్టీకి అధికారికంగా 103 మంది సభ్యులుండగా వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన మరో 22 మంది అనధికారికంగా టీడీపీలో ఉన్నారు. మొత్తంగా 125 మంది ఆ పార్టీ తరఫున హాజరు కావాల్సివుండగా ప్రతిరోజూ 70–80 లోపే హాజరు ఉంటోంది. మధ్యలో రెండు, మూడు రోజులైతే కనీసం 40 మంది కూడా లేని పరిస్థితి. ప్రశ్నోత్తరాల సమయంలో చాలా ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా నోట్ చేసుకున్నామని, దీనిపై తగు చర్య తీసుకుంటామని చెప్పి కూర్చుంటున్నారు. సంబంధిత మంత్రులు కూడా సభలో ఉండడంలేదు. ఆ కారణంతోనే ఎమ్మెల్యేలు సభకు వచ్చేందుకు ఇష్టపడడంలేదు. సోమవారం జరిగిన జీరో అవర్‌లో సభ్యులు మరీ తక్కువగా ఉండడంతో చంద్రబాబు ఎమ్మెల్యేలను మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిచి ప్రతిపక్షం లేకపోయినా సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని తాను మొదటి నుంచి చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం హాజరు శాతం కొంత పెరిగినా చంద్రబాబు సభలో ఉన్నంతవరకే కావడం విశేషం. -
పేపర్లు బల్లకేసి కొట్టిన డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా అని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే అసైన్డ్ కమిటీల గురించి సమాచారం కోరారు. ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్ కమిటీలపై సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయో లేదా రిపోర్ట్ తెప్పించుకుంటామని ఆయన అన్నారు. అసైన్డ్ కమిటీలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేఈ అసహనం వ్యక్తం చేస్తూ.. తన చేతిలో ఉన్న పేపర్లను బల్లకేసి కొట్టారు. సీఎందే బాధ్యత! అనంతరం డిప్యూటీ సీఎం కేఈ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసైన్డ్ కమిటీల బాధ్యత సీఎందేనని అన్నారు. ‘ నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్తాను. ఎమ్మెల్యేలు నన్ను కాదు.. సీఎంను అడగాలి’ అని కేఈ అన్నారు. రేషన్ షాప్‌ల్లో వేలిముద్రలు..! రేషన్‌షాపుల్లో లబ్ధిదారుల వేలిముద్రల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సభ దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు రాకపోవడంతో వృద్ధులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో మంత్రులు అసత్యాలు చెపుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు అంటూ అందరికీ ఆపాదించడం సరికాదని, విష్ణుకుమార్ రాజు తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని యనమల కోరారు. తన ఉద్దేశం అది కాదన్న విష్ణుకుమార్ రాజు.. స్పీకర్ సూచన మేరకు మంత్రులు అబద్ధాలు చెప్తున్నారన్న వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నారు. బయో మెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు గుర్తించకపోవడంతో రేషన్ ఆగిపోయే పరిస్థితి లబ్ధిదారులకు రానివ్వబోమని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలిముద్రల సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. మూడు3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోయిన కార్డ్ రద్దు కాదని చెప్పారు. అవస్తవాలు చెప్పాల్సిన అవసరం మంత్రులకు లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాబోమని ఆయన అన్నారు. -
మీ ఇళ్లల్లో పెళ్లి జరిగితే సెలవులిచ్చేస్తారా?
సాక్షి, అమరావతి : ‘‘మా దళితుల ఇళ్లల్లో వివాహానికి ఎవరినీ రానివ్వరు. అదే మీ వాళ్ల ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారా? ఏకంగా సెలవులు ఇచ్చేస్తారా?’’ అని మంత్రి యనమల రామకృష్ణుడిపై శాసన మండలి సభ్యురాలు శమంతకమణి విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏమయ్యా.. మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో వివాహం జరుగుతుంటే ఎవరినీ రానివ్వకుండా చేశారు. అదేపనిగా అందరినీ పోలవరం ప్రాజెక్టు వద్దకు అంటూ తీసుకెళ్లారు. మా మనవరాలి (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాల కుమార్తె) పెళ్లి ఈ నెల 16న అనంతపురంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకుపోయారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె పెళ్లి 23వ తేదీన అనంతపురంలో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా? ఏం.. మా ఇళ్లల్లో శుభకార్యాలకు ఎవరూ రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు?’’ అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక యనమల మౌనంగా ఉండిపోయారు. పయ్యావుల కేశవ్ సోదరుడి కుమార్తె వివాహం కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడితో గురువారం అనంతపురంలో జరగనుంది. -
ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు
-
ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు ప్రకటించారు. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా ముహూర్తాలున్నాయని, బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరుకావాల్సి ఉన్నందున సెలవులు ప్రకటించాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజుతో పాటు పలువురు టీడీపీ సభ్యులు బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో డిమాండ్ చేశారు. 23, 24, 25 తేదీల్లో వరుసగా పలు పెళ్లిళ్లకు హాజరుకావాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించాలని విష్ణుకుమార్ రాజు కోరారు. దీనికి అధికార పక్ష సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. అనంతరం అధికార పార్టీ సభ్యులు వరదాపురం సూర్యనారాయణ, డి.నరేంద్ర, శ్యామ్ సుందర్ శివాజీ, గద్దె రామ్మెహన్‌రావు కూడా అసెంబ్లీకి మూడు రోజులు సెలవులివ్వాలని డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. సభ్యుల మనోభావాలను అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రధానంగా విష్ణుకుమార్ రాజు సెలవు ఇవ్వాలని కోరినప్పుడే మంత్రులు తప్ప మిగతా సభ్యులందరూ బల్లలు చరిచి మద్దతు తెలిపారన్నారు. 23, 24, 25 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. అనంతరం పోలవరంపై సీఎం సమాధానం పూర్తయిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూడు రోజులు విరామం ప్రకటిస్తూ సభను 27వ తేదీకి వాయిదా వేశారు. 27 నుంచి మరో వారం రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని ప్రకటించారు. -
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ను ముట్టడించేందుకు బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. మల్కాపురం గ్రామం నుంచి వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలంతా అసెంబ్లీలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం చంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారని.. ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా పెట్టాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్కాపురం గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం నుంచి సుమారు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రహస్యంగా మకాం వేసి ఉన్నారని పోలీసులు అంటున్నారు. -
ఏపీ అసెంబ్లీ పనిదినాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల పని దినాలను పెంచారు. ఈ నెల 27,28, 29 తేదీలలోనూ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నెల 25 న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈ నెల 10 న ప్రారంభమైన ఏపీ అసంబ్లీ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు నిర్వహించాలనుకున్నారు. 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా అప్పట్లో బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ( సోమవారం) అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత పని దినాలను పెంచుతున్నట్టు అధికారంగా తెలిపారు. -
'ఎన్టీఆర్ క్యాంటీన్లు' పై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాట్లుపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చలోక్తులు విసిరారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మూర్తి మాట్లాడుతూ ఆరు నెలల క్రితం మంత్రి సునీత క్యాంటిన్ల విషయంలో ఏ సమాధానం చెప్పారో.. ప్రస్తుత మంత్రి పుల్లారావు కూడా అదే సమాధానం చెప్పారన్నారు. రోజులు మారుతున్నాయి.. మంత్రులు మారారు గానీ పథకం మాత్రం అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. పేదల ఆకలిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖపై మూర్తి ధ్వజమెత్తారు. ఏపీ రోగాలకు నిలయంగా మారిందని, ప్రసూతి మరణాలలో ఏపీ ప్రథమ స్దానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా విజృంభణతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దయచేసి రాష్టాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. -
ఒంటి చేతి చప్పట్లు
ఆ సభ్యుడు స్పీకర్ కాళ్ల మీద పడి లేచాడు. గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మీ ద్వారా పాదాభివందనం సమర్పించుకుంటున్నానధ్యక్షా అనగానే సభ కుదుటపడింది. ఇప్పుడు అమరావతి శాసనసభ దేశ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ప్రతిపక్షం శాంపిల్‌గా కూడా లేకుండా అధికారపక్షం సభ నడిపిస్తోంది. తెరచాప వేసుకుని జాయ్‌గా వాలుకి సాగిపోతున్న పడవలా సభ నడుస్తోంది. దీన్నే ఆంగ్లంలో ‘కేక్వాక్’ అంటారు. తెలుగులో ‘నల్లేరు మీద బండి నడక’ అంటారు. సంసార పక్షంగా చెప్పాలంటే అత్తలేని కాపురంలా పోరు పొక్కు లేకుండా ఉంది. ప్రతి అనుకూల, ప్రతికూల సందర్భాలని తన దారికి తెచ్చుకునే నేర్పరి మన చంద్రబాబు. ‘‘.... మీరు నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడండి! అవసరమైతే కడిగెయ్యండి. ప్రతిపక్ష పాత్ర పోషించండి. మనం చేసిన, చేస్తున్న పనులన్నింటినీ సమీక్షించుకుని ముందుకు పోవడానికిదొక మహదవకాశం....’’ అనగానే ఓ సభ్యుడు నిలబడి ‘‘అధ్యక్షా! నన్ను మూడు దేశాలు తిప్పుకొచ్చారు. మంచి ఫుడ్డు పెట్టించారు...’’ అంటుండగానే పక్క సభ్యుడు చొక్కా లాగి కూచోపెట్టాడు. ‘‘విశాఖలో హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు అధ్యక్షా! మన ముఖ్యమంత్రి ఆ బీభత్సాన్ని మూడ్రోజుల్లో క్లీన్ అండ్ క్లియర్ చేసి పడేశారు. ఇది ఆయన ఘనత తప్ప మరొకటి కాదని తలబద్దలుకొట్టుకు చెబుతున్నా. దీనిని గౌరవ ముఖ్యమంత్రి బేషరతుగా అంగీకరించకపోతే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సభాముఖంగా తెలియచేస్తున్నా!’’ అని మరో సభ్యుడు అనగానే చిరుదరహాసంతో ఆయన అంగీ కారం తెలిపి, ‘‘... నేను టెక్నాలజీని బాగా వినియోగింపచేశాను అధ్యక్షా! టెక్నాలజీతో కొండమీద కోతిని దింపవచ్చు అధ్యక్షా!’’ సభ దద్దరిల్లేటట్టు బల్లల మీద చరిచారు సభ్యులు. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాలను పక్కకి నెడుతూ, మద్యం విక్రయాల్లో అగ్రస్థానంలో ఏపీ తూలకుండా నిలబడిందంటే దాని వెనకాల మన ప్రియతమ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పడానికి గర్విస్తున్నానధ్యక్షా!’– కొందరికి ఏదో డౌటొచ్చి బల్లలు చరచక తటస్థంగా ఉండిపోయారు. ఓ సభ్యుడు అత్యుత్సాహంగా నిలబడి, ‘‘కిందటి మిర్చి సీజన్లో అస్సలు ధర లేక రైతాంగం ఎండుమిర్చిని గుట్టలు పోసి యార్డ్‌లో తగలబెట్టినప్పుడు భరించరాని కోరు వచ్చింది. అప్పుడు అధికార యంత్రాంగాన్ని క్షణాల్లో రంగంలోకి దింపి మిర్చి కోరుని, రైతు హోరుని అదుపు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిగారిదే అధ్యక్షా! వారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెల్పుకుంటున్నానధ్యక్షా!’’ ఇవన్నీ వింటుంటే జానపద రామాయణంలో ఓ ఘట్టం గుర్తొచ్చింది. హనుమంతుడు రామ పట్టాభిషేక సమయంలో ఒక్కసారిగా ఆవేశపడి, ‘‘నీల మేఘశ్యామ, రామా! చెట్టు చాటు నుంచి వాలిని చంపిన రామా, కోతులతో సేతువు కట్టిన రామా!’’ అంటూ కీర్తించడం మొదలు పెడితే రాముడు అప్సెట్ అయి ఆపించాడట. రామాయణంలో పిడకల వేట అంటే ఇదే. ఇంతలో ఉన్నట్టుండి, ఓ సభ్యుడు లేచి, సభలో వెల్ వైపు నడిచాడు. అంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. అధ్యక్షుల వారు కొంచెం కంగారు పడ్డారు. సన్నిటి సందులోంచి పెద్ద శబ్దంతో ఆ సభ్యుడు స్పీకర్ కాళ్ల మీద పడి లేచాడు. గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మీ ద్వారా పాదాభివందనం సమర్పించుకుంటున్నానధ్యక్షా అనగానే సభ కుదుటపడింది. రెండు చేతులూ కలసినపుడే చప్పట్లు. ఒంటి చేత్తో మన వీపుల్ని మనం చరుచుకుంటే అవి చప్పట్లు కావు. ఆత్మస్తుతులు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల నిరసన
-
ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్...టెన్షన్
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బుధవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉద్యోగులును ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అదే విధంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులును అరెస్టు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైన అసెంబ్లీని ముట్టడించి తీరుతామని సీపీఎస్ ఉద్యోగులు తెలిపారు. -
ఏపీ అసెంబ్లీకి వెళ్లడం టైమ్ వేస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం సమయం వృథా అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయ న ఇక్కడి శాసన సభ ఆవరణలో కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో మా అసెంబ్లీకి వెళ్లడం టైమ్ వృథా. మాకు మాట్లాడేందుకు ఐదు నిమిషాలు కూడా మైక్ ఇవ్వరు. తెలంగాణలో మా త్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం లభిస్తోంది. ఇక్కడ శీతాకాల సమావేశాలు ఇన్నిరోజులు జరుపుతున్నారు. ఏపీలో బడ్జెట్ సమావేశాలే 14 రోజులు దాటనివ్వరు. ఇక్కడ ప్రతిపక్షంగా కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. కానీ, ఏపీలో అన్నింటిని తట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడుతోంది. టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హార్డ్ క్యాష్ ఇవ్వటం లేదు. కాంట్రాక్టుల ద్వారా కమీషన్‌ను వారికి చేరవేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వ సొమ్మునే ఖర్చు పెట్టారు అని చెప్పారు. -
చీఫ్ విప్‌లుగా పల్లె, పయ్యావుల..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నియమితులయ్యారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే అసెంబ్లీ విప్‌లుగా గణబాబు, సర్వేశ్వరరావు, ఇక శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, విప్‌లుగా బుద్దా వెంకన్న,డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌ల నియామకం జరిగింది. నియామకానికి సంబంధించిన బుధవారం జీవో విడుదల అయింది. కాగా పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్ విప్‌గా ఎంపికయ్యారు. మరోవైపు పయ్యావుల కేశవ్ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్ పదవిని కట్టబెట్టారు. -
ఫిరాయించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: పార్టీ మారిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ శాసనసభ స్పీకర్‌ను డిమాండ్ చేశారు. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా శాసనసభ నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై పార్టీ మారాలంటే ముందు రాజీనామా చేయాలని, దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాఖీదులైనా ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వివరణ అయినా తీసుకున్నారా అని స్పీకర్‌ను ప్రశ్నించారు. అందరూ చూస్తుండగా ఫిరాయింపుదారులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారని, దీనికి స్పీకర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని చెప్పిన స్పీకర్ ప్రతిపక్షం రాలేదని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలోనే కాదు 13 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్నాయననడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని తప్పించుకోవాలని చూస్తున్నారని, వెంటనే పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభలో జరుగుతున్న తంతును, చట్టసభలను మీ చుట్టాలుగా మారుస్తున్న వ్యవహారాన్ని ప్రజలు చూస్తున్నారని, చరిత్రలో చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పీకర్, ముఖ్యమంత్రి తమ ఆలోచనలను మార్చుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, చట్టసభలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఆదాయంపైనే చంద్రబాబు దృష్టి ప్యారడైజ్ పేపర్ల ఆధారంగా చేసిన ఆరోపణలపై జగన్ చేసిన సవాల్‌ను చంద్రబాబు ఎందుకు స్వీకరించడంలేదని బొత్స ప్రశ్నించారు. పనామా పేపర్లలో హెరిటేజ్ డైరెక్టర్ మెటపర్తి శివరామప్రసాద్ పేరు ఉన్న విషయాన్ని మరచిపోయారా? అని విమర్శించారు. ప్రతిపక్ష నేత వల్ల రాష్ట్ర బ్రాండ్‌నేమ్ పోతుందని చంద్రబాబు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... చంద్రబాబు అవినీతి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని విమర్శించారు. ఏ పరిశ్రమైనా ఆ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమకు వచ్చే లాభాలను బేరీజు వేసుకుని వస్తాయని, కానీ చంద్రబాబు తనకు ఆదాయం వస్తుందో లేదో చూసుకుంటున్నారని ఆరోపించారు. జాయింట్ వెంచర్ల పేరుతో చంద్రబాబు డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్పారు. ఇది కాదని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించి, వీటిని ఉదాహరణలతో సహా వివరిస్తానన్నారు. జపాన్ సంస్థ మకి అసోసియేట్స్ రాసిన లేఖను ప్రస్తావిస్తూ... ఒకటి, రెండూ కాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్పారు. పార్టీ మారినవారిపై స్పీకర్ గంటకో మాట మారుస్తున్నారు -
చంద్రబాబుకు రాష్ట్రం కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం
-
ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ ప్రారంభం
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. వివిధ అంశాలపై మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు చర్చ జరిగింది. తర్వాత శాసనసభ సోమవారంకు వాయిదా పడింది. ఈరోజు నుంచి ప్రారంభమైన శాసనమండలి సమావేశాలు కూడా సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సభ నుంచి బహిష్కరించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. -
ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
విపక్షం లేకుండా సభ
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో ఏ చట్టసభలైనా అధికార, ప్రతిపక్షాలతోనే సమావేశాలు జరుగుతాయి. అయితే రాష్ట్రంలో అధికార పక్షం అసాధారణ పరిస్థితులను కల్పించింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది. తాజాగా మరో మహిళా ఎమ్మెల్యేను కూడా ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ నలుగురికి ఏకంగా మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ బహిష్కరించటం తెలిసిందే. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోటీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పలుసార్లు విజ్ఞప్తి చేసినా సభాపతి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీలో రికార్డుల్లో మాత్రం నలుగురు మంత్రులతో పాటు ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికైనట్లు చూపిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితుల్లో మరో మార్గంలేనందున మిగతా సభకు హాజరు కారాదని ప్రతిపక్షం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభాపతి దృష్టికి కూడా తెచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే సభకు హాజరవుతామని కూడా విపక్షం స్పష్టం చేసింది. ఇలాంటప్పుడు అధికార పార్టీ తప్పులను సరిచేసుకుని ప్రతిపక్షం సభకు హాజరయ్యేలా చూడకుండా వారు రాకపోయినా ఫరవాలేదనే రీతిలో వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి పసుపు కండువాలు కప్పడం ఒక ఎత్తయితే... విలువలకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను కేటాయించకుండా టీడీపీ ఇన్ఛార్జుల పేరిట ఇస్తూ పాలకపక్షం అప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సమావేశాలు అంటే సర్కారుకు భయం... అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. తెలంగాణ సర్కారు శీతాకాల అసెంబ్లీ సమావేశాలను యాభై రోజుల పాటు నిర్వహించేందుకు కూడా సిద్ధపడింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాధ్యమైనన్ని తక్కువ రోజులు సభ జరిపేందుకు మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రధాన సమస్య పరిష్కారం కాకపోవడం, అన్నివర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో వైఫల్యంతో పాటు ప్రజారోగ్యం, సంక్షేమం, అభివృద్ధి పనులు మందగించడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మొహం చాటేస్తోంది. వర్షాకాల సమావేశాలను నిర్వహించకుండా దాటవేసింది. అది ఉప్పూ కారం లేని వంటకమే! రాజ్యాంగపరంగా ఆరు నెలల్లోగా సభ నిర్వహించాల్సి ఉన్నందున అధికార పక్షం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహిస్తోంది. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10.30 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సుమారు పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం సమావేశాలు ముగిసిన తరువాత సభా వ్యవహారాల కమిటీ సమావేశమై ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏ సమస్యలపై చర్చించాలో నిర్ణయిస్తుంది. ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహణపై ప్రభుత్వం నాలుగు రోజులుగా కసరత్తు చేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమాలోచనలు చేశారు. అయితే ప్రధాన ప్రతిపక్షం లేని సమావేశాలు ఉప్పు కారం లేని వంటల మాదిరిగా ఉంటాయని, సమావేశాలకు ఎటువంటి ప్రాధాన్యం, సీరియస్‌నెస్ ఉండవని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రశ్న, జవాబు మనవే.. గతంలో ఏదైనా అంశంపై నిరసనగా ప్రధాన ప్రతిపక్షం ఎక్కువ రోజుల పాటు సభకు దూరంగా ఉంటే ప్రభుత్వంతో పాటు సభాపతి కూడా వారితో చర్చించి సభకు రప్పించేందుకు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సమావేశాలు నిర్వహించడం హుందాతనం కాదనే ఉద్దేశంతో సామరస్యంగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ‘మనమే ప్రశ్నలు వేసి మనమే సమాధానాలు చెప్పుకుందాం’ అనే రీతిలో వ్యవహరించడం గమనార్హం. ఇలా ఎన్నడూ జరగలేదు: నాదెండ్ల మనోహర్, మాజీ స్పీకర్ ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలా జరగడం సరికాదు. ప్రజల సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి అసెంబ్లీ అత్యున్నత వేదిక. అలాంటి సభలో ప్రతిపక్షం లేకపోతే సంపూర్ణత చేకూరదు. సభ సజావుగా నడిచేందుకు ప్రతిపక్షం, అధికారపక్షం పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా సభను సమర్థంగా నడిపించుకోవాల్సిన బాధ్యత అధికారపక్షంపై ఉంటుంది. గతంలో ప్రతిపక్షంలో రెండు మూడు పార్టీల సభ్యులుండేవారు. ఏదైనా సమస్య తలెత్తి ప్రతిపక్షం సభనుంచి బయటకు వెళ్లిపోవడమో సస్పెండ్ కావడమో జరిగితే మరో ప్రతిపక్ష పార్టీ ఆ అంశం సర్దుబాటు అయ్యేలా ప్రయత్నించేది. సమస్యను సభ దృష్టికి తెచ్చి బయటకు వెళ్లిన సభ్యులు తిరిగి సభాకార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేది. ఇతర పార్టీలు అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చి సభ సాగేలా చూసేవి. ఇప్పటి సభలో ప్రధాన ప్రతిపక్షం ఒక్కటే ఉండటంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రజాసమస్యల ప్రస్తావన, పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎంత కీలకమో సభను సజావుగా నిర్వహించటంలో అధికార పక్షానికి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ దిశగా రెండు పక్షాలు నడుచుకోవాలి. స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచమని ఎక్కడా చెప్పలేదు ఇలాంటి విషమ పరిస్థితి, రాజ్యాంగ తూట్లు పొడిచే వ్యవహారాలు గతంలో చోటు చేసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రలోభాలు పెట్టి విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. సహజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. దీనిపై ఫిర్యాదు చేసినా, ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖాతరు చేయకుండా సంవత్సరాల తరబడి నాన్చుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన మాట వాస్తవం. తీర్పు ఇచ్చే వరకు స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. నిబంధనలను వక్రీకరిస్తున్న యనమల పార్లమెంటరీ నిబంధనావళి సెక్షన్ 42 ప్రకారం ఆ సెషన్ వరకే సస్పెండ్ చేయాల్సి ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి విపక్ష ఎమ్మెల్యే రోజాను అధికారపక్షం ఏడాది పాటు సస్పెండ్ చేయించింది. అది అక్రమమని కోర్టుకు వెళ్తే సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్పీకర్ తన చర్యను సమర్థించుకున్నారు. ఇప్పుడు కోర్టులో కేసు ఉందంటూ అడ్డు పడుతున్నారు. ఫిరాయింపులపై ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే గవర్నర్ వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతికి కూడా విన్నవించాం. మా సభ్యులతో మాపైనే ఆరోపణలు చేయిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వైస్సార్ సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మంత్రులుగా అసెంబ్లీలో సమాధానాలు చెబుతున్నారు. అసెంబ్లీ బులెటిన్‌లో వారిని వైఎస్సార్ సీపీ సభ్యులుగా చూపిస్తూనే మంత్రులుగా పేర్కొంటున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జరుగుతున్న ఇలాంటి సభను వైఎస్సార్ సీపీ బహిష్కరించడమే సరైనది. సభకు రాకుంటే సభ్యత్వాలు రద్దు అవుతాయని మంత్రి యనమల రామకృష్ణుడు బెదిరించడం సరికాదు. ఆయన తాను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. అసెంబ్లీ రూల్సును వక్రీకరిస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం సభను ఏడాది మొత్తంమీద 55 రోజులకు మించి నిర్వహించడం లేదు. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ -
పార్టీ ముఖ్యులతో చంద్రబాబు సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ముఖ్యులతో చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో తొలుత స్ట్రాటజీ కమిటీ భేటీ అనంతరం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి యనమలతోపాటు మరికొంతమంది ముఖ్యనేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ సీపీ బహిష్కరించిన నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌పై ఏ విధంగా ఎదురుదాడికి దిగాలో సమావేశంలో తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలతోపాటు సొంతపార్టీ నేతలతో జగన్‌పై ఎదురుదాడి చేయించేలా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగానే ఉన్నారని సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ సారి సమావేశాలను వైఎస్ఆర్ సీపీ బహిష్కరించిందని...ఆ నెపాన్ని స్పీకర్‌పై నెట్టేయాలని ప్రతిపక్షపార్టీ చూస్తున్నట్లు పార్టీ ముఖ్యులతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. -
ఆ నలుగురు మంత్రులను బర్తరఫ్ చేస్తేనే...
సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం గురువారమిక్కడ ముగిసింది. అనంతరం పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. ఫిరాయింపుకు పాల్పడిన 20మందిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతామని ఆయన తెలిపారు. ‘ఫిరాయింపులపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రులు చేశారు. మంత్రి పదవులు కట్టబెట్టిన నలుగురిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తేనే తాజా అసెంబ్లీ బులిటెన్‌లో 66మందిని వైఎస్ఆర్ సీపీ సభ్యులుగా చూపించారు. ఇరవైమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి...మంత్రి పదవులు కట్టబెట్టిన నలుగురిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడే సభకు హాజరు అవుతాం. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏకపక్షంగా నిర్వహిస్తోంది. ప్రతిపక్షంగా మా గొంతను నొక్కేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐదేళ్లలో 156 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే... గత నాలుగేళ్లలో చంద్రబాబు కేవలం 80 రోజులు సభ నడిపారని అన్నారు. సభలో ప్రతిపక్ష నేతను తిట్టే కార్యక్రమాన్నే నిర్వహిస్తురు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లను కలిసి అప్రజాస్వామిక విధానాలను వివరిస్తాం.’ అని పెద్దిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నేతల ముఖ్య సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని రావినారాయణరెడ్డి సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఆరు నెలలపాటు ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 11న జరిగిన విస్తృత సమావేశంలో జగన్ పార్టీ నేతలనుంచి ఇదే అంశంపై అభిప్రాయాల్ని తెలుసుకున్న విషయం విదితమే. వాటి ఆధారంగా రూపొందించిన కార్యాచరణపై ఇవాళ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. వారిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతాం -
వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం గురువారం ఇక్కడ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా... వద్దా? అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నెల 23న అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ నిర్వహించిన భేటీలో.. అధికారపక్షం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శాసనసభా సమావేశాలను బహిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం గురువారం జరగనుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా... వద్దా? అనే అంశంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నెల 23న అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ నిర్వహించిన భేటీలో.. అధికారపక్షం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శాసనసభా సమావేశాలను బహిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపై గురువారం తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతల ముఖ్య సమావేశం నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని రావినారాయణరెడ్డి సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఆరు నెలలపాటు ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వెల్లడిస్తారు. ఈ నెల 11న జరిగిన విస్తృత సమావేశంలో జగన్ పార్టీ నేతలనుంచి ఇదే అంశంపై అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. వాటి ఆధారంగా రూపొందించిన కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతున్నారు. -
10 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు నవంబర్ పదో తేదీ నుంచి జరగనున్నాయి. ఎనిమిదో తేదీ నుంచి సమావేశాలు జరపాలని మొదట భావించినా మంచిరోజు కాదనే ఉద్దే శంతో తేదీని మార్చినట్లు తెలిసింది. పదో తేదీ నుంచి 10 పనిదినాల పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఐదు రోజులే సమావేశాలు జరపాలని అధికా రపక్షం భావించింది. అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర తలపెట్టిన నేపథ్యంలో సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చనే అంచనాతో మరో ఐదు రోజులు పొడిగించాలని పాలకపక్ష ముఖ్యులు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశాల్లోనే బాలికా సంరక్షణ, బాలికల సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ఎమ్మెల్యేలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదిరోజుల పాటు సమావేశాలు జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. -
అసెంబ్లీ సెషన్‌లోపే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఫిరాయింపుదారులైన 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘సభ ప్రారంభతేది నాటికి ఆ 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసి, నలుగురు మంత్రులను బర్తరఫ్‌చేసి, శాసనసభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలమీద మాట్లాడేందుకు అవకాశం కల్పించాలి’ అని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యనేతల కీలక భేటీ వివరాలను ఆ పార్టీ శాసనసభ ఉపనేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలు, రుణమాఫీ, చంద్రబాబు విదేశీ పర్యటనలు, మెడికల్ సీట్లలో మైనారిటీలకు అన్యాయం, అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్ర తదితర అంశాలపై నాయకులతో అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్చించారని పెద్దిరెడ్డి తెలిపారు. అసెంబ్లీని ఆగస్టులోనే నిర్వహించాల్సిఉండగా, అలా చేయకుండా, పాదయాత్ర ప్రారంభసమయంలో నిర్వహిస్తుండటం అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించినట్లు, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనియ్యకుండా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నదని, అలాంటి నేపథ్యంలో అసలు సభరే హాజరుకాకపోవడమే సరైన నిర్ణయమని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్లు మీడియా ప్రకటనలో పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనే నిర్ణయిస్తారని, ఈ అంశంపై అక్టోబర్ 26న జరగనున్న ఎల్పీ సమావేశంలో మరోసారి చర్చించి, అధ్యక్షుడు తుది ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. పాదయాత్రపై : నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి నేటి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో యాత్ర జరిగే జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు, త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడనున్నట్లు తెలిపారు. -
నవంబర్ 10నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశలు
-
ఐదు రోజులే శీతాకాల సమావేశాలు
-
ఐదు రోజులే శీతాకాల సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి మంగళవారం సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ ప్రకారం ఐదు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం వర్షాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని వాయిదా వేసి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర జరిగే సమయంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించటం గమనార్హం. -
నవంబర్ 8నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్ 8నుంచి ప్రారంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా వర్షాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి మంగళవారం ఓ షెడ్యూల్ విడుదల చేశారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి. -
నవంబర్ మొదటి వారంలో అసెంబ్లీ: కోడెల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల, శీతాకాల సమావేశాలు నవంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. వచ్చే నెల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే 63వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుపై చర్చించడానికి మంగళవారం పార్లమెంటు అనెక్స్ హాల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో మిగిలిపోయిన రిజర్వు క్యాటగిరీ సీట్లను జనరల్ క్యాటగిరిలో భర్తీ చేయాలని జవదేకర్‌ను కోరినట్టు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు10 రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉందన్నారు. అంతకుముందు ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కోడెల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
ఏపీ అసెంబ్లీ నిర్మాణంపై సెటైర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గొప్పగా కనిపించేలా శాసనసభ భవనం నిర్మించడానికి కోట్లాది రూపాయలు వృధా చేసే బదులు అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్క్రీన్‌లో నిర్వహించి ఏవిధంగా టెలికాస్ట్ చేయాలో రాజమౌళిని అడిగితే సరిపోతుంది. ప్రపంచంలోని అన్ని అసెంబ్లీ భవనాలను తలదన్ని ఇది బాహుబలి అసెంబ్లీగా నిలుస్తుంద’ని వర్మ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి ఇప్పటికే పలు దేశాల నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అవేమి ఆయనకు నచ్చకపోవడంతో దర్శకుడు రాజమౌళిని స్వయంగా తన దగ్గరకు రప్పించుకుని సలహా అడిగారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధించారు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్‌లో విడుదల చేస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం వంటిదని అభిప్రాయపడ్డారు. అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. -
ఏపీ అసెంబ్లీ భవనానికి వాస్తుదోషం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాస్తు దోషం వదిలేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ భవనానికి మార్పులు, చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాస్తు దోషం అంటూ సచివాలయంలో పలు మార్పులు చేర్పులు చేసిన సర్కార్.. అసెంబ్లీ భవనానికి మార్పులు చేయనుంది. వాస్తు కోసం సచివాలయం వైపు అధికారులు ...కొత్త గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఐదు గేట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఆరో గేటు నిర్మిస్తున్నారు. సచివాలయంలో వాస్తు దోషం కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూటు మార్చుకుని వెళుతున్న విషయం విదితమే. అంతేకాకుండా సచివాలయంలో పలు గోడలు, నిర్మాణాలు పగులగొట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ టీడీపీ సర్కారుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ ప్రారంభం తొలి రోజే ఇలా జరగడంతో టీడీపీ శ్రేణులు అపశకునం ఎదురైనట్లు చర్చించుకున్నారు. దీంతో అసెంబ్లీకి వాస్తు దోషాలు ఉన్నట్లు గుర్తించి మార్పులు చేస్తున్నారు. సచివాలయం వైపు ఆరో గేటు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా ఏం మార్పులు చేస్తుందో చూడాలి. -
26న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కమిటీ రాక
అనంతపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కమిటీ 20 మందితో కూడిన బృందం ఈనెల 26న ‘అనంత’కు రానున్నట్లు డీఆర్ఓ మల్లీశ్వరిదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు మైనర్ ఇరిగేషన్ పనులపై ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. -
‘ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్ ముగిసినట్లే’
సాక్షి, విజయవాడ : ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్ ముగిసినట్లేనని బీజేపీ శాసనసభా పక్ష నేత, పీఏసీ సభ్యులు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ 175 సీట్లను గెలుస్తామని చెబుతోందని ఆయన అన్నారు. విష్ణుకుమార్ రాజు బుధవారమిక్కడ మాట్లాడుతూ..రకరకాల సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తుంటే ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో మంత్రులు సచివాలయానికి రావడం లేదని విమర్శించారు. తాను కూడా వినతి పత్రాలు ఇద్దామంటే ఇక్కడ మంత్రులు లేరని అన్నారు. తాను మంత్రులను కలుద్దామని వచ్చి నిరుత్సాహపడ్డానని అన్నారు. సచివాలయంలో మంత్రులు ఉండకపోతే ప్రజల వినతులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక ‘చంద్రబాబునాయుడు 175 సీట్లు గెలుస్తున్నానని చెబుతున్నారు, మరి మిత్రపక్షంతో కలిశా, లేదా ఒంటరిగానా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. ఇన్నాళ్లూ 225 నియోజకవర్గాలు అని అన్నారు, ఇప్పుడు 175లోనే గెలుస్తున్నామంటే ఇక 225 ఇష్యూ క్లోజ్ అయినట్టేనా’ అని అన్నారు. బీజేపీ కూడా ప్రతి నియోజకవర్గంలో బలం పుంజుకుందని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అన్నారు. పలు సమస్యలపై ప్రజాపద్దుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చజరిగిందని, వీటిపై ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు తెలిపారు. -
మంత్రులు లేకపోవడం సరైంది కాదు
-
ఏపీ అసెంబ్లీ ప్రసారాలపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్‌కు అక్రమంగా ఇచ్చారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి, అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్‌కు ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే.. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలువకుండా.. స్పీకర్ ఆదేశాల మేరకు అడ్వాన్డ్ టెలీకమ్యూనికేషన్‌కు ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసార హక్కులను కట్టబెట్టారని తెలిపారు. ఈ హక్కులను ఎలా ఇచ్చారనే ఆర్టీఐ చట్టం కింద తాను అడిగానని, అందులో స్పీకర్ ఆదేశాలమేరకు 2018 చివరివరకు నామినేషన్ ప్రాతిపదికన సమయభావం వల్ల అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్ సంస్థకు హక్కులు కేటాయించామని చాలా స్పష్టంగా చెప్పారని, కానీ, స్పీకర్ ప్రివిలేజ్ కిందకు ఇది రాదని చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయని ఆయన వివరించారు. ఈ హక్కులు కేటాయించేందుకు టెండర్లు పిలువాల్సి ఉంటుందని, కానీ నిబంధనలను పక్కనబెట్టి అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్ సంస్థకు స్పీకర్ ఇచ్చారని తెలుస్తోందని ఆయన తెలిపారు. ప్రతిపక్షానికి, పాలకపక్షానికి సంధానకర్తగా వ్యవహరించాల్సిన స్పీకర్ తన విధులను నిర్వర్తించకుండా.. తమ సభ్యుల గొంతులను నొక్కివేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కుల కేటాయింపులో క్విడ్ ప్రో కో జరిగిందని ఆయన ఆరోపించారు. అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్ సంస్థ వేమూరి రాధాకృష్ణ కొడుకు అయిన వేమూరి ఆదిత్యకు చెందినదని, ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా హైకోర్టు తెలియజేశామని చెప్పారు. ఏ విధమైన నిబంధనలు పాటించకుండా, టెండర్లు పిలువకుండా, కాంపిటేషన్ బిడ్డింగ్ లేకుండా ప్రసార హక్కులను కట్టబెట్టారని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. న్యాయస్థానం చాలా సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
నియోజకవర్గాల పెంపుపై టీడీపీకి షాక్
►టీడీపీలో మొదలైన ఆందోళన ►పునర్విభజన సాధ్యం కాదని తేల్చిన కేంద్రం ►అయోమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. భవిష్యత్తుపై భయాందోళనలు ►60 నుంచి 70 నియోజకవర్గాల్లో కుమ్ములాటల భయం ►దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు.. టీడీపీ శ్రేణుల్లో గందరగోళం అమరావతి: రాష్ట్రంలో శాసనసభా నియోజకవర్గాల సంఖ్య పెంపుదల సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది. కోట్లు వెదజల్లి, పదవులతో ప్రలోభపెట్టి 21మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీడీపీలో ఇప్పుడు గుబులు పుడుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అందరినీ సర్దుబాటు చేస్తానంటూ మూడేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నేతలను మభ్యపెట్టిన అధినేత చంద్రబాబు ఇప్పుడేం చేస్తారోనన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. అసంతృప్తి జ్వాలలు, పరస్పర దాడులతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఆయా నియోజకవర్గాలతో పాటు మరో 40-50 నియోజకవర్గాల్లోనూ గందరగోళం తప్పదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యం కాదనే విధంగా తనతో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే చెప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాతో సుస్పష్టం చేయడంతో ఏపీలో అధికార పార్టీకి పిడుగుపడినట్లయింది. నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026 తరువాతనే పరిశీలించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పునర్విభజన అంశాన్ని సానుకూలంగా మలుచుకుని 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని చూసిన పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో నేతల మధ్య కుమ్ములాటలు తప్పవని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందంటూ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఇప్పుడు తలనొప్పులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు. అడియాశలైన ఆశలు రాష్ట్ర విభజన చట్టంలో అనేక అంశాలున్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన (పెంపు)పైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా, పోలవరంలాంటి కీలకాంశాల కంటే ఆయన నియోజకవర్గాల పునర్విభజనకే ప్రాధాన్యమిచ్చారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఫిరాయింపులను ప్రోత్సహించారు. 21 మంది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకునేటపుడు దాదాపుగా వారి నియోజకవర్గాలన్నింటిలోనూ టీడీపీ శ్రేణుల నుంచి, ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల చేతిలో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనీ, ఇప్పటికే టీడీపీలో ఉన్న వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు వారిని ఊరడించారని సమాచారం. పార్టీలో ఇప్పటికి చేర్చుకున్నది 21 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే అనీ, 50 వరకూ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కనుక అంత మందిని అదనంగా చేర్చుకున్నా మనకు ఇబ్బంది లేదని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు పార్టీలోని అసమ్మతి నేతలను అనేకసార్లు బుజ్జగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గత పార్లమెంటు సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన బిల్లు రాబోతోందని టీడీపీ వర్గాలు ఆశించాయి. అపుడు సాధ్యం కాకపోవడంతో ఈ సమావేశాల్లో ఎలాగైనా ఆమోదింప జేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సందర్భంగా ప్రధాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనపై సానుకూలత కనిపించక పోవడంతో పార్టీ నేతలకు, శ్రేణులకు ఇపుడేం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అధినేత పడిపోయారని టీడీపీ నేతలే చెబుతున్నారు. పలు చోట్ల పొసగని తీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 21 మందిని టీడీపీలో చేర్చుకునేటపుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో తీవ్రస్థాయిలో అసంతృప్తి తలెత్తింది. అద్దంకి, జమ్మలమడుగు, కందుకూరు వంటి చోట్ల నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు, గత ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల చేతిలో ఓటమి పాలైనవారూ తీవ్రంగా ప్రతిఘటించారు. వారిని చేర్చుకుంటే తాము పార్టీని వీడతామని హెచ్చరించారు కూడా. వారందరినీ ఇప్పటివరకూ బుజ్జగిస్తూ వచ్చారు. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ నిత్యం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాల మధ్య హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి రంగ ప్రవేశాన్ని ఆయన చేతిలో ఓటమి పాలైన పి.రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరి మధ్య నేటికీ సఖ్యత కుదరలేదు. ఈ రెండు చోట్లా నియోజకవర్గ స్థాయి నేతలు ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టినా ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. కందుకూరు నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన చేతిలో ఓడిపోయిన దివి శివరామ్ వర్గాల మధ్య నేటికీ సఖ్యత లేదు. ఇక టీడీపీలోనే ఒకే నియోజకవర్గంలో ఇద్దరేసి ముఖ్య నేతలున్న చోట్ల కూడా నియోజకవర్గాల సంఖ్య పెరుగుదలపై ఆశలు పెట్టుకున్న వారికి రాబోయే ఎన్నికల్లో అదనపు స్థానాల్లో సర్దుబాటు చేస్తానని టీడీపీ అధినాయకత్వం హామీలిచ్చింది. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, పాలేటి రామారావు... విశాఖపట్టణం నగరంలోని నియోజకవర్గాల్లో ఎంవీవీఎస్ మూర్తి, రెహ్మాన్లకు సర్దుబాటు ఆశలు చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విభజన ఉండదని తేలిపోవడంతో అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకూ నియోజకవర్గాల సంఖ్య పెంపుదల పేరు చెప్పి నెట్టుకు వచ్చిన చంద్రబాబు ఇకపై పార్టీ శ్రేణులకు ఏం చెబుతారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
నీళ్లు ఎలా వెళ్లాయో కనిపెట్టలేకపోయిన ప్రొఫెసర్లు
గుంటూరు: వర్షం లీకేజీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక సచివాలయం భవనాలలోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్లోకి నీళ్లు ఎలా వెళ్లాయో ప్రొఫెసర్ల బృందం కనిపెట్టలేకపోయింది. సీఆర్డీఏ కాంట్రాక్టర్లు చెబుతున్న వాదనకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. పైప్ లైను నుంచి వైఎస్ జగన్ కుర్చీ వరకు నీళ్లు వెళ్లే అవకాశం లేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ కుర్చీపైకి సీలింగ్ ఎలా ఊడిందని జేఎన్టియు ప్రొఫెసర్ల ప్రశ్నించగా .... కాంట్రాక్టర్లు నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు మరోవైపు సీఐడీ అధికారులకు కూడా ఈ వాటర్ లీకేజీ వ్యవహారం అంతుపట్టడం లేదు. అసెంబ్లీ మొదటి ఫ్లోర్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పైప్ కట్ చేసినవారిని ఎలా గుర్తించాలనే సందేహం వారిలో తలెత్తుతోంది. అంతేకాకుండా విచారణ ప్రారంభించేసరికి మరమ్మతులు పూర్తి చేయడంతో విచారణ ఎలా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లీకేజీ తర్వాత చాలాచోట్ల మరమ్మతులు చేయడంతో సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్ లీకేజీ కంటే వీడియో లీకేజీపైనే సీఐడీ విచారణ కొనసాగుతోంది. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ లీక్‌పై మూడో రోజూ సీఐడీ దర్యాప్తు
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీల్లో వర్షపు నీరు లీక్ అవడంపై సీఐడీ విచారణ మూడో రోజూ కొనసాగింది. సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు, సిబ్బంది వర్షపు నీరు లీక్ అయిన ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జేఎన్టీయూ ప్రొపెసర్ల బృందం కూడా శుక్రవారం అసెంబ్లీని సందర్శించింది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే. -
‘అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌పై కుట్ర’
తిరుపతి : ఆంధప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పథకం ప్రకారమే టీడీపీ నేతలు జగన్‌పై కుట్ర పన్నుతున్నారని ఆమె శుక్రవారమిక్కడ ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత ఛాంబర్లో లీకేజీ వ్యవహారం నడిచిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ జగన్‌పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్ ఉన్నట్లు టీడీపీ చెప్పడం సాధారణమైపోయిందని ఆమె ధ్వజమెత్తారు. రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఏడ్చినా... జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదని రోజా ఎద్దేవా చేశారు. భవనం లీకేజీపై తక్షణమే సీబీఐ విచారణకు సిద్ధపడతాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్లో లీకేజీల వల్ల వాననీరు ధారాళంగా పారింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిసిపోయాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి కూడా వాన నీరు ధారగా కారిపోవడంతో కింద బక్కెట్లు పెట్టారు. చాంబర్లో పడిన వాన నీటిని బక్కెట్లతో పట్టి బయటకు పోసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అయితే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ పైపెచ్చు వర్షాలకు అసెంబ్లీ భవనాలు కురుస్తున్నాయని, లీకేజీలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయంటూ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పరిశీలించేందుకు శుక్ర, , శనివారాల్లో సామాన్య ప్రజానీకంతోపాటు ప్రజాప్రతినిధులు, మీడియా అందరికీ అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడం విశేషం. -
లీకేజీపై నెటిజన్ల సెటైర్ల హోరు
అమరావతి: తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల లీకేజీపై సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తుతున్నాయి. రూ.వేయి కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు తేలికపాటి వర్షానికే ధారాళంగా కారుతుండడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు. వెయ్యికోట్ల సచివాలయమే ఇలా కట్టిస్తే ఇక రెండు లక్షల కోట్ల రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం? అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోనే పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తాం..’ అంటూ ఒక నెటిజన్ భవిష్యత్తును ఆవిష్కరించాడు. సోషల్ మీడియా సెటైర్లలో కొన్ని.. సచివాలయంలో కాగితపు పడవల పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పన ‘సార్ నాకు రెండు వారాలు లీవ్ కావాలి’ ‘రెండు వారాలా? ఎందుకు?’ ‘‘ఈత నేర్చుకోవడానికి సార్.. ఈ రోజు చూశారుగా, వర్షం వస్తే ఆఫీసు లో కూర్చుని పనిచేయడానికి లేదు.. ఈదుతూ పనిచేయాలి!!’ ‘‘నిజమేనోయ్.. టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి మరి!’ ‘అంతర్జాతీయ స్థాయంటే ఆమాత్రం ఉండొద్దూ!’ నాన్నారూ నాన్నారూ సచివాలయంలో పుష్కరాలు ఏర్పాటుచేస్తే ఎలా ఉంటదంటారు? సహజంగా వాటర్ ఫాల్స్ అడవుల్లోనో, కొండలమీదనో ఉంటాయి. కానీ మన చంద్రన్న ఏకంగా అసెంబ్లీలోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. అది కూడా బల్బుల నుంచి, ఫ్యాన్ల నుంచి, ఏసీల నుంచి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడమంటే మాటలు కాదు. బహుశా దానికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ వాడి ఉండొచ్చు. ఈ వాటర్‌ఫాల్స్ కూడా అతి సహజంగా ఉండేలా చేయడం కోసం ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అపార్థం చేసుకోకండి. వర్షాన్ని చూస్తూ పనిచేస్తుంటే ఆనందంగా ఉంటుంది అని అలా కట్టించాము. అంతే తప్ప తెలియకకాదు. అది లేటెస్టు టెక్నాలజీ అని తెలుసుకోండి. ఇక జగన్ చాంబర్లో అలా కావాలనే సహజ జలపాతం ఏర్పాటు చేశాం. ఆయనకు మా మీద కోపం ఎక్కువ కదా.. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని అలా వర్షపు ధారలు పడే వీలు కల్పించాం. అంతేకానీ మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు. వెయ్యికోట్ల సచివాలయమే ఇలా కట్టిస్తే ఇక రెండు లక్షల కోట్ల రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం? అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోనే పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తాం. అధ్యక్షా..! ఈ నీళ్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ, ప్రతిపక్ష నాయకుడు జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, భారత ప్రధాని మోదీ గార్లు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. చేస్తాం.. చేస్తాం... ఎందుకు చేయం.. ఆయన: ఎవడయ్యా కాంట్రాక్టరు పిలవండి కాంట్రాక్టర్: సార్ ఆయన: ఏమిటయ్యా ఒక్క వర్షానికే కురిసేలా కట్టావు కాంట్రాక్టర్: మేము మోసపోయాం సార్ ఆయన: ఎందుకయ్యా కాంట్రాక్టర్: మీరు ఉన్న చోట వర్షాలు పడవని అధికారులు చెప్పారు సార్ మీకు కుళ్లు. పాపం ఆయన ఎక్కడ ఉన్నా వర్షం పడదు అని ఆడిపోసుకుంటారు. ఇప్పుడు చూడు ఏకంగా అసెంబ్లీలోనే వరద తెప్పించాడు. ఓరి దీంతస్సాదియ్యా, ఈ టెక్నాలజీ ఏదో బాగుందే!! న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ లైనుకి మిస్డ్ కాల్ ఇస్తే చాంబరు సీలింగ్ పగిలి లోపలికి నీళ్లొచ్చాయా??! కేకంతే. ముందే చెప్పారు ఇవి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం అని. మీరే అవి పర్మనెంట్ అని ఆశపడ్డారు. పాపం వాళ్ల తప్పేమీ లేదు. ప్రపంచస్థాయి కట్టడాలు లీక్ అవుతాయా?? పైగా విజనరీ కట్టినవి..!!! -
వైఎస్ జగన్ ఛాంబర్లో పనిచేసే వారిపై కేసులు?
- లీకేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది - సీబీఐ దర్యాప్తుతోనే నిజమైన దోషులెవరో తేలతారు - నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు నరసరావుపేట: అసెంబ్లీ భవనంలోకి వర్షపు నీరు రావటాన్ని సామాజిక ప్రసార మాధ్యమాల (వాట్సాప్) ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన వారిపై అక్రమంగా కేసులు పెట్టే కుట్రకు ప్రభుత్వం తెరతీస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ జేబు సంస్థ లాంటి సీఐడీతో అసెంబ్లీ ఆవరణలోని వైఎస్.జగన్ ఛాంబర్లో పనిచేసే వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, కుతంత్రాలతో ప్రభుత్వం నడుస్తుందనే దానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి దోషులెవరో తేలాలంటే సీబీఐతో నిష్పాక్షికమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘అసెంబ్లీ హాల్లోకి వర్షపు నీరు వచ్చిందనే విషయంపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం ఎమ్మెల్యేలందరమూ పరిశీలించేందుకు వెళ్లాం కానీ సిబ్బంది మమల్ని లోపలికి అనుమతించలేదు. ఆ మేరకు స్పీకర్ తమకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారని సిబ్బంది చెప్పారు’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు. స్పీకర్ కోడెల.. మీడియాను అసెంబ్లీలోని లాబీల్లోకి గాని, మొదటి ప్లోర్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి చాంబర్లోకి గానీ తీసుకెళ్లకుండా సరాసరిగా రూఫ్‌కు తీసుకెళ్లడం, అప్పటికే కట్‌చేసి ఉంచిన పైపును చూపించి లీకేజీకి ఇదే కారణమని చెప్పడం విడ్డూరమని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి భూమి, ఇసుక ఉచితంగా ఇచ్చి నిర్మాణానికి స్కేర్ ఫీట్‌కు రూ.4వేలకు బదులుగా రూ.10వేలు చెల్లించినా వర్షపు నీరు ఎందుకు కారిందని ప్రశ్నించారు. (జగన్ ఛాంబర్లోకి నీళ్లు; భారీ కుట్ర) -
అసెంబ్లీలోనే కుట్రలా?
అమరావతి: అసెంబ్లీలోకి వర్షపు నీరు లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ కాదు, సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయంలో లీకేజీపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయంలోకి మీడియాను ఎందుకు అనుమతించలేదని అడిగారు. లీకేజీపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కట్టుకథలేనని అన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసి విచారణ జరపమేంటని నిలదీశారు. తుని ఘటనలాగే దీన్ని కూడా పక్కదారి పట్టిస్తారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పకడ్బందీ భద్రత ఉండే అసెంబ్లీలోనే కుట్రలా, భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరపాల్సిందేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. -
సెంటీమీటరు వానకే.. ఇన్ని లీకులా!
ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10 వేలు ఖర్చుపెట్టి ప్రపంచ స్థాయిలో తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారని, కానీ గట్టిగా ఒకటి, రెండు సెంటీమీటర్ల వానకే భవనాలన్నీ లీకుల మయం అయిపోయాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పలు భవనాలు లీకులమయం కావడంతో దాన్ని పరిశీలించేందుకు మీడియా ప్రతినిధులను తీసుకుని లోపలకు వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే అక్కడున్న పోలీసులు, ఇతర అధికారులు మాత్రం మీడియాను లోపలకు అనుమతించలేదు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే వెళ్లనిస్తామని, మీడియాను లోపలకు రానివ్వబోమని, ఆ మేరకు తమకు స్పష్టమైన ఉత్తర్వులున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తమకు చెప్పినట్లు ఆర్కే తెలిపారు. ఉన్న వాస్తవాలను బయటకు చెప్పడానికి మీడియాను తీసుకుని లోపలకు వెళ్దామంటే కనీసం అనుమతి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ లోపలకు కాకపోయినా కనీసం ప్రాంగణంలో మీడియా పాయింటు ఉంది కాబట్టి అక్కడి వరకు అనుమతించాలని కోరినా, దానికి కూడా అంగీకరించలేదన్నారు. దీనివెనక దురుద్దేశాన్ని గమనించాలని, వైఎస్ జగన్ చాంబరే కాదు, అసెంబ్లీ, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్లు ఎలా ఉన్నాయో కూడా చూపించాలని ఆయన తెలిపారు. లోపల ఎవరో సిబ్బంది తీసిన చిన్న వీడియో క్లిప్ ద్వారానే ఈ భవనాల బండారం మొత్తం బయటపడిందని, అందువల్ల లోపల భవనాల నాణ్యత ఎలా ఉందో కచ్చితంగా చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నూజివీడు ప్రాంతంలో రాజధాని కట్టాలని తాము ఎంతగానో కోరామని, ఇక్కడ అంతా నల్లమట్టి, ఇది నిర్మాణాలకు పనికిరాదని చెప్పామని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. తాము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా.. ఏదో త్వరగా చేసేశామని చూపించుకోవాలన్న తొందరలో ఇలా నాణ్యత లేని నిర్మాణాలు చేయించారని, అందుకే కట్టిన కొద్ది రోజులకే ఇలా నీళ్లు కారుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన చెప్పారు. నూజివీడు దగ్గర ప్రభుత్వ భూములు 140 ఎకరాలున్నాయి. అయినా అక్కడ కాదని ఇక్కడే కట్టారన్నారు. మీడియాను నియంత్రించడం సరికాదని, వర్షానికి తడిసి ముద్దయిన అసెంబ్లీ ఎలా ఉందో ప్రపంచానికి తెలియాలని మరికొందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత చాంబరే ఇలా ఉంటే ఇక అసెంబ్లీ హాల్ ఎలా ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 900 కోట్లు ఖర్చుపెట్టి నాసిరకం పనులు చేపట్టారని, అసెంబ్లీ నిర్మించేటపుడు తొందరపాటు వద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెబుతున్నా తనకు అనుభవం ఉందంటూ చంద్రబాబు ఊదరగొట్టారని చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, చంద్రబాబు వల్ల ఏపీ పరువు పోయిందని, ప్రపంచ స్థాయి నిర్మాణం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. -
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ
- నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఆమోదం - ఏకపక్షంగా మరో బిల్లుకూ ఆమోదముద్ర - రైతు సమస్యలపై చర్చకు విపక్షం పట్టు - పోడియంలో వైఎస్సార్ సీపీ ఆందోళన - గందరగోళం మధ్యే సీఎం చంద్రబాబు ప్రసంగం సాక్షి, అమరావతి: ఒకపక్క రోజురోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు. మరోపక్క గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కుతున్న అన్నదాతలు. రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించలేదు. అసెంబ్లీ చేరువలోని కృష్ణానదిలో దూకి ఇటీవలే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నా కళ్లులేని కబోదిలానే ప్రభుత్వం వ్యవహరించింది. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అసెంబ్లీలో గళమెత్తితే.. ఎప్పటిలాగే తమ అధికార బలంతో దానిని నొక్కేసింది. ప్రస్తుతం ధరల పతనంతో అల్లాడిపోతున్న తమను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై ప్రకటన చేస్తారేమో నని ఆశగా ఎదురుచూసిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీని కేవలం 42 నిమిషాల్లోనే ప్రభుత్వం ముగించింది. జీఎస్టీ బిల్లుతో పాటు మరో బిల్లును ఆమోదించడానికి మాత్రమే పరిమితమైంది. మంగళ వారం ఉదయం స్పీకరు కోడెల శివప్రసాదరావు సభలోకి ప్రవేశించగానే రైతుల సమస్యలు, మిర్చి, పసుపు అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టాలు, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలపై అత్యవసరంగా చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘విహార యాత్రల్లో ముఖ్యమంత్రి.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు.., మిరప రైతులను ఆదుకోవాలి. పసుపు రైతుల బాధలు సర్కారుకు పట్టవా? వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రికి రైతుల బాధలెందుకు పడతాయి? మిర్చి రైతుల వ్యతిరేక సీఎం డౌన్‌డౌన్.. ఎన్నికల హామీని నెరవేర్చాలి. రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి..’ అంటూ సభ నిరవధికంగా వాయిదా పడేవరకు ప్రతిపక్షసభ్యులు పోడియంలో నినాదాలు కొనసాగించారు. రైతు సమస్యలపై విపక్షసభ్యులు ఇంత ఆందోళన చేసినా ముఖ్యమంత్రి రెండుసార్లు సాగించిన ప్రసంగంలో ఎక్కడా అన్నదాతల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణ: సీఎం ఆర్థిక సంస్కరణల తర్వాత జీఎస్టీనే విప్లవాత్మక సంస్కరణని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని విపక్ష ఆందోళన, నినాదాల మధ్యే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రసంగం పూర్తికాగానే స్పీకరు సూచన మేరకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ‘ఆంధ్రప్రదేశ్ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)’ బిల్లును ప్రతిపాదించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. గందరగోళం మధ్యే బిల్లు పాసైంది. సింధుకు డిప్యూటీ కలెక్టరు కోసం చట్ట సవరణ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇచ్చేందుకు వీలుగా చట్టసవరణకు అసెంబ్లీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీసుల నియామకాల నియంత్రణ బిల్లును మంత్రి యనమల ప్రతిపాదించగా సభ ఆమోదించినట్లు స్పీకరు ప్రకటించారు. రైతుల ఇక్కట్లపై నోరు మెదపని పాలకపక్షం సభ ప్రారంభం నుంచి రైతు సమస్యలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే వచ్చారు. రైతుల ఇక్కట్లపై ప్రకటన చేయడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై ఎదురుదాడికి మాత్రం సమయం కేటాయించడం గమనార్హం. విపక్షం విపరీత పోకడలు పోతోందని విమర్శించారు. సంతాప తీర్మానాలు, ఆ వెంటనే బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిపై ఒకరిద్దరు మాట్లాడడం, మూజువాణి ఓటుతో ఆమోదించడం అసెంబ్లీలో చకచకా జరిగిపోయాయి. -
సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
-
సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: వైఎస్ జగన్
అమరావతి: రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?. ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇవాళ్టి నుంచి మిర్చి యార్డ్‌కు సెలవు ప్రకటించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్‌కు సెలవు ఇచ్చారు. రైతులు సమస్యల్లో ఉంటే యార్డ్‌ను మూసేస్తారా?. మిర్చికి కేంద్రం రూ.5వేలు ఇస్తానన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. రుణమాఫీ విషయంలోనూ మాట తప్పి రైతులను దగా చేశారు. జీఎస్టీ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే రెండు నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. రైతుల సమస్యలపై మాట్లాడదామంటే తప్పించుకుంది. అ అంటే అభివృద్ధి అమరావతి కాదు. అ అంటే అవినీతి, అ అంటే అరాచకాలు, అ అంటే అనారోగ్యం, అ అంటే అబద్ధాలు.’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చేలా బిల్లుకు సవరణలు చేసి ఏపీ అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. -
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
-
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లు వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒకే దేశం...ఒకే పన్ను విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు రైతులను ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు దేవినేని నెహ్రు, ఆరేటి కోటయ్య, రుక్మిణిదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. -
దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
-
రైతు సమస్యలపై వాయిదా తీర్మానం
అమరావతి: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర శాసనసభతో పాటు శాసనమండలి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు మండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. అంతకు ముందు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశాలను నాలుగు రోజులు జరపాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి ఒక్కరోజులోనే అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్ సీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతుల కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సభలో ప్రస్తావించనున్నారు. -
అవును.. ప్రధాని సావధానంగా విన్నారు: వైఎస్ జగన్
రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ప్రధానమంత్రిని కలవకపోతే అమెరికా అధ్యక్షుడిని కలుస్తామా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రధానికి రాసిన లేఖకు అప్పుడే అక్కడినుంచి సమాధానం కూడా వచ్చిందని, దాన్ని ఇప్పుడు రాసినట్లుగా ఆంధ్రజ్యోతి ప్రచురించిందని, వాళ్లకు అది ఏ అధికారి నుంచి వచ్చిందో వాళ్లనే అడగాలని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని చాలా సావధానంగా విన్నారని, ఆయన హోదా ఇస్తారనే ఆశ తమకు ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము హోదానే ప్రధాన అంశం చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. జీఎస్టీ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బిల్లు ఒక ఫార్మాలిటీ కేంద్రం ఇదివరకే నాలుగు బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించిన నేపథ్యంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి అన్నీ కేంద్రం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీని రాష్ట్రాలకు పంపడం ఒక ఫార్మాలిటీ జీఎస్టీకి ఎవరూ వ్యతిరేకం కాదు. దానివల్ల మంచి జరుగుతుంది, పన్నుల మీద పన్నులు పడే పరిస్థితి ఉండదు కాబట్టి రేట్లు తగ్గుతాయనే ఆశ ప్రతి సామాన్యుడిలోను ఉన్న నేపథ్యంలో అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున కేంద్రంలో ఈ బిల్లుకు మద్దతిచ్చాం, రాష్ట్రంలో కూడా మద్దతివ్వడంలో ఎలాంటి అనుమానం లేదు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోడానికి బిల్లు పెడుతున్నారు గానీ, రైతు ఆదాయాన్ని గురించి ఆలోచన చేయడం లేదు గిట్టుబాటు, మద్దతుధరలు లేక ఏ పంట చూసినా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉండటంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉల్లి కిలో రూపాయికి, రెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు గత సంవత్సరం 25-30కి అమ్మారు కంది 8వేలు-8500 ఉంటే ఇప్పుడు మూడు, నాలుగు వేలకు కూడా కొనట్లేదు పెసర గతంలో ఆరువేలు ఉంటే ఇప్పుడు నాలుగువేలు పలుకుతోంది మినుము గతంలో 12 వేలు అయితే ఇప్పుడు ఆరువేలు ఉంది మిర్చి గత సంవత్సరం 12-14వేలు పలికితే ఇప్పుడు 800-4000 మధ్య అమ్ముకోవాల్సిన అధ్వానమైన పరిస్థితి ఉంది పసుపు గత ఏడాది 9వేలు అమ్మితే ఈ ఏడాది 4000-4500 దాటడం లేదు టన్ను మామిడి గత సంవత్సరం 45 వేలు పలికితే ఇప్పుడు 7వేలకు అమ్ముతున్నారు కానీ రైతు కొనాల్సిన పశుగ్రాసం మాత్రం ఎకరా పదివేల రూపాయలు ఉంది. ఒక గేదెకు ఒక ఎకరా కావాలి.. ఎండు గడ్డి రేటు ఎకరా పదివేలు గత సంవత్సరం ఇది 5వేలు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి 2, 3 వేలు మాత్రమే ఉండేది పరిస్థితి ఇంత దారుణంగా ఉండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతామన్నారు మేం 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాం అనగానే రైతులను మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు.. పూర్తిగా రుణాల మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో బంగారం ఇంటికి తెస్తానని ఏ రకంగా మోసపూరిత మాటలుచెప్పాడో, వాటినే కొనసాగిస్తూ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు మొన్న మిర్చి ధరల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే.. రైతు పరిస్థితి మారకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం అని చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నాం రైతు పరిస్థితిని పట్టించుకోని చంద్రబాబుకు బుద్ధి వచ్చేందుకు రైతులకు తోడుగా నిలబడతాం రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మార్కెట్లో దళారులు దారుణంగా ఉన్నారు ఎవరైనా హెరిటేజ్ షాపుకు వెళ్లి మిర్చి కొనాలంటే 200 గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు. అంటే క్వింటాలు దాదాపు 25వేల రూపాయలు ఉంది. కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి 2వేల నుంచి 4 వేల మధ్యలో ఉంది రైతు నుంచి వ్యాపారి వరకు పోయేసరికి ఇంత తేడా కనిపిస్తోంది చంద్రబాబు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటే.. హెరిటేజ్‌లో తన లాభాలు తగ్గుతాయని హెరిటేజ్‌లో ఎక్కువ ధరలకు కొనాల్సి ఉంటుందని ఇంత దారుణంగా చంద్రబాబు దగ్గర నుంచి దళారులు, వ్యాపారులు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు 92 లక్షల క్వింటాళ్లు పండాయి కాబట్టి కనీసం 50 లక్షల క్వింటాళ్లు కొంటేనే మార్కెట్లో పోటీ వస్తుంది, వ్యాపారులు కూడా రేటు పెంచి కొనుగోలు చేస్తారు కేంద్రం కాస్తో కూస్తో ముందుకొచ్చి 5వేలు క్వింటాలుకు ఇస్తామని ముందుకొచ్చింది.. సంతోషం కేంద్రం నుంచి అంత వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి.. మరో 3వేలు జతచేసి కనీసం 8వేలకు అయినా కొనుగోలు చేస్తే రైతులకు కనీసం ఖర్చులు వస్తాయి ఎకరాకు రైతుకు లక్షా 30 వేల నుంచి లక్షా 60 వేల వరకు ఖర్చవుతుంది ఎకరాకు 13-15 క్వింటాళ్లు కూడా రాలేదు, రైతులు ఎలా బతుకుతారు? మిర్చి, ఉల్లి, మామిడి, టమోటా.. ఏ పంట చూసినా రైతులు బతికే పరిస్థితి లేదు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం కేవలం 2 కోట్లు.. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అన్నిరకాలుగా అండగా నిలిచేందుకు, చంద్రబాబు ఇంత దారుణంగా పాలన చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తూ, అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెబుతున్నాం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెట్టాల్సిందే, గిట్టుబాటు ధరలకు పంటలను కొనాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నాం వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు... ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశాను.. దాన్ని కరుణాకర రెడ్డి కూడా చూపించారు చంద్రబాబు తన అధికారంతో ఒకవైపు ప్రతిపక్షమే ఉండకూడదన్న దుర్బుద్ధితో నిస్సిగ్గుగా తన దగ్గర ఉన్న అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే.. అధికారులను ప్రలోభపెట్టి, వాళ్లతో తప్పులు చేయిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? రాజ్యాంగ పరిధిలో ఉన్నాం.. ట్రంప్‌కో, అమెరికా గవర్నర్‌కో చేయలేం కదా, ప్రధానికే ఫిర్యాదు చేస్తాం అధికారులు ఇలా చేస్తున్నారు, వాళ్లకు చంద్రబాబు నుంచి సూచనలు వస్తున్నాయి, వీళ్లు చేస్తున్న వేధింపుల మీద లోతుగా దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రికే కాదు.. సీవీసీకి, అందరికీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి, ఆ బెయిల్‌ను రద్దు చేయాలని మళ్లీ కోర్టుకు పోవడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు తప్పు చేశాడని రుజువు కాకుండా జైల్లో పెట్టడమే తప్పు, రాజ్యాంగం ప్రకారం 3 నెలల్లోపు విడుదల చేయాలి కానీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై కేసులు పెట్టారు.. అక్కడి నుంచి కేసులు నడిపించేవరకు కూడా అంతా వాళ్లే అప్పుడు చంద్రబాబు ఫోన్లలోనే అధికారులతో నడిపించారు, వాళ్లు మీడియాకు సెలెక్టివ్ లీకులు ఇచ్చారు ఎంతవరకు చెప్పాలి, ఏ రకంగా చెడ్డపేరు రావాలని చూశారు దర్యాప్తు అధికారులు ఇలా చేయకూడదు గానీ, వాళ్లతో ఈయన చేయించారు అప్పుడు అలా చేశారు, ఇప్పుడు మళ్లీ తనకున్న మంత్రిని కేంద్రంలో కూర్చోబెట్టుకుని ఆయనతోను, చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న మంత్రులను ఉపయోగించుకుని ఇదే కార్యక్రమం చేస్తున్నారు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాజీ సీఎస్ ఏదో చెబితే, నేను ప్రభావితం చేశానని, బెయిల్ రద్దు చేయాలని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఇంత దారుణంగా చేస్తున్నాడు.. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు, ఎవరి దగ్గరకు వెళ్తున్నారు, ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో అన్నింటి మీదా దర్యాప్తు చేయాలని లెటర్లు రాయడం ప్రజాస్వామ్యంలో్ తప్పదు అవతలివాడు కొడుతున్నా కొట్టించుకుంటే ఎవడూ బతకడు బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లేఖ తీసుకెళ్లి ఇస్తాడా? చంద్రబాబు మీడియాను ఎంతలా మేనేజ్ చేస్తారంటే.. చివరకు ఒక మీడియా హౌస్ న్యాయం తరఫున మాట్లాడాల్సింది పోయి.. జరగనిది జరిగినట్లుగా కుకప్ చేసింది నేను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే, వాళ్ల దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చింది. మే 10న నేను ప్రధానమంత్రిని కలిశాను బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లెటర్ తీసుకెళ్లి ఇస్తాడా.. నేను మే 10న ఇచ్చిన లేఖను పక్కన పెట్టి, ఫిబ్రవరి 17న నేను రాసిన లేఖను ప్రస్తావించారు. మొదటి పేజీ చూపిస్తే తేదీ చూపించాల్సి వస్తుందని చివర పేజీ వేశారు ఇదే లేఖ పెట్టి మీడియా అబద్ధాలు చెబుతుంటే ఈ వ్యవస్థలో ఎవరైనా బతకగలరా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రధనమంత్రిని కలిసి సమస్యలు చెప్పడం తప్పా? ప్రధానితో హోదా సహా అన్ని విషయాలూ మాట్లాడాం గంట సేపు మాట్లాడితే సహజంగానే అన్నీ మాట్లాడతాం ప్రత్యేక హోదా అంశం మీదే 10-15 నిమిషాలు చెప్పి ఉంటాం నిజమా జగన్.. మరి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అని ప్రధాని అన్నారంటే ఈయన ఏ రకంగా మిస్లీడ్ చేశారో అర్థమవుతుంది. అగ్రిగోల్డ్ గురించి మాట్లాడాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు చంద్రబాబు కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చాయన్నాను మిర్చి రైతుల అవస్థల గురించి కూడా మోదీతో ప్రస్తావించాను సహజంగా రాజకీయాలు కూడా మాట్లాడతాం చంద్రబాబు ఎలా దోచుకుంటున్నాడు, అవినీతిలో ఏపీని నెంబర్ 1 అని ఎలా చెప్పారు, కాగ్ నివేదిక చంద్రబాబు మీద ఆరోపణలను ధ్రువీకరిస్తూ ఎలా నివేదిక ఇచ్చింది, రాజధాని కేంద్రంగా చంద్రబాబు చేస్తున్న స్కాంలు ఏంటి.. అన్నింటి మీదా కూలంకషంగా చెప్పాం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎలా చేస్తున్నాడో అన్నీ చెప్పాను కానీ చంద్రబాబుకు ఉన్నట్టుండి మోదీ అంటరాని వాడు అయిపోయారు మోదీ జగన్‌కు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని అడుగుతున్నారు ప్రతిపక్ష నాయకుడికి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం తప్పా, ప్రతిపక్ష నేత సమస్యలు చెప్పడం తప్పా? నువ్వు మోదీ దగ్గరకు వెళ్లి ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడావు, ఎప్పుడు ఒత్తిడి తెచ్చావు.. ఏరోజూ చెప్పలేదు పైగా నువ్వు చెయ్యవు, ఎవరైనా చేస్తే వాళ్లమీద అభాండాలు వేయడం నేను మోదీని కలవడం తప్పన్నట్లు, ఆయనకు విషయాలు చెప్పడం, ఆయన వినడం అన్నీ తప్పన్నట్లు చెబుతుంటే ఆశ్చర్యం వేసింది ఏ ఈడీ అధికారి నుంచి ఆంధ్రజ్యోతికి ఆ లేఖ వచ్చిందో వాళ్లనే అడగండి సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించి ఒక వ్యక్తిని 14 రోజులు జైల్లో పెట్టారు నిజంగా మీరు చేస్తున్నది కరెక్టేనా? వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారంటే.. కేసులు పెట్టడం దగ్గర నుంచి లోపల వేసేవరకు ఎన్నికలకు ముందు నా గురించి ఎంత దారుణంగా నైతిక విలువలు మర్చిపోయి పోస్టింగులు చేయించారు నక్కను పెట్టి, దాని ముఖానికి నా ఫొటో తగిలిస్తే తప్పు కాదా జగన్‌ను ప్రేమించేవాళ్లు కూడా కడుపు మండి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్లను బెదిరించి కేసులు పెడుతున్నారు వ్యవస్థలను ఇంత దారుణంగా మేనేజ్ చేసేవాళ్లు సీఎం పదవిలో కూర్చోడానికి అర్హుడు కాడు నా షెడ్యూల్ ఇదీ.. మరి బాబు ఎక్కడికెళ్లారు? నాకైతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాత్రి ఫోన్ వచ్చింది, పొద్దున్నే రమ్మన్నారు ఉదయం 6.30 విమానానికి బయల్దేరి వెళ్లాం, అది సాంకేతిక సమస్య కావడంతో 7.30కి వేరే విమానంలోకి మారాం అక్కడకు వెళ్లేసరికి సుమారు 10 అయ్యింది, వెంటనే ప్రెస్‌కు ప్రధాని అపాయింట్మెంట్ ఉందని చెప్పాం ఫ్రెషప్ అయ్యి వెంటనే ప్రధాని వద్దకు వెళ్లాం, ఆయనకు ఇచ్చిన అర్జీ సహా అన్నీ మీడియాకు చూపించాం.. అన్నీ పారదర్శకంగా చేశాం చంద్రబాబు 2-3 గంటలకు వచ్చి, 11 గంటల వరకు ఎవరికీ కనపడలేదు ఆయన ఈ మధ్య సమయంలో ఎక్కడకు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఎవరు చీకట్లో చిదంబరాన్ని కలిశారు, ఎవరు కాంగ్రెస్‌తో కలిసి నా మీద కేసులు పెట్టారు, ఎవరు విప్ జారీచేసి మరీ కిరణ్ సర్కారును కాపాడారు? బీజేపీ ప్రభుత్వంలో తనవాళ్లను మంత్రులుగా పెడతాడు, ఇక్కడ ఆయన రహస్యంగా తిరుగుతాడు, ఎవరిని కలిశాడో కూడా చెప్పడు కడుపు మండినవాళ్లే మెయిల్ పెట్టి ఉంటారు అమెరికా గవర్నర్, అమెరికా అధ్యక్షుడు మన దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించినవాళ్లా? వాళ్లకు రాస్తే మాకు పార్టీపరంగా ఏమొస్తుంది? ఆ మెయిల్స్ మేం పెట్టలేదు.. కడుపు మండినవాడు ఎవడో పెట్టి ఉంటాడు గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కోసం 27 మందిని చంపేశాడు.. ఆ కేసులో జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు బయట తిరుగుతూనే ఉన్నాడు. ఆ గోదావరి జిల్లాల వాళ్లకు ఎవరికో కడుపు మండే ఉంటుంది తమిళనాడుకు చెందిన 29 మంది కార్మికులను స్మగ్లర్లు అన్న పేరుతో పిట్టల్ని కాల్చినట్లు టపటపా కాల్చేశారు.. దాంతో తమిళనాడులో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. వాళ్ల కుటుంబాలలో ఎవరికో కడుపు మండే ఉంటుంది ఓటుకు కోట్ల కేసులో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియోటేపుల్లో దొరికిపోయినా ఆయనను అరెస్టు చేయలేదంటే, రాజీనామా చేయలేదంటే ఎవరికైనా కడుపు మండదా? బయటకొచ్చి నీ అంత సత్య హరిశ్చంద్రుడు ఎవరూ లేరన్నట్లు కబుర్లు చెబుతారు ఇవన్నీ చూసి ఎవరికో కడుపు మండి ఈ మెయిల్ పెడతారు.. దానిమీద వాళ్లకు ఖాళీ ఉంటే చదివి తీసుకోవాలనుకుంటే చర్య తీసుకుంటారు దాన్ని ఈయనేదో కుట్ర అని బాధపడిపోతారు.. తప్పు చేసినందుకు కాకుండా, వాటిని ఎత్తి చూపించినందుకు ఎక్కువ బాధపడతారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నామీద కేసులు పెట్టారని ఆయనే ఒప్పుకున్నారు. కానీ ఆయన సగమే చెప్పారు. తాను కూడా ఆ కేసులో ఉన్నానని కూడా చెప్పి ఉండాల్సింది ప్రధాని హోదా ఇస్తారన్న ఆశ ఉంది.. హోదా అనే విషయం మీద ప్రధానమంత్రికి కనీసం 10 నిమిషాల సేపు చెప్పాను. ఆయన చాలా సానుకూలంగా విన్నారు. నిజంగా ఇంత సానుకూలంగా ఆయన విన్న తర్వాత.. మోదీ పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి. ఆయన గురించి భవిష్యత్తులో గొప్పగా మాట్లాడాలంటే, ప్రత్యేక హోదా విషయంలో ఆలోచించాలి.. పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చారు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో్ను, బెంగళూరుతో కూడిన కర్ణాటకతోను, చెన్నైతో కూడిన తమిళనాడుతోను పోటీ పడలేమని చెప్పాం ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదంటే, ఎక్సైజ్ డ్యూటీ అక్కర్లేదంటే ఎవరైనా వస్తారు, మీరు కూడా తిరుపతిలో మాటిచ్చారు, మాట తప్పొద్దని రిక్వెస్ట్ చేశాం మాకు ఆశ ఉంది.. చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందంటే అది ప్రధానికే పోరాటం చేసేటపుడు మూడు రకాల వ్యూహాలు ఉండాలి.. అవి దౌత్యం, లౌక్యం, పోరాటం అన్నిరకాలుగా చేస్తేనే మన ప్రత్యేక హోదా పోగొట్టుకోకుండా ఉంటాం నిజంగా ఆయన మనసు కరిగి అది జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.. కాస్త సమయం ఇద్దాం, మంచి జరుగుతుందని ఆశిద్దాం రాజీనామాలు చేయించడం చిన్న విషయం. ఒకసారి చేసిన తర్వాత ఇక ప్రత్యేక హోదా గురించి అడగగలిగింది ఎవరు? కనీసం పార్లమెంటులో ఉన్నారు కాబట్టి అడుగుతారు, రాజ్యసభలో కూడా విజయసాయిరెడ్డి పట్టుబట్టారు ఆ వ్యక్తి అక్కడ ఉంటేనే బిల్లు వస్తుంది, చర్చ జరుగుతుంది మోదీ గారికి చెప్పాం కాబట్టి ఆయన కాస్తో కూస్తో మంచి చేస్తారని ఆశిద్దాం పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు మీద చర్చ కూడా ఆయన దృష్టికి వెళ్లచ్చు ఈరోజు కాకపోతే ఆరు నెలల తర్వాత రాజీనామాలు చేయిస్తాం.. ఒత్తిడి చేయకుండా ఊరికే ఏ ఆలోచనా, దౌత్యం, లౌక్యం లేకుండా రాజీనామా చేస్తే మనకే నష్టం ప్రత్యేక హోదా గురించి ఆరాటపడేది, సిన్సియర్‌గా పోరాటం చేసేది ఒక్క జగనే అని గర్వంగా చెప్పగలను ఎన్నికల్లో కూడా దీన్ని ఇష్యూ చేస్తాం.. అది ఇచ్చేవారికి మా మద్దతు ఉంటుందని ఇప్పుడే చెబుతున్నాం ఫిబ్రవరి 17న ప్రధానికి వైఎస్ జగన్ రాసిన లేఖ అసలు ప్రతి ఇదీ.. -
రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం ఉదయం జరగనుంది. ఉదయం 9 గంటలకు బీఏసీ సమావేశం కానుంది. 9.45 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, 10.15 గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. చర్చల అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. -
మే రెండోవారం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ
అమరావతి: ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మే రెండోవారం తర్వాత ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కోడెల పేర్కొన్నారు. మహిళా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో డిక్లరేషన్‌ను రూపొందిస్తున్నామని, ఇందుకోసం కోర్ కమిటీ, సలహా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జూన్ 30 నాటికి అమరావతి డిక్లరేషన్‌ను రూపొందిస్తామని స్పీకర్ తెలిపారు. కాగా స్పీకర్ కార్యాలయానికి రాజీనామాలు ఏమైనా వచ్చాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, స్పీకర్ మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. -
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
-
లోకేశ్.. మళ్లీ వేసేశారు!
-
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అయితే ఆయన పదవీకాలం ముగియడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కూడా ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ప్రతిపక్ష నాయకుడిని ఎంచుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. సీనియర్ నాయకుడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. -
లోకేశ్.. మళ్లీ వేసేశారు!
మొన్నామధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఆ రెండింటినీ మించిపోయేలా మరో గొప్ప మాట చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మరోసారి ఆయన నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే. అలాంటప్పుడు నూటికి 110 మార్కులు తెచ్చుకోవాలని అన్నట్లుగా లేని సీట్లు ఎక్కడి నుంచి గెలిపించుకురావాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఆయన ఎలా చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకున్నారు. అయినా.. నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా.. దొడ్డి దారిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి సంపాదించి మంత్రి అయిన ఆయనకు.. అసెంబ్లీ గురించి ఎలా తెలుస్తుందిలే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. లోకేశ్ ఇంకా ఏమన్నారో చూడండి.. నారా లోకేశ్ ప్రమాణం చూశారా? తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేశ్ అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్ -
టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు
అసెంబ్లీ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆర్కే మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ కార్యదర్శిగా కొనసాగడానికి అర్హతల్లేని కె.సత్యనారాయణను తక్షణం పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్హతల్లేవని తెలిసీ ఆ పదవిలో కొనసాగిస్తున్నా రంటే సీఎం చంద్రబాబుకు ఆయనతో ఉన్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యనారాయణ నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా టీడీపీ కార్యకర్తలా పనిచేస్తు న్నారని తప్పుపట్టారు. రెండేళ్లుగా కార్యదర్శి విద్యా ర్హతల గురించి సమాచారమడుగుతున్నా ఇవ్వట్లేదన్నారు. ఇదే విషయమై తాను సమాచారహక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే మూడు నెలల క్రితం అసెంబ్లీ పీఐఓకు రూ.15వేలు జరిమానా విధించారని తెలిపారు. తాను స్వయంగా స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యాలయా లకెళ్లి సమాచారం కావాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. కార్యదర్శిపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమోదై నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందని, ప్రభుత్వోద్యోగిపై కేసు ఉన్నపుడు పదవినుంచి తప్పించి విచారణనుంచి బయటికొచ్చాకే మళ్లీ పదవివ్వాలని సీసీఏ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. -
‘ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని తొలగించాలి’
-
రెండు రోజుల పాటు అసెంబ్లీ: యనమల
సాక్షి, అమరావతి: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో గానీ రెండు రోజుల పాటు అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహిస్తామని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అనంతరం రాష్ట్రం జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో జీఎస్టీ సన్నద్ధత, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వ్యయంపై సమీక్ష నిర్వహించారు. -
‘అధికార పక్షానికి జగనే ఓ సమస్య’
-
ప్రజాస్వామ్య విలువలు ఖూనీ
⇒ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరుపై ⇒ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ధ్వజం సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్షం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసిందని, సభ జరిగిన తీరు పూర్తి అప్రజాస్వామికంగా ఉందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఆయన తన చాంబర్లో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ జరిగిన తీరును, ప్రజా సమస్యల పట్ల అధికారపక్షం వ్యవహరించిన తీరును జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే... అడుగడుగునా అప్రజాస్వామిక పోకడలే.. ‘‘సభ జరిగిన తీరుపై నేను చెప్పడం కన్నా... అది ఎంత అప్రజాస్వామికంగా జరిగిందో చెప్పడానికి మీరే (మీడియా) మొట్టమొదటి సాక్షులు. సభ చాలా దారుణంగా జరిగింది. చిట్ట చివరి రోజు కూడా మేం లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. ఈ సభలో అధికారపక్షం వాళ్లు నన్ను ఇష్టమొచ్చినట్లు దూషించారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ఏపీ సీఎం చంద్రబాబు చూస్తూ చాలా బాగా ఆనందించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు టీడీపీ నుంచి అందరూ నన్ను తిట్టేవాళ్లే.... నేను మైక్ తీసుకుని రెండు మాటలు మాట్లాడేటప్పటికి పదే పదే కట్ చేసేస్తు న్నారు. నేను మాట్లాడుతున్నపుడు సీఎం మూడు సార్లు, మంత్రులు అచ్చెన్నాయుడు నాలుగైదు సార్లు, అయ్యన్న పాత్రుడు రెండు సార్లు జోక్యం చేసుకుని అడ్డు తగులుతూ మాట్లాడారు. నాపై వారు చేసినవన్నీ వ్యక్తిగత ఆరోపణలే... అన్నీ అబద్ధాలతో కూడుకున్నవే. వాటిని నిరూపించక పోతే పదవులకు రాజీనామా చేస్తారా? అని నేను విసిరిన చాలెంజ్‌ను స్వీకరించే ధైర్యం వాళ్లకు లేదు. ఏ చర్చ చూసినా పక్కదోవ పట్టించడమే! అసెంబ్లీలో మేము ఏ అంశాన్ని లేవనెత్తినా దానిపై చర్చను అధికారపక్షం పక్కదోవ పట్టిస్తోంది. ఆక్వా పార్కు కాలుష్యం వల్ల చనిపోయిన బాధితుల సమస్యపై ఇవాళ చర్చ ఎలా జరిగిందో చూశారు కదా! ఇదొక్కటే కాదు.. అధికారులపై టీడీపీ నేతలు దాడి చేసిన ఉదంతం, దాని కన్నా ముందు అగ్రిగోల్డ్ కుంభకోణం, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజి వ్యవహారం ఇలా.. ఏ అంశంపై చూసినా ప్రభుత్వ వైఖరి ఒకేలా కనిపిస్తోంది. తప్పించుకోవడం.. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం.. ఏ అంశంపై కూడా సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడలేదు. అగ్రిగోల్డ్ విషయంలో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని కోరాం, కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అగ్రిగోల్డ్‌కు చెందిన, బయట ఉన్న ఇంకా కొన్ని ఆస్తులను కూడా వేలం పరిధిలోకి తీసుకు రావాలని కోరితే ప్రభుత్వం దానికీ ఒప్పుకోలేదు. అధికారపక్షానికి ప్రజాసమస్యలు పట్టవు.. ప్రతిపక్షంగా మాకేమో ప్రజాసమస్యలే మాకు సమస్యలు... కానీ అధికారపక్షానికి జగనే ఒక సమస్య, అన్నట్లుగా వ్యవహరించారు. మేం ప్రజా సమస్యలపై మాట్లాడితే వారు (టీడీపీ) మాత్రం జగనే తమ సమస్య అన్నట్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తీర్మానం చేయించేందుకు మేం పడ్డ ఆరాటం, తపనను చంద్రబాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తాను ప్రత్యేకహోదాకు వ్యతిరేకిని అని చంద్రబాబు ఈ సమావేశాల్లో స్పష్టంగా బయటపడ్డారు. మా పార్టీ నుంచి ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చంద్రబాబు కండువాలు కప్పి తీసుకెళ్లారు. స్పీకర్ సమక్షంలోనే సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరినీ టీడీపీ బెంచీల వైపు కూర్చోబెట్టి సభను నడిపిన తీరు ఈ సమావేశాల్లో చూశాం. ఇంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కనుక చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పైన దేవుడున్నాడు.. అంతిమంగా గుణపాఠం నేర్పడానికి ప్రజలున్నారు. వారే తుది నిర్ణయం తీసుకుంటారు. అబద్ధాలు, మోసాలు కాగ్ బయటపెట్టింది.. వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ‘కాగ్’(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. 2015–16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రాష్ట్రం వ్యవసాయ రుణ విముక్తికి రూ.4,300 కోట్లు కేటాయించింది. అందులో రూ.743 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన రూ.3,557 కోట్ల మొత్తాన్ని ఇతర పద్దులకు రీ అప్రాప్రియేషన్ చేశారు. అందులో ఉద్యానవన పంటల రుణ మాఫీ కోసం 2015–16లో నిధులేమీ కేటాయించలేదు. ఖర్చుచేసిన రూ.743 కోట్ల మొత్తంలో కూడా రూ.375 కోట్ల నిధులను సంవత్సరం చివర్లో రైతు సాధికార సంస్థ పీడీ ఖాతాకు సర్దుబాటు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేని ప్రాజెక్టు అని కాగ్ అంది’ అని జగన్ పేర్కొన్నారు. -
ఆక్వాపార్కుకు కొమ్ముకాస్తున్న సర్కారు
‘మొగల్తూరు’ సంఘటనపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన జగన్ సాక్షి, అమరావతి: అయిదుగురు యువకులను పొట్టన పెట్టుకున్న మొగల్తూరు ఆనంద ఆక్వాపార్కు వ్యవహారం లో ప్రభుత్వ పక్షపాత వైఖరి, అసత్యాలు బట్టబయలయ్యాయని విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. కర్మాగారం నిర్లక్ష్యమే అయిదుగురి మరణానికి కారణమని తెలిసినా... అంతకు పదిరెట్లు కాలుష్య కారక కర్మాగారం ఏర్పాటుకు ఇదే యాజమాన్యానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ సర్కారును నిలదీశారు. మొగల్తూరు ఆక్వా ప్లాంటు ప్రమాద సంఘటన శుక్రవారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ అసెంబ్లీలో స్పీకరుకు వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ఆరంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు స్పీకరు పోడియంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు చేసిన నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. మూడుసార్లు వాయిదా అనంతరం ప్రమాద సంఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే... మంత్రి చెప్పినవి అబద్ధాలే కదా! ఆనంద ఆక్వా ప్లాంటులో ట్రీట్మెంట్ ప్లాంటు ఉందని మంత్రి చెప్పారు. మరి ట్రీట్మెంటు ప్లాంటు ఉంటే ఇన్ని రోజులు వ్యర్థాలను ఎందుకు నిల్వ చేశారు? ట్రీట్మెంటు ప్లాంటు ఉండి నిజంగా దీనిని ఉపయోగించే ఆలోచన ఉంటే గొంతేరు కాలువకు పైప్‌లైన్ ఎందుకు వేశారు? గొం తేరు కాలువకు ఉన్న పైప్‌లైన్ తీసేయాలనే కదా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చెప్పింది. 2014లో పరిశ్రమ పెడితే 2016లో గొంతేరు కాలువకు ఉన్న పైప్‌లైన్ తొలగిం చాలని పీసీబీ ఆదేశించింది. మరి ఆ రెండేళ్లు వ్యర్థాలు గొంతేరులోకి పంపినట్లే కదా? మంత్రి ప్రకటనలోని ఆరో పేరాలో చెప్పిన కథే ఇది. ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంటులో కలెక్షన్ ట్యాంకు, ఏరేషన్ ట్యాంక్, క్లారిఫయర్, స్లడ్జ్డ్రయింగ్ బెడ్స్, బఫర్ ట్యాంక్ ఉంటాయని, వీటిలో శుద్ధి చేసిన నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూముల్లో మొక్కల పెంపకానికి సేద్యపు నీరుగా వినియోగిస్తున్నారని మంత్రి చెప్పింది అబద్ధమే కదా? పదిరెట్లు కాలుష్యం వెదజల్లే పరిశ్రమకు ఎలా అనుమతించారు? ఇక్కడ ఆనంద ఆక్వా పార్కు ప్రమాణాలు పాటించలేదని మంత్రి ప్రకటనలోనే తేటతెల్లమైంది. మరి ఇదే యాజమాన్యానికి తుందుర్రులో గోదావరిలో కలుషిత నీరు కలిసేలా పది రెట్లు కాలుష్యం వెదజల్లే ఆక్వా పరిశ్రమకు ఎలా అనుమతి ఇస్తారు..? ప్రజలు గోదావరి ఆక్వా పార్కు అనుమతించవద్దని ఓవైపు ఆందోళన సాగిస్తుంటే ఉద్యమం చేపట్టిన 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని ఏమంటారు? ప్రయివేటు పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటూ ప్రజలను వేధిస్తారా? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకసార్లు జీరో పొల్యూషన్ పరిశ్రమలు అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు ప్లేటుమార్చి ఆనంద ఆక్వా పరిశ్రమ ఆరెంజి కేటగిరీలో ఉందని అంటున్నారు. పీసీబీ ప్రమాణాల ప్రకారం కాలుష్య స్థాయిని బట్టి రెడ్, ఆరెంజి, గ్రీన్, వైట్ అనే నాలుగు రకాలుంటాయి. ఈ పరిశ్రమవల్ల నీరు కలుషితమవుతోందనేది వాస్తవమని ఆరెంజి అని పేర్కొనడాన్ని బట్టే తేటతెల్లమవుతోంది. పొల్యూషన్ విషయంలో జీరో నుంచి ఆరెంజికి వచ్చింది. అంటే మీ (ప్రభుత్వ) స్టాండులో మార్పు కనిపిస్తోంది. యాజమాన్య నిర్లక్ష్యం మాటేది? మంత్రి రెండు పేజీల ప్రకటనలో ఇన్ని తప్పులున్నాయేగానీ, అయిదుగురు మృతి చెందిన సంఘటన వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. నాకు, యాజమాన్యానికి విరోధం లేదు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. మంత్రిని ముందుగా ఇంగ్లిష్ సరిచేసుకోమనండి. (ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు లేచి వ్యక్తిగత విమర్శలు చేయడంతో) నన్ను తిట్టడానికి గొప్ప స్పీచ్ ఇచ్చారు. మంత్రి కాబట్టి అలా మాట్లాడితే పరువుపోతుందని, తప్పు సవరించుకోవాలని చెప్పాం. అయిదుగురి మరణానికి దారితీసిన కారణాలేమిటి తెలుసుకోవాలనిగానీ, భవిష్యత్తులో ఇలా జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలనిగానీ ప్రభుత్వానికి ఉంటే మెజిస్టీరియల్ విచారణ జరపాలని నిర్ణయిస్తుందా? అయిదుగురు మరణానికి దారితీసిన సంఘటనను ఆర్డీవో స్థాయి మెజిస్టీరియల్ విచారణతో సరిపెడతారా? పరిశ్రమలు రాకూడదని ఎవరికీ ఉండదు రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని ఎవరికీ ఉండదు. పరిశ్రమలు తప్పనిసరిగా రావాల్సిందే. అయితే వాటిని పెట్టాల్సిన చోట పెట్టాలి. కాలుష్య కారక పరిశ్రమలను సముద్రతీరంలో ఏర్పాటుచేస్తే అందరూ ఆహ్వానిస్తారు. గొంతేరు కాలువ పరిసరాల్లో పది వేల మంది నివాసం ఉంటున్నారు. ఆనంద ఆక్వాలో క్లీనింగ్ చేయడానికి వెళ్లిన అయిదుగురు కూ..కా.. అనే మాట కూడా లేకుండా చనిపోయారు. అలాంటి చోట్ల ప్రస్తుత పరిశ్రమ కంటే పదిరెట్లు కాలుష్య కారక పరిశ్రమ పెడితే ఇలాంటి ప్రమాదం జరిగితే ఎన్ని వేల మంది చనిపోతారు? పైప్‌లైన్ వేసేదెవరు? చంద్రబాబు జీరో పొల్యూషన్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. నేను ఆర్ఓసీ డేటా చూశాను. ఇది ప్రయివే టు కర్మాగారం. దీని నుంచి వచ్చే వ్యర్థపదార్థాలు సము ద్రంలో కలపాలంటే 30 కిలోమీటర్లు పైపు లైన్ వేయాలి. మరి ఈ పైప్‌లైన్ ఏర్పాటుకు ఖర్చును ఎవరు భరిస్తారు? ఒక వేళ ప్రభుత్వమే భరించేట్లయితే ఈ కర్మాగారంపై సర్కారుకు ఎందుకంత శ్రద్ధ? ఒకవేళ కర్మాగారం వారే పైపులైన్ వేస్తారంటే 30 కిలోమీటర్లకు రూ. 40 కోట్లు ఖర్చవుతుంది. ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయ ప్రొఫె సర్ల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించింది. తుందుర్రు, బేతపూడి గ్రామాలు సముద్ర మట్టానికన్నా తక్కువ ఎత్తు లో ఉన్నాయని తేల్చింది. ఈ పరిశ్రమకు రెండు వైపులా పొలాలున్నాయి. మరో రెండు వైపుల ఊర్లు, కాలువలు ఉన్నాయి. మరి ఇలాంటి చోట్ల విష వాయువులు, ప్రమాదకర గ్యాస్ పైప్లైన్లకు నిజంగా ఎవరైనా భూములు ఎందుకు ఇస్తారు? రూ.122కోట్ల ఫ్యాక్టరీ ఈ పైపులెన్ వేయడానికి రూ.40 కోట్లు ఖర్చవుతుంది. ఇంత ఖర్చుపెట్టి పైపులైను నిర్మించడం కంటే యాజమాన్యం కర్మాగారాన్నే సముద్ర తీరానికి మార్చుకోవచ్చు కదా. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా? ‘‘నా చదువుకు సంబంధించి (ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం లీక్ చేయమని కోరినట్లు) చేసిన అభియోగం నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా? చెప్పమనండి. చంద్రబాబు నాయుడికి నేను సవాల్ విసురుతున్నా. ఈ అంశంలో నాకూ చంద్రబాబు నాయుడికి సవాల్. మీరే అధికారంలో ఉన్నారు. నీకు ఇష్టమొచ్చినట్లు విచారణ జరిపించుకోండి. దమ్ముంటే రుజువు చేయండి’’ అని జగన్ చాలెంజ్ చేశారు. ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు తెలుసు అసెంబ్లీలో శుక్రవారం ప్రతిపక్ష నేత స్థాయి గురించి అచ్చెన్నాయుడు అవాకులు చెవాకులు పేలడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘ఎవరి స్థాయి ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేమిటో ప్రజలకు బాగా తెలుసు. నేను మొదటిసారి ఎమ్మెల్యేని కాదు. రెండుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లాను. 5.45 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచిన రికార్డు నాది. తల కిందపెట్టి కాళ్లు పైకెత్తినా చంద్రబాబుకు ఈ రికార్డు రాదు’’ అని నొక్కి చెప్పారు. (భూమా నాగిరెడ్డి మరణించినప్పుడు... అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా...) ‘‘ఎవరి మానవత్వం ఏమిటో ప్రజలకు తెలుసు. బస్సు ప్రమాదంలో పది మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి మనసు రాదు. మీ పార్టీకి 30 ఏళ్లు ఊడిగం చేసిన శోభమ్మ (శోభా నాగిరెడ్డి) చనిపోతే ఒక్కరైనా వచ్చారా? ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు. ఏ విషయమైనా రాజకీయమేనా? గోదావరి ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టిస్తారా? ప్రయివేటు పరిశ్రమకు సపోర్టు చేస్తూ ప్రభుత్వం ప్రజలను వేధించడమేనా మీ మానవత్వం?’’ అని సీఎం చంద్రబాబును, మంత్రులను నిలదీశారు. -
వారం తర్వాత గంటా మంత్రిగా ఉంటారా..!
మంత్రివర్గ విస్తరణపై శాసనమండలిలో సరదా చర్చ సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై శుక్రవారం శాసనమండలిలో సభ్యుల మధ్య కొద్దిసేపు అసక్తికర చర్చ జరిగింది. పాఠశాల విద్యపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో... వారం తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు మానవ వనరుల (విద్య) శాఖ మంత్రి పదవిలో ఉంటారో లేదోనని పీడీఎఫ్ ఎమ్మెల్సీల పక్ష నాయకుడు బాలసుబ్రమణ్యం ప్రస్తావించినప్పుడు మంత్రి సహా సభలోని పలువురు సభ్యుల ముఖాలలో నవ్వులు విరిశాయి. సభలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి గంటా మాట్లాడుతూ.. పాఠశాల విద్యపై అందరి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఎమ్మెల్సీలతో వారం రోజుల్లో ఒక సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనను ఆ శాఖ నుంచి తప్పించి వేరొక శాఖ కేటాయించమని సీఎంను కోరినట్టు ఈ రోజే కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయంటూ వారం రోజుల తర్వాత ఆయన ఈ మంత్రిగా ఉంటారో లేదనని బాలసుబ్రమణ్యం అనుమానం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి నవ్వుతూ బదులిస్తూ.. ఈ శాఖ మంత్రిగా తానుంటే తానే సమావేశం నిర్వహిస్తాననని.. లేదు ఎవరుంటే వాళ్లు సమావేశం నిర్వహిస్తారన్నారు. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ ప్రభుత్వ సూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆలోచన ఉన్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శాసనమండలిలో చెప్పారు. పాఠశాల విద్యపై చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ అంశంపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిందన్నారు. టీచర్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు, ఈ రంగంపై అసక్తి ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్ధునుల అత్మరక్షణ అవసరమైన అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఫైలెట్ ప్రాజెక్టు ఒక జిల్లాలో తరగతులు నిర్వహించి, ఫలితాలను బట్టి తదుపరి రాష్ట్రమంతా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం మౌలిక సౌకర్యాల కల్పనకు యాన్యూటీ పద్దతిన రూ.4 వేల కోట్లుతో నిధులు ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని ఉపాధ్యాయులకు జైలు శిక్షలా? పదవ తరగత పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని.. ఏ తప్పు లేకపోయినా ఉపాధ్యాయులను అనవసరంగా బలిపశువులను చేస్తున్నారని ఎమ్మెల్సీ వై. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చేయని తప్పులకు ఉపాధ్యాయులను జైలులో పెడుతున్నారని తప్పుపట్టారు. సభలో ఆయన మాట్లాడడానికి మండలి చైర్మను మైక్ ఇవ్వకపోయినా శ్రీనివాసరెడ్డి గట్టిగా మాట్లాడుతూ, తన అభిప్రాయాన్ని సభ ముందుంచారు. అంతకు ముందుకు పలువురు సభ్యులు పాఠశాల విద్య అంశంపై మాట్లాడారు. -
జగన్ కోసం వస్తే తరిమేశారు
అమరావతి : ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులతో శుక్రవారం అసెంబ్లీ లాబీలు కిక్కిరిసి పోయాయి. ఓ వైపు సభ జరుగుతుండగా జగన్ ను కలుసుకోవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన చాంబర్ ముందు గుమికూడారు. జగన్ తన చాంబర్లో ఉండగా బయటకు వస్తే కలుద్దామని వేచి ఉన్నారు. జగన్ వ్యక్తిగత సిబ్బంది వారందరినీ వరుసగా కలిపే యత్నం చేస్తుండగా అసెంబ్లీ ప్రధాన భద్రతాధికారి అక్కడకు వచ్చి ‘ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు...’ అంటూ అందరినీ గద్దించి పంపేశారు. చాలా మందిని అసెంబ్లీ ఆవరణను దాటించే వరకు వదల్లేదు. ఎంతో ఆశతో జగన్‌ను కలుద్దామని వచ్చిన సందర్శకులు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు నిరాశతో వెనుదిరిగారు. వాస్తవానికి జగన్ అసెంబ్లీకి వచ్చినపుడల్లా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు ప్రతిరోజూ ఆయన్ను కలవడానికి తాపత్రయపడుతున్నారు. అసెంబ్లీ ముగియగానే అదే పనిగా వేచి ఉండి ఆయనను కలిసే వెళుతున్న సందర్భాలు రోజూ జరుగుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు, ఇతర అసెంబ్లీ సిబ్బంది కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ హడావిడి కొనసాగుతోంది. అయితే శుక్రవారం అసెంబ్లీ చివరి రోజు కావడంతో సందర్శకుల రద్దీ మరితంగా పెరిగింది. చాలా మంది సెల్ఫీలు తీసుకుందామని ఆసక్తిని చూపారు. ఇలా ప్రజలు జగన్ కోసం అసెంబ్లీకి రావడం అధికారపక్షానికి కంటగింపుగా తయారైందట. అసెంబ్లీలో ఏ నేతకు కూడా లేని విధంగా ఇంత మంది సందర్శకులు జగన్ కోసం రావడం చూసి, వెంటనే భద్రతా సిబ్బందికి పురమాయించిన కారణంగానే వారందరినీ బయటకు పంపేశారని చెబుతున్నారు. -
చంద్రబాబు, పవన్‌కు ఆ ఆలోచనే లేదు: రోజా
అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయాలపై వాయిదా తీర్మానాలు ఇస్తే అధికార పక్షం కొట్టిపారేసి సమస్యలకు పాతరేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా టీడీపీపై ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో మొదటిరోజు నుంచి చివరిరోజు వరకు ప్రభుత్వం స్టేట్మెంట్లు ఇచ్చి తప్పించుకోవాలని చూసిందని, ఒక్క విషయంపైన కూడా సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి, ఆక్వా కంపెనీలో ఐదుగురి మృతి విషయాలపై వాయిదా తీర్మానాలు ఇస్తే పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని తిట్టడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారే తప్ప, ప్రజా సమస్యలపై తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. తమను తిట్టడానికే సమయం ఉపయోగించారని, ప్రజా సమస్యలపై నోరు మెదపలేదని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి విషయంలో చేసినట్లే మొగల్తూరు మృతుల విషయంలో కూడా సీఎం సెటిల్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన వారిగురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. నాయకుల తప్పులను కప్పిపుచ్చేందుకు మాత్రం తెరపైకి వస్తున్నారన్నారు. కుందుర్రులో పెట్టబోయే ఆక్వా ప్రాజెక్టు గురించి జగన్మోహన్రెడ్డి మాట్లాడితే మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకులంటూ విమర్శిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. నర్సాపురం, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో కొత్తగా పెట్టబోయే ఆక్వా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. స్వలాభం, రాజకీయ లాభం కోసం సీఎం ప్రజల ప్రాణాలు ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. తనకు కావాల్సిన ట్రావెల్స్ వారికి అన్ని పర్మిషన్లను సీఎం ఇప్పిస్తున్నారన్నారు. కాసుల కల్యాణ్, ప్యాకేజీ కల్యాణ్‌ను దించి సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓట్లేసిన వారికి న్యాయం చేయాలన్న ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడుకుగానీ, ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్కుగానీ లేదన్నారు. కమీషన్లు, లంచాల కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టేవారిని తమపార్టీ వదలబోదని హెచ్చరించారు. ఐదుగురి మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘టీడీపీ గొంతు శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే’
అమరావతి: అధికారపార్టీ ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తోందని, ఊరు మారినా.. తీరు మారలేదని, గత మూడేళ్ల దుష్ట సంప్రదాయాన్ని కొత్త అసెంబ్లీలో కూడా కొనసాగించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సంఖ్యాబలం ఉందని, అధికార మంద బలంతో శాసనసభలో అధికారపార్టీ నియంతలా వ్యవహరించి ప్రజావాణిని వినిపించే ప్రతిపక్ష గొంతు నొక్కేశారన్నారు. ఏ ప్రజా సమస్యపైన కూడా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని పట్టుమని రెండు నిమిషాలు కూడా మాట్లాడనీయకుండా మైక్ కట్ చేయడం ద్వారా అధికారపార్టీ నియంతృత్వ ధోరణిని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయిందన్నారు. ఇదే సమయంలో ఆయా అంశాలతో సంబంధంలేని అధికార పార్టీ వ్యక్తులకు మైక్ ఇచ్చి గంటల తరబడి వ్యక్తిగత దూషణలతో విలువైన సభసమయాన్ని అధికారపార్టీ దుర్వినియోగం చేసిందంటూ దుయ్యబట్టారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ సభ్యులమైన తాము అధ్యక్షా మైక్... అధ్యక్షా మైక్... అంటూ పోడియం చుట్టిముట్టి పోరాడితేకానీ మైక్ ఇచ్చేవారు కారని, ఇచ్చిన 30 సెకన్లలోనే తిరిగి మైక్ కట్ చేసి సభను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. కీలక ప్రజా సమస్యలైన అగ్రిగోల్డ్, పదవి తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్, ఆక్వాఫుడ్స్ కార్మికుల మరణాలు, రైతులు గిట్టుబాటు ధరలు, మైనార్టీల సంక్షేమం, అంగన్వాడీ సమస్యలు, విద్యార్థుల సమస్యలు వంటి ఏ సమస్యపై మాట్లాడదామన్నా మైక్ ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేశారన్నారు. ఈ నియంతృత్వ విధానానికి ప్రజలు చెప్పాల్సిన చోట, నొక్కాల్సిన చోట నొక్కడం ద్వారా ప్రజాక్షేత్రంలో టీడీపీ గొంతును శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అధికార పక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి అసెంబ్లీలో తమ గొంతు నొక్కినా దానికి రెట్టించిన ఉత్సాహంతో ప్రతిపక్ష పార్టీ నేతగా వైఎస్ జగన్ ప్రజా గొంతును వినిపిస్తూనే ఉంటారన్నారు. -
ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసబ బడ్జెట్ సమావేశాలు మొత్తం 57 గంటల 56 నిమిషాలు జరిగాయి. 14 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇక పార్టీలువారీగా సభలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారనేదానికి వస్తే... టీడీపీ ఎమ్మెల్యేలు 42 గంటల 9 నిమిషాలు, వైఎస్ఆర్ సీపీ 12 గంటలు, బీజేపీ 3గంటల 32 నిమిషాలు మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8గంటల 19 నిమిషాలు మాట్లాడగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3 గంటల 46 నిమిషాలు మాట్లాడారు. అలాగే బీజేఎల్పీ నేత 3 గంటల 13 నిమిషాలు మాట్లాడారు. కాగా అసెంబ్లీ జరిగిన తీరుపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంకు ఎనిమిది గంటలు అవకాశం ఇస్తే, వైఎస్ జగన్‌కు ఇచ్చిన సమయం కేవలం మూడు గంటలా అని ప్రశ్నించారు. ఇక నలుగురు సభ్యులు ఉన్న బీజేఎల్పీ నేతకు ఎంత సమయం ఇచ్చారో... 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్‌కు అంతే సమయం ఇచ్చారని అన్నారు. ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలో శుక్రవారం జరిగిన ప్రమాద ఘటనపై చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జవాబు ఇస్తూ జగన్ చదువు గురించి ప్రస్తావిచండంతో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
‘అధికార పక్షానికి జగనే ఓ సమస్య’
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్షం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసిందని, సభ జరిగిన తీరు పూర్తి అప్రజాస్వామికంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఆయన తన ఛాంబర్లో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ జరిగిన తీరు, ప్రజా సమస్యల పట్ల అధికారపక్షం వ్యవహరించిన వైఖరిని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున తాము లేవనెత్తిన ఏ అంశంపైనా విచారణకు ప్రభుత్వం సిద్ధపడక పోగా తప్పించుకుని పోయేందుకు, అసలు విషయాన్ని దారి మళ్లించేందుకే ప్రయత్నించిందని ఆయన అభ్యంతరం తెలిపారు. సమావేశాలను జగన్ సమీక్షిస్తూ..... ‘సభ జరిగిన తీరుపై నేను చెప్పడం కన్నా... అది ఎంత అప్రజాస్వామికంగా జరిగిందో అనడానికి మీరే (మీడియా) మొట్టమొదటి సాక్షులు. సభ చాలా దారుణంగా జరిగింది. చిట్ట చివరి రోజు కూడా మేం లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. నన్ను తిడితే స్పీకర్‌కు, ముఖ్యమంత్రికీ ఆనందమా!? ఈ సభలో వాళ్లు (అధికారపక్షం) నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టొచ్చు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తూ చాలా బాగా ఆనందిస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు టీడీపీ నుంచి అందరూ నన్ను తిట్టే వాళ్లే.... నేను మైక్ తీసుకుని రెండు మాటలు మాట్లాడేటప్పటికి పదే పదే కట్ చేసేస్తున్నారు. నేను మాట్లాడుతున్నపుడు ముఖ్యమంత్రి మూడు సార్లు, మంత్రులు అచ్చెన్నాయుడు నాలుగైదు సార్లు, అయ్యన్నపాత్రుడు రెండు సార్లు జోక్యం చేసుకుని అడ్డు తగులుతూ మాట్లాడారు. మొత్తం పదిహేనుసార్లు ఇలా మాట మాటకూ అడ్డొచ్చారు. నాపై వారు చేసినవన్నీ వ్యక్తిగత ఆరోపణలే... అన్నీ అబద్ధాలతో కూడుకున్నవే! నాపై వాళ్లు (అధికారపక్షం) చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. వాటిని నిరూపించక పోతే పదవులకు రాజీనామా చేస్తారా? అని నేను విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించే ధైర్యం వాళ్లకు లేదు. ఏ చర్చ చూసినా పక్కదోవ పట్టించడమే! అసెంబ్లీలో మేము ఏ అంశాన్ని లేవనెత్తినా దానిపై చర్చను అధికారపక్షం పక్కదోవ పట్టిస్తోంది. అక్వా పార్కు కాలుష్యం వల్ల చనిపోయిన బాధితుల సమస్యపై ఇవాళ చర్చ ఎలా జరిగిందో చూశారు కదా ! అక్వా పార్కు ఇబ్బందులు, నష్టాలను సభలో మేం చెప్పాం. దానిని అక్కడి నుంచి తరలించి సముద్ర తీరం దగ్గరికి తీసుకు వెళ్లండి అని మేం విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. ఇదొక్కటే కాదు, అధికారులపై టీడీపీ నేతలు గతంలో దాడి చేసిన ఉదంతం, దాని కన్నా ముందు అగ్రిగోల్డ్ కుంభకోణం, పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారం ఇలా... ఏ అంశంపై చూసినా ప్రభుత్వ వైఖరి ఒకే విధంగా కనిపిస్తోంది. తప్పించుకోవడం.... అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం... ఏ అంశంపై కూడా సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడలేదు. అగ్రిగోల్డ్ విషయంలో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని కోరాం, కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అగ్రిగోల్డ్‌కు చెందిన బయట ఉన్న ఇంకా కొన్ని ఆస్తులను కూడా వేలం పరిధిలోకి తీసుకు రావాలని కోరితే ప్రభుత్వం దాన్నీ ఒప్పుకోలేదు. అసలు ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలను వినాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోతుంది. అధికారపక్షానికి జగనే ఒక సమస్య ప్రతిపక్షంగా మాకేమో ప్రజా సమస్యలే మాకు సమస్యలు... కానీ అధికారపక్షానికి జగనే ఒక సమస్య, అన్నట్లుగా వ్యవహరించారు. మేం ప్రజా సమస్యలపై మాట్లాడితే వారు (టీడీపీ) మాత్రం జగనే మా సమస్య అని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తీర్మానం చేయించేందుకు మేం పడ్డ ఆరాటం, తపనను చంద్రబాబునాయుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకిని అని చంద్రబాబు ఈ సమావేశాల్లో స్పష్టంగా బయట పడ్డారు. మా పార్టీ నుంచి ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చంద్రబాబు కండువాలు కప్పి తీసుకెళ్లారు. స్పీకర్ సమక్షంలోనే సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరినీ టీడీపీ బెంచీల వైపు కూర్చోబెట్టి సభను నడిపిన తీరు ఈ సమావేశాల్లో చూశాం. ఇంత దారుణంగా ప్రజా స్వామ్య విలువలను ఖూనీ చేశారు. ఆ దేవుడు, ప్రజలు చూసుకుంటారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కనుక చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పైన దేవుడున్నాడు...అంతిమంగా గుణపాఠం నేర్పడానికి ప్రజలున్నారు. వారే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం వరుసగా అన్యాయాలు చేసుకుంటూ పోతూంటే మేం ఏం చేయగలం. వ్యవసాయ రుణ విముక్తిపై అబద్ధాలు, మోసాలు వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక పూర్తి వివరాల్లోకి నేనింకా వెళ్లలేదు. వ్యవసాయ రుణాల విముక్తి అంశం చాలా ముఖ్యమైంది కనుక చూశాను (కాగ్ నివేదిక చూపుతూ....) 2015–16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణ విముక్తికి రూ 4300 కోట్లు కేటాయించింది. అందులో రూ 743 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన రూ 3557 కోట్ల మొత్తాన్ని ఇతర పద్దులకు రీ అప్రాప్రియేషన్ చేశారు. ఇక ఉద్యానవన పంటల రుణ విముక్తి కోసం 2015–16లో నిధులేమీ కేటాయించలేదు. రూ 743 కోట్ల మొత్తంలో కూడా రూ 375 కోట్ల నిధులను సంవత్సరం చివర్లో రైతు సాధికార సంస్థ పీడీ ఖాతాకు సర్దుబాటు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ నిధులు రైతులు, మహిళాస్వయంసహాయక బృందాలు, చేనేత మరమగ్గాలు, నేత కార్మికులకు ఇచ్చిన రుణాల విముక్తికి ఉద్దేశించినవి కాబట్టి , కార్య నిర్వాహక శాఖలు వీటిని అనుకున్న వ్యవధిలో కేటాయించిన ప్రయోజనం కోసం ఖర్చు చేయలేక సంవత్సరం చివర్లో నిధులను బ్యాంకుల్లో జమ చేశాయి అని కాగ్ పేర్కొంది. అంటే 2015–16లో రూ 4300 కోట్లు రుణ విముక్తికి కేటాయిస్తే అందులో రూ 743 కోట్లు మాత్రమే వ్యవసాయ రుణ విముక్తి పథకం కోసం ఖర్చు చేసినట్లు మిగతా రూ 3557 కోట్లను ఇతర పద్దులకు రీ అప్రాప్రియేషన్ చేసినట్లు కాగ్ నివేదిక చూపుతూ... ఇంత దారుణంగా అబద్ధాలాడుతూ మోసాలు చేస్తున్నారు. పట్టిసీమలో అవినీతి పట్టిసీమ ప్రాజెక్టు ఒక అవసరం లేని ప్రాజెక్టు అని కాగ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ 350 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా , ఒక ప్రతికూలమైన ప్రాజెక్టుగా వ్యాఖ్యానించింది. జగన్‌తో పాటుగా ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, గిడ్డి ఈశ్వరి, వంతెల రాజేశ్వరి, పి.అనిల్‌కుమార్ యాదవ్, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జంకె వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
‘టీడీపీ గొంతు శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే’
-
చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు
-
అక్కడ పదిరెట్ల కాలుష్యం ఎక్కువ
మొగల్తూరు ఘటనలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయని, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తుందుర్రులో తలపెడుతున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు మొగల్తూరు ఫ్యాక్టరీ కంటే పదిరెట్లు ఎక్కువ సామర్థ్యం ఉందని, అక్కడి నుంచి పది రెట్లు ఎక్కువ కాలుష్యం వస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు జరిగిన చర్చలో ఆయన వివరంగా మాట్లాడారు. మధ్యమధ్యలో మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా దానికి దీటుగా సమాధానం ఇస్తూనే ఆక్వా పరిశ్రమ వల్ల కలుగుతున్న నష్టాలను ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే.. మొగల్తూరు ఘటన మీద మంత్రి ప్రకటన చేశారు.. ఈ ప్రకటనలోని కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నాను ట్రీట్మెంట్ ప్లాంటు ఉంటే, అన్నిరోజుల పాటు వ్యర్థాలను ఎందుకు నిల్వ చేశారు? ట్రీట్మెంట్ ప్లాంటు ఉండి, దాన్ని ఉపయోగించే ఆలోచనే వాళ్లకు ఉంటే గొంతేరు డ్రెయిన్‌కు పైపులు ఎందుకు వేశారు? ఆ పైప్లైన్లు తీసేయమని కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది 2014లోనే పరిశ్రమ పెట్టినప్పుడు 2016లో పీసీబీ అక్కడకు వెళ్లి పైపులైన్లు తీసేయమని చెప్పింది.. అంటే రెండేళ్ల పాటు డ్రెయిన్‌లోకి వ్యర్థాలు పంపించినట్లే కదా? రెండేళ్లుగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రెయిన్‌కు పైపుల ద్వారా కాలుష్యాన్ని నింపేయడం వల్లే పీసీబీ వాటిని తీసేయమందని మీరే చెప్పారు ఆనంద్ ఫుడ్స్ యాజమాన్యానికే తుందుర్రులో అనుమతి ఇచ్చారు. ఇక్కడిది మొగల్తూరు కన్నా పది రెట్ల సామర్థ్యం ఎక్కువ అంటే కాలుష్యం కూడా పదిరెట్లు ఎక్కువగా వస్తుంది ఈ రెండేళ్లుగా ప్రజలు ఇవన్నీ చూసే తమకు ఈ పరిశ్రమ వద్దని ఆందోళన చేస్తున్నారు గతంలో దీన్ని జీరో పొల్యూషన్ అన్నారు, దానికి సంబంధించి చంద్రబాబు ఏకంగా ప్రెస్‌లో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు మీరు ఈవాళ ఇచ్చిన ప్రకటనలో మాత్రం ఈ ఘటన జరిగిన తర్వాత ప్లేటు మార్చి ఇది ఆరంజ్ కేటగిరీలోకి వస్తుందన్నారు కాలుష్యానికి సంబంధించి రెడ్, ఆరంజ్, గ్రీన్, వైట్ అని నాలుగు విభాగాలు ఉంటాయి మొన్నటివరకు జీరో పొల్యూషన్ అని, ఇప్పుడు ఆరంజ్ కేటగిరీ అంటున్నారంటే మీ స్టాండ్‌లో తేడా కనిపిస్తోంది యాజమాన్యం నిర్లక్ష్యం గురించి ప్రకటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు (ఈ సమయంలో అచ్చెన్నాయుడు కలగజేసుకుని ప్రసంగానికి ఆటంకం కలిగించారు. పరిశ్రమలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటుకు బదులు ఆయన కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంటు అని చెప్పారు) ఇక్కడ ఏం సూచనలిచ్చినా నిర్మాణాత్మకంగా ఉండాలని చెబుతాం తప్ప ఆటంకం కలిగించాలన్న ఉద్దేశం లేదు మంత్రిగారిని ముందు ఇంగ్లీషు సరిచేసుకోమని చెప్పండి.. అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంటు కాదు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఈ సందర్భంలోనే మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ లేచి వైఎస్ జగన్ మీద, ఆయన విద్యార్హతల మీద వ్యక్తిగత విమర్శలు చేశారు) ఈ అంశంపై మెజిస్టీరియల్.. అంటే ఆర్డీవోతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, దాన్నిబట్టే వీళ్లకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది పరిశ్రమలు రాకూడదని ఎవరికీ లేదు.. యాజమాన్యంతో కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవు పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలి. వీటిని సముద్రతీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఈవాళ వాళ్లు గొంతేరు డ్రెయిన్ పక్కన పెట్టారు అక్కడ పది వేల మంది ప్రజలు నివాసం ఉంటారు అక్కడకు క్లీనింగ్ చేయడానికి వెళ్లిన ఐదుగురు కార్మికులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చనిపోయారు అలాంటిది పదివేల మంది ఉండేచోట ఇలాంటి ప్రాజెక్టే పెడతామంటున్నారు పొరపాటు ఏమైనా జరిగితే ఎన్నివేల మంది చనిపోతారో ఆలోచించాలని చెబుతున్నా ఇది ప్రైవేటు కంపెనీ.. దీనికి పైప్ లైను ఎవరు వేస్తారు? అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది.. దానికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు ప్రభుత్వమే డబ్బు పెట్టేటట్లయితే కంపెనీ మీద ఎందుకంత ప్రేమ వాళ్లే పైపులైను వేసేటట్లయితే దానికి కనీసం 40 కోట్ల ఖర్చవుతుంది గ్రామాలలో ఎవరూ భూములు ఇవ్వరు. ఆ పైపులైన్లు ఊళ్ల మధ్య నుంచి పోతాయి.. ఎక్కడైనా లీకైతే పరిస్థితి ఏంటని భూములు ఇవ్వరు పైపులైన్ల లెవెల్స్ ఎలా ఉన్నాయని చూస్తే.. ఈమధ్యే నాగార్జున వర్సిటీ బృందం అక్కడ పరిశీలనకు వెళ్లింది తుందుర్రు, బేతపూడి గ్రామాలు సముద్ర మట్టం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయని వాళ్లు చెప్పారు ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలున్నాయి, రెండువైపులా ఊళ్లు, తర్వాత గొంతేరు డ్రెయిన్ ఉన్నాయి విషవాయువులు, ప్రమాదకరమైన గ్యాస్ అన్నీ ఆ పైపులైన్ నుంచే వెళ్తాయి.. అలాంటి పైపులు వేయడానికి ఎవరైనా ఎందుకు ఒప్పుకొంటారు దాని బదులు ఇదే ఫ్యాక్టరీని తీరప్రాంతంలోకి తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఐదుగురు మనుషులు చనిపోతే అదేశాఖకు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం అక్కడకు వెళ్లలేదు, ముఖ్యమంత్రి కూడా వెళ్లడానికి తీరిక లేదు అక్కడ ఐదుగురు చనిపోయినా, బస్సు ప్రమాదంలో పదిమంది మరణించినా ముఖ్యమంత్రికి కనిపించదు.. కనీసం మానవత్వం అనేది చూపించాలి గొంతేరు డ్రెయిన్‌కు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది యనమదుర్రు డ్రెయిన్ పూర్తిగా కాలుష్యం అయిపోయి, అది తాగునీటికి, సాగునీటికి కూడా పనికిరాకుండా పోయింది గొంతేరు డ్రెయిన్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుందన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు ఇదే చంద్రబాబు ఆక్వా ఫుడ్ పార్కుకు మద్దతిస్తూ.. 37 మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టారు (ఈ సమయంలో మళ్లీ అధికార పక్షానికి మైకు ఇవ్వడంతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వెళ్లి మైకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు) -
చంద్రబాబు, పవన్‌కు ఆ ఆలోచనే లేదు
-
చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు
తాను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 5.45 లక్షల మెజారిటీ వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అంత మెజారిటీ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు. తన చదువు గురించి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని వైఎస్ జగన్ సవాలు చేశారు. ఇది తనకు, చంద్రబాబుకు సవాలని గట్టిగా చెప్పారు. తాను ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే మంత్రి మాత్రం తన విద్యార్హతల గురించి సంబంధం లేని విషయాలు మాట్లాడారన్నారు. తనతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఓ వ్యక్తి మాట్లాడారని అంటూ లేనిపోని ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడికి వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అలాగే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందున తన స్థాయి ఎక్కువంటూ అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలకు కూడా గట్టిగా జవాబు చెప్పారు. చట్టసభలు తనకు కొత్త కాదని, సభా సంప్రదాయాలు తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. తన స్థాయి అదని... మీ స్థాయి ఇదని గట్టి సమాధానం ఇచ్చారు. -
మొగల్తూరు ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ
అమరావతి: మొగల్తూరు ఆక్వాప్లాంట్‌లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై శుక్రవారం ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఆక్వాప్లాంట్ ఘటనపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ.. దానిపై చర్చకు గట్టిగా పట్టుబట్టింది. అయితే ఆ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. మొగల్తూరు ఆక్వా బాధితులను ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో అధికారపక్ష నేతలు వైఎస్ఆర్సీపీ సభ్యులపై దూషణలకు దిగారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను తొలుత 10 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనా కూడా మరోసారి వైఎస్ఆర్సీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టి, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆక్వాప్లాంటు ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, ఆ తర్వాత దానిపై చర్చిద్దామని మంత్రులు, స్పీకర్ తెలిపారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని కోరారు. అయితే, అత్యంత ముఖ్యమైన అంశం అయినందున ఆక్వా ప్లాంటు ఘటనపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు. విధిలేని పరిస్థితులలో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. -
లీకేజీపై దద్దరిల్లిన అసెంబ్లీ
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్షం సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. నినాదాలు, ప్లకార్డులు, అరుపులు, కేకలతో సభ అట్టుడికింది. ఓ దశలో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుటే కాకుండా పోడియంపైకి చేరుకుని నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పరం వాగ్వాదాలతో పాటు ఉభయ పక్షాలు సభ మధ్యలోకి దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. పేపర్ల లీకేజీపై గురువారం ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ చేసేది లేదని కాసేపు, చేస్తామని కాసేపు అధికారపక్షం కాసేపు దోబూచులాడింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటలోపే స్పీకర్ సభను నాలుగు సార్లు వాయిదా వేశారు. లీకేజీపై ప్రభుత్వం మంగళవారం ప్రకటించినట్టుగా గురువారం సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షం సభ్యులు పట్టుబట్టగా ఇప్పటికే సీఎం వివరణ ఇచ్చినందున తిరిగి ఇవ్వాల్సిన పని లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కొట్టిపడేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. -
సర్కారు సెల్ఫ్‌గోల్!
ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్రప్రభుత్వం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా? అప్పుడే కుంభకోణంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సీబీఐ విచారణ జరిపించే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? –ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవాల్ పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు వెల్లడైతే సాక్షిపై చర్యలు తీసుకుంటా. –ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీఐ విచారణ ఎందుకు? ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం. –మంత్రి గంటా శ్రీనివాసరావు సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రకరకాల వాదనలను ముందుకు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయింది. ఈ లీకేజీ వ్యవహారంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు నారాయణ విద్యాసంస్థల అధినేత మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణలిద్దరి హస్తం ఉన్నట్లు స్పష్టం కావడంతో అధికారపక్షం ఇరకాటంలో పడి విలవిల్లాడింది. జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామంటూ దబాయిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ విసిరిన సవాల్‌కు జవాబు చెప్పలేక ఆత్మరక్షణలో పడిపోయారు. లీకేజీకి కారకుడైన వాటర్‌బాయ్ నారాయణ స్కూల్లో ఉద్యోగి కాదా అని జగన్ ప్రశ్నించడంతో అప్పటివరకు గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి సైలెంట్ అయిపోయారు. సహచర మంత్రిని రక్షించుకునేందుకు అసెంబ్లీ సాక్షిగా బాబు తాపత్రయపడడం స్పష్టంగా బయటపడింది. తగినంత సమయం మైక్ ఇవ్వకపోయినా రాష్ట్రప్రభుత్వ దివాలాకోరుతనాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షం సఫలమయ్యింది. కన్నంలో చిక్కిన దొంగలా పరిస్థితి మారడంతో ముఖ్యమంత్రి, మంత్రులు జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శించారు. జగన్ మాట్లాడుతుండగా పదేపదే మైక్ కట్ చేసి మంత్రులకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే దక్కిన కొద్ది సమయంలోనే ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడంలో ప్రతిపక్షనేత విజయంసాధించారు. అధికారపక్షం... పలాయనమంత్రం ప్రశ్నాపత్రాల లీకేజీలపై సభలో గురువారం కూడా అదే గందరగోళం.. అదే దొంగాట.. లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా అధికారపక్షం మరోసారి పలాయనమంత్రం పఠించింది. ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, మంత్రులు సమస్యను తప్పుదోవ పట్టించడం కోసం జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణకు సహకరించాలని కోరుతూనే.. ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేసిందని అభాండాలు వేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’ మీడియాపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనితతో ఆరోపణలు చేయించి.. చర్చను పక్కదోవ పట్టించి గట్టెక్కేయత్నం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షం పట్టుబట్టింది. అధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఉదయం 9 గంటల నుంచి నాలుగుసార్లు వాయిదా వేసిన అనంతరం.. మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది. మాల్‌ప్రాక్టీస్‌గా చిత్రీకరించే యత్నం... మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమయ్యాక మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటన చేస్తారని చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నా మంత్రి జాడ కానరాలేదు. మంత్రి ఎక్కడున్నారంటూ ప్రతిపక్షం నినాదాలు చేయడంతో స్పీకర్ తన స్థానం నుంచి దిగి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. మంత్రి గంటాను సభలోకి రప్పించి ప్రకటన చేయించారు. లీకేజీపై మంత్రి చేసిన ప్రకటనలో ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పాటు ఆరున్నర లక్షలమంది విద్యార్ధులకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని చాలా చిన్నదిగా.. మాల్‌ప్రాక్టీస్ గా చూపే ప్రయత్నం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని.. పోలీసు కేసు నమోదు చేయించామని చెప్పారు. గంటా ప్రకటన అనంతరం జగన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సర్కార్‌ను ఏకిపారేశారు. ఆధారాలు చూపిస్తూ.. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ.. జవాబులను విద్యార్థులకు చేరవేస్తూ.. ఆ స్కూళ్ల విద్యార్థులే ర్యాంకులు సాధించేలా చేస్తోన్న తీరును ఎండగట్టారు. నెల్లూరులో కేసు నమోదు చేయించడంలో జాప్యాన్ని.. అనంతపురం జిల్లా మడకశిరలో పేపర్ లీక్ చేసిన నారాయణ సంస్థల ఉద్యోగిని పోలీసులు వదిలేసిన తీరుపై సర్కార్‌ను నిలదీశారు. నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ, మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇద్దరూ వియ్యంకులు కావడం వల్లే ఈ కుంభకోణం సాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత ఆధారాలను చూపుతూ ప్రశ్నాస్త్రాలను సంధించడంతో అధికారపక్షం ఆత్మరక్షణలో పడింది. జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, నారాయణ, యనమల, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, టీడీపీ ఎమ్మెల్యే అనిత, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అడుగడుగునా అడ్డుతగిలారు. ఇరుకునపడ్డ ప్రభుత్వం... ప్రతిపక్ష నేత సాక్ష్యాధారాలు చూపుతూ లోటుపాట్లను ఎత్తిచూపడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాబు ఎదురుదాడికి దిగారు. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడమే కాక సాక్షి స్టింగ్ ఆపరేషన్ చేసిందని ఆరోపించారు. లీకేజీలపై విచారణలో తప్పులున్నట్లు తేలితే ఎవర్నీ వదిలిపెట్టనని.. తాను చండశాసనుణ్ని అంటూ విచారణకు సహకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. కావాలంటే జ్యుడిషియల్ విచారణ కూడా వేస్తానన్నారు. ఇదే సమయంలో సమయం లేదు ప్రతిపక్షమా.. మీకున్నది రెండే ఆప్షన్లు సహకరిస్తారా పారిపోతారా అంటూ వ్యంగ్యంగా అన్నారు. కానీ.. జగన్ ఏమాత్రం సంయమనం కోల్పో కుండా బాబు ఎత్తులను తిప్పికొట్టారు. ‘నేను నీలా వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడలేను’ అంటూ చురకలు వేస్తూనే.. చిత్తశుద్ధి ఉంటే మంత్రులను బర్త్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు సిద్ధమా? మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. విచారణకు సాక్షి సహకరిస్తుంది’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో విపక్ష సభ్యులు స్పందిస్తూ.. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా.. మరణమా..’ అంటూ అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌తో ఆత్మరక్షణలో పడిన అధికారపక్షం.. అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే అనితతో చర్చతో సంబంధం లేని అంశాన్ని ప్రస్తావింపజేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందిస్తూ.. ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తామన్నారు. అదే క్రమంలో లీకేజీలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా అధికారపక్షం జ్యుడీషి యల్ విచారణ చేయిస్తామన్నదంటూ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
సభాహక్కుల కమిటీకి ‘స్పీకరు ప్రెస్‌మీట్’
అమరావతి: జాతీయ మహిళా సదస్సుపై స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రెస్‌మీట్‌ను వక్రీకరించిన మీడియాపై చర్యలకు సిఫార్సు కోసం ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి పంపుతామని సభాపతి ప్రకటించారు. పవిత్రసంగమంలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు ఏర్పాట్లపై ప్రెస్మీట్లో స్పీకరు అనని మాటలను అన్నట్లుగా ‘సాక్షి’ మీడియా దుష్ప్రచారం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే అనిత గురువారం అసెంబ్లీలో ఆరోపించారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజిలో ప్రధాన భూమిక పోషించిన మంత్రి నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విపక్షం చేసిన డిమాండుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అనిత పాత విషయాన్ని సభలో తెరపైకి తెచ్చారు. ఏది పడితే అది రాయడం ద్వారా సాక్షి గతంలో తనను కూడా అవమానించిందని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా సభాధ్యక్షుడిని కూడా అవమానించిన విషయాన్ని సభ్యులందరికీ చూపించేందుకు సభలో వీడియో ప్రదర్శించగా దానికి చూడకుండా ప్రతిపక్షం పారిపోయిందని ఆమె విమర్శించారు. అందువల్ల ఈ విషయంపై సిఫార్సు చేసేందుకు వీలుగా ఈ అంశాన్ని çసభాహక్కుల కమిటీకి సిఫార్సు చేయాలని ఆమె స్పీకరుకు నోటీసు ఇచ్చినట్లు సభలో ప్రకటించారు. అనిత ఇచ్చిన నోటీసు అందిందని, దీనిని సభా హక్కుల కమిటీకి పంపుతామని స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. -
‘దొంగలా వచ్చి చంద్రబాబు సభలో ప్రకటన’
-
‘దొంగలా వచ్చి చంద్రబాబు సభలో ప్రకటన’
అమరావతి : పదో తరగత ప్రశ్నపత్రాల లీకేజిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ చేత విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 6.50 లక్షల విద్యార్ధుల భవిష్యత్‌కు సంబంధించిన ఈ లీకేజిపై చర్చ జరపడానికి అవకాశం ఇవ్వడం లేదని, మంగళవారం దీనిపై సభలో పట్టుబడితే గురువారం ప్రకటన చేస్తామని చెప్పి విపక్షం లేని సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దొంగలా వచ్చి దీనిపై ప్రకటన చేయడంతోపాటు విలువైన బిల్లులను కూడా పాస్ చేయించుకున్నారని తెలిపారు. ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రకంగానూ, మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఆ వార్త ఒక్క సాక్షి పత్రికలోనే ప్రచురితం కావడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షి దినపత్రికలే కారణమంటూ ఆరోపణలు చేయడం టీడీపీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం బినామీగా మంత్రి నారాయణ వ్యవహరిస్తుండటంతో ఆయనేం అక్రమాలకు పాల్పడినా చర్యలు ఉండటం లేవని ఆరోపించారు. -
'విచారణకు ఆదేశించి గౌరవాన్ని కాపాడుకోండి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థ అంతా సీఎం చంద్రబాబు బినామీల చేతుల్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. తన బినామీలను కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెన్త్ పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. టెన్త్ పశ్నాపత్రాలు లీకయినట్టు 'సాక్షి'లోనే కాదు అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షానికి శాసనసభలో మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే 2 నిమిషాల్లోనే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేకపోయినా అధికార పార్టీ సభ్యులకు పదేపదే మైక్ ఇస్తున్నారని వాపోయారు. -
వాళ్లు మంత్రులు కాదు, వ్యాపారులు
-
వాళ్లు మంత్రులు కాదు, వ్యాపారులు: రాచమల్లు
అమరావతి: కార్పొరేట్ సంస్థల నిర్వాహకులను మంత్రులుగా నియమిస్తే పాలన కూడా వ్యాపార పరంగానే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ గెలుపుకు రూ.700 కోట్లు వరకు ఖర్చు చేశారని, అప్పుడు చేసిన ఖర్చును రెండింతలు సంపాదించేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదో తరగతి పరీక్షా పత్రాలు మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్ధలో లీక్ అయితే, దానిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా విద్యార్ధుల భవిష్యత్‌ను టీడీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తూ ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై విచారణ చేస్తుండగానే ఇతర పేపర్లు కూడా లీకు అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రాచమల్లు ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు గంటా, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 6.50 లక్షల విద్యార్ధుల సమస్యలపై సభలో చర్చించేందుకు ప్రయత్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోందని ఆరోపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
దమ్ముంటే మా సవాల్ స్వీకరించండి
-
'విచారణకు ఆదేశించి గౌరవాన్ని కాపాడుకోండి'
-
దమ్ముంటే మా సవాల్ స్వీకరించండి: వైఎస్ జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటకు వస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా వాదించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్‌కు కారకులైన వారి విషయం ప్రస్తావించకుండా...లీక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాక్షి విలేకరి గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సాక్షి తరఫున తమ పూర్తి సహకారం ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలు సీబీఐకి అందిస్తామని తెలిపారు. పేపర్ లీక్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. జంబ్లింగ్ విధానంపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. తామే జంబ్లింగ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని సీఎం చెబుతున్నారని, 1978 నుంచే జంబ్లింగ్ విధానం అమల్లో ఉందన్నారు. నెల్లూరులో ఈ నెల 25న పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయితే... ప్రభుత్వం తీరిగ్గా 28న ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు. అదేవిధంగా కదిరిలోనూ హిందీ పేపర్ లీక్ అయ్యిందని, నారాయణ విద్యాసంస్థల సిబ్బందే స్వయంగా విద్యార్థులకు స్లిప్‌లు అందిస్తూ దొరికిపోయారన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. దీనిపై ఏం చర్య తీసుకుంటారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. -
వైఎస్ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలు
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగింది. సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రం లీకేజీపై సమాచారం ఇచ్చిన సాక్షి మీడియాపై ఆయన ఈ సందర్భంగా అక్కసు వెళ్లగక్కారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై చంద్రబాబు గురువారం సభలో మాట్లాడుతూ ఎక్కడ తప్పు జరిగినా క్షమించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నారాయణ, శ్రీచైతన్య సంస్థలు అంతా తమకు సమానమే అని చెప్పుకొచ్చారు. ఎవర్నీ కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ఘటనపై ఒకర్ని సస్పెండ్ చేసి, ఏడుగురిని రిలీవ్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ కాదని మాల్ ప్రాక్టిస్ మాత్రమే అని చంద్రబాబు మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. -
పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్
-
పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్
పదో తరగతి పరీక్ష ప్రారంభం కావడానికి 5 నిమిషాల ముందే ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చిందని, అయినా సంబంధిత మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఆ స్కూలును ఎందుకు బ్లాక్ లిస్టులో చేర్చలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సాక్షి ప్రతినిధి బాధ్యతాయుతమైన పౌరుడిగా తనకు వచ్చిన పేపర్‌ను నేరుగా డీఈవోకు పంపారని, విజిల్ బ్లోయర్‌గా వ్యవహరించిన అతడిని ప్రశంసించాల్సింది పోయి అతడి మీద చర్యలు తీసుకోవాలన్నట్లుగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. నెల్లూరులోని నారాయణ హైస్కూల్లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజి వ్యవహారంపై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో ఆయన పాల్గొని ప్రభుత్వం తీరును కడిగి పారేశారు. ఆయన ప్రసంగానికి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు పదే పదే అడ్డు తగులుతూ తాము అంతకుముందు చెప్పిన విషయాలనే పదే పదే చెబుతూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగం పూర్తి కాకముందే ముఖ్యమంత్రి కూడా దానిపై మాట్లాడటం గమనార్హం. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వైఎస్ జగన్ ఏమన్నారంటే... ముఖ్యమంత్రి ప్రకటన అయితేనేం, మంత్రి ప్రకటన అయితేనేం వీళ్ల మాటలు ఏవి చూసినా అవాస్తవాలే. ఉదయం 9.30కి పరీక్ష మొదలైంది. 9.25 నిమిషాలకే నారాయణ స్కూలుకు సంబంధించిన ఒక ఉద్యోగి ఆ పేపర్‌ను వాట్సప్‌లో ఫొటోలు తీసి బయటకు పంపారు. పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్నవాళ్లు ఎవరికైనా సెల్ ఫోన్లు అనుమతించరు అయినా కూడా పరీక్ష ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే అదే నారాయణ స్కూలు ఉద్యోగి పేపర్‌ను బయటకు పంపారు. నారాయణ ఉద్యోగులు వాటికి ఆన్సర్లు తయారు చేసుకుని, తమ విద్యార్థులకు జవాబులు చేర వేసి పరీక్షలు రాయిస్తుంటే దానివల్ల నారాయణ స్కూళ్లకు ర్యాంకులు వస్తుంటే, ఇది మీకు అన్యాయంగా, మోసంగా కనిపించడం లేదా మరొక్క విషయం.. వీళ్లు చెబుతున్నట్లు బయటకు వచ్చాయని చెబుతున్న వాటిని వీళ్లు అసలు ఒప్పుకోలేదు అసెంబ్లీలో మేం ప్రస్తావించి, విషయాన్ని పెద్దది చేసి, రిపోర్టు చూపించిన తర్వాత మాత్రమే వాళ్లు ఒప్పుకొన్నారు (మధ్యలోనే గంటా శ్రీనివాసరావు కలగజేసుకుని, జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అంతకుముందు చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ ఆయన ప్రస్తావించారు) డైలీ స్టేటస్ రిపోర్టులో పరీక్షల డైరెక్టర్ స్పష్టంగా రాశారు. వాట్సప్‌లో పేపర్ బయటకు వచ్చిందని ఆయన పేర్కొన్నప్పుడు పరీక్షను ఎందుకు రద్దు చేయలేదు? మెసేజ్ పంపించిన వ్యక్తి నారాయణ యాజమాన్యానికి సంబంధించిన వాడు పరీక్ష మొదలుకావడానికి ముందుగానే దాన్ని ఫొటో తీసి వాట్సప్‌లో పంపుతుంటే, నారాయణ స్కూలు యాజమాన్యాన్ని ఎందుకు బ్లాక్ లిస్టు చేయలేదు, ఆ కేంద్రాన్ని ఎందుకు రద్దు చేయలేదని అడుగుతున్నాం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.. డీఈఓ 26న ఫిర్యాదుచేస్తే, 28న ఎఫ్ఐఆర్ దాఖలైంది సాక్షాత్తు నారాయణ యాజమాన్యం మన మంత్రి గారిది, ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి.. అవునా, కాదా? 9.30కు పరీక్ష మొదలవుతుంటే, 9.25 గంటలకు పంపింది ఎవరు.. నారాయణ స్కూలు ఉద్యోగి అవునా, కాదా ఆయన ఫోన్ నెంబరు ద్వారా ఎవరెవరికి పంపారన్న విషయమై సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలూ బయటకు వస్తాయి నారాయణ సిబ్బంది ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా తయారుచేసి అందరికీ పంపారో తెలుస్తుంది ఈ విషయం పెద్దదైన తర్వాత, అసెంబ్లీలో నివేదికను చూపించిన తర్వాత అప్పుడు జరిగిన విషయాన్ని అంగీకరించారు 9.25 గంటలకు పేపర్ బయటకు వెళ్తే, 10.30 గంటలకు సాక్షి రిపోర్టర్ డీఈవోకు వాట్సప్‌లో పంపారని ఇదే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు సాక్షి రిపోర్టర్ విజిల్ బ్లోయర్‌గా డీఈఓకు సమాచారం ఇచ్చి, చర్యలు తీసుకోవాలని చెప్పినందుకు అతడే తప్పు చేసినట్లు అభాండాలు వేస్తున్నారు అతడి మీద చర్యలు తీసుకోవాలంటున్నారు అటెండర్లు, చిన్న చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం ఏంటి.. మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారు? మీకు ప్రయోజనాలు ఏమీ లేకపోతే వాళ్లను మంత్రి పదవుల్లో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇది జరిగింది కేవలం నెల్లూరు ఒక్కచోట మాత్రమే కాదు.. తొలి రోజు కూడా తెలుగు పేపర్ 1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిరలో వాట్సప్ ద్వారా బయటకు వచ్చింది హిందూపురం నారాయణ పాఠశాల ఉద్యోగి ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టేశారు కష్టపడి చదివేవాళ్లు ర్యాంకులు రావాలని ఆరాటపడతారు. కానీ నారాయణ స్కూళ్లకు లక్షలు లక్షలు ఫీజులు కడితేనే ర్యాంకులు వస్తాయని దగ్గరుండి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తోంది లీకైందని ప్రభుత్వం ఒప్పుకొన్నప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరిమీద? అటెండర్లు, చిన్న వాళ్ల మీద కాదు.. మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు (ఈ సమయంలో మంత్రి గంటా జోక్యం చేసుకుని, పేపర్ లీక్ కాలేదని చెప్పారు) గతంలో ఇలాంటి ఘటన చూస్తే ముద్దు కృష్ణమనాయుడు రాజీనామా చేశారు. వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు ఇప్పుడు వాట్సప్ ద్వారా ఏకంగా పరీక్షకు ముందు ఫొటో తీసి వాళ్ల వాళ్ల సిబ్బందికి పంపి, వాట్సప్ ద్వారా రొటేట్ చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ల పిల్లలకు మాత్రమే పంపుతున్నారు ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే సీబీఐ చేత విచారణ చేయించకపోవడం, దాన్ని డిఫెండ్ చేసుకుంటూ చిన్న ఘటన అన్నట్లుగా కొట్టేస్తున్న పరిస్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఈ మొత్తం వ్యవహారంలో అడ్డగోలుగా దొరికిపోయినా ఏదేదో చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు మంత్రులను కాపాడుకోడానికి చంద్రబాబు నోట్లోంచి కూడా కొన్ని తప్పులు చెబుతున్నారు చంద్రబాబు అని ఓ సెల్ ఫోన్ నెంబరు చెప్పారు వాటర్ బోయ్ ఫోను నెంబరు చెప్పరు, సాక్షి రిపోర్టర్ 10.30కి డీఈఓకు చెబితే ఆ నెంబరు మాత్రమే చెబుతారు చంద్రబాబు ధనలక్ష్మీపురం నారాయణ హైస్కూలు అని ఒకచోట అంటారు, మరోచోట ఆ స్కూలు నారాయణదే కాదంటారు ఆ స్కూల్లో నారాయణకు చెందిన ప్యూన్లు, గీన్లు ఉండొచ్చని కూడా ఆయన అన్నారు -
.. నేనే రాజీనామా చేసేవాడ్ని: గంటా
అమరావతి: పదో తరగతి పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ వాట్సప్‌లో బయటకు వచ్చిందని, పరీక్ష ప్రారంభానికి ముందు పేపర్ లీకైనట్టయితే తానే రాజీనామా చేసేవాడినని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. వాట్సప్‌లో పేపర్ రాగానే ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశామని, వాటర్ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గంటా చెప్పారు. 6.80 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని మంత్రి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినకుండా పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. వాట్సప్‌లో ఓ మెసేజి రావడం, దానిపై అధికారులు ఎలా స్పందించారో, ఏం చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరంగా చెప్పారని తెలిపారు. పరీక్ష విధానం చాలా పెద్దదని, పరీక్ష పత్రాల సెట్టింగ్, ముద్రణ, కేంద్రాలకు చేర్చడం.. చాలా అంశాలున్నాయని చెప్పారు. పేపర్ సెట్టింగ్, ప్రింటింగ్, రవాణా చేస్తున్న సమయంలో కానీ పరీక్ష రాయడానికి ముందు గానీ పేపర్ లీకైతే సీరియస్ విషయమని అన్నారు. అలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఎవరూ డిమాండ్ చేయకుండానే తాను రాజీనామా చేసి ఉండేవాడిని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ వాట్సప్‌లో బయటకు వచ్చిందని, సంఘటన చిన్నదైనా వివరంగా విచారణ చేయాలని, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని సీఎం తమకు చెప్పారని తెలిపారు. పోలీసుల కంటే ముందుగానే విద్యాశాఖ అధికారులు స్పందించి, ఎక్కడి నుంచి పేపర్ వచ్చిందో తెలుసుకుని చర్యలు తీసుకున్నారని చెప్పారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయని, ఈసారి చాలా తక్కువగా ఉన్నాయని గంటా తెలిపారు. -
మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
అమరావతి: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు. శుక్రవారం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సతీష్‌రెడ్డి పదవీకాలం పూర్తైంది. దీంతో నూతన డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతోంది. -
పదో తరగతి పేపర్ల లీకేజిపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
పదో తరగతి పేపర్ల లీకేజిపై దద్దరిల్లిన అసెంబ్లీ
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు గురువారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దానిపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండోరోజు కూడా ఇదే అంశంపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార పక్ష సభ్యులు మాత్రం యథావిధిగా ప్రతిపక్ష సభ్యులను నిందించడానికే తమ ప్రసంగాలను ఉపయోగించుకున్నారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
నీటి సమస్య పరిష్కరించండి
► అసెంబ్లీలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం : మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోని మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయని తెలిపారు. ఈ ప్రాంతంలో 1000 అడుగుల లోతున బోర్లు వేసినా నీరు పడే పరిస్థితి లేదన్నారు. మంచినీటి సమస్య జనవరి నుంచే ప్రారంభమైందని, నీటి రవాణా కూడా కష్టమై ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని పొదిలి, కొనకనమిట్ల మండలాల్లోని 32 ప్రాంతాల్లో రూ.95 కోట్లతో నీటి పథకం, అలాగే మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని 32 ప్రాంతాల్లో రూ.600 కోట్లతో పథకం, మార్కాపురం మండలం ఇడుపూరు, తర్లుపాడు మండలాల్లో సాగర్‌నీరు కవర్ కాని ప్రాంతాల్లో రూ.110 కోట్లతో నీటి ఎద్దడి నివారణ కోసం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. పథకాలు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖామంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడిని కోరారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల ద్వారా శాశ్వత పరిష్కారానికి మూడు ప్రాజెక్టులు రూపొందించామని, ఇటీవల కేంద్రం ప్రకటించిన పథకంలోగానీ, రాష్ట్ర నిధుల నుంచిగానీ మంజూరు చేయాలని కోరారు. అలాగే బొందలపాడు, తుమ్మలచెరువు రోడ్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గం ప్రాధాన్యత క్రమంలో ఉందని తెలిపారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అలానే అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేయటం మంచిది కాదని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసి రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేయటం సరికాదన్నారు. గతంలో కృష్ణాజిల్లా తహసీల్దార్ వనజాక్షిపై కూడా టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కేసులు నమోదు చేయకుండా రాజీ చేయటం వలన అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రజాసేవ చేస్తున్న అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు.