ఆంధ్రప్రదేశ్ విభజన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండుసార్లు లేఖలు ఇచ్చారని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. ఏపీ అసెంబ్లీ మండలిలో ఆయన మాట్లాడుతూ సీపీఎం మినహా అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరించాయని చెప్పారు. అంతా సమన్యాయం అన్నారే తప్ప ఏ ఒక్కరూ ఏపీకి ఏం కావాలనే విషయాన్ని అడగలేదని అన్నారు.