ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కంటతడి పెట్టారంటూ వస్తోన్న వార్తా కథనాలపై వైఎస్సార్‌సీపీ ఘాటుగా స్పందించింది. ‘ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు, టీడీపీ ఎమ్మెల్యేలకు.. నాడు అదే అసెంబ్లీలో ప్యాకేజీ నిర్ణయాన్ని (బల్లలు చరిచిమరీ) ఆహ్వానించిన సంగతి గుర్తులేదా’ అని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.