ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే అవకాశమేలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మట్టి నుంచి ఇసుకదాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆఖరికి బడిపిల్లల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆసాంతం నాకేశారని మండిపడ్డారు