curruption
-
‘అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి’: KTR
హైదరాబాద్, సాక్షి: అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్న(శుక్రవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘‘ఈరోజు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ. 1137 కోట్ల పనుల దక్కించుకున్న పత్రాలు ఇవిగో.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుంది.ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుంది.అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్ర లోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.SCAM Alert - AMRUT Tenders I wrote a letter to Union Ministers Shri Manohar Lal Khattar Ji (@mlkhattar) and Shri Tokhan Sahu Ji (@tokhansahu_bjp) regarding corruption in AMRUT tendersContracts were awarded to Chief Minister Revanth Reddy's Brother-in-law, Srujan Reddy’s… pic.twitter.com/pqgz7aLBGR— KTR (@KTRBRS) September 21, 2024చదవండి: కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ -
karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బి శివరాము సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వంలో 40 శాతం అవినీతి జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. తన సొంత జిల్లా హసన్‌లోనే ఈ అవినీతి.. బీజేపీ హాయాంలోని 40 శాతం కంటే అధికంగా పెరిగిపోందన్నారు. ఈ విషయాన్ని తాను నేరుగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతిపై పార్టీ కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. తాను అవినీతి విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్న అవినీతిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా.. ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై నిఘా ఉంచాలని అన్నారు. తాను సొంతపార్టీ నేతల అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చెడ్డవాడిగా ముద్రవేస్తారని తెలుసని అన్నారు. కానీ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్యే శివరాము.. అధికారంలో ఉన్న సొంత పార్టీపై అవినీతి ఆరోపణలు చేయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం గానీ.. సీఎం సిద్ధరామయ్య గాని ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ నిరసనలు -
రానున్న పూర్వవైభవం.. ఏసీబీ మళ్లీ దాడులకు సిద్ధం!
సాక్షి, ఆసిఫాబాద్: ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం.. సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం.. తదితర కారణాలతో ప్రభుత్వ శాఖల్లో పనులు నత్తనడకన జరగడంతో ఇటీవల అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జోరు తగ్గింది. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా లేకపోవడంతో కేసుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి.. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిపాలన మళ్లీ గాడిన పడింది. ఏసీబీ బాస్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. ఏసీబీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులతోపాటు సొంతంగా దాడులు చేసేందుకు అవకాశమున్న ‘ఆదాయానికి మించి ఆస్తులు’ కేసులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. ఎన్నికలతో విరామం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రెండు ఏసీబీ దాడులు జరిగాయి. రెబ్బెన మండల సర్వేయర్, చైన్‌మెన్ రూ.10 వేలు, రూ.20 వేల లంచం తీసుకొంటూ చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏసీబీ దాడులు నమోదు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంతో రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు తదితర కీలక శాఖల సిబ్బంది ఆ విధుల్లో మునిగిపోయారు. పింఛన్లు, భూముల పట్టాల మంజూరు, వివిధ రకాల అనుమతుల ప్రక్రియలు మందగించాయి. ప్రజలకు సంబంధించిన ప్రభు త్వ కార్యాలయాల్లో పనులన్నీ దాదాపు స్తంభించాయి. దీని వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయని ఏసీబీ సిబ్బంది చెబుతున్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఉద్యోగులపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ‘వారి’పై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం ఫిర్యాదులు(ట్రాప్)లతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు(డీఏ) కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో లెక్కకు మిక్కిలిగా సంపాదించుకుంటున్న సిబ్బంది, బినామీ పేర్లతో ఆస్తులు వెనకేసుకున్న ఉద్యోగులు, ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేసి, పాడి ఆవుల్లాంటి విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. అవినీతికి బానిసలైన అధికారుల అక్రమ ఆస్తులపై, బినామీలపై ఏసీబీ రహస్యంగా నిఘా వేయనున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్‌లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్‌పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్‌బుక్‌లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్‌డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్‌కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్‌ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్‌వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ ఉద్యోగి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నవళగుంద పంచాయతీ ఉద్యోగి తలాటి ప్రదీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాలు... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని ఓ బాధితుడు పరిహారం కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ ఉద్యోగి ప్రదీప్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగదు అందజేస్తున్న సమయంలో ఏసీబీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ రామచంద్రరావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ 2016లో రూ.9.5 లక్షల వ్యయంతో అన్నవరం రైల్వేస్టేషన్‌కు ఎదురుగా గల దేవస్థానం పొలంలో రేకుల షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా పొందాడు. పని పూర్తయ్యాక అతడికి కాంట్రాక్ట్ తాలుకు బిల్లులు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఈఎండీ మొత్తం రూ.40,646 దేవస్థానం వద్ద డిపాజిట్లో ఉంచారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ పూర్తయిన రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ నాలుగు నెలలుగా ఈఎండీ మొత్తాన్ని ఇవ్వమని ఇంజినీరింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 19న ఇదే పనిపై ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ చిక్కాల సాయిబాబాను కలిశాడు. రూ.ఐదు వేలు ఇస్తే తప్ప డిపాజిట్ రిఫండ్ ఇవ్వడం కుదరదని సాయిబాబా చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగినట్టుగా సాయిబాబా వాయిస్ రికార్డు కూడా కాంట్రాక్టర్ సమర్పించడంతో దానిని పరిశీలించి సాయిబాబాపై నిఘా ఉంచామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్ వరప్రసాద్ సాయిబాబాకు కెమికల్ పూసిన రూ.500 నోట్లు ఇవ్వగా, తాము దాడి చేసి పట్టుకున్నామన్నారు. లంచం స్వీకరించిన నిందితుడు సాయిబాబాను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తే సెల్:9440446160కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు తిలక్, మోహన్‌రావు, పుల్లారావు, ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు ఈ దాడి లో పాల్గొన్నారు. విసిగి ఫిర్యాదు చేశా: కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ నిరుద్యోగంతో వేగలేక చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న తనను అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు ఈఎండీ ఇవ్వకుండా వేధించారని కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ విలేకర్లకు తెలిపారు. తాను ఈఎండీ సొమ్ము ఇవ్వమని ఇంజినీరింగ్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు గుమస్తా కూడా ఈఎండీ ఇవ్వాలంటే కొంచం ఖర్చువుద్ది అని చెప్పాడని తెలిపారు. దాంతో మూడు నెలలు ఆగి మరలా వస్తే ఇప్పుడున్న గుమస్తా చిక్కాల సాయిబాబా కూడా రూ.ఐదు వేలు లంచం ఇవ్వనిదే పని జరగదని చెప్పాడని తెలిపారు. దాంతో ఏసీబీ ని ఆశ్రయించినట్టు తెలిపారు. దేవస్థానంలో కాంట్రాక్ట్ చేసినట్టుగా ‘ఎక్స్పీరియన్స్’ సర్టిఫికెట్ ఇవ్వమని 2018లో ఇంజినీరింగ్ అధికారులను, అప్పటి ఈఓను అడిగినా ఇవ్వలేదని తెలిపారు. అదే విధంగా ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన తన మోటార్ సైకిల్ చోరీ జరిగిందని దీనిపై దేవస్థానం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కాంట్రాక్టర్ వరప్రసాద్ వాపోయారు. దీంతో విసిగి వేసారి సిబ్బందిలో కొంతైనా మార్పు వస్తుందనే ఇలా చేశానని తెలిపారు. -
కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం
నరసరావుపేట రూరల్: ‘కోడెల ట్యాక్స్’ (కే టాక్స్)పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అవినీతి, అక్రమాలపై శాసనసభలో చర్చిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడెల కుటుంబం అవినీతిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన కుటుంబంపై కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే, కే టాక్స్ బాధితులందరూ తెలుగు దేశం పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. కళ్ల ముందు కనిపిస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడాన్ని మానుకోవాలని కోడెలకు హితవు పలికారు. కోడెల అక్రమాలన్నింటిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని ట్రాఫిక్ ఆంక్షలపై టీడీపీ నేతలు విమర్శించడం తగదని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే మార్పులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారన్నారు. -
పట్టుకుంటే చాలు అవినీతి షాక్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం విజయవాడ విద్యుత్ సౌధ కార్యాలయంలో భేటీ అయింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) మాజీ సీఎండీ పి.గోపాల్ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం రెండు గంటలపాటు సాగింది. 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం సూచించిన ప్రాజెక్టులను ఏ విధంగా పరిశీలించాలి? అవినీతి కోణాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమాచార సేకరణకు అవసరమైన ఏర్పాట్లు.. తదితర అంశాలపై సమావేశంలో చైర్మన్, సభ్యులు రామారావు (ట్రాన్స్‌కో గ్రిడ్ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్), ప్రొఫెసర్ ఉషా రామచంద్ర (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్), రాజ్‌గోపాల్ రెడ్డి (ఆర్థిక నిపుణులు, ఏపీఈఆర్ మాజీ సభ్యుడు), సీహెచ్‌వీఎస్ సుబ్బారావు (ట్రాన్స్‌కో ప్లానింగ్ సీజీఎం) సమగ్రంగా చర్చించారు. ఎవరికి ఎంత అందిందో ఆరా.. ట్రాన్స్‌కోలో అవసరం లేకున్నా కమీషన్ల కోసమే విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అప్పు చేసి మరీ అనుకూలమైన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం నిబంధనలను ఇష్టానుసారం మార్చారు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత సంపాదించేలా జాగ్రత్త పడటంలో అప్పటి అధికారులు అన్ని విధాల టీడీపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఏపీ జెన్కోలో రెండు థర్మల్ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టులను దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని సంస్థలకు కట్టబెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థలను దండుకునే కేంద్రాలుగా గత ప్రభుత్వం మార్చేసింది.డెప్యూటేషన్‌పై ట్రాన్స్‌కోకు వచ్చిన ఓ అధికారి అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్ శాఖలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల అవినీతి, బినామీ వ్యవహారాలపై కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. దీన్ని కూడా లోతుగా పరిశీలించే వీలుంది. అతి ముఖ్యమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, స్వల్పకాలిక, రోజువారీ విద్యుత్ కొనుగోళ్లలో ఎవరికి ఎన్ని ముడుపులు అందాయనేది ఆరా తీయబోతున్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏళ్ల తరబడి అదే విభాగంలో ఉన్న అధికారుల ఆస్తులపై కూడా వివరాలు అందినట్లు తెలిసింది. ప్రతి ప్రాజెక్టులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆధారాలతో వెలికితీయాలని కమిటీ నిర్ణయించింది. అవినీతిపైనే ప్రధాన దృష్టి.. గత ఐదేళ్లలో విద్యుత్ రంగం పూర్తిగా అవినీతి మయమైంది. ట్రాన్స్‌కో, జెన్కో ప్రాజెక్టుల విషయంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి భారీగా ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ అవినీతి వ్యవహారాలను ఐదేళ్లుగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తెచ్చింది. బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ట్రాన్స్‌కోలో కొంతమందికే అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించిన తీరును ఎప్పటికప్పుడు వెలికితీసింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయట పెద్దఎత్తున పోరాడారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. -
అక్రమాల్లో ఇంద్రుడు!
సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎప్పుడూ డబ్బుపైనే ధ్యాస.. పథకాల పేరుతో అందినకాడికి రైతుల నుంచి వసూళ్లు.. ప్రభుత్వం కేటాయించిన దాణా, ఇతర ఇన్పుట్స్ లబ్ధిదారులకు అందజేయకుండా మెక్కేయడం.. ఇదీ ఆత్మకూరు మండలంలోని ఓ పశువైద్యాధికారి వ్యవహార శైలి. సంబంధిత ఏడీ, డీడీలు ఈయన పనితీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ 50 శాతం సబ్సిడీపై పాడిగేదెలు, దాణా, దాణామృతం, సైలేజ్ గడ్డి వంటి వాటిని పంపిణీ చేస్తోంది. ఈ పథకాల అమలులో ఆ వైద్యుడు పాల్పడిన అక్రమాలపై రైతులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వీరపాండియన్ ఈనెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లారు. జిల్లాకు చెందిన వారితో పాటు ఆత్మకూరు మండల అధికారులందరూ కలెక్టర్ వెం ట ఉన్నా ఈ పశువైద్యాధికారి మాత్రం పత్తా లేరు. రైతులను హర్యానాలో వదిలి... 2018–19కి సంబంధించి పాడి గేదెలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈయన తన పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది రైతుల నుంచి పాడిగేదెల యూనిట్ల పంపిణీకి ఒక్కొక్కరి నుంచి రూ.15వేలు నాన్స్ సబ్సిడీ మొత్తం రూ.3.60 లక్షలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని డీడీ తీసి పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో అప్పగించాలి. పాడి గేదెలను హర్యానా, ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లోనే రైతుల సమక్షంలోనే కొనుగోలు చేయాలి. నాన్ సబ్సిడీ మొత్తానికి కార్యాలయంలో అప్పగించకుండా స్వాహా చేసి రైతులను హర్యానా రాష్ట్రానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జేడీ కార్యాలయం అధికారులు విషయం తెలుసుకొని డీడీ లేకపోవడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. డీడీ బీరువాలో పెట్టి మరిచి వచ్చానని.. వచ్చిన వెంటనే అప్పగిస్తానని నమ్మించే ప్రయత్నం చేశారు. ముందు డీడీ అప్పగించే ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే పాడిగేదెలు బేరం చేయాలని ఆదేశించారు. దీంతో రైతులను హర్యానా రాష్ట్రంలో వదిలి చెప్పాపెట్టకుండా వచ్చేశారు. రైతులు తిప్పలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. రైతుల నుంచి వసూలు చేసిన నాన్ సబ్సిడీ మొత్తం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ నెల చివరి వరకు ఓపీ రికార్డు పూర్తి... ఈ నెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ కూడా వెళ్లారు. డాక్టర్ లేకపోవడంతో పశువైద్యశాలకు వెళ్లి ఓపీ రికార్డు పరిశీలించారు. నెలకు సంబంధించిన చికిత్సల వివరాలతో ముందుగానే నింపేసి ఉండటాన్ని చూసి జేడీ అవాక్కయ్యారు. కోళ్ల దానాను వదల్లేదు వివిధ గ్రామాలకు చెందిన వారికి పశుసంవర్ధక శాఖ కోళ్లు పంపిణీ చేస్తుంది. కోళ్లకు దాణా, ఇతర ఇన్పుట్స్ ఇస్తారు. ఇందిరేశ్వరం తదితర గ్రామాల వారికి కోళ్లు పంపిణీ చేశారు తప్ప దాణా, ఇతర ఇన్పుట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంపై ఆరా తీస్తే అమ్మేసుకున్నట్లు తేలిందని రైతులు వాపోతున్నారు. -
‘దేవుడి’ సొమ్ముకే టెండర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. టెండర్లు పిలువకుండానే, లక్షలాది రూపాయల మేర అభివృద్ధి పనులను కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనేది పక్కనబెడితే, దీని వల్ల లక్షలాది రూపాయల మేర దేవుడి సొమ్ము దుర్వినియోగమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా రూ.30 వేలు పైబడి ఖర్చు చేసే ఏ పనికైనా దేవస్థానం మాన్యువల్ టెండర్‌ను పిలవాలి. అలాగే లక్ష రూపాయలు పైబడి జరిగే పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్‌ను పిలిచి, ఎవరు తక్కువకు టెండర్ వేస్తే.. వారికే పనులను అప్పగించాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, సకాలంలో పనులు పూర్తవడంతో పాటు, పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అత్యవసరం పేరుతో 90 శాతం అభివృద్ధి పనులను ఎటువంటి టెండర్లూ లేకుండానే చకచకా కానిచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన వారికి అధికారులు పనులను అప్పగించి, వారికి సొమ్ములను ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి పనులు అప్పగింత ద్వారకాతిరుమలలో దాదాపు ఐదు జేసీబీలు ఉండగా, ఎప్పుడూ ఒక జేసీబీ యజమానికే దేవస్థానం ఇంజినీరింగ్ విభాగ అధికారులు పనులను అప్పగిస్తున్నారు. ఈ విషయంలో గతేడాది సెప్టెంబర్ 7న ఇద్దరు జేసీబీ యజమానులకు, దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరకు ఆ గొడవ రోడ్డుపైనే సెటిల్మెంట్ అయ్యింది. అయినా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న ఆ జేసీబీ యజమానికే ఇప్పటికీ టెండర్లు లేకుండా పనులను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలపైబడి జరిగిన పనులకు సైతం రూ.30 వేలు లోపు, పలు బిల్లులను పెడుతూ ఆ వ్యక్తికే లబ్ధి చేకూరుస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి శేషాచలకొండపై ఇటీవల జేసీబీతో జరుగుతున్న పనులు తక్కువ పని చేసినా.. జేసీబీ దాదాపు 4 గంటలు పనిచేస్తే, 10 గంటలు పనిచేసినట్లు బిల్లుల్లో చూపుతూ, గంటకు రూ.వెయ్యి వరకు అధికారులు ఆ వ్యక్తికి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీ ఎంత సమయం పనిచేసిందనే దాన్ని రీడింగ్ రూపంలో సంబంధిత సిబ్బంది లాక్‌బుక్ రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే దేవస్థానం బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పనులకు ఎటువంటి లాక్‌బుక్ లేనట్లు తెలుస్తోంది. తక్కువ పనిచేసినా.. ఎక్కువ పనిచేసినట్లు సిబ్బంది చేప్పే, ఒట్టి నోటి మాటల ద్వారానే, పెద్ద మొత్తంలో బిల్లులు ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చినవెంకన్న సొమ్ముకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొక్కల పెంపకానికి, ఇతర పనులకు మట్టిని తోలే పనులను సైతం అదే వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇలా అన్ని పనులూ దాదాపుగా ఒకే వ్యక్తికి అధికారులు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ చినవెంకన్నకే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను పాటించి, అభివృద్ధి పనులకు టెండర్లను పిలవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఇదీ అవినీతి రంగు!
ఏలూరు(సెంట్రల్): కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛందంగా ప్రైవేట్ సంస్థలు చేసిన పనులకు డబ్బులు డ్రా చేసేందుకు కుయుక్తులు పన్నారు. బిల్లులు సిద్ధం చేశారు. ఈ ఉదంతం నగరపాలక సంస్థలో చర్చకు దారితీసింది. ఈ బిల్లుల తయారీలో నగరపాలక సంస్థ కీలక విభాగంలోని ఓ ముఖ్య అధికారి ప్రత్యేక పాత్ర పోషించినట్టుగా సమాచారం. అసలేం జరిగింది.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, వంతెనలు, డివైడర్ల గోడలపై కొందరు వాల్‌పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించడం, ఇతర ప్రకటనల రంగులు వేయడం చేస్తున్నారు. దీనివల్ల అవి అధ్వానంగా తయారవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు కళ్లు తెరిచిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, వంతెనలు, ఫ్లైఓవర్ల గోడలను సుందరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తలంచారు. సుందరీకరణలో భాగంగా 3డీ బొమ్మలు, రంగులు వేయాలని నిర్ణయించారు. రంగులు, 3డీ డిజైన్లను వేసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఈ ఏడాది జనవరిలో టెండర్లను పిలిచారు. విశాఖపట్నానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా చేసిన వ్యాపార సంస్థలు.. అయితే 3డీ డిజైన్లు, బొమ్మలు వేసేందుకు నగరంలోని పలు వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. నగరపాలకసంస్థ కార్యాలయం, నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న దామరాజు వెంకట్రావు పంతులు పార్కు, కర్రల వంతెన, లోబ్రిడ్జి, ప్రభుత్వాస్పత్రి, ఓవర్ బ్రిడ్జి గోడలకు వివిధ రకాల డిజైన్లతో కూడిన బొమ్మలను వేసి, వారి వ్యాపార సంస్థల పేర్లను వాటి పక్కనే వేసుకున్నారు. ఇదంతా ఉచితంగానే చేశారు. కాంట్రాక్టరే చేసినట్టుగా బిల్లులు అయితే ఈ పనిని కాంట్రాక్టరే చేసినట్టుగా నగరపాలక సంస్థ అధికారులు బిల్లుల కాజేతకు యత్నిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా రూ.8.14 లక్షలకు బిల్లు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలోని గోడలకు ప్రైవేట్ సంస్థలు రంగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. కాంట్రాక్టరే రంగులు వేసినట్లు అధికారులు బిల్లులు సిద్ధం చేయడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేట్ సంస్థల సౌజన్యంతోనే.. నగరంలోని డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు పోస్టర్లను అంటించి అధ్వానంగా చేస్తున్నారు. దీంతో గోడలపై ఎటువంటి పోస్టర్లను వేయకుండా ఉండేలా 3డీ బొమ్మలు, రంగులు వేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. అయితే వీటిని వేసేందుకు నగరంలోని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వాటితోనే రంగులు, బొమ్మలు వేయించాం. ఈ పనికి నగరపాలకసంస్థ నిధులు ఏమీ ఖర్చు చేయలేదు. బిల్లులు సిద్ధం చేసినట్టుగా నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేస్తాం. –ఎ.మోహన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ -
పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి
-
పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి
సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి బయపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలవరంలో తెలుగు తమ్ముళ్ల అవినీతిపై గత నాలుగైదు నెలలుగా సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రచురితమవడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సాక్షి కథనాలతో విచారణ చేపట్టిన ఐటీడీఏ పీఓ హరీంద్రయ ప్రసాద్ దాదాపు రూ. 13 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. జంగారెడ్డి గూడెం మండలం తాడువాయి, చల్లా వారి గూడెం, మంగి శెట్టి గూడెం తదితర గ్రామాల్లో సేకరించిన 1000 ఏకరాల భూమిలో తెలుగు తమ్ముళ్ల అవినీతి బట్ట బయలైంది. రాళ్ల క్వారిలో జీడిమామిడి తోట ఉన్నట్లు.. పామాయిల్ తోటలో కోకో తోటలు ఉన్నట్లు, లేని టేకు, వేప చెట్లను ఉన్నవాటిగా నమెదు చేసి కోట్ల రూపాయలు మింగిన వైనం తెరమీదకొచ్చింది. పోలవరంలో జరిగిన అవినీతి నిరూపణ కావడంతో పీఓ హరీంద్రయ ప్రసాద్ ఇప్పటికే 8 మంది ఉద్యోగులను సస్సెండ్ చేశారు. దాంతో పాటు కొందరు టీడీపీ నేతలకు రికవరీ నోటీసులు పంపించి.. సొమ్ము చెల్లించపోతే కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. అయితే అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు’ : మధుయాష్కీగౌడ్
సాక్షి, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌లో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారని, అందులో కేటీఆర్ కుటుంబీకులే ఉన్నారన్నారు. తన ఫ్యా మిలీకే కాంట్రాక్టు అప్పగించి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. జాగృతి పేరిట, బతుకమ్మ పేరిట ఇతర రాష్ట్రా ల్లో సైతం డబ్బులు వసూలు చేసిందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె వద్ద జైరాంరెడ్డికి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చి ఆ యనకు అప్పగించారని, ఇందుకుగాను ఎక్స్పో కంపెనీ క వితకు భారీగా ముడుపులు అందించారన్నారు. కేసీఆర్ తన ఫౌమ్‌హౌస్‌లో వందలాది బోర్లు వేయగా చుట్టు పక్కల రైతు లు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మహాకూటమి నిశ్శబ్ధ విప్లవంగా వస్తుందని, క చ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టనున్నారని పేర్కొన్నారు. -
‘రాష్ట్ర విభజనకు అనుకూలమని చెప్పింది ఈయనే’
సాక్షి, విజయనగరం: ఏపీలో టీడీపీ ప్రభుత్వం దోచుకుందాం.. దాచుకుందాం అనే రీతిలో పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విజయనగరంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు, పెనుమత్స సాంబ శివరాజు, కోలగట్ల వీర భద్రస్వామి, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. పట్టణానికి చెందిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్ క్రిష్ణ రంగారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజులపై నిప్పులు చెరిగారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. సుజయ్.. దందాలు చేసుకోవడానికే బొబ్బిలి రాజావారూ జిల్లా అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామన్నారు. ఈ మూడు సంవత్సరాలలో ఈ అభివృద్ది చేశామని ధైర్యంగా చెప్పండి. తలదించుకుని మీ మందు నిలబడతా. ఆస్తులు కాపాడుకోవడానికి, దందాలు చేసుకోడానికి మీరు పార్టీ మారారు సుజయ్. ఇక అశోక్ గజపతిరాజు మీరు జిల్లాకు చేసింది శూన్యం. కేంద్ర మంత్రిగా ఉండి హోదా కోసం ఎప్పుడైనా మాట్లాడారా? కాంగ్రెస్ మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసి.. నేడు అదే కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు? రోశయ్య మీటింగ్‌లో రాష్ట్ర విభజనకి అనుకూలమని చెప్పింది ఈయన గారే. భోగా పురం ఏయిర్పోర్టు టెండర్లు రద్దు చేసి ప్రయివేట్ వారికి ముడుపులు తీసుకుని అప్పజెప్పాలను కోవడం వాస్తవం కాదని.. మీ ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా? ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు మేం జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ, ఆంధ్రా యునివర్సిటీ, కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం.. మీరేం తెచ్చారో చెప్పండి? పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి రామతీర్థ సాగర్ని మా హయాంలో మొదలు పెట్టాం. టీడీపీ నేతలు నేటికి పూర్తి చేయలేకపోయారు. ఇంటికో రేటు పెన్షన్‌కో రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు తాతగారి ఆస్తుల్లా 1300 కోట్లు అప్పనంగా చెల్లించారని కాగ్ బయటపెట్టింది. సీఎంకి ప్రయివేట్ సంస్థలకు వాటాలు నప్పకే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం తేలట్లేదు. తోటపల్లి వద్ద పడుకుని పూర్తి చేశానని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. సంక్షేమ రాజ్యం రావాలంటే.. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి వారికి ఓ భరోసాని ఇవ్వడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాకు చేరుకోనున్నారు. వైఎస్ జగన్‌కు కుర్చి మీద తపన ఆరోపణలు చేస్తున్నారు. నిజం జగన్‌కి కుర్చి కావాలి. పదవి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలరు. సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి.. కావాల్సిందే. విజయనగరం జిల్లాలో జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకోవడం చారిత్రాత్మకం. -
నవాజ్ షరీఫ్‌కి భారీ ఊరట
-
బాబు పాలనలో అందరికీ కష్టాలే
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘రావాలి జగన్...కావాలి జగన్’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులను జనం వైఎస్సార్సీపీ నేతల వద్ద ఏకరువు పెడుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం గొటుకూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, యువజన విభాగం నాయకులు ప్రణయ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి జనంతో మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి మొదలుకుని కార్యకర్త వరకు దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదన్నారు. ధర్మవరం పట్టణం ఒకటో వార్డు శాంతినగర్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదంటూ పలువురు మహిళలు వెంకటరామిరెడ్డితో వాపోయారు. మోసం చేసిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం యర్రయ్యగారిపల్లి, చుండురోళ్లపల్లిలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క హామీ అమలు చేయకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మడశికర నియోజకవర్గం గుండుమలలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని తిప్పేస్వామి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సయుక్త కార్యదర్శి రంగేగౌడు పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జగన్ సీఎం అయితే చేపట్టే పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఈదులకుంట్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం మోసం చేసిన వైనాన్ని గ్రామస్తులు నాయకుల వద్ద వాపోయారు. కళ్యాణదుర్గం పట్టణం ఇందిరమ్మకాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు కార్యక్రమం నిర్వహించారు. ఏళ్ల తరబడి బుట్టలు అల్లుకుని జీవిస్తున్నామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని మహిళలు వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలూ అభివృద్ధి చెందుతాయని ఉషశ్రీచరణ్ వారికి భరోసా ఇచ్చారు. -
నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు: విడుదల
ఇస్లామాబాద్: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు.. ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. అవెన్‌ఫీల్డ్ కేసులో షరీఫ్ (68), ఆయన కూతురు మర్యం, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ ముహ్మద్ సఫ్దార్‌ల జైలు శిక్షను నిలిపివేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో బుధవారం రాత్రి ఈ ముగ్గురినీ విడుదల చేశారు. రావల్పిండి ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కు పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. విడుదలకు ముందు జైలు సూపరింటెండెంట్ గదిలో తన సన్నిహితులతో ‘నేనేం తప్పు చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు. ఏది సత్యమో అల్లాకు తెలుసు’ అని షరీఫ్ అన్నట్లు పాక్ మీడియా పేర్కొంది. లండన్‌లోని అవెన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఖరీదైన బంగళాలు కొన్నారన్న కేసులో తమను జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ షరీఫ్, కూతురు, అల్లుడు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
పోలవరం, పట్టిసీమపై చర్చకు సిద్ధం
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం, పట్టిసీమ, అమరావతి బాండ్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ధర, రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి.. తదితర అంశాలపై చర్చకు తాను ఎప్పుడు.. ఎక్కడకు రావాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందన్నది తన వాదన కాదని, 10.36 శాతం ఎక్కువ వడ్డీకి ఎందుకు తీసుకున్నారనేదే తన వాదనని పునరుద్ఘాటించారు. వడ్డీ 8 శాతానికి మించి తీసుకోకూడదని జీవో జారీచేసిన ఆరు నెలలకే 10.36 శాతానికి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. చెల్లింపులపై ఆడిట్ అభ్యంతరాలివిగో.. రాజధాని మీటింగ్‌కు మోదీ వచ్చినప్పుడు రూ.4.98 లక్షల ఖర్చవగా.. అందులో కాంట్రాక్టర్ ప్రాఫిట్ అని రూ.70 లక్షలు ఇచ్చినట్టు రాశారని తెలిపారు. బిల్డింగ్లు కట్టడం కోసం రూ.53.74 కోట్లకు షెడ్యూల్ ఆఫ్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని, అయితే పల్లోంజి కంపెనీ రూ.103.42 కోట్లకు, ఎల్ అండ్ టీ అయితే రూ.106 కోట్లు ఇస్తే చేస్తామని చెప్పాయని.. నిబంధనల ప్రకారం ఐదు శాతం ఎక్కువ వస్తే టెండర్లు రద్దు చేయాల్సి ఉందన్నారు. కానీ వాళ్లను బేరానికి పిలిచి 25 శాతం అదనంగా చెల్లించేందుకు రెండు పనులు, 26 శాతం అదనానికి ఒక పని కేటాయించడంపై ఆడిట్ కార్యాలయం ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండా.. చేసినట్లు చూపించి రూ.101 కోట్లు చెల్లించారని 2018 జూలై 10న పోలవరం పే అండ్ అకౌంట్ అధికారి.. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు లేఖ రాసిన విషయం నిజం కాదని కుటుంబరావు చెప్పాలన్నారు. -
ఆదరణ స్కీమ్‌లో అవినీతి...
-
అవినీతి ధార
అక్రమ కుళాయిలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులేఅక్రమాలకు పాల్పడుతున్నారు. భవన యజమానుల నుంచిఅక్రమంగా నగదు వసూలు చేసి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో అక్రమ కుళాయిలు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 కోట్లునష్టం వాటిల్లుతోంది. ఈ వ్యవహారంలో ఫిట్టర్లుకీలకప్రాత పోషిస్తున్నారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 1.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 32,200, విలీన పంచాయతీల్లో 6,000 కుళాయిలు ఉన్నాయి. నెల్లూరు నగరంలోని కుళాయిలకు రూ.2,400, పంచాయతీల్లోని కుళాయిలకు రూ.1,200 పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. అలాగే 765 కమర్షియల్ భవనాల నుంచి ఏడాదికి రూ.40 లక్షలు వసూలవుతోంది. కార్పొరేషన్‌కు ఏడాదికిమొత్తం రూ.8 కోట్లు ఆదాయం వస్తోంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 15 వేలకు పైగా అక్రమ కుళాయిలు ఉన్నట్లు అంచనా. వీటి వల్ల కార్పొరేషన్ రూ.3.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతుంది. అధికారులు ఆన్లైన్ చేశామని, అక్రమ కుళాయిలు లేకుండా చేస్తామని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఫిట్టర్లు భవన యజమానుల నుంచి భారీగా వసూలు చేసి ఇష్టారాజ్యంగా అక్రమ కుళాయిలకు కనెక్షన్లు ఇస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఓ అధికారికి ఫిట్టర్లు ప్రతి నెలా రూ.లక్ష ఇవ్వాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు అందుతుండడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. రెసిడెన్షియల్ భవనాలకు ఇంటి కుళాయి ఉన్నట్లు సృష్టించారు. నగరంలోని రెసిడెన్షియల్ భవన యజమానుల నుంచి ప్రతి ఏటా లక్షలు వసూలు చేస్తున్నారు. అర్హత లేని వారికి.. కార్పొరేషన్ పరిధిలో ఫిట్టర్లు 22 మంది పని చేస్తున్నారు. వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఐటీఐ విద్యను పూర్తి చేశారు. మిగిలిన 14 మందికి సరైన విద్యార్హత లేదని తెలుస్తోంది. ప్రజారోగ్యానికి సంబంధించిన నీటి సరఫరాలో టెక్నికల్ సబ్జెక్ట్ కచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే కార్పొరేషన్ ఉన్నతాధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అనర్హులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా నీటి పైప్‌లైన్ పగిలితే సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమవుతున్నారు. భలే డిమాండ్ కార్పొరేషన్లో ఫిట్టర్ పోస్ట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో పోస్ట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అధికారులకు, పాలకవర్గానికి ముట్టజెబుతున్నారని సమాచారం. ఇటీవల ఓ పోస్ట్‌కు ఇంజినీరింగ్ విభాగంలోని ఉన్నతాధికారికి రూ.70 వేలు అందినట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అక్రమ కుళాయిలపై విజిలెన్స్ కన్ను అక్రమ కుళాయిలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వాటిని క్రమబద్ధీకరించాల్సిన ఫిట్టర్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు తప్ప కుళాయి కనెక్షన్లు కార్పొరేషన్ నీటి పైప్‌లైన్ నుంచి ఇవ్వలేరు. ఫిట్టర్ కింద ఉండే సిబ్బంది ద్వారా రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపి బిగిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై వారు విచారణ చేస్తున్నారు. ఫిట్టర్ సస్పెన్షన్ అక్రమ కుళాయిల ఏర్పాటుకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ అనే ఫిట్టర్‌ను ఇటీవల కమిషనర్ అలీంబాషా సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో మరో ఫిట్టర్‌పై కూడా ఫిర్యాదులు రావడంతో విచారించి సస్పెండ్ చేయనున్నట్లు తెలిసింది. -
అవినీతి @ 5% ప్రపంచ జీడీపీ
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అవినీతే మూల కారణమనీ, ఈ జాడ్యం కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతానికి సమానమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. హింస, ఘర్షణలు, అస్థిరత, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా తదితర అనేక సమస్యలు అవినీతి వల్లే రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. లంచగొండితనం కారణంగా హింస పెచ్చరిల్లుతుండటం, అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవినీతిని అంతమొందిచటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సోమవారం నిర్వహించిన సమావేశంలో గ్యుటెరస్ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) అంచనాలను ఆయన ఉటంకిస్తూ.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అక్రమ నగదు రవాణా, పన్ను ఎగవేతల కారణంగానే అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనీ, ఈ నేరాలను అరికట్టేందుకు అన్ని దేశాలూ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని గ్యుటెరస్ కోరారు. జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్లను ఏర్పాటుచేసి, విచారణ జరపడం అత్యంత ఆవశ్యకమనీ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ, అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యకర్తలకు రక్షణ ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. ‘అవినీతి అన్ని దేశాల్లోనూ ఉంది. ధనిక–పేద, ఉత్తర–దక్షిణ, అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న.. ఇలా ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ అవినీతి ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వ్యక్తులు, వాణిజ్య సంస్థలు ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే లంచం ఇస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సబ్‌ప్లాన్ పనులకూ.. అధికార చీడ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతలు ఏ పనులనూ వదలడం లేదు. అన్నీ తమకే అప్పగించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురికి కాలువలు వంటి పనులకు పిలిచిన టెండర్లను తెరవొద్దంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో టెండరు గడువు పూర్తయి సుమారు నెల రోజులు కావస్తున్నా వాటిని కర్నూలు కార్పొరేషన్ అధికారులు తెరవడం లేదు. తన వారికి దక్కలేదన్న కారణంగా అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో టెండర్లు తెరవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన పనులకు సకాలంలో టెండర్లు పిలవలేదంటూఏకంగా మునిసిపల్ డైరెక్టర్ రద్దు చేసినప్పటికీ వ్యవహారంలో మాత్రం మార్పు రావడం లేదు. మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.4.5 కోట్లతో మూడు వేర్వేరు టెండర్లను ఈ ఏడాది జూలై 21న పిలిచారు. వీటికి బిడ్లు సమర్పించే గడువు ఆగస్టు 13తో పూర్తయ్యింది. ఈ టెండర్లలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే, అధికార పార్టీ నేతకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి దక్కలేదనే కారణంగా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ టెండర్లు తెరవకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు వెనక్కి వెళుతున్నా... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో సబ్‌ప్లాన్ నిధులను సకాలంలో ఖర్చు చేయలేదన్న కారణంతో వెనక్కి తీసుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల మేర నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. జిల్లాలో కూడా రూ.20 కోట్ల మేర వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కూడా రూ.4.5 కోట్ల పనులకు టెండర్లను పిలిచి 50 రోజులకు పైగా అయ్యింది. బిడ్లను సమర్పించి కూడా నెల రోజులు కావస్తోంది. అయినప్పటికీ టెండర్లను మాత్రం తెరవడం లేదు. అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లు ఆలస్యం కాకుండా చూడాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కర్నూలు కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో గడువు ముగిసినా టెండర్లను తెరవని పరిస్థితి నెలకొంది. రంగంలోకి ఇతర కాంట్రాక్టర్లు! సబ్‌ప్లాన్ టెండర్లను తెరవకపోవడంతో కొద్ది మంది మునిసిపల్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సదరు నేత వద్దకు వెళ్లి.. టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ నేత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. టెండరులో పనులు దక్కే కాంట్రాక్టర్‌ను మీ వద్దకు తీసుకొస్తామని పేర్కొన్నప్పటికీ అంగీకరించలేదని సమాచారం. కేవలం తన మనుషులకు మాత్రమే పనులు దక్కించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తప్పుడు ఎన్నికల అఫిడవిట్ అవినీతి చర్యే
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడాన్నీ అవినీతి చర్యగానే పరిగణించాలని సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, అలాంటి వ్యక్తులపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేలా చట్టం తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించలేమని సోమవారం స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పులను సీరియస్‌గా పరిగణించాలంటూ బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లన్నింటినీ ఒకేసారి విచారిస్తామని పేర్కొంది. ‘తప్పుడు ఎన్నికల అఫిడవిట్ విషయంలో సీరియస్‌గా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం. తప్పుడు వివరాలు పొందుపరచడం నైతికంగా తప్పే. కానీ.. ఈ దిశగా సరైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించలేం. అవినీతి చర్యల్లో దీన్ని కూడా చేర్చాలని పార్లమెంటుకు సూచించలేం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ లా కమిషన్ కూడా తన 244వ నివేదికలో ఈ అంశాన్ని పేర్కొందని.. ఎన్నికల కమిషన్ కూడా రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవని ప్రతిపాదించిన విషయాన్ని ఉపాధ్యాయ తరపు న్యాయవాది.. రాణా ముఖర్జీ కోర్టుకు గుర్తుచేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 (ఏ) ప్రకారం తప్పుడు అఫిడవిట్ సమర్పించిన వారికి ఆర్నెళ్ల జైలుశిక్ష విధించాలని చెబుతోందన్నారు. అయితే.. ఈ చట్టంలోని 123లో ఉన్న అవినీతి చర్యల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని చేర్చనందునే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. -
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ సాగునీటి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు కేం ద్రం భారీగా నిధులిస్తే సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా కేంద్రం ఇచ్చే నిధులతో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని రకాలు గా దుష్ప్రచారం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ నిర్మాణాత్మక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీలకు లోపాయి కారీ ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని దత్తాత్రేయ తిప్పికొట్టారు. కేసీఆర్‌తో బీజేపీకి ఎప్పటికీ మితృత్వం ఉండదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు వెంపర్లాడుతున్న చంద్రబాబు ఎప్పటికీ స్వయం ప్రకాశవంతుడు కాలేరన్నారు. దత్తాత్రేయతో పాటు రాజస్థాన్ ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరాం తదితరులు ఉన్నారు. -
లంచాల కోసం.. ఏకంగా కార్యాలయం!
వేలూరు (తమిళనాడు): లంచాలు వసూలు చేసేందుకు ఏకంగా కార్యాలయాన్నే నడపడంతో పాటు 38 మంది సిబ్బందిని నియమించుకున్నాడు ఓ అధికారి. విజిలెన్స్ తనిఖీల్లో గుట్టు బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని వేలూరు సత్‌వచ్చారిలో టౌన్‌ప్లానింగ్ జోన్ అసి స్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో సుబ్రమణియన్ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అనుమతిలేని ఇళ్ల స్థలాలు, పరిశ్రమలకు అనుమతులిస్తూ ఉంటాడు. అక్కడి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం కార్యాలయంలో విజిలెన్స్ డీఎస్పీ శరవణకుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్‌వచ్చారిలోని వివేకానందనగర్‌లో సుబ్రమణియన్.. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసి ఓ రిటైర్డ్ అధికారిని నియమించుకున్నాడు. ఆయన కింద 37మంది సిబ్బందిని నియమించి లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. సోదాల్లో రూ.3 లక్షల 28 వేల నగదు స్వాధీనం చేసుకుని, సుబ్రమణియన్‌ను అరెస్ట్ చేశారు. -
జేసీపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
-
‘నిరూపిస్తే నా తల నరుక్కుంటా’
సాక్షి, అనంతపురం: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు బయట పడుతున్నాయి. టీడపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎంపీ జేసీ దివారక్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జేసీకి వయస్సు మీద పడింది కానీ బుద్ధి రాలేదని అన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం అసలుకు లేవు, అందుకే నీ అమ్మా, అబ్బా అంటూ తిడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో దివాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఆధికారులను, మీడియాను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను తలుచుకుంటే జేసీ కంటే ఎక్కువ తిట్టగలను, కానీ సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. నిరుపిస్తే తల నరుక్కుంటా... జేసీ నీకు దమ్ము, దైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరుపిస్తే తల నరికేసుకుంటానని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎంపీ దివాకర్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డుపడుతున్నారని వాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, గన్ మెన్లు లేకుండా నేను తిరిగేందుకు నేను సిద్ధం మీరు సిద్ధామా అని సవాల్ చేశారు. నా సహనానికి ఓ హద్దు ఉంది, నా సహనాన్ని పరీక్షించొదని పరీక్షిస్తే ఖబడ్దారు అని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఆగడాలకు తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. జేసీ తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదని, దివాకర్ రెడ్డి వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని వాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జేసీ దౌర్జన్యాలను సహించేది లేదు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. మేమంతా కలసి జేసీని గెలిపిస్తే తాను మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఎంపీ జేసీ వల్ల టీడీపీకి చాలా సష్టం జరుగుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అవినీతి పాఠం!
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో చేయి తడపందే పనులు కావడం లేదు. ఆమ్యామ్యాలిస్తేనే అనుమతులిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు, రెన్యూవల్‌కు రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లను పెండింగ్‌లో ఉంచేస్తున్నారు. అధికారులు అడిగినంత ముట్టజెబుతున్న స్కూళ్ల నిర్వాహకులు ఆ మేరకు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులు, ఉన్న స్కూళ్ల గుర్తింపు రెన్యూవల్స్‌కు సంబంధించిన విషయాల్లో డీఈఓ కార్యాలయంలో మామూళ్ల దందా నడుస్తోంది. అక్కడి అధికారుల పనికి బట్టి ఫిక్స్డ్ రేట్లు నిర్ణయించారు. వారు చెప్పిన మేరకు చెల్లిస్తే సరే... అందులో పైసా తగ్గినా ఫైళ్లు ముందుకు కదలవు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి 60–70 పైళ్లు ఇలా డబ్బుతోనేముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఇలా... ♦ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేయాలన్నా, ఉన్న స్కూల్ గుర్తింపు రెన్యూవల్ చేసుకోవాలన్నా రూ.2,500 చలానా తీయాలి. ♦ ఉన్నత పాఠశాలకైతే రూ. 5 వేలు చలానా కట్టాలి. ♦ ప్రాథమిక పాఠశాలలైతే ఎంఈఓ, ఉన్నత పాఠశాలలైతే డిప్యూటీ డీఈఓ వెళ్లి... సదరు పాఠశాలలో నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నాయా...? లేదా..? వాటికి సంబంధించి సర్టిణఫికెట్లు పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత డీఈఓకు సిఫార్సు చేయాలి. ♦ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి డీఈఓ అనుమతిలిస్తారు. ♦ ఉన్నత పాఠశాలల ఫైళ్లు డీఈఓ నుంచి రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ, కడప)కి... అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్తాయి. అన్నీ సవ్యంగా ఉంటేనే ప్రభుత్వం అనుమతిలిస్తుంది. జరుగుతోందిలా... ♦ ప్రాథమిక పాఠశాలలకైతే ఎంఈఓకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఇవ్వాల్సి వస్తోందని పలు పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. ♦ ఫైలు అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి వెళ్లగానే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రూ.30 వేలు చెల్లించాలి. ♦ ఉన్నత పాఠశాలలైతే డిప్యూటీ డీఈఓలకు ఐదేళ్ల ఫైళ్లయితే రూ.30 వేలు, పదేళ్ల ఫైళ్లయితే రూ. 60 వేలు ఇవ్వాలట. ♦ అక్కడి నుంచి ఫైలు డీఈఓ కార్యాలయానికి రాగానే అక్కడ వారికి రూ. 30 నుంచి రూ. 40 వేలు ఇవ్వాలి. డబ్బు ముట్టజెబితే తప్ప ఫైలుకు ముందుకు వెళ్లని పరిస్థితి. – ఆర్జేడీ కార్యాలయంలోనూ ఒక్కో ఫైలుకు రూ. 60 వేలు ముట్టజెబితేనే ఫైళ్లు ముందుకు వెళ్తాయని ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు వాపోతున్నారు. ♦ పాఠశాల నిర్వహణకు కీలకమైన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, సౌండ్నెట్, శానిటరి, ఫైర్ ఎన్ఓసీ, ట్రాఫిక్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు పక్కాగా జత చేసినా...వీరికి మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే ఫైళ్లకు బూజు పడతాయి. డబ్బులిస్తే మేనేజ్ చేస్తారట పాఠశాల రెన్యూవల్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు కచ్చితంగా ఇటీవల తీసుకున్నవే ఉండాలి. డీఈఓ కార్యాలయంలో కొందరు సిబ్బంది పాత సర్టిఫికెట్లు జతచేసి వాటితోనే ఫైళ్లను పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక అధికారుల పర్యవేక్షణలో ఈ మూమాళ్ల తతంగం నడుస్తోంది. ఏ ఫైలుకు ఎంత ఇవ్వాలనేది ఫిక్స్ చేసింది వారేనని ప్రచారం సాగుతోంది. పాఠశాల అనుమతి, రెన్యూవల్ విషయంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది తీరుపై ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లలో చర్చనీయాంశమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యాశాఖలో కొందరికి పండుగే. కొందరు ఎంఈఓలతో పాటు డీఈఓ కార్యాలయంలో రెన్యూవల్స్, అనుమతులకు సంబంధించి ఫైళ్లు చూసే సెక్షన్ల సిబ్బంది సీజన్ ముగిసేదాకా కళకళలాడుతుంటారు. కొసమెరుపు డీఈఓ కార్యాలయంలో దందా చేస్తున్న సిబ్బంది అధికారుల వాటాగా మాత్రం రూ.4–5 వేలు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా అధికారుల పేరు చెబుతూ వసూళ్లకు తెర తీస్తుండడం కొసమెరుపు. విచారణ చేయిస్తా ప్రైవేట్ స్కూళ్ల రెన్యూవల్స్, కొత్తగా అనుమతులకు డబ్బులు తీసుకుంటున్న విషయం ఎవరూ నాదృష్టికి తీసుకురాలేదు. అయినా దీనిపై విచారణ చేయిస్తా. కార్యాలయంలో ఎవరైనా సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. ఎవర్నీ ఉపేక్షించం. – జనార్దనాచార్యులు, జిల్లా విద్యాశాఖ అధికారి -
దోపిడీ ఫండ్‌గా మారిన సీఎం రిలీఫ్ ఫండ్
-
ఇసుక దందా
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో ఇసుక దందా మళ్లీ జోరందుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి.. ఇసుక మేటలు వేసింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో అక్రమార్కులు దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. యథేచ్ఛగా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మైన్స్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి, అర్లి(బి) శివారు ప్రాంతాల్లోని సాత్నాల వాగు, చాందా(టి), భీంసరి, జైనథ్ మండలం తరోడ, పూసాయి, బేల మండలం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో వర్షాకాలంలో కురిసే వర్షాలతో వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తుండడంతో క్రమేణ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంది. కొన్నేళ్లుగా నిరంతరాయంగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుకను తొడేస్తున్నారు. దాడుల సమయంలో పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నాలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంతమాత్రం కృషి చేయడం లేదు. పగలు రాత్రీ అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూగర్భజలమట్టం మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణా అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లు గుంతలమయం ఆయా ప్రాంతాల నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతుండగా.. ట్రాక్టర్ల రద్దీకి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయకూడదని, వాగుల సమీపంలోని పొలాలు ఉన్న రైతులు చెబుతున్నా వారు పట్టిం చుకోవడం లేదని వాపోతున్నారు. కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయల్టీ రూపంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనుల పేరుతో.. ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని చెప్పి చాలామంది వ్యాపారులు ప్రైవేట్ వారికి ఇసుకను అమ్ముతున్నారు. వ్యాపారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ఆయా శాఖల రెవెన్యూ అధికారుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. నీరుగారుతున్న వాల్టా చట్టం.. భూగర్భ జల వనరుల సంరక్షణకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలు నీరుగారుతోంది. వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర మినహా మరే ఇతర చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు వేలు అన్న చందంగా సాగుతోంది. మైన్స్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారులు స్పందించి వాల్టా చట్టం పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రెవెన్యూ అధికారులే చూసుకోవాలి పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గతంలోనే చెప్పాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. – రవిశంకర్, జిల్లా మైన్స్ అధికారి, ఆదిలాబాద్ -
ఒకేసారి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతి అధికారులపై ఏకకాలంలో క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన క్షమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) స్పష్టం చేసింది. కొన్ని అవినీతి కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై అధ్యయనం తర్వాత అలాంటి కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుందన్న సాకుతో శాఖపరమైన చర్యల్లో జాప్యం చేస్తున్నారని సీవీసీ గుర్తించింది. కేసు విచారణలో ఉందన్న సాకుతో కొన్ని విభాగాలు, సంస్థలు అలాంటి వైఖరి అనుసరించడం సరైన విధానం కాదని బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్పష్టం చేసింది. -
విద్యుత్ సంస్థలో అవినీతి చీకట్లు!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) అవినీతి పుట్టగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంత మంది ఇంజినీర్లు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వీరిబాటలోనే నడుస్తున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు ఏఈలు, ఒక లైన్మెన్ ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమ మీటర్ల వ్యవహారంలో మరో ముగ్గురి(ఒక ఏఈ సహా లైన్మెన్, ఆర్టిజన్)పై వేటు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఈ శాఖ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. ఆశించిన దానికంటే అధిక మొత్తంలో వేతనాలు పెంచినా అక్రమ వసూళ్ల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం గచ్చిబౌలికి చెందిన లైన్మెన్ ఎ.రాజేందర్ ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఆ తర్వాత ఏడీఈ, ఏఈలను కూడా ఏసీబీ విచారించింది. నిబంధనల ప్రకారం మీటర్లు, ప్యానల్ బోర్డు కోసం నిర్దేశించిన చార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించినప్పటికీ నెల రోజులుగా మీటర్లు జారీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇందులో పెద్ద తలకాయల ప్రమేయం కూడాఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెట్టిన ఖర్చులు సంపాదించుకునేందుకే.. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా డిస్కంలో పనిచేసే ప్రదేశాలను యాజమాన్యమే ‘ఫోకల్.. నాన్ ఫోకల్’ కేటగిరీలుగా విభజించింది. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాలను నాన్‌ఫోకల్‌గా, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఫోకల్‌గా పేర్కొంటున్నారు. బదిలీ సమయంలో ఫోకల్(కొత్త నిర్మాణాలు, కొత్త వెంచర్లు అధికంగా ఉండే ప్రదేశాలు) పోస్టు కోసం ఏఈలు, ఏడీఈలు, డీఈలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. రాజకీయ పెద్దలకు, ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి పోస్టింగ్‌లు పొందడం డిస్కంలో అందరికీ తెలిసిన తతంగమే. ముఖ్యంగా శివారు ప్రాంతలైన గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, సరూర్‌నగర్, చంపాపేట్, శంషాబాద్, హబ్సిగూడ, బోయిన్పల్లి, కూకట్‌పల్లితో పాటు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ఇంజినీర్లు పోటీ పడుతుంటారు. పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇలా పెట్టిన ఖర్చులను తిరిగి సంపాధించుకునేందుకు ఆ తర్వాత అడ్డదారులు తొక్కతున్నారు. కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ షిష్టింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కొత్త లైన్ల ఏర్పాటు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్తాయి కార్మికులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఎవరైనా పట్టుబడినప్పుడు తమకేమీ సంబంధం లేదని పెద్దలు తప్పించుకుంటే కిందిస్థాయి సిబ్బందిపై వేటు పడుతోంది. పెద్దల పనికి చిరుద్యోగులు బలి ఓల్డ్ బోయిన్పల్లి సెక్షన్ పరిధిలో రోలింగ్ స్టాక్‌లోని 130 మీటర్లును మాయం చేసి, గుట్టుచప్పుడు కాకుండా వినియోగదారుల నివాసాలకు అమర్చిన ఘటనలో లైన్మెన్ రమేషాచారి సహా ఏఈ వినోద్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ విషయంలో ఏడీఈ, డీఈలకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు. అదే విధంగా సరూర్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ సెక్షన్ పరిధిలో హెచ్‌టీ మీటర్ల జారీలోనూ అక్రమాలు జరిగాయి. ఒకే సర్వీసు నెంబర్‌తో ఉన్న మీటర్‌ను అధిక మొత్తంలో రీడింగ్ నమోదైన ప్రతిసారి సాంకేతిక అంశాలను కారణాలుగా చూపి ఎనిమిదిసార్లు మార్చారు. అంతేగాక డిస్కంను ఏమార్చిన వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులను సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. ఈ ఘటనపై ఓ ఆర్టిజన్ కార్మికుపై డిస్కం వేటు వేసి విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ అంశంలో సంబంధత డివిజన్ ఉన్నతాధికారులకు ప్రమోయం ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం వెనకాడుతుండుతోంది. యాజమాన్యమే అక్రమార్కులకు కొమ్ముకాస్తోందని సంస్థలోని ఉద్యోగులే విమర్శిస్తున్నారంటే ‘డిస్కం’ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి డీఈ, ఏడీఈ, ఏఈలకు తెలియకుండా కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు సాధ్యం కాదు. ఒకవేళ మంజూరు చేసినా వెంటనే తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఛార్జీలను వినియోగదారుడు సంస్థకు చెల్లించిన తర్వాత గడువులోగా వాటిని మంజూరు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కారణాలు అన్వేశించాల్సిన బాధ్యత సదరు ఉన్నతాధికారులదే. ఉన్నతాధికారులే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తుండడంతో వినియోగదారులు తమ బాధతలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. -
రూ.100 కోట్లు..నో బ్రేక్!
సాక్షి, అమరావతి /తిరుపతి క్రైం: రేణిగుంట చెక్‌పోస్ట్‌లో ఎంవీఐగా పనిచేస్తున్న పసుపులేటి విజయభాస్కర్‌పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అతని ఆస్తులు రూ.4.5 కోట్లు ఉంటాయని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లపైగానే ఉంటాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..పద్మావతిపురం పంచాయతీలోని శ్రీనివాసపురంలో ఉన్న ఇంటితో పాటు, బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి 16ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెంగళూరులోని 4 ప్రదేశాల్లో, అనంతరంపురంలో ఓ చోట, చిత్తూరు జిల్లాలో పదిచోట్ల, చెన్నైలోని ఓ ప్రాంతంలో, బంధువులకు చెందిన, బినామీ పేర్లతో సుమారు రూ.8కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెండు లాకర్లను గుర్తించారు. కడప జిల్లా, నందలూరు మండలం, శేషామాంబపురానికి చెందిన పి.సుబ్బరాయుడు కుమారుడు పి.విజయభాస్కర్ (51) 1993లో అగ్నిమాపకశాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2005లో బదిలీపై రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. పలమనేరు చెక్‌పోస్టు , కడప డీటీసీ ఆఫీసులో 2014 వరకు విధులు నిర్వహించాడు. 2011లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక టివి చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి సస్పెండ్ అయ్యాడు. 2014లో ఇతనికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పలుమార్లు తనిఖీల్లో పట్టుబడిన ఆయనపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆర్సీవో కేసు నమోదు చేశారు. ఇంట్లో వందల కొద్ది పత్రాలు, బాండ్లు, నగదు, వెండి, విలువైన వస్తువులు, వాహనాలను గుర్తించారు. కొంతకాలంగా రాజకీయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఆయన సన్నిహితులు కూడా రాజంపేట ఎమ్మెల్యే టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. విజయభాస్కర్ మొదటి భార్య త్రిపురసుందరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి నెల్లూరు కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ ఏఎస్ఈ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. గుర్తించిన ఆస్తులివే... - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/3 నిందితుడు పి.విజయభాస్కర్ భార్య త్రిపురసుందరి పేరుతో ఉన్న రూ.228.69లక్షల ఇళ్లస్థలం 20 గుంటలు - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/5 విజయభాస్కర్ పెద్దమ్మ కామాక్షమ్మ , రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.81.90లక్షల ఇళ్లస్థలం7.52 గుంటలు - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.168,ఆర్ఎస్నం.262 విజయభాస్కర్ రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.11లక్షల ఇళ్లస్థలం 1.39 ఎకరాలు - కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వేనం.902/391/3ఎ1, 1500–2 పచ్చిపుల సుదర్శన్‌కుమార్ పేరుతో రూ.4లక్షల వ్యవసాయ భూమి 7.21 ఎకరాలు - కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వే నం 227/2ఎన్2లో పచ్చిపుల వెంకటసుబ్బయ్య పేరుతో రూ.0.20లక్షల 0.37 ఎకరాలు - బెంగళూరులో హోబ్లీ కృష్ణరాజపుర, దేవచంద్ర గ్రామంలో తన రెండో భార్య పి.ధనలక్ష్మి తండ్రి డి.కృష్ణ పేరు మీద రూ.16.02లక్షల 1800 చదరపు అడుగులున్న రెండు ప్లాట్లు - చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని గౌతమ్‌నగర్‌లో రెండో భార్య పి.ధనలక్ష్మి పేరుతో రూ.26 లక్షల 306 అడుగులున్న ఇల్లు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు.. - బెంగళూరులోని కనకపుర మెయిన్‌రోడ్డులోని గ్రేస్ క్రియేషన్స్ క్లాత్ డిజైనింగ్ కంపెనీలో 2011లో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. - బెంగళూరు మైసూర్ రోడ్డులోని కుంభలగోడు ఇండస్ట్రియల్ ఏరియాలోని గ్రేస్టెక్స్ప్రో ఫ్యాక్టరీ (ఎంబ్రయిడరీ మిషన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ)లో 2011లో రూ.30లక్షల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. చరాస్తులు.. - విజయభాస్కర్ మొదటి భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.29లక్షలు - రెండో భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.53.33లక్షలు - గుర్తించిన నగదు 7.72లక్షలు - సంతకం చేసిన రూ.110.00లక్షల విలువైన 6 ఖాళీ చెక్కులు - రూ.57.00లక్షల విలువైన 12 ప్రామిసరీ నోట్లు - సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు 25 - బ్యాంకు బ్యాలెన్స్ రూ.53లక్షలు - గోల్డ్ 350 గ్రాములు, సిల్వర్ 2 కేజీలు - ద్విచక్ర వాహనం ఒకటి, హోండా యాక్టివా, ఫోర్‌వీలర్స్ 2 (విలువ రూ.29లక్షలు) - 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని ఇంకా పరిశీలించలేదు. -
ఏసీబీ ఉచ్చు.. సొమ్ములతోనే చిచ్చు
వరంగల్‌లోని హన్మకొండలో సర్వశిక్షాభియాన్ ఈఈ రవీందర్రావు ఫర్నిచర్ కాంట్రాక్టర్ కోసం బాధితుడు వన్నాల కన్నా నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించి 2018, ఫిబ్రవరి 26న వల వేయించి పట్టించారు. అయితే ఇందుకోసం కన్నా ఇచ్చిన సొమ్ము విషయం ఏసీబీ అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఆరు నెలలు దాటిపోతున్నా తమకు బడ్జెట్ రాలేదని, తమ ఉన్నతాధికారులను కలవాలని సలహాలు ఇచ్చి పంపేస్తున్నారు. ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బాధితుల చిట్టా చాలానే ఉంది. సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు తమతో కలసి రావాలని ఏసీబీ పిలుపునిస్తోంది. అక్రమార్కులను పట్టించిన బాధితులు వినియోగించే సొమ్ములు తిరిగి చెల్లించే విషయంలో ఎగనామం పెడుతోంది. ఉచితంగా అందాల్సిన సేవలకు లంచాలు ఇవ్వలేక కొంతమంది బాధితులు పౌరవిజ్ఞతతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తుంటారు.లంచగొండులను వల వేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గరి నుంచి డబ్బులు అప్పుతెచ్చి ఏసీబీ ద్వారా పట్టిస్తుంటారు. ఇలా ట్రాప్ వేసిన కేసుల్లో బాధితులిచ్చిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోపల కోర్టు వ్యవహారాలను పరిష్కరింపజేసుకొని బాధితులకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవినీతి నిరోధకశాఖలో ఈ ప్రక్రియ సజావుగా సాగక ఏళ్ల తరబడిగా బాధితులు తమ డబ్బు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. లంచంకోసం వెచ్చించిన మొత్తాలు వారి కుటుంబాల్లో చిచ్చురగిలిస్తోంది. 10 రోజుల్లో డిపాజిట్లు రావాల్సి ఉన్నా.. వాస్తవానికి ఏసీబీ ఇస్తున్న చైతన్యపూరితమైన ప్రకటనలతో బాధితులు వలపన్ని లంచమడిగిన అధికారులను పట్టించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు అప్పుచేసి ఆ మొత్తాలను ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన లంచాన్ని ఏసీబీ పది రోజుల్లో కోర్టు డిపాజిట్ నుంచి విడుదల చేయించి ఫిర్యాదుదారుకు ఆ మొత్తం వచ్చేలా చేయాలి. ఇది జరగకపోవడంతో అవినీతి నియంత్రణ కోసం కృషిచేస్తున్న ఉత్సాహవంతులు నీరుగారిపోతున్నారు. అప్పు తెచ్చిన మొత్తాలకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాంగ్మూల లోపమంటున్న ఏసీబీ.. ఇలాంటి కేసుల్లో వలపన్నేందుకు వినియోగించే మొత్తాలను వెనక్కు తేవాలంటే బాధితులు ఇచ్చిన కోర్టు వాంగ్మూలం సరిగ్గా ఉండనికారణంగానే అవి కోర్టులనుంచి విడిపించలేకున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనితో బాధితులు విభేదిస్తూ తాము సక్రమంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నామని అంటున్నారు.ట్రాప్ తర్వాత దర్యాప్తు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కారణాల వల్ల చివరికి నష్టపోయేది ఏసీబీని ఆశ్రయించి సహకరించిన బాధితులే కావడం విశేషం.ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మాత్రం అరెస్టవ్వడం, రిమాండ్‌కు వెళ్లడం, బెయిల్‌పై బయటకు వచ్చి, వీలుంటే మళ్లీ పోస్టింగ్‌లు కూడా పొంది దర్జాగా ఉంటున్నారు. ఫిర్యాదుదారులే దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని కొత్త ఆర్థిక చిక్కుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది బాధితుల చిట్టా.. - భూపాలపల్లి జిల్లాలో అసైన్‌ల్యాండ్ పట్టాకోసం వీఆర్వో జాకీర్ హుస్సేన్ (75)నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించాడు. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. రూ.5వేల కోసం తిరిగి తిరిగి రూ.10వేలు ఖర్చైందని బాధితుడు వాపోతున్నాడు. - ఇదే భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన రఘునా«థాచారి తన భూమి పట్టాకోసం ఆర్డీఓ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 11న ఈ వలపన్నారు. ఇతడికి ఇప్పటివరకు ట్రాప్ మొత్తం తిరిగి రాలేదు. - మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సై కమలాకర్ చార్జిషీట్ దాఖలుకు ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేసి మార్చి10, 2018న ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో మొత్తానిదీ అదే పరిస్థితి. - వరంగల్ నర్సంపేట మండలం ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం జడల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రెవెన్యూ అధికారి మురళి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఫిబ్రవరిలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మురళిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు వెంకటేశ్వర్లు డబ్బు తిరిగి చేతికి రాలేదు. -
అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో జరిగిన నరసాపురం పార్లమెంట్ రివ్యూ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు ముంపుకు గురైన పోలాలను గుర్తించలేదని మండిపడ్డారు. పచ్చ చొక్కాలు కాంట్రాక్టు పనులు చేపట్టడం వల్లనే ఎర్రకాలువకు వరద ముంపు వచ్చిందని విమర్శించారు. డెల్టా మోడ్రనైజేషన్ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పశ్చిమగోదావరి జిల్లా నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నియంతపాలన సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ ఒక ప్రజానాయకునికిపై కేసులు పెట్టడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. లంచమడిగాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఓ కాంట్రాక్టర్ ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెట్టిన సంఘటన ప్రపంచం మొత్తం చూసిందని గుర్తుచేశారు. పచ్చ చొక్కా నాయకులు తమ మాముళ్ల వసూళ్ల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడం శోచనీయం అన్నారు. -
అవినీతి ముద్ర
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి వేళ్లూనుకుంటోంది. రిజిస్ట్రేషన్ మొదలుకొని ఏం కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఈసీలు, సీసీలు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉన్నా ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. చుక్కలు, చిక్కులున్న సెటిల్మెంట్ భూములు, దేవాదాయ, డీకేటీ భూములే లక్ష్యంగా దళారుల చేతివాటంతో తప్పుడు రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖకు రెవెన్యూ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనే ఆరోపణలున్నాయి. చిత్తూరు, సాక్షి: జిల్లాలో తిరుపతి, చిత్తూరుల్లో జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. ఇవి కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 25 ఉన్నాయి. వీటిలో ఎక్కువ అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి మూల విలువపై 6.5 స్టాంపు సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో ఈ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు పెరుగుతున్నాయి. అత్యవసరమైతేæ అడిగినంత ఇస్తేనే పనులవుతాయనే వాదన ప్రజల్లో నాటుకుపోయింది. ఈ కార్యాలయాల నుంచి ఈసీ లు, ఆర్‌హెచ్ నకళ్లు పొందడం పెద్ద సమస్యగా మారుతోంది. చుక్కల భూముల వ్యవహారాన్ని చక్కదిద్దే క్రమంలో రెవెన్యూ అధికారులు మేన్యువల్ ఈసీలు, హక్కు ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా చేశారు. ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సిబ్బందికి అవకాశంగా మారింది. మేన్యువల్ ఈసీ, ఆర్‌హెచ్ నకలు తీసుకోవాలంటే కనీసం రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలతో కూడిన వ్యవహారం కావడంతో సకాలంలో రైతులకు ఈసీలు, ఆర్హెచ్లు సమకూర్చలేకపోతున్నారు. ఈసీకి రూ.520, ఆర్‌హెచ్ కాపీకి రూ.220 వరకు కలిపి వసూలు చేయాల్సి ఉండగా అవసరాల నేపథ్యంలో అడిగినంత ముట్టజె బుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రార్ కుమ్మక్కు పాకాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని పాకాల, పెనుమూరు మండలాల్లో దేవాదాయ, డీకేటీ, సెటిల్మెంట్ భూములు యజమానుల ప్రమేయం లేకుం డానే 1బీ ఆధారంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. దీనికి అధికారపార్టీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల్లో చుక్కలు, డీకేటీ భూములను గుర్తించి రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లకు 1 బీ, అడంగల్‌లో నమోదు చేస్తున్నారు. పత్రాలు లేకుండానే కేవలం 1బీ ఆధారంగానే ఇతరులకు విక్రయ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పెనుమూరు మండలం గుడ్యానంపల్లిలో అధికార పార్టీ నాయకుడు జయరామిరెడ్డి 70 ఎకరాలు డీకేటీ భూమిని బినామీ పేర్లతో ఆక్రమించుకున్నాడు. ఆన్లైన్ చేసుకున్నాడు. జెట్టిగుండ్లపల్లిలో కుంటస్థలాన్ని టీడీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పేరుతో 1బీలో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సరైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో భూ యజమానులు వారి భూములపై పట్టు కోల్పోతున్నారు. ఆఖరుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చిట్ల కంపెనీలతో కుమ్మక్కు.. రిజిస్ట్రేషన్ అధికారులు ప్రైవేటు చిట్ల కంపెనీలతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంస్థల నుంచి ముడుపులు అందుతున్నాయని తెలు స్తోంది. దీనివల్లే ప్రై వేటు చిట్ కంపెనీలు నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నా ఒక్క సంస్థపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం చిట్లను తెరిచేటప్పుడే.. సభ్యుల జాబితా సమర్పించాలి. దీంతో పాటు చిట్లను ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీలు యథేచ్ఛగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా యి. చిట్ నిర్వహణలో ఖాతాదారుడు బయటికి వెళితే.. కొత్త ఖాతా దారుడిని చేర్చుకున్నా రిజిస్ట్రేషన్ శాఖకు తెలియజేయాలి. చిట్ కంపెనీలు ఇలాంటివేవి చేయడం లేదు. దీనిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో చిట్ సంస్థ ఖాతాదారులు నిండా మునిగిపోతున్నారు. పత్రాలతో మాకు పనిలేదు భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో పత్రాలతో మాకు పనిలేదు. కేవలం 1బి చూస్తాం. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎవరి పేరున 1బీలో భూములు ఉంటే వారినే యజమానిగా రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈసీ, ఓసీలు ఉచితంగానే అందిస్తున్నాం. ఎక్కడగాని డబ్బులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్‌లో ఎవరైనా అవినీతికి పాల్పడినా, డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రమేష్‌బాబు, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
బ్యూటిప్స్
ముడతల నివారణకు...అరటిపండు – 1క్యాబేజీ ఆకులు – రెండు కోడిగుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే) తయారి: అరటిపండు ముక్కలుగా కట్ చేయాలి. దీనితో పాటు క్యాబేజీ ఆకుల ను సన్నగా తరగాలి. ఈ రెంటినీ మిక్సర్ లో వేసి పేస్ట్ చేయాలి. దీంట్లో కోడిగుడ్డు తెల్లసొన వేసి కలపాలి. తర్వాత ముఖ మంతా అప్లై చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు తగ్గుతాయి. క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ కావలసినవి: క్యారెట్లు – రెండు (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), క్యాబేజీ తురు ము – టేబుల్ స్పూన్, టొమాటో – 1 తయారి: క్యాబేజీ తురుము, టొమాటో, క్యారెట్ ముక్కలు మిక్సర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి, మూడు చుక్కల తేనెతో కలపాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి మెడకి ఈ పేస్ట్ అప్లై చేయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ కితాబా?
సాక్షి, హైదరాబాద్: బాధ్యత గల ప్రతిపక్షంగా విద్యాశాఖలో వెలుగు చూసిన అవి నీతిని తాము వెలుగులోకి తెస్తే, తప్పును సరిదిద్దుకోకుండా దొంగలకు సద్ది మోసే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. టీచర్ల బదిలీలపట్ల ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తి గురించి తెలుసుకోకుండా అంతా సంతో షంగా ఉన్నారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కితాబివ్వడం తగదని వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, నష్టపోయిన వారందరికీ న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆచార్యకు కూడా లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. విద్యా శాఖలో అవినీతి జరగకపోతే వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత సర్దుబాటు పేరుతో ఓడీలు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చేరకపోతే అక్కడ విద్యార్థులు లేరన్న నెపంతో లెక్చరర్లను ఓడీల పేరిట బదిలీలు చేస్తున్నారని, విద్యార్థుల సంఖ్య, రెగ్యులర్ లెక్చరర్ల సంఖ్య, ఓడిపై ఏ కళాశాల నుండి ఏ కళాశాలకు పంపారన్న వివరాలను బయటపెట్టాలని కోరారు. అంతర్ జిల్లా బదిలీలు నిర్వహిం చి భార్యాభర్తలకు ఊరట కలిగిస్తామని 2016 మే 21న సీఎం ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని, రెండేళ్ల క్రితం ఇచ్చి న జీవోపై మళ్లీ సీఎం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. -
‘నాలుగేళ్లలో 2.49 లక్షల కోట్ల రూపాయల అప్పు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లలో 2 లక్షల 49 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్ననూతన ప్రత్యామ్నాయ మహా గర్జన సభకు సంబంధించిన ప్రచార గీతమాలికను సోమవారం ఆయన అవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యవర్గసభ్యులు శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మహా గర్జనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం అనేక సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, అక్కడి కరువు పరిస్థితులపై మంగళవారం వైఎస్సార్ జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడువి కేవలం ప్రచార ఆర్భాటలు మాత్రమేనని.. వాటి ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిని నిర్మించకుండా ముంబై వెళ్లి బాండ్లను విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాజధానిలో సెంట్ భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మార్చురీలో పోస్టుమార్టంకు కూడా డబ్బులు వసూలు చేసేంతలా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విలయం తాండవం చేస్తుంటే.. చంద్రబాబు డ్యాష్ బోర్డులో అది కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. అది జ్ఞాన భేరి ఎలా అవుతుంది.. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధర్మ పాలన చేస్తూ ధర్మ పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేలాది ఎకరాల భూములు లాక్కొని ఒక్క పరిశ్రమైనా నిర్మించారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసేది నిజమైన పోరాటం కాదని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా విద్యార్థులను అరెస్ట్ చేస్తే అది జ్ఞాన భేరి ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ముంబై వెళ్లి బాండ్ల లిస్టింగ్పైన చూపే శ్రద్ద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీద పెట్టాలని సూచించారు. -
నాడెప్ తొట్లకు అవినీతి తూట్లు
సేంద్రియ ఎరువుల ఉత్పాదనని ప్రోత్సహించేందుకు.. రైతులు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసుకోవాలనే ఉన్నత లక్ష్యంతో స్వచ్ఛభారత్ స్వచ్ఛత్‌లో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్, వాటర్‌షెడ్ శాఖల ద్వారా నిర్మించిన నాడెప్ తోట్లు అవినీతి, అక్రమాలకు పరాకాష్టగా మారాయి. నేతల, అధికారుల అవినీతి, లబ్ధిదారులకు అవగాహన వైఫల్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. నాడెప్ తొట్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లిస్తున్నా... ఎన్ఆర్ఈజీఎస్, వాటర్షెడ్ల శాఖ పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు. కనిగిరి (ప్రకాశం): జిల్లాలోని 56 మండలాల్లో 2016–17 సంవత్సరానికి 47,218 నాడెప్ తోట్లు మంజూరు కాగా ఇప్పటికి 16,664 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు గాను రూ.1657.34 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. అందులో 5,489 ఇన్ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. 2017–18 ఏడాదికి గాను 17,893 మంజూరు కాగా, 5,436 పూర్తయ్యాయి. దీనికి గాను రూ.342.52 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. 3,775 ఇన్ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2016–17లో 7,040 మంజూరు కాగా, 2,283 పూర్తియ్యాయి. వీటికి గాను 221.41 లక్షలు ఖర్చుపెట్టినట్లు నివేదికలున్నాయి. 2017–18లో 2,760 మంజూరు కాగా, 1,088 పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం నాడెప్ తొట్ల నిర్మాణాలు వాటర్‌షెడ్ పరిధిలో జరగ్గా, ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో 70 శాతం పనులు జరిగాయి. ఉపయోగం ఇలా.. 10/6 సైజులో కట్టిన నాడెప్ తొట్టిలో ఒక వరుస చెత్త, దానిపై మరో వరుస పుట్టమట్టి, దాని పేడ వేస్తారు. 40 రోజులు అలా వేస్తే సుమారు రెండున్నర టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. వీటిని పొలాలకు ఎరువులుగా వాడటం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. అయితే దీనిపై ఎక్కడా ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అక్రమం జరుగుతుంది ఇలా.. సన్న, చిన్న కారు రైతులకు, ఎస్సీ, ఎస్టీలకు నాడెప్ తొట్ల నిర్మాణాలకు అర్హులు. ఒక జాబ్ కార్డుకు ఒక నాడెప్ తొట్టిని శాంక్షన్ చేస్తారు. ఒక్కో దానికి (పొడవు 10 అడగులు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 9 ఇంచెల మందంలో గోడ) రూ.10,159లు ఇస్తారు. అందులో రూ.194లను మాత్రమే కూలి పేరుతో నగదు చెల్లింపు ఉంటుంది. మిగతా రూ.9,965లను మెటీరియల్ కాంపోనెంట్ (ఇసుక, ఇటుక, సిమెంట్, వగైరా వస్తువుల కొనుగోలు) కింద చెల్లిస్తారు. వీటిని జాబ్ కార్డ్ హోల్టరే నిర్మించుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల రైతులు నిర్మించుకోలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ సప్లయర్స్ విధానంలో నిర్మించుకునే అవకాశం కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై సప్లయర్స్ పద్ధతిలో 60 శాతంకు పైగా నాడెప్ తొట్ల నిర్మించి అక్రమార్జన చేసినట్లు తెలుస్తోంది. లక్షల్లో అవినీతి.. సప్లయర్స్ విధానాన్ని అసరాగా లక్షల్లో అవినీతి చోటు చేసుకుంటుంది. నాడెప్ తొట్టి శాంక్షన్ పొందిన లబ్ధిదారునికి అధికారులు వర్క్ కమిట్మెంట్ లెటర్ ఇస్తారు. సప్లయర్స్ విధానంలో నాడెప్ తొట్టిని నిర్మించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు విల్లింగ్ లెటర్‌ను లబ్ధిదారుని నుంచి తీసుకుంటారు. ఈ క్రమంలో నాడెప్ తొట్టి నిర్మాణానికి వచ్చే రూ.10,159ని సప్లయర్స్ (కాంట్రాక్టర్) ఖాతాలోకి జమ చేస్తారు. అయితే నాడెప్ తొట్టి నిర్మాణానికి రూ.5 నుంచి రూ.6 వేలు మాత్రమే ఖర్చవుతుంది. మిగిలిన నగదును పర్సంటేజీల ప్రకారం అధికారులు, అధికార పార్టీ నాయకులు (సప్లయర్స్) పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 2016–17లో మొత్తం 2,283 నాడెప్ తొట్లకు రూ.221.41 లక్షలు చెల్లించినట్లు నివేదికలున్నాయి. ఇటీవల జరిగిన సామాజిక తనిఖీల్లో ఆడిట్ బృందం గ్రామాల్లో తిరిగి పరిశీలించగా.. కొన్ని చోట్ల నిర్మాణాలు కనిపించకపోగా.. మరి కొన్ని చోట్ల వాటి ఆనవాళ్లు మాత్రమే కన్పించడం గమనార్హం. -
మెప్మా ..ఇదేంటి చెప్మా..
తిరుపతి తుడా: అవినీతి, అక్రమాలతో ఇప్పటికే అభాసుపాలైన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో వేధింపులకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. అక్క డి అవినీతి జాడ్యాన్ని భరించలేని ఓ మ హిళ ప్రభుత్వం నుంచి మెప్మాకు అందుతున్న నిధులు, జమా ఖర్చు వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగింది. దీంతో ఆ మహిళకు అధికారుల నుంచే కాకుండా అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు మొదలయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 4200 డ్వాక్రా గ్రూపులు ఉండగా, 43 వేల మంది సభ్యులుగా ఉన్నారు. మీనాక్షి సమాఖ్యలో కొర్లగుంట చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన హేమలత సభ్యురాలు. గతంలో ఆర్పీగా పనిచేసేది. అనివార్య కారణాలతో ఏడాది క్రితం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. మెప్మా అధికారుల అక్రమాలు, అవినీతిని భరించలేక బయటపడినట్లు సన్నిహితుల వద్ద ఆవేదనవ్యక్తం చేసేది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి మెప్మాకు ఎలాంటి నిధులు అందుతున్నాయి, ఖర్చుల వివరాల కోసం హేమలత భర్త ఆర్టీఏకు దరఖాస్తు చేశారు. ఫలితంగా ఆమెకు.. కుటుంబానికి వేధింపులు మొదలయ్యాయి. గుట్టు బయటపడుతుందనే.. హేమలత అడిగిన వివరాలను చూసిన అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. సమాచారం బయటకు పొక్కితే మెప్మా గుట్టు బయటపడుతుందని అధికారులు తిరుపతిలోని అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ఆ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ వివరాలు ఎందుకంటూ అధికార పార్టీలో కీలక నాయకుడొకరు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన చెందుతోంది. పలుకుబడి, పరిచయాలతో మిగిలిన మూడు టీఎల్ఎఫ్లో పనిచేస్తున్న కొంతమంది సభ్యుల ద్వారా ఆమెపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. అండగా నిలవాల్సిన తోటి సభ్యులు, అధికార పార్టీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీఏ కింద సమాచారం ఇవ్వకుండా మూడు నెలలుగా కాలయాపన జరుగుతోంది. వేధింపులు పరాకాష్టకు చేరడంతో ఆ మహిళ శనివారం ఈస్టు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మెప్మా.. మెప్మా అధికారులు రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బంధువు ద్వారా పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆర్టీఏ కింద ఆమె అడిగిన సమాచారం ఇస్తే అవినీతి, అక్రమాలు బయటపడతాయని, తమతో పాటు సంఘాల లీడర్ల అవినీతి బాగోతం బయటపడుతుందని మహిళా సంఘాల సభ్యులను రెచ్చగొట్టి ఆమెపైకి ఉసిగొల్పుతున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు మెప్మా కార్యాలయానికి వస్తే చర్చించుకోవచ్చని పీడీ కోరినట్టు తెలుస్తోంది. -
రూ.42.79 కోట్లను మళ్లించేసిన మంత్రి
-
అ'ధన'పు అంతస్తులు
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడలో అనధికార నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా చేపడుతున్నారు. నగర పాలక సంస్థ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే అపార్టుమెంట్లు సైతం కట్టేస్తున్నారు. తీసుకునే ప్లాన్ ఒకటయితే...నిర్మించే భవనం ఇంకో విధంగా ఉంటుంది. ఇందుకు బిల్డర్ల వద్ద టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, వీఎంసీ అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీని వల్లకార్పొరేషన్ ఖజానాకు భారీగానే గండిపడుతోంది. భద్రతా ప్రమాణాలు తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్దంగా అదనపు అంతస్తులు కడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నగరంలో జరుగుతున్న అనధికారిక నిర్మాణాల గురించి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని నేపథ్యంలో విజయవాడలో భవన నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఓ వైపు రాజకీయ నాయకుల ఒత్తిడి మరోవైపు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల చేతివాటంతో నగరంలో అనధికారిక నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 2018 జనవరి నుంచి జూన్ వరకు కేవలం 3 వేల అపార్టుమెంట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. కానీ నగరంలోని దుర్గాపురం, అజిత్‌సింగ్‌నగర్, భవానీపురం, ముత్యాలంపాడు, సత్యనారాయణపురంలో అన«ధికారిక నిర్మాణాలు కోకొల్లలు. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు అపార్టుమెంట్లు నిర్మాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. వేలాది భవనాలు కనీస అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు. నగరంలో అనుమతులు లేని భవనాల వివరాలు కావాలని నగరంలోని ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారంటే అధికారుల ధనదాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో భవన నిర్మాణ అనుమతులపై అవకతవకలు జరిగాయని ఏసీబీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విభాగంపై విచారణ అంటేనే ఏళ్ల తరబడి సాగతీత వ్యవహారంగా మారటంతో ఇక్కడి అధికారులు ఎలాంటి విచారణకు బెదరడం లేదని సమాచారం. కన్పించని సెట్‌బ్యాక్స్ నగరంలో నిర్మాణాలు జరుగుతున్న బహుళ అంతస్తుల భవనాల నుంచి జీప్లస్–3 గృహాల వరకు సెట్‌బ్యాక్స్ వదలటంలేదు. ¿¶ భధ్రత ప్రామాణికంగా ఏర్పాటు చేసిన ఈ విధానానికి బిల్డర్లు తూట్లు పొడుస్తుంటే అధికారులు వంత పాడుతున్నారు. చాలా భవనాలకు సెట్‌బ్యాక్స్ అనేవి ప్రామాణికమైనా అవి నిషిద్ధం అన్నట్లు బిల్డర్లు వ్యవహరిస్తున్నారు. ఇవిగో అక్రమ నిర్మాణాలు.... బీసెంట్‌రోడ్డులో ఎల్ఐసీ భవనం వెంబడి ఓ నిర్మాణం పూర్తి నిబంధనల విరుద్దంగా సాగుతుంది. అనుమతి పొందింది జీప్లస్–3 వరకు మాత్రమే. కానీ స్థానిక కార్పొరేటర్ సహకారంతో అదనపు అంతస్తులు వేసేశారు. ఇందుకు గాను టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి కార్పొరేటర్ వరకు ఆ బిల్డరు రూ. 7 లక్షలు చెల్లించుకున్నట్లు సమాచారం. ఒన్‌టౌన్‌లోని మారుపిళ్ల చిట్టి రోడ్డులో 50 గజాల స్థలంలో జీప్లస్ 5 నిర్మాణం జరిగింది. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవటానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సాహసం చేయకలేకపోతున్నారు. కారణం అక్కడ ఎమ్మెల్యే అండదండలతో నిర్మాణం సాగుతోంది. ఇందుకు ఎమ్మెల్యేకు రూ. 10 లక్షలు చెల్లించినట్లు కార్పొరేషన్లో వినికిడి. కృష్ణలంకలోని పొట్టిశ్రీరాములు జూనియర్ కళాశాల వద్ద ఓ గ్రూప్‌హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు గాను టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అధికారికి రూ. నాలుగులక్షలు అందాయని సమాచారం. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం అనధికారిక నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేశాం. అనధికారిక నిర్మాణాలను నిర్మూలించేందుకు చర్యలు చేపడతున్నాం.బి. లక్ష్మణరావు, సిటీ ప్లానర్ -
అన్న క్యాంటీన్లలోనూ బొజ్జ నింపుకున్నారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల అవినీతి పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటులోనూ కక్కుర్తి పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకోసం సదరు హోటళ్ల యాజమాన్యాల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించారు. మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చే రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. అదేవిధంగా రోగులను చూసేందుకు వచ్చే బంధువుల సౌకర్యార్థం పెద్దాస్పత్రిలోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే, ప్రైవేటు హోటళ్ల యాజమాన్యాలతో అధికార పార్టీ నేతలు చేతులు కలిపారు. కుంటిసాకులు చూపుతూఅన్న క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు. మార్కెట్‌యార్డులో స్థలం లేదని, ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్య వస్తుందనే నెపంతో క్యాంటీన్లు రద్దు చేయించడం గమనార్హం. ఊరికి దూరంగా... ప్రస్తుతం అన్న క్యాంటీన్లు రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఊరికి దూరంగా ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా లేని ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. కర్నూలులో ఏకంగా ఉల్చాల గ్రామానికి వెళ్లే దారిలో వీకర్ సెక్షన్ కాలనీ సమీపాన ఏర్పాటు చేశారు. ఇక్కడికి పెద్దగా వచ్చే వారు కూడా ఉండరు. ఇక కలెక్టర్‌లో క్యాంటీన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉల్చాల దారిలో క్యాంటీన్ నిర్మాణ పనులు సగం కూడా కాకముందే ప్రారంభించిన అధికారులు.. కలెక్టరేట్లో మాత్రం ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తద్వారా ఇక్కడ ప్రైవేటు హోటళ్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలు క్యాంటీన్ల నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడడమే కాకుండా.. వాటి కోసం ప్రాంతాల ఎంపికలోనూ స్వార్థానికి ఒడిగట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన క్యాంటీన్లలో రోజూ చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్నం అయిపోయిందంటూ నిర్వాహకుల నుంచి సమాధానం వస్తోందని వారు పెదవి విరుస్తున్నారు. కమీషన్ల కోసమే.. ప్రైవేటు హోటళ్ల వారు ఇచ్చే కమీషన్ల కోసమే మార్కెట్‌యార్డులో అన్న క్యాంటీన్ రద్దు చేశారు. రైతులు అసలే దూరాభారం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు సరుకు తెస్తున్నారు. ఒక్కోసారి రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. మూడు పూటలా బయట తినాలంటే రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఖర్చు చాలావరకు తగ్గుతుంది. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఏర్పాటు చేయాలి. – ఈరన్న, కోడుమూరు -
ఆర్‌యూలో ఇష్టారాజ్యం
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. మెస్ బిల్లుల గురించి మాట్లాడితే విద్యార్థులు హడలిపోతున్నారు. ఇష్టానుసారం వసూలు చేస్తుండటంతో చెల్లించలేని స్థాయికి బకాయిలు చేరాయి. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండానే కొనుగోళ్ల కమిటీ (పర్చేజ్ కమిటీ) అనామతుగా కొని బిల్లులు చెల్లిస్తోంది. అధికారుల కక్కుర్తి కూడా తోడు కావటంతో విద్యార్థులకు బిల్లుల భారం తడిసి మోపెడవుతోంది. ఒక్క బిల్లులోనే రూ.77 వేలు అదనంగా చెక్ రాయగా.. అది కాస్తా బహిర్గతం కావడంతో క్యాన్సిల్ చేసి మరో చెక్కును సరుకుల సరఫరాదారులకు ఇచ్చారు. బయట పడటం వల్లే దాన్ని క్యాన్సిల్ చేశారు. బయట పడనివి ఎన్నో ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. విద్యార్థులపై ఏటా రూ.10 లక్షల వరకు అదనంగా మెస్ బిల్లుల భారం పడుతోంది. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి సరుకులు, కూరగాయలు, చికెన్, పాలు, తాగునీరు లాంటి వాటిని ఎలాంటి టెండర్లూ లేకుండానే కొనుగోలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు సమయంలో వర్సిటీలోని కొందరు అధికారులకు భారీగా కమీషన్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు సదరు అధికారుల ఇళ్లకు చేరటం పరిపాటిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటకెక్కిన విచారణ.. గత విద్యా సంవత్సరం హాస్టళ్లకు ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిలో భారీగా అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ విద్యా సంవత్సరం ప్రొవిజన్స్, కూరగాయల సరఫరాకు టెండర్లు పిలిచారు. ప్రొవిజన్స్ సరఫరాకు కాంట్రాక్టర్ ముందుకొచ్చారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యమైన సరుకులు సరఫరా చేయటం లేదని, తూకాల్లో వ్యత్యాసం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కూరగాయల సరఫరాకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో గత ఏడాది మాదిరిగానే కొనుగోలు చేస్తున్నారు. తడిసి మోపెడవుతున్న మెస్ బిల్లులు రాయలసీమ విశ్వవిద్యాలయంలో మూడు మెన్ హాస్టళ్లు, రెండు ఉమెన్ హాస్టళ్లు ఉన్నాయి. గత ఏడాది 330 మంది విద్యార్థులు, 335 మంది విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది. కూరగాయలు, పాలు, చికెన్ తదితర వాటికి రూ.5.50 లక్షల వరకు అవుతుంది. అబ్బాయిలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,200, అమ్మాయిలకు రూ.1,700 వరకు బిల్లు వస్తోంది. కోర్సు, కేటగిరిని బట్టి వారికి స్కాలర్షిప్ ఏడాదికి రూ.5,400 నుంచి రూ.7,000 వరకు వస్తోంది. మిగతా మొత్తం చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరకు సరుకులు, కూరగాయలు సరఫరా చేసే వారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల భారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. నిబంధనల ప్రకారం హాస్టళ్లను నిర్వహిస్తే ఏడాదికి రూ.10 లక్షల వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. విచారణ కమిటీ వేశాం హాస్టళ్లలో అవినీతిపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించాం. ఈ నెల 24లోగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలి. హాస్టళ్లలో అవినీతి జరిగిందని విద్యార్థులు ఆందోళనలు చేపట్టడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారు. వారి వినతి మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ప్రొవిజన్స్ కాంట్రాక్టర్ సరిగా సరఫరా చేయటం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ అమర్నాథ్, రిజిస్ట్రార్, ఆర్యూ నివేదిక ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఆర్యూ హాస్టళ్ల నిర్వహణలో రూ.లక్షల్లో అవినీతి జరిగింది. దీనిపై నియమించిన విచా రణ కమిటీ నివేదికను ఇంతవరకు ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కమిటీలు నామమాత్రంగా వేస్తున్నారు కానీ విచారణ పక్కాగా జరగటం లేదు. విద్యార్థులకు రూ.వేలల్లో మెస్ బిల్లులు వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవటంతో ఇలా జరుగుతోంది. అధికారులు స్పందించి ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారం నిర్వహిస్తే ఎలాంటి అక్రమాలూ జరగవు. – సూర్య, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమిటీలు కాగితాలకే పరిమితం వర్సిటీలో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. హాస్టళ్లలో అవినీతిపై కమిటీని నియమించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీన్ని బట్టి చూస్తే అధికారులు అందరూ కుమ్మక్కు అయినట్లు అర్థమవుతోంది. విచారణ చేపట్టి వాస్తవాలు బయటికి తీస్తే విద్యార్థుల్లో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి. వర్సిటీ అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి నిజాలను బయట పెట్టాలి. లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతాం. – శ్రీరాములు, ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ -
రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోంది
యర్రగొండపాలెం (ప్రకాశం): రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోందని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎపాలెం నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. సోమవారం స్థానిక మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కళాశాల భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఒక తరగతి గదిలో అడ్డంగా పరదాలు కట్టుకొని రెండు తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కేవలం లంచం ఇవ్వడం లేదని కాంట్రాక్టర్‌కు సకాలంలో డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వ పెద్దలు జాప్యం చేస్తున్నారని వివరించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు తమకు తెలిసిందని విద్యార్థులు పేర్కొన్నారు. కమీషన్ల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని, గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భవనాల నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆందోళన చేపట్టినప్పటికీ సమస్యలు సర్కారు చెవికి ఎక్కవని, విద్యార్థులు చేసే కార్యక్రమాల్లో తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు. 2008లో మార్కాపురం ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి ఈ ప్రాంత సమస్యలను సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. యర్రగొండపాలెం ప్రాంతంలో విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరడంతో స్పందించిన వైఎస్సార్ మోడల్ డిగ్రీ కళశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తాను కళాశాల భవనాల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నానన్నారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవిధంగా తాను కృషి చేస్తానని చెప్పారు. ముందుగా జూనియర్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న మోడల్ డిగ్రీ కళాశాల తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏపీ ఎంహెచ్ఐడీసీ ఎండీతో ఫోన్లో కళాశాల భవనాల నిర్మాణం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొంతా కిరణ్‌గౌడ్, ఎస్కే జబీవుల్లా, యవజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కె.ఓబులరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎన్.వెంకటరెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎ.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల పేరుతో లూటీ
యర్రగొండపాలెం (ప్రకాశం): ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులు కాజేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి గతనెలలో బాక్సు టెండర్లను టీడీపీ వర్గీయులతో వేయించి ఇప్పుడిప్పుడే ఆ పనులకుగాను అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. సహజంగా రోడ్లు, భవనాల శాఖ రూ.1 లక్ష పనులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూ.5 లక్షల మేరకు పనులకు ఆన్లైన్ టెండర్లను వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా జిల్లాలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు. కోట్లాది రూపాయల ప్రజల సొత్తును టీడీపీ నాయకులకు కట్టబెట్టడానికి బాక్సు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పనులకు గాను టెండర్లు మరో విధంగా వేశారు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తన అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్‌ను తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ వర్గీయులకే అందేలా చర్యలు తీసుకున్నారు. అందుకుగాను టెండరు దక్కించుకున్న టీడీపీ నేత ఆయనకు 10 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే నిబంధనలను పూర్తిగా వ్యతిరేకించిన వారవుతారన్న ఉద్దేశంతో మరో ఫాల్ట్ టెండర్‌ను వేయించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు : ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే, ఎస్‌ఎన్‌పాడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయ అభివృద్ధి పథకం కింద మంజూరైన ఈ పనులు 100 ఎకరాలకుపైబడి ఉన్న చెరువులలో మాత్రమే చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొ దటి విడత కింద 3 చెరువులకు రూ.7.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పెద్దదోర్నాల మండలంలోని వై.చెర్లోపల్లి చెరువు అభివృద్ధికి రూ 3.70 కోట్లు, పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె చెరువుకు రూ.2.50 కోట్లు, దేవరాజుగట్టు, పెద్దారవీడు చెరువులకు ఒకే ప్యాకేజి కింద రూ.1.50 కోట్లు ప్రకారం మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేయటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు పోటీపడ్డారు. అయితే తనకు అత్యంత సన్నిహింతంగా ఉండేవారితో మాత్రమే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఈ టెండర్లు వేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పనంగా ప్రజల సొత్తును కాజేయటానికి అధికార పార్టీకి చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాలో చెరువులకు రూ.37 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలువాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బాక్సు టెండర్లను పిలవడం శోచనీయం. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెరువులకు మంజూరైన రూ.7.70 కోట్ల పనులకు సింగిల్ టెండర్లు మాత్రమే వేయించుకున్నారు. కంటి తుడుపుగా మరొకరితో తప్పుడు టెండరు వేయించారు. షెడ్యూల్ కూడా టీడీపీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అగ్రిమెంట్లు జరగకుండా రాష్ట్ర నీటిపారుదల మంత్రి, చీఫ్ ఇంజినీరు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్లపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 100 ఎకరాలలోపు ఉన్న చెరువులలో నీరు – చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు కాజేశారు. చెరువులను ఆడ్డంగా పెట్టుకొని టీడీపీ జేబులు నింపుకుంటున్నారు. -
అ‘ధర్మ’కర్త మండలి !
సాక్షి,విజయవాడ : ఎన్నో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గ గుడి పాలక మండలి అవసరమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరను కాజేయడంతో కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి ప్రభుత్వం తొలగించింది. పదవి కోల్పోయిన సూర్యలత పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యుడు వెలగపూడి శంకరబాబు పై ఆరోపణలు చేశారు. వెలగపూడి శంకరబాబు ఐదుగురు ఓపీడీఎస్ మహిళల్ని వేధించారని, దీనిపై వారు ఫిర్యాదు చేసినా చైర్మన్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన పాలకమండలి సభ్యుడు దేవస్థానంలో పనిచేసే మహిళా సెక్యురిటీ సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేశారనే విషయం ఇంద్రకీలాద్రి పై చర్చనీయాశంగా మారింది. చైర్మన్ దేవస్థానంలో సెక్యురిటీ టెండర్లను పారదర్శకంగా పాటించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పాలకమండలిలో ఉన్న మరొక సభ్యుడుకు నేర చరిత్ర ఉంది. అవినీతికి ఆలవాలమైన కమిటీ... దుర్గగుడి పాలకమండలి అవినీతికి ఆలవాలంగా మారింది. పాలకమండలి సభ్యులకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉండటంతో అధికారులు, సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే 14 నెలలు గడిచిపోవడంతో ఉన్న కొద్దికాలంలో సాధ్యమైనంత రాబట్టేందుకు కొంతమంది పాలకమండలి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేయాల్సిన పనులు వదిలివేసి... పాలకమండలి సభ్యుడు దేవస్థానం ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి. తమ పరపతిని ఉపయోగించి దేవస్థానానికి విరాళాలు వచ్చేటట్లు చేయాలి. అయితే ఏడాది గడిచిన పెద్దగా విరాళాలు తెచ్చిన దాఖాలు లేవు. తమ పరపతిని ఉపయోగించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్డడం లేదు. ఇక అధికారులకు మంచి సూచనలేమైనా చేశారంటే అదీ కనపడదు. భక్తులపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నాలు కూడా ఏమీ కపడవు. భక్తిభావం లేని ఇటువంటి పాలకమండలి ఎంతమేరకు అవసరమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
‘ప’రేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాక్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల వరకు అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సిబ్బంది, మరోవైపు డీలర్లు ‘రేషన్’ కొల్లగొడుతున్నారు. పేదల పొట్టకొడుతూ బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా..పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇటు పౌరసరఫరాల శాఖ గానీ, అటు తూనికలు, కొలతల శాఖ గానీ శ్రద్ధ చూపకపోవడంతో కార్డుదారులు నష్టపోతున్నారు. రసీదులేవీ?: చౌక దుకాణంలో సరుకులు తీసుకునే కార్డుదారులకు ఈ–పాస్ మిషన్ నుంచి వచ్చే రసీదులను విధిగా ఇవ్వాలి. జిల్లాలో 2,436 చౌక దుకాణాలు ఉండగా.. ఏ ఒక్క దాంట్లోనూ రసీదులు ఇస్తున్న దాఖలాలు లేవు. రసీదులు ఇస్తే తమ అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతో డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ తూకం తక్కువ ఇస్తూ కార్డుదారులను దగా చేయడం డీలర్లకు పరిపాటిగా మారింది. ఈ మోసాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖపై ఉంది. అయితే.. ఈ శాఖ టార్గెట్‌కు అనుగుణంగా కేసులు నమోదు చేసి..చేతులు దులిపేసుకుంటోంది. స్టాక్ పాయింట్ల నుంచే అక్రమాలు.. అక్రమాల పర్వం స్టాక్ పాయింట్ల నుంచే మొదలవుతోంది. నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేసి డీలర్లకు సరుకులివ్వాలి. జిల్లాలోని ఏ స్టాక్ పాయింట్లోనూ ఇలా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. స్టాక్ పాయింట్లలోనే క్వింటాల్‌కు ఐదు కిలోల వరకు కోత కోసి బియ్యం ఇస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని డీలర్లు మరింత చెలరేగిపోతున్నారు. తూకంలో రెండు కిలోల డబ్బా వాడుతూ.. దాని బరువు మేర బియ్యం కాజేస్తున్నారు. 25 కిలోల బియ్యం ఇవ్వాలంటే రెండుసార్లు తూకం వేయాలి. అంటే 25 కిలోల బియ్యంలో డీలర్లు నాలుగు కిలోల వరకు కాజేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంత్యోదయ కార్డులకు విధిగా 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. అనేక మంది డీలర్లు 30 నుంచి 32 కిలోల వరకే ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 50 వేల క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నెల నుంచి కార్డుకు రెండు కిలోల ప్రకారం ఇస్తున్న జొన్నలకు డిమాండ్ ఉంది. అయితే.. బియ్యంలో రెండు కిలోలు తగ్గించి.. ఆ మేర జొన్నలు ఇవ్వడంపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే ప్యాక్ చేసి.. బియ్యం, చక్కెర, జొన్నలు తదితర సరుకులను విధిగా కార్డుదారుల ముందే తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. కానీ డీలర్లు చక్కెరను ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకొని ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 500 గ్రాములకు 100 గ్రాముల చొప్పున కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముందుగా తూకం వేసిన సరుకులను తీసుకోరాదని, తమ సమక్షంలోనే తూకం వేయించుకోవాలనే విషయంపై కార్డుదారులకు అవగాహన కల్పించే చర్యలు కరువయ్యాయి. డీలర్లు సేవల్లో నాణ్యత పాటించకపోయినా, రసీదు ఇవ్వకపోయినా, అనుచితంగా ప్రవర్తించినా 1100కు లేదా 1800114000 నంబరుకు ఫోన్ చేయవచ్చన్న విషయం కార్డుదారులెవరికీ తెలియదు. యాక్టివ్‌లోకి తెచ్చుకోవడానికి తంటాలు రేషన్‌కార్డు ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటుందో, ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌లోకి పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లోకి వెళితే.. దాన్ని యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే కార్డుదారులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలని, ఈకేవైసీ వేసి ఉండాలనే నిబంధన పెట్టారు. నాలుగైదు నెలల క్రితం ఒక్క కర్నూలు నగరంలోనే 8,200 కార్డులను ఇన్‌యాక్టివ్‌లో పెట్టారు. కార్డుదారులు ప్రతి నెలా సరుకులు తీసుకుంటున్నా.. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లో పెట్టడంతో బాధితుల ఆందోళన అంతాఇంతా కాదు. యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్డుదారులు అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ దాదాపు ఐదువేల మందికి సమస్య పరిష్కారం కావడం లేదు. -
అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు అగ్గిపెట్టెలను తలపిస్తున్నాయి. ఎన్నికల ముందు సొంత ఇళ్లు లేని కుటుంబానికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి షీర్వాల్ టెక్నాలజీ అంటూ గొప్పలు చెబుతూ జీప్లస్ త్రీ అంతస్తులతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేవలం సెంటు స్థలానికి తక్కువగా ఉన్న విస్తీర్ణంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారు. కడప కార్పొరేషన్ : పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై) కింద అపార్ట్మెంట్ పద్దతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టుతీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్‌వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే నిర్మించే ఇళ్లకు ఎంత వరకు మన్నిక ఉంటుందనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. సాధారణంగా ఇక్కడ చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు, ఆపార్ట్‌మెంట్లకైతే 16ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్టీఆర్ హౌసింగ్‌కు మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మిస్తున్నారు. 8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్ 3 ఆపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. స్లాబ్ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తున్నారు. ఇంత బరువును ఈ నాలుగు ఇంచ్ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయో భగవంతుడికే ఎరుక. షియర్ వాల్ టెక్నాలజీతో కట్టే ఇళ్లు సముద్రంలోనూ, భూకంపాలు వచ్చినా చెక్కుచెదరవని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏ ఇంటికైనా స్లాబ్ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్ చేయాల్సిఉంది. ఇక్కడ మొత్తంసిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా నిర్మించాలనే తలంపుతో కార్మికులకు షిఫ్టు పద్దతి లేకుండా రేయింబవళ్లు పనిచేయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరికి కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలోనూ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరుగుదొడ్డి పక్కనే వంటగది ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు సబ్సిడీ ఇస్తాయి.300 చదరపు అడుగులు (రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు) వంటి మూడు కేటగిరిలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈమొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపంలో చెల్లిం చాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్ బెడ్రూమ్ కాగా, మూడో కేటగిరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. డబుల్బెడ్రూమ్ ఇళ్లలో ఎడమ వైపు ఉన్న ఇళ్లకు బెడ్రూమ్కు వంటగదికి మధ్య బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం మైనస్‌గా చెప్పవచ్చు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్టీఆర్ హౌసింగ్ డిజైన్లలో ఇది ఏవిధంగా చేర్చారో అర్థం కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏపీ టిడ్కో ఆధికారులను అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిజైన్ వాడుతున్నారని చెప్పడం గమనార్హం. మూడు కేటగిరీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సకాలంలో పూర్తయ్యేనా...! రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద మూడు దశల్లో నిర్మించనున్న 19,232 ఇళ్లు సకాలంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. మొదటి దశలో మొత్తం 4092 నిర్మించనుండగా కడపలో 2,092 ఇళ్లు, ప్రొద్దుటూరులో 2,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కడపలో ఒక బ్లాక్‌లో 32 ఇళ్ల చొప్పున మొత్తం 63 బ్లాకుల్లో 2,016 ఇళ్లు నిర్మించాలి. అయితే ఇందులో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉన్నాయి. మిగిలిన 24 బ్లాకుల్లో సాగుతుండగా 630 ఇళ్లు పూర్తయ్యాయి. 300 ఇళ్లను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, బద్వేల్లో ఈ స్కీం ఇంకా మొదలు కాలేదు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. రెండవ దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. అయితే రెండు, మూడు దశల్లో నిర్మించే 15,140 ఇళ్లు డిసెంబర్, మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కోర్టు కేసులు, భూసేకరణ సమస్యల వల్ల ఎన్నికలు రాబోతున్న ఈ నాలుగైదు మాసాల్లో అవి పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇళ్లు నిర్మించినచోట రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఎçప్పటిలోగా కల్పిస్తారో వేచిచూడాల్సిందే. నాణ్యతలో సందేహాలు అక్కర్లేదు: ఈఈ ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతలో ఎలాంటి అక్కర్లేదని ఏపీటిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లీలా క్రిష్ణ ప్రసాద్ అన్నారు. క్యూరింగ్ బాగానే చేస్తున్నామని, క్వాలిటీ తనిఖీ చేయడానికి ప్రత్యేక విభాగం ఉందని చెప్పారు. వారు ఎప్పటికప్పుడు నాణ్యతను తనిఖీ చేస్తుంటారని, కడ్డీలు సన్నగా ఉన్నా ఎక్కువ కడ్డీలు వేస్తున్నందున ఇళ్లకు బలం వస్తుందని, ఎన్ని ఏళ్లయినా చెక్కుచెదరవని చెప్పారు. -
పైసలా.. పట్టుచీరా!
ధర్మవరం హౌసింగ్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. చేయి తడిపితేనే పేదలు నిర్మించుకునే ఇళ్లకు బిల్లులు మంజూరవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు దళారులుగా మారి జియోట్యాగింగ్ చేయాలంటే ఒక రేటు, బిల్లు మంజూరైతే మరో రేటంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పిన వారికే బిల్లులు మంజూరు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు డబ్బు ముట్టజెబుతున్నారు. ధర్మవరం టౌన్ : నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ ఫర్ ఆల్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ పథకాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలో 2016–17వ సంవత్సరానికి సంభందించి 1,400 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 2,400 ఇళ్లు మంజూరయ్యాయి. అలానే ధర్మవరం మండలం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు 2016–17లో 1,250 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 1,100 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.2.50 లక్షలను ప్రభుత్వం ఇస్తోంది. అంతులేని అవినీతి ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారునికి బేస్మెంట్, రూఫ్‌లెవల్, టాప్‌లెవల్, ఇంటినిర్మాణం పూర్తి అనే నాలుగు దశలలో బిల్లును చెల్లిస్తారు. ఇందుకోసం హౌసింగ్ అధికారులు ఒక్కో దశలో జియోట్యాగింగ్ చేసి బిల్లులు ఆన్లైన్లో నమోదు చేస్తే... నేరుగా అమరావతి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. అయితే లంచాలకు అలవాటు పడిన హౌసింగ్ అధికారులు చేయితడపందే బిల్లులు ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. అంతేకాకుండా ఇలా డబ్బు వసూళ్ల కోసం అధికార పార్టీకి చెందిన వారినే దళారులుగా నియమించారు. ధర్మవరం నియోజకవర్గంలోని లబ్ధిదారుడు ఎవరైనా సరే... జియోట్యాగింగ్ చేసి బిల్లు ఆన్లైన్ చేయాలంటే... ముందుగా అధికార పార్టీకి చెందిన దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉంది. వీరి ద్వారా ఒకసారి జియోట్యాగింగ్ చేస్తే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులివ్వకపోతే నెలలు గడచినా జియోట్యాగింగ్ చేసేందుకు అధికారులు రావడం లేదనీ...అందువల్లే తప్పనిసరి పరిస్థితులలో లంచం ఇస్తున్నామని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. మరోవైపు ఇళ్లు మంజూరు కావాలంటే ముందుగానే రూ.20 వేలు చెల్లించాలని చాలా చోట్ల దళారులు, అధికారులు దోపిడీ చేస్తున్నట్లు సమాచారం. పట్టుచీరల ఇవ్వాలని డిమాండ్ పట్టణంలోని శివానగర్, కేశవనగర్, శాంతినగర్, చంద్రబాబు నగర్ తదితర చేనేతలు అత్యధికంగా> నివశించే ప్రాంతాల్లో హౌసింగ్ అధికారులు దళారుల చేత పట్టుచీరల కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా చాలామంది చేనేత కార్మికులు తాము కష్టపడి నేసిన పట్టుచీరలను హౌసింగ్ కార్యాలయంలో ఓ అధికారినికి ఇచ్చి బిల్లులు పొందామని వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వస్తుందన్న భరోసాతో ఇళ్లు నిర్మిస్తే..లంచాలకే అది సరిపోతోందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. అధికారుల బాధ్యతా రాహిత్యం ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 200 మంది లబ్ధిదారులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లును అధికారులు రెండుసార్లు ఖాతాల్లో జమ చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అధికారులు బ్యాంకుల వద్దకు వెళ్లి లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. దీంతో వాస్తవంగా ఆస్థానంలో బిల్లులు పొందాల్సిన వారు సకాలంలో బిల్లు అందక ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలానే పట్టణంలోని శివానగర్‌లో ఒక వ్యక్తి ఇంటిని రెండు సార్లు జియోట్యాగింగ్ చేసి బిల్లును పొందారు. ఈ విషమం హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ పరిగణించిన వారు బిల్లులు చెల్లించిన ఖాతాలను ఫ్రీజ్ చేసి నగదును రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అవినీతిని ఉపేక్షించం ఇళ్ల లబ్ధిదారులు జియోట్యాగింగ్, బిల్లులు చెల్లింపులకు ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన ఆవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక సమస్యతో ఇటీవల కొంతమంది లబ్ధిదారులకు బిల్లు రెండుసార్లు ఖాతాలో జమ అయ్యింది. వెంటనే లబ్ధిదారుల ఖాతా నుంచి నగదును రికవరీ చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తాం. –చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ, ధర్మవరం -
కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెసోళ్లు లుచ్చగాళ్లంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఫైర్ అయ్యారు. కరీంనగర్లో రూ.231 కోట్లతో చేపడుతున్న స్మార్ట్‌సిటీ రోడ్ల పనులను, రూ.5కే భోజనం పథకాన్ని, కోర్టు జంక్షన్లో అందంగా రూపొందించిన కూడలిని బుధవారం ప్రారంభించారు. అనంతరం సర్కస్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోకి కొత్త బిచ్చగాళ్లొచ్చారంటూ.. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చి నట్లు ఎన్నికలు దగ్గర పడుతుండగానే ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చారని విమర్శించారు. గంగిరెద్దులోళ్లు మంచోళ్లంటూనే.. కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లంటూ మండిపడ్డారు. నాలుగేళ్లుగా గ్రామాల్లో మొఖం చూపలేని.. తెలివిలేని దద్దమ్మలు ఇప్పుడొచ్చి ‘తిమ్మి ని బమ్మిని’చేసే మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వ లేని కాంగ్రెస్ నేతలు ప్రజలపై కపట ప్రేమను ఒలక బోస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఖతం.. సొంత నియోజకవర్గంలోని అమేథీ మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాడంటే హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఎస్పీ, సమాజ్‌వాది దయ తో గెలిచిన రాహుల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భూస్థాపితమవుతోందని విమర్శించారు. అందుకు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో సైతం కాంగ్రెస్ ఖతమవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో రాహుల్ శిష్య బృందానికి శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కరెప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కరెప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ అని.. అలాం టి వారు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ అంటేనే దోపిడీ అంటూ రాహుల్ తిమ్మిని బమ్మిని చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారని, 60 ఏళ్లు దగాపడ్డ తెలంగాణకు మాత్రం ఏమీ ఇవ్వ మని చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రిజర్వాయర్ లేకుండా 160 టీఎంసీల నీటిని కేవలం పంపింగ్ ద్వారా ఎత్తిపోయడం సాధ్యం కాదని, నీటి నిలువ సామర్థ్యం పెంచితే, కరువు సమయంలో కూడా నీళ్లను అందించేలా రీడిజైన్లు చేపట్టామని వివరించారు. రాహుల్ గన్‌పార్కుకు వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం విడ్డూరంగా ఉందన్నారు. 1969 ఉద్యమంలో ఇందిరాగాంధీ హయాంలో 369 మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. గన్‌పార్కు ఎందుకు కట్టారో కూడా రాహుల్‌కు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి చేసి చూపించాం: ఈటల 56 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కురుచ పార్టీల నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు టీఆర్ఎస్పై ప్రేమ ఆశీర్వాదం ఉందని, కాం గ్రెస్ వాళ్ల కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలి బీమా ప్రయోజనం సిరిసిల్ల జిల్లాలో రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేత సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకంలో తొలి ప్రయోజనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇద్దరు రైతుల కుటుంబాలకు దక్కింది. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి కేటీఆర్ రెండ్రోజుల క్రితం మృతి చెందిన కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన జాప పోషయ్య (50), చందుర్తి మండలం మూడపల్లికి చెందిన రాచర్ల బూదమ్మ(42) కుటుంబ సభ్యులకు ప్రొసీడింగ్ కాపీలు అందించారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే ప్రీమి యం చెల్లించి బీమా చేయించిందని కేటీఆర్ తెలిపారు. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎల్ఐసీ ద్వారా ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు చనిపోయిన 24 గంటల్లోగా బీమా సాయాన్ని అందించడం రాష్ట్రంలో తొలిసారి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డి.కృష్ణభాస్కర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్నారు. -
అవినీతి కొండ.. వెంగమాంబ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవంగా చెల్లించాల్సిన జీతాలు కంటే.. అధికంగా చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద అభిమానం చాటుకుంది. వర్సిటీ ప్రధాన ఖాతా నుంచి నిధులు ఏజెన్సీ నిర్వాహకుడి ఖాతాలో అధికంగా జమ చేసింది. ఈ అవినీతి అక్రమాల వ్యవహారాన్ని ప్రొఫెసర్ల కమిటీ నిర్ధారించింది. ఎస్కేయూ: ఎస్కే యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న వెంగమాంబ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అప్పగించిన విధానం, జీతాలు చెల్లింపు, విధివిధానాలు, నియమ నిబంధనలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేయడానికి పాలకమండలి ఉప కమిటీని 2017 మార్చి 8న నియమించారు. ఈ ఉపకమిటీలో ప్రొఫెసర్ బి.ఫణీశ్వరరాజు, ప్రొఫెసర్ ఎ.మల్లికార్జునరెడ్డి, ప్రొఫెసర్ జి.శ్రీధర్ (మాజీ రెక్టార్) సభ్యులుగా ఉన్నారు. 2015 ఆగస్టు 10 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు వెంగమాంబ ఏజెన్సీకి జమ చేసిన జీత మొత్తాల వివరాలను కమిటీ అధ్యయనం చేసింది. ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు సరైనవేనా అనే అంశంపై కమిటీ ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలను సందర్శించి మరీ పరిశీలించింది. సమగ్రంగా అధ్యయనం చేసిన కమిటీ అదే ఏడాది మార్చి 18న నివేదిక సమర్పించింది. ఇందులో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాల క్లెయిమ్ బిల్లులు, కమిటీ సిఫార్సులను పొందుపరిచింది. బోగస్ సంస్థల పేరుతో గోల్మాల్ ఏదైనా ఏజెన్సీ టెండర్ దక్కించుకోవాలంటే కచ్చితంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకోవాలి. కానీ వెంగమాంబ ఏజెన్సీ చట్టబద్ధత లేని సంస్థ అని కమిటీ స్పష్టం చేసింది. ఆరు కొటేషన్లను ప్రధానంగా తీసుకుని అందులో ప్రామాణికతలు గల ఏజెన్సీ సంస్థకు అప్పగించాలి. కానీ ఆరు కొటేషన్లు తిరుపతికి చెందిన ఏ మాత్రం చట్టబద్ధత లేని కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి ఏజెన్సీ దక్కించుకుందని కమిటీ చివాట్లు పెట్టింది. మొదట 40 మంది ఉద్యోగులు అవసరమని టెండర్ ఖరారు చేసుకుని.. తర్వాత ఉద్యోగుల సంఖ్యను 69కు పెంచారు. జీతాల చెల్లింపుకు సంబంధించి జీఓ 43, జీఓ 151లను పాటించలేదు. ప్రభుత్వ సంస్థలు, వర్సిటీల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జీతాల చెల్లింపునకు ఈ జీఓల ప్రకారం తప్పనిసరిగా విధివిధానాలు పాటించాలి. కేవలం అవగాహన ఒప్పందంలో పొందుపరిచిన అంశాల ప్రకారం జీతాల చెల్లింపు అడ్డుగోలుగా జరిగాయని కమిటీ ఏకరువు పెట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏజెన్సీ నిర్వాహకుడికి భారీగా లబ్ధి చేకూరింది. కమిటీ సిఫార్సులే పట్టించుకోలేదు.. ‘ఏజెన్సీ నిర్వాహకుడి వ్యవహారం అప్పటికే వివాదాస్పదం కావడంతో కమిటీ నివేదిక ఇచ్చే ముందు ఆరు నెలల జీతాలు చెల్లింపు చేయలేదు. దీంతో ఏజెన్సీకి ఇవ్వాల్సిన రూ.30.54 లక్షలు జీతాలు నిలిపివేయండి. వాస్తవానికి ఏజెన్సీకి అవగాహన ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.75,25,554. కానీ రూ.81,89,278 చెల్లించారు. ఉదారంగా రూ. 6,63,724 అదనంగా చెల్లించారు (కమిటీ నివేదిక ఇచ్చిన కాలం వరకే ). ఇంకా రూ.30.54 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నుంచి అధికంగా చెల్లించిన రూ. 6,63,724 రికవరీ చేయాలి. అనంతరం తక్కిన మొత్తాన్ని ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించండి’ అని కమిటీ స్పష్టం చేసింది. కానీ ఒక్క నయాపైసా రికవరీ చేయలేదు. కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, నివేదిక సమగ్రంగా ఇచ్చినప్పటికీ, ఏకంగా రూ.30,54,000ను ఏజెన్సీ నిర్వాహకుడికి చెల్లించేసి తమ ఉదారతను చాటుకున్నారు. నివేదికపై పాలకమండలిలో చర్చేదీ? ‘ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ చందాను ప్రతి నెలా ఏజెన్సీ నిర్వాకుడు జమ చేయలేదు. ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేసిన పీఎఫ్ మొత్తం రూ.6,82,201, ఈఎస్ఐ చందా కింద ఉద్యోగులకు దక్కాల్సిన మొత్తం రూ.2,70,038. పీఎఫ్, ఈఎస్ఐ మొత్తంతో పాటుగా వర్సిటీ అదనంగా చెల్లించిన రూ.6,63,724ను రికవరీ చేయండి. పీఎఫ్, ఈఎస్ఐ చందాలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయండి. వర్సిటీకి రావాల్సిన అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన రూ.30.54 లక్షల్లో రికవరీ చేయాల’ని ఉప కమిటీ స్పష్టం చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ నివేదికపై పాలకమండలి సమావేశంలో చర్చించలేదు. నివేదికను తొక్కిపెట్టి మౌనం వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లించాల్సిన మొత్తం రూ.30.54 లక్షలు చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద ఒక క్రిమినల్ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. -
పిల్లల బియ్యం మెక్కేశారు...!
సాక్షి ప్రతినిధి కడప: పాఠశాలలో విద్యార్థులకు వండిపెట్టాల్సిన 60 బస్తాల బియ్యం అక్కడి అధికారి ‘స్థానిక’ సిబ్బందితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కున మింగేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమను ప్రశ్నించేవారు లేరనుకున్నారో.. లేక గతంలో బోలెడు అవినీతి చేసినా ఎవరూ కనుగొనలేకపోయారనుకున్నారో తెలియదు కానీ, ఈసారి బడి పిల్లల బియ్యానికే ఎసరు పెట్టి ఏకంగా 60 బస్తాలను మాయం చేశారు. మునుపటి ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేసి కొత్త ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ అవినీతి ఒక్కసారిగా వెలుగు చూడడంతో బియ్యం బకాసురులు ఉలిక్కి పడుతున్నారు. కొండాపురం జిల్లా ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్నబోజన పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ఈ పాఠశాలలో నెలకు 18 నుంచి 20 బస్తాలు బియ్యం ఖర్చు అవుతాయి. విద్యార్థుల హాజరు ప్రకారం అక్కడ ఖర్చు అయిన బియ్యం కంటే 2017–18 విద్యా సంవత్సరంలో 60 బస్తాలు అదనంగా పంపించినట్లు రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 23 నాటికి ఆపాఠశాలలో 30 క్వింటాళ్లు నిల్వ ఉండాలి. వాస్తవంలో ఒక్క క్వింటా కూడా మిగులులో లేదు. బాగోతం వెలుగు చూసిందిలా.. గతంలో బియ్యం గోల్మాల్ వ్యవహారం మూడో కంటికి తెలియకుండా ముగిసేది. ఈపరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్య మే31న పదవీ విరమణ చేశారు. తదుపరి సీనియర్ ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించే సమయంలో బియ్యం వ్యవహారం వెలుగుచూసింది. రికార్డు ప్రకారం తనకు 60 బస్తాలు నిల్వ చూపిస్తే తప్పా పూర్తి బాధ్యతలు తీసుకోలేనని గట్టిగా చెప్పడంతో అటు పూర్వపు ప్రధానోపాధ్యాయుడిని మందలించలేక, ప్రస్తుత ప్రధానోపా«ధ్యాయుడికి నచ్చజెప్పలేక అధికారులు తలపట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ‘స్థానిక’ సిబ్బందిపైనా అనుమానాలు.. ఈస్వాహా పర్వంలో పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్యతోపాటు స్థానికంగా ఉన్న కొందరు బోధన, బోధనేతర సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు ప్రధానోపాధ్యాయుడి అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవ్వరికీ చేతనైనన్ని మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈపాపంలో తనకు భాగం ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు అక్రమార్కులను వారించలేనట్లు సమాచారం. గతంలో సైతం ఈశ్వరయ్య పాఠశాల ఆవరణంలో ఉన్న దశాబ్దాల కాలం నాటి పెద్ద వృక్షాలను నరికించి వాటిని అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. ఒక ట్రాక్టర్ మొద్దులు తరలించిన అనంతరం ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో విధిలేని పరిస్థితుల్లో అటవీ అధికారులు జోక్యం చేసుకోని కొండాపురం పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ మిగులు మొద్దులు పాఠశాల ఆవరణలో కుళ్లిపోతున్నా కేసు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. అధికారులు ఏమి చేస్తున్నట్లు.. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు భోంచేశారన్న విషయాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు ఏ రోజుకు ఆరోజు మొబైల్ యాప్ ద్వారా తెలియజేస్తూండాలి. ఈ లెక్క ఆధారంగానే తర్వాత నెలా బియ్యం కేటాయింపులు చేస్తారు. కొండాపురం పాఠశాలలో 100శాతం విద్యార్ధులు హాజరవుతున్నారని రాసినప్పటికీ ఇక్కడ నెలకు 20 బస్తాలు కంటే ఎక్కువ బియ్యం ఖర్చు కావు. అలాంటిది ఏకంగా మూడు నెలలకు సరిపడే బియ్యాన్ని అధికారులు ఆపాఠశాలకు అదనంగా కేటాయించి ఆవాటి లెక్క జమల అడుగక పోవడం ఆశ్చర్యం కల్గించక మానదు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు దృష్టి సారించకపోయి ఉంటే ఇక 60 బస్తాల స్వాహా పురాణం వెలుగు చూసే అవకాశం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కొండాపురం జడ్పీ హైస్కూల్లో చోటుచేసుకున్న బియ్యం స్వాహా ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పదవీ విరమణ చేశారు కదా..అనారోగ్యంతో ఉన్నారు కదా....అని ఉపేక్షిస్తూ పోతే వ్యవస్థను మరింత అవినీతి మయం చేసినట్లు అవుతోందని విద్యావేత్తలు వాపోతున్నారు. -
మోదీ.. చర్చకు వస్తావా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ.. అబద్ధాలు చెప్పడంలో వారిద్దరిదీ ఒకటే స్టైల్.. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెబితే, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇవి రెండూ నెరవేరేవి కావు. రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తుంగలోకి తొక్కారు..’’అంటూ ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉంటే 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని అటకెక్కించారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, తెలంగాణలో ప్రస్తుతం ప్రతి కుటుంబంపై రూ.2.66 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. సాయంత్రం శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇచ్చిన హామీలేవీ పట్టించుకోని కేసీఆర్ కనీసం.. రాష్ట్ర విభజన హామీలను కూడా నెరవేర్చుకోలేకపోయారని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వని కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి పెద్ద నోట్ల రద్దు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి అంశంలోనూ బీజేపీకి కేసీఆర్ మద్దతిచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఏమీ చేయనప్పుడు కేంద్రానికి ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపై ఇంటింటికి వెళ్లండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. కేంద్రంలో రాఫెల్ కుంభకోణంతోపాటు కేసీఆర్ చేస్తున్న అవినీతి, అబద్ధాలపై ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌లో మొదట్నుంచీ ఉండి పోరాటం చేస్తున్న వారికి తగిన గుర్తింపు ఉంటుందని, వారినే చట్టసభలకు పంపుతామని చెప్పారు. ఎన్నికల సమయంలో పైనుంచి ప్యారాషూట్లలో వచ్చి టికెట్లు అడిగే వారి సంగతి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. విభజన హామీలన్నీ నెరవేరుస్తాం ‘‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. నా రికార్డు చూడండి.. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడినా, బయట మాట్లాడినా... నేను ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను..’’అని రాహుల్ అన్నారు. ‘‘రుణమాఫీ చేస్తామని చెప్పి కర్ణాటకలో రూ.70 వేల కోట్ల రైతుల అప్పులు రద్దు చేసి చూపించాం. భూసేకరణ చట్టం అమల్లోకి తెచ్చాం. నేను అబద్ధాలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు. ప్రధానిలా ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పను. చందమామను భూమిపైకి తెస్తానని చెప్పను. ప్రధాని, తెలంగాణ ముఖ్యమంత్రిలాగా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ సభ నుంచి చెబుతున్నా. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. అది ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా అయినా... తెలంగాణకు ఇచ్చిన హామీలయినా.. అన్నింటిని నెరవేర్చి తీరుతాం’’అని స్పష్టం చేశారు. మోదీ చేసినా చేయకపోయినా ఆ హామీలను నెరవేర్చడం తమ బాధ్యతగా తీసుకుంటామన్నారు. పునర్విభజన హామీలు తెలంగాణ, ఆంధ్రా ప్రజల హక్కు అని, వాటిని కాపాడతామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రేణుకా చౌదరి, మల్లు రవి, వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి భిక్షపతి యాదవ్, రవియాదవ్లతో పాటు భారీసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ.. చర్చకు వస్తావా? వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు స్కాంపై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. అది పార్లమెంటు ప్రాంగణంలో అయినా.. ఇంకెక్కడయినా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రూ.562 కోట్ల విలువైన విమానాలను రూ.17 వేల కోట్లు పెట్టి ఎలా కొన్నారని పార్లమెంటులో మోదీని అడిగితే దాని గురించి ఒక్క మాటా మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. రాఫెల్ విమానాల ధరలు బయటకు చెప్పకూడదని కేంద్రం చెబుతోందని, దీనిపై తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని అడిగితే అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారన్నారు. దీనిపై పార్లమెంటులో 56 అంగుళాల ఛాతీ ఉన్న కాపలాదారుడిని నిలదీస్తే కనీసం నా కళ్లలోకి చూడలేకపోయారని వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో తొలిసారి పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని, వాస్తవాలను రాసేందుకు కూడా మీడియా వెనుకాడుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని చెప్పారు. -
అనుభవంతో అవినీతి అభివృద్ధి
దర్శి: దేశంలో అందరికంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి రాష్ట్రంగా తీర్చి దిద్దడంలో ఆయన అనుభవాన్ని చూపించారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరువ లక్ష్మీ నారాయణ రెడ్డి విమర్శించారు. స్థానిక ఆపార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరశింహరావు అడిగిన రూ. 53 వేల కోట్లు పీడీ అకౌంట్లలో ఎందుకు జమచేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న ని«ధులతో కడుతున్న పోలవరం తానే కడుతున్నట్లు ఆంధ్ర ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు. తాగునీటి అవసరాలు తీర్చే వెలుగొండ, గుండ్లకమ్మ, పాలేరు వంటి చిన్న చిన్నప్రాజెక్టులను కూడా నాలుగేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేక పోయారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. రూ. 25 వేల కోట్లతో అభివృద్ధి చెందే రామాయపట్నం పోర్టుకు ఎందుకు అనుకూలంతో కూడిన ప్రత్యుత్తరం కేంద్రానికి ఇవ్వలేక పోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో ధర్మదీక్షలు, విదేశాల పర్యటనల పేరుతో దర్వినియోగం చేస్తూ, తనకు అనుకూలమైన వారికి దోచి పెడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికీ జిల్లాలో జరుగుతున్న ఇసుకమాఫియా, అటవీ శాఖలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమాలను ఎప్పుడు అరికడతారని ప్రశ్నించారు. దర్శి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు 2014లో ఇచ్చిన హామీలైన ఆర్టీసీ డిపో, ఎర్రచెర్వును మంచినీటి చెరువుగా మార్చడం, దర్శి కేంద్రంగా రెవెన్యూ డివిజన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇండోర్‌స్టేడియం, రైతుబజార్, దొనకొండ కేంద్రంగా పారిశ్రామిక హబ్, దర్శి– కురిచేడు, దర్శి–దొనకొండ డబుల్ రోడ్డు, వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగ పడే హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నియోజకవర్గంలో రూ.2500 కోట్ల అభివృద్ది చేశానని చెప్తున్న మంత్రి శిద్దా కనీసం తాగు నీటి సమస్య తీర్చగలిగారా అని ప్రశ్నించారు. ఇక్కడ జరిగింది అభివృద్ధి కాదని కందుల కొనుగోలు కేంద్రాల్లో భారీగా అవినీతి, జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టి నీరు–చెట్టు పేరుతో దోపిడీ, నివాసాల మంజూరులో, మరుగుదొడ్లలో అవినీతి సాధించారని ప్రజలే చెప్తున్నారని విమర్శించారు. ఇన్ని కోట్ల అవినీతికి మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తిండి నారాయణరెడ్డి, మండల పార్టీ అ«ధ్యక్షుడు ఆలమోతు అమర్నా«థ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాడపాకుల శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరంరెడ్డి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కణితి నాగభూషణాచారి, వి. అమరేశ్వరరావు, బోసులు పాల్గొన్నారు. -
తునిలో డంపింగ్ యార్డ్ లేక శ్మశానంలో చెత్త వేస్తున్నారు
-
ఎల్ఎల్ఆర్ మేళాతో మోసం
జంగారెడ్డిగూడెం : కాదేది వసూళ్లకు అనర్హం అన్నట్లుగా సాగింది ఓ సీఎస్సీ నిర్వాహకుడి తీరు. రవాణా శాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాను కాసులు కురిపించే కార్యక్రమంగా మార్చుకున్నాడు. అమాయక గిరిజనులను టార్గెట్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు కాజేశాడు. మోసపోయామని తెలుసుకున్న గిరిజనులు ఐటీడీఏ పీఓను ఆశ్రయించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రవాణా శాఖ ప్రతీ వాహన చోదకుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జంగారెడ్డిగూడెం సబ్యూనిట్ ఆధ్వర్యంలో ఇటీవల జీలుగుమిల్లిలో ఒక సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఆ రోజు సర్వర్ సక్రమంగాపనిచేయకపోవడంతో కొద్ది మందికి మాత్రమే స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణ, ఏఎంవీఐ శ్రీనివాస్ ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీచేయగలిగారు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. దీనినే సీఎస్సీ నిర్వాహకుడు కాసులు పండించే అవకాశంగా మలుచుకున్నాడు. రవాణాశాఖ అధికారులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లో సొంతంగా ఎల్ఎల్ఆర్ మేళాను ఏర్పాటు చేశారు. ఒక కారులో ల్యాప్‌టాప్ తీసుకుని ఆయా గ్రామాలకు వెళ్లి దండోరా వేయించి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే ఎల్ఎల్ఆర్ మేళా ఏర్పాటు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు పంచాయతీ కార్యాలయానికి రావాలని డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని దండోరా వేయించారు. ఐటీడీఏ ద్వారా మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో అమాయక గిరిజనులు వందల సంఖ్యలో క్యూకట్టారు. ఇలా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో సదరు సీఎస్సీ నిర్వాహకుడు మేళాను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మోటార్ సైకిల్ ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.260 తీసుకోవాల్సి ఉండగా సదరు నిర్వాహకుడు రూ.600, కారు లేదా ట్రాక్టర్‌కు అయితే రూ.410 తీసుకోవాల్సి ఉండగా రూ.1000 వరకు వసూలు చేశాడు. అంటే ఒక్కొక్క ఎల్‌ఎల్‌ఆర్‌కు రెట్టింపుపైగా వసూలు చేశాడు. సుమారు 2500 స్లాట్లు బుక్ చేశాడు. ఈ విధంగా లక్షలాది రూపాయలు దండుకున్నాడు. దీంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా ఎల్‌ఎల్‌ఆర్‌కు స్లాట్లకు ఖాళీలేదు. సదరు నిర్వాహకుడు బుక్ చేసిన స్లాట్‌కు సంబంధించి గిరిజన యువకులు ఎంవీఐ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ ఇమ్మని అడగడంతో రవాణా శాఖాధికారులు అవాక్కయ్యారు. దీనికోసం టెస్ట్ నిర్వహించడంతో వారంతా అవగాహన లేక టెస్ట్‌లో విఫలమయ్యారు. దీంతో గిరిజనులు ఐటీడీఏ పీఓ హరేంద్రప్రసాద్‌కు ఫిర్యాదుచేశారు. వెంటనే ఆయన స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణను అడగ్గా తామేమీ ఎల్ఎల్ఆర్మేళా నిర్వహించలేదని స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐటీడీఏ మేనేజర్‌కు ఆదేశాలు జారీచేశారు. అయినా ఫలితం లేకపోయింది. గిరిజనులు మాత్రం డ్రైవింగ్ లైసెన్సుల కోసం స్థానిక ఎంవీఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవీఐ వెంకట రమణ సీఎస్సీ హెడ్ అయిన ఏలూరుకు చెందిన రాజుకు ఫోన్లో జీలుగుమిల్లి సీఎస్సీ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ చర్యలు లేవు. తామంతా మోసపోయామని, తమ వద్ద ఎల్ఎల్ఆర్ పేరుతో లక్షలాది రూపాయలు సీఎస్సీ నిర్వాహకుడు వసూలు చేశాడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వామీ.. ఏమిటీ దోపిడీ!
మంత్రాలయం: స్వామీ నిన్ను కొలవని వారికి నీవంటే భయం.. నిన్ను కొలిచే వారికి నీవంటే భక్తి.. నీ భక్తులను మోసం చేసేవారికి నీ సన్నిధి ఓ వ్యాపార కేంద్రం. ఇక్కడ రావాల్సింది అధికారులకు వస్తోంది. కావాల్సిన దానికి మించి కాంట్రాక్టర్‌కు మిగులుతోంది. దేవుని సాక్షిగా రూ.కోట్లలో అవినీతి పర్వం దర్జాగా సాగిపోతోంది. ఏటా దోపిడీ విలువ అక్షరాల కోటి రూపాయలు. ఈ సొమ్మంతా భక్తుల నుంచి దోచుకుంటున్నదే. ప్రముఖ ఉరుకుంద నృసింహ ఈరన్న స్వామి పుణ్య క్షేత్రంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఏటా చేస్తున్న దగా ఇదీ. దోపిడీ లీలలు కన్నామంటే కళ్లు తిరిగాల్సిందే. ఇదిగో దోపిడీ బాగోతం. నారీకేళాల సమర్పణ 14 లక్షలు పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ సోమ, గురు, శనివారాలు భక్తుల రద్దీ ఉంటుంది. నెలలో దాదాపు 10 లక్షల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. అందులో ఎంతలేదన్న 7 లక్షల మంది భక్తులు జోడు టెంకాయలు స్వామికి సమర్పిస్తారు. ఈ లెక్కన క్షేత్రంలో అమ్ముడు పోయే టెంకాయలు 14 లక్షలు. టెంకాయలు ప్రతి భక్తుడూ ఇక్కడే కొనుగోలు చేస్తారు. టెంకాయల సమర్పణకు ఎలాంటి టిక్కెట్ లేకున్నా కొట్టే అర్చకులకు జోడికి రూ.10 ఇచ్చుకుంటారు. వాస్తవ ఖర్చు.. టెండర్‌దారులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇక్కడకు టెంకాయలు తీసుకువస్తారు. అక్కడ పెద్దసైజు టెంకాయ రూ.15, మధ్య సైజు టెంకాయ రూ.14, చిన్నసైజు రూ.10–12 ధర పలుకుతోంది. ఉరుకుంద క్షేత్రంలో మధ్యసైజు టెంకాయలు విక్రయిస్తారు. ఉత్సవాలకు 56 లారీల్లో (10 టైర్లు) టెంకాయలు దిగుమతి చేసుకుంటారు. ఒక్కో లారీలో 25 వేలు మధ్య సైజు టెంకాయలు లోడింగ్ అవుతోంది. ఒక్క లారీ బాడుగ అక్కడి నుంచి ఉరుకుందకు రూ.24 వేలు. బాడుగతో కలిపి లారీ టెంకాయలు రూ.3.74 లక్షలు. 56 లారీల టెంకాయలు విలువ రూ.1.96 కోట్లు. అందుకు లారీల బాడుగ మొత్తం రూ.13.44 లక్షలు. అంతా కలిపి కాంట్రాక్టర్ 56 లారీల సరుకు తెప్పించేందుకు గానూ రూ.2.09,44,000 వెచ్చిస్తారు. దోపిడీ తతంగం.. ఈఏడాది ఆదోనికి చెందిన మోహన్ అనే వ్యక్తి టెంకాయల టెండర్ కైవసం చేసుకున్నారు. రూ.90.90 లక్షలకు టెండర్ పాడారు. జోడి టెంకాయలను భక్తులకు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. 14 లక్షల టెంకాయలకుగానూ కాంట్రాక్టర్ ధర ప్రకారం వచ్చే మొత్తం రూ.4.90కోట్లు. అందులో ఆయన వెచ్చించిన నగదు రూ.2.09 కోట్లు. టెండర్ చెల్లింపు (రూ90.90 లక్షలు)తో కలిపి ఖర్చు రూ.3 కోట్లు అవుతోంది. భక్తులు సమర్పించిన టెంకాయలో అర చిప్ప కాంట్రాక్టర్‌కే సంబంధం. బయట మార్కెట్లో ఒక్కో చిప్ప ధర రూ.3లు. 14 లక్షల చిప్పలకుగానూ రూ.42 లక్షలు వస్తోంది. టెంకాయ కొట్టుకు 100 టెంకాయలు వేసేందుకు చేసే వసూలు 100. టెంకాయలకు రూ.60. ఈ లెక్కన వచ్చే ఆదాయం రూ.8.40 లక్షలు. అదనపు రేటు, చిప్పల విలువ కలిపి ఆయనకు నికరంగా మిగులు రూ.5,40,40,000. అందులో వెచ్చించి న ఖర్చు, టెండర్ నగదు తీసివేయగా దోపిడీ విలువ రూ.1.49 కోట్లు. ఇదీ ముమ్మాటికీ భక్తుల నుంచి దోచుకున్న సొమ్ము. అంతా కుమ్మక్కు.. ఏటా శ్రావణమాసంలో జరుగుతున్న దోపిడీ ఇది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దేవదాయ శాఖాధికారులకు తెలిసిన విషయమే. ఇంతగా భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అటు దేవుడికి శఠగోపం, భక్తుల నెత్తిన టెంకాయ కొడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతి సొమ్మును పంచుకు తింటున్నారు. భక్తులు ఎంతగా అరిచి గీపెట్టుకున్నా క్షేత్రం అధికారుల్లో చలనం లేదు. కారణం ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతోంది. ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు ఉన్నా ఫలితం శూన్యం. భక్తుల గోడు పట్టించుకునే పాపాన పోలేదు. నిలువు దోపిడీని అరికట్టి భక్తుల జేబులకు కన్నాలు వేయడం మానుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల ఈఓ రామ్‌ప్రసాద్ అడుగగా అధిక ధరలకు విక్రయించకుండా తగ్గించే ప్రయత్నం చేస్తామని సెలవిచ్చారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ విద్యు త్ శాఖ డీఈ దుర్గారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్ఎస్పీడీసీఎల్లో దుర్గారావు డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భాస్కర్‌రావు అనే కాంట్రాక్టర్ దగ్గర బిల్లుల మం జూరుకై రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో భాస్కర్‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని దుర్గారావు నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుర్గారావును అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. -
‘అవినీతి అంతానికి రూ.లక్ష కోట్లతో పథకం’
తమిళ సినిమా (చెన్నై): తమిళనాడులో అవినీతిని అంతం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో ఒక పథకం తన వద్ద ఉన్నట్లు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూనే నటుడిగానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వరూపం 2 చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. అందుకు తన వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్లో ఒక పెద్ద పథకం ఉందన్నారు. ఆ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలో లంచం, అవినీతి వంటివి పూర్తిగా అంతం అవుతాయన్నారు. దీనికంటే తనకు సినిమా ముఖ్యం కాదని అన్నారు. స్నేహబంధం రాజకీయాలకు సహకరిస్తుందా? అని అడుగుతున్నారని, మూగజీవాలకు స్నేహ బంధం ఉంటుందనీ, అవే దాన్ని ఉపయోగించుకుంటూ ఫలం పొందుతున్నప్పుడు రాజకీయవాదులు ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ప్రశ్నించారు. తనకు నగరాల్లో కంటే గ్రామాల్లోనే అధిక అభిమాన గణం ఉందని తెలిపారు. వారికి తాను ప్రస్తుతం ఒక నటుడిగానే తెలుసుననీ, ఇకపై రాజకీయనాయకుడిగానూ ఆదరిస్తారనీ అన్నారు. -
టీడీపీ నేతలు దొంగల్లా తప్పించుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని చెబితే.. ఆ అవినీతిని బయటపెట్టిన వారిపై విమర్శలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అవినీతిలో అడ్డంగా దొరికినప్పుడు లాలూ ప్రసాద్‌యాదవ్ మొదట్లో బుకాయించిన తరహాలోనే ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద అవినీతిని మీడియాలో రాకుండా చేసి విజయం సాధించవచ్చని అనుకుంటున్నారు. 2జీ స్కామ్, లాలూ స్కామ్ జరిగినప్పుడు నిందితులు ఇలాగే బుకాయించారు. అవినీతిలో కూరుకుపోయినా తమను ఎవరేం చేయగలరులే అనుకున్నారు. అలా అనుకున్న వారు చాలామంది చరిత్రలో అక్రమార్కులుగా మిగిలిపోయారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.53,000 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును పర్సనల్ డిపాజిట్(పీడీ) ఖాతాల్లో జమ చేసి, ఖర్చు పెట్టిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇది కచ్చితంగా అతిపెద్ద అవినీతి కుంభకోణమని పునరుద్ఘాటించారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఇష్టపడడం లేదని, భయపడుతోందని జీవీఎల్ దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘రాష్ట్ర ప్రభుత్వంపై ‘కాగ్’ తీవ్ర ఆరోపణలు చేసింది. మీకు(ప్రభుత్వ పెద్దలకు) ఏమాత్రం సిగ్గు, శరం లేదా? లాలూ ప్రసాద్‌యాదవ్ కంటే దిగజారిన పరిస్థితిలో మీరు కనిపిస్తున్నారు. రూ.53,000 కోట్లు అవినీతి గురించి చెబితే తెలంగాణలో కూడా ఉన్నాయంటున్నారు. తెలంగాణలో రూ.8,545 కోట్ల నిధులను ఇలాంటి ఖాతాల్లో వేశారు. వాటికి ఆ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ‘కాగ్’కు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీలో రూ.53,000 కోట్ల గురించి సమాధానం అడిగితే ప్రభుత్వ పెద్దలు గుమ్మడికాయ దొంగల్లా తప్పించుకుంటున్నారు. మీ వెధవ కౌంటర్లు ప్రజలకు అక్కర్లేదు. ప్రజలకు కావాల్సింది నిధుల ఖర్చుకు వివరాలు మాత్రమే. ‘చౌదరి’ కాపాడుతారని అనుకుంటున్నారేమో! పీడీ ఖాతాల్లో ప్రభుత్వ డబ్బులే జమ చేస్తారు. ఈ ఖాతాల ద్వారా ఖర్చుల్లో అక్రమాలు జరిగినా పట్టుబడే అవకాశం తక్కువ. అలా పట్టుబడకూడదనే ఆంధ్రప్రదేశ్‌లో పీడీ ఖాతాలను పెద్ద సంఖ్యలో తెరిచారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో పీడీ ఖాతాలు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 58,539 పీడీ ఖాతాలు తెరిచారు. షేర్ మార్కెట్ కుంభకోణం లాగా ప్రభుత్వ డబ్బులను ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, దాంట్లో నుంచి ఇంకొక ఖాతాలో వేసి వివరాలు చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారు. ప్రజల డబ్బుల ఖర్చుకు వివరాలు చెప్పమంటే నాపై విమర్శలు చేసి, కావాల్సిన పత్రికల్లో తాటికాయంత ఆక్షరాలతో రాయించుకుంటే సరిపోదు. మీ నిజ స్వరూపాన్ని ‘కాగ్’ రిపోర్టు బయటపెట్టింది. కావాలంటే ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అంటున్నారు. ఎవరో చౌదరి కాపాడుతారని అనుకుంటున్నారేమో! ఈ విషయాలు ఇంతటితో ఆగవు. ఈ నిధులపై జవాబు ప్రభుత్వం చెప్పేవరకూ దీని గురించి ప్రజాకోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చుకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. వెధవ కామెంట్లు చేసి తప్పించుకోలేరు. టీడీపీ ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారాలు బయటకు రాకుండా ఎక్కువ కాలం దాచలేరు. సద్వినియోగమైతే వివరాలు ఇవ్వరేం? మన రాష్ట్రంలో రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించడానికి, దొంగలించడానికి, అవినీతి చేయడానికి భారీ సంఖ్యలో పీడీ ఖాతాలను తెరిచారు. మిగతా రాష్ట్రాల్లో కేవలం రూ.వంద కోట్లు మాత్రమే ఇలాంటి ఖాతాల్లో ఉంటే, మన రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఉన్నాయి. 2జీ స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ స్కామ్‌ను బయటపెట్టినట్లుగానే ‘కాగ్’ టీడీపీ ప్రభుత్వ పీడీ ఖాతాల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘కాగ్’ నివేదికలోని అంశాలనే మేము ప్రస్తావిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినవారు అవినీతి దొంగల్లా మాట్లాడుతున్నారు తప్ప మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు. అవినీతి బయటపడిందని నిరాశ చెంది నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి. లేదంటే ప్రతి దానికీ మా నాన్న గ్రేట్, నేను గ్రేట్ అని కితాబులిచ్చుకునే నారా లోకేశ్ అయినా జవాబు చెప్పాలి. రూ.53,000 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరెవరు పంచుకున్నారు? సమాధానం ఇవ్వాలి. వాటిలో కొంతవరకైనా సద్వినియోగమై ఉంటే వాటి వివరాలెందుకు ఇవ్వట్లేదు? దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ ప్రభుత్వం లాలూప్రసాద్ యాదవ్ ముద్రనే కొనసాగించాలనుకుంటే అది వారి ఇష్టం’’ అని జీవీఎల్ తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు ♦ పీడీ ఖాతాల అవినీతి కుంభకోణానికి సంబంధించి ‘కాగ్’ తన నివేదికలో పేర్కొన్న అంశాలనే ఏడు ప్రశ్నలుగా టీడీపీ ప్రభుత్వం ముందుంచుతున్నానని, వాటికి జవాబు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ♦ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 58,000కుపైగా పీడీ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరవాల్సి వచ్చింది? ♦ ఇవి కేవలం తాత్కాలిక అవసరాలకు వాడుకునే ఖాతాలయితే, అన్ని ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏమిటి? వీటిద్వారా రూ.వేల కోట్లు నిధులు మళ్లించారని స్పష్టంగా అర్థమవడం లేదా? ♦ పీడీ ఖాతాల ద్వారా ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలను ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఆ వివరాలను ‘కాగ్’ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వివరాలన్నీ బయటకు వస్తేనే దీంట్లో ఎవరు ఎంత నొక్కారో స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది. ♦ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ఆఖరి నాటికి పీడీ ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్నా ఆ మొత్తాలను ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ఆ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉండాలి. అయినా దాదాపు రూ.25,000 కోట్లు పీడీ ఖాతాల్లో ఉంచారు. ♦ పీడీ ఖాతాల్లో భారీఎత్తున నిధులను వృథాగా ఉంచుకొని, 6.5 వడ్డీకి ప్రభుత్వం కొత్త అప్పులు చేసిందని ‘కాగ్’ ప్రస్తావించింది. అంటే ప్రభుత్వం వద్ద సొంత డబ్బులు ఉండి కూడా రూ.1,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తోంది. డబ్బులు ఉంచుకొని, అప్పులు తెచ్చుకొని దాదాపు రూ.1,500 కోట్లు ప్రజాధనాన్ని వడ్డీగా చెల్లిస్తున్నారు. పీడీ ఖాతాల కుంభకోణంలో ‘రుణాలపై వడ్డీ’ స్కామ్ కూడా కలిసి ఉంది. ఇది రెండు కుంభకోణాలు కలిసిన ఉన్న అంశం. ♦ పీడీ ఖాతాల ద్వారా ఏడాదిలో ఖర్చు పెట్టిన రూ.51,000 కోట్లు ఎవరికి చేరాయి? ఎవరి ఖాతాలకు మళ్లించారు? వివరాలను ‘కాగ్’కు కూడా ఎందుకు ఇవ్వలేదు? ♦ పీడీ ఖాతాల ద్వారా అధికారులు సెల్ఫ్ చెక్ ద్వారా డబ్బులు వాడకూడదు. సెల్ఫ్ చెక్‌ల ద్వారా రూ.వందల కోట్లు డ్రా చేశారని ‘కాగ్’ తన నివేదికలో పేర్కొంది. దొంగలు ఎవరెవరు? ఎవరెంత పంచుకున్నారు? అన్నింటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. -
మోదీ అవినీతిని బయటపెడదాం
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ అనధికారికంగా ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు ప్రజాఉద్యమాలు తీసుకురావాలని నిర్ణయించింది. దీనమైన దేశ ఆర్థిక స్థితి, బ్యాంకు కుంభకోణాలు, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై దూకుడుగా బీజేపీని ఎదుర్కొనాలని శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించింది. పార్టీ చీఫ్ రాహుల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. రాహుల్‌తోపాటుగా మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ, ఆజాద్, ఖర్గే, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. యూపీఏ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియా వ్యక్తిగత కారణాలతో సీడబ్ల్యూసీ భేటీకి గైర్హాజరయ్యారు. పార్లమెంటు లోపలా, బయటా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలో విపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ‘నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించాం. అవినీతి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇదే మంచి తరుణం’ అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. చోక్సీ, రాఫెల్‌లపై దూకుడుగా.. సమావేశ వివరాలను పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రజాందోళనను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పీసీసీల సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 2017లో మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చినపుడు భారత విచారణ సంస్థలు క్లీన్చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకునే దేశం నుంచి చోక్సీని బయటకు పంపించిందని సుర్జేవాలా విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని గానీ, రక్షణ మంత్రి గానీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని సుర్జేవాలా అన్నారు. ఎన్నార్సీపై జాగ్రత్తగా.. అస్సాం ఎన్నార్సీ వివాదంపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నార్సీ కాంగ్రెస్ పార్టీ మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని.. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ చేసుకున్న అస్సాం ఒప్పందంలో భాగంగా ఎన్నార్సీ రూపకల్పన జరిగిందని సుర్జేవాలా తెలిపారు. భారతీయ పౌరుల్లో ఒక్కరు కూడా ఈ జాబితానుంచి తప్పిపోకుండా పార్టీ తరపున భరోసా ఇస్తున్నామన్నారు. 2005 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ 82,728 మంది బంగ్లాదేశీయులను బహిష్కరిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం నాలుగేళ్లలో 1,822 మంది బంగ్లాదేశీయులను మాత్రమే బయటకు పంపిందన్నారు. -
కాసులు ఇస్తేనే బిల్లులు
రాయచోటి(వైఎస్సార్ కడప): రాయచోటి హౌసింగ్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయంలో సిబ్బంది చేతివాటం తారాస్థాయికి చేరుకోవడంతో లబ్ధిదారులు గగ్గోలుపెడుతున్నారు. పక్కాగృహం మంజూరు దరఖాస్తు నుంచి చివరి బిల్లు పడేవరకు కదిలే ప్రతి ఫైలుకు ఒక ధరను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు రోడ్డెక్కాయి. కార్యాలయ పరిధిలో జరుగుతున్న అవినీ తిపై సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోం ది. అధికారపార్టీకి చెందిన కొంతమంది నాయకులను అండగా పెట్టుకుని వేలకు వేలు లబ్ధిదారుల నుం చి లాగేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నా యి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుందామనుకున్న పేదలకు మామూళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇవ్వకుంటే బిల్లు చేయరన్న భయంతో చాలామంది అప్పులు చేసి సమర్పిస్తున్నట్లు ప్రజాసంఘాలు వెల్లడిస్తున్నాయి. నీరుగారుతున్న లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించడంలో హౌసింగ్ శాఖాధికారులు విఫలమవుతున్నారు. లబ్ధిదారుల నుంచి మామూళ్లు వసూళ్లపై పెట్టే శ్రద్ధ లక్ష్యాన్ని ఛేదించడంలో కనిపించడం లేదు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో 4,643 పక్కాగృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41.69శాతం అంటే 19,36 గృహాలు పూర్తవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,707 గృహాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. వీటిని డిసెంబరు చివరికి పూర్తిచేయించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో మంజూరైన గృహాలలో కూడా కొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా మంజూరైన గృహా లను పూర్తి చేయించ లేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వందశాతం గృహాలను పూర్తి చేయిస్తారన్న నమ్మకం లబ్ధిదారులు కోల్పోయారు. దళారుల మాటే వేదం కార్యాలయ పరిధిలో ఫైలు కదలాలంటే దళారుల మాటే వేదం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలోని కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ గృహం మం జూరు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, గృహాల కేటాయింపులో లబ్ధిదారులకు అవకాశం లభించా లన్నా, చివరికి బిల్లుల జమ వరకు దళారుల చేతికి డబ్బులు అందిన తర్వాతనే కార్యాలయంలో రికార్డులు ముందుకు సాగుతుంటాయి. మున్సిపాలిటీ, రూరల్ పరిధిలుగా విభజించి ఒకొక్క పక్కాగృహానికి రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు మామూళ్ల రూపంలో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి అక్రమాలపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న వాదనలు ఉన్నాయి. సొమ్ములు లేకపోతే కనీసం అధికారపార్టీ అండదండలైనా ఉండి తీరాల్సిందేనని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హౌసింగ్ శాఖ నుంచి తొలగించిన సిబ్బందే దళారుల అవతారమెత్తినట్లు ప్రచారం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డులను అడ్డుపెట్టి డివిజన్ పరిధిలోని లబ్ధిదారులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఇప్పటికే దళారుల పాత్రతో సుమారు 200 గృహాలను మంజూరుచేసినట్లు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. వాటిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక డీఈ, ఆ పైస్థాయి అధికారులు ఆలస్యం చేస్తున్నారు. పునాదుల బిల్లు సిద్ధం చేస్తున్నాం. డబ్బులు సిద్ధం చేసుకుని ఆఫీసుకొచ్చి కనపడు. డీఈ సర్ చెప్పారు. డబ్బు చెల్లిస్తే మీ బిల్లు బ్యాంకులో జమవుతుంది. అంటూ మధ్యవర్తులు, కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న సిబ్బంది నుంచి ఫోన్ ద్వారా లబ్ధిదారులకు చెబుతున్న మాటలు ఇవి. రాయచోటి పట్టణ పరిధిలోని సంజీవనగర్ పరిధికి చెందిన చాకలి రాజాకు ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేశారు. గృహానికి సంబంధించిన బిల్లు సిద్ధమైంది.. రూ.5వేలు తీసుకుని కార్యాలయానికి రావాలని సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. విషయాన్ని స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కౌన్సిలర్ బిల్లుల మంజూరుకు మామూళ్లు వసూలు చేయడంపై ప్రశ్నించడంతో కార్యాలయం సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇలా కార్యాలయంలోని సిబ్బంది, మధ్యదళారుల అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి. ప్రత్యక్షంగా హౌసింగ్ డివిజన్ అధికారి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవు పక్కాగృహాల మంజూరుకు, బిల్లులు చెల్లింపు కోసం లబ్ధిదారుల మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వసూళ్లకు పాల్పడిన వారి వివరాలు నా దృష్టికి తెస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాను. లబ్ధిదారులు ఎవ్వరూ కార్యాలయ సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుని పేరున బ్యాంకులో జమ అవుతుంది. గురుప్రసాద్, గృహనిర్మాణశాఖ డీఈ, రాయచోటి -
అవినీతి కేసులో లాలూకు సమన్లు
సాక్షి,న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాద్ సహా ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్న కేసులో ఆగస్టు 31న కోర్టు ఎదుట హాజరు కావాలని నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ఆదేశించారు. కేసుకు సంబంధించి నిందితులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని ఏప్రిల్ 16న చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పేర్కొంది. లాలూ కుటుంబ సభ్యులతో పాటు మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, బీకే అగర్వాల్, అప్పటి ఐఆర్సీటీసీ ఎండీ, డైరెక్టర్ రాకేష్ సక్సేనాల పేర్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఐఆర్సీటీసీ అప్పటి గ్రూప్ జనరల్ మేనేజర్లు వీకే ఆస్ధానా, ఆర్కే గోయల్, విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, సుతాజా హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ అధినేతల పేర్లు సైతం చార్జిషీట్లో నమోదయ్యాయి. -
లోక్‌పాల్ కోసం అక్టోబర్ 2 నుంచి నిరశన
రాలేగావ్ సిద్ధి: లోక్‌పాల్ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్‌పాల్ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్‌పాల్ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. -
రాఫెల్లో అవినీతి అవాస్తవం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాఫెల్లో అవినీతి జరగడం అవాస్తవమని ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు స్పందించని కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్, సోనియాగాంధీలపై పలు అవినీతి కేసులున్నాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాని మోదీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో టీఆఎర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వాయిదాకు ప్రయత్నించిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 34 శాతం చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. -
కోర్టుకెక్కిన ఏపీ వైద్యారోగ్యశాఖ అవినీతి
-
‘రాఫెల్’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానా ల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీజేపీ కుంభకోణాల ప్రభుత్వమని, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడూతూ, బోఫోర్స్ కుంభకోణాన్ని బీజేపీ గోరంతది కొం డతగా చూపి రాజీవ్‌గాంధీని పార్లమెంట్లో అవమానించారని, ఆయన చనిపోయిన తర్వాత ఆ కుంభకోణంపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. -
ఆ కేసులో పంజాబ్ సీఎంకు ఊరట..
చండీగఢ్ : పదేళ్ల కిందట ప్రైవేట్ డెవలపర్‌కు భూమి బదలాయింపు కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా 17 మందికి విముక్తి లభించింది. నిందితుల్లో పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, సహా ఇద్దరు మాజీ మంత్రులు మరణించారు. అమృత్సర్ ట్రస్ట్‌కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్‌కు అభివృద్ధి పరిచే నిమిత్తం బదలాయించడంలో 18 మంది నిందితులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్ బ్యూరో (వీబీ) నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్టు మొహాలీ ప్రత్యేక న్యాయమూర్తి జస్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ సూచనతో 2008లో విజిలెన్స్ బ్యూరో వీరిపై కేసు నమోదు చేసింది. న్యాయస్ధానానికి హాజరైన అమరీందర్ సింగ్ ఇతర నిందితులు తీర్పును స్వాగతించారు. చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపుతోనే తమపై విజిలెన్స్ బ్యూరోను ప్రేరేపించి కేసులో ఇరికించారని అప్పటి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ అమరీందర్ సింగ్ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గిన విజిలెన్స్ బ్యూరో అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు. -
బాబు అవినీతిపై కేసులేవీ?
సాక్షి, హైదరాబాద్: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ బీజేపీని నిలదీశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వరప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన, అవినీతిని ఆయన ఎండగట్టారు. ‘టీడీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట. నాలుగేళ్లుగా అబద్ధాలు, అవినీతితో బాబు పాలన సాగిస్తున్నారు. ఎంతో అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం దేశంలో ధనిక సీఎం చంద్రబాబే. దేశంలోనే ఏపీ ఇప్పుడు అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. రాజధాని భూముల్లో అంతా అవినీతే. అలాంటి వ్యక్తిపై బీజేపీ నేతలు కేసులు ఎందుకు పెట్టడం లేదు’ అని వరప్రసాద్ అన్నారు. ‘రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. జగన్ దోషి అని ఏ కోర్టు చెప్పింది?.. రాజకీయ కక్షలతో ఆయనపై కేసులు పెట్టారన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే కోర్టు నుంచి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు. దమ్ముంటే.. అంత నిజాయితీ పరుడైతే విచారణను ఎదుర్కోవాలి’ అని వరప్రసాద్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జాతీయ, అంతర్జాతీయ సర్వేల్లో సైతం ఏపీ అవినీతి గురించి ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్ గుర్తు చేశారు. -
మోదీ సర్కారు చట్టం.. ఇక అవినీతి కేసులు మటుమాయం!
సాక్షి, న్యూఢిల్లీ : భారత అవినీతి నిరోధక చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా వారం క్రితం రాజ్యసభలో ఆ బిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. మంగళవారం ఆ బిల్లు లోక్‌సభ పరిశీలనకురాగా దాన్ని సభ్యులు యథాతథంగా ఆమోదించారు. అవినీతి ఆరోపణలపై కేసును నమోదుచేయడం దగ్గరి నుంచి దర్యాప్తు జరిపి దోషుల్ని తేల్చడం, అనంతరం వారికి శిక్షలు విధించడం వరకున్న పలు నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. దేశంలో రోజురోజుకు అవినీతి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ సవరణ చట్టం వల్ల శిక్షలు ఎక్కువ పడి కేసులు తగ్గుతాయా? లేదా? అన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. ఇంతకుముందు ప్రభుత్వాధికారి లంచం తీసుకోవడం అంటే ‘ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ఓ వ్యక్తికి పని చేయడం కోసం అతని నుంచి డబ్బు లేదా ఇతర రూపాల్లో విలువైన వస్తువులను అక్రమంగా తీసుకోవడం’ అవినీతికి విస్తత నిర్వచనం. ఈ నిర్వచనానికి ‘టెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్’ అనే పదాన్ని జోడించారు. ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే అది ఏ ఉద్దేశంతో తీసుకున్నారో అంటే, లంచంగానే తీసుకున్నారా? అన్న అంశాన్ని దర్యాప్తు సంస్థ ముందుగా తేల్చాలి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇక ముందు ఎవరిపై కేసులు దాఖలు చేయడానికి వీల్లేదు. అంటే ఆస్తులపై దాడులు జరిపి ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ కేసులు దాఖలు చేయడానికి వీల్లేదు. లంచం తీసుకున్నారా, లేదా ? అన్న అంశం ప్రాతిపదికనే కేసులు దాఖలు చేయాలి. అంతేకాకుండా ఓ అధికారి తన నిజాయితీని పక్కన పెట్టి బాధ్యతా రాహిత్యంగా ఓ వ్యక్తికి అనసరమైన ప్రయోజనం కలిగించారా? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారానే లంచం తీసుకున్నారా, లేదా అన్న అభిప్రాయానికి రావాలి. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ఓ వ్యక్తి నుంచి లంచంగా లేదా అక్రమ పద్ధతిలో డబ్బు లేదా ఇతర విలువైన వస్తువును తీసుకోవడమే అవినీతి అని పాత చట్టం సులభంగా నిర్దేశిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారమే బోఫోర్స్ దగ్గరి నుంచి 2జీ స్కామ్ వరకు, కామన్వెల్త్ గేమ్స్ నుంచి కోల్‌స్కామ్ వరకు కేసులను నమోదు చేసి విచారించారు. కొత్త సవరణల ప్రకారం అధికారులపై కచ్చితమైన అనుమానాలున్నా అవినీతి కేసును నమోదు చేయరాదు. విచారించాకే కేసును నమోదు చేయాలి. విచారించేందుకు కూడా సంబంధిత ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కొత్త నిబంధన తెచ్చారు. సదరు అధికారి అనుమతిస్తే విచారణ జరపాల్సి ఉంటుంది. లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని సవరించడం మరీ దారుణం. ప్రస్తుతం లంచాలిచ్చే వారిపై లంచాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై మాత్రమే కేసు పెట్టే అధికారం ఉండగా, అంటే దర్యాప్తు సంస్థ కేసు పెట్టాలి అనుకుంటేనే పెట్టే అవకాశం ఉండింది. సంస్థలు, కంపెనీలపైనే లంచం ఇచ్చినందుకు కేసు పెట్టారే తప్ప, సామాన్య పౌరులపై కేసులు ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరమే అవుతుంది కనుక లంచం ఇచ్చిన వారిపై కూడా తప్పనిసరి కేసు పెట్టాల్సిందే. కేసు పెడతారన్న భయంతో అవినీతిపై ఫిర్యాదు చేయడానికే ప్రజలు ముందుకు రారన్నది అందరికి తెల్సిందే. లంచం ఇచ్చేలా తనపై తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఇక ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ లంచం ఇచ్చిన వారు నిరూపించుకోగలిగితేనే శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. అది ఎంత మందికి సాధ్యం అవుతుంది? ఎన్ని కేసుల్లో సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు ‘సంబంధిత అధికారి’ నుంచి అనుమతి తీసుకోవాలని సవరణలో ప్రభుత్వం పేర్కొంది. ఆ సంబంధిత అధికారి ఎవరో మాత్రం వెల్లడించలేదు. కేంద్రంలోని లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తాలు అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. 2013 నాటి లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించనే లేదు. ఎప్పుడు ఆమోదించాలి. అది ఎప్పుడు అమల్లోకి వచ్చేను? అవినీతి రహిత సమాజంగా మారుస్తానన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, అది సాధ్యం కాదనుకొని అవినీతి కేసుల రహిత దేశంగా మారుద్దామని తీర్మానించికుందా? -
రాఫెల్ డీల్ : అది నకిలీ మకిలి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నకిలీ రాఫెల్ వివాదాన్ని సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య జరిగిందని, ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. రాహుల్ ఆరోపణలు సత్యదూరమని తేటతెల్లమైందన్నారు. మోదీ సర్కార్‌పై పోరాడేందుకు ఎలాంటి అంశాలు లేని కాంగ్రెస్ దిక్కుతోచక లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిందని గగ్గోలు పెడుతోందని దుయ్యబట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూడవ, నాలుగవ స్ధానంలో నిలవనుందని జైట్లీ జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 225 స్ధానాల్లోనే నేరుగా బీజేపీతో తలపడేందుకు సిద్ధమైందన్నారు. మిగిలిన స్ధానాల్లో పోటీచేయకుండా మిత్రపక్షాలకు ఆయా స్ధానాలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఫేస్బుక్ పోస్ట్‌లో జైట్లీ పేర్కొన్నారు. ఇక యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి గత ప్రభుత్వాలు సైతం ధరల వివరాలను బహిర్గతం చేయలేదని గుర్తుచేశారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఆయుధాల ధరలను వెల్లడించదన్నారు. -
ఆధారాలు చూపిస్తా.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?
పొందూరు: ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చేసిన అక్రమాలను ఆధారాలతో చూపిస్తా... అతనిని సస్పెండ్ చేయగలరా? అని వైఎస్సార్సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును సూటిగా ప్రశ్నించారు. స్థానిక పట్టుశాలీ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన అ నంతరం రవికుమార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై సమాచారమందిస్తానని తెలిపారు. నదీతీర ప్రాంతాలైన నిమ్మతొర్లాడ, జీకే వలస, ముద్దాడ పేట, దూసి, గోపీనగరం, సింగూరు, పురుషోత్తపురం, పెద్దసవలాపురం, యరగాం గ్రామాల్లో ఇసుక ర్యాంపులను అనధికారంగా ప్రారంభించి ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. మైనింగ్, లిక్కర్, భూ మి, ఇసుక మాఫియాలకు అండగా నిలుచొని అక్రమాలకు పాల్పడటం శోచనీయమని చెప్పారు. ఇసుక ర్యాంపుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా తనకు ఉన్నాయని ఆధారాలతో నిరూపిస్తే బహిరంగంగా ఉరి తీయండని సవాలు విసిరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి జిల్లాల్లో భూములను విప్ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, మండల పార్టీ అ«ధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి బిఎల్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి లోలుగు కాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంట్యాడ రమేష్, ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై లంచం ఇచ్చిన వారూ శిక్షార్హులే
న్యూఢిల్లీ: లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా ఇకపై నేరస్తులే. ఇందుకు గాను వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అవినీతి నిరోధక (సవరణ) బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఉద్దేశపూర్వకంగా చేసే ఫిర్యాదుల నుంచి ఉన్నతాధికారులకు, వారు రిటైరైన తర్వాత కూడా రక్షణ కల్పించటం తోపాటు అవినీతి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఇందులో పలు నిబంధనలను చేర్చాం’ అని ఆయన చెప్పారు. ‘తాజా సవరణ ద్వారా లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బలవంతంగా ఎవరైనా లంచం ఇవ్వజూపితే సదరు అధికారి ఆ విషయాన్ని పై అధికారులకు వారంలోగా తెలియజేయాలి. అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూ రుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులపై పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు ఆమోదం ‘పరారైన ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2013’ను లోక్‌సభ ఆమోదించింది. ‘దీంతో నేరాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల లేదా బినామీ దారుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. పరారైన వారి నుంచి డబ్బు రాబట్టుకునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం సాయపడుతుంది’ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. -
మోసాలు.. మోపెడు
అధికార పార్టీ అండ ఉంది. ఏంచేసినా చెల్లుతుందనే నమ్మకముంది. ఇంకేముంది మోపెడ్‌పై సైతం వందలాది క్వింటాళ్ల ధాన్యం తరలించేసినట్లు బిల్లులు సృష్టించి దోచేసుకునే ధైర్యం వారికుంది. పౌర సరఫరాల శాఖలో తప్పుడు రవాణా బిల్లులు సైతం ‘పాస్’ చేయించుకొనే ‘ప్రసన్నాంజనేయుడి’ పవర్ అది. నందిగామ మార్కెట్‌యార్డులో ధాన్యం దోపిడీ తీరు ఇది. సాక్షి, అమరావతిబ్యూరో : టీవీఎస్–ఎక్స్ఎల్ మోపెడ్ వాహనంపై ఎన్ని బస్తాలు తీసుకెళ్లవచ్చు? మహా అయితే 10 బస్తాల వరకు సాధ్యపడవచ్చు. అదే ఆటో రిక్షాలో ఓ 20 బస్తాలు.. ఇక ఇండికా కారు అనుకోండి 30 బస్తాలు సరే. కానీ.. నందిగామ మార్కెట్‌యార్డు నుంచి ఓ టీవీఎస్ మోపెడ్ వాహనంపై ఏకంగా 713 బస్తాలు, టాటా ఇండికా కారులో 463 బస్తాలు, ఆటో రిక్షాలో 537 బస్తాలు సరఫరా చేసినట్లు నిసిగ్గుగా రికార్డులు రాసేశారు. ఇదొక్కటే కాదు ఒక లారీలో ఏకంగా 1203 బస్తాలు సరఫరా చేయడం ఒక్క ‘ప్రసన్నాంజనేయ’ గ్రామైక్య సంఘానికే చెల్లింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పీపీసీ కమిటీ సభ్యురాలు ధాన్యం రవాణా పేరిట చేసిన అడ్డగోలు దోపిడీని చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇంత జరిగినా, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా లూటీ చేసినా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లో వెళితే.. రవాణా చేశారిలా.. మార్కెట్ యార్డుల్లో పీపీసీ కమిటీల ద్వారా సేకరించిన చేసిన ధాన్యాన్ని సాధారణంగా పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్పోర్టర్లు సరఫరా చేస్తుంటారు. కాగా, నందిగామ మార్కెట్‌యార్డులో ప్రసన్నాంజనేయ గ్రామైక్య సంఘం పేరిట సేకరించిన ధాన్యాన్ని కూడా టెండరు దక్కించుకున్న అన్నపూర్ణ లారీ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపెట్టారు. కానీ ఇక్కడ ధాన్యం సరఫరా చేసేందుకు లారీలను ఉపయోగించకపోగా నిబంధనలకు విరుద్ధంగా టీవీఎస్ మోపెడ్, ఆటో రిక్షాలు, ఇండికా కారు, రవాణాశాఖ కార్యాలయ చరిత్రలో లేని సీరిస్ నంబర్ల పేరిట ఉన్న లారీల్లో సరఫరా చేసేశారు. ఆ వాహనాల నంబర్ల మీదే బిల్లులురూపొందించారు. లారీల్లో సరఫరా చేసిన ధాన్యం కన్నా ఇతర వాహనాల్లో సరఫరా చేసిన ధాన్యమే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇవేవీ పౌరసరఫరాల సంస్థ అధికారులకు పట్టలేదు. పైగా వారు రూపొందించిన తప్పుడు రవాణా బిల్లులకు ఆమోదం తెలిపి పరోక్షంగా ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి సహకరించారు. రూ. 33.81లక్షల దోపిడీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా ఉండే పౌరసరఫరాల గోదాములకు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం లారీల ద్వారానే జరుగుతుంది. కానీ నందిగామ మార్కెట్ యార్డు నుంచి తరలించిన ధాన్యం మాత్రం అధిక భాగం లారీల్లో కాకుండా సాధారణ వాహనాల్లో అది కూడా టీవీఎస్–50, ఆటో రిక్షా, టాటా ఇండికా కారు, ట్రాక్టర్ లాంటి వాటిపై వేలాది బస్తాలను తరలించినట్లు చూపెట్టారు. 1992 మోడల్‌కు చెందిన టీవీఎస్–50ఎక్స్ఎల్( అ్క07 8544) పై 13 ్ర టిప్పులు చొప్పున ∙Ðð ¬త ్తం 7000 బస్తాలను సరఫరా చే సిన ట్లు రి కారు ్డల్లో ^è ప గా.. రవాణా శా ఖ రి కారు ్డల్లో లేని అ్క20 6770 నంబరు గల లారీ ద్వారా 15 ట్రిప్పులు చొప్పున సుమారు 9వేల బస్తాలు, ఏపీఎస్టీ 1234 లారీ ద్వారా 2,500 బస్తాలు సరఫరా చేసినట్లు ప్రసన్నాంజనేయ సంఘం రికార్డుల్లో చూపింది. ఈ రెండు లారీల నంబర్లు రవాణా శాఖ రికార్డుల్లోనే లేకపోవడం విశేషం. ఇలా లేని లారీలు ఉన్నట్లుగా.. రైతుల వద్ద సేకరించని ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి నాలుగేళ్ల వ్యవధిలో రవాణా చార్జీల పేరిట రూ. 33.81 లక్షలు దోచుకున్నారు. గన్నీ బ్యాగ్‌ల డబ్బును వదల్లేదు నందిగామ మార్కెట్‌యార్డు కమిటీలో నాలుగేళ్ల కాలంలో ‘ప్రసన్నాంజనేయ’ పరపతి సంఘం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని తేలింది. వారు ధాన్యాన్ని సరఫరా చేసినట్లు చూపుతున్న వాహనాలు కొన్ని లేకపోవడం.కొన్నింటిలో సరఫరా చేయడానికి సాధ్యం కాని వాహనాలు ఉండటం చూస్తే 90 శాతం వరకు ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయనేలేదని సుస్పష్టమవుతోంది. అయితే వారు ధాన్యం సేకరించినట్లుగా.. వాటికి కొత్త బ్యాగుల్లో నింపినట్లుగా చూపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ. 15ల చొప్పున వసూలు చేశారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం మొత్తం 1.53,705.6 క్వింటాళ్లకు గానూ 3,84,262 బ్యాగులు(50 కేజీల బస్తా బ్యాగులు) కొనుగోలు చేయడానికి రూ. 57.63 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ వారు ఎలాంటి బ్యాగులు కొనకుండా ఆ డబ్బునూ నిసిగ్గుగా నొక్కేశారు. -
విద్యార్థుల సొమ్ముకు వేశారు కన్నం
చీరాల: అవినీతికి, అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లు విద్యాశాఖ వ్యవహరిస్తోంది. విద్యాశాఖలో ఇప్పటికే అనేక అవినీతి వ్యవహారాలు బట్టబయలైనా సిబ్బందిలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ శాఖలో మరో అక్రమ వ్యవహారం బయటపడింది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున విద్యాశాఖ ప్రతి విద్యార్థికి చెల్లిస్తుంది. జిల్లాలో ప్రధానంగా పర్చూరు ప్రాంతంలో పాఠశాలలకు, గ్రామాలకు మధ్య చాలా దూరం ఉండడంతో విద్యార్థులు వ్యయప్రయాసలతో చదువుకోవాల్సి వస్తుంది. వీరి కోసం విద్యాశాఖ ఇటువంటి అవకాశం కల్పించింది. చీరాల నియోజకవర్గంలో పాఠశాలలన్నీ కిలోమీటరు దూరంలోనే ఉండి బస్సు సౌకర్యం కూడా ఉన్నప్పటికీ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నయాపైసా కూడా చెల్లించకుండానే పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కలిసి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో వేటపాలెం మండలం నాయనిపల్లి పడమర స్కూల్లో 41 మంది విద్యార్థులకు దూర ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా, వారికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనట్లుగా రికార్డుల్లో సృష్టించి రూ.1.68 లక్షల నిధులు మింగేశారు. అయితే ఇక్కడ కిలోమీటరులోపే ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎక్కువ దూరం ఉన్నట్లుగా చూపించి డబ్బులు కాజేశారు. అలానే దేశాయిపేటలో 30 మంది విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, రవాణా సౌకర్యం కింద రూ.90 వేలు డ్రా చేసి విద్యార్థులకు దక్కనివ్వలేదు. వేటపాలెం ఓఆర్ఎస్ (ప్రాథమిక పాఠశాల) ఏడుగురు విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.12,900, కొత్తపేట యానాది సంఘం యూపీ స్కూల్లో రవాణా సౌకర్యం కింద తొమ్మిది మంది విద్యార్థులకు మొత్తం రూ.15,900 చొప్పున మొత్తం కలిపి రూ.2,25,600 గత మార్చిలో డ్రా చేసి బిల్లులన్నీ స్వాహా చేశారు. నిబంధనలు ఇవీ... ఈ జీవో ప్రకారం మండల పరిధిలోని కిలోమీటరు దూరంలో ఎటువంటి ప్రభుత్వ పాఠశాల లేకుండా ఆ పాఠశాలలోని వారు కిలోమీటరు పక్కన ఉన్న పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.300 చెల్లించాల్సి ఉంది. అది కూడా బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు మాత్రమే. ఆర్టీసీ బస్సు పాసులు అందించాలనే నిబంధన ఉంది. అలానే యూపీ పాఠశాల విద్యార్థులకు 2 కిలోమీటర్లు దాటి మరో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి రవాణా సౌకర్యం చొప్పున ప్రతి విద్యార్థికి రూ.300 చెల్లిస్తుంది. అలానే హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు కిలోమీటర్లు దాటి వెళున్న వారికి రూ.300 చొప్పున అందిస్తుంది. వేటపాలెం మండలంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, రెండు కిలోమీటర్లలో యూపీ స్కూల్స్, మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్ ఉన్నాయి. చివరకు చీరాల నుంచి ఒంగోలుతో పాటు ఈ పాఠశాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది. అయినా దూర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు నమ్మించారు. బయటపడిందిలా... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పడిపోవడంతో బడిబాట పేరుతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. అలానే విద్యార్థుల సంఖ్య తగిన రీతిలో లేకపోతే ఆ పాఠశాలను తొలగిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలోనే ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించేందుకు మొదటలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు రూ.500లు చొప్పున ఖర్చు పెట్టి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఆటోలు ఏర్పాటు చేశారు. అయితే రవాణా చార్జీల కింద వచ్చిన నిధులలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుడికి, ప్రధానోపాధ్యాయుడికి మధ్య వివాదం తలెత్తడంతో ఈ అవినీతి వివాదం బట్టబయలైంది. ఎంఈఓ ఏమంటున్నారంటే.... వేటపాలెం మండల ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు ఈ అక్రమ వ్యవహారంపై మాట్లాడుతూ విద్యార్థులకు రవాణా కింద చెల్లించాల్సిన నగదు దుర్వినియోగం అయినట్లు తన దృష్టికి వచ్చిందని, దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
హంగూ..ఆర్భాటాలకే టీడీపీ సర్కార్ పెద్దపీట
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకుండా పోయింది