న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతి అధికారులపై ఏకకాలంలో క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన క్షమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) స్పష్టం చేసింది. కొన్ని అవినీతి కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై అధ్యయనం తర్వాత అలాంటి కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుందన్న సాకుతో శాఖపరమైన చర్యల్లో జాప్యం చేస్తున్నారని సీవీసీ గుర్తించింది. కేసు విచారణలో ఉందన్న సాకుతో కొన్ని విభాగాలు, సంస్థలు అలాంటి వైఖరి అనుసరించడం సరైన విధానం కాదని బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment