Government departments
-
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు పూర్తిస్థాయి స్వేచ్ఛ కలి్పస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూలి్చవేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ ‘ఓఆర్ఆర్కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించాం. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హైడ్రాలో నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ కనీ్వనర్‌గా ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ఆథారిటీ, జియోలాజికల్ విభాగాల అధికారులు ఉంటారు..’ అని పొంగులేటి తెలిపారు. 8 కొత్త వైద్య కళాశాలలకు 3 వేల పైచిలుకు పోస్టులు ‘హైదరాబాద్ నగరం కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం.తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు గాను 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించాం. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయనున్నాం. ములుగు జిల్లా ఏటూరునాగారం ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని మంజూరు చేశాం. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 వైద్య కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 3 వేల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ, హకీంపేటకు జూనియర్ కళాశాల మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం..’ అని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం: కోమటిరెడ్డి ‘కాంగ్రెస్ పారీ్టకి, తనకు పేరు వస్తుందనే అక్కసుతో కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.6 వేల కోట్ల మిషన్ భగీరథ పనులు జరిగితే, రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగింది. నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి ఫ్లోరైడ్ తీవ్రత పెరిగినట్టు కేంద్రం నివేదిక ఇచి్చంది..’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.2027 నాటికి ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి: ఉత్తమ్ ‘ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి 2027 సెపె్టంబర్‌లోగా ప్రారంభిస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించాం.డిండి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతుల సాధనకు, మిగిలి న 5 శాతం పనుల పూర్తికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఖరీఫ్‌లో సన్నాలను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయి లో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుంది. వచ్చే నెలలో కొత్త తెల్లరేషన్ కార్డుల జారీని ప్రారంభిస్తాం. జనవరి నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తాం.. అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు.బిల్లులు రావట్లేదు సార్ కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదని పలువురు మంత్రులు..సీఎం రేవంత్ దృష్టికి తెచి్చనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఆయా బిల్లులు త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
ఉద్యోగ ఖాళీలెన్ని ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన జాబ్ కేలండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీతో పాటు విద్యుత్ సంస్థల పరిధిలో ఏఈఈ, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు, సభ్యులతో గత వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా గ్రూప్–1 ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేలి్చ, వివరాలు ఆర్థిక శాఖకు సమరి్పంచాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు బిజీ బిజీ సీఎస్ ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు, వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఖాళీల లెక్కలు తేలి్చన తర్వాత ఆర్థిక శాఖకు సమరి్పంచాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి, ఆ మేరకు ప్రతిపాదనలను నియామక సంస్థలకు అప్పగించాలి. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచి్చన తర్వాత రెండోసారి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ రెండోసారి, కొన్నిటి భర్తీ మూడోసారి జరుగుతున్నట్లు సమాచారం. కేలండర్ ప్రకారం ప్రకటనలు తెలంగాణ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్లో స్పష్టం చేసింది. టీజీజెన్కో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా అక్టోబర్‌లోనే జారీ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి. జీవో 55లో గుర్తించిన 19 కేటగిరీల్లోని పోస్టులు గ్రూప్–1 పరిధిలోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేయాలి. జాబ్ కేలండర్లో నిర్దేశించిన నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను సర్కారు ఆదేశించింది. -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
బదిలీలు బద్నామ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక తొలిసారిగా తలపెట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. సీనియారిటీ జాబితాల రూపకల్పన మొదలు గరిష్టంగా 40శాతం సిబ్బంది బదిలీ నిబంధన వరకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. దీనితో చాలా శాఖల్లో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఈనెలాఖరు వరకు బదిలీల గడువును పొడిగించాల్సి వచ్చింది. నిజానికి ప్రభుత్వ శాఖలు ప్రకటించిన సీనియారిటీ జాబితాలు శాస్త్రీయంగా లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితాల ప్రకటన అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది జాబితాల ప్రకటనకు ప్రభుత్వం పెద్దగా సమయం ఇవ్వలేదని.. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు ముందుకు సాగలేదని అంటున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో ట్రాన్స్ఫర్లకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల సందేహాలను, సీనియారిటీ సమస్యలను నివృత్తి చేయలేక శాఖాధిపతులు తల పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తేలని జీవో 317 లొల్లి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అమల్లో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపులపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. 32 శాఖల్లోని 53వేల మందికిపైగా ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించారు. జీవో 317 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ సమస్యల వివరాలను కూడా సేకరించింది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 18న ఉప సంఘం సమావేశమవాల్సి ఉన్నా జరగలేదు. దీంతో 53 వేల మంది ఉద్యోగుల వినతులు పెండింగ్‌లో పడిపోయాయి. అవన్నీ ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెరలేపింది. మంత్రివర్గ సమావేశం జరిగి ఉంటే సమస్యల పరిష్కారానికి సిఫార్సు లభించేదని, వాటిని పరిష్కరించకుండా బదిలీల ప్రక్రియ ఎలా పూర్తవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం.గురుకులాల్లో ఆందోళన సాధారణ బదిలీల కంటే ముందే గురుకుల విద్యా సంస్థల్లో పదోన్నతులు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాదాపు నెలరోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జోనల్ కేటాయింపులు రోజుకోరకంగా మారుతుండటంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మల్టీజోన్–1కు చెందిన ఉద్యోగులను మల్టీజోన్–2కు కేటాయించారు. కొన్ని కేటగిరీల్లో మల్టీజోన్–2 పరిధిలోని ఉద్యోగులు మల్టీజోన్–1కు పంపారు. ప్రిన్సిపాల్స్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ కేటగిరీల్లో వందల మందికి ఇలా జోన్లు మారడంతో వారంతా న్యాయ పోరాటానికి దిగారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారిని మినహాయించి బదిలీలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనూ జోనల్ కేటాయింపుల్లో సమస్యలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. విద్యా శాఖలో సింగిల్ టీచర్ సమస్య.. పాఠశాల విద్యా శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ పదిరోజుల క్రితం ముగిసింది. దాదాపు 35వేల మంది టీచర్లు కొత్త స్కూళ్లకు బదిలీ అయ్యారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల విషయంలో ఇబ్బంది ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆ పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు బదిలీ అవడం.. వాటికి ఇతర టీచర్లెవరూ రాకపోవడం సమస్యగా మారింది. అలాంటి చోట్ల టీచర్లను రిలీవ్ చేయకుండా నిలిపేశారు. బదిలీ అయినా ఆ టీచర్లు పాత స్కూళ్లలోనే కొనసాగాల్సి వస్తోంది. వైద్యారోగ్య శాఖలో సీనియర్లకు మొండిచేయి రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కూడా బదిలీల ప్రక్రియతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కీలక సమయంలో మంచి వైద్య సేవలు అందించిన అధికారులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మాజీ డీఎంఈ సైతం ప్రాధాన్యత లేని చోటికి ట్రాన్స్ఫర్ కావడం గమనార్హం. కరోనా సమయంలో కీలకపాత్ర పోషించిన రాజారావు, నాగేందర్, రమేశ్‌రెడ్డి కూడా దూర ప్రాంతాలకు కేటాయించారు. దీంతో ఈ శాఖలో బదిలీల ప్రక్రియను ఇష్టానుసారం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నర్సుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. కొందరు అధికారులు ముడుపులు కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఆర్థిక శాఖలో ‘క్లియర్ వేకెన్సీ’ వివాదం.. ఆర్థికశాఖలో జరిగిన బదిలీల్లో నిబంధనలు సరిగా పాటించలేదని ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. డైరెక్టర్ వర్క్స్, అకౌంట్స్ కార్యాలయంలో జరిగిన బదిలీల్లో నాలుగేళ్ల తప్పనిసరి బదిలీ నిబంధన పాటించలేదు. ఒకేచోట ఆరేడు ఏళ్ల సర్వీసు పూర్తయినా.. కొందరి వివరాలు సేకరించకుండా పక్కనబెట్టారని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు తక్కువకాలం పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీ జాబితాలోకి తీసుకువచ్చారని మండిపడుతున్నారు. అంతేకాదు.. సీనియారిటీ ప్రకారం పూర్తి వేకెన్సీలను చూపకుండా అన్యాయం చేశారనే ఆరోపణలూ వస్తున్నాయి. హనుమకొండలోని మిషన్ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక డీఏఓ ఆరేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ జాబితాలోకి తీసుకోలేదని సమాచారం. ములుగు కార్యాలయంలో ఉన్న క్లియర్ వేకెన్సీని సీనియర్ ఉద్యోగులకు చూపించకుండా.. మిషన్ భగీరథ వరంగల్ కార్యాలయంలో పనిచేస్తున్న తక్కువ సర్వీస్ ఉన్న డీఏఓకు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీలోనూ బది‘లీలలు’! తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ)లో సుదీర్ఘకాలంగా హెడ్డాఫీస్, జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పైస్థాయి అధికారులు, వివిధ కేడర్ల అధికారులు/ఉద్యోగులు నాలుగేళ్లకుపైబడి ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గడువు పెంచినా.. బదిలీల విషయంలో అధికారుల నుంచి అటెండర్ల వరకు అసంతృప్తిగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇలా వివిధ శాఖల్లో జరుగుతున్న బదిలీలు గందరగోళంగా మారడంతో ప్రభుత్వ బదిలీల ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో ఇప్పటికైనా అర్హులైన ఉద్యోగులకు బదిలీలు జరగాలని, అన్యాయంగా జరిగిన బదిలీలు ఆగిపోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. జోనల్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు మినహాయింపు నీటి పారుదల శాఖలోని అన్ని కేడర్ల ఇంజనీర్లను సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం జారీచేశారు. శాఖలో ఇంజనీర్ల కొరత ఉందని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నిర్మాణంలోని ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ అవసరాలు తీరాక శాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని కేడర్లలోని ఇంజనీర్ల బదిలీలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఇంజనీర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో శాఖలోని వివిధ ఇంజనీర్ల సంఘాల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ప్రస్తుతానికి బదిలీలను పక్కనపెట్టినట్టు సమాచారం. 40% నిబంధనతో చిక్కు..ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నాలుగేళ్లు, ఆపై ఒకేచోట పనిచేస్తున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీ కేటగిరీలోకి వస్తారు. అయితే గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే స్థానచలనం కలిగేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉదాహరణకు ఒక జోన్ పరిధిలో వంద మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 మంది నాలుగేళ్లకుపైగా ఒకేచోట ఉన్నారనుకుంటే.. ఈ 50 మందికి బదిలీ అర్హత ఉన్నట్టే. కానీ 40శాతం నిబంధన మేరకు 40 మంది మాత్రమే బదిలీ అయి, మిగతా పది మందికి చాన్స్ దొరకదు. ఇలా చాలా శాఖల్లో తప్పనిసరి జాబితాలోని ఉద్యోగులకు బదిలీ చాన్స్‌రాక తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్యాలయాలన్నీ ఒకే స్టేషన్ కిందకు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వ శాఖలు తడబాటుకు గురవడంతో.. కొందరు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకే బదిలీ కావాల్సి వచ్చింది. -
కొలువుల పట్టిక తారుమారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి (నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్ చేసి) చూపించేవారు. కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చేయరు (ఎలాంటి మార్కింగ్ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్‌తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్‌ను తొలగించి పది పోస్టులను జనరల్‌కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది. -
మరింత సులభంగా ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: విద్య, ఉద్యోగ ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. కుల, నివాస, జనన వివరాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఒకసారి తీసుకొంటే చాలని స్పష్టం చేసింది. ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని, ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య తదితర సంక్షేమ శాఖలతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబరుతో కొత్తది పొందే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరంలేదు. దరఖాస్తుదారు తన వద్ద ఉండే జిరాక్స్ కాపీలో పేర్కొన్న నంబరు చెబితే కొత్తది ఇస్తారు. కుటుంబంలో గతంలో ఎవరూ ఎలాంటి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ పొంది ఉండకపోతే దరఖాస్తుదారు ప్రస్తుతం ఈకేవైసీ చేయించుకొని తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందాలి. ఒక వేళ దరఖాస్తుదారు ఈకేవైసీ చేయించుకొని సర్టిఫికెట్ పొంది ఉంటే, అతని తండ్రి లేదా తండ్రి తరపున రక్త సంబం«దీకులు ఎవరైనా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తహసీల్దార్ నుంచి కుల ధ్రువీకరణ పత్రం పొందొచ్చు. -
TSPSC Paper Leak: ఆరు పరీక్షలు మళ్లీ.. అన్నీ కొత్తగానే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు రద్దు చేసిన పరీక్షలు, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఇదివరకే నిర్వహించిన నాలుగు పరీక్షలు రద్దు కాగా... మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై ఇప్పటికే పలు రకాల సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అతి త్వరలో ఈ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. కాగా పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు చేయనున్నట్లు కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హాల్ టికెట్లు మొదలు.. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఏడు అర్హత పరీక్షలను నిర్వహించింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్... వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. దీంతో ఆరు పరీక్షలను టీఎస్పీఎస్సీ తిరిగి నిర్వహించాల్సి వస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల వద్ద హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ సమూలంగా మార్చి కొత్తగా పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహించే వారం రోజుల ముందు కొత్త నంబర్లతో అభ్యర్థులకు తిరిగి హాల్ టిక్కెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే అభ్యర్థులకు కొత్తగా పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు. కొత్త ప్రశ్నపత్రాలను కూడా రూపొందించనున్నారు. కమిషన్ రహస్య కంప్యూటర్లలోని సమాచారం బయటకు లీక్ కావడంతో అన్ని రకాల ప్రశ్నపత్రాలు సమూలంగా మారనున్నాయి. ఈ మేరకు కొత్త ప్రశ్నలతో ప్రశ్నపత్రాల తయారీకి నిపుణులకు సూచనలు అందినట్లు సమాచారం. కాగా ప్రశ్నపత్రాల్లో జంబ్లింగ్ విధానాన్ని అనుసరించే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత పరీక్షల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్కుఉని... ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అత్యంత గోప్యంగా ఈ ప్రక్రియ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఇది దరఖాస్తుల సమయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నియామక సంస్థలు వరుసగా ప్రకటనలు జారీ చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులంతా..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ఎంపిక చేసుకున్న పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బీ)లు పెద్ద సంఖ్యలో కొలువుల భర్తీకి ప్రకటనలు జారీ చేశాయి. దాదాపు 15 రకాల పోస్టులకు ప్రకటనలు విడుదల చేసిన నియామకసంస్థలు... ఈనెల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడుతున్నాయి. ఈ మేరకు ప్రారంభ, చివరి తేదీలను ఖరారు చేశాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈపాటికే ప్రారంభం కాగా.. మరికొన్నింటికి అతి త్వరలో ఆన్లైన్లో మొదలుకానుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రకటనలు జారీ చేసి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టడంతో అభ్యర్థుల్లోనూ కొంత అయోమయం నెలకొంది. ఏయే పోస్టులకు సన్నద్ధం కావాలి? వేటికి దరఖాస్తు చేస్తే బాగుంటుంది? ఎందులో విజయవంతం అయ్యే అవకాశం ఉంది? అన్న ఆలోచనలో నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. చివరిదాకా ఆగొద్దు... టీఎస్పీఎస్సీ, టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బీలు దాదాపు 20 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేశాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన తేదీలు ప్రకటించాయి. ఒక్కో పోస్టుకు దరఖాస్తు గడువును కనిష్టంగా మూడు వారాల నుంచి నాలుగు వారాల సమయాన్ని కేటాయిస్తూ తేదీలను ఖరారు చేశాయి. అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తుకు గడువు ఎక్కువ రోజులే ఇచ్చినప్పటికీ ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు. ప్రక్రియ మొదలైన వారం రోజుల్లోనే దరఖాస్తు చేసుకుంటే ఆందోళన ఉండదని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి ప్రత్యేకంగా సూచించారు. చివరి నిమిషంలో తత్తరపాటు లేకుండా ఉండేందుకు ముందుగానే పని ముగించుకోవాలని అన్నారు. గతంలో సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యలు, ఇతరత్రా ఇబ్బందుల కారణంగా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడటాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ముందస్తు దరఖాస్తు వల్ల తొలి ప్రాధాన్యత ఇచ్చిన చోటే పరీక్ష సెంటర్ కేటాయించే అవకాశం ఉందని వెల్లడించారు. -
కొలువుల క్రమబద్ధీకరణ తొలి ప్రతిపాదన పూర్తి.. సీఎం కార్యాలయం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యో గుల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు న్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరించి శాశ్వత ప్రాతి పదికన నియమిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో శాఖలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం వివిధ శాఖలను ఇటీవల ఆదేశించింది. దీంతో క్రమబద్ధీకరణ నిబంధనలకు అను గుణంగా వర్క్ హిస్టరీ ఉన్న ఉద్యోగులను గుర్తించిన శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 143 మంది కాంట్రాక్టు సూపర్వైజర్ల జాబితాతో తొలి ప్రతిపాదన సమర్పించగా సీఎం కార్యాలయం దాన్ని ఆమోదించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు, కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ నియామక ఉత్త ర్వులు జారీ చేసింది. విధుల్లో చేరిన ఆయా ఉద్యోగులకు కేడర్ ఆధారిత పే స్కేల్‌కు అనుగుణంగా వచ్చే నెల (అక్టోబర్)లో తొలి వేతనం అందనుంది. వడివడిగా కదులుతూ: ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి విద్య, అనుబంధ శాఖల్లోనే దాదాపు 32 శాతం మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గురుకుల సొసైటీలు, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల్లోనే అత్యధిక పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సర్వీసు నిబంధనల విష యంలో స్పష్టత కోసం ఆయా ఫైళ్లకు మోక్షం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక శాఖతోపాటు సాధారణ పరిపాలన విభాగం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే మరో 30 శాతం మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొలిక్కి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు లోగా మరికొన్ని ఫైళ్లకు ఆమోదం లభిస్తుందని విశ్వసనీయ సమాచారం. -
ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ సమాన హోదాలో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 121ను విడుదల చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వీఆర్వోల వ్యవస్థ రద్దయినందున.. ఆ పోస్టుల్లోని సిబ్బందిని ఇతర శాఖల్లోకి తీసుకోనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన ఖాళీల్లో వారిని సర్దుబాటు చేయాలని, లాటరీ తీసి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఇచ్చే సర్వీస్ రిజిస్టర్, తాజా పే సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు వారిని చేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం సెలవు, సస్పెన్షన్, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీసులో ఉన్న వీఆర్వోలను కూడా ఇతర శాఖలకు పంపాలని ఆదేశించారు. అదనంగా ఉంటే పొరుగు జిల్లాలకు.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ ప్రతి జిల్లాకు ఓ ఉత్తర్వును జారీ చేసింది. సదరు జిల్లాల్లో గుర్తించిన ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను విభాగాల వారీగా ప్రకటిస్తూ.. ఎంతమంది వీఆర్వోలను సర్దుబాటు చేయాలో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ మెమో నంబర్: 1634052–బీ/186/ఏ1/హెచ్ఆర్ఎం–7/2022 పేరిట అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. లాటరీ ప్రక్రియను వీడియో తీయాలని.. నిర్దేశిత ఫార్మాట్లో ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లే ఇవ్వాలని సూచించారు. ఏదైనా జిల్లాలో గుర్తించిన ఖాళీల కంటే వీఆర్వోల సంఖ్య ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు పంపాలని ఆదేశించారు. భూపరిపాలన మినహా.. జిల్లాల వారీగా ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వీఆర్వోలను ఎక్కువగా నీటి పారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖలకు కేటాయించారు. జిల్లాల్లో హెచ్‌వోడీల పరిధిలోకి వచ్చే విభాగాల్లోని ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలన్నారు. దేవాదా య, ఎక్సైజ్, పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోకి కూడా వీరిని తీసుకునేందుకు అనుమతినిచ్చిన ఆర్థిక శాఖ.. భూపరిపాలన విభాగంలోకి తీసుకునేందుకు అనుమతించలేదు. జీవో నం 121 ప్రతి దహనం తమను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడంపై వీఆర్వోల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం 121 ప్రతిని వీఆర్వో సంఘాల జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయ ప్రాంగణంలో దహనం చేశారు. వీఆర్వోలుగా తాము ఒక్క భూపరిపాలన విధులు మాత్రమే చూడటం లేదని.. మొత్తం 54 రకాల విధుల్లో అదీ ఒకటని, తమను ఇతర శాఖలకు పంపితే మిగతా 53 విధులను ఎవరు నిర్వర్తించాలని ప్రశ్నించారు. తమను సంప్రదించకుండా, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. అప్పటివరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చే సర్దుబాటు ఉత్తర్వులను తీసుకోవద్దని నిర్ణయించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీఆర్వోల జేఏసీ నేత వింజమూరి ఈశ్వర్ తెలిపారు. ఎక్కడో అవినీతి జరిగిందనే సాకుతో వ్యవస్థనే రద్దు చేయడం దారుణమన్నారు. ముందు కేడర్ స్ట్రెంత్ నిర్ధారించండి: ట్రెసా వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ 6,874 పోస్టులను కోల్పోతోందని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో తమ శాఖలో పని ఒత్తిడి పెరుగుతుందని.. పరిపాలన, ఎన్నికలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ధ్రువపత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందన్నారు. పాలనా సౌకర్యార్ధం ప్రతి మండలానికి ఐదుగురు అదనపు సిబ్బందిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను అనాథ చేశారు: టీజీటీఏ తెలంగాణ పాలన వ్యవస్థకు ఆయువు పట్టు అయిన రెవెన్యూ శాఖను ప్రభుత్వం అనాథను చేసిందని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) పేర్కొంది. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇప్పటివరకు చెప్పలేదని టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మండిపడ్డారు. కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటయ్యాక ఒక్క పోస్టునూ పెంచని ప్రభుత్వం.. ఏకంగా 6వేలకు పైగా పోస్టులను రెవెన్యూ శాఖ నుంచి తీసేయడం దారుణమన్నారు. వెంటనే జీవో 121ను రద్దు చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
బ్యాంకుల్లో డిపాజిట్లు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని వివరాలను వెంటనే తమకు పంపాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, స్థానిక సంస్థలు, జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు, ఆయా అకౌంట్లలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో నంబర్ 18ని జారీ చేశారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై పలు జాగ్రత్తలను సూచిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు అకౌంట్లన్నింటినీ ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకునే తెరిచారా.. లేదా? ప్రస్తుతమున్న అకౌంట్లను సమీక్షించి అవసరం లేని అకౌంట్లను మూసివేసే అంశాలపై వచ్చే నెల 10వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆయా బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితిని పరిశీలించాలని, డిపాజిట్ చేసిన మేరకు నగదు ఉందో లేదో తనిఖీ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల నుంచి తాజాగా సర్టిఫికెట్లు తీసుకుని తమకు పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. ఒకే బ్యాంకులోకి డిపాజిట్లు.. అదే విధంగా ఒక శాఖ లేదా సంస్థకు పలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ చేసిన ఏదైనా ఒకే బ్యాంకులోకి మార్చాలని, ఈ క్రమంలో వడ్డీ తగ్గకుండా చూసుకోవాలని కోరింది. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేసే అవకాశం లేకపోతే ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వివరాలన్నింటినీ ప్రతి నెలా 10వ తేదీ కల్లా అప్డేట్ చేయాలని వెల్లడించింది. ఇక నుంచి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను డిపాజిట్ల రూపంలోకి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని, డిపాజిట్ల ఉపసంహరణ కాలపరిమితి ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపంలో లావాదేవీలు జరగకూడదని, కచ్చితంగా ప్రభుత్వ అధికారిక ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులపై వచ్చిన వడ్డీని ఆ పథకం కిందనే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వడ్డీ కింద వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో వార్షిక ఆడిట్ నివేదికలో స్పష్టంగా నమోదు చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి ఒక నిర్దిష్ట విధానం (ఎస్ఓపీ–స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తీసుకు రావాలి. అవినీతిపై ఫిర్యాదులు చేస్తూ వచ్చే కాల్స్‌పై దృష్టి పెట్టాలి. ఈ ఫిర్యాదుల పట్ల అధికారులు సొంతంగా బాధ్యత తీసుకోవాలి. క్షేత్ర స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు, కార్య క్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి కలిగేలా చేయడం కలెక్టర్లు, జేసీల బాధ్యత. ఇదే సమ యంలో ప్రభుత్వానికి రావా ల్సిన రెవెన్యూ వసూళ్లపైనా కూడా దృష్టి పెట్టడం ఇంకో బాధ్యత. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం వినూత్న సంస్కరణలు తీసుకురావాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర ఆదాయ వనరులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల వ్యవహారానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏసీబీ దాడులు చేస్తే కానీ ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని, అసలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేదు.. ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా.. అన్న విషయం ఎందుకు పరిశీలించడం లేదు.. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేశామని వివరించారు. కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని చెల్లింపుల ప్రక్రియను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను నిశితంగా గమనించామని, అవినీతికి చోటు లేకుండా పూర్తి స్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ సేవ’ల్లో పరిస్థితులను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సహజ మార్గంలో ఆదాయం పెరిగేలా చూడండి ► క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవలి. వారం లేదా పది రోజులకు ఒకసారి ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలి. ప్రతి సమావేశంలో ఒక రంగంపై దృష్టి సారించాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఎలా ఉందన్న విషయం తదుపరి సమావేశంలో పరిశీలించాలి. ► రాష్ట్ర ఆదాయ వనరులను మెరుగు పరుచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులతో పాటు, రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలి. జీఎస్టీ వసూళ్లు, ఇతరత్రా ఆదాయం పూర్తి స్థాయిలో వచ్చేలా చూడాలి. ► వివిధ శాఖలు సరైన కార్యచరణ ద్వారా సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు చక్కటి సేవలను అందించడంతోపాటు ఆదాయాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, తదితర శాఖల మధ్య సమన్వయం బావుండాలి. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి ► సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. దీనిని పూర్తిగా అడ్డుకోవాలి. మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలి. ► మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఇలాంటి వ్యవహరాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. ► ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ పియూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబు, ఎస్ఈబీ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మహిళా ఉద్యోగుల కోసం ఫిర్యాదుల కమిటీలు
సాక్షి,అమరావతి: అన్ని ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా అంతర్గత కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లకు శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి మహిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అందువల్ల ఫిర్యాదుల కమిటీలను తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం కాకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ శాఖాధిపతులు చూడాలని, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు మహిళా కమిషన్‌కు పంపాలని ఆదేశించారు. -
ప్రభుత్వ డేటాకు మరింత భద్రత
సాక్షి, అమరావతి: సైబర్ సెక్యూరిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్ రెండు చోట్ల ఎస్‌డీసీలను ఏర్పాటు చేస్తోంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖలో ప్రైమరీ సైట్‌ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశామని, ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏడాదిలోగా ఈ ఎస్డీసీని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వమే సొంతంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా డేటా భద్రతతో పాటు నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం డేటా నిర్వహణకు ప్రైవేటు సంస్థ నుంచి క్లౌడ్ సర్వీసులు వినియోగించుకుంటే ఐదేళ్ల కాలానికి రూ.795 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, అదే ఎస్డీసీ ద్వారా ఈ వ్యయాన్ని రూ.570 కోట్లకు పరిమితం చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చిలోగా ఎస్డీసీలోకి.. డేటా భద్రతకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న అప్లికేషన్లను ఏపీఎస్డీసీలోకి మార్చి 31లోగా బదలాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 32కు పైగా ప్రభుత్వ విభాగాలు ఈ గవర్నెన్స్‌లో భాగంగా బయట సంస్థలు అభివృద్ధి చేసిన అప్లికేషన్లు, హోస్టింగ్ డేటా వినియోగించుకుంటున్నట్లు ఏపీటీఎస్ గుర్తించింది. ఈ అప్లికేషన్లకు సంబంధించి సెక్యూరిటీ ఆడిటింగ్ చేసి, మార్చి 31లోగా ఎపీఎస్డీసీలోకి మార్చనున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్సైట్లు, యాప్‌ల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను కూడా జారీ చేసింది. -
ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: అధికార యంత్రాంగానికి కొత్త రక్తం ఎక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది. కీలకమైన శాఖల్లో 30 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కాంట్రాక్టు విధానంలో నియమించాలని నిర్ణయించింది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే జాయింట్ సెక్రెటరీ, డైరెక్టర్ పోస్టుల్లో వీరిని నియమించాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ పోస్టుల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికైన వారిని నియమిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3 జాయింట్ సెక్రెటరీ, 27 డైరెక్టర్ల పోస్టుల భర్తీకి గాను నైపుణ్యం కలిగిన భారతీయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ యూపీఎస్సీ ఇటీవల ప్రకటనలు జారీ చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ, రెవెన్యూ విభాగం, ఆర్థిక శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రెటరీ పోస్టులో ప్రైవేట్ నిపుణులను నియమిస్తారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, న్యాయ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ, జలశక్తి శాఖ, పౌర విమానయాన తదితర శాఖల్లో డైరెక్టర్ పోస్టుల్లో ప్రైవేట్ నిపుణులను చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ సెక్రెటరీ స్థాయి పోస్టులో కనీసం 15 ఏళ్ల అనుభవం, డైరెక్టర్ స్థాయి పోస్టులో పదేళ్ల అనుభవం ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. -
ఆరున్నరేళ్లు...1,26,641
సాక్షి, హైదరాబాద్: స్వరాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 1,26,641 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆర్థిక శాఖ తేల్చింది. రాష్ట్రం ఏర్పాటైన 2014, 2 జూన్ నుంచి గత ఏడాది డిసెంబర్ 16 వరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ మేరకు పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొంది. ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా 30,594 పోస్టులు, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ ఎల్పీ ఆర్బీ) ద్వారా 31,972 పోస్టులు, పలు విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,637 పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖలో 10,763 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్టు వెల్లడించింది. ఇందులో ఆర్టిజన్ల క్రమబద్ధీకరణతో పాటు మొత్తం 53,264 పోస్టులకు ఇంకా తమ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇందులో ఇప్పటికే 49,174 పోస్టులు భర్తీ అయ్యాయని స్పష్టం చేసింది. మొత్తంగా గత ఆరున్నరేళ్లలో మొత్తం భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిన 1,50,326 పోస్టులకు గాను 1,32,899 పోస్టులను నోటిఫై చేయగా, ఇందులో 1,26,641 భర్తీ అయ్యాయని, మరో 23,685 భర్తీ దశలో నిలిచిపోయాయని స్పష్టం చేసింది. ‘హోం’లో అత్యధికం... ఉన్నత విద్యలో సున్న ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హోంశాఖ ముందంజలో ఉంది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వివిధ స్థాయిల్లో 31,972 ఉద్యోగాలు కల్పించగా, ఆ తర్వాత పంచాయతీ రాజ్‌లో 10,763, పాఠýశాల విద్యలో 8,443 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక, ఉన్నత విద్యలో 1,061 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతి లభించగా, ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా నియమించలేదని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అలాగే న్యాయ శాఖలో 9, పరిశ్రమల శాఖలో 20, ఆర్థిక శాఖలో 27, సాధారణ పరిపాలన శాఖలో 90 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ఆ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన శాఖల్లో కూడా 100 నుంచి 3 వేల చొప్పున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఆ రెండు వర్సిటీల్లోనే.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉద్యోగాల భర్తీలో వెనుకబడ్డాయి. 15 వర్సిటీలకు గాను రెండింటిలోనే 259 (వ్యవసాయ వర్సిటీలో 179, ఉద్యాన వర్సిటీలో 80) ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. పశు వైద్య విశ్వవిద్యాలయం (244), అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ (10), ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ (15), జేఎన్టీయూ (186), కాకతీయ (136), ఎంజీ వర్సిటీ (34), ఉస్మానియా (415), పాలమూరు (63), ఆర్జీయూకేటీ–బాసర (96), శాతవాహన (40), తెలుగు వర్సిటీ (7), తెలంగాణ వర్సిటీ (59)ల్లో ఒక్క అధ్యాపక, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టలేదు. సీఎం నిర్దేశించిన 50వేల మాటేంటి? ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టుల వరకు వెంటనే గుర్తించి భర్తీ చేయాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. అయితే, సీఎం చెప్పిన 50వేల పోస్టులతో పాటు అదనంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఇందులో ఆర్థిక శాఖ తయారుచేసిన తాజా నివేదిక ప్రకారం.. 23,685 పోస్టులుండగా, మరో 20వేల వరకు పోలీసు శాఖలో, 10వేల పోస్టుల వరకు విద్యా శాఖలో ఉంటాయని సమాచారం. వీటితో పాటు ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరయ్యే వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆరున్నరేళ్లలో వీరి సంఖ్య 10వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇవే కాక, వివిధ కార్పొరేషన్లు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఖాళీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెలాఖరు కల్లా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. -
గిరిజన గ్రామాల వివరాలకో మొబైల్ యాప్
సాక్షి, అమరావతి: గిరిజన గ్రామాల వివరాలు, మౌలిక సదుపాయాలు తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను గిరిజన సంక్షేమ ఐటీ విభాగం రూపొందించింది. రోడ్లు, భవనాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మొదలైన అన్ని మౌలిక సదుపాయాలను, గ్రామాల్లోని అన్ని ఇతర ఆస్తులను ప్రభుత్వ విభాగాలు తెలుసుకునేందుకు ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ► ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎఫ్) గిరిజన గ్రామాలకు చెందిన మొత్తం సమాచారాన్ని ఆయా విభాగాల నుంచి సేకరించి క్రోడీకరిస్తుంది. ► త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్‌ను ఆఫ్‌లైన్, ఆన్లైన్లో చూసుకోవచ్చు. మొబైల్, కంప్యూటర్ సిస్టమ్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఈ యాప్‌లో గ్రామ ప్రొఫైల్‌లో జనాభా వివరాలు, గృహాలు, స్వయం సహాయక బృందాల సంఖ్య, పెన్షనర్ల సంఖ్య, సంక్షేమ సహాయకుడి పేరు, గ్రామ వలంటీర్ల సంఖ్య, వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉందనే వివరాలు ఉంటాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొఫైల్‌లో 35 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అవి.. ఏపీఎస్ఆర్టీసీ, వ్యవసాయం, వినోదం, పాడి, పశుసంవర్థక, విద్య, విద్యుత్, ఫైబర్‌నెట్, ఫైనాన్స్, ఫైర్ స్టేషన్, ఫిషరీస్, ఫుడ్– సివిల్ సప్లైస్, ఫారెస్ట్, జీసీసీ, గ్యాస్ అండ్ పెట్రోల్, హెల్త్, హార్టికల్చర్, ఐటీడీఏ, ఇరిగేషన్ సోర్స్, జువెనైల్ వెల్ఫేర్, లేబర్ విభాగం, పంచాయతీ రాజ్, పోలీస్‌స్టేషన్, ఆర్టీఏ, రెవెన్యూ విభాగం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, స్వయం సహాయక బృందాలు, సెరికల్చర్, నైపుణ్యాభివృద్ధి, వసతి గృహాలు, టెలికాం, వెటర్నరీ, మహిళ– శిశు సంక్షేమం, ఇతర విభాగాలు. ► రహదారి కనెక్టివిటీ సమాచారంతో రహదారులను సంగ్రహించడానికి జియో ఫెన్సింగ్ సౌకర్యం ఉంది. డ్యాష్ బోర్డులో పూర్తి వివరాలు ఉంటాయి. ► హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రోగులకు వైద్య సాయాన్ని అందించే అనువర్తనాన్ని ఈ అప్లికేషన్లో అభివృద్ధి చేశారు. -
విజయనగరంలో సీఎం పర్యటన ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విజయనగరంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి అయోధ్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలిస్తారు. అనంతరం 11.25 గంటలకు ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశ పోలీసు స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయనగరం నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. -
విభజన తర్వాతే కొత్త కొలువులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో ఆ మేరకు శాఖల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో ఖాళీలు, నియామకాలపై సందిగ్ధత వీడలేదు. దీంతో ఈ అంశం తేలేవరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం లేదు. పాత జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలన్నీ జిల్లా, జోనల్ స్థాయిల్లోనే జరిగేవి. నూతన జోనల్ విధానంతో ఇకపై జిల్లా స్థాయితో పాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో నియామకాలు చేపట్టాలి. నియామకాలు చేపట్టాలంటే ప్రస్తుత ఉద్యోగుల కేడర్‌ను కొత్త జోనల్ విధానం ప్రకారం విభజించాలి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు నియామకాల ప్రక్రియ సాధ్యం కాదని ఉద్యోగ నియామక బోర్డులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విభజన పూర్తయితేనే నియామకాలు.. కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లయింది. ప్రస్తుతం ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువగా జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనతో పాటు జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో కూడా పరిధిని ఫిక్స్ చేయాలి. ఇది పూర్తయితే ప్రతి ఉద్యోగికి పరిధిపై స్పష్టత రావడంతో పాటు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, పనిచేస్తున్న వారి లెక్కలు తేలుతాయి. దీంతో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, నేరుగా భర్తీ చేసేవెన్ని, పదోన్నతులతో నింపేవెన్ని అనేది తెలుస్తుంది. ఉద్యోగులకు ఆప్షన్లు... తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. గత ఆగస్టు నుంచి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అందుబాటులోకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను ప్రాథమికంగా విభజించారు. అయితే విభజన పూర్తిస్థాయిలో జరిగితేనే ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారనేది స్పష్టత వస్తుంది. ఉద్యోగుల విభజన చేపట్టే క్రమంలో ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగి ఎంపిక చేసుకునే విధానం ప్రకారం విభజనకు ఆస్కారముంటుంది. ఉద్యోగుల విభజన విషయంలో ప్రభుత్వం పలుమార్లు శాఖాధిపతులతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. -
9... నెమ్మది!
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై కాగ్ పెదవి విరిచింది. బడ్జెట్ కేటాయింపులకు తగినట్లుగా నిధు లు వాడుకోకపోవడాన్ని తప్పుబట్టింది. 2017–18 ఆర్థిక సం వత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్ ఆదివారం శాసనసభ ముందుంచింది. ఆర్ అండ్ బీ, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య, పురపాలన, గృహనిర్మాణ, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, భారీ, మధ్య తరహా నీటిపారుదల, వాణిజ్య, పరి శ్రమల శాఖలు నిధులు వాడుకోకపోవడంతో మురిగిపోయాయని తేల్చింది. నిధులు ఖర్చు పెట్టని శాఖల్లో మున్సిపల్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. నిధులను సద్వినియోగం చేసుకోని ఈ శాఖలను నిధులు పొదుపు చేశారంటూ కాగ్ ఎద్దేవా చేసింది. నిధులు వాడుకోకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యసాధనలో వెనుకబడ్డాయని పేర్కొంది. -
అంతా అక్రమమే..!
సాక్షి, పెద్దపల్లికమాన్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించినా ఫలితాలు రావటం లేదు. ఆమ్యామ్యాలు లేనిదే పనులు చేయమనే ధోరణి పెద్దపల్లి రవాణాశాఖ కార్యాలయంలో కొద్దిమంది అధికారుల్లో కనబడుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, లైసెన్స్ తదితర సమస్యల పరిష్కారానికి వచ్చే సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ తప్పించుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా వస్తేనే పనులు చేస్తామని కోడ్‌రూపంలో సంకేతాలిస్తున్నారు. జిల్లాలోని ప్రజలు పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, ఎన్టీపీసీ, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో ఉండే ఆర్టీఏ ఏజెంట్లను సంప్రదించి పనులు చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రయివేటు ఏజెంట్లదే హవా.. ఆర్టీఏ కార్యాలయంతో సంబంధం లేని ఓ ప్రైవే టు వ్యక్తి రోజూ సాయ్రంతం వాహనాల పనులు చేయించే ఏజెంట్ల వద్ద నగదు తీసుకుని అధికారులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సమయంలో ఏ ఏజెంట్‌కు సంబంధించి ఆ ఏజెంట్ దరఖాస్తులపై కోడ్‌ను సూచించి దరఖాస్తుదారులను కార్యాలయంలోకి పంపిస్తున్నారు. కోడ్ ఉంటే ఎలాంటి సందేహం లేకుండా అధికారులు, కార్యాలయ సిబ్బంది పని పూర్తి చేస్తున్నారు. ఎక్కువ లోపాలు కలిగిన వాహనాలుంటే అందు కు ఎక్కువ నగదు ముట్టజెప్పాల్సిందే. జిల్లాలో టిప్పర్లు, బొగ్గు, ఇసుక లారీలు కాలం చెల్లిన వా హనాల యజమానులు, పెద్ద వ్యాపారుల వద్ద ఎలాంటి కేసు కాకుండా ఉండేందుకు నెలవారీ మామూళ్లు కూడా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వసూళ్లు సైతం కానిస్టేబుళ్లు, హోంగార్డులే చేస్తున్నట్లు కార్యాలయానికి వెళ్లే పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలల బస్సుల తనిఖీల్లో.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఏటా సామర్థ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రారంభంలో అధికారులు తనిఖీలు చేస్తూ సామర్థ్య పరీక్షలు చేయించని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేయాలి. ఇలా చేయకుండా పాఠశాలల యజమానులతో కుమ్మక్కయి వారి నుంచి డబ్బులు తీసుకుని సామర్థ్య పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇవ్వాల్సిన నగదు ఇస్తేనే చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టపగలే చుక్కలు.. పెద్దపల్లి రవాణా కార్యాలయానికి వచ్చే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడి అధికారులు, సిబ్బంది, వాహనానికి సంబంధించిన ఏ పనికైనా ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. నూతన రిజిస్ట్రేషన్‌కు వచ్చే ద్విచక్రవాహనాలకు ప్రయివేటు వ్యక్తులు పరిశీలించి, ఫాం నింపి.. ఎంతోకొంత తీసుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడి ఉన్నతాధికారులు సమయానికి రాకపోవడంతో ఉదయం కార్యాలయానికి వచ్చే సామాన్యులు సాయంత్రం వరకు తిండి, తిప్పలు లేకుండా వాహన పరీక్షల కోసం వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పారదర్శకంగా పనులు పెద్దపల్లి ఆర్టీఏ కా ర్యాలయంలో పనుల కోసం ప్రజలు ఏజెంట్లు లేకుండా నేరుగా రావొచ్చు. వారి సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నాం. ఏజెంట్ల ప్రభావం లేకుండా వారిని కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా డబ్బుల కోసం వేధి స్తే నేరుగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం. – ఆఫ్రీన్ సిద్దిఖి, ఆర్టీవో పెద్దపల్లి -
ఎంత ఖర్చు చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకోసం అమలుచేస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక బడ్జెట్లో ఈ రెండు కేటగిరీల్లో రూ.26,145 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,452 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,693 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి లక్ష్యాలు నిర్దేశించింది. వార్షిక సంవత్సరం పూర్తయ్యేలోపు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిశాయి. ప్రస్తుతం నాల్గో త్రైమాసికం కొనసాగుతోంది. ఈక్రమంలో మూడు త్రైమాసికాలలో వినియోగానికి సంబంధించిన వివరాలను నోడల్ ఏజెన్సీలకు ఇవ్వాలి. కానీ గత ఆర్నెళ్లుగా ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుపై అయోమయం నెలకొంది. శాఖల వారీగా లక్ష్యసాధనకు సంబంధించిన వివరాలేవీ నోడల్ ఏజెన్సీలకు ఇవ్వడం లేదు. దీంతో ఈ పద్దు కింద ఎంత ఖర్చు జరిగింది, లక్ష్యాలు ఏమిటనేదానిపై అస్పష్టత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం రెండు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేసింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధినిధి నోడల్ ఏజెన్సీగా ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీగా గిరిజన శాఖను నియమించింది. ఈ శాఖలు ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ సమావేశాలు, నోడల్ ఏజెన్సీ మీటింగ్‌లు, పురోగతిపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఈక్రమంలో ఎస్డీఎఫ్ నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో వినియోగానికి సంబంధించిన సమాచారం సమర్పించాలని పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తాజాగా వివరాలు సమర్పించని ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. త్వరలో నోడల్ ఏజెన్సీ సమావేశం ఉండడంతో ఆలోపు వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశాయి. -
ఎన్నికల తెరపై నోటిఫికేషన్ల డ్రామా
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ ఖాళీల భర్తీపై దృష్టి పెట్టకుండా నిరుద్యోగులను నిలువునా వంచించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాలకు తెరతీస్తోంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని మభ్యపెడుతోంది. 2 లక్షలకు పైగా ఖాళీలుండగా, కేవలం 18,450 పోస్టులనే భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. వచ్చే ఎన్నికలోలబ్ధి కోసమే ప్రభుత్వం ఆరాట పడుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రూల్–7 రద్దుతో నిరుద్యోగులకు షాక్ తాము అధికారంలోకి వస్తే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, ప్రతిఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల దాకా ఖాళీల భర్తీ ఊసే ఎత్తలేదు. 2016 జూన్ 17న జీఓ నెంబర్ 110ను విడుదల చేసి, 10 వేల పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. అందులో 4,009 పోస్టులను ఏపీపీఎస్సీతో, 5,991 పోస్టులను పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు. జీఓ 110కు సవరణల పేరిట కాలయాపన చేశారు. డిసెంబరు ఆఖరు నాటికి కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఏపీపీఎస్సీకి అప్పగించిన వాటిలో కేవలం 2 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందుకు కారణం ఏపీపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి అనుకూలంగా ఉన్న రూల్–7ను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలగించడమే. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరకపోయినా, వేరే కొలువు వచ్చి రిజైన్ చేసినా ఖాళీ అయ్యే ఆయా పోస్టులు రూల్–7తో మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు వచ్చేవి. చంద్రబాబు ఈ రూల్–7ను రద్దు చేశారు. మిగిలిపోయిన పోస్టులనే మళ్లీ కొత్త నోటిఫికేషన్లలో కలిపేస్తున్నారు. 18,450 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రూల్–7ను రద్దు చేయడంతో ఈ పోస్టుల్లోనూ భర్తీ చేసేవి తక్కువే కానున్నాయి. ఎన్ని పోస్టులను కుదిస్తారో! 2016 తరువాత మళ్లీ ఒక్క నోటిఫికేషన్‌కు కూడా చంద్రబాబు అనుమతివ్వలేదు. 2 లక్షలకు పైగా ఖాళీలు ఉండగా, 70 వేలు మాత్రమే ఉన్నాయని, అందులో కేవలం 20 వేలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలంటూ ఆయా శాఖాధిపతులు పంపించిన నివేదికలను బుట్టదాఖలు చేశారు. విద్యాశాఖలో 30 వేలకు పైగా ఖాళీలుండగా, అందులో 14 వేల పోస్టుల భరీకి అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ ప్రతిపాదనలు పంపితే తిరస్కరించారు. త్వరలో ఎన్నికలు రానుండడంతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లంటూ సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారు. కేవలం 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా అనుమతిచ్చారు. ఇందులో కూడా నోటిఫికేషన్ల నాటికి ఎన్ని పోస్టులను కుదిస్తారోనన్న అనుమానాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ ఆఖరు నాటికి గానీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం లేదు. 2019లో మాత్రమే ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుంది. అప్పటికింకా ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిర్దాక్షిణ్యంగా ఊస్టింగ్‌లు రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగులనే నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తప్పించింది. ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు.. ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న 1.50 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించింది. -
ఒకేసారి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతి అధికారులపై ఏకకాలంలో క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన క్షమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) స్పష్టం చేసింది. కొన్ని అవినీతి కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై అధ్యయనం తర్వాత అలాంటి కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుందన్న సాకుతో శాఖపరమైన చర్యల్లో జాప్యం చేస్తున్నారని సీవీసీ గుర్తించింది. కేసు విచారణలో ఉందన్న సాకుతో కొన్ని విభాగాలు, సంస్థలు అలాంటి వైఖరి అనుసరించడం సరైన విధానం కాదని బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్పష్టం చేసింది. -
‘ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) డిమాండ్ చేసింది. ఆదివారం టీఈఏ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కార్యదర్శి సంపత్‌కుమార్ స్వామి మాట్లాడారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని, ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వా లన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు రప్పించాలని, ఈపీటీఆర్ఐలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. -
డమ్మీలైన.. డిప్యూటీ డీఎంహెచ్వోలు..!
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో అధికారాల పంచాయితీ మొదలైంది. పరిపాలన సౌలభ్యం, మెరుగైన సేవల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ అమలు కావడంలేదు. దీంతో ఆస్పత్రుల పర్యవేక్షణ అయోమయంగా మారుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రాతిపదికగా చేసుకుని డిప్యూటీ డీఎంహెచ్‌వో (జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు)లను వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని సంస్థల పర్యవేక్షణ అధికారాలు వీరికే అప్పగించింది. ఈ మేరకు డిప్యూటీ డీఎంహెచ్‌వోల అధికారాలను పేర్కొంటూ 2016 అక్టోబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏడాదిన్నర గడిచినా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావడం లేదు. ఉన్నతాధికారుల ఉదాసీనతతో పాత పద్ధతిలోనే పరిపాలన, పర్యవేక్షణ వ్యవహారాలు సాగుతున్నాయి. ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే అధికారాలు చెలాయిస్తున్నారు. ఈ పరిణామాలపై తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎంజేఏసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ను కోరింది. ఈ ‘అధికారాల’పంచాయితీ వైద్య, ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైద్య సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. టీఎంజేఏసీ పేర్కొన్న ప్రధాన అంశాలివీ - ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిప్యూటీ డీఎంహెచ్‌వో పర్యవేక్షణలోనే వైద్య, ఆరోగ్య శాఖ సంస్థలు, కార్యక్రమాల అమలు జరగాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని డిప్యూ టీ డీఎంహెచ్‌వోలకు నిధుల విడుదల (డీవో) అధికారాలు అమలు కావట్లేదు. - ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యాధికారుల సాధారణ సెలవులు, గరిష్టంగా 30 ఆర్జిత సెలవుల మంజూరు, వైద్యాధికారులు, ఇతర సిబ్బంది ఇంక్రిమెంట్, ఏసీఆర్, క్రమశిక్షణ చర్యలు, ఆకస్మిక తనిఖీ వంటి అధికారాలను డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఇస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే వీటిపై అధికారాలు చెలాయిస్తున్నారు. - లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, ఆస్పత్రుల ఏర్పాటు అనుమతి, నిర్వహణ పర్యవేక్షణ వంటి చట్టపరమైన అధికారాలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే అప్పగించినా.. ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం వంటి చర్యల విషయంలోనూ ఇదే జరుగుతోంది. - మాతా శిశు సంరక్షణ, చిన్నారుల్లో వ్యాధి నిరోధకతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల బాధ్యత పూర్తిగా డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే ఉంది. నెలవారీ సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ డీఎంహెచ్‌వోల ఆధ్యర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. - 108, 104, మృతదేహాల తరలింపు వంటి వైద్య సేవల అమలు, పర్యవేక్షణ అధికారాలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే ఉండాలి. వైద్య శాఖలోని వివిధ విభాగాల కింద ఉన్న ఆస్పత్రుల సేవల అనుసంధానం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి ఇతర ప్రభుత్వ శాఖల్లో సమన్వయం బాధ్యతలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఉంటాయి. కానీ ఇవి డీఎంహెచ్‌వోల అధీనంలోనే ఉన్నాయి. -
‘డూప్’ అకౌంట్లు
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు అకౌంట్లు.. వందల్లో కాదు.. ఇబ్బడిముబ్బడిగా.. ఏకంగా 40 వేలకుపైనే! ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు తెరిచిన ఖాతాలు!! అసలు ఏ విభాగం ఎన్ని ఖాతాలు తెరిచింది? అవి ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో అసలు నిధులున్నాయా? ఉంటే ఎంత ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ఆర్థిక శాఖ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. 40 వేలకు మించిపోయిన ఈ ఖాతాల్లో దాదాపు 10 వేల నుంచి 20 వేల అకౌంట్లు అనుమానాస్పదంగా మిగిలిపోయాయి. వీటిలో భారీ మొత్తంలోనే నిధులు నిల్వ ఉన్నాయని, దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంటాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే వాటినెలా స్వా«ధీనం చేసుకోవాలి.. పెరిగిపోతున్న ఖాతాల సంఖ్యను ఎలా కట్టడి చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి పథకానికి ఈ ఏడాది మే నెలలోనే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూర్చటం కత్తి మీద సామేనని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ లెక్కలేని ఖాతాలపై దృష్టి సారించింది. అందులో నిల్వ ఉన్న నిధులను తవ్వి తీయాలని భావిస్తోంది. ఎందుకు పెరిగిపోయాయి? ఒక్కో ప్రభుత్వ విభాగం తమ అవసరాల మేరకు ఖాతాలు తెరుచుకుంటూ పోవడం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు కారణంగా బ్యాంకు అకౌంట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోయింది. కొన్ని పథకాల అమలుకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవాల్సి వచ్చిందనిఅధికారులు చెబుతున్నారు. కొన్నిసార్లు కేంద్ర, రాష్ట్ర నిధుల కేటాయింపులకు అనుగుణంగా రెండు మూడు ఖాతాలు తెరిచిన సందర్భాలున్నాయి. కొన్ని విభాగాల్లో అధికారులు బదిలీపై వెళ్లినప్పుడల్లా పాత ఖాతాలు కొనసాగించే బదులు.. తమ పేరిట కొత్త ఖాతాలు తెరిచారు. దీంతో కొత్త ఖాతాలు పెరిగి పాత ఖాతాలు మూలనపడ్డాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఖాతాల సంఖ్యపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని వేలల్లో ఖాతాలు ఎందుకున్నాయి.. ఇవన్నీ అవసరమా అని అడిట్‌లో ప్రశ్నించింది. పాత నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్ము కోసం.. బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్మును వాడుకునే కొందరు అధికారుల కక్కుర్తి కూడా.. ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కొందరు అధికారులు ఎక్కడికి బదిలీపై వెళ్లినా.. వెంటనే తన పేరిట జరిగే అధీకృత చెల్లింపులకు కొత్త ఖాతాలు తెరిచారు. అధికారులు మారినప్పుడల్లా.. ‘మీ ఖాతాలు మా బ్యాంకులో నిర్వహించండి..’అంటూ బ్యాంకర్లు సైతం రకరకాల ఆఫర్ల వల విసరటం పరిపాటిగా మారింది. దీంతో అధికారులు తమ ఇష్టానుసారం ఖాతాలు తెరిచారు. దీంతో అవి అన్ని బ్యాంకులు, బ్రాంచీలకు విస్తరించాయి. ఇలా కొత్త అధికారి వచ్చినప్పుడల్లా కొత్త ఖాతాలు తెరవటంతో పాత ఖాతాల్లో నిధులున్నాయా.. లేవా.. ఖాళీ అయ్యాయా.. అన్నది తేలకుండా పోయింది. అనామతు ఖాతాలన్నీ రద్దు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ఉన్న ఖాతాల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఖాతాల వివరాలే అన్ని శాఖలు పంపిస్తాయని, మూలనపడ్డ ఖాతాలను దాచిపెడతాయని ముందుగానే అంచనా వేసుకుంది. అందుకే అధికారికంగా వెల్లడించిన ఖాతా నంబర్లను నోటిఫై చేసి.. బ్యాంకులకు సమాచారం అందించాలని నిర్ణయించింది. తాము నోటిఫై చేసినవిగాకుండా మిగతా ఖాతాలన్నీ చెల్లుబాటు కావనీ, వాటిలో ఉన్న డబ్బును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని బ్యాంకర్లకు సూచించనుంది. దీంతో దాదాపు రూ.వెయ్యి కోట్లు రికవరీ అవుతాయని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల సర్దుబాటు, ఒక పథకం నిధులను అవసరం మేరకు మరో పథకానికి మార్చేందుకు వీలుగా అన్ని విభాగాల్లో పీడీ ఖాతాలు తెరిచే ఆనవాయితీని ఆర్థిక శాఖ ఎప్పట్నుంచో అమలు చేస్తోంది. వాటికి భిన్నంగా లెక్కతేలని సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు కూడా ఉన్నాయని, ఇప్పుడు అందులో ఉన్న నిల్వలపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రభుత్వ శాఖల్లో వెక్కిరిస్తున్న ఉద్యోగుల కొరత
-
ప్రభుత్వ శాఖల్లో వెక్కిరిస్తున్న ఉద్యోగుల కొరత
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల సంక్షేమమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఊదరగొడుతున్నారు. మరోవైపు సంక్షేమ శాఖల్లో వేలాది ఖాళీలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అన్ని సంక్షేమ శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగానే ఉండడం గమనార్హం. ఉన్న అరకొర సిబ్బందితో బడుగుల బతుకులను ఎలా బాగుచేస్తారో ఇక ప్రభుత్వమే చెప్పాలి. ఉన్న ఉద్యోగుల్లోనూ కోత సంక్షేమ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పైగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఖాళీల భర్తీపై నోరెత్తడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం సంక్షేమ విభాగాల్లో పని భారం విపరీతంగా పెరిగిపోయింది. సగం పోస్టులు ఖాళీగా ఉండడంతో సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్కార్ నిర్వాకం వల్ల అంతిమంగా నష్టపోతోంది మాత్రం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలే. ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, లేదంటే పథకాల అమలు కుంటుపడక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. ఖాళీలే ఖాళీలు గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, గృహ నిర్మాణాల శాఖల్లో మంజూరైన పోస్టుల సంఖ్య 41,606 ఉండగా, ఇందులో 19,324 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలు విభాగాల్లో 12,851 పోస్టులకు గాను, ఏకంగా 5,308 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన రీసెర్చ్ మిషన్‌లో మంజూరైన పోస్టులు 70 ఉండగా, ఇవన్నీ ఖాళీగా ఉండడం గమనార్హం. అలాగే గిరిజన గురుకులం విభాగంలో 3,796 పోస్టులకు గాను, 2,384 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో 13 పోస్టులుండగా, అందులో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ ఫెడరేషన్స్‌లో 30 పోస్టులుండగా, అందులో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో 983 పోస్టులున్నప్పటికీ, ఇందులో 712 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. మహిళా సంక్షేమ శాఖలోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ విభాగంలో 19 పోస్టులుండగా, ఈ పోస్టుల్లో ఒక్క అధికారి కూడా లేకపోవడం గమనార్హం. చిన్న పిల్లల సంరక్షణ విభాగంలో 371 పోస్టులుండగా, వీటిలో 190 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణ సంస్థలో రెగ్యులర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అరకొర సిబ్బందితో అగచాట్లు సాంఘిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో ఉద్యోగుల కొరత వల్ల పథకాల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. పథకాల అమలు తీరును పర్యవేక్షించే వారే లేకుండా పోయారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధికోసం చేసుకున్న దరఖాస్తులకు నెలలు గడిచినా మోక్షం లభించడం లేదు. అయ్యా.. మా దరఖాస్తును పరిశీలించండి అంటూ జనం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గిరిజన కార్పొరేషన్లో పోస్టులన్నీ ఖాళీగానే కనిపిస్తుండడంతో ఎవరికి మొర పెట్టుకోవాలో తెలియని దుర్గతి దాపురించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్లోనూ అదే పరిస్థితి. బీసీ కమిషన్‌లో 14 పోస్టులుండగా, అన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వెనుకబడిన తరగతులను ముందంజలోకి తీసుకొస్తామని చెబుతున్న ప్రభుత్వానికి ఈ దుస్థితి కళ్లకు కనిపించకపోవడం విషాదకరం. మహిళా శిశు సంక్షేమం, అనాథ పిల్లల సంరక్షణ తదితర విభాగాలు అరకొర సిబ్బందితో సతమతమవుతున్నాయి. వివిధ సంక్షేమ శాఖల విభాగాల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల సంఖ్య -
ప్రభుత్వ శాఖల్లో ఇంటర్న్‌షిప్
- టాస్క్ సమావేశంలో మంత్రి కేటీఆర్ - జర్మనీ తరహా ప్రాక్టీస్ స్కూల్ విధానం పాటించాలి - పరిశ్రమల్లో ఏడాది ఇంటర్న్‌షిప్‌కు అవకాశమివ్వాలి - ఇంజనీరింగ్ కళాశాలలకు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోపాటు కళాశాలలు కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని చాలా కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాల కోసం ప్రయత్నిస్తున్నాయని, కానీ కొన్ని కళాశాలల వ్యాపార దృక్పథం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్లు, విద్యా సంస్థల చైర్పర్సన్లు, పరిశ్రమల ప్రతినిధులతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కళాశాలల యాజమాన్యాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమాణం కంటే ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలలపై గట్టి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి యువతరమే గొప్ప బలమని, ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత యువశక్తి మనదేశంలో ఉందన్నారు. ఏటా భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ చేసి బయటకొస్తున్న విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం ఉంటోందని పరిశ్రమల వర్గాలు తెలిపాయని మంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ విద్యలో విశ్వఖ్యాతి గడించిన జర్మనీ దేశ ప్రాక్టీస్ స్కూల్ విధానం తరహాలో ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులను పరిశ్రమలో కనీసం ఓ ఏడాది ఇంటర్న్‌షిప్ ఇస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ దిశగా కళాశాలల యాజమాన్యాలు ఆలోచించాలని సూచించారు. వరంగల్, నిజామాబాద్‌లలో టాస్క్ కేంద్రాలు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో వినూత్న కార్యక్రమాలను టాస్క్ చేపట్టిందని, ఇప్పటికే ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిది ద్దిందని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో టాస్క్ ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థులకు టాస్క్ శిక్షణ ఉపయోగపడేలా ఇంజనీరింగ్, ఫార్మసీ, వృత్తివిద్యా కళాశాలలు సహకరించాలని కోరారు. -
ఇంటి గుట్టు గూగుల్!
⇔ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం బహిర్గతం ⇔ వివిధ పథకాల దరఖాస్తుదారుల వివరాలన్నీ ఆన్లైన్లో.. ⇔ పేరు, చిరునామాతోపాటు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల సమాచారమూ ఓపెన్! ⇔ భద్రంగా ఉంచాల్సిన వివరాలన్నీ ఇంటర్నెట్లో ప్రత్యక్షం ⇔ ఓ కేంద్ర ప్రభుత్వ శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల నిర్లక్ష్యం ⇔ లక్షలాది మంది వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ⇔ ‘ది వైర్’ ఆంగ్ల వెబ్సైట్ పరిశీలనలో వెల్లడి మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా..? ఏదైనా ప్రభుత్వ శాఖ నుంచి లబ్ధిదారుగా ఉన్నారా..? అయితే మీ పేరు, ఊరు, పుట్టిన తేదీ సహా వ్యక్తిగత అంశాలెన్నో బహిర్గతం అయిపోతున్నాయి. పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి భద్రంగా ఉండాల్సిన రహస్య సమాచారమూ ఇంటర్నెట్లో దర్శనమిచ్చేస్తోంది. ఆన్లైన్లో కేవలం మీ పేరిటో, ఫోన్ నంబర్తోనో సెర్చ్ చేస్తే చాలు.. మిగతా వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖలు, విభాగాల నిర్లక్ష్య ధోరణే దీనికి కారణం. ది వైర్ అనే ఓ ఆంగ్ల వెబ్సైట్ పరిశీలనలో ఈ విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. – తెలంగాణ డెస్క్ మన పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటివన్నీ మన వ్యక్తిగతం. ఇవి ఎవరికీ తెలియడం మనకు పెద్దగా ఇష్టం ఉండదు, తెలిస్తే మోసాలకు, దుర్వినియోగానికి ఆస్కారం ఎక్కువ. కానీ ఏదో పథకం కోసమో.. మరేదో పనికోసమో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఇచ్చిన లక్షలాది మంది వివరాలు చాలా సులువుగా బహిర్గతం అవుతున్నాయి. కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖ నుంచి, పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతున్నట్లు తేలింది. అందులోనూ వివిధ సంక్షేమ శాఖల పరిధిలో పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు, లబ్ధి పొందిన వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కూడా ఆయా శాఖల వెబ్సైట్లలో ఓపెన్‌గా దర్శన మిస్తున్నాయి. అందులో పేర్లు, చిరునామాల వంటి వాటితోపాటు వారి కులం, మతం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంకు ఖాతాల వివరాలూ ఉండడం గమనార్హం. భద్రంగా, రహస్యంగా ఉంచాల్సిన ఈ వివరాలన్నింటినీ ఆయా శాఖలు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైళ్లలో నమోదు చేసి, వెబ్సైట్లలో పెడుతున్నాయి. ఎవరైనా ఆయా వెబ్సైట్లు ఓపెన్ చేసిగానీ, ఇంటర్నెట్లో సెర్చ్ చేసిగానీ ఈ వివరాలు మొత్తం పొందగలిగేలా ఉండడం ఆందోళనకరంగా మారింది. ఓ ట్వీటర్ పోస్టుతో నేపథ్యంలో పరిశీలన ఎస్టీ–హిల్ (@St_Hill) అనే ఓ ట్వీటర్ యూజర్ పోస్ట్ చేసిన ఆర్టికల్తో ఈ అంశంపై దృష్టి పడింది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో, వ్యక్తిగత సమాచారం చోరీ అయితే ఉండే ప్రమాదాలేమిటనే దానిపై ఆ ఆర్టికల్‌లో వివరించారు. దీంతో ‘ది వైర్’దీనిపై పరిశీలన చేపట్టింది. సంక్షేమ శాఖలు, విభాగాల నుంచి.. – ఒక ప్రతిష్టాత్మక పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వ్యక్తిగత వివరాలను ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ బహిర్గతం చేసినట్లు తేలింది. అందులో పేరు, చిరునామాతోపాటు కుటుంబ వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలూ ఉన్నాయి. – ఒక రాష్ట్ర ప్రభుత్వ శాఖ కూడా ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బాలల సంక్షేమం కోసం కేంద్రం నిర్వహిస్తున్న పథకాన్ని అమలు చేసే ఆ శాఖ.. వేలాది మంది బాలల పేర్లు, వారి చిరునామాలు, కులం, మతం, బ్యాంకు ఖాతాల వివరాలను ఇంటర్నెట్లో పెట్టేసింది. – మరో రాష్ట్ర ప్రభుత్వ శాఖ.. ఓ పథకం కింద శిక్షణ పొందిన వారి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో అందుబాటులో పెట్టింది. – ఇక ఇంకో రాష్ట్ర ప్రభుత్వమైతే ఏకంగా లక్ష మంది ప్రజలకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన ఎక్సెల్ ఫైల్‌ను వెబ్సైట్లో పెట్టడం గమనార్హం. ఓ సామాజికాభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న/లబ్ధిపొందిన వారికి సంబంధించి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందులో ఉన్నాయి. – అయితే ఇలా బహిర్గతమైన సమాచారం ఎంతవరకు వాస్తవమనేదానిపై అధికారికంగా నిర్ధారణ కాలేదని, అందుకోసం ప్రయత్నిస్తున్నామని ‘ది వైర్’వెబ్సైట్ పేర్కొంది. సరైన రక్షణ కల్పించకపోవడంతోనే.. మరో ఘటనలో ప్రభుత్వ సేవలను నిర్వహించే ఓ థర్డ్ పార్టీ వెబ్సైట్ పొరపాటున దాదాపు 5 లక్షల మంది బాలల పేర్లు, వారి ఫొటోలతోపాటు కులం, మతం, ఆధార్ వివరాలను బహిర్గతం చేసింది. ఆ వెబ్‌సైట్‌ను కొద్ది రోజుల తర్వాత మూసేశారని... కానీ వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఇది ఎత్తి చూపుతోందని స్పష్టం చేసింది. ఇక ఇటీవలే మెక్డొనాల్డ్డ్స ఇండియా స్మార్ట్‌ఫోన్ యాప్ వినియోగదారులకు సంబంధించి.. 22 లక్షల మంది వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయని గుర్తుచేసింది. ఇది చట్ట విరుద్ధమే! ఎవరికైనా సంబంధించిన వ్యక్తిగత అంశాలను బహిర్గతం చేయడం చట్ట ప్రకారం నేరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ చట్టం–2016 ప్రకారం ఆధార్ వివరాలను బయటపెట్టడం నేరం. ఆ చట్టంలోని సెక్షన్ 29 లో.. ‘‘ఆధార్ నంబర్‌ను గానీ, బయోమెట్రిక్ సమాచారాన్ని గానీ బహిరంగంగా ప్రదర్శించడం, ప్రచురించడం చేయకూడదు. చట్టంలో పేర్కొన్న కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది..’’అని స్పష్టం చేశారు కూడా. -
హైకోర్టును పోస్టాఫీస్ చేస్తున్నారు
అధికారుల తీరుపై హైకోర్టు ఆక్షేపణ సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించకుండా హైకోర్టును పోస్టాఫీస్ చేస్తున్నారని, అధికారులు చేయాల్సిన పనుల్ని కూడా తామే చేయాల్సి వస్తోందని ఆక్షేపించింది. హైకోర్టును ఏర్పాటు చేసింది ప్రభుత్వ శాఖలు నిర్వర్తించే ప్రతి పనినీ పర్యవేక్షించేందుకు కాదని తేల్చిచెప్పింది. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు పౌరులు సమర్పించే వినతిపత్రాలు, దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖల్లో అమలు చేయాలని, ఇందుకు అంతర్గతంగా ఓ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పు వెలువరించారు. లీజు గడువు ఇంకా ఉన్నప్పటికీ ఎలాంటి కారణాలు చెప్పకుండానే గ్రానైట్ రవాణాకు పర్మిట్లు జారీ చేసేందుకు గనుల శాఖ అధికారులు నిరాకరించారంటూ జయరంగ సాయి గ్రానైట్స్(కర్నూలు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. ఎందుకు కారణాలు చెప్పలేదో వివరించాలని గనుల శాఖ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ‘సమస్యల పరిష్కారానికి పౌరులు సమర్పించే వినతిపత్రాలు, దరఖాస్తుల విషయంలో అధికారులు సకాలంలో స్పందించడం లేదు. తిరస్కరిస్తున్న వాటి విషయంలో కారణాలు చెప్పడం లేదు. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు అంతర్గత వ్యవస్థ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. అధికారులు తమ తీరు వల్ల హైకోర్టును పోస్టాఫీసు చేస్తున్నారు’ అని జస్టిస్ కోదండరామ్ తన తీర్పులో పేర్కొన్నారు. -
కోర్టు వివాదాలు పరిష్కరించుకోవాలి
ప్రభుత్వ విభాగాలకు ప్రధాని మోదీ సూచన న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు కలసి మెలసి విశాల ధృక్పథంతో పనిచేయాలన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ప్రభుత్వ విభాగాలు తీవ్ర ఇబ్బందుల మధ్యే పనిచేస్తున్నాయి. శాఖకు.. శాఖకు మధ్య సమన్వయం అనేదే కనిపించదు. అందువల్లే ఒక విభాగం ఒక నిర్ధిష్టమైన పథకం గురించి ఆలోచన చేస్తుంటే.. మరో విభాగం దీనికి పూర్తి విరుద్ధమైన ఆలోచన చేస్తుంటుంది’’అని ప్రధాని చెప్పారు. ‘‘ప్రభుత్వ విభాగాలు తమ మధ్య వివాదాల పరిష్కారానికి ఒకదానిపై మరొకటి కోర్టులను ఆశ్రయిస్తుంటాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఇరు పక్షాలు కూర్చుని చర్చించుకోవాలి. దీనికి విశాల దృక్ఫథం అవసరం’’అని పేర్కొన్నారు. శుక్రవారం గుజరాత్ కచ్‌లోని రణ్‌లో కేంద్ర, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా మంత్రిత్వ శాఖల సదస్సు జరిగింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోదని, వ్యవస్థాగతమైన ఏర్పాట్లతోనే పోత్సాహం లభిస్తుందన్నారు. ఈ నెల 29న ‘మన్‌కీబాత్’లో పోటీ పరీక్షలపై చర్చించనున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు. -
పాలన.. గాడిన
ప్రజల్లో తొలగుతున్న గందరగోళం ప్రభుత్వశాఖలపై పెరిగిన అవగాహన వీడియో కాన్ఫరెన్స్‌లతో కలెక్టర్ల బిజీబిజీ క్రైం మీటింగ్‌లతో పోలీస్ కమిషనర్... రెండోరోజు ‘కొత్త’ అధికారులు బిజీబీజీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సాక్షి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల విలీనం, పాలన వ్యవస్థ తీరు తెన్నులపై ప్రజల్లో నెలకొన్న గందరగోళం ఇప్పుడిప్పుడే తొలగిపోతోంది. ప్రభుత్వ శాఖల విలీనం, పునర్విభజనపై అవగాహన పెరుగుతోంది. ఇప్పటివరకు విడివిడిగా ఉన్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), ఇంది కాంత్రి పథం (ఐకేపీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చి డీఆర్‌డీఏగా అవతరించింది. అంతకు ముందున్న ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) పోస్టును రద్దు చేసి ఇప్పుడు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో)గా నామకరణం చేశారు. స మాచారం పౌర సంబంధాల శాఖలో పర్యాటక, పురావస్తు, సాంస్కృతిక శాఖలను విలీనం చేయగా, ఇంతకు ముందు ఆ బాధ్యతలను చూసే డివిజనల్ పబ్లిక్ రిలేషన్ అఫీసర్ (డీపీఆర్వో) తప్పించారు. ఇప్పుడా బాధ్యతలను డిప్యూటీ డైరక్టర్(డీడీ) స్థాయి అధికారికి అప్పగించారు. కరీంనగర్‌కు ఈ పోస్టును కేటాయించి, త్వరలోనే డీడీని నియమించనున్నారు. అదేవిధంగా ఐసీడీఎస్ శాఖలోకి వికలాంగుల సంక్షేమశాఖ ను విలీనం చేశారు. వికలాంగ, వయోవృద్ధుల, శిశు మహిళాభివృద్ధి శాఖగా ఏర్పడగా, ఇదివరకున్న పీడీ పోస్టు స్థానంలో జిల్లా సంక్షేమాధికారిని నియమించారు. పౌరసరఫరాల శాఖలోను డీఎస్వో హోదాను పెంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్)గా చేశారు. ఇలా వాణి జ్య పన్నులు, ఇంటర్మీడియెట్ విద్య, బీసీ సంక్షే మ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమం, అటవీ, పోలీసుశాఖల్లోను జరిగిన స్వల్ప, భారీ మార్పులపై నెలకొన్న గందరగోళం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. అభివృద్ధి పథం, ఆశల సౌధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల పునర్విభజన అనంతరం అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత, ఆ జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోను ఏ విధమైన అభివృద్ధి చేయవచ్చన్న దిశలో అధికార యంత్రాంగం అడుగులు వేస్తోం ది. ‘పునర్విభజన’లో జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి కొత్తగా ఏర్పడిన తర్వాత మిగిలిన కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రధానంగా దృష్టి సారించింది. జిల్లాల పున ర్వి భజన అనంతరం జిల్లా కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్‌గా బద్రి శ్రీనివాస్, కొత్తగా ఏర్పడిన పోలీసు కమిషనరేట్‌కు కమిషనర్‌గా వీబీ.కమలాసన్‌రెడ్డి ఈ నెల 11న బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా టీమ్‌గా డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, ఐసీడీఎస్ పీడీ గిరిజారాణి , వ్యవసాయాధికారి(డీఏవో) సీహెచ్.తేజోవతి, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాధవరావు, జిల్లా వైద్య ఆర్యోగశాఖాధికారి రాజేశం, డీఈవో పెగుడ రాజీవ్, డీఐఈవో ఎల్.సుహాసిని తదితర శాఖల జిల్లా ఉన్నతాధికారులు అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందు కు సాగుతున్నారు. జిల్లాలోని పర్యాటక, పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమైన యంత్రాంగం.. ఆ రంగాలపైనా నివేదికలు తయారు చేస్తోంది. ఖనిజ సంపద పరిరక్షణ, వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపుపైనా దృష్టి సారించారు. ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి అందరి లక్ష్యంగా ముందుకెళ్తుండటంలో యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. పథకాల అమలుపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి నేర సమీక్ష, శాంత్రి భద్రతల పరిరక్షణ సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నారు. -
కొత్త డీసీసీబీలపై మల్లగుల్లాలు
విభజిస్తే నష్టదాయకమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లను ఏర్పాటు చేసే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా డీసీసీబీలను విడగొట్టి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. సహకార బ్యాంకుల విభజనగాని, కొత్తగా ఏర్పాటు చేయడంగాని ఆర్బీఐ పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఆర్బీఐ అనుమతి తీసుకుంటేనే ఉన్న వాటిని విభజించడం... లేదా కొత్త వాటిని ఏర్పాటు చేయడం సాధ్యపడుతుంది. అది కూడా లాభనష్టాల ఆధారంగానే కొత్త వాటి ని ఏర్పాటు చేయాలా.. లేదా.. అన్న అంశా న్ని ఆర్బీఐ అధ్యయనం చేసి అనుమతిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలతోపాటు డీసీసీబీల ఏర్పాటు ఉండబోదని... జిల్లాల ఏర్పాటు అనంతరం పాలకవర్గాల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీ మురళీధర్ ‘సాక్షి’తో అన్నారు. అయితే, కొత్త జిల్లాలతోపాటు డీసీసీబీలను కూడా ఏర్పాటు చేయాలని కొందరు డీసీసీబీ సభ్యులు కోరుతున్నారు. డీసీసీబీల నేతృత్వంలో ఉన్న సహకార బ్యాంకుల్లో దాదాపు 30లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రూ.5వేల కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి. వాటిని విడగొట్టి కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే నష్టాలబాట పట్టే పరిస్థితులు ఏర్పడతాయని టెస్కాబ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు ఉంటాయన్న నమ్మకం వస్తేనే కొత్త జిల్లాల్లో డీసీసీబీలను ఏర్పాటు చేస్తామని, దాని ప్రకారం పాలకవర్గాల తీర్మానంతో ఆర్బీఐ అనుమతి తీసుకుంటామని మురళీధర్ పేర్కొంటున్నారు. -
శాఖల స్వరూపం ఇలా..
- ప్రభుత్వానికి చేరిన తుది ప్రతిపాదనలు - ‘సంక్షేమం’పై కొనసాగుతున్న సందిగ్ధత కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది.. మరి ప్రభుత్వ శాఖల స్వరూపం ఎలా ఉండబోతోంది..? ఏయే మార్పులు చేయబోతున్నారు..? వేటిని విలీనం చేయబోతున్నారు..? వీటిపై ఆయా శాఖలు ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించాయి. ఆ వివరాలు శాఖల వారీగా ఓసారి చూద్దాం.. - సాక్షి, హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి..ఒకే కమిషనర్ కిందకు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విలీనమవుతుండడంతో ఇకపై ఈ సంస్థలన్నీ ఒకే కమిషనర్ కింద పనిచేస్తాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా స్థాయి హెడ్లుగా వ్యవహరిస్తారు. మిషన్ భగీరథ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆర్టీసీ.. 18 మంది డివిజినల్ మేనేజర్లు.. 27 జిల్లాలను 18 మంది డివిజినల్ మేనేజర్లు పర్యవేక్షిస్తారు. విస్తీర్ణం, డిపోల సంఖ్య ఆధారంగా పెద్ద జిల్లాలకు ఒక డివిజినల్ మేనేజర్, చిన్నవైతే రెండిటికి కలిపి ఒకరు చొప్పున ఉంటారు. ఆదిలాబాద్, నిర్మల్‌కు సంబంధించి నిర్మల్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లికి కలిపి కరీంనగర్లో, వరంగల్, భూపాలపల్లికి కలిపి వరంగల్‌లో, హన్మకొండ, మహబూబాబాద్‌కు కలిపి హన్మకొండలో, మహబూబ్‌నగర్, వనపర్తికి కలిపి మహబూబ్‌నగర్‌లో, నల్లగొండ, సూర్యాపేటకి కలిపి నల్లగొండలో, మెదక్, సంగారెడ్డికి కలిపి సంగారెడ్డిలో, హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరిలకు హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాలుంటాయి. రిజిస్ట్రేషన్ల శాఖ పనిభారం మేరకు ఉద్యోగుల కేటాయింపు ఉండనుంది. ప్రస్తుతం 12 మంది జిల్లా రిజిస్ట్రార్లు ఉండగా, మిగిలిన 15 పోస్టుల్లో సీనియర్ సబ్ రిజిస్ట్రార్లను డీఆర్లుగా నియమించనున్నారు. పంచాయతీరాజ్.. రాష్ట్రంలో కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటవుతున్నందున ప్రస్తుతం ఉన్న ఎంపీడీవోలనే కొత్త మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. వేర్వేరు మండలాల్లోని గ్రామాలతో ఏర్పాటవుతున్న 10 నుంచి 12 మండలాలకు ఒక ఓఎస్డీని నియమించనున్నారు. వాణిజ్య పన్నులు కొన్ని జిల్లాల సర్కిల్ పరిధిలో మార్పు చేర్పులు జరుగుతాయి. జనగామలోని కేంద్ర కార్యాలయాన్ని యాదాద్రి జిల్లా కేంద్రానికి మారుస్తారు. భూపాలపల్లి, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లలో సీటీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఉప్పల్‌లో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో ఇక డీఐఈవో.. ఇన్నాళ్లూ జిల్లా ఇంటర్మీడియట్ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవీఈవో), ఇంటర్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐవో) వ్యవస్థ ఉండేది. ఇకపై ఇది రద్దు కానుంది. కొత్త జిల్లాల్లో ఈ రెండింటిని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) పేరుతో కొత్త కేడర్‌ను సృష్టించి అమలు చేయనున్నారు. ఇక జిల్లాల్లో పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఇకపై జిల్లా విద్యాశాఖాధికారి వ్యవస్థ మాత్రమే ఉండనుంది. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ (డీపీవో) వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపాదించారు. విద్యుత్.. కొత్త జిల్లాల్లో డిస్కంల జిల్లాధికారులుగా డివిజ నల్ ఇంజనీర్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పరిధిలోని 12 సర్కిల్ కార్యాలయాల సూపరింటెండెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో కొత్త జిల్లాల డీఈలు పనిచేయనున్నారు. జెన్కో, ట్రాన్స్‌కో, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, నెడ్‌క్యాప్, సింగరేణి సంస్థలపై కొత్త జిల్లాల ప్రభావం ఏమీ లేదు. రెవెన్యూలో సెక్షన్ల కుదింపు కలెక్టరేట్లలో ఇప్పటి వరకు ఎనిమిది సెక్షన్లు ఉండగా వాటిని ఆరుకు కుదిస్తారు. గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు. రోడ్లు భవనాలు రెండు మూడు జిల్లాలను ఓ సర్కిల్‌గా చేసి ప్రతి సర్కిల్‌కు ఒక ఎస్ఈని కేటాయిస్తారు. ఉద్యాన, పట్టు పరిశ్రమల విలీనం జిల్లా స్థాయిలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారు. వీటన్నింటికీ కలిపి జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) నేతృత్వం వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల డిప్యూటీ డెరైక్టర్లు, పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల స్థాయి అధికారులు డీఏవోలుగా ఉంటారు. ‘సంక్షేమం’ ఏం చేస్తారో..? సంక్షేమ శాఖల విలీన ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ తుది ప్రతిపాదనలను అందజేయగా, సంక్షేమ శాఖల నుంచి మాత్రం మూడు ప్రతిపాదనలు అందాయి. అవేంటంటే.. 1. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన వివిధ విభాగాలను వాటి మాతృశాఖలో కలిపేయడం. 2. రెండు శాఖలు విలీనమైతే... ► బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విలీనం ► ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమాలు విలీనం ► ఇతర సంక్షేమ శాఖలన్నీ ఒకటవుతాయి 3. అన్ని శాఖలు విలీనమైతే... ► జిల్లా మొత్తానికి ఒకే సంక్షేమ అధికారి ఉంటారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో సహాయ సంక్షేమ అధికారులుగా ఉన్న వారే జిల్లా సంక్షేమ అధికారులుగా కొనసాగుతారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుత జిల్లాలకు డీఎం హెచ్వోలే అధిపతులుగా కొనసాగుతారు. కొత్తగా వచ్చే 17 జిల్లాలకు మాత్రం అడిషనల్ డీఎంహెచ్వోలు, ఏడీఎంహెచ్‌వో(పీహెచ్)లు డీఎంహెచ్‌వోలుగా నియమితులవుతారు. -
సమాధానం చెప్పండి.. మోదీని కలవండి
న్యూఢిల్లీ : 5 నిమిషాల్లో... 20 ప్రశ్నలకు జవాబు చెప్తే... మీరు గెలుచుకుంటారు.. ప్రధానమంత్రిని కలిసే అవకాశం. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్రం ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తోంది. విజేతలుగా నిలిచినవారు ప్రధాని సంతకం చేసిన సర్టిఫికెట్తో పాటు మోదీని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం www.mygov.in వెబ్‌సైట్‌లోని ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఎక్కువ సమాధానాలు చెప్పినవారిని విజేతలుగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్ని వెబ్సైట్లలోనూ ఈ క్విజ్ లింక్‌ను అనుసంధానం చేశారు. మే 25న ప్రారంభమైన క్విజ్ జూన్ 5 వరకు కొనసాగుతుంది. 2015-16లో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఎంత?, ఏడాదికి 100 కోట్ల టన్నుల బొగ్గు లక్ష్యం ఏ సంవత్సరం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? వంటి ప్రశ్నల్ని నాలుగు ఆప్షన్లతో క్విజ్‌లో పొందుపర్చారు. -
ఆప్కోలో అవకతవకలు వాస్తవమే
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విచారణ కమిటీ సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక చేనేత సొసైటీల ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా ఆప్కో (టీఎస్) ఇష్టారీతిన వస్త్రాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం విచారణలో తేలింది. క్షేత్ర స్థాయి అవసరాలతో పొంతన లేకుండా ఇండెంట్ ఆర్డర్లు.. మగ్గాలు లేని సొసైటీలు వస్త్రాన్ని సరఫరా చేయడం.. చేనేత పేరిట పవర్లూమ్ ఉత్పత్తులను అంటగట్టడం వంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించిన వైనం విచారణలో వెల్లడైంది. రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో టీఎస్)లో జరిగిన అవకతవకలపై చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ.. ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనేక అంశాలపై ఆప్కో (టీఎస్) నుంచి అరకొర సమాచారం అందినట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, ఆప్కో విక్రయ షోరూంల నుంచి అందే ఇండెంట్ల ఆధారంగా సొసైటీలకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇవ్వాల్సి ఉన్నా.. అధికారులు నిబంధనలు ఉల్లంఘించి నట్లు నివేదికలో పేర్కొంది. వస్త్రం నాణ్యత, సొసైటీల ఉత్పత్తి సామర్థ్యం తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సిబ్బంది స్టాంపింగ్ వేశారు. ఆప్కో గోదాముల్లోనూ వస్త్ర నిల్వలకు సంబంధించి గేట్ ఎంట్రీలు శాస్త్రీయంగా లేవు. చాలా సొసైటీల్లో మగ్గాల సంఖ్యకు, వస్త్ర ఉత్పత్తికి మధ్య పొంతన లేదని కమిటీ నివేదిక స్పష్టం చేసింది. నిబంధనలు బేఖాతర్: మెదక్ జిల్లాలో ఒక సొసైటీలో ఉత్పత్తి చేసే మగ్గాలు లేకున్నా.. వస్త్రాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించిన వైనం వెల్లడైంది. ఎన్‌హెచ్‌డీసీ నుంచి కనీసం 40% ముడి ఊలు కొనాలనే నిబంధన వున్నా అధికారులు.. వంద శాతం ఊలును బయటి సంస్థల నుంచి కొనుగోలు చేశారు. సొసైటీల నుంచి సరఫరా అయిన వస్త్రానికి చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించకుండా.. పలుకుబడి కలిగిన సొసైటీలకే డబ్బులు చెల్లించారు. ఏపీ సొసైటీల నుంచి వస్త్ర సేకరణ నిలిపేయాలని, తెలంగాణ సొసైటీల నుంచే సేకరించాలనే నిబంధనను పాటించలేదని విచారణలో వెల్లడైంది. విచారణ కమిటీ సూచనలివే.. ఆప్కో (టీఎస్)లో జరిగిన అవకతవకలను ప్రాథమికంగా నిర్ధారించిన విచారణ కమిటీ.. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఆప్కో ఆర్థిక లావాదేవీలు, స్టాక్ వివరాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. సొసైటీల నుంచి కొనుగోలు చేసే వస్త్రం నాణ్యతను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించాలి. ఆప్కో (టీఎస్) సభ్య సంఘాల నుంచి మాత్రమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి. సొసైటీలు అవసరమైనంత వస్త్రాన్ని సరఫరా చేయలేని పక్షంలో.. టెండర్ లేదా ఇతర పద్ధతుల ద్వారా పవర్లూమ్ వస్త్రాన్ని సేకరించాలి. -
‘లక్ష్యం’ సాధించారు...
గ్రేటర్లో రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ళు ► గ్రేటర్లో ప్రభుత్వ శాఖలు కళకళ ► ఆదాయం, పన్నుల వసూళ్లలో ముందంజ ► రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన జీహెచ్ఎంసీ ► హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు ఈ ఆర్థిక సంవత్సరం(2015-16)లో గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఆదాయం పరంగా లక్ష్యాలను సాధించాయి. కొన్ని శాఖలు లక్ష్యానికి చేరువలో ఉండగా..కొన్ని పూర్తి స్థాయిలో టార్గెట్‌ను పూర్తిచేశాయి. ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ ముందంజలో ఉంది. లక్ష్యాన్ని మించి పన్నులు వసూలయ్యాయి. ఇక ఆబ్కారీ శాఖ సైతం లక్ష్యాన్ని మించి ఆదాయం పొందింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి బాగానే ఉంది. ఆర్టీఏ 85 శాతం లక్ష్యం సాధించగా..ఈసారి రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉంది. జలమండలి కూడా ఈ ఏడాది లక్ష్యాన్ని మించి రెట్టింపు ఆదాయం పొందింది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం అర్ధరాత్రి వరకు రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశారు. ఆస్తిపన్ను చెల్లింపులకు అర్ధరాత్రి వరకు గడువున్నందున మరో రూ. 30 కోట్లు వచ్చే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గత (2014-15) ఆర్థిక సంవత్సరం రూ. 1063 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ సంవత్సరం రూ.1065 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, రూ.1200 లోపు ఆస్తిపన్ను వారికి ప్రభుత్వం మాఫీ చేయడంతో దాదాపు రూ. 88 కోట్లు కోత పడిందని పేర్కొన్నారు. అందుకనుగుణంగా వసూళ్ల లక్ష్యాన్ని కూడా రూ. 977 కోట్లకు తగ్గించారు. ఈ లెక్కన లక్ష్యాన్ని అధిగమించామని జీహెచ్ఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మార్చినెల ఒకటో తేదీ నుంచి 31 వరకు రూ. 351 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ సంవత్సరం రూ.375 కోట్లు వసూలైందని అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) జె.శంకరయ్య తెలిపారు. పూర్తి లెక్కలు తేలేవరకు మరో రూ.15 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఆస్తిపన్ను వసూళ్ల కోసం గతంలో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డా.. ఈసారి పరస్పర సంప్రదింపులు, ఎస్సెమ్మెస్‌లు వంటి పద్ధతులతోనే ఇంత భారీ లక్ష్యం సాధించడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఈసారి దుందుడుకు చర్యలకు దిగలేదు. 2012-13లో రూ. 779 కోట్లు వసూలు కాగా, 2013-14లో ఏకంగా రూ. 1020 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం రూ. 1464 కోట్ల లక్ష్యం పెట్టుకోగా, రూ. 1463 కోట్లు వసూలయ్యాయి. గత సంవత్సరం పాత బకాయిలపై పెనాల్టీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికలు, బీసీ గణన, వార్డుల పునర్విభజన తదితర కార్యక్రమాలతో సిబ్బంది మొత్తం ఆ పనుల్లో తలమునకలయ్యారు. ఫిబ్రవరి వరకు ఆస్తిపన్ను వసూళ్లపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. గత నెలన్నర రోజులుగా మాత్రం విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలను.. దిగువస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరినీ ఆస్తిపన్ను వసూళ్లకు నియమించారు. ఉన్నతాధికారులకు సూపర్వైజర్ బాధ్యతలప్పగించారు. భారీ బకాయిలున్న గృహయజమానులు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. కమిషనర్ సైతం పలు సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. అంచనాలను మించిన ‘కిక్కు’... సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం గ్రేటర్ ఆబ్కారీశాఖకు కాసుల పంట పండినట్లేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆబ్కారీశాఖ అంచనాలకు మించి అమ్మకాల్లో వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. గతేడాది(2014-15)సంవత్సరంతో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో నగర ఆబ్కారీశాఖ ఆదాయంలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో 20 శాతం ఆదాయం అధికమని పేర్కొన్నాయి. మొత్తంగా ఈ గత ఏడాదిగా హైదరాబాద్, సికింద్రాబాద్, ధూల్‌పేట్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించామన్నారు. కాగా గ్రేటర్ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లలో అమ్మకాల కిక్కు ఊపందుకుందని తెలిపారు. లక్ష్యానికి చేరువైన ఆర్టీఏ 85 శాతం ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఆదాయం ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యానికి చేరువలో ఉంది. కొత్తవాహనాలపై వచ్చే జీవితకాల పన్ను, రవాణా వాహనాలపైన త్రైమాసిక పన్ను, తదితర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకున్నట్లు ఆర్టీఏ రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.858.62 కోట్ల టార్గెట్ నిర్దేశించగా, ఈ నెలాఖరు నాటికి రూ.761 కోట్ల ఆదాయం లభించింది. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ.676.69 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.574.22 కోట్ల ఆదాయాన్ని సముపార్జించారు. ద్విచక్రవాహనాలు, కార్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో రవాణాశాఖ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది సుమారు 46 లక్షల వాహనాలు నమోదు కాగా, వాటిలో 30 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, మరో 8 లక్షల కార్లు ఉన్నాయి. జీవితకాల పన్ను రూపంలోనే పెద్దమొత్తంలో ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. జలమండలికి రికార్డు ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి తాగునీటి కటకట లేకుండా చేస్తున్న బోర్డు 2015-16 సంవత్సరానికి రూ.1129.42 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా...దాన్ని మించి ఏకంగా 1237.88 కోట్ల ఆదాయం పొందింది. గతేడాది 1213.40 కోట్లు రాగా, ఈసారి దాన్ని మించి ఆదాయం సమకూరడం పట్ల జలమండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2013-14లో 858.09 కోట్లు, 2012-13లో 756.33 కోట్లు ఆదాయం వచ్చింది. వాణిజ్య రాబడి కీలకం.. సాక్షి, సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ మహా నగర రాబడి అత్యంత కీలకం. వాణిజ్య పన్నుల శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, మహానగరంలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి ద్వారానే అత్యథికంగా ఆదాయం సమకూరుతోంది. మాహ నగరంలోని ఏడు డివిజన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.21 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ.17 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), సీఎస్టీ తదితర పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత వరకు రాబడి లభిస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది.. రిజిస్ట్రేషన్ శాఖ రాబడి అంతంతే.. ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నుంచి అదాయం రాబడి అధికంగా నే ఉంటుంది రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్)లు ఉండగా అందులో మహానగరం పరిధిలోనే నాలుగు డీఆర్లు ఉన్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాట 68.89 శాతం వరకు ఉంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 2360 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ. 1896.58 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. -
2,600 ఎకరాల్లో కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో భాగంగా దాదాపు 2,600 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దశలవారీగా పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. సచివాలయం, ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, స్వయం ప్రతిపత్తి గల శాఖలు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, స్టేట్ గెస్ట్‌హౌస్, వీఐపీ హౌసింగ్, స్టాఫ్ హౌసింగ్‌కు 104.6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఆర్కిటెక్చర్ అండ్ అర్బన్ డిజైన్, ల్యాండ్ స్కేపింగ్, ఇంటీరియర్ డిజైన్లను అందించే అనుభవం ఉన్న సంస్థల నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల స్వీకరణకు ఆఖరు తేదీ ఈ నెల 11. టెండర్లను 14వ తేదీన ఖరారు చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1,850 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు పైసా కూడా ఖర్చు చేయలేదని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు సీఆర్డీఏ హడావుడిగా ప్రతిపాదనలు రూపొందించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రధానమైన నిర్మాణాలు అసెంబ్లీ, హైకోర్టు మినహా మిగిలిన నిర్మాణాలకు ఎంత స్థలం కావాలో.. ఎంత చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలు ఉంటాయో సీఆర్డీఏ పేర్కొంది. -
కుదరదు గాక కుదరదు
జూన్ 1 తర్వాత హైదరాబాద్ నుంచి పనిచేయడానికి నో ♦ సచివాలయంతోసహా అన్ని శాఖలూ కొత్త రాజధానికే ♦ ఆలోగా అన్ని రికార్డులు ఇ-ఆఫీస్‌లో ఉంచాలి : సీఎం ఆదేశం ♦ సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి.. హడావుడెందుకని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ నుంచి పనిచేయడానికి ఎవరినీ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఉన్నతాధికారులు, మంత్రుల సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను జూన్ 1వ తేదీ తరువాత సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్ నుంచి పనిచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. జూన్ 1 నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, సచివాలయ శాఖలు నూతన రాజధాని నుంచే పనిచేయాలన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల రికార్డుల్ని ఇ-ఆఫీస్‌లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని, జూన్ 1 నాటికి ఇ-ఆఫీస్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎవరి మేలుకోసం ఈనిర్ణయమంటున్న ఉద్యోగులు.. సీఎం ఆదేశాలపై సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టకుండా హడావిడిగా హైదరాబాద్ నుంచి ఆఫీసుల్ని, ఉద్యోగులను తరలించడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఇ-ఆఫీసులోనే ఫైలును పంపించాలని నిర్ణయం తీసుకున్నందున ఎక్కడినుంచి పనిచేస్తే ఏమిటని అంటున్నారు. ఇ-ఆఫీస్ అమల్లోకి వచ్చినందున నూతన రాజధానిలో సచివాలయంతోపాటు ఇతర శాఖల కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్‌లోనే ఉద్యోగులు పనిచేయడం వల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయని పేర్కొంటున్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నందున హడావుడిగా హైదరాబాద్‌ను వీడివెళ్లాల్సిన అవసరం ఏముందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనాల్ని అద్దెకు తీసుకుని, వారికి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకే ప్రభుత్వం తరలింపు హడావుడి చేస్తోందనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. లింగమనేని సంస్థకు చెందిన అతిథిగృహంలో ముఖ్యమంత్రి నివసిస్తున్నందున అందుకు ప్రతిగా అదే సంస్థకు చెందిన విల్లాల్ని, అపార్ట్మెంట్లను ఎక్కువ ధర అద్దె చెల్లించి మంత్రులు, ఉన్నతాధికారుల నివాసానికి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాగా నూతన రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి అధికారుల కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దాని ఆధారంగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రుల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా శనివారం సీఎం నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఉద్యోగులు, కార్యాలయాల తరలింపుపైనా చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
తాత్కాలిక సెక్రటేరియట్.. మేధా టవర్స్
సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం సమీపంలోని మేధా టవర్స్‌లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుపై కసరత్తు సాగుతోంది. పలు ప్రభుత్వ శాఖలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఐటీ సెజ్‌లో భాగంగా వైఎస్సార్ హయాంలో దీనిని 30 ఎకరాల్లో నిర్మించారు. 2006లో నిర్మాణం చేపట్టి 2010లో పూర్తిచేశారు. ఎల్ అండ్ టీ, ఏపీఐఐసీ నేతృత్వంలో సుమారు రెండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనంలో 11 వేల మంది పనిచేసేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం నాలుగు కంపెనీలు ఇందులో కొనసాగుతుండగా 20 వేల చదరపు అడుగుల స్థలం మాత్రమే వినియోగంలో ఉంది. విజయవాడలో తగినంతగా ఐటీ అభివృద్ధి లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం మేధా టవర్స్ టీడీపీ ప్రభుత్వానికి నీడనిచ్చే కల్పతరువుగా కనిపిస్తోంది. జవహర్‌రెడ్డి ప్యానల్ సిఫారసు మేరకు... మేధా టవర్స్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటం దీనిని సెక్రటేరియట్‌కు ఎంపిక చేయడానికి ప్రధాన కారణమని సమాచారం. రాజధాని ప్రాంతంలోని క్యాంప్ఆఫీస్కు నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులు సమీ క్షలు, శాఖాపరమైన పనుల నిమిత్తం రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇక్కడికి రావాలని మంత్రులు, అధికారులకు కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని డిసెంబర్ నాటికి తరలించాలని భావిస్తున్నారు. మిగిలిన అధికార యంత్రాంగం 2016 మార్చి నాటికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజ ధాని ప్రాంతంలో ప్రభుత్వ శాఖలు, మంత్రుల కార్యాల యాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేలా ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. వారిలో పంచాయతీరాజ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్యాంబాబు, హౌసింగ్ సెక్రటరీ లవ్అగర్వాల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన హేమ మునిచంద్రలను నియమించారు. ఈ ప్యానల్ అవసరమైన భవంతులు, సౌకర్యాల కోసం వెదుకులాట వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మేధాటవర్స్ విశాలమైన నిర్మాణమయినందున అన్ని విధాలా బాగుంటుందని జవహర్‌రెడ్డి ప్యానల్ గట్టి ప్రతిపాదన చేసినట్టు సమాచారం. దీని సమీపంలో విశాలమైన స్థలం ఉన్నందున పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, గన్నవరం విమానాశ్రయానికి, జాతీయ రహదారికి చేరువలో ఉండటం వల్ల రవాణాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. విశాలమైన గదులు, సమావేశాలకు సరిపడే హాళ్లు, విద్యుత్, ఫోన్, వైఫై సౌకర్యాలు కల్పించేం దుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. దేశ, విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు అవసరమైతే ఏ విషయమైనా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా ఉందని తమ ప్రతిపాదనలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియేట్‌తో పాటు కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసే యోచన ఉంది. విజయవాడ కంటే గుంటూరులో ఇళ్ల అద్దెలు తక్కువగా ఉండటంతో అవసరమైతే గుంటూరులో మరికొన్ని శాఖలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 85 భవనాల పరిశీలన... ప్రభుత్వ శాఖలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలను ఇక్కడికి తరలించేలా అవసరమైన భవంతుల కోసం వెదుకులాటలో భాగంగా పలు ఇళ్లను గుర్తించారు. విజయవాడతో పాటు సమీపంలోని ఆరు మండలాల్లో ఇప్పటి వరకు 85 భవంతులను పరిశీలించారు. కృష్ణా జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్ శరత్‌బాబు వీటిని పరిశీలించి వాటి వివరాలు, ఫొటోలను ఉన్నతాధికారులను అందించినట్టు తెలిసింది. విజయవాడ నగరం, విజయవాడ రూరల్, పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో గుర్తించిన భవంతుల ఎత్తు, ఎంత విస్తీర్ణం, రహదారి, మంచినీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై పూర్తి నివేదికలను అందించారు. వాటిని పరిశీలించి అనుకూలమైన భవంతులను అద్దెకు తీసుకునేలా రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసు చేయాల్సి ఉంది. -
ఆ ప్రతిపాదనలను ఆమోదించొద్దు
ప్రభుత్వ శాఖలకు సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో గల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి షీలాభిడే కమిటీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించవద్దని, వాటిని అమలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవల విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన 1,253మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ ఉద్యోగులను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం సూచించినా తెలంగాణ సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఉద్యోగుల పంపిణీ తేలే వరకు ఈ సంస్థల్లో ఆస్తులు, అప్పుల పంపిణీని చేయరాదంటూ షీలాభిడే కమిటీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీని కొనసాగింపుగా ఇప్పటికే ఆస్తులు, అప్పులు పంపిణీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయరాదని, తిరిగి షీలాభిడే కమిటీకి పంపించేయాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు. -
తరతరాలుగా వెట్టిచాకిరే..
- గిరిజనులను కదిలిస్తే కన్నీళ్లే - రూ.3 వేలు అప్పు చేసినందుకు ఏళ్లతరబడి శ్రమ చేస్తున్న వైనం - పట్టించుకోని రెవెన్యూ, కార్మికశాఖ గూడూరు: నేటి ఆధునిక యుగంలోనూ జిల్లాలోని గిరిజనులు వెట్టిచాకిరీలో మగ్గుతున్నారు. తరతరాలుగా భూస్వాముల చెప్పుచేతల్లో వేలాది మంది గిరిజనులు నలిగిపోతున్నారు.వారిని రక్షించాల్సిన ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులెవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా కార్మిక , రెవెన్యూశాఖలు వెట్టిచాకిరీకి గురవుతున్న గిరిజనులను కాపాడే విషయంలో ఘోరంగా వైఫల్యం చెందాయనే విమర్శలొస్తున్నాయి. కార్మికశాఖాధికారులకు గిరిజనుల వెట్టిచాకిరీ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. తొమ్మిది మందికి విముక్తి... ఈ క్రమంలోనే చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో శనివారం ఏఆర్డీ సంస్థ డైరక్టర్ బషీర్ ఫిర్యాదు మేరకు వెట్టిచాకిరీ నుంచి విడుదలైన 9 మంది గిరిజనులు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీరు తెప్పించక మానదు. నర్రవారిపాళెంలోని కాల్తీరెడ్డి సుబ్రహ్మణ్యం అనే భూస్వామి వద్ద రెండు తరాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నామని బాధితులు తెలిపారు. దీనికి కారణం ఎన్నో ఏళ్ళ కిందట తాము తీసుకున్న రూ. 3వేలు అప్పు.. రెండు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా అక్కడే పనిచేస్తున్నా జీతాలు ఇవ్వకపోవగా ఆ ఆప్పు నేటికి రూ. 50వేలు అయినట్లు చెబుతున్నాడు. వారసత్వ అప్పుల్లో కూరుకుపోయిన వైనం... గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతే వెట్టిచాకిరీకి కారణమని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,272 హ్యామ్లెట్స్లో 65 వేల కుటుంబాల్లో సుమారు 2.85 లక్షల మంది గిరిజనులున్నారు. వీరి ప్రధాన వృత్తి చేపల పట్టడం. చెరువుల్లో, గుంతల్లో చేపలు పట్టుకునే హక్కును ఆయా ప్రాంతాల్లోని పంచాయతీలు, సొసైటీలు హస్తగతం చేసుకుంటుండడంతో వీరికి జీవనోపాధి ఉండటం లేదు. పేదరికంలో మగ్గుతున్న గిరిజనుల్లో ఎక్కువశాతం మంది భూస్వాముల రొయ్యల గుంతలు, ఇటుకబట్టీల వద్ద ఏళ్ల తరబడి తరతరాలుగా కుటుంబాలతో కలిసి వెట్టిచాకిరీకి గురవుతున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న భూస్వాములు వారికి కొద్ది మొత్తాల్లో అప్పులు ఇచ్చి వాటిని బూచిగా చూపుతూ ఎక్కడికీ కదలనివ్వకుండా వారసత్వంగా అప్పులను వారి పై రుద్దుతున్నారు. దీంతో గిరిజనులు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. పారిపోతే చిత్రహింసలే... ఎవరైనా ధైర్యం చేసి ఇతర ప్రాంతాలకు పారిపోతే వారిని వెతికి పట్టుకుని భూస్వాములు చిత్రహింసలకు గురిజేస్తారు. వారి కుటుంబసభ్యుల మధ్యనే శిక్షలు విధిస్తున్నారు. భూస్వాములు వారి వద్ద వెట్టిచాకిరీ చేసే గిరిజన కుటుంబాల్లోని మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. లైంగిక వేధింపులపై డీఎస్పీ విచారణ భూస్వామి గూడూరు ప్రాంతంలోని తాను నివాసముంటున్న ఇంట్లో వెట్టిచాకిరి చేయిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంపై ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. భూస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసు, చైల్డ్ లేబర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. నిందితుడు సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నందున గాలింపు చేపట్టామని తెలిపారు. -
సర్కారీ సొమ్ము నీళ్లపాలు !
కరీంనగర్ హెల్త్ : ప్రభుత్వ శాఖలను కదిలిస్తే... తమ దగ్గర డబ్బులే లేవు.. ఏం చేయాలో అర్థం కావడం లేదనే సమాధానం సాధారణమే. కానీ, పుష్కలంగా డబ్బులుండీ.... యంత్రాలు సమకూర్చుకున్న తరువాత కూడా వాటిని వాడకుండా పడేయడం ఎక్కడైనా చూశామా? వైద్య ఆరోగ్యశాఖలో ఇది మామూలే. గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు రుతుస్రావం సమయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారని... వారికి న్యాప్కిన్స్ అందిస్తే ఆయా రోగాలు రాకుండా అరికట్టవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు జిల్లాలో వృథా అయ్యాయి. ప్రతినెలా మహిళలు, యుక్తవయసు బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం(2013 మే 6న) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఆర్ఎం) నిధుల ద్వారా జిల్లాకు రూ.3,99,920 విడుదల చేసింది. ఈ నిధులతో న్యాప్కిన్ యంత్రాలు, ముడిసరుకు తెప్పించింది. జిల్లాలోని కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, కోరుట్ల ప్రాంతాల్లో ఆయా యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఉన్నతాధికారుల నిర్లక్ష్యం... సిబ్బంది అవగాహన లోపంతో ఆ యంత్రాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యూరుు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలకు అందని మిషన్ లక్ష్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, భద్రతపై అవగాహన పెంపొందించేందుకు 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది. శిశు, యుక్త వయసు బాలికలు, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించింది. రుతుస్రావ సమయంలో అవగాహన లేక సరైన జాగ్రత్తలు పాటించక వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యశాఖ పరిష్కారానికి చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్థానిక అంగన్వాడీ, బాలికల వసతిగృహాలు, ఆస్పత్రుల ద్వారా శానిటరీ న్యాప్కిన్ పంపిణీ చేయాలని సంకల్పించింది. వీటి తయారీకి అవసరమైన నిధులు మంజూరు చేసింది. తయారీకి కావాల్సిన యంత్రాలు, ఉపయోగించే ముడిసరుకు వంటివి తెప్పించారు. వాటిని తయారు చేయడానికి స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించి వారికి శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. మిషన్ పనితీరు, తయూరీపై యంత్రాల కంపెనీ ప్రతినిధితో శిక్షణ ఇప్పించారు. ఇదే సమయంలో ఈ యంత్రాలతో తయారు చేసిన న్యాప్కిన్లు నాణ్యత ఉండవని, వీటి తయారీకి కొనుగోలు కంటే ఖర్చు ఎక్కువే అవుతుందని తెలుసుకున్న అధికారులు వాటిని ఏర్పాటు చేయకుండానే మూలన పడేశారు. ప్రస్తుతం ఆ యంత్రాలు గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భద్రపర్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆధునిక యంత్రాలపై దృష్టి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన న్యాప్కిన్ తయారీ యంత్రాలు మూలనపడి ఉండటంపై ప్రజాప్రతినిధులు పాలకమండలి సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకపోవడంతో మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని... సమస్య పరిష్కారంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. కొత్త యంత్రాల ఏర్పాటుకు కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడటంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కాలపరిమితి దాటిపోయింది న్యాప్కిన్స్ తయారు చేసే మిషన్ పూర్తిగా కాలపరిమితి దాటిపోవడంతో వాడటం లేదు. ఈ మిషన్‌తో ఎక్కువ ఖర్చుతోపాటు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అధునాతన ఆటోమెటిక్ మిషన్‌ను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారుచేశారు. దీనికి రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎంపీ వినోద్‌కుమార్ వివరాలు అడిగారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపడతాం - ఎండీ అలీమ్,డీఎంహెచ్‌వో -
అంతా వారిష్టం
ఏలూరు :ప్రభుత్వ శాఖల్లో బదిలీల వేడి రాజుకుంటోంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, మార్గదర్శకాల్లో సర్కార్ మార్పులు చేసింది. దీనివల్ల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా బదిలీల వ్యవహారం నడిపే ప్రమా దం ఉందని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతానికి మించి బదిలీ చేయకూడదన్న పరిమితిని ఎత్తివేయడం, గరిష్ట సర్వీసు ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గింపు, కొన్నిశాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయడం గుబులు రేపుతోంది. మొత్తం ప్రక్రియను ఇన్చార్జి మంత్రి పర్యవేక్షణలో చేపట్టనుండటంతో ప్రజాప్రతినిధుల జోక్యం మరింత తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీరో సర్వీసు నుంచి మూడేళ్లలోపు ఒకే స్థానంలో పనిచేస్తున్న వారిని ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ రెండు శాఖల్లో సిఫార్సులకే పెద్దపీట మాట వినని అధికారులను బదిలీ చేస్తామని, పదోన్నతుల వ్యవహారం కూడా తమ చేతుల్లోనే ఉందని ఇటీవల జిల్లాకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం గుబులు రేపుతోంది. ఆర్‌డబ్ల్యుఎస్ ఇన్చార్జి ఎస్ఈగా కొనసాగుతున్న ఏలూరు ఈఈ సీహెచ్ అమరేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తారా, అదే స్థానంలో కొనసాగిస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ కార్యదర్శి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 155 మందిని బదిలీ చే యడానికి అవకాశం ఉందని సమాచారం. డీపీవో కార్యాలయ పరిపాలనాధికారి జి.సంపత్‌కుమారి, ఏలూరు డీఎల్పీవో జి.రాజ్యలక్ష్మి ఇక్కడకు వచ్చి మూడేళ్ల కాలం పూర్తికావడంతో వారికి బదిలీ తప్పదని తెలుస్తోంది. రెవెన్యూలో కౌన్సెలింగ్‌కు అవకాశం? జిల్లా రెవెన్యూ శాఖలో వీఆర్వో మొదలుకుని ఆర్ఐ, డెప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్లను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్ ద్వారా రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా మార్గదర్శకాల్లో మార్పులతో ఎక్కువ మందిని సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. నివేదికలు కోరిన కలెక్టరేట్ జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు, మూడేళ్లు పూర్తికాని ఉద్యోగుల వివరాలను కేడర్ల వారీగా నివేదించాలని కలెక్టరేట్ వర్గాలు విభాగాధిపతులను కోరాయి. సోమవారం నాటికి హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈ మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొన్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆదివారం సెలవు రోజైనప్పటికీ కలెక్టరేట్ నుంచి అడిగిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు కుస్తీ పట్టారు. రోజుకో జీవోతో అయోమయం బదిలీలపై నిషేధం ఎత్తివేసిన రోజు నుంచి ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేయడంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఇంకా సరైన విధి విధానాలు రాకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. గతంలోనే మాదిరిగా కేడర్ స్ట్రెంగ్త్‌లో 20 శాతం వరకు మాత్రమే బదిలీలు చేపడితే పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది ఉండదు. ఇష్టారాజ్యంగా ఎవరికి కావాల్సిన ఉద్యోగిని వారు తీసుకునే అవకాశం కొత్త విధానంలో కనిపిస్తోంది. దీనివల్ల కార్యాలయాల్లో పని విధానం దెబ్బతింటుంది. అవసరం మేరకు బదిలీలు చేపట్టాలి. అదికూడా పారదర్శకంగా జరగాలి. - చోడగిరి శ్రీనివాస్, అధ్యక్షులు, జిల్లా ఇరిగేషన్ ఎంప్లాయాస్ అసోసియేషన్ తీరుతెన్నూ లేదు ఈ నెలలో బదిలీల పక్రియపై విడుదల చేసిన షెడ్యూల్ తీరుతెన్నూ లేదు. బదిలీలకు సంబంధించి జీవోలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెలాఖరులో బదిలీలు చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్, ఆయా శాఖాధిపతులు చర్చించి బదిలీలు చేయాల్సి ఉన్నదృష్ట్యా ఈ వ్యవహారంలో జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్లోనే వివిధ శాఖల్లో బదిలీలు జరిగాయి. ఈ దృష్ట్యా అవసరం మేరకే బదిలీలు చేయడం ఉత్తమం. అది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పారదర్శకంగా చేయాలి. - ఆర్ఎస్ హరనాధ్, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ -
అసంతృప్తి..ఆగ్రహం
ఒంగోలు : అడుగడుగునా అసహనం..అసంతృప్తి... ప్రభుత్వ శాఖలు, అధికారుల పనితీరుపై ఆగ్రహం... స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో శనివారం రాత్రి నాలుగు ప్రభుత్వ శాఖలపై మంత్రి శిద్దా రాఘవరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరిస్థితి ఇది. జిల్లాలో ప్రభుత్వ పాలనను వేగవంతం చేసేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి శిద్దాకు అధికారులు అడుగడుగునా చుక్కలు చూపించారు. ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పకుండా మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు. సమావేశంలో కేవలం నాలుగు శాఖలపైనే సమీక్షించాలని కలెక్టర్ విజయకుమార్ నిర్ణయించారు. ఆ మేరకు సమావేశం ప్రారంభానికి ముందే దానిపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి తదుపరి సమావేశానికి అన్ని శాఖల సమీక్షకు సిద్ధంగా ఉంటామంటూ వివరణ ఇచ్చారు. అయితే, సమీక్ష ప్రారంభించినన అనంతరం ప్రతి శాఖపైనా శాసనసభ్యులు ప్రశ్నించడంతో అధికారులు నీళ్లునమలడానికే పరిమితమయ్యారు. దీంతో పలుమార్లు మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ విజయ్‌కుమార్‌లు జోక్యం చేసుకుని అధికారులను మందలించారు. సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు..? : ఎమ్మెల్యేలు గొట్టిపాటి, ఆదిమూలపు ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ లక్ష ఎకరాల ఆయకట్టుకు ఎందుకు నీరివ్వలేకపోతున్నారో చెప్పాలంటూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. 95 శాతం పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదల చేసుకోలేకపోవడానికి గల కారణాలు చెప్పాలంటూ నిలదీశారు. 61 ఎకరాల స్థల సేకరణ సమస్యంటూ చెప్పడంతో 5 సంవత్సరాలుగా అదే సమస్య చెబుతుంటే ఇక ఎలా పూర్తిచేస్తారంటూ మంత్రి శిద్దా జోక్యం చేసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువలపై అధికారుల పర్యవేక్షణ లేకుండా ఉంటే చివరి భూములకు నీరెలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అంతేగాకుండా జోన్-1కు నీరు ఎప్పటి వరకు ఇస్తారు, జోన్-2కు ఎప్పటి వరకు ఇస్తారని ప్రశ్నించారు. ఇవ్వలేకపోతే రైతులకు ఎలాంటి పంటలు వేసుకోవాలో సూచనలు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఏంటని నిలదీశారు. రబీ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైతే రైతులకు ఎప్పటి వరకు నీరిస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలంటూ గొట్టిపాటి రవికుమార్ పట్టుబట్టారు. దీంతో మంత్రి శిద్దా జోక్యం చేసుకుని ఆదివారం జిల్లా పర్యటనకు భారీ నీటిపారుదల శాఖామంత్రి వస్తున్నందున మాట్లాడి తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విచారణకు ఆదేశించాలి : ఎమ్మెల్యే డోలా సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి దొంగపట్టాలు పుట్టించి నష్టపరిహారం తీసుకున్నారని, దానిపై విచారణకు ఆదేశించాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. సగిలేరు ఆవశ్యకతను గుర్తించాలి : ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరులో సగిలేరు కాలువ ఆవశ్యకతను గుర్తించాలని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బల్లికురవ, మార్టూరు మండలాల్లో డ్రైనేజీ కాలువల పర్యవేక్షణ ఏ శాఖ చూస్తుందో తెలియదనడంతో అధికారులంతా ఒకరి శాఖపై మరొకరు చెప్పుకున్నారు. దీంతో జిల్లా మొత్తాన్ని చీరాలలో ఉన్న డ్రైనేజీ అధికారుల పర్యవేక్షణకే ఇచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడతామంటూ మంత్రి శిద్దా సూచించారు. తాగునీటిపై గందరగోళం... తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌డబ్ల్యూయస్ ఈఈపై అద్దంకి, గిద్దలూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీడబ్ల్యూ స్కీములను తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకున్నారని ఆరోపించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తక్షణమే టెండర్లు పిలుస్తామని చెప్పిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం పర్సంటేజీలే అందుకు కారణమంటూ ఆరోపించారు. కొమ్మాలపాడు, మోదేపల్లి వంటి ప్రాంతాల్లో స్కీములు కట్టారని, కానీ గ్రామం పక్కనుంచే నీరు వెళ్తున్నా ట్యాంకులు నింపుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టినా కనీసం వాటికి కనెక్షన్లు ఇప్పించుకోవడంలో కూడా నిర్లక్ష్యం తాండవిస్తుందంటూ మండిపడ్డారు. ఇప్పటికే గిద్దలూరు పట్టణంతోపాటు పలు మండలాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైందని, ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదంటూ మంత్రికి నివేదించారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుంటూ ఎన్నికలకు ముందు చాలా పథకాలు వచ్చాయని, అయితే సకాలంలో పూర్తిచేయకపోవడం వల్ల అవన్నీ వృథా అయ్యాయని పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖాధికారుల పొంతనలేని లెక్కలు... మార్కెటింగ్ శాఖాధికారులు పొంతనలేని లెక్కలు చెప్పడంతో ఆ శాఖ తీరును కూడా ఎమ్మెల్యేలు ఎండగట్టారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుంటూ సమావేశానికి వచ్చే సమయంలోనే పూర్తి సమాచారంతో రావాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం జేజే-11 శనగల కొనుగోలుపై దృష్టిసారించడంతో బయటి మార్కెట్ కూడా పెరిగిందని శాసనసభ్యులు సూచించారు. అందువల్ల కాక్-2, బోల్డ్ రకానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొనుగోలుపై దృష్టిసారిస్తే ప్రైవేటు మార్కెట్ కూడా పెరిగి రైతు లాభపడతారంటూ గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ దానిపై కూడా దృష్టిపెడతామని, ప్రైవేటు వ్యాపారులతో కూడా చర్చిస్తున్నామని అన్నారు. అధికారులందరితో తప్పకుండా పనిచేయిస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. -
బకాయిల భారం
కడప అగ్రికల్చర్: వివిధ ప్రభుత్వ శాఖలు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ నష్టాల షాక్‌కు గురవుతోంది. అధిక ధరలకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో సంస్థ తీవ్ర రుణ భారంలో చిక్కుకు పోయింది. ఈ ఊబి నుంచి బయట పడేందుకు సంస్థ సాధారణ వినియోగదారుడిపై భారాల బండమోపుతోంది. పదులు, వందల్లో ఉన్న బిల్లులు చెల్లించడం ఆలస్యమైతేనే సామాన్యులను నానా విధాలుగా వేధించే విద్యుత్ అధికారులు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, చిన్న, పెద్ద పరిశ్రమల బకాయిలపై ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రూ.114 కోట్ల బకాయిలు.. 14 విద్యుత్ రెవెన్యూ ఆఫీసుల పరిధిలో శాఖకు రావాల్సిన బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.1.08 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.6.36 కోట్లు ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి వీధి దీపాలు, తాగునీటి పంపింగ్ స్కీములు, పంచాయతీ కార్యాలయాల నుంచి రూ.51.44 కోట్లు, కోర్టుల్లో వివిధ కేసులు ఉండటం వల్ల రూ.12.53 లక్షలు, ఆర్ఆర్ యాక్టు ఉపసంహరించుకోవడం వల్ల రూ.83 వేలు, సర్వీసుల తొలగింపు బకాయి రూ.18.40 కోట్లు, లైవ్ సర్వీసుతో ఆగిన బకాయి రూ.4.16కోట్లు, బిల్లులు నిలిపి వేయడంతో ఆగిన బకాయి రూ.13.48 కోట్లు విద్యుత్ సంస్థకు రావాల్సి ఉంది. అలాగే హెచ్‌టీ సర్వీసుల నుంచి మరో రూ.10.26 కోట్లు బకాయి అందాల్సి ఉంది. ఈ మొండి బకాయిలను రాబట్టేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇటీవల సీఎండీ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ప్రతి రోజు అధికారులు బకాయి ఎంత రాబట్టింది పక్కాగా ఒక నివేదికను జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో అందిస్తున్నారు. ఆ నివేదికను తిరుపతిలోని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కార్యాలయానికి పంపుతున్నారు. నిన్న మొన్నటి వరకు నోటీసులకే పరిమితమైన అధికారులు ఏకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బకాయిల వసూలుకు దిగారు. ఇటీవల జిల్లా పరిషత్ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేయడంతో ఆగమేఘాల మీద పెండింగ్ బకాయిలో కొంత మొత్తాన్ని చెల్లించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ పద్ధతిని మిగిలిన శాఖల కార్యాలయాలకు కూడా వర్తింప చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పెషల్ డ్రైవ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న అధికారులు.. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గ్రాంటు నిధులు విడుదల చేసినప్పుడు అందులో కొంత మొత్తాన్ని విద్యుత్ బకాయిల కింద తమ శాఖకు కొంత మొత్తాన్ని బదలాయించి ఉంటే సంస్థకు ఇబ్బంది వచ్చేది కాదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల నుంచి దాదాపు రూ.55 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయని ఆయా సంస్థల ఉన్నతాధికారుల కార్యాలయాలకు ఇది వరకే నోటీసులు పంపినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. భీష్మించిన స్థానిక సంస్థల అధ్యక్షులు.... జిల్లాలో స్థానిక సంస్థలకు ఎన్నికైన అధ్యక్షులు విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే 13 ఫైనాన్స్ గ్రాంటు నుంచి విడుదలైందని ఆ నిధులన్నీ రూ. 51.44 కోట్లు విద్యుత్ పాత బకాయిలకు చెల్లిస్తే ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. గతంలోని అధ్యక్షులు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. -
అది నిర్లక్ష్యమే!
పద్దుల నిర్వహణలో ప్రభుత్వ శాఖలు వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కాగ్ (కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్) కడిగేసింది. ఆన్లైన్లో చూపే వివరాలు, సాధారణంగా నమోదుచేసే రికార్డుల్లో తేడాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వశాఖల్లో అవకతవకలను ఎండగట్టింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కాగ్ 2013 మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేసిన ఆడిట్‌పై నివేదిక సమర్పించింది. ఇందులో జిల్లాలోని వివిధ శాఖల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. జరిగిన నష్టాన్ని నివేదించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ), మండల పరిషత్‌లు, విద్యాశాఖ, రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన అవకతవకలను ఉదాహరణలతో సహా వెల్లడించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : పద్దుల నిర్వహణలో స్థానిక సంస్థల తీరు ఆందోళనకరంగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. హయత్‌నగర్ మండలంలో ప్రియాసాఫ్ట్ పనితీరును పరిశీలించిన కాగ్ అధికారులు.. ఆన్లైన్ పద్ధతిలో పేర్కొన్న వివరాలు, సాంప్రదాయ పద్ధతిలో నమోదు చేసిన వివరాల్లో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. దీంతో నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు కాగ్ పేర్కొంది. వ్యక్తిగత మరుగుదొడ్ల పథకంలో జిల్లాలో అక్రమాలు జరిగినట్లు కాగ్ పరిశీలనలో వెల్లడైంది. ఐహెచ్హెచ్ఎల్ పథకంపై క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు ఒకే కార్డుపై లెక్కకుమించి మరుగుదొడ్లు మంజూరు చేసినట్టు తేలింది. 69 కార్డులపై 510 మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. ఇలా పలుప్రాంతాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అభిప్రాయపడింది. జిల్లా నీటిసరఫరా, పారిశుద్ధ్య సమితి (డీడబ్ల్యూస్ఎమ్)కి సంబంధించి జిల్లాలో రూ.1.3 కోట్లు టర్మ్ డిపాజిట్లో పెట్టడాన్ని కాగ్ ఆక్షేపించింది. అదేవిధంగా డీడబ్ల్యూస్ఎమ్లో అడ్వాన్స్ రూపేనా ఇచ్చిన రూ.80లక్షలకు సంబంధించి లెక్కలు లేవని కాగ్ నివేదికలో తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో జిల్లా విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని కాగ్ పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో మంజూరైన మరుగుదొడ్లలో కనీసం 50శాతం కూడా నిర్మాణాలు పూర్తికాలేదని, నిర్మాణాలు పూర్తిచేసిన చోట నీటివసతి కల్పించకపోడంతో అవి నిరుపయోగంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తీరుపై కాగ్ తీవ్రంగా స్పందించింది. 2013 మార్చినెలలో రూ.50లక్షలకు సంబంధించి రికార్డులు లేవని కాగ్ అధికారులు గుర్తించారు. ఆడిట్‌లోనూ ఈ అంశం ప్రస్తావనలేదని కాగ్ తెలిపింది. డీఆర్డీఏ అధికారులు పలు బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించడంతో నిధులపై స్పష్టత లోపించిందని, ఫలితంగా రూ.2.49 కోట్లకు సంబంధించి వివరాల్లో గందరగోళం నెలకొందని పేర్కొంది. పౌరసరఫరాల శాఖలో డిమాండ్, వసూళ్లు, నిల్వ(డీసీబీ)రిజిస్టర్ నిర్వహణలో అయోమయం నెలకొం దని, కిరోసిన్‌కు సంబంధించి రూ.2.07 కోట్లకు లెక్కల నిర్వహణ సరిగాలేదని కాగ్ పేర్కొంది. వ్యాట్‌కు గండి బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లింపులో అవకతవకలు జరిగాయని, తక్కువ విలువ చూపడంతో పన్ను చెల్లింపు సైతం తక్కువగా జరిగిందని కాగ్ స్పష్టం చేసింది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిందని కాగ్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఎస్ఆర్ఓలలో తనిఖీలు నిర్వహించి పైవాస్తవాలను గుర్తించారు. -
ప్రభుత్వ శాఖలు వర్సిటీకి..
కొత్త కాపురానికి ఇల్లు వెతుక్కున్నట్టు, నవ్యాంధ్ర ప్రభుత్వ పాలనా కార్యాలయాలను హైదరాబాద్ నుంచి తరలించేందుకు ఉన్నతాధికారులు భవన వసతి కోసం జిల్లాకు విచ్చేశారు. దీనిలో భాగంగానేమూడు ప్రధానశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు శనివారం మంగళ గిరి సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం మేరకు విద్య, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన అన్ని కార్యాలయాలను వర్సిటీకి తరలించనున్నట్టు తెలుస్తోంది. ఏఎన్‌యూ రాష్ట్ర ప్రభుత్వ పాలనా కార్యాలయాలను హైదరాబాద్ నుంచి జిల్లాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శులు అజయ్ కల్లం, డి. సాంబశివరావు, శ్యాంబాబులు శనివారం ఉదయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీని పరిశీలించారు. తొలుత పరిపాలనా భవన్‌లోని కమిటీ హాలులో వర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు. ఏఎన్‌యూ మొత్తం విస్తీర్ణం, భవనాల నిర్మాణాలు, రోడ్లకు కేటాయించిన స్థలం ఇలా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి. రాజశేఖర్, ఇంజనీర్ కుమార్ రాజాలు అన్ని వివరాలు అందించారు. అనంతరం ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం భవనాన్ని పరిశీలించారు. అక్కడి వివరాలను కేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రం తెలియజేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న ఈసీ, ట్రిపుల్ ఈ భవనాన్ని పరిశీలించారు. ఆ వివరాలను ఇంజనీర్ కుమార్ రాజా వివరించారు. ఏఎన్‌యూలో వసతుల కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై ఏఎన్‌యూ అధికారులకు రాష్ట్ర శాఖల అధికారులు పలు సూచనలు చేశారు. ఇకపై నూతనంగా నిర్మించే భవనాల్లో అటాచ్డ్ బాత్రూంలు ఉండే విధంగా ప్లాన్ చేయాలని సూచించారు. భవనాల పరిశీలన లాంఛనమే.. ఏ భవనాలను ఏ అవసరాలకు వాడుకోవాలనే దానిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇక్కడకు వచ్చిన ఉన్నతాధికారులు తమవెంట ఏఎన్‌యూ మ్యాప్‌లు, భవనాల విస్తీర్ణం, తదితర పూర్తి వివరాలను తమ వెంట తెచ్చుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు భవనాలు తీసుకుంటున్నాం: ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏఎన్యూలోభవనాలు తీసుకుంటున్నట్టు ప్రిన్సిపల్ కార్యదర్శులు తెలిపారు. వర్సిటీని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్య, సాంఘిక సంక్షేమ శాఖల అవసరాలకు కావాల్సిన భవనాలను ఇవ్వాలని ఏఎన్‌యూ ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. దీనిపై ఏ విషయాన్ని వర్సిటీ అధికారులు తమకు సమాచారం ఇవాల్సివుందన్నారు. ఈ భవనాల్లో... రాష్ట్ర ప్రభుత్వ అవసరాల్లో భా గంగా ఏఎన్‌యూలోని దూరవిద్యాకేంద్రం భవనం, పరిపాలనా భవ నం, ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనం, స్పోర్ట్స్ హాస్టల్‌తో పాటు, రూ.20 కోట్లతో నిర్మించనున్న ఇంటర్నేషనల్ స్టూ డెంట్స్ హాస్టల్ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల వెంట జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ భాస్క ర నాయుడు, ఆర్అండ్ బీ ఈఈ రాఘవేంద్రరావు, డీఎస్ఓ రవితేజ నాయక్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎస్ఓ సుధాకర్, మంగళగిరి తహశీల్దార్ కృష్ణమూర్తి, పెదకాకాని ఇన్చార్జి తహశీల్దార్ డి.సుబ్బారావు తదితరులు ఉన్నారు. -
బదిలీ గుబులు
ఏలూరు : ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు బదిలీ గుబులు పట్టుకుంది. ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల్లోని జోనల్, జిల్లాస్థాయి ఉద్యోగులకు గత నెలలో బదిలీ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. అయితే, వారికి ఉత్తర్వులు ఇవ్వాలా, వద్దా అన్న గందరగోళంలో అధికారులు ఉన్నారు. బదిలీలు చేపట్టేందుకు ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉంది. హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో వాయిదాపడిన జన్మభూమి గ్రామసభలను నవంబర్ 1నుంచి నిర్వహించాల్సి ఉండటంతో ఈలోగా ఉద్యోగుల్ని బదిలీ చేయూలా, చేయకూడదా అనేది అధికారులకు తోచడం లేదు. ఒకవేళ కౌన్సెలింగ్ పూర్తయిన వారికి బదిలీ ఉత్తర్వులు ఇస్తే.. వారు జన్మభూమి సభలు పూర్తయ్యాక మాత్రమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. బదిలీ అయిన ఉద్యోగి కొత్త స్థానంలో చేరడానికి వారం నుంచి 15 రోజుల వరకు సమయం ఇవ్వాల్సి ఉంది. నవంబర్ 13 నుంచి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆలోగా ఈ పక్రియ పూర్తికాకపోతే ఇక బదిలీల ఊసే ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎటూ తేల్చని ప్రభుత్వం అవసరమైన శాఖల్లోనే బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ఎన్జీవో జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇది జరిగి వారం గడుస్తున్నా.. ఈ విషయమై ప్రభుత్వ శాఖలకు ఎలాంటి సమాచారం రాలేదు. ఏ విషయం తేలకపోవడంతో ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖల్లో బదిలీ కౌన్సెలింగ్ వాయిదా వేశారు. మరోవైపు రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల్లో చాలాకాలంగా వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల కోసం వేచివున్న వారిని బదిలీ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బదిలీ ప్రక్రియపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కౌన్సెలింగ్ పూర్తయిన ఉద్యోగులకు ఆ రోజే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చివరకు బదిలీ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందోనన్న అయోమయం ఉద్యోగులను వెన్నాడుతోంది. -
ఇదేనా ‘ప్రగతి’
* జిల్లా ప్రగతి నివేదికలో అస్తవ్యస్తంగా సమాచారం * రూపకల్పనలోనూ అధికారుల అలసత్వం * నిర్లక్ష్యాన్ని వీడని ప్రభుత్వ శాఖలు ఒంగోలు: జిల్లా పరిషత్ పాలనా పగ్గాలు మూడున్నరేళ్లుగా అధికారుల చేతుల్లోనే ఉండటంతో వారిలో నిర్లక్ష్యం పాలు పెరిగి పోయింది. జెడ్పీ నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత ఈనెల 10వ తేదీ నిర్వహించి న తొలి సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులకు వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను జెడ్పీ అధికారులు పంపిణీ చేశారు. దాదాపు అన్ని శాఖలూ మొక్కుబడి సమాచారాన్నే అందించాయి. * ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన గృహాల వివరాలను 2006 - 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు జీవో నంబర్ 171, రచ్చబండలకు సంబంధించిన వివరాలు మాత్రమే నివేదికలో పొందుపర్చారు. అంతే తప్ప ఆ శాఖ వద్ద ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంత మందికి ఈ ఏడాది రుణం మంజూరు చేశారు, ప్రస్తుతం ప్రభుత్వం ఏయే పథకాలను అమలు చేస్తోంది, గత ప్రభుత్వంలో రుణం మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు బిల్లులు ఏమైనా చెల్లించారా తదితర వివరాలు ఏవీ పొందుపరచకపోవడం గమనార్హం. * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ పొందుపరిచిన సమాచారం కూడా అరకొరగానే ఉంది. అమ్మహస్తం పథకం సరుకుల కొనుగోలు లేదా పంపిణీ వివరాలు కేవలం ఏప్రిల్ 2014 వరకే ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి సరుకులను పంపిణీ చేస్తున్నారనే సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నెలలో భారీగా రేషన్ కార్డులకు కోత పడింది.ఆధార్ సమర్పించలేదంటూ 5.30 లక్షల కార్డులు తొలగించారు. అయినా కార్డుదారుల పాత వివరాలనే సమర్పించారు. * ఈ వ్యవసాయ సీజన్లో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. అసలు విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఏయే రకం విత్తనాలు ఎంత మేరకు ఉన్నాయి. ఇంకా విత్తనాలు ఎంత మోతాదులో అవసరం అనే వివరాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువులు, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతమేర పంటలను సాగుచేశారనే వివరాలను కూడా సభ్యులకు ఇవ్వకపోవడం గమనార్హం. * జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి పంపిన సమాచారంలో కూడా కనీసం ఎన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు? గ్రంథపాలకులు లేనివెన్ని, నూతన భవనాల నిర్మాణం కోసం ఎక్కడెక్కడ స్థలాలు కావాలని విజ్ఞప్తి చేశారనే వివరాలు కూడా లేవు. * జిల్లా విద్యాశాఖ పొందుపరిచిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో సభ్యుల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. జిల్లాలో మొదటి దశలో మొత్తం 37 మోడల్ పాఠశాలల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతి లభించింది. వాటిలో 11 పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. 5 నిర్మాణం పూర్తిచేసుకోగా...5 చోట్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఈ వివరాలను తెలియజేయడంలో విద్యాశాఖ అయోమయాన్ని సృష్టించింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారిపై జెడ్పీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. * జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ మొత్తం మూడు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే కేవలం 27 మండలాల సమాచారం మాత్రమే నివేదికలో ఉంది. మిగిలిన 29 మండలాల సమాచారం లేదు. అది కూడా కేవలం ఒక పథకానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చారు. * ఏపీబీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం ప్రగతి భవన్ వెనుక వైపు శంకుస్థాపన చేశారు. దానిపై ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. దాని నిర్మాణానికి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. * జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వివరాలే సభ్యులకు ఇచ్చిన పుస్తకంలో లేవు. -
నిధుల తిరుగు టపా!
వంగర: ఎన్నికల సమయంలో ఎన్నో హామీలతో ఊదరగొట్టిన తెలుగుదేశం, అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యల పేరుతో కాలక్షేపం చేస్తోంది. ఇప్పుడు అదే వంకతో ప్రభుత్వ శాఖలు, పథకాలు, ప్రాజెక్టుల్లో ఎక్కడ నిధులున్నా వాటిని తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని తాఖీదులు జారీ చేసినట్లు తెలిసిం ది. ఈ నిర్ణయం మడ్డువలస ప్రాజెక్టు నిర్వాసితులకు షాకిచ్చింది. ఈ ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం, నిర్వాసిత కాలనీల నిర్మాణానికి గతంలో మంజూరు చేసిన నిధుల్లో సుమారు రూ. 6 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు. సర్కారు నిర్ణయం కారణంగా ఇప్పుడు అవి వెనక్కి వెళ్లిపోయినట్లే. ఫలితంగా నిర్వాసితులకు ఇప్పట్లో పరిహారం, సౌకర్యాలు లభించే అవకాశాలు లేనట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని ఏడు నిర్వాసిత గ్రామాలకు 2010లో ప్రభుత్వం రూ.27.35 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో గీతనాపల్లి, పటవర్థనం, దేవకివాడ, వీపీఆర్‌పేట, కొత్తపేట, నరేంద్రపురం, నూకలివాడ(బలిజిపేట మండలం) గ్రామాల్లో భూములు, ఇళ్లు,ఖాళీ స్థలాలు, పశువుల శాలలకు నష్టపరిహారంతోపాటు, గ్రామాలను విడిచి వెళ్లే కుటుంబాలకు రవాణా చార్జీలు కూడా భూసేకరణ అధికారులు చెల్లించారు. నష్టపరిహారం చెల్లింపులకు ఇప్పటివరకు రూ. 21.35 కోట్లు వెచ్చిం చారు. రవాణా చార్జీలకు సంబంధించి రూ. 24 లక్షల్లో కొంత మొత్తం ఖర్చు కాగా ఇంకా నిధులు ఉన్నప్పటికీ.. ఎంత మేరకు ఉన్నాయన్నది పాలకొండ ఆర్డీవో కార్యాలయ అధికారులకే తెలుసు. ఇక పునరావాస కాలనీల నిర్మాణంతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, తాగునీరు, విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు కేటాయించిన సుమారు 5.70 కోట్లతో ఇంత వరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. పటువర్థనం, నూకలి వాడ, గీతనాపల్లి, దేవకివాడ, కొత్తపేట, వీపీఆర్‌పేట గ్రామాల నిర్వాసితుల కు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సైతం సేకరించలేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు రూ.6 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు. ఈ తరుణంలో ఖర్చు కాకుండా ఉన్న నిధులను ఆగస్టు 31 నాటికి తమకు జమ చేయాలని భూసేకరణ విభాగం రాష్ట్ర ఫైనాన్స్ విభాగం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. తనకు రావలసిన నష్టపరిహారం ఇంకా అందకపోవడంతో పటువర్థనం గ్రామానికి చెందిన నల్ల కాశినాయుడు అనే నిర్వాసితుడు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను వివరాలు కోరగా ఈ విష యం బయటపడింది. ఇప్పట్లో నష్టపరిహారం చెల్లించలేమని, మిగులు నిధులు ప్రభుత్వానికి మళ్లిస్తున్నామని జిల్లా అధికారులు ఆయనకు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. దీంతో నష్టపరిహారం ఎప్పుడు అందుతుందో, మౌలిక సౌకర్యాలు ఎప్పటికి కల్పిస్తారోనని నిర్వాసితులు దిగాలు చెందుతున్నారు. -
6 నెలలు.. రూ.30 కోట్లు అరుణాచలం రావాల్సిందే!
‘నెల రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చుపెడితే రూ.3వేల కోట్లకు అధిపతి అవుతావు’ అన్న షరతుకు కట్టుబడి.. అరుణాచలం సినిమాలో హీరో రజినీకాంత్ 30 రోజుల్లో రూ.30 ఖర్చు పెడతాడు.. ఇలాంటి పరిస్థితే డ్వామా ఎదుర్కోవాల్సి ఉంది. వాటర్‌షెడ్ ప్రాజెక్టుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.40కోట్లలో కేవలం రూ.10 కోట్లు ఖర్చుపెట్టారు. ఆరు నెలలే గడువుంది.. ఆలోగా రూ.30 కోట్లు ఖర్చుపెట్టాలి. వీటిని అరుణాచలంలా ఖర్చుపెడతారో.. లేదో చూడాలి. నీలగిరి నిధలు లేక ప్రభుత్వ శాఖలు నీరసిస్తుంటే.. నిధులు ఉన్నా ఖర్చు పెట్టలేని దయనీయ స్థితిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ కొట్టుమిట్టాడుతోంది. మెగా వాటర్షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖర్చుపెట్టడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. వృథాగా పోతున్న నీటిని సంరక్షించడంతోపాటు, సహజ వనరుల నిర్వహణ ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించేందుకు 2009-10లో జిల్లాకు తొలి విడత 7 మెగావాటర్ షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఐదేళ్ల లక్ష్యానికిగాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏడు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన నిధుల్లో కేవలం రూ.10 కోట్లతో మాత్రమే ప్రాజెక్టు పనులు చేపట్టారు. ప్రాజెక్టులు మంజూరైన నాలుగున్నర ఏళ్లలో రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అధికారులు మరో ఆరు మాసాల్లో రూ.30 కోట్లు ఏవిధంగా ఖర్చు పెడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆరు మాసాల్లో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇంత తక్కువ వ్యవధిలో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదు. అదీగాక రూ.30 కోట్లు ఖర్చు పెట్టి మరీ శరవేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఇదే విషయమై జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డ్వామా అధికారులను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమాల్సినపరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టులపై వీలైనంత త్వరగా ఓ ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూ అభివృద్ధి పథకం, వాటర్షెడ్లు, ఉపాధి హామీ, ఇందిర జలప్రభ పథకాలు పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ సి.దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాల పురోగతిని పరిశీలించేందుకు త్వరలో క్షేత్రస్థాయి పర్యటన వెళ్లేందుకు ఓ కార్యాచరణ రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులకు నిధుల కేటాయింపు.. డీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చైర్మన్ అసంపూర్తిగా ఉన్న స్త్రీ శక్తి భవనాలు పూర్తి చేసేం దుకు అవసరమయ్యే నిధులను జెడ్పీ నుంచి కేటాయిస్తామని తెలిపారు. సుస్థిర వ్యవసాయం పురోగతి పరిశీలనకు గ్రామస్థాయిలో పర్యటిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల ఇనిస్టిట్యూట్లు తనిఖీ చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాంలు నిర్మాణానికి నాబార్డు సంప్రదించి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. మత్స్యశాఖ నుంచి లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడీ రూ.40 లక్షలు విడుదల చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు చిర్రా సుధాకర్, సునందారెడ్డి, మత్స్యశాఖ ఏడీ సాల్మన్‌రాజు, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
పర్మినెంట్ చేయాలని డిమాండ్ మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ మహారాణిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖ లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ పి.మణి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. రాష్ట్రంలో 5.5లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నట్టు తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పిం చాలని, వేతనాలు పెంచాలని కోరారు. ప్రసూతి సెలవులు, ఇంక్రిమెంట్లు, డీఏ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. సిటు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ సేవలలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామనే రాజకీయ పార్టీలకే మద్దతు తెలపాలన్నారు. వీరి రెన్యువల్ కాల పరిమితిని ఏడాది నుంచి మూడు నెలలకు కుదించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వాపోయారు. పర్మినెంట్ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పర్యాటక, ఈఎస్ ఐ, 108, యూహెచ్‌సీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీఐఐసీ, హౌసింగ్, ఏయూ, అటవీశాఖ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఐకేపీ, ఐసీడీఎస్, డ్వామా తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు సంఘీభావం తెలిపారు. -
ప్రభుత్వ శాఖలన్నింట్లో వెబ్ ఆధారిత సేవలు
సాక్షి, హైదరాబాద్: అన్ని శాఖల్లోనూ వెబ్ ఆధారిత సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 220 రకాల సేవలు అందిస్తున్న మీ-సేవా కేంద్రాలకు మార్చి నాటికి మరో 150 రకాల సేవలను అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి బుధవారం ఈ-గవర్నెన్స్ మార్గదర్శకాలను (జీఓ 1) జారీ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఐసీటీ బృందాలను ఏర్పాటు చేసుకొని ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వివరించారు. అలాగే అన్ని రాష్ట్ర, జిల్లా శాఖలు ఐటీ శాఖ సహకారంతో స్టేట్ పోర్టల్ ఫ్రేమ్‌వర్క్ కింద తమ వెబ్సైట్లను అభివృద్ధి చేయాలని ఆ మార్గదర్శకాల్లో వివరించారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. -
ఇక మొబైల్‌ఫోన్ గవర్నెన్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై మరింత స్మార్ట్ కానున్నాయి. చెల్లింపులు, రిజిస్ట్రేషన్లు తదితర పనుల్లో ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు పంపనున్నాయి. వాటినే వారు ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించవచ్చు. అలాంటి సౌకర్యాన్ని కల్పించే ‘మొబైల్ సేవా’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. వంద సంస్థలకు సంబంధించి పెలైట్ ప్రాజెక్టును సమర్థవంతంగా పూర్తి చేసిన తర్వాత 241 అప్లికేషన్లతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్లికేషన్లలో ఆర్టీఐ, ఆరోగ్యం, ఆధార్, విద్య తదితర సర్వీసులకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి జె. సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం డిజిటల్ సిగ్నేచర్ ఉన్నవాటిని ధ్రువపత్రాలుగా స్వీకరిస్తున్నామని, అలాంటి నిబంధనలే మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా రూపొందించాలన్నారు. -
24లోగా దరఖాస్తులను అందజేయాలి
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప ని చేసే ఉద్యోగుల పూర్తి వివరాలను తమకిచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా భర్తీ చేసి ఈ నె ల 24లోగా సంబంధిత (హెచ్ఓడీ) జిల్లా అధికారులకు అందజేయాలని జిల్లా అదనపు జేసీ శేషా ద్రి సూచించారు. హెల్త్ కార్డుల జారీ, ఉద్యోగుల పూర్వపరాల వివరాలు అందజేయాలని రాష్ట్ర ఆ ర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శని వారం జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, మం డలాధికారులకు జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ శాఖ అధికారు లు ప్రతి ఉద్యోగికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేసి ప్రొజెక్టర్ ద్వారా పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెగ్యూలర్,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన ఎంత మంది ఉద్యోగులు ఎన్ని శాఖల్లో పని చేస్తున్నారు, వారు తీసుకుంటున్న జీతభత్యాలు ఎంత?, ఎప్పుడు ఉద్యోగంలోకి వచ్చారు?, సొంత శాఖ, వారి కుటుంబ సభ్యులు ఎందరు తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. దరఖాస్తులను భర్తీ చేసేందుకు ఏమైనా సందేహాలు ఉంటే హైదరాబాద్‌లోని 040-23457618 లేదా 040-23450111 నెంబరుకు, అలాగే 104కు కూడా ఫాన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఇటు జిల్లాలో కూడా జిల్లా ట్రెజరీ శాఖకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్ మహిం దర్ 9951602570 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. ఉద్యోగులు దరఖాస్తునకు హెల్త్ కార్డు కోసం తమ కుటుంబ సభ్యుల ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, సెల్ నెంబరు ఇతర వివరాలు కలిగిన జిరాక్స్ ప్రతులను జత చేయాలని సూచించారు. ఉద్యోగులు ఇచ్చిన దరఖాస్తులను హెచ్ఓడీలు స్వీకరించగానే జనవరి 5లోగా జ్టఞ.ఛిజజ.జీ అనే వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. హెల్త్‌కార్డులు ముం దుగా 90 రోజుల కాల వ్యవధితో కూడినవి ప్రభుత్వం అందజేస్తుందని, తరువాత శాశ్వత కార్డులు వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ శాఖ డీడీ రాజేందర్, ఏటీఓ సదాశివ్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు. -
‘విభజన’పై లెక్కలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు నివేదికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. సచివాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు ఇప్పటికే కొన్ని శాఖలు సమాచారాన్ని అందజేశాయి. కోరిన సమాచారాన్ని అందించేందుకు సంసిద్ధులు కావాలంటూ మరికొన్ని శాఖలకు ఉన్నతాధికారుల నుంచి వర్తమానం అందింది. రాష్ట్ర రాజధానికి మెదక్ జిల్లా పొరుగునే ఉండటంతో హైదరాబాద్‌తో ముడిపడి వున్న అంశాలపై సమాచారం కోరుతున్నట్లు తెలిసింది. జంట నగరాలకు తాగు నీరు సరఫరా చేస్తున్న ‘సింగూరు జలాశయం’పై నీటి పారుదల శాఖ అధికారులు ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నివేదిక సమర్పించారు. నీటి నిల్వ, మూడేళ్లుగా ప్రతీ యేటా ఎంత నీరు సరఫరా చేస్తున్నారు అనే కోణంలో వివరాలు కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుపైనా వాణిజ్య పన్నుల శాఖ నివేదిక సమర్పించినట్లు సమాచారం. బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి సంస్థలు చెల్లిస్తున్న వాణిజ్య పన్నుల వివరాలు ఈ నివేదికలో క్రోడీకరించారు. జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని కోరితే నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని జిల్లా ప్రణాళిక అధికారులకు వర్తమానం అందింది. త్వరలో ఇతర శాఖలకు.. విభజనకు సంబంధించిన పలు అంశాలపై నివేదిక రూపొందిస్తున్నారు. రవాణా, పరిశ్రమలు, రెవెన్యూ, ఉపాధి కల్పన తదితర అంశాలకు సంబంధించి కూడా త్వరలో సమాచారం కోరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లతో పాటు శివారు ప్రాంతాలతో ముడిపడిన అంశాలపైనా నివేదికలు కోరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. -
వైభవంగా దసరా ఉత్సవాలు
= రంగలీల మైదానంలో రావణ వధ = ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కరీమాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో రాత్రి నిర్వహించిన వేడుకలకు ఉర్సు, కరీమాబాద్ ప్రాంతవాసులే కాకుండా నగరం, జిల్లా నలుమూల ల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో మైదానం కిక్కిరిసి పొయింది. ఉర్సు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ, అన్ని ప్రభుత్వ శాఖలు ఉత్సవాల విజయవంతానికి కృషి చేశాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పార్లమెం ట్లో అమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది దస రా ఉత్పవాలను మరింత వైభవంగా జరుపుకుంటామన్నారు. ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి మాట్లాడుతూ శ్రీ భద్రకాలీ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతుల తో ఉండాలని కోరారు. అర్బన్, రూరల్ ఎస్పీలు వెంకటేశ్వర్రావు, పాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్ ప్రజలకు దసరా శుభాకంక్షలు తెలిపిపారు. కార్యక్రమంలో ఐజీ రవిగుప్త, డీసీ శంకర్, డీఆర్ఓ సురేంద్రకరణ్, ఆర్డీ మధు, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి వెంకట స్వామి, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి మండ వెంకన్న, నాగపూరి సంజయ్, ఒగిలిశెట్టి అనిల్‌కుమార్, గోనె రాంప్రసాద్, వొడ్నాల నరేందర్, మేడిది మధుసూదన్, వంచనగిరి పెద్ద సమ్మయ్య, రాసమల్ల కుమారస్వామి, వెలిదె శివమూర్తి, నాగపూరి రంజిత్, ఆకుతోట బలరాం, సుంకరి సంజీవ్, లక్కాకుల శ్యాం, వి.సుధాకర్, చంద్రశేఖర్, కోటేశ్వర్, బొల్లం రాజు, మధు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా వరంగల్ డీపీఆర్ఓ వారి ఆధ్వర్యంలో వేంపటి నాగేశ్వరి శిశ్య బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
అక్రమ కట్టడాల జోరు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :కొన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వరదొచ్చినా, వానొచ్చినా పండగే. బాధితులకు ప్రభుత్వం అందించే సాయంలోనూ అక్రమాలకు పాల్పడటం వారికి పరిపాటి. ఇదే రీతిలో గ్రామ కార్యదర్శులు, వీజీటీఎం ఉడా సర్వేయర్లు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అందు తున్నాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అన్నిశాఖల సిబ్బంది, అధికారులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు ఇబ్బంది కలగకుండా అనధికారికంగా విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే గ్రామ కార్యదర్శులు, ఉడా సర్వేయర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విమర్శలకు గురవుతున్నారు. ఉద్యమం పేరుతో అక్రమ కట్టడాలకు ఊతం ఇస్తూ దండుకుంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఉడా పరిధిలోని ఏ గ్రామంలోనైనా కట్టడాలు ప్రారంభమైతే ల్యాండ్ కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్ లేదని గ్రామ కార్యదర్శులు, ఉడా సర్వేయర్లు వీరిని బెదిరిస్తూ కాసులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. బిల్డర్లు ప్లాన్‌కు భిన్నంగా డీవియేన్స్తో నిర్మాణాలు జరుపుతున్నా, పెంట్‌హౌస్‌లు కడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా అనధికార కట్టడాలపై ఫిర్యాదు చేస్తే ‘ఉద్యమాన్ని సాకు’గా చూపి విధులకు హాజరుకాలేమని చెబుతున్నారు. బిల్డర్లకు, వీరికి ‘మనీఫిక్సింగ్’ ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ ఉద్యమ కాలంలో ఉడా పరిధిలోని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాల్లో కనీసం 400 వరకు అనధికార కట్టడాలు జరిగి ఉండవచ్చనే అభిప్రాయం అధికారులు, రియల్టర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలు ఎక్కువగా గ్రూపు హౌస్‌ల్లోనే జరుగుతున్నాయి. ఉడా పరిధిలోని ఏ గ్రామంలోనైనా 10 మీటర్ల ఎత్తుదాటి ఇళ్ల నిర్మాణం జరగకూడదు. వీటి నిర్మాణానికి ఇంటి ప్లాన్లు ఆయా గ్రామ కార్యదర్శులు మంజూరు చేస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా మూడు ఫ్లోరులతో నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం సర్వేయర్లకు ఉన్నప్పటికీ, గ్రామ కార్యదర్శుల ద్వారా మామూళ్లు అందుకోవడం వల్ల పట్టించుకోవడం లేదు. అపార్టుమెంట్ల నిర్మాణం చేపడుతున్న బిల్డర్లు ఇటీవల కాలంలో పెంట్‌హౌస్‌ల నిర్మాణాలను నిలిపివేసినప్పటికీ, సెట్బ్యాక్లు, డీవియేషన్లకు పాల్పడుతున్నారు. స్థలాల ధరలు పెరిగి అక్రమ కట్టడాలు... కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సిటీ పరిధి దాటిన తరువాత కొన్ని ప్రాంతాల్లోని స్థలాల ధరలు అధికంగా పెరగడంతో ఈ అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, ఉండవల్లి, తెనాలి రూరల్, మంగళగిరి రూరల్, గుంటూరు రూరల్‌లోని పలకలూరు, పేరేచర్ల, కృష్ణాజిల్లాలోని గొల్లపూడి, యనమలకుదురు, పెనమలూరు, కంకిపాడు, రామవరప్పాడు, ప్రసాదంపాడు తదితర గ్రామాల్లో ఈ అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవల యనమలకుదురులో అక్రమ కట్టడాలు నిర్మించిన 26 మందికి జిల్లా పంచాయతీ అధికారి నోటీసు జారీచేశారు. ఈ అక్రమ కట్టడాల విషయమై ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా, ప్రస్తుత పరిస్థితిలో చేయగలిగిందీ ఏమీ లేదన్నారు. అక్రమ కట్టడాలపై ఎవరైనా తన దృష్టికి తీసుకువస్తే వైస్ చైర్మన్ ద్వారా తనిఖీ చేయించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉద్యమం కారణంగా ఉడాకు సంబంధించి అనేక సమస్యలు పెరుగుతుండటంతో సిబ్బందిని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసేందుకు ఈ నెల 30వ తేదీన వారితో సమావేశం నిర్వహించాలని వైస్ చైర్మన్‌కు చెప్పానని వివరించారు. -
పన్ను వసూలుకు సమ్మె సెగ
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు ప్రభుత్వ శాఖల పై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తర్వాత రాష్ర్ట ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టేది వాణిజ్య పన్నులశాఖ. ఈ శాఖ ద్వారా ఏటా జిల్లా నుంచి సుమారుగా రూ.450 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. సమైక్య ఉద్యమం ఈ శాఖ ఆదాయానికి గండికొట్టింది. వాణిజ్య పన్నుల శాఖకు జిల్లాస్థాయి లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంతో పాటు 11 సర్కిల్స్ ఉన్నాయి. డీసీ కార్యాలయంలో డీసీ పౌసమి బసుతో పాటు సుమారు 50 మంది వరకు గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులతో పాటు క్లాస్-4 ఉద్యోగు లు, ఇతర సిబ్బంది ఉండగా, ప్రతి సర్కిల్ పరిధిలో ఇదే రీతిలో 30 మంది చొప్పున పనిచేస్తున్నారు. డీసీ మినహా మిగిలిన అధికారులు, సిబ్బంది గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్వజనుల సమ్మెలో భాగస్వాములయ్యారు. దీంతో డీసీ కార్యాలయంతోపాటు జిల్లాలోని 11 సర్కిల్ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. జిల్లా ఆడిట్ విభాగంతో పాటు లార్జ్ ట్యాక్స్ యూనిట్ కూడా మూతపడింది. ఈ యూనిట్ ద్వారా నెలకు రూ.10 కోట్లు, ప్రతీ సర్కిల్ నుంచి నెలకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. జిల్లాలో మండపేట, రామచంద్రపురంతో పాటు తుని, కాకినాడ, ఆల్కట్గార్డెన్(రాజమండ్రి)సర్కిల్స్ నుంచి అత్యధిక ఆదాయం వస్తుంది. సమైక్య ఉద్యమంలో భాగంగా తొలుత బంద్‌ల కారణంగా తొలి 13 రోజులు కార్యాలయాలు సరిగా పని చేయలేదు. 12వ తేదీ నుంచి సర్వజనుల సమ్మె పుణ్యమాని కార్యాలయాలన్నీ మూతపడడంతో ఆ వచ్చే కొద్దిపాటి ఆదాయానికి సైతం బ్రేకులు పడ్డాయి. ఈ లెక్కన గత 44 రోజుల సమైక్య ఉద్యమం, గత 31 రోజుల సర్వజనుల సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా ఈశాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ. 50 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఇటీవలే ప్రారంభించిన ఈ-పేమెంట్ ద్వారా ప్రస్తుతం 10 నుంచి 20 శాతం వరకు పన్నులు చెల్లింపులు నేరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యమం పన్ను చెల్లింపుదారులకు బాగా కలిసి వస్తోంది. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగానో, రోటేషన్ చేసుకునేందుకో వినియోగిస్తున్నారు. ఈ పన్నులను ఇవాళ కాకపోయినా సమ్మె అనంతరమైనా వసూలు చేస్తారు. సమ్మె అనంతరం స్పెషల్ డ్రైవ్‌తో పన్నులను వసూలు చేయడం అధికారులకు నిజంగా కత్తిమీద సామే. -
బకాయిలు రూ.200 కోట్లు
నల్లగొండ, న్యూస్‌లైన్: జిల్లాలో విద్యుత్ బకాయిలు సుమారు రూ.200 కోట్ల మేర పేరుకుపోయాయి. మొత్తం బకాయిల్లో ప్రభుత్వ శాఖలదే అగ్రభాగం. బకాయిల విషయంలో సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ ఇటీవల సమీక్షలు నిర్వహించి జిల్లా అధికారులకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు ఇకనుంచి బకాయిల వసూళ్లకు కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో గృహ వినియోగంతో పాటు వాణిజ్యం, పరిశ్రమలు, పవర్‌లూం, వ్యవసాయ, తాగునీటి పథకాలు, వీధిలైట్లు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల నుంచి రావాల్సిన బకాయిలు రూ.193కోట్ల 49లక్షల 91వేల మేర ఉన్నాయి. ప్రభుత్వ బకాయిలను పట్టించుకోకుండా... నష్టాలు పూడ్చుకునే పనంటూ ప్రతి ఏడాది మాదిరిగానే చార్జీలు, సర్‌చార్జ్‌ల, వినియోగదారుల సేవాచార్జీల రూపంలో జిల్లా ప్రజలపై ఎప్పటికప్పుడు భారం మోపుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ శాఖల నుంచి సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. నష్టాలొస్తున్నాయంటూ చార్జీల భారాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నాలు మాని బకాయిలపై దృష్టి పెట్టాలని మేధావులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విద్యుత్ బిల్లుల విషయంలో ఒకడుగు ముందుకేస్తూ మచ్చలేకుండా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థలు, ఏజెన్సీల హెచ్‌టీ, ఎల్టీ సర్వీసుల బకాయిలు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయాయి. నోటీసులకు స్పందన కరువు బకాయిలకు సంబంధించి పలుమార్లు ప్రభుత్వ శాఖల బాధ్యులకు నోటీసులు జారీ చేసినా స్పందన కరువైంది. నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు తెలియజేసినా ప్రభుత్వం నుంచి అనుమతి లేనిది ఏమిచేస్తామంటూ సమాధానాలు తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. ప్రధాన ప్రభుత్వ శాఖలన్నీ పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బకాయిపడ్డాయి. ప్రధానంగా జిల్లాలోని గ్రామీణ తాగునీటి పారుదల వ్యవస్థ, వీధిలైట్లు, వసతిగృహాలు, పాఠశాలలకు సంబంధించి రూ.61 కోట్ల6 లక్షల 59వేల మేర బకాయిపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ శాఖలు కోట్లల్లో బకాయిలు పేరుకుపోయినా, వాటికి సంబంధించి వందల్లో లేఖలు అందినా ఆయా శాఖల నుంచి స్పందన మాత్రం కానరావట్లేదు.