= రంగలీల మైదానంలో రావణ వధ
= ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కరీమాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో రాత్రి నిర్వహించిన వేడుకలకు ఉర్సు, కరీమాబాద్ ప్రాంతవాసులే కాకుండా నగరం, జిల్లా నలుమూల ల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో మైదానం కిక్కిరిసి పొయింది. ఉర్సు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ, అన్ని ప్రభుత్వ శాఖలు ఉత్సవాల విజయవంతానికి కృషి చేశాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పార్లమెం ట్‌లో అమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది దస రా ఉత్పవాలను మరింత వైభవంగా జరుపుకుంటామన్నారు. ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి మాట్లాడుతూ శ్రీ భద్రకాలీ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతుల తో ఉండాలని కోరారు.
అర్బన్, రూరల్ ఎస్పీలు వెంకటేశ్వర్‌రావు, పాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్ ప్రజలకు దసరా శుభాకంక్షలు తెలిపిపారు. కార్యక్రమంలో ఐజీ రవిగుప్త, డీసీ శంకర్, డీఆర్‌ఓ సురేంద్రకరణ్, ఆర్డీ మధు, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి వెంకట స్వామి, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి మండ వెంకన్న, నాగపూరి సంజయ్, ఒగిలిశెట్టి అనిల్‌కుమార్, గోనె రాంప్రసాద్, వొడ్నాల నరేందర్, మేడిది మధుసూదన్, వంచనగిరి పెద్ద సమ్మయ్య, రాసమల్ల కుమారస్వామి, వెలిదె శివమూర్తి, నాగపూరి రంజిత్, ఆకుతోట బలరాం, సుంకరి సంజీవ్, లక్కాకుల శ్యాం, వి.సుధాకర్, చంద్రశేఖర్, కోటేశ్వర్, బొల్లం రాజు, మధు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా వరంగల్ డీపీఆర్‌ఓ వారి ఆధ్వర్యంలో వేంపటి నాగేశ్వరి శిశ్య బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.