Manda Vinod Kumar
-
చైర్మన్ మాటలు నీటి మూటలేనా..?
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారంటే ఇక అంతే సంగతులు. మళ్లీ గుర్తు చేస్తే తప్ప స్పందించని పరిస్థితి. పాలకవర్గం కొలువుదీరి సుమారు వంద రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పనిని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. దీంతో మా ర్కెట్‌కు వచ్చే రైతులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచ్చుకు కొన్ని.. ‘రైతులంటే అలుసేనా’ శీర్షికన ‘సాక్షి’లో గత సోమవారం ప్రచురితమైన కథనానికి చైర్మన్ స్పందించారు. అదేరోజు మార్కెట్‌ను సందర్శించి ‘సాక్షి’లో వచ్చిన సమస్యలను వారంలో గా పరిష్కరిస్తామని అప్పటికప్పుడు ప్రకటిం చారు. అయితే వారం దాటుతున్నా ఒక్కటంటే ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. వెలగని విద్యుత్ లైట్లు, తూకానికి నోచుకోని వే బ్రిడ్జి, నిరుపయోగంగా మరుగుదొడ్లు, మంచినీటి కొరత, అలంకారప్రాయంగా షెడ్లు, డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం అలాగే ఉన్నాయి. ఉచిత భోజనం, ఖాళీ సంచుల లెక్క.. మార్కెట్లో ఉచిత భోజనం అమలు చేస్తానని, గత సంవత్సరం సీసీఐ కొనుగోలు చేసిన ఖాళీ సంచుల డబ్బులను రైతులకు ఇప్పిస్తానని చైర్మన్ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా పెద్ద మార్కెట్‌కు అనుబంధంగా ఉన్న కూరగాయలు, పండ్ల మార్కెట్లో కూడా సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తానని చైర్మన్ హామీ ఇచ్చినా అతీగతి లేదు. తమకు పెంచిన చార్జీలను అమలు చేయాలని హమాలీకార్మికులు పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదు. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చైర్మన్ ఒక్క పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. -
వైభవంగా దసరా ఉత్సవాలు
= రంగలీల మైదానంలో రావణ వధ = ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కరీమాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో రాత్రి నిర్వహించిన వేడుకలకు ఉర్సు, కరీమాబాద్ ప్రాంతవాసులే కాకుండా నగరం, జిల్లా నలుమూల ల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో మైదానం కిక్కిరిసి పొయింది. ఉర్సు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ, అన్ని ప్రభుత్వ శాఖలు ఉత్సవాల విజయవంతానికి కృషి చేశాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పార్లమెం ట్లో అమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది దస రా ఉత్పవాలను మరింత వైభవంగా జరుపుకుంటామన్నారు. ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి మాట్లాడుతూ శ్రీ భద్రకాలీ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతుల తో ఉండాలని కోరారు. అర్బన్, రూరల్ ఎస్పీలు వెంకటేశ్వర్రావు, పాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్ ప్రజలకు దసరా శుభాకంక్షలు తెలిపిపారు. కార్యక్రమంలో ఐజీ రవిగుప్త, డీసీ శంకర్, డీఆర్ఓ సురేంద్రకరణ్, ఆర్డీ మధు, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి వెంకట స్వామి, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి మండ వెంకన్న, నాగపూరి సంజయ్, ఒగిలిశెట్టి అనిల్‌కుమార్, గోనె రాంప్రసాద్, వొడ్నాల నరేందర్, మేడిది మధుసూదన్, వంచనగిరి పెద్ద సమ్మయ్య, రాసమల్ల కుమారస్వామి, వెలిదె శివమూర్తి, నాగపూరి రంజిత్, ఆకుతోట బలరాం, సుంకరి సంజీవ్, లక్కాకుల శ్యాం, వి.సుధాకర్, చంద్రశేఖర్, కోటేశ్వర్, బొల్లం రాజు, మధు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా వరంగల్ డీపీఆర్ఓ వారి ఆధ్వర్యంలో వేంపటి నాగేశ్వరి శిశ్య బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.