లెక్కలు తేల్చే పనిలో నియామక సంస్థలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల నేపథ్యం
జాబ్ కేలండర్ ప్రకారం ప్రకటనల జారీకి సమాయత్తం.. గ్రూప్–1, విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై కసరత్తు
ఖాళీలు తేలిస్తే ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన జాబ్ కేలండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీతో పాటు విద్యుత్ సంస్థల పరిధిలో ఏఈఈ, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు, సభ్యులతో గత వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా గ్రూప్–1 ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేలి్చ, వివరాలు ఆర్థిక శాఖకు సమరి్పంచాలని ఆదేశించారు.
ప్రభుత్వ శాఖలు బిజీ బిజీ
సీఎస్ ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు, వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఖాళీల లెక్కలు తేలి్చన తర్వాత ఆర్థిక శాఖకు సమరి్పంచాల్సి ఉంటుంది.
ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి, ఆ మేరకు ప్రతిపాదనలను నియామక సంస్థలకు అప్పగించాలి. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచి్చన తర్వాత రెండోసారి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ రెండోసారి, కొన్నిటి భర్తీ మూడోసారి జరుగుతున్నట్లు సమాచారం.
కేలండర్ ప్రకారం ప్రకటనలు
తెలంగాణ ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్‌లో స్పష్టం చేసింది. టీజీజెన్‌కో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి.
అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా అక్టోబర్‌లోనే జారీ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి. జీవో 55లో గుర్తించిన 19 కేటగిరీల్లోని పోస్టులు గ్రూప్–1 పరిధిలోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేయాలి. జాబ్ కేలండర్లో నిర్దేశించిన నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను సర్కారు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment