సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర | Small scale workers in government departments on strike: andhra pradesh | Sakshi
Sakshi News home page

సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర

Published Tue, Aug 6 2024 4:04 AM | Last Updated on Tue, Aug 6 2024 7:19 AM

Small scale workers in government departments on strike: andhra pradesh

అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులపై రాష్ట్రవ్యాప్త నిరసనలు

కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించి గళమెత్తిన చిరుద్యోగులు 

బలవంతంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అలి్టమేటం 

నాయకుల తీరు మారకపోతే ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్‌ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.

సాక్షి నెట్‌వర్క్‌: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎనీ్టఆర్‌ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.

చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్‌ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్‌ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్‌వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు.   

ఖాళీ ప్లేట్లతో నిరసన 
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

స్కీమ్‌ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్‌ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్‌ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వ­హించి  స్కీమ్‌ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. 

మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి 
‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్‌వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement