Anganwadi workers
-
అయ్యో.. అంగన్వాడీ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ విరమణ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుంది. 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లను విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గతేడాది ఏప్రిల్ నుంచి తప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 61 సంవత్సరాల వరకు సర్విసులో కొనసాగుతుండగా, గౌరవ వేతనంతో విధులు నిర్వర్తిస్తు్తన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మాత్రం 65 సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వారి సర్విసులకు గుర్తింపుగా ఉద్యోగ విరమణ సమయంలో ప్రత్యేక ప్యాకేజీని గత ప్రభుత్వం ప్రకటించింది.విరమణ పొందే ప్రతీ అంగన్వాడీ టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50 వేల ఆర్థిక సాయంతో పాటు సామాజిక పింఛన్ ఇస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని టీచర్లు, హెల్పర్లు వ్యతిరేకించారు. కనీసం టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో మౌఖికంగా మంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అయితే ఏడాది దాటినా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. ఇదిగో..అదిగో..అంటూ అధికారులు చెబుతున్నా, ఆచరణలో సాధ్యం కాలేదు. ఏడు వేల మందికి పైమాటే... గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యోగ విరమణ చేశారు. ఇందులో మెజారిటీ మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుకోలేదు. విధుల నుంచి తప్పించినా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పట్ల స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. వీరంతా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సీడీపీఓలు, జిల్లా సంక్షేమాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కనీసం సామాజిక భద్రత పింఛన్ మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నా, చాలామందికి మంజూరు కాలేదు. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 5,250 మంది టీచర్లు, 2 వేల మంది హెల్పర్లు ఉద్యోగ విరమణ పొందారు. తాజాగా అంగన్వాడీల్లో కొలువుల భర్తీకి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క ఇటీవల సంతకం చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయానికి పంపారు. సీఎంఓ నుంచి కూడా ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ వచి్చనట్టు సమాచారం. ఈ ఫైల్లో పేర్కొన ఖాళీల్లో గతేడాది నుంచి ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన వాటిని కూడా ప్రకటించారు. కొత్తగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నా, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఆర్థిక సాయం అందించకపోవడం సరికాదని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తక్షణమే ఆర్థిక సాయం చేయాలని కోరుతోంది. -
అంగన్వాడీ టీచర్‌పై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలంలోని కంకణాలపల్లిలోని అంగన్వాడీ టీచర్‌పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నారని అంగన్వాడీ టీచర్ స్వర్ణలత తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పౌష్టికాహారం ఇవ్వాలంటూ వెంకటేశ్వరరావు హుకుం కూడా జారీ చేశాడంటూ ఆమె వాపోయారు.పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసిన కానీ.. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు దళితులు.. మా పార్టీ అధికారంలో ఉంది.. నన్నేమీ చేయలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ స్వర్ణలత తెలిపింది.తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షలు ఇప్పిస్తానని వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు డిమాండ్ చేశారన్న స్వర్ణలత.. తనకు ఇద్దరు చిన్న పిల్లలని.. తనకు ఆత్మహత్య తప్ప మరో దారికి లేదన్నారు. న్యాయం చేయాలంటూ బాధితురాలు స్వర్ణలత కన్నీరు మున్నీరవుతున్నారు. -
అన్న వస్తున్నాడు .. కోడిగుడ్డు కూర వండు !
సత్తెనపల్లి: ఏం మేడం ఏం చేస్తున్నారు .. అన్న వస్తున్నాడు .. కోడి గుడ్డు కూర వండు అంటూ ఓ గ్రామ అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నాయకుడి అనుచరుడు ఫోన్ చేసి వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తకు అదే గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి పక్కన ఉండే అనుచరుడు మూడు రోజుల కిందట ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. ఈ రోజు అన్న మీ ఇంట్లోనే ఉంటాడని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడని, అన్న ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు తెలుసుగా ? అంటూ ఘీంకరించాడు. దీంతో ఏం చేయాలో పాలు పోక అంగన్వాడీ కార్యకర్త ఫోన్లో మాట్లాడిన మాటలు అన్నీ ఆమె రికార్డింగ్ చేసింది. వాటిని గ్రామానికి చెందిన మరో అధికార పార్టీ నాయకుడు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన ఆమెను వెంటబెట్టుకొని ఎమ్మెల్యే వద్దకు తీసుకువచ్చాడు. ఆ వీడియో వినిపించగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఎమ్మెల్యే వద్దకు వచ్చిన సంగతి తెలియడంతో గ్రామంలో ఫోన్ చేసిన వ్యక్తికి పార్టీ నేతలే స్వల్పంగా దేహశుద్ధి చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని ప్రాథేయపడటంతో కేసు నమోదు చేయకుండా రాజీమార్గం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉగాది పర్వదినాన ఆదివారం బయటకు రావడంతో పట్టణం, మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
బాబుపై కదంతొక్కిన అంగన్వాడీలు
-
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు. -
Anganwadi Workers: విజయనగరంలో అంగన్వాడీల ధర్నా
-
మాకు న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు.. బాబుపై అంగన్వాడీ వర్కర్లు ఫైర్
-
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్‌తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్‌కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్‌కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
అంగన్వాడీలపై కూటమి సర్కార్ కుట్ర
-
14,236 అంగన్వాడీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ ఫైలుకు వేగంగా పరిష్కారం లభిస్తుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ విభాగంలో మొత్తం 14,236 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 7,837 ఖాళీగా ఉన్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లెక్కగట్టింది. ‘కోడ్’ ముగిశాక నియామక ప్రక్రియ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అంగన్వాడీల్లో ఖాళీలుంటే నిర్దేశించుకున్న లక్ష్యాల అమలు కష్టసాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవీవిరమణకు అర్హత సాధించిన వారు, పదోన్నతికి అర్హత ఉన్న వారితోపాటు కేటగిరీలవారీగా ఖాళీలను లెక్కించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమాళి వచ్చే నెల తొలివారం వరకు కొనసాగనుంది. దీంతో కోడ్ ముగిశాక నియామక నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలవారీగా ఖాళీలను ఖరారు చేశాక వాటిని ఆయా జిల్లా కలెక్టర్లకు పంపేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయి. గతంలో ఈ పోస్టులను భర్తీ చేసినప్పటికీ వేల సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. -
తెలంగాణలో కొలువుల జాతర.. భారీ నోటిఫికేషన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసింది. 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.ఆయా జిల్లా కలెక్టర్లు.. నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్వాడీలు పనిచేయనున్నారు. -
అంగన్వాడీ సిబ్బందికి 18 నుంచి నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల 18 నుంచి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేలా జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకోసం సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రోగ్రాం సాంకేతిక సహకారం అందించనుంది.మొదటి విడత ఈనెల 18 నుంచి 20 వరకు, రెండో విడత 22, 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,344 ఉన్నత పాఠశాలలే కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.45కోట్లు కేటాయించింది. కాగా, శిక్షణలో పాల్గొనే అంగన్వాడీ సిబ్బందికి రోజువారీ గౌరవ భృతి ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీలను క్రమబద్దీకరించాలి
కార్వేటినగరం: అంగన్వాడీ కార్యకర్తలను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం క్రమబద్దీకరించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సిబ్బంది సిఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు విజయ, మమత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడిలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు తీర్పు ప్రకారం ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు సంస్థాగతం చేయకపోవడం దారుణమన్నారు. శిశు, మరణాలు రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల కొద్ది పని చేస్తున్న అంగన్వాడీలపై పనిభారం పెంచడంతో రకరకాల పద్ధతుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల వద్ద డబ్బులు వసూలు చేసే కార్యక్రమం తీవ్రమైందన్నారు. చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా పోషణ వాటిక సెంటర్లను నిర్వహించడం అధికారులకు కాసుల పంటగా మారిందన్నారు. దీంతో అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించారు. అధికారుల ఒత్తిడి మానక పోతే నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టులో ఒకరిద్దరు నాయకులుగా చెలామణి అవుతూ అధికారులకు తొత్తులుగా ఉంటూ అంగన్వాడీలను బెదిరించే పనులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డెమ్మ (శ్రీరంగరాజపురం) పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
Vizag: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రూ.35 వేలు ప్రాణం మీదికి తెచ్చింది. నిందితురాలు సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వద్ద అంగన్వాడీ టీచర్ మున్నిసా బేగం రూ.35 వేలు అప్పు తీసుకోగా.. డబ్బులు అడిగేందుకు సంగీత వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ సంగీత బెదిరింపులకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గొడవలో పెట్రోల్ మీద పోసుకున్న అంగన్వాడీ టీచర్ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది.. దీంతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి అంటూ ప్రచారం జరగడంతో కలకలం రేగింది. యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్ మీద ఆగంతకులు వచ్చారని, ఆమెపై యాసిడ్ పోశారంటూ ప్రచారం జరిగింది.ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ! -
విశాఖలో దారుణం.. అంగన్వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విశాఖలో ఆశ వర్కర్ల నిరసనలు..లోకేష్ గాలి తీసేసిన ఆశావర్కర్
-
హామీ ఇచ్చారు.. చేతులెత్తేశారు.. కూటమి ప్రభుత్వం పై అంగన్వాడీలు ఫైర్
-
బాబుగారూ.. మట్టి ఖర్చులైనా ఇవ్వండి!
తిరుపతి అర్బన్/సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అంగన్వాడీ ఉద్యోగులు మృతి చెందితే కనీసం మట్టి ఖర్చులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అంటూ.. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు కనీసం మట్టి ఖర్చులకైనా నిధులు కేటాయించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా చేశారు. వారికి సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. సీఐటీయూ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచి్చన హామీలను కూటమి సర్కార్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగిన నిరసన ధర్నాలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, శ్రామిక మహిళా జిల్లా కనీ్వనర్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు ఓ వినతిపత్రాన్ని అందించారు. పాడేరులో అంగన్వాడీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పలుచోట్ల హెచ్చరించారు. -
అంగన్వాడీల సదస్సుకు మంత్రి డుమ్మా!
సాక్షి, విజయవాడ: అంగన్వాడీల రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి డుమ్మా కొట్టారు. మంత్రి, కూటమి ప్రభుత్వ తీరుపై అంగన్వాడీ సదస్సు అసహనం వ్యక్తం చేసింది. ‘‘అంగన్వాడీలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. మా సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని, అధికారులను ఆహ్వానించాం. సదస్సుకు కనీసం అధికారులు కూడా రాలేదు’’ అని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వస్తున్నామని చెప్పి మొహం చాటేశారు.. ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఎవరొచ్చినా రాకపోయినా మా ఉద్యమాలు ఆగవు. డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని బేబి రాణి డిమాండ్ చేశారు.మంత్రి రాకపోతే మాకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టంగతంలో అంగన్వాడీలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు గుర్తు చేశారు. ‘‘2014-19 మధ్య కూడా చంద్రబాబు అంగన్వాడీలను పట్టించుకోలేదు. ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వస్తానన్నారు. ఆమె రాకపోతే మనకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టం. ప్రభుత్వాలు ఏవైనా ఉద్యమాల ద్వారానే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి. శాసనమండలి సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై ప్రస్తావిస్తాం. అంగన్వాడీల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చా. 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని నిలదీస్తాం’’ అని లక్ష్మణరావు తేల్చి చెప్పారు.మంచి చేస్తామని చెప్పి.. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మౌనంగా ఉండాలనుకుంటున్నట్లు అనిపిస్తోందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మండిపడ్డారు. ‘‘ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సదస్సుకు రాకపోవడం అలానే అనిపిస్తోంది. అంగన్వాడీల టెంట్ల వద్దకు వచ్చి మద్దతిచ్చిన టీడీపీ.. ఒక్క హామీ ఇవ్వలేదు. మన టెంట్ల వద్దకు వచ్చి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మనల్ని ఎలా బంధించాలా అని ప్రభుత్వం చూస్తోంది. మీ మౌనానికి.. మీ సంఖ్యా బలానికి అంగన్వాడీలు తలొగ్గరు’’ అని రమాదేవి పేర్కొన్నారు.ఇదీ చదవండి: వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలుఆ హామీలేమైపోయాయి..అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ‘‘నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయాలి. ప్రభుత్వం ప్రకటన చేయకపోతే నవంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తాం. జూలైలో అంగన్వాడీలను చర్చకు పిలవాలని మినిట్స్ లో రాసుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలయ్యింది...ఇంతవరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. అంగన్వాడీల సమ్మె టెంటుల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలేమైపోయాయి’’ అంటూ ఆమె ప్రశ్నించారు.‘‘టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీలకు గ్యాడ్యువిటీ హామీని నెరవేర్చాలి. అంగన్వాడీల సమస్యలను. పరిష్కరించకపోతే డిసెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. మేం ఏ పెన్షనూ అడగం. మా ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందంటున్నారు. చనిపోయిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులకు జీవో ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది. అంగన్వాడీలకు కూడా దీపం పథకం అమలు చేయాలి. అంగన్వాడీలకు పెన్షన్ పంపిణీ డ్యూటీలు రద్దు చేయాలి‘‘ అని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. -
శుక్రవారం మాది..
నేటి కాలంలో ఆడపిల్ల కడుపున పడినప్పటి నుంచీ కష్టాలే. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడం నుంచి కిశోర బాలికలకు, బాలింతలకు పోషకాహారం అందకపోవడం దాకా ఎన్నో సమస్యలు. మహిళలు కేన్సర్లు సహా ఎన్నో శారీరక రుగ్మతలకు లోనైనా కప్పిపుచ్చుకుంటూ జీవిస్తున్న పరిస్థితి. పిల్లలను అంగన్వాడీలకు పంపడం లేదు. తెలియక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేలా, మహిళల్లో అవగాహన కల్పించేలా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, స్వయం సహాయక సంఘాలను ఒకే తాటిపై తీసుకువచ్చారు. ‘శుక్రవారం సభ’పేరిట ప్రభుత్వ సేవలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ముందు మా సేవలు చూడండి నేటి కాలంలో మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తున్నారు. పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అనారోగ్యమొస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఈ క్రమంలో ‘ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని ఎదగండి. చిన్నారులకు అంగన్వాడీలలో అందించే బాలామృతం, కిశోర బాలికలకు రక్తహీనతను తగ్గించే పోషకాహారం, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం, మధ్య వయసు స్త్రీలకు ప్రతీ 3 నెలలకోసారి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఆరోగ్య మహిళ’ పేరిట లభించే 52 ఉచిత పరీక్షల వివరాలు తెలుసుకోండి. ఈ సేవలన్నీ ప్రభుత్వం వద్ద ఉచితంగా అందుతాయి..’అంటూ ‘శుక్రవారం సభ’పేరిట వారానికి ఒక మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే గర్భవతులకు సీమంతం, బాలింతలకు పోషకాహార పంపిణీ వంటివాటిని కలెక్టర్ స్వయంగా చేపడుతుండటం గమనార్హం. పీసీవోడీ, కేన్సర్, భ్రూణహత్యలపైనా.. నడి వయసు మహిళలకు ఆరోగ్య మహిళా పథకం ద్వారా పీసీవోడీ (గర్భాశయంలో కణతులు), కేన్సర్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ముప్పును ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని.. అవే పరీక్షలు, చికిత్సలు ప్రైవేటులో చేస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని కలెక్టర్ సత్పతి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. మహిళలు తీవ్ర అనారోగ్యాల పాలైతే వారి కుటుంబాలు ఆగమవుతాయని సూచిస్తున్నారు. పిల్లల మానసిక వికాసానికి వీలుగా అంగన్వాడీలను ఆహ్లాద వాతావరణం ఉండేలా మారుస్తున్నారు. భ్రూణహత్యలను అరికట్టేలా మహిళల్లో చైతన్యం కల్పిస్తున్నారు. పోషకాహారం ప్రాధాన్యం తెలిసింది.. కలెక్టర్ సత్పతి మేడం మొదలుపెట్టిన శుక్రవారం సభ మాలో చైతన్యం తెచ్చింది. బాలింతలకు, గర్భవతుల సంక్షేమం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మాలో రక్తహీనత నివారించేలా అవగాహన కల్పించారు. తల్లి పాల ప్రాముఖ్యత, అంగన్వాడీలలో లభించే సేవల గురించి చక్కగా వివరించారు. –అనిత, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్కేన్సర్ ముప్పు గురించి చెప్పారు కలెక్టర్ మేడం పీసీవోడీ, కేన్సర్ ఎలా వస్తాయో వివరించారు. మా ముందు తరాల వారు పనిలో పడి ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నారు. కలెక్టర్ మేడం తల్లిలా మాపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడపిల్లల ప్రాధాన్యం వివరించి భ్రూణహత్యల నివారణపైనా అవగాహన కల్పించారు. – అఖిల, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్ -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
టీడీపీ నేతల వేధింపులు తాళలేక ‘అంగన్వాడీ’ ఆత్మహత్యాయత్నం
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ విలేకరి (సాక్షి, ఈనాడు కాదు) వేధింపులు భరించలేక అంగన్వాడీ కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త వీరభద్ర కథనం మేరకు.. దుద్యాల పంచాయతీ పెద్దజంగంపల్లికు చెందిన అంగన్వాడీ కార్యకర్త జె. నాగరత్నకు గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మంజూరైంది. ఆమె భర్త వీరభద్ర వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడనే నెపంతో.. తమ ఇంటిని కూల్చివేస్తామని భార్యాభర్తలను టీడీపీ నేతలు, సదరు విలేకరి వేధింపులకు గురి చేస్తూండేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కుటుంబంపై జరుగుతున్న ఘటనలకు బతుకు మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగిందని భర్త వీరభద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీల నిరసన.. అంగన్వాడీ వర్కర్ నాగరత్నమ్మకు మద్దతుగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఐటీయూ నేతలు రామాంజనేయులు, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, సీపీఎం , సీపీఐ నాయకులు , ఐసీడీఎస్ పీడీ శశికళ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు, ఓ పత్రిక విలేకరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తాళ్లతో బంధించి దళిత యువకుడిపై దాడికాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘటన ప్రేమ పేరుతో అల్లరి చేశాడని యువకుడిపై యువతి ఫిర్యాదుసామర్లకోట: ప్రేమిస్తున్నానని చెప్పిన ఓ దళిత యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సామర్లకోట సీఐ ఆర్.అంకబాబు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన దళిత యువకుడు చాపల అజయ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె ఇంట్లోకి వెళ్లి అల్లరి చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని ప్రేమిస్తున్నానని చెప్పిన నేరానికి ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడి చేతులు కట్టి, చిత్రహింసలకు గురి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కాగా, దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. అజయ్, ఆ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 1న ఇద్దరూ కలసి బయటకు వెళ్లారని, రాత్రి సమయంలో ఆ యువతిని అజయ్ కుమార్ ఇంటి వద్ద క్షేమంగా దింపాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలు పెడుతున్నారనే విషయం తెలిసి, అజయ్ శనివారం ఆమె ఇంటికి వెళ్లాడని దీంతో యువతి కుటుంబీకులు అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బందీగా ఉన్న అజయ్ కుమార్‌ను పోలీసులు విడిపించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. -
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
అంగన్వాడి టీచర్లకు 2 లక్షలు.. ఆయాలకు లక్ష
సాక్షి, హైదరాబాద్, రహమత్‌నగర్: పదవీ విరమణ పొందే అంగన్ వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు (హెల్పర్లు) రూ.లక్ష రిటైర్మెంట్ ప్యాకేజీని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఫైల్ క్లియర్ చేసిందని, రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని చెప్పారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమాత్ నగర్ డివిజన్లో అమ్మ మాట – అంగన్ వాడీ బాట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి సీతక్క ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల భాష బోధనా విధానం ప్రవేశపెడతామని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్ధులకు యూనిఫామ్స్, ఆట వస్తువులు అందించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్చించాలని తల్లి దండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత మంత్రి సీతక్క మొక్కలు నాటించారు. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అని చిన్నారులతో పలికించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ. రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పాల్గొన్నారు.మహిళా రైతులకు 50 శాతం రాయితీపై పరిశీలన: సీతక్కసాగు భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని ప్రభు త్వం పరిశీలిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. మంగళవారం ప్రజా భవన్లో మంత్రితో మహిళా రైతుల హక్కుల సాధనకు కృషిచేస్తున్న ‘మహిళా కిసాన్ అధికార్ మంచ్’ (మకామ్) ప్రతినిధులు డా. ఉషా సీతా మహాలక్ష్మి, డా. వి రుక్మిణి రావు, ఎస్. ఆశాలత సమావేశమయ్యారు. మహిళలకు భూ యాజ మాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు సమర్పించిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. రైతు భరోసా పథకాన్ని పదెకరాల వరకే అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల మధ్య భూ పంపకాలు జరిగే అవకాశా లున్నాయని ’మకాం’ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పెళ్లికాని కుమార్తెలు, ఒంటరి మహిళలు, గృహిణుల పేర్లపై భూ రిజిస్ట్రేషన్లు పెంచేలా.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళలకి రాయితీ ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను సీఎం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాగు భూమి రిజిస్ట్రేషన్ల చార్జీలో 50 శాతం రాయితీలు ఇస్తూ విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయ త్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
అంగన్వాడీలకు గుడ్ న్యూస్
-
అంగన్వాడీల్లో రిటైర్మెంట్ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు తప్పకుండా రిటైరవ్వాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు నిర్మల కాంతి వెస్లీ తరఫున సంయుక్త సంచాలకులు కేఆర్ఎస్ లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు. ఈ మెమోను రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఆదివారం పంపించారు. ప్యాకేజీపై పెదవి విరుపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ ప్యాకేజీ కింద అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ప్రభుత్వం జీఓ 10ని జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలు సద్దుమనిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్యాకేజీ సవరణల ఊసు లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదవీవిరమణ ప్రక్రియ అమల్లోకి వచి్చంది.ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారు విధుల నుంచి తప్పుకోవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూచించింది. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ సమాచారాన్ని అంగన్వాడీల యాప్ (ఎన్‌హెచ్‌టీఎస్–ఈఎంఎస్) నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. దీనిపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోబోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలి అంగన్వాడీ టీచర్, హెల్పర్లు సగటున 30–40 ఏళ్లపాటు సేవలందించి 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతున్నారు. అంతకాలం సేవలందించే వారికి ప్రభుత్వం అత్తెసరు ఆర్థిక సాయం ఇవ్వాలనుకోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయంలో మార్పులు చేయాలి. కనీసం అంగన్వాడీ టీచర్‌కు రూ. 2 లక్షలు, హెల్పర్‌కు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలి. అప్పటివరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందుకు అంగీకరించాలి. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు దిగుతాం. – ఎం.సాయిశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నాటి హామీలు ఏమయ్యాయి? గౌరవవేతనం పెంపు కోసం గతేడాది మేం సమ్మె చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనాలు పెంచడంతోపాటు పదవీ విరమణ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా వేతన పెంపు, రిటైర్మెంట్ ప్యాకేజీ మాటెత్తడం లేదు. – పి.రజిత, అంగన్వాడీ టీచర్, కరీంనగర్ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మెరుగైన పదవీవిరమణ ప్యాకేజీ ఇస్తామని, వేతనాలు కూడా పెంచుతామని అప్పట్లో సమ్మె చేసిన చోటుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు. టీచర్లకు రూ. 18 వేలు జీతం ఇస్తామని, రిటైర్మెంట్ ప్యాకేజీ రెట్టింపు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదు. – టేకుమల్ల సమ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
ఆగం అవుతున్న అంగన్వాడీ బతుకులు
-
అంగన్వాడీల్లో వేతన యాతన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి వారికి వేతనాల్లేవు. మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పదో తేదీలోపు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందేవి. కానీ ఏడాది కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 59వేల మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 59వేల మంది టీచర్లు, హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్వాడీ టీచర్‌కు నెలకు రూ.13650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా... హెల్పర్‌కు రూ.7800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం మంజూరు చేస్తోంది. ప్రతి నెలా జాప్యమే.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలో లేక ఇతరత్రా కారణాలతో వేతన చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ.. ప్రతి నెలా ఇదే పరిస్థితి తలెత్తుతుండడం పట్ల వారు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలకు ప్రతి నెలా రూ.70 కోట్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవవేతనానికి సంబంధించి ప్రతి నెలా సగటున రూ.70కోట్ల బడ్జెట్ అవసరం. ఈ లెక్కన ఏటా రూ.840 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. గత కొంత కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కమిషనరేట్‌కు ఫిర్యాదులు వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు వే ర్వేరుగా వినతి పత్రాలు సమరి్పంచింది. వేత న చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరింది. -
మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు
ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్‌కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లింది.అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్‌కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్వాడీ టీచర్ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు.అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్‌కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. -
అంగన్వాడీల రిటైర్మెంట్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పదవీ విరమణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవడం.. మరోవైపు వయోపరిమితి సడలింపు తర్వాత ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల ప్రక్రియ షురూ కావడంతో అంగన్వాడీల రిటైర్మెంట్ల పర్వానికి తెరలేచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమాచార సేకరణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టింది. ఉద్యోగంలో చేరిన తేదీ మొదలు, జిల్లా, ప్రాజెక్టు వివరాలు, వారి పుట్టిన తేదీ, వయసు తదితర వివరాలను నిరీ్ణత ప్రొఫార్మాలో క్షేత్రస్థాయిలో జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(సీడీపీఓ)ల నుంచి తెప్పించుకుంది. గత నెలాఖరు నుంచే రిటైర్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్ల పెంపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణలు మార్చి నెల నుంచే మొదలయ్యాయి. అయితే నూతన వార్షిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మాత్రం ఏప్రిల్ నెలాఖరు నుంచి రిటైర్మెంట్లు అమలు చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలతో 65 సంవత్సరాలు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల వివరాలను ఆ శాఖ సేకరించింది. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్, అంగన్వాడీ హెల్పర్‌కు రిటైర్మెంట్ ప్యాకేజీ కింద రూ.50వేలు అందించనుంది. రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పింఛన్ ఇచ్చేలా ప్యాకేజీలో ఉంది. ఏడాది చివరికల్లా 5వేల మంది... రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్చర్లు దాదాపు 50వేల మంది పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు పదవీ విరమణకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించే అంశం లేదు. తాజాగా ప్యాకేజీని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి పదవీ విరమణ ప్రక్రియను చేపడుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5వేల మంది టీచర్లు, హెల్పర్లు రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ ప్యాకేజీ సమ్మతంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ల రిటైర్మెంట్ ప్యాకేజీ ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదు. టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలని గత ప్రభుత్వం ఎదుట డిమాండ్ పెట్టాం. కానీ అందులో సగానికి తగ్గించి ప్యాకేజీ అంటూ చెప్పడం అన్యాయం. ప్రభుత్వం ఇచ్చే రిటైర్మెంట్ ప్యాకేజీ వారి జీవితానికి ఏమాత్రం సరిపోదు. డిమాండ్ల సాధన కోసం మళ్లీ న్యాయపోరాటం చేస్తాం. – టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు -
వ్యాన్ డ్రైవర్ భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇవ్వండి
అన్నానగర్: పోలీసుల దాడిలో మరణించిన వ్యాన్ డ్రైవర్ భార్యకు అంగన్వాడీ వర్కర్‌గా ఉద్యోగం ఇవ్వాలని మధురై హైకోర్టు ఆదేశించింది. పోలీసుల దాడిలో మృతి చెందిన వ్యాన్ డ్రైవర్ భార్య తెన్కాశి జిల్లా శంకరన్ కోవిల్ ఉత్తర పుత్తూరు ప్రాంతానికి చెందిన మీనా మదురై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త మురుగన్ (36) వ్యాన్ డ్రైవర్. గత 8వ తేదీన అచ్చంపట్టి నుంచి మహిళలను వ్యానులో ఎక్కించుకుని శివరాత్రి ఉత్సవాల కోసం ఆలయానికి వెళ్లాడు. ఆపై వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు తన భర్తను అనుచితపదాలతో దూషించి, దాడి చేశారు. సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి చనిపోయాడని వైద్యులు తెలిపారు. భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆ ఫిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు తగిన పరిహా రం ఇవ్వాలన్నారు. సంబంధిత పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ ఆమె పిటిషన్లో పే ర్కొన్నారు. ఈ కేసులో తగిన ఉత్తర్వులు జారీ చేస్తా మని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌కు అంగన్వాడీ కా ర్యకర్త ఉద్యోగం ఇవ్వాలని, అలాగే మురుగన్ కుటుంబానికి ఆది ద్రావిడర్ సంక్షేమ నిధి నుంచి తగిన పరిహారం అందించాలని కేసు విచారించిన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే మురుగన్ మృతి కేసును సీబీసీఐడీ పర్యవేక్షణలో తగు విచారణ జరపాలని ఆదేశించారు. -
అంగన్వాడీల వేతన వెతలు!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపోగా... అంతకు ముందు సమ్మె కాలానికి సంబంధించిన వేతన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు. అందాల్సిన వేతనాల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌కు నిత్యం వినతులు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాష్ట్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,000మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 58,500 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. మూడు నెలల కిందటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా పదో తేదీ లోపు వేతనాలు అందించేవారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు గౌరవ వేతన రూపంలో రూ.13,650, హెల్పర్లకు 7,800 చొప్పున నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీరికి ఏడాదికి రూ.850 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. బడ్జెట్ లేదంటూ... ప్రస్తుతం మూడు నెలలుగా టీచర్లు, హెల్పర్లకు వేతనాలు నిలిచిపోయాయి. బడ్జెట్ సమస్యతో వేతనాలు నిలిచిపోయాయంటూ కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని, అది పరిష్కారమైతేనే వేతనాలు విడుదలవుతాయని అంటున్నారు. అయితే ఎన్నిరోజుల్లో సమస్యకు పరిష్కారం దక్కుతుందో యంత్రాంగం వద్ద కూడా స్పష్టత లేదు. ప్రతినెలా ఒకటో తేదీనే చెల్లించాలి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే గౌరవవేతనం అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా అదేరోజు చెల్లించాలి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో చాలామంది అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో సమ్మె చేసిన కాలానికి సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. – టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
సమస్య పరిష్కరించిన సీఎం జగన్..విధులకు హాజరైన అంగన్ వాడీలు
-
థ్యాంక్యూ సీఎం సార్
సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అంగన్వాడీల్లో అభిమానం ఉప్పొంగింది. సమ్మెకు స్వస్తి పలికి విధుల్లో చేరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వానికి అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛందంగా సభలు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లలో 10 ఆమోదించి తక్షణం అమలు చేస్తున్నందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించినందుకు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామని, వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి పేద వర్గాల సేవలకు అవాంతరాలు తొలగించడం పట్ల కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. అంగన్వాడీ కార్యక్రమాలు యథావిధిగా సాగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలందించే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పట్ల, అలాగే వర్కర్లు, హెల్పర్ల పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచి సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు మెరుగైన వేతనాలు సీఎం వైఎస్ జగన్ పాలనలోనే అందిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంగన్వాడీ వర్కర్ల సగటు నెల వేతనం రూ.6,100 ఉంటే సీఎం జగన్ నాలుగున్నరేళ్లుగా వర్కర్లకు రూ. 11,500 చొప్పున అందిస్తున్నారు. విశాఖలో సంబరాలు సీతమ్మధార (విశాఖ ఉత్తర): తమ సమస్యల పరిష్కారం కావడంతో మంగళవారం విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద భీమిలి, పెందుర్తి, విశాఖ అర్బన్ ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీల కార్యకర్తలు, హెల్పర్లు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందం పంచుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటాన్ని పట్టుకుని ‘జై జగన్’ అంటూ నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ యూనియన్ గౌరవ సలహాదారులు బృందావతి, అధ్యక్షురాలు వై.తులసీ, కార్యదర్శి ఎల్.దేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం గతంలో అంగన్వాడీలు ఉద్యమాలు చేస్తే అణచివేసేందుకే ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు వైఎస్సార్ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా వ్యవహరించడంతో శాంతియుతంగానే మా సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఎం వైఎస్ జగన్ మా 11 డిమాండ్లలో పది ఆమోదించి అమలు చేయడం పట్ల ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. – మహాలక్ష్మి, చాగల్లు అంగన్వాడీ వర్కర్, తూర్పుగోదావరి జిల్లా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంగళవారం నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రభుత్వం మాకు అండగా ఉందనే భరోసా దక్కడంతో సమ్మె విరమించి విధుల్లో చేరాం. – రావాడ వెంకట సత్యవేణి, గొలుగొండపేట–1 అంగన్వాడీ వర్కర్, అనకాపల్లి జిల్లా చంద్రబాబు గుర్రాలతో తొక్కించింది మరవలేం సమస్యల పరిష్కారానికి ఆందోళన చేసిన అంగన్వాడీలను చంద్రబాబు హయాంలో గుర్రాలతో తొక్కించి, బాష్పవాయువును ప్రయోగించిన చేదు ఘటనను ఎప్పటికీ మరిచిపోలేం. సీఎం జగన్ మాత్రం మమ్మల్ని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన తీరుతో ఉద్యోగ భద్రత లభించింది. మళ్లీ జగన్ ప్రభుత్వం రావడానికి సహకరిస్తాం. – పి.విజయకుమారి, చాగల్లు అంగన్వాడీ వర్కర్, తూర్పుగోదావరి జిల్లా సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఆమోదించి తక్షణం అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం, చనిపోతే మట్టి ఖర్చులు రూ. 20 వేలు ఇవ్వడం వంటి అనేక నిర్ణయాలతో మాకు చాలా మేలు జరుగుతుంది. – అమిడెల సోములమ్మ, చిత్రకాయ పుట్టు అంగన్వాడీ వర్కర్, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా మా కోర్కెలు తీర్చిన ఏకైక ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు తీర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఏవో కొన్ని డిమాండ్లు ఆమోదించి, మిగిలినవి తర్వాత చూద్దాం అని ప్రభుత్వం అంటుందని అనుకున్నాం. కానీ, మేము అడిగిన ప్రతీ డిమాండ్‌ను ఆమోదించి మనసున్న ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్ మరోమారు నిరూపించారు. – కొర్ర కన్యాకుమారి, వెళ్లపాలెం అంగన్వాడీ హెల్పర్, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా -
అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం
-
అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం
-
సమ్మెకు తెర.. నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. ‘అంగన్వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నాం. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు.. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నాం. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్ చేస్తాం. అంగన్వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి.. వారిచ్చేది నేరుగా అమలు చేస్తాం. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమ్మె కాలంలోని అంగన్వాడీల వేతనం, పోలీసు కేసుల అంశం తీసుకెళ్లి.. న్యాయం జరిగేలా చూస్తాం. ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్వాడీ అక్కచెల్లెమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని మంత్రి తెలిపారు. ఇక విధుల్లోకి వెళ్తున్నాం.. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. సర్వీసులో ఉండి అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో టీఏ బిల్లులు నిలిచిపోయాయని, ఆ బిల్లులు వచ్చిన వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. యాప్‌ల భారాన్ని సైతం తగ్గిచేందుకు స్పష్టమైన హామీ లభించిందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ బిల్లులు, గ్యాస్ మెనూ పెంపు, చిన్నారుల మెనూ పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి చర్యలు చేపడతామనడం ఆనందాని్నస్తోందన్నారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, గౌరవాధ్యక్షురాలు మంజుల, వీఆర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ‘ఛలో’ భగ్నం ఇదిలా ఉండగా.. అంగన్వాడీల ఆందోళనను అడ్డు పెట్టుకుని పలుచోట్ల టీడీపీ నేతలు టెంట్లు, కుర్చీలు, భోజనాలు సమకూరుస్తూ కొన్ని శక్తులను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. అంగన్వాడీల ముసుగులో అసాంఘిక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ‘ఛలో విజయవాడ’కు పిలుపునిచ్చాయి. నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. -
అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం
విజయవాడ: అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు సజ్జల మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయని అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ► అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం ► జూలైలో జీతాలు పెంచుతాం ► ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం ► హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం ► మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ► సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం ► సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం ► వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం ► గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం ► ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం ► అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం ► మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి ► కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు ► మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు కాగా ఈ చర్చలకు హాజరైన అంగన్వాడీ యూనియన్ నాయకులు తాము సమ్మె విరమించి విధులకు రేపట్నుంచి హాజరౌతున్నట్టు తెలిపారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి ► చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి ► సమ్మె విరమిస్తున్నాం...రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం ► జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు ► మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు ► రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు ► మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ► అగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు ► రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది ► టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది ► సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తాం అన్నారు ► సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు... కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది -
‘పలు జిల్లాల్లో అంగన్వాడీలు విధుల్లో హాజరవుతున్నారు’
సాక్షి, అమరావతి: పలు జిల్లాల్లో అంగన్వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని ఆయన సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని తెలిపారు.జాయిన్ అవుతున్నవారందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరుతున్నానని అన్నారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని మరోసారి గుర్తుచేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని చెప్పారు. మీరు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామని తెలిపారు. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామని చెప్పారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని అన్నారు.రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్వాడీలను మరోసారి కోరుతున్నానని తెలిపారు. అంగన్వాడీల అందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని చెప్పారు. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని, బాలింతలు, శిశువులకు ఇబ్బంది రాకుండా వెంటనే అంగన్వాడీల సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధులకు హాజరుకాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరుతున్నామని అన్నారు. వారి సేవలు చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తి చేస్తున్నామని బొత్సా సత్యనారాయణ అన్నారు. చదవండి: చంద్రబాబు పల్లకి మోసేందుకు ముద్రగడ నో..! -
ఏపీలో దారి తప్పుతున్న అంగన్వాడీల ఆందోళన
విజయవాడ: ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన దారి తప్పుతోంది. అంగన్వాడీల నీడలో ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అసాంఘిక, రాజకీయ శక్తుల చేతుల్లోకి ఛలో విజయవాడ కార్యక్రమం వెళ్లినట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. దాంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను నిఘా వర్గాలు అలెర్ట్ చేశాయి. దీనిపై అంగన్వాడీలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. -
అంగన్వాడిల సమ్మెపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
అమలాపురంలో TNTUC నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు
-
కోనసీమ జిల్లా: టీడీపీ నేతలకు అంగన్వాడీల ఝలక్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్‌కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు. ఇదీ చదవండి: అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి -
అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అంగన్వాడీల సమస్యలపై సానుభూతితో వ్యవహరిస్తోందనీ, ఆయన ఆదేశాలతో ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి చర్చలు జరిపారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడంలేదని, ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామని చెప్పారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని గమనించాలని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందనీ, వారికి సేవలు అందకపోవడంవల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయనీ, పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని కోరుతున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... అడిగినవన్నీ ఆమోదించాం.. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాం. దానిపై వారు మరోసారి ప్రతిపా దించడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు, పదోన్నతుల వయో పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు అంగీకరించాం. టీఏ, డీఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేలా ఆమోదించాం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపాం. మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాం. వేతనం పెంపుపై పట్టు తగదు.. చంద్రబాబు హయాంలో అంగన్వాడీలకు ఇచ్చిన వేతనం ఎంత? వైఎస్ జగన్ ఇస్తున్న వేతనం ఎంత? అనేది అంగన్వాడీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అంగన్వాడీ వర్కర్లకు రూ.4,200, హెల్పర్లకు రూ.2,200, అదే 2016లో రూ.7 వేలు, రూ.4,500 ఇచ్చారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనం పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడంతో ఎన్నికల ఆర్నెల్ల ముందు చంద్రబాబు వేతనాలు పెంచినా... సక్రమంగా అందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ అధికారం చేపట్టిన వెంటనే జూలైలో వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో వర్కర్లకు సగటున నెలకు రూ.6,100 మాత్రమే వస్తే... జగన్ పాలనలో నాలుగున్నరేళ్లుగా రూ.11,500 ఇస్తున్నారు. వేతనాల పెంపునకు గడువు కోరాం ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాం. 2019 జూలైలో వేతనాలు పెంచాం. కనీసం ఐదేళ్లు గడువు ఇవ్వాలని చెప్పాం. వచ్చే జూలైలో ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతామనీ, సమ్మె విరమించాలని కోరాం. యూనియన్లు ఇప్పటికైనా ఆలోచించాలి. రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అంగన్వాడీల సమ్మె విషయంలో సంయమనం పాటించాం. ఎస్మా విషయంలో రాజకీయ పార్టీలు, అంగన్వాడీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ అజెండాతో రెచ్చగొడుతున్న ప్రతిపక్షాల డైరెక్షన్లో అంగన్వాడీలు వెళితే నష్టపోక తప్పదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గురువారం నుంచి నోటీసులు ఇస్తోంది. పది రోజుల గడువు ఇచ్చి కొత్త వారిని నియమించుకుంటాం. తెగే వరకు సమస్యను సాగదీయకుండా అంగన్వాడీలు అర్థం చేసుకుని సమ్మె విరమించాలి. -
అంగన్వాడీలు మెట్టు దిగడం లేదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం. వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పాం. అంగన్వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్ చేస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించాం. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, గర్భిణీలు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మాన పరిధిలోకి తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో.. అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాం. అంగన్వాడీలు విధుల్లో చేరాలని ప్రభుత్వం తరఫున కోరారాయన. ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉంది. ఈ పోలిటికల్ ఎజెండాతో అంగన్వాడీలు నష్టపోతారు. వారు విధుల్లో చేరకుంటే నిబంధనలు ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అని సజ్జల పేర్కొన్నారు. -
ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు
ఆఖరుకు రాజకీయాలు అలా తయారయ్యాయి.. ప్రజలు.. కార్మికులు.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన ఉద్యమ పార్టీలు డబ్బుకు అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో లేని కారణాలు సృష్టించి.. ఉద్యోగుల్లోనూ, అంగన్ వాడీల్లోనూ లేని అసంతృప్తిని రేకెత్తించి వాళ్లను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో కార్మిక.. ఉద్యోగ.. విద్యార్ధివర్గాల్లో అసంతృప్తి ఉందన్న భావనను విస్తృతం చేయడం.. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత రాజేయడం వారి లక్ష్యం. అయితే ఇదంతా ఊరకనే చేయరు.. అటు ప్రతిపక్ష తెలుగుదేశానికి లబ్ది చేకూర్చడానికి వారు ఎన్నికల్లో గెలవడానికి తమవంతు పాత్ర పోషించే క్రమంలో ఫీజు తీసుకుని ఇలా ఉద్యమాలు చేస్తుంటారు అన్నమాట. అన్ని వర్గాల ప్రజలకు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందుతుండడంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. వారినుంచి ఎలాంటి అసంతృప్తి లేదు. ఉద్యోగుల్లో అంగన్ వాడీలు.. ఇంకా ప్రభుత్వ సిబ్బందికి సైతం ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మరి అలాంటపుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం తెలుగుదేశం వల్లకాదని అర్థం చేసుకున్న ఆ పార్టీ పెద్దలు.. నేరుగా ఉద్యమపార్టీలను లైన్లో పెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను వారికి కోట్లకు కోట్లు ప్రతిపక్ష టీడీపీ ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ డబ్బును జిల్లాల యూనిట్ల బాధ్యులకు కాస్త పంపించి ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. అందుకే కారణం లేకుండానే అంగన్ వాడీలు సైతం ఆందోళనలకు దిగారు. వారికి గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహాన్ని సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న జీతాలను జగన్మోహన్రెడ్డి పెంచి.. వారికి ఉద్యోగభద్రత కల్పించడమే కాకుండా పదోన్నతుల్లో వారికి మరిన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అయినా సరే అకస్మాత్తుగా వారు సమ్మెకు దిగారు. గతంలో జగన్‌కు క్షీరాభిషేకాలు చేసినవాళ్లే ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని సందేహిస్తున్న వారికి అసలు కారణం తెలుస్తోంది. వాస్తవానికి 2014-19 మధ్య అంగన్ వాడీలు.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు పెద్దగా చేసిందేమి లేదు కానీ ఆనాడు ఉద్యమాలు పెద్దగా చేసింది లేదు. అంటే అప్పుడు మిన్నకుండడానికి సైతం పేమెంట్ ముట్టిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నేళ్లు ఊరుకున్న ఉద్యోగులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్లెక్కడం వెనుక ఆ పార్టీల పెద్దల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది అవగతం అవుతున్నది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏమీ చేయకపోయినా పల్లెత్తుమాట అనలేదు కదా చంద్రబాబుని.. పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు మాత్రం.. ఉపాధ్యాయ.. విద్యార్ధి.. ఇతర ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి వారి ఖర్చులు.. ధర్నాల టెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆందోళనలు చేయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -- సిమ్మాదిరప్పన్న చదవండి: ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు -
AP: అంగన్వాడీలు రాజకీయాలకు బలి కావొద్దు: సజ్జల
సాక్షి,తాడేపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు. ‘అంన్వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆడియోలు మేం విన్నాం. కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు. రాజకీయ అజెండాకి బలి కావద్దు. ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం. గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్టొద్దు. పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుంది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్వాడీలను రెచ్చగొడుతున్నారు. వారి వలలో చిక్కుకోవద్దు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్వాడీలకు అన్యాయం చేశారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుతున్నాం. సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్థులు లేరు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. మేము కాన్ఫిడెంట్‌గా సీట్లపై నిర్ణయాలు తీసుకుంటున్నాం. లోకేష్, గంటా శ్రీనివాసరావు, అనిత, జవహర్ ఇలా ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు మారారో తెలియదా.. అన్ని పార్టీలు కట్ట కట్టుకుని వచ్చినా మాకు ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు, అలాంటప్పుడు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారు? ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటమి తప్పదని ఊహించే ముందుగా కారణాలు వెతుక్కుంటున్నారు. గతంలో ఓడిపోగానే ఈవీఎంలపైకి నెట్టారు’అని సజ్జల గుర్తుచేశారు. ఇదీచదవండి.. రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు -
‘నా ఉద్యోగం నేను చేసుకుంటా..’
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ‘నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లను. నాకు జీతం కావాలి. నా ఉద్యోగం నేను చేసుకుంటాను’ అని విశాఖపట్నంలోని రేసపువానిపాలెం అంగన్వాడీ కేంద్రం ఆయా దేవిక తేల్చి చెప్పింది. సహచరులు సమ్మె చేస్తున్నా కూడా ప్రజలకు అత్యవసర సేవలు ఆగకూడదన్న ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి విధుల్లో చేరింది. సమ్మె కారణంగా జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలెం అంగన్వాడీ సెంటర్‌ను మూసివేయాల్సి వచ్చింది. ఆ కేంద్రంలోని ఆయా దేవిక శుక్రవారం అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న సమయంలో కొందరు యూనియన్ నాయకులు ఆమెను అడ్డుకుని అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. మళ్లీ కేంద్రాన్ని తెరిస్తే ఆయాకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఇంటిని 500 మంది అంగన్వాడీలతో కలిసి ముట్టడిస్తామని ఆమెను యూనియన్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లనని చెప్పిన ఆయా దేవిక ధైర్యంగా శనివారం కూడా అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసి తన విధులను యథావిధిగా నిర్వర్తించారు. -
అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదనే..
సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అందాల్సిన అత్యవసర సేవల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ఈ చర్యను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.. ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో అంగన్వాడీలు సమ్మెకు దిగడాన్ని తప్పుబట్టాయి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నాయి. వాస్తవానికి దేశంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, వీరి వేతనాల నిమిత్తం కేంద్రం కేవలం రూ. 1,800 మాత్రమే ఇస్తున్నా మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపాయి. చాలా రాష్ట్రాల్లో వారికి ఇచ్చే వేతనం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉందని చెప్పాయి. కాగా, ఇప్పుడు అంగన్వాడీలను ఇష్టమొచ్చిన మాటలతో రెచ్చగొడుతున్న విపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న 2000వ సంవత్సరంలో ఉద్యోగులను గుర్రాలతో తొక్కించాడన్నది పచ్చి నిజం. మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్ల పాటు వారికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు రూ. 7 వేలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల వేతనాన్ని తెలంగాణతో సమానంగా పెంచుతామని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే కొద్ది నెలల ముందు హడావుడిగా వారి వేతనాన్ని రూ. 10,500కు పెంచి దానిని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్వాడీల వేతనాన్ని రూ. 11,500కు పెంచి చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది తలెత్తినా ఎప్పుడూ ప్రభుత్వం వెనకడుగు వేయని ప్రభుత్వ పరిస్థితిని అంగన్వాడీలు అర్థం చేసుకోకపోవడం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే ఎస్మా.. అత్యంత బలహీనులకు పౌష్టికాహార పంపిణీ తదితర సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అంగన్వాడీలు ఆరు నెలల పాటు సమ్మె చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలలో 25 రోజుల చొప్పున ఏడాదిలో 300 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గత నెల 12 నుంచి సమ్మెకు దిగడంతో ప్రజల్లో అత్యంత బలహీనులైన వారికి పౌష్టికాహార పంపిణీలో అవరోధం ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి 11 డిమాండ్లలో 10 ఆమోదించి అమలుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ నిలిచిపోయింది. పిల్లల గ్రోత్ మోనిటరింగ్ నిర్వహణ, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు ఆగిపోయాయి. సమ్మె కారణంగా 7.5 లక్షల ప్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు రావడం తగ్గిపోయి ప్రస్తుతం రెండు లక్షలే వస్తున్నారు. కొత్తగా పిల్లల నమోదు కూడా ఆగిపోయింది. ప్రతి నెల సుమారు 45 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనార్థం తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్విసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్–1971(ఎస్మా)’ను ప్రయోగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నెలలపాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వం ఇది.. ♦ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఐదేళ్ల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ. 6,950, అంగన్వాడీ సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ.3,900 మాత్రమే చెల్లించింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలున్నగురేళ్లుగా వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు చొప్పున పెంచిన వేతనాలు అందిస్తోంది. అంతేగాక మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ఇస్తోంది. ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. -
అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు నీచ రాజకీయాలు
సాక్షి అమరావతి: అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్‌గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్‌తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం. -
AP: ఎస్మా పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు
-
AP: ఎస్మా పరిధిలోకి అంగన్వాడీ సర్వీసులు
సాక్షి, విజయవాడ: అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి రాష్ట్రంలోని అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించింది. ఆరు నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మెలు నిషేధించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదీచదవండి.. సంక్రాంతికి స్పెషల్ రైళ్లు -
సీఎం వైఎస్ జగన్ హయంలో అంగన్ వాడీలకు మేలు
-
అంగన్ వాడీలకు సీఎం జగన్ ప్రోత్సాహకం
-
AP: సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు మరింత చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరింది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. వారి క్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అనివార్య పరిస్థితి తీసుకురావద్దని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ప్రయోజనం కోసం తీసుకున్న వివిధ నిర్ణయాలను పునరుద్ఘాటిస్తూ.. మరిన్ని సానుకూల నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. అందువల్ల సమ్మెను విరమించాలని కోరింది. టీడీపీ హయాంలో ఒక్కపైసా కూడా పెంచలేదు అంగన్వాడీలకు టీడీపీ హయాంలో 2016 ఏప్రిల్ 4న అంగన్వాడీ కార్యకర్తల జీతం రూ.4,200 నుంచి, రూ.7,000కు, మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు రూ.2,950 నుంచి రూ.4,500కు, అంగన్వాడీ సహాయకుల జీతాలు రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచారని మంత్రుల బృందం గుర్తు చేసింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీల కష్టాలు చూసి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాలను పెంచిందని గుర్తు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకురాలికి, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించిందని వివరించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.11,500లకు, మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.7,000కు, అంగన్వాడీ సహాయకుల జీతాలను రూ.7,000కు పెంచిందన్నారు. మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.27.80 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రుల బృందం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తొలిసారిగా పదోన్నతులు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేసింది. ఈ పోస్టుల పరీక్షలు రాసేవారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. దాంతో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కల్పించిందని వివరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా రూ.1,313 కోట్లు అందించిందని తెలిపింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలతోపాటు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. -
ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించి బాలింతలు, తల్లులు, పిల్లలకు సేవలందించాలని ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డితో కూడిన అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మరోమారు చర్చించింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారని, అర్థం చేసుకుని సమ్మె విరమించి సహకరించాలని అన్నారు. జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ కిట్లు, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు. సంక్రాంతి తర్వాత మరలా కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో ఒక్కటి తప్ప 10 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. వాటిని అమలు చేస్తూ జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టీఏ, డీఏలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనం రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంపు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంచడం వంటి వాటికి సంబంధించిన జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. మిగిలిన వాటిపై కూడా రెండు, మూడు రోజుల్లో జీవోలు జారీ చేస్తుందని తెలిపారు. గౌరవ వేతనం పెంపు అంశం ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగారు. అంగన్వాడీల గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని, దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. తాము బెదిరించడం లేదని, సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి బొత్స వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వేతనాలు పెంచకపోతే ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు ప్రకటించారు. చర్చల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బరావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్వాడీ హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి.భారతి, కార్యదర్శి వీఆర్.జ్యోతి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ, ఉపాధ్యక్షురాలు ఫ్లారెన్స్, ప్రధాన కార్యదర్శి జె.లలిత తదితరులు పాల్గొన్నారు. -
11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రాట్యూటీ అంశం మా పరిధిలో లేదని అంగన్వాడీలకు చెప్పామన్నారు. ‘‘వేతనం పెంపుపై కొంత సమయం అడిగాం. సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తాం. 15 రోజుల సమ్మెతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 3వ తేదీ తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలి. జగనన్న కిట్లు అందించేందుకు సహకరించాలని అంగన్వాడీలను కోరాం. సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత మరోమారు చర్చలు జరుపుతాం’’ అని మంత్రి బొత్స తెలిపారు. ‘‘అంగన్వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం. మేం అంగన్వాడీలను బెదిరించడం లేదు.. రిక్వెస్ట్ చేస్తున్నాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Fact Check: రైతుబజార్లపై ‘కుళ్లు’ కథ -
అంగన్వాడీలకు అడిగినవన్నీ..
సాక్షి, అమరావతి : బడుగు బలహీనవర్గాలకు మేలుచేసే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వాటిలో సేవలందిస్తున్న వర్కర్లు, ఆయాలపట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచీ సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఆ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు అంగన్వాడీలకు మెరుగైన జీతాలిచ్చింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు జమానాకంటే సీఎం జగన్ పాలనలోనే వీరి వేతనాలు పెరిగాయి. ఎలాగంటే.. 2014 నుంచి 2016 వరకు ఈ వర్కర్లకు కేవలం రూ.4,200 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిన చంద్రబాబు 2016లో కంటితుడుపు చర్యగా రూ.ఏడు వేలకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల మూడు నెలలపాటు అదే అరకొర జీతంతో సరిపెట్టారు. 2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్ ప్రకటించడంతో అప్పుడుగానీ చంద్రబాబుకు వారి జీతాలు గురించి గుర్తురాలేదు. దీంతో ఎన్నికలకు ఆర్నెల్ల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూర్తింగా జీవో ఇచ్చారు కానీ, అమలు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణా కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలు చొప్పున పెంచి అందిస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్వాడీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి నాలుగున్నరేళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది. నీతిఆయోగ్ ప్రశంసలు.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. అంతేకాదు.. అంగన్వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ అని నీతిఆయోగ్ ప్రశంసించింది. అంగన్వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ఆరవ స్థానంలోను, హెల్పర్ల వేతనాల్లో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే అంగన్వాడీలకు అసలైన మేలు జరిగింది. అత్యాధునికంగా అంగన్వాడీ కేంద్రాలు.. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ♦ నాడు–నేడు ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. వీటికి అవసరమైన వస్తువులు, స్టేషనరీకి 48,770 మెయిన్ కేంద్రాలకు రూ.500 చొప్పున.., 6,837 మినీ కేంద్రాలకు రూ.250 చొప్పున మొత్తం 55,607 కేంద్రాలకు రూ.7.81కోట్లు మంజూరు చేసింది. ♦ సొంత భవనాల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులకు 21,206 కేంద్రాలకు (ఒక్కొక్క దానికి రూ.3వేలు చొప్పున) మొత్తం రూ.6.36 కోట్లు విడుదల చేసింది. ♦ అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 16,575, పట్టణాల్లోని 6,705 అంగన్వాడీ కేంద్రాలకు రూ.66.54 కోట్ల అద్దె బకాయిలు చెల్లించింది. ♦ అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తోంది. అంగన్వాడీల మేలు కోరిన ప్రభుత్వం.. వేతనాల పెంపే కాదు.. అంగన్వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో ఆమోదించి అమలుచేస్తున్నారు. అంగన్వాడీల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా (ఈ నెల 20న) మరికొన్ని ఉత్తర్వులు జారీచేసింది. అవేమిటంటే.. ♦అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీఓఎంఎస్–44 జారీచేసింది. ♦ సెక్టార్, యూనిట్ సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు ఇవ్వాలన్న అంగన్వాడీల కోరికపై సానుకూలంగా స్పందించి మెమో నెంబర్.2303564/2023 జారీచేసింది. ♦ అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి టీఏ, డీఏలు చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ♦ వీటితోపాటు అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ♦ అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్ రూ.50 వేలను రూ.1 లక్షకు పెంచింది. ♦ సహాయకుల సర్విసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్ రూ.20వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారం (ఆరు చీరలు చొప్పున) అందించేందుకు రూ.16 కోట్లను ఖర్చుచేసింది. వారి విధులు సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ఫోన్లు కొని, అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా ఏడాదికి రూ.12కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్వైజర్లను కూడా నియమించింది. ♦ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలోలా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌హోం రేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గింది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి పదోన్నతులు.. ఇక అంగన్వాడీలకు 2013 నుంచి పదోన్నతులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. మరోవైపు.. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసింది. ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వయో పరిమితి పెంపు చాలా ఉపయోగపడింది. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించింది. ఇక నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి కూడా వర్తింపజేయడం గమనార్హం. -
అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరిస్తాం: మంత్రి ఉషశ్రీ చరణ్
-
మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతిపాదించిన అనేక అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు పలు డిమాండ్లపై సమ్మెచేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం శుక్రవారం మరోదఫా సానుకూలంగా చర్చలు జరిపింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కె.వి.ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. యూనియన్ నేతలు ప్రస్తావించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వివరించారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించిందన్నారు. కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్‌ను ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. హెల్పర్లకూ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయించిందన్నారు. సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ కోసం గరిష్ట వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించిందని తెలిపారు. కార్యకర్తలకు టీఏ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించిందని తెలిపారు. గ్రాట్యుటీ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో లేఖరాశామని, దానిపైన కూడా కేంద్రం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు గతంతో పోల్చుకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వేతనాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి పనితీరు కనబర్చిన వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసిందన్నారు. సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించిందని, నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వర్తింపజేసిందని వివరించారు. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు అందించిందని, డేటా చార్జీల కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు రూ.2 లక్షల జీవిత బీమాను వర్తింపజేస్తోందని, రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించిందని చెప్పారు. అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నాడు–నేడు ద్వారా అనేక చర్యలు చేపట్టిందన్నారు. గతంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశతోపాటు వర్కర్లు, హెల్పర్లకు ఎంతో మేలు జరిగిందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. తాజాగా ప్రతిపాదించిన అనేక అంశాలపైనా సానుకూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారికి పౌష్టికాహార పంపిణీ సమ్మె కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్నీ అంగీకరించినప్పటికీ ఒక్క వేతనం పెంపు విషయంలోనే అంగన్వాడీ యూనియన్ నేతలు పట్టువీడకపోవడం గమనార్హం. -
పామిడి మండలాల్లో ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రాలు
-
అంగన్వాడీలపై సానుకూలం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత శాఖ ద్వారా పరిశీలించి పలు అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల ద్వారా పలు అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆందోళన విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో విధులకు గైర్హాజరైనట్లుగా భావించి సంబంధించిన జీవోల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఆమోదం తెలిపిన అంశాలివీ.. ♦ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం. ♦ అంగన్వాడీ కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచేందుకు నిర్ణయం. ♦ హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం. ♦ సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకారం. ♦ టీఏ, డీఏలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేయడానికి ఆమోదం. ♦ రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం. మేలు చేసిన సీఎం జగన్ ♦ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు చేస్తూ పలు చర్యలు తీసుకుంది. అందులో కొన్ని ఇవీ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకూ టీడీపీ హయాంలో అంగన్వాడీల జీతం నెలకు రూ.7 వేలు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలను పెంచుతూ జీఓ 18 జారీ చేసింది. అంగన్వాడీల జీతాలను రూ.11,500కి పెంచుతూ 2019 జూన్ 26న జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసింది. గత నాలుగేళ్లుగా పెంచిన వేతనం అమలవుతోంది. ♦ అంగన్వాడీ కార్యకర్తలతోపాటు మినీ అంగన్వాడీ వర్కర్లకు కూడా గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. ♦ సహాయకులకు గత ఎన్నికలకు ముందు వరకు రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. వీటిని జీవో 18 ద్వారా ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది. ♦ టీడీపీ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీతాలు పెంచి అందించింది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ♦ 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు (ప్రమోషన్లు) ఇవ్వలేదు. గత సర్కారు దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ♦ సూపర్వైజర్ పోస్టుల పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయో పరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది. ♦ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి రూ.1,313 కోట్లు అందించింది. జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికీ వర్తింపజేసింది. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా డేటా కూడా ఇస్తోంది. 2023 జూలై 1 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపచేస్తూ ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించింది. నాడు–నేడు ద్వారా అంగన్వాడీల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ♦ గర్భిణులు, బాలింతలు, పిల్లలకు హోం రేషన్ పద్ధతిని అమలు చేస్తోంది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. -
ఏపీ సర్కార్ మరో ముందడుగు.. అంగన్వాడీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణ వైద్య సేవలు అందించేలా మరో ముందడుగు వేసింది. చిన్నారులకు స్వల్ప అనారోగ్యం, చిన్న చిన్న గాయాలకు తక్షణ వైద్య సేవలు అందించేలా ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించింది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అంగన్వాడీలకు చేరువ చేసి వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక వైద్య సేవలు అందించేలా ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి మరో మారు ఒక్కొక్కటి చొప్పున ఫస్ట్ ఎయిడ్ కిట్(ప్రాథమిక చికిత్స మందులు)ను సరఫరా చేసింది. గతంలో పంపిణీ చేసిన కిట్లలో కంటే ఎక్కువ మందులను ఈ కిట్లలో పొందుపర్చి అందించడం విశేషం. ఆటలాడేటప్పుడు తగిలే చిన్న చిన్న గాయాలు, కొద్దిపాటి జలుబు, ఇతర చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్స అందించేందుకు ఈ కిట్లలోని పది రకాలకుపైగా ఔషధాలు దోహదపడతాయి. కిట్‌లో పొందుపర్చిన మందుల్లో కొన్ని.. అంగన్వాడీ మెడికల్ కిట్‌లో పారాసిటమాల్ సిరప్, ఐరన్ ట్యాబ్లెట్లు, అయోడిన్, సిల్వర్ సల్ఫాడైజీన్, క్లోరో ఫినరామిన్ మాలియాట్, ఫురాజోలిడిన్, హ్యాండ్ శానిటైజర్, రోలర్ బ్యాండేజ్, నియోమైసిన్ ఆయింట్మెంట్, కాటన్, సిప్రోఫ్లాక్సిన్ చుక్కల మందు, బెంజయిల్ బెంజోయేట్తోపాటు మరికొన్ని సిరప్లు ఉన్నాయి. వీటిలో ఏయే మందులను ఎలా ఉపయోగించాలి అనేది సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం పేరుతో సమాచారాన్ని కూడా పంపించారు. వీటి వినియోగంపై అవగాహన కల్పించారు. సద్వినియోగం అయ్యేలా అంగన్వాడీ సిబ్బందికి సూచనలు చేశారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని సచివాలయ ఆరోగ్య కార్యదర్శి, స్థానిక ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంగన్వాడీల్లోని చిన్నారుల పెరుగుదల(ఎత్తు), బరువుపై పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు అందించాలి. మందుల వినియోగం ఇలా.. జ్వరం: పారాసిటమాల్ సిరప్‌ను రెండు నెలలలోపు పిల్లలకు 1 మిల్లీలీటర్ చొప్పున రోజుకు రెండు సార్లు, ఏడాది లోపు పిల్లలకు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున ఇవ్వాలి. తెగిన, కాలిన, గీరుకొనే గాయాలు : ప్రమిసెటిన్ స్కిన్ క్రీమ్ ఆయింట్మెంట్ను గాయమైన చోట నీటితో శుభ్రంగా కడిగి రాయాలి. అవసరమైతే దూది(కాటన్) పెట్టి కట్టు కట్టాలి. కళ్లు ఎర్రబడుట, చెవిపోటు: సిప్రోప్లాక్సాసిస్ చుక్కల మందును రెండు చుక్కలు చొప్పున రోజుకు రెండు నుంచి మూడు సార్లు వాడాలి. డీహైడ్రేషన్ అవ్వకుండా: ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ రెండు సంవత్సరాలలోపు పిల్లలకు 50 నుంచి 100 మిల్లీ లీటర్లు, రెండు నుంచి పదేళ్లలోపు పిల్లలకు 100 నుంచి 200 మిల్లీ లీటర్లు చొప్పున ఇవ్వాలి. గతం కంటే ఎక్కువ మందులు రాష్ట్రంలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.485.37 విలువైన ఒక్కో కిట్‌ను తాజాగా ప్రభుత్వం అందించింది. గత ఏడాది కంటే ఎక్కువ మందులతో ఇచి్చన ఈ కిట్లు ప్రాథమిక చికిత్సకు బాగా ఉపయోగపడతాయి. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు రూ.2,69,89,770లతో ప్రభుత్వం అందించింది. పిల్లల్లో వచ్చే సాధారణ వ్యాధులు, ప్రమాద గాయాలకు తక్షణ చికిత్సకు ఉపయోగపడేలా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంలో వీటిని అందించారు. –ఎం.జానకి, కమిషనర్, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీల అభివృద్ధికి సీఎం జగన్ కృషి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టింది. వాటికి సొంత భవనాలతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఆట పాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమానికి ఇతోధికంగా నిధులు ఇవ్వడం ద్వారా కొత్త విధానాలతో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మేలు కలిగేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. –కేవీ ఉషశ్రీ చరణ్, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి చదవండి: పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల -
Fact Check: చిరుద్యోగులపై దొంగ ఏడుపులు
చిరుద్యోగులకు గత సర్కారు హయాంలో జీతాల వ్యయం రూ.1,100 కోట్లు! మరిప్పుడు వారి జీతాల కోసం చెల్లిస్తున్న మొత్తం ఏకంగా రూ.3,300 కోట్లు!! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిరుద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల నుంచి 108 డ్రైవర్ల దాకా పలు వర్గాల జీతాలను పెద్ద ఎత్తున పెంచింది. జీతాల ఖర్చు మూడు రెట్లు పెరగడం కళ్లెదుటే కనిపిస్తున్నా చిరుద్యోగులకు దగా చేస్తున్నారంటూ కడుపు నొప్పితో కళ్లనీళ్లు పెట్టుకునే వారిని ఏమనాలి? మరిలాంటి దుష్ప్రచారం ఈనాడులో చేస్తున్నారు కాబట్టి రామోజీనే అనుకోవాలేమో!! జీతాలు పెంచాలని చిరుద్యోగులు గత ప్రభుత్వ హయాంలో గగ్గోలు పెట్టిన విషయం ఆయనకు గుర్తున్నా తెలియనట్లే నటిస్తున్నారు!!– సాక్షి, అమరావతి పారదర్శకంగా నియామకాలు, చెల్లింపులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పూర్తి పారదర్శకతను తీసుకొస్తూ దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఆప్కాస్ కార్పొరేషన్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. లంచాల ప్రసక్తే లేకుండా శాశ్వత ఉద్యోగుల కంటే ముందే ఠంచనుగా ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలిచ్చే పద్ధతిని తెచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్‌ను వర్తింప చేసింది. దీనికి అనుగుణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను కూడా పెంచారు. వీరికి గరిష్టంగా రూ.28 వేల వరకూ చెల్లిస్తున్నారు. మరి టీడీపీ సర్కారు ఇలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చిరుద్యోగులను ఎందుకు ఆదుకోలేదు? వారి పోస్టులకు తగ్గట్టుగా పూర్తి జీతాలను ఎందుకు ఇవ్వలేదు? ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టి ఏజెన్సీ కమీషన్ల పేరుతో జీతాలను గుంజుకుంటే ఈనాడుకు కనపడలేదా? మనసున్న ప్రభుత్వం ఎవరిది? నాలుగున్నరేళ్ల పాటు చిరుద్యోగుల జీతాలను పెంచాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబు సర్కారు గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అరకొరగా పెంచిన జీతాలను కొందరికి మాత్రమే అమలు చేసింది. మరి కొందరికి పెంపు కాగితాలపైనే పరిమితమైంది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలను మరింత పెంచి మొదటి రోజు నుంచే అమలు చేసింది. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, శానిటేషన్ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలు లాంటి చిరుద్యోగుల విషయంలో సీఎం జగన్ మనసు పెట్టి జీతాలు పెంచారు. గత సర్కారు హయాంలో రూ.1,100 కోట్లు మాత్రమే ఉన్న వారి జీతాల వ్యయం ఇప్పుడు ఏకంగా రూ.3,300 కోట్లకు పెరగడమే అందుకు తిరుగులేని నిదర్శనం. ఉదారంగా అర్హతల సడలింపు ప్రభుత్వ పథకాల అమలులో అర్హతలను సడలిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వక్రీకరిస్తూ ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. పథకాలను మరింత మందికి అందజేయాలనే ఉద్దేశంతో ఆదాయం, భూమి, కరెంటు వినియోగం తదితర అంశాలలో ఉదారంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. గత ప్రభుత్వంలో పథకాలను పొందేందుకు గ్రామాల్లో నెలకు కనీస ఆదాయ పరిమితి రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలుగా ఉండేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలను నెలవారీ ఆదాయ పరిమితిగా నిర్ణయించి ప్రభుత్వం మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. కరెంట్ వినియోగంపై గతంలో 200 యూనిట్ల పరిమితి విధించగా ఇప్పుడు 300 యూనిట్లకు పెంచారు. వివాహాల అనంతరం వేరుగా ఉంటున్న వారిని విడి కుటుంబాలుగా పరిగణిస్తున్నారు. ఆ మేరకు వారికి విడిగా రేషన్ కార్డులను జారీ చేస్తూ వివిధ పథకాలకు అర్హత కల్పిస్తున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో వేల సంఖ్యలో అందిన ఇలాంటి దరఖాస్తులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. చిరుద్యోగులకు సీఎం జగన్వేతనాలను పెంచారిలా.. ♦ అంగన్వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ రూ.7వేలు ఉంటే ఇప్పుడు రూ.11,500కు పెంచారు. హెల్పర్ల జీతాలు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయి. ♦ గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్ జీతాలను రూ.2 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచారు. ♦ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు తీసుకుని వెళ్లారు. ♦ ఆశావర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ♦ గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి ఏకంగా రూ.4 వేలకు పెంచి అండగా నిలిచారు. ♦ పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల జీతాలను రూ.18 వేల నుంచి రూ.21,300కు పెంచారు. ♦ పాఠశాల విద్యాశాఖలో కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచారు. ♦ 108 డ్రైవర్ల జీతాలను రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ.17,500 నుంచి రూ.20 వేలకు తీసుకుని వెళ్లారు. ♦ 104 డ్రైవర్ల జీతాలను రూ.26 వేలకు పెంచారు. ♦ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు. -
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్‌రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
మహేశ్వరం: తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రూ.14 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం స్థానిక మంత్రి సబితారెడ్డితో కలసి ఆమె శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంజారాలు, ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్లను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బంది నిరసన మహేశ్వరంలో పర్యటిస్తున్న మంత్రుల వాహనాలను అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శివగంగ రాజేశ్వరాలయం ఎదుట ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులు కాన్వాయ్కి అడ్డుగా నిలిచారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిని పక్కకు నెట్టేసి కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో దురుసుగా వ్యవహరించారని నిరసనకారులు మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీలు శాంతించారు. -
భర్తతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉండగా.. భార్య ఆత్మహత్య
ప్రకాశం: ఉరి వేసుకుని అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మంగపాటివారిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొప్పోలు కళ్యాణి (38) వెల్లటూరు పంచాయతీలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సురేష్ వ్యవసాయం చేస్తూనే ఓ ప్రైవేట్ మార్కెట్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మార్కెట్ కంపెనీలో సురేష్ బాగా పనిచేయడంతో ఆ కంపెనీ వారు సురేష్ కుటుంబానికి అక్టోబర్ 1వ తేదీ థాయ్‌లాండ్ టూర్ ఏర్పాటు చేశారు. దీంతో సురేష్, కళ్యాణి థాయ్‌లాండ్ వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన భర్త సురేష్ గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి చూడగా అప్పటికే కళ్యాణి మృతి చెందింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకుని కళ్యాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆపై మృతిపై అనుమానాలున్నాయని, ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సమ్మె విరమించండి.. సమస్యలుంటే పరిష్కరిస్తాం
సాక్షి,హైదరాబాద్/ వెంగళరావునగర్: అంగన్వాడీటీచర్లు, హెల్పర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించి చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, జీఓలు జారీ అయ్యాక సమ్మెకు దిగడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో మంత్రి సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల్లో నమోదయ్యే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని, విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో వారంతా ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారి సేవలను తక్షణమే కొనసాగించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయలబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీల క్రమబద్ధీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రాష్ట్రప్రభుత్వం నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పారు. అంగన్వాడీల తరపున డిమాండ్లు కేంద్రానికి నివేదిస్తామని, అవసరమైతే స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలికేరి, జేడీ లక్ష్మీదేవీ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సత్యవతి ఇంటి ముట్టడికి అంగన్వాడీల యత్నం
సాక్షి, మహబూబాబాద్: పనికి తగిన వేతనం ఇవ్వాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గురువారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అప్రమత్తమై మహబూబాబాద్ – నర్సంపేట రోడ్డులో వారిని ఆపేందుకు ప్రయత్నించారు. తర్వాత మంత్రి ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని నెట్టుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మంత్రి ఇంటికి తాళం వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో వందలాది మంది అంగన్వాడీలు మంత్రి ఇంటి ఎదుట బైఠాయించారు. మంత్రి వచ్చి తమ డిమాండ్లపై హామీ ఇవ్వాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం నేతలు సరోజన, హిమబిందు, ఎల్లారీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/ కైలాస్‌నగర్ (ఆదిలాబాద్)/జగిత్యాల క్రైం/సుభాష్ నగర్ (నిజామాబాద్): అంగన్వాడీల్లోని టీచర్లు, హెల్పర్లు తలపెట్టిన సమ్మె పదోరోజూ ఉధృతంగా కొనసాగింది. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. టీచర్లు, హెల్పర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు పెన్షన్, ఆరోగ్య పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఆదిలాబాద్‌లో జుట్లు పట్టుకుని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో పలువురు అంగన్వాడీలు, పోలీసులకు గాయాలయ్యాయి. అంగన్వాడీలను నిలువరించే క్రమంలో తలమడుగు ఎస్సై ధనశ్రీ ఓ అంగన్వాడీ జుట్టు పట్టుకుని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు అంగన్వాడీలు ఎస్సై ధనశ్రీని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది అంగన్వాడీలు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించడంతో కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. వారంతా తిరిగి కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగించడంతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా సమ్మె శిబిరానికి చేరుకున్న తర్వాత బేల మండలం సదల్పూర్ అంగన్వాడీ టీచర్ ప్రగతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాలలో పోలీసులపై దాడి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ముట్టడి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పలువురు అంగన్ వాడీలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు తదితరులు అంగన్వాడీల ఆందో ళనకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు కూడా అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు సీఐటీయూ నాయకులు గేట్లు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. -
అంగన్వాడీల్లో 65 ఏళ్లకు రిటైర్మెంట్
సాక్షి, హైదరాబాద్/ వెంగళరావు నగర్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అదేవిధంగా పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్‌కు లక్ష రూపాయలు, మినీ అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్‌కు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనుంది. పదవీ విరమణ పొందిన మరుసటి నెల నుంచి ఆసరా పెన్షన్ కూడా అమలు చేయనుంది. 50 సంవత్సరాలలోపు ఉన్న అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. సర్విసులో ఉన్న అంగన్వాడీ టీచర్ మరణిస్తే రూ.20 వేలు, మినీ అంగన్వాడీ టీచర్/హెల్పర్‌కు రూ.10 వేలు దహన సంస్కారాల నిమిత్తం అందజేయనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోలికేరి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతినెలా 14లోపు వేతనాలు: మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీలోపు వేతనాలు అందిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అంగన్వాడీల సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు. మంగళవారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలను అమలు చేయాలని కోరుతూ సమ్మెకు దిగడం న్యాయసమ్మతం కాదన్నారు. ఆయా డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ ఉన్నతాధికారులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంగన్వాడీలతో కలసి సహపంక్తి భోజనం చేశారు. -
బాబు ఆగడాలు మర్చిపోతే ఎలా రామోజీ?
సాక్షి, అమరావతి: అధికారం తమవారి చేతుల్లో లేకపోతే కడుపుమంట ఎంతలా ఉంటుందో రామోజీని చూస్తే తెలుస్తుంది. అబద్ధాలను అతికినట్లు చెప్పడంలోగానీ.. నిజాలను పాతర వెయ్యడంలోగానీ ఆయన ఎంతో నేర్పరి. వాస్తవాలు బయటకొస్తాయనే భయం కూడా ఆయనకు కొరవడింది.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతుంటే పాఠకులు ఎలా స్పందిస్తారో అన్న కనీస స్పృహ కూడా కరువైంది. ఎందుకంటే.. అంగన్వాడీలను ఉక్కుపాదంతో అణచివేసిన చంద్రబాబును వదిలేసి అధికారంలోకి వచ్చీరాగానే వారికి ఎన్నో వరాలిచ్చిన సీఎం వైఎస్ జగన్‌పై ‘అంగన్వాడీలపై ఉక్కుపాదం’ అంటూ తాజాగా చేతికొచ్చినట్లు రాసిపారేశారు. ఈ కాకమ్మ ‘కథల్ని’ జనం నమ్మే రోజులు పోయాయని ఇంకెప్పుడు తెలుసుకుంటారో రామోజీ..? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని వర్గాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ‘పచ్చ’బ్యాచ్ కుట్రలు శృతిమించుతున్నాయి. నిజానికి.. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక వరాలిచ్చారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వేతనాలు పెంచారు.. పదోన్నతులు కల్పించారు.. పదోన్నతుల్లో వయో పరిమితి పెంచుతూ అనేకమందికి అవకాశం కల్పించారు.. అంతేకాక, పాత స్మార్ట్ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లు అందించారు.. మునుపెన్నడూ లేని విధంగా సెలవులు కూడా మంజూరు చేశారు. బీమా కల్పించారు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మేలుచేసి మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అంగన్వాడీల మన్ననలు అందుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, హెల్పర్ల వేతనాల పెంపు వంటి అనేక విషయాల్లో దేశంలోనే ఏపీ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోంది. అయినా అంగన్వాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ఎల్లో మీడియా కిందామీదా పడుతోంది. పొరుగునున్న తెలంగాణాతో పోల్చి బాబు హయాంలోనే బాగా చేశారని గొప్పలు చాటేలా ఈనాడు ఆ కథనంలో తెగ తాపత్రయపడింది. నిజానికి.. అంగన్వాడీల విషయంలో చంద్రబాబుదే ఉక్కుపాదం.. జగన్ ఆపన్న హస్తం అందించారని చెప్పేందుకు అనేకానేక ఉదాహరణలున్నాయి. వారిపట్ల గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించింది? ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? అనే వాస్తవాలు ఒకసారి పరిశీలించండి. గుర్రాలతో తొక్కించినది మరిచారా గత ఎన్నికలకు ఆరునెలల ముందు అంగన్వాడీలకు హడావుడిగా జీతాలు పెంచి వాటిని అమలుచేయకుండా బకాయిలు పెట్టిన చంద్రబాబు సంగతిని వారు మర్చిపోలేదు. అలాగే, గతంలో వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించిన చంద్రబాబు నిరంకుశ పాలననూ ఎలా మర్చిపోగలరు? ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ‘పచ్చముఠా’ మొసలికన్నీరు కారుస్తోంది. ఇవిగో వాస్తవాలు.. ♦ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్వాడీ వర్కర్ల జీతం నెలకు రూ.7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచారు. అంగన్వాడీలకు రూ.11,500కు, హెల్పర్లకు రూ.7 వేలకు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ♦ విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు చెల్లిస్తోంది. ♦ 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసింది. ఈ పోస్టుల వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50కు పెంచారు. ♦ అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ.85.47 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది. ♦ రూ.16కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందిస్తున్నారు. ♦ అంగన్వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నారు. పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. ♦ నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. అంగన్వాడీలకూ కొత్తరూపు తీసుకొస్తోంది. ♦10,932 అంగన్వాడీ కేంద్రాల్లో (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ.500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ ఉపకరణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు. ♦ స్మార్ట్ టీవీల ఏర్పాటుతో పాటు నేర్చుకునే విధానాలను మెరుగుపరచడానికి 8.5లక్షల మంది పిల్లలకు ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. దీంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలనూ అందిస్తోంది. ♦ పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ.16.04 కోట్లతో 19,236 గ్రోత్ మానిటరింగ్ పరికరాలను అందిస్తోంది. ♦ ఇక గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్ హోం రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ♦గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. -
అంగన్వాడీల్లో సమ్మె సైరన్!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన రిటైర్మెంట్ పాలసీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూనియన్ నేతలు... విధులు బహిష్కరించి ఉద్యమానికి ఉపక్రమిస్తున్నారు. ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె తేదీ కంటే ముందుగానే డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ల చిట్టాను సమర్పించింది. చర్చలకు విరుద్ధంగా రిటైర్మెంట్ పాలసీ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించి పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. 65 ఏళ్ల వయసును రిటైర్మెంట్ ఏజ్‌గా ఖరారు చేసిన ప్రభుత్వం... పదవీ విరమణ పొందిన టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ అయిన వెంటనే టీచర్ లేదా హెల్పర్‌కు ఆసరా పెన్షన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతవారం సంతకం చేయగా... అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్‌కు పూర్తి విరుద్ధంగా ఉందంటూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. హామీలకు.. అమలుకు పొంతన లేదు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లపై గత నెలలో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నేతలు పలు డిమాండ్లు మంత్రి ముందు ఉంచారు. ఈ క్రమంలో చర్చించి కొన్ని హామీలు ఇవ్వగా... ఇటీవల సీఎం సంతకం చేసిన ఫైలులోని అంశాలపై ఏమాత్రం పొంతన లేదంటూ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. మంత్రితో చర్చలు జరిపినప్పుడు టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు అందులో సగానికి కోత పెట్టారంటూ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ... అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.26వేలుగా నిర్ధారించాలి విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలి విరమణ పొందిన టీచర్‌కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ నాటికి తీసుకునే వేతనంలో సగం మేర పెన్షన్‌గా ఇవ్వాలి సీనియారిటీ ఆధారంగా వేతనాలను పెంపుతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి సమాచార నమోదు కోసం కేంద్ర, రాష్ట్రాలు తెచ్చిన యాప్‌ల విషయాన్ని పరిశీలించాలి -
Fact Check: అడగకుండానే అంగన్వాడీలకు ఎన్నో వరాలు
సాక్షి, అమరావతి: అడగకుండానే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక వరాలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వేతనాలు పెంచారు. పదోన్నతులు కల్పించారు. పదోన్నతుల్లో వయో పరిమితి పెంచుతూ అనేక మందికి అవకాశం కల్పించారు. పాత స్మార్ట్ ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్లు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా సెలవులు మంజూరు చేశారు. బీమా కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మేలు చేసి మనసున్న సీఎంగా వైఎస్ జగన్ మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే విపక్షాల కుట్ర చేశాయి. వాస్తవాలను మరుగుపరిచి వారిని రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు తమను ఆదుకున్నదెవరో చూడాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు, వాటిలో సేవలు అందించే వర్కర్లు, హెల్పర్ల పట్ల గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించింది? ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? అనే వాస్తవాలు ఒకసారి పరిశీలిస్తే.. బాబు జమానాలో దారుణం.. వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించి చెదరగొట్టిన చంద్రబాబు నిరంకుశ పాలనను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అంగన్వాడీల ఆవేదనను, ఆక్రోశాన్ని, కన్నీళ్లను చంద్రబాబు పట్టించుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కనికరించలేదు. ఎన్నికల ముందు అరకొరగా జీతాలు పెంచి వాటిని అమలు చేయకుండా బకాయిలు పెట్టి వదిలేశారు. సీఎం జగన్ అమలు చేసిన కార్యక్రమాల్లో కొన్ని.. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు, అంటే గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్వాడీ వర్కర్ల జీతం నెలకు రూ. 7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 18 జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ. 11,500కు, హెల్పర్లకు రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ► విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు చెల్లిస్తోంది. ► 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. ► అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ. 85.47 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది. ► రూ. 16 కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. ► అంగన్వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నారు. పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. ► నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాణ్యంగా కనీస మౌలిక సదుపాయాలను అందించేలా చర్యలు చేపట్టింది. ► 10,932 అంగన్వాడీ కేంద్రాలు (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనుల్లో భాగంగా అంగన్వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ ఉపకరణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు. ► స్మార్ట్ టీవీల ఏర్పాటుతో పాటు పిల్లల్లో నేర్చుకునే విధానాలను మెరుగుపరచడానికి ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 8.5 లక్షల మంది పిల్లలకు ఈ కిట్లను ప్రభుత్వం ఇస్తోంది. దీంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ► పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ. 16.04 కోట్ల ఖర్చుతో 19,236 పరికరాలను అంగన్వాడీ స్కూళ్లకు ప్రభుత్వం అందిస్తోంది. గ్రోత్ మానిటరింగ్ పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ► గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్ హోం రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ► అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. అంగన్వాడీల్లో మనమే బెస్ట్ –కేవీ ఉషశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, హెల్పర్ల వేతనాల పెంపు వంటి అనేక విషయాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బెస్ట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టడంతో అంగన్వాడీల వ్యవస్థ నేడు మెరుగ్గా ఉంది. అంగన్వాడీలు, ప్రభుత్వ బడుల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ వర్గాలకు చెందిన పిల్లలకు సీఎం వైఎస్ జగన్ తోడుగా నిలబడుతున్నారు. ఆయన పెద్ద మనస్సుతో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు సంతరించుకున్నాయి. -
అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యా యత్నం ఓ నాటకం
గుడివాడ రూరల్: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం గుర్విందగుంటలో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం నాటకమని తేలిపోయింది. వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లు, బెదిరిస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఇదంతా ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఆడించిన డ్రామా అని తేలిపోయింది. ఆమె ఎలుకల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించారు. జరిగిందిదీ.. అంగన్వాడీ కార్యకర్త అన్నపూర్ణ సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదని, బాలలు, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గ్రామ ప్రజలు ఎంపీటీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీటీసీ, ఐసీడీఎస్ అధికారులు రెండు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు. కేంద్రంలో 11 మంది చిన్నారులకు కేవలం ఒక్కరే ఉండటంతోపాటు పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఉన్నతాధికారుల విచారణలోనూ ఇదే తేలింది. దీంతో సస్పెన్షన్ తప్పదని భావించింది. ఈ విషయం తెలిసి అంగన్వాడీ సూపర్వైజర్ భర్త అయిన ఎల్లో మీడియా విలేకరి, టీడీపీ నాయకులు కలిసి కార్యకర్తతో ఆత్మహత్య డ్రామా ఆడించారు. వారి సూచన మేరకు ఆమె ఎలుకల మందు నోటికి పూసుకుని ఆసుపత్రిలో చేరింది. ఎంపీటీసీ వేముల మోహన్, వైఎస్సార్సీపీ నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆరోపణలు చేసింది. దీనిని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఆమెను వైద్యులు పరీక్షించి, ఎటువంటి ఎలుకల మందు సేవించలేదని నిర్ధారించారు. వైద్యం అవసరం లేదని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు కొందరు విలేకరులను వైద్యుల వద్దకు పంపించి నివేదిక మార్చాలని బెదిరించారు. వీరి బెదిరింపులకు భయపడని వైద్యులు ఆ నివేదికను పోలీసుల ద్వారా బయట పెట్టారు. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తోక ముడిచారు. -
అంగన్వాడీలను ఆదుకున్నదెవరు?
సాక్షి, అమరావతి: వేతనాలు పెంచాలని వేడుకున్న అంగన్వాడీ వర్కర్లు, ఆయాలను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో హింసించిన చంద్రబాబు నిరంకుశ పాలనను ఎవరూ మరచిపోలేరు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ ఆయన అంగన్వాడీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అరకొరగా వేతనాల పెంపు పేరుతో మభ్యపుచ్చే యత్నాలు ఫలించలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంపు, స్మార్ట్ఫోన్లు, అంగన్వాడీ వర్కర్లకు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పదోన్నతులు, అడగకుండానే పదోన్నతుల్లో వయో పరిమితి పెంపు లాంటి ప్రధాన నిర్ణయాలను తీసుకుంది. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ అనుకూల మీడియా వక్రీకరిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దేశంలోనే ఏపీ బెస్ట్ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, ఆయాలకు వేతనాలు పెంపు వంటి పలు అంశాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమం. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్న టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంగన్వాడీలను మరింత బలోపేతం చేశాం. అంగన్వాడీలు, ప్రభుత్వ బడుల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. వారికి తోడుగా నిలుస్తూ సీఎం జగన్ ఎçప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో ఆర్నెల్ల పసి బిడ్డల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించి బలమైన సమాజానికి ఊతమిస్తున్నారు. – ఎ.సిరి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ► అంగన్వాడీ వర్కర్లకు ఎన్నికలకు కొద్దిగా ముందు వరకు రూ.7 వేలు మాత్రమే వేతనాలు చెల్లించగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రూ.11,500కి పెంచింది. 2019 జూలై నుంచి పెంచిన జీతాలను చెల్లించింది. ► అంగన్వాడీ హెల్పర్లకు ఎన్నికలకు కాస్త ముందు వరకూ రూ.4,500 మాత్రమే వేతనాలు చెల్లించగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.7 వేలకు పెంచింది. 2019 జూలై నుంచి పెంచిన జీతాలను చెల్లిస్తోంది. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించారు. ఆ పదోన్నతుల ద్వారా 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. సూపర్వైజర్ పోస్టుల పరీక్షలకు వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు కారణంగా తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్న వారికి వయోపరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది. ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్న పదోన్నతుల అంశాన్ని చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కనీసం పట్టించుకోలేదు. ► అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, సూపర్వైజర్లు విధులను సజావుగా నిర్వహించడం, అత్యుత్తమ సేవలను అందించేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించుకుంటోంది. దీనికోసం వారికి స్మార్ట్ఫోన్లు అందించింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ. 68.61 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ► అంగన్వాడీల నిర్వహణలో భాగంగా వంట చెరకు, కూరగాయలు, రవాణా ఖర్చుల నిమిత్తం మార్చి వరకు బడ్జెట్ విడుదల చేసింది. ► మొత్తం మూడు దశల్లో నాడు – నేడు ద్వారా అంగన్వాడీ కేంద్రాల భవనాల అభివృద్ధి కోసం దాదాపు రూ.1,350 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ► అంగన్వాడీల సమర్ధత పెంచేందుకు అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్తమ భవిష్యత్తు ఉన్న చిన్నారులను తీర్చిదిద్దడంలో వారి భాగస్వామ్యాన్ని క్రియాశీలకం చేశారు. -
‘సాల్ట్’ పేరిట ఉద్యోగాల వల
సాక్షి, విజయవాడ ప్రతినిధి/సాక్షి, అమరావతి: ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన బాగోతమిది. కేంద్ర ప్రభుత్వం ‘సాల్ట్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతోందనీ, దీనిపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నామంటూ బురిడీ కొట్టించి వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకుని మోసం చేసిన ఓ బోగస్ సంస్థ నిర్వాకమిది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇద్దరు బాధితులు విజయవాడలోని సంస్థ నిర్వాహకులను నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ‘ఆల్ఫాబెట్ వెంచర్’ పేరుతో.. విజయవాడ సూర్యారావుపేటలోని వేమూరి వారి వీధిలో ‘ఆల్ఫాబెట్ వెంచర్’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థ వెలిసింది. ఎడ్యుకేషనల్ బుక్స్ పబ్లికేషన్, డిజిటల్ అండ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ లెర్నింగ్, పేపర్ అండ్ పేపర్ ప్రోడక్ట్స్, ప్రింటింగ్ అండ్ రీ ప్రొడక్షన్, మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, రేడియో అండ్ టెలివిజన్, స్టాఫింగ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్, సీసీఎంఎస్–ఐఓటీ–కంప్యూటర్స్ అండ్ రిలేటెడ్ సేవల పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సర్వీసులను ఏజెన్సీలకు అప్పగిస్తాయని, ప్రభుత్వ కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని ఈ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మబలికారు. సంస్థ నెలకొల్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ‘సాల్ట్’ పథకానికి ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నామని మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. దీంతో విస్సన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి మానేసిన చిన్నం మృత్యుంజయ అనే వ్యక్తి ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులను ఆకర్షించాడు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు సాల్ట్ పథకంపై శిక్షణనిచ్చే కాంట్రాక్టును ‘ఆల్ఫాబెట్ వెంచర్’కు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందనీ, ఇందుకుగానూ ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను ఆ సంస్థ నియమిస్తుందని, 20 రోజుల శిక్షణ తరువాత నెలకు రూ.40 వేలు జీతం వస్తుందని అతను అందరినీ నమ్మించాడు. ఉద్యోగానికి రూ.4 నుంచి రూ.6 లక్షలు వసూలు.. ఇక ఫీల్డ్ ఆఫీసర్, సూపర్వైజర్ ఉద్యోగానికి ఒకొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా విజయవాడలోని ఆల్ఫాబెట్ సంస్థ ప్రతినిధులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. చిన్నం మృత్యుంజయ ద్వారానే తమ నుంచి రూ. 8.20 లక్షలు వసూలు చేశారని ఇద్దరు బాధితులు చెబుతున్నారు. వీరిరువురూ ఎంఏ, పీహెచ్డీ చేసి విస్సన్నపేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. తాము గత ఏడాది సెప్టెంబర్‌లో డబ్బులు చెల్లించి 20 రోజులు శిక్షణ తీసుకున్నామని, ఆ తరువాత సంస్థ నిర్వాహకులు జీతం ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలా బోగస్ సంస్థలు వెలిశాయని బాధితులు చెబుతున్నారు. జిల్లాకు ఓ పేరుతో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ఏర్పాటుచేసి వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. ఏలూరులో ఆదిత్య మ్యాన్‌పవర్ సొల్యూషన్స్, కాకినాడలో మ్యాట్రిక్స్ మాన్పవర్ సొల్యూషన్, విశాఖపట్నంలో మరో పేరుతో సంస్థలను నెలకొల్పినట్లు బాధితుల కథనం. దీనిపై ఐసీడీఎస్ ఉద్యోగులను ఆరా తీస్తే.. తమ వద్ద అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పజెప్పలేదని స్పష్టంచేశారు. ఉద్యోగాల పేరిట మోసపోవద్దు సమగ్రశిక్ష వొకేషనల్ ట్రైనర్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దు. పాఠశాలల్లో వృత్తివిద్య కోర్సులు బోధించడానికి వొకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్, వొకేషనల్ ట్రైనర్లను నియమించుకుని పాఠశాలల్లో బోధిస్తారు. ఈ పోస్టులు పరిమిత కాలానికి మాత్రమే. కాబట్టి వీరి నియామకానికి సంబంధించి సమగ్రశిక్ష ఎటువంటి బాధ్యత వహించదు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులను "vocational. apsamagra@gmail. com' కు మెయిల్ చేయాలి. – ఎస్. సురేష్‌కుమార్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు -
అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
సాక్షి, అమరావతి: మహిళా, శిశుసంక్షేమశాఖలో అంగన్వాడీ వర్కర్లను గ్రేడ్–2 సూపర్వైజర్లుగా నియమించేందుకు ఉద్దేశించిన ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. సూపర్ వైజర్ల నియామక ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ విషయంలో గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తేసింది. అంగన్వాడీ వర్కర్లను సూపర్వైజర్లుగా నియమించేందుకు వీలుగా జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగన్వాడీ వర్కర్లను గ్రేడ్–2 సూపర్వైజర్లుగా నియమించేందుకు వీలుగా 560 పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 45 మార్కులు, ఇంగ్లిషులో ప్రావీణ్యానికి 5 మార్కులు నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు తమకు రాతపరీక్ష మాత్రమే నిర్వహించి, ఇంగ్లిషు ప్రావీణ్యపరీక్షను నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇంగ్లిష్ ప్రావీణ్యపరీక్ష నిర్వహించకుండానే తుది మెరిట్ లిస్ట్ ప్రకటించేందుకు అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామక ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది శశిభూషణ్‌రావు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్‌కు అనుగుణంగానే పోస్టుల భర్తీప్రక్రియ చేపట్టామన్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికే ఇంగ్లిష్ ప్రావీణ్యపరీక్ష నిర్వహిస్తామని, ఈ విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. మెమో ద్వారా కూడా స్పష్టతనిచ్చామన్నారు. స్టే వల్ల భర్తీప్రక్రియ మొత్తం నిలిచిపోయిందని, దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ గతంలో విధించిన స్టే ఎత్తేశారు. పిటిషన్లను కొట్టేశారు. -
ఏపీ: అంగన్వాడీ పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి శుభవార్త. పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ పోస్టుల భర్తీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో.. బుధవారం విచారణ కొనసాగగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే.. అంగన్వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంగన్వాడీ సూపర్వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గతంలోనే స్పష్టత ఇచ్చింది. -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, పుట్టపర్తి: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నారు. త్వరలో అధికారికంగా ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పాదర్శక సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాకు 2,863 స్మార్ట్ఫోన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గానూ 2,824 అంగన్వాడీ కేంద్రాలు (మినీ, మెయిన్) ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణకు గానూ 39 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. అంగన్వాడీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా వీరందరికీ 2,863 స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ రకాల సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. వీటి వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్థిదారుల హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్య పరచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ల విధానం ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శక సేవలు అందుతాయి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోంది. ఐసీడీఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ల మంజూరుతో అక్రమాలకు చెక్ పడటంతో పాటు పారదర్శక సేవలు అందుతాయి. – రెడ్డి రమణమ్మ, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ (చదవండి: సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ) -
ఆశల కల..నెరవేరుతున్న వేళ
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పదోన్నతుల కోసం ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి సువర్ణావకాశం కలి్పంచింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఒంగోలు రీజియన్ పరిధిలో 142 పోస్టులు ఉన్నాయి. సుమారు 5,530 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఒంగోలు నగర పరిధిలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలలను ఎంపిక చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఒంగోలు సబర్బన్: అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టు కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాసిన అంగన్వాడీ కార్యకర్తలకు సువర్ణావకాశం కల్పించింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్ని పోస్టులను భర్తీ చేశారు. ఆ తరువాత 2013 డిసెంబర్లో కిరణ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ పోస్టులను అసంపూర్తిగా భర్తీ చేశారు. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు. పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేసినా పెడచెవిన పెట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ కావడంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. ఈ నెల 12వ తేదీతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. 5,530 దరఖాస్తులు అంగన్వాడీల్లో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారి నుంచే సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టులకు ఎంపిక చేస్తారు. పాత ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన తరువాత ఈ మూడు జిల్లాల పరిధి ప్రస్తుతం ఐదు జిల్లాలకు పెరిగింది. ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం పరిధిలో మొత్తం 142 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకుగాను మొత్తం 5,530 మంది అంగన్వాడీ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 50 మార్కులు.. అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి రాత పరీక్షతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ ప్రొఫిషిఎన్సీ (ఆన్ వీడియో)తో కూడిన పరీక్ష నిర్వహించనున్నారు. 50 మార్కులు. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు 90 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున వేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఒక్కోదానికి అర మార్కు చొప్పున 45 మార్కులకు ఇస్తారు. వీటితోపాటు ఐదు మార్కులకు స్పోకెన్ ఇంగ్లిషు ప్రొఫిషిఎన్సీకి కేటాయించారు. అలాగే నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే పావు మార్కు తగ్గిస్తారు. ఏడు కాలేజీల్లో పరీక్ష ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం పరిధిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఏడు కాలేజీలను ఎంపిక చేశారు. కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుకు సంబంధించి పోలీస్ అధికారులు, ప్రభుత్వ అనుబంధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఏర్పాట్లు పూర్తి సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15 నుంచి హాల్ టికెట్లు పంపిణీ చేస్తున్నాం. 18వ తేదీన కేటాయించిన కాలేజీల్లో రాత పరీక్ష ఉంటుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు అభ్యర్థులు పరీక్ష హాలులోకి రావాలి. 10 గంటలకు పరీక్ష ప్రశ్న పత్రం ఇస్తాం. 10 గంటల తరువాత ఎవరినీ హాలులోని అనుమతించం. – వై.శైలజ, ఆర్జేడీ, ఒంగోలు -
నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! అంటూ గొడవ చేసిన తండ్రి...
Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్. ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్లు వేసే అంగన్వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం) -
అంగన్వాడీలకు ఉద్యోగ విరమణ ప్యాకేజీ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ అంశం త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్పై ప్రత్యేక నిబంధనలేమీ లేవు. ప్రస్తుతం వారికి గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగ విరమణ విషయంలో కూడా విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వారి రిటైర్మెంట్ ప్యాకేజీ కోసం ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆయా సంఘాల ప్రతినిధులతో పలుమార్లు చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. 53 వేల మంది ఉద్యోగులు.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసు) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ఐసీడీఎస్‌లు గ్రామీణ ప్రాంతాల్లో, 25 పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుకాగా, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 55 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. ఇందులో 27 వేల మంది టీచర్లు, 25 వేలకు పైగా హెల్పర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మాత్రం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో దాదాపు 9 వేల మంది పదవీ విరమణ వయసు దాటిన వారు ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు గతేడాది అంచనా వేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు మీదపడిన వారికి విశ్రాంతి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుప్రీంకోర్టు పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రాట్యుటీ ఇవ్వాలని ఆదేశించించిన నేపథ్యంలో అంగన్వాడీలకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తోంది. ప్యాకేజీలో ప్రతిపాదించిన ప్రధాన అంశాలు.. ♦ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.2 లక్షలు ఇవ్వాలని శిశుసంక్షేమ శాఖ భావిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ వేతనాన్ని మాత్రమే ఇస్తున్నందున ఇందులో బేసిక్, డీఏలు ఉండకపోవడంతో గ్రాట్యుటీ లెక్కింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాట్యుటీ ఇవ్వడం కుదరనందున టీచర్లకు రూ.2 లక్షల సాయంపై యోచన. ♦అంగన్వాడీ టీచర్ రిటైర్మెంటు తీసుకున్న మరుసటి నెల నుంచి ఆసరా పింఛన్ ఇవ్వాలి. ♦రిటైర్మెంటు తీసుకున్న అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అంగన్వాడీలో ఉపాధి అవకాశాన్ని కల్పించాలి. ♦అంగన్వాడీ హెల్పర్‌కు రూ.లక్ష సాయంతో పాటు ఇతర అంశాల్లో అంగన్వాడీ టీచర్‌కు అమలు చేసే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా ప్రతిపాదనలను తయారు చేసినట్లు సమాచారం. వీటిని మరింత లోతుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించాలని ఈ శాఖ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ముఖ్యమంత్రితో సమావేశమై ప్యాకేజీ ఖరారు అయ్యేలా విశదీకరించాలని భావిస్తున్నారు. వచ్చే నెలాఖరులో సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలని మంత్రి భావిస్తున్నట్లు పేషీ వర్గాలు చెబుతున్నాయి. -
అంగన్వాడీ వర్కర్లకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అర్హులైన అంగన్వాడీ, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..? ఆదాయ పరిమితిలోపు గౌరవ వేతనం పొందుతున్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లకు వైఎస్సార్ పెన్షన్ కానుకతో పాటు అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల శాఖతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు, జిల్లా కలెక్టర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు మహిళా శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్ ఇచ్చింది. -
అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అంగన్వాడీ కేంద్రాల వర్కర్లు, సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ‘‘అంగన్వాడీ కేంద్రాలు చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తూ ప్రభుత్వంలో భాగంగా మారాయి. గ్రాట్యుటీ చట్టం–1972 వాటికీ వర్తిస్తుంది’’ అని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్ ఎస్ ఒకాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల సంక్షేమం వంటి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అంగన్వాడీ సిబ్బందిని పార్ట్‌టైం వర్కర్లుగా భావించలేమని పేర్కొంది. క్లిక్: వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు -
మోసం కాకుంటే ఏంటి బాబూ?
సాక్షి, అమరావతి: జీతాల కోసం ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. తను అధికారంలో ఉన్నపుడు నాలుగున్నరేళ్ల పాటు అసలు వారి జీతాలు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ఘనత ఆయనది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయువు పట్టులాంటి చిరుద్యోగులకు అతితక్కువ జీతాలు చెల్లిస్తూ... అవికూడా ఆరు నెలలకో, తొమ్మిది నెలలకో ఇస్తూ వచ్చిన చంద్రబాబు... పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిరుద్యోగులు ఆశ్రయించటం... తనకు పరిస్థితి చేయిదాటిపోతోందోని గ్రహించటంతో ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచీ కొందరికి జీతాలు పెంచటం మొదలెట్టారు. దీన్నేమనుకోవాలి? నాలుగున్నరేళ్లపాటు పట్టించుకోకపోవటం మోసం కాదా? చివర్లో జీవోలిచ్చి చేతులు దులుపుకోవటం దుర్మార్గం కాదా? అలాంటి చంద్రబాబు ఇపుడు వివిధ సంఘాలు, కమ్యూనిస్టుల ద్వారా ఉద్యోగులను రెచ్చగొట్టి తమ ఎజెండాను వారిపై రుద్ది ఆందోళనలు చేయిస్తున్నారంటే ఏమనుకోవాలి? అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి అనేది ఉందా? చిత్తశుద్ధి ఉందో లేదో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు. అదేమిటంటే... రాష్ట్రంలో వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు దాదాపు 3.07 లక్షల మంది ఉండగా... చంద్రబాబు హయాంలో వారికి చెల్లించిన జీతాల బిల్లు ఏడాదికి రూ.1198 కోట్లు. కానీ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఈ ఉద్యోగులందరికీ జీతాలు పెంచటంతో ఈ బిల్లు ఏకంగా రూ.3,187 కోట్లకు చేరింది. అంటే... దాదాపు మూడు రెట్లు పెరుగుదల. ప్రభుత్వంపై ఏకంగా రూ.2వేల కోట్ల మేర భారం పడినా... చిరుద్యోగుల సంక్షేమం అత్యవసరమని మనసా వాచా నమ్మటంతో ముందుకే అడుగేశారు ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ చంద్రబాబుకో... టీడీపీ అనుకూల మీడియాకో తెలియవా అంటే... తెలీకేమీ కాదు. వారిదల్లా రాజకీయ ఎజెండా. దానికోసం ఎర్రజెండాతో సహా దేన్నయినా ఆశ్రయించే నైజం వారిది. అందులో భాగమే తప్పుడు రాతలు, ప్రేరేపించిన ఆందోళనలు. కావాలంటే చంద్రబాబు హయాంలో ఎంత జీతాలుండేవో... జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంత జీతాలున్నాయో ఒకసారి చూద్దాం. -
అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు చరిత్రను ఎవరూ మరిచిపోలేదని, నేడు అంగన్వాడీలు, ఆశాలకు సీఎం వైఎస్ జగన్ మేలు చేస్తుంటే ఓర్వలేక వాస్తవాలను వక్రీకరిస్తూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న దు్రష్పచారాలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. మహిళల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఆర్ధికంగా వారికి అండగా నిలవడానికి సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటి ప్రభుత్వం మీద ఈర‡్ష్య, అసూయలతో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. బాబుతో కుమ్మక్కైన ఎర్ర పార్టీల్లోని కొందరు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. వీరిని అదే జాతికి చెందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 సంస్థలు తమ భుజాలపై మోస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి.’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
‘బెదిరించారు.. బలవంతం చేశారు.. తప్పని పరిస్థితుల్లో ధర్నాకు వచ్చాం’
సాక్షి, మచిలీపట్నం: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్నన చూరగొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు పన్నిన కుట్ర బట్టబయలైంది. అంగన్వాడీల ధర్నాల వెనుక టీడీపీ, ఎల్లో మీడియా పాత్ర స్పష్టంగా బయటపడింది. తమను బెదిరించి, బలవంతంగా తీసుకువచ్చారని మచిలీపట్నంలో ధర్నాలో పాల్గొన్న పలువురు అంగన్వాడీలు చెప్పారు. తమకు మేలు చేస్తున్న జగనన్నకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం ఇష్టం లేదని వారు తేటతెల్లం చేశారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు, ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నం ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నా కోసం నాలుగు రోజులుగా టీడీపీ నేతలు అంగన్వాడీ వర్కర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ధర్నాకు రావాలని బెదిరిస్తున్నారు. వారి నుంచి అంతగా స్పందన లేకపోవటంతో టీడీపీ శ్రేణులు, సీఐటీయూ నాయకులు కొందరు మహిళలకు డబ్బులిచ్చి ధర్నా చౌక్‌కు ఆటోల్లో తీసుకొచ్చారు. ఈ నేతల బెదిరింపులకు భయపడి కొందరు అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు ధర్నా సమయానికి అక్కడికి వచ్చారు. వారంతా ఒక చోట మౌనంగా కూర్చున్నారు. టీడీపీ మహిళా నేతలు అంగన్వాడీ నేతలమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లకు మేలు జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లకు చిర్రెత్తుకొచి్చ, ఎదురు తిరిగారు. చంద్రబాబు హయాంలో తమను ఎంత హీనంగా చూశారో వారికి గుర్తు చేశారు. గుర్రాలతో తొక్కించిన సంఘటనను మర్చిపోలేమని చెప్పారు. దీంతో టీడీపీ మహిళా నాయకురాలు ఆచంట సునీత, మరి కొందరు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఆందోళన చేయడం తమకు ఇష్టం లేదని అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వెల్లడించారు. చంద్రబాబునాయుడు హయాంలో తమను హీనంగా చూశారని, జగనన్న వచ్చాక వేతనాలు పెంచి గౌరవప్రదంగా చూసుకుంటున్నారని తెలిపారు. తమ డిమాండ్లను జగనన్న పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని, ఆందోళనలు అవసరం లేదన్నారు. జగనన్న అన్యాయం చెయ్యరనే నమ్మకం ఉందన్నారు. మమ్మల్ని కొందరు బెదిరించి, బలవంతం చేస్తే తప్పని పరిస్థితుల్లో ధర్నాకు వచ్చామని చెప్పారు. మీకు దండం పెడతా పిడికిళ్లు బిగించి నినాదాలు చేయండి ధర్నాలో పాల్గొన్న వారెవ్వరూ నినాదాలు చేయలేదు. మౌనంగా కూర్చుండిపోయారు. ఈ పరిణామాన్ని జీరి్ణంచుకోలేని ఎల్లో మీడియా ప్రతినిధులు సీఐటీయూ నాయకులను పక్కకు పిలిచి ఇలా మౌనంగా కూర్చుంటే టీవీల్లో, పత్రికల్లో చూపించలేమని చెప్పారు. టీవీ విజువల్స్, ఫొటోల కోసమైనా కాసేపు నినాదాలు చేయించమని కోరారు. దీంతో సీఐటీయూ నాయకులు ‘మీకు దండం పెడతాం. పిడికిళ్లు బిగించి కొద్ది సేపైనా చేతులెత్తి నినాదాలు చేయండి’ అంటూ ప్రాథేయపడ్డారు. అతి కొద్ది మంది మాత్రం చేతులెత్తి నినాదాలు చేశారు. మిగతా వారు స్పందించలేదు. -
AP: అంగన్వాడీ’లకు తీపికబురు
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదోన్నతుల కోసం ఎనిమిదేళ్ల వీరి నిరీక్షణకు తెరదించి అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతమున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లు సైతం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వీరికి పదోన్నతులు కల్పించాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణాధికారులు (ఈఓ) గ్రేడ్–2 (సూపర్వైజర్లు) పోస్టులు వీరితో భర్తీకానున్నాయి. నిజానికి.. రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులు 976 ఉన్నాయి. వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీచేశారు. అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీచేస్తారు. వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. అంగన్వాడీ వర్కర్ల చేతికి ’స్మార్ట్ ఫోన్’ ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్ఫోన్లు ఇవ్వనుంది. 55,607 అంగన్వాడీ వర్కర్లు, 1,377 సూపర్వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్ ఖరీదు రూ.14,998 కాగా, మొత్తం రూ.85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత సర్కారు వీరిని నిర్లక్ష్యం చేసింది రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు విశేష సేవలందిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం తరఫున తమ వంతు సేవలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్ల మేలు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రేడ్–2 సూపర్వైజర్లకు గ్రేడ్–1 సూపర్వైజర్లుగాను, గ్రేడ్–1 సూపర్వైజర్లకు సీడీపీఓలుగాను, సీడీపీఓలకు ఏపీఓలుగాను పదోన్నతులు కల్పించాం. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంగన్వాడీ వర్కర్ల పదోన్నతుల విషయంలో వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పారదర్శకంగా పదోన్నతులు అంగన్వాడీ వర్కర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. 2013లో వీరికి పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా లేవు. అప్పటి నుంచి ఉన్న ఖాళీలను అర్హులైన అంగన్వాడీ వర్కర్లతో భర్తీ చేయాలనే డిమాండ్ ఉంది. వీరి విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పదోన్నతులకు ఆమోదం తెలిపింది. దీనికి మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. – కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
అంగన్వాడీలకు చేనేత చీరలు
సాక్షి, హైదరాబాద్: చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేనేత చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యా దేవరాజన్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా చేనేత వస్త్రాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి, 30శాతం వేతన సవరణ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విభాగంపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ అన్నారు. ట్రాన్స్జెండర్లు తయారు చేసిన జనపనార బ్యాగులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. -
మట్టిలో నుంచి పసిబిడ్డ ఏడుపు.. తవ్వి చూస్తే..!!
భోపాల్: మూడు రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో! ఐతే విధి చిన్నచూపు చూసినా మృత్యువును జయించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ పసికూన. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో బతికున్న మూడురోజున పసిబిడ్డను నది ఒడ్డున మట్టిలో పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. గురువారం సాయంత్రం ఝంగర్చక్ గ్రామ సమీప పొలాల్లో పనులు చేసుకునే కొందరు గ్రామస్థులకు పసిబిడ్డ ఏడుపు వినిపించిన ప్రదేశానికి వెళ్లారు. కొంతసమయానికి బిడ్డ ఏడుపు మట్టికింద నుంచి రావడాన్ని గమనించి, మట్టిని జాగ్రత్తగా తొలగించించారు. అనంతరం కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కేవలం రోజుల వయసున్న నవజాత శిశువును ఒక సంచిలో చుట్టి బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. దీంతో వారు బిడ్డను రక్షించి ముంగావలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై సెక్షన్ 317 కింద కేసు ఫైల్చేసి నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సతీష్ గార్గ్ మీడియాకు వెల్లడించారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
పాలు తాగిన గంట తర్వాత.. ఏమైందో ఏమో..
సాక్షి,లావేరు(శ్రీకాకుళం): మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ నేతేరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్వాడీ కార్యకర్త అల్లంశెట్టి పద్మావతి ఉదయం 9 గంటల సమయంలో చిన్నారులు లండ ధనుష్, కె.మహేష్, బి.ఉదయ్‌కిరణ్, బి.రోహిణి, ఎ.సాత్విక్, ఎ.విష్ణువర్ధన్, ఎ.రామలక్ష్మి, బి.శిరీష, బి.ఝూ న్సీ, వి.సందీప్‌లకు పాలు ఇచ్చారు.గంట తర్వాత ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వగా వాటిని తిన్న పిల్లలు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. కార్యకర్త, గ్రామస్తులు స్పందించి 108 అంబులెన్సుల్లో పిల్లలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పిల్లలకు అందించిన పాలు, గుడ్లు రెండు రోజుల కిందటే వచ్చాయని, తయారీ తేదీలు కూడా సక్రమంగానే ఉన్నాయని, ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని అంగన్వాడీ కార్యకర్త తెలిపారు. విష యం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికు మార్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలకృష్ణ, జెడ్పీటీసీ మీసాల సీతన్నాయు డు, వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనివాసరావు, సర్పంచ్ కొల్లి ఈశ్వరరావురెడ్డి, ఐసీడీఎస్ పీఓ ఝూన్సీరాం, ఎంపీడీఓ బి.మధుసూదనరావు రిమ్స్‌కు వెళ్లి వైద్య సేవలను పర్యవేక్షించారు. చదవండి: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా.. -
కోవిడ్ విధుల్లోని అంగన్ వాడీలకు 50 లక్షల బీమా
న్యూఢిల్లీ: కోవిడ్ సంబంధ విధుల్లో పాలుపంచుకునే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా కవరేజీ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్–19 అవగాహన, పర్యవేక్షణతోపాటు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులను అందించే అంగన్వాడీ సిబ్బంది ఈ పథకం పరిధిలోకి వస్తారని మంగళవారం మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. విధుల్లో ఉండగా కోవిడ్‌తో చనిపోయినా, ప్రమాదవశాత్తూ మరణించినా వర్తిస్తుందన్నారు. ఈ పథకం మహమ్మారి దేశంలో మొదలైన 2020 మార్చి 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కోవిడ్ విధుల్లో పాలుపంచుకునే అంగన్ వాడీ, ఏఎన్ఎం సిబ్బంది వివరాల కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగాలను కోరినట్లు చెప్పారు. దేశంలోని అంగన్వాడీల్లో సుమారు 13.29 లక్షల వర్కర్లు, 11.79 లక్షల మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. రూ.50 లక్షల బీమా వెసులుబాటు ప్రస్తుతం కోవిడ్ సంబంధ విధుల్లో పాల్గొంటున్న ప్రజారోగ్య సిబ్బందికి ఉంది. -
అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా?
భువనేశ్వర్: అంగన్వాడీ కార్యకర్త అక్రమాస్తుల సంపాదన వ్యవహారాన్ని విజిలెన్స్ సిబ్బంది మంగళవారం బట్టబయలు చేశారు. పలుచోట్ల ఒకేసారి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని కొరొడొకొంటా అంగన్వాడీ కేంద్రం కార్యకర్త కబితా మఠాన్ రూ.4 కోట్లు పైబడి విలువైన ఆస్తులను ఆర్జించినట్లు విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు. ఖుర్దా, కేంద్రాపడా, జగత్సింఘ్పూర్ జిల్లాల్లో ఒకేసారి ఉదయం సోదాలు చేపట్టిన అధికారులు అక్రమాస్తుల చిట్టాని వెలుగులోకి తీసుకువచ్చారు. సదరు అంగన్వాడీ కార్యకర్త ఆస్తుల గుట్టు రట్టు చేయడంలో 6 బృందాలు పాల్గొనగా, వీరిలో 10 మంది డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 4 భవనాలు, 10 ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కారు, విలువైన బంగారు ఆభరణాలను కబితా మఠాన్ ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. భవనాల్లో భువనేశ్వర్‌లో 4 అంతస్తుల భవనం ఒకటి, 3 అంతస్తుల భవనం మరొకటి, 2 రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. అలాగే జగత్సింఘ్పూర్ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉండగా, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు, పలు స్థిర చరాస్తులు ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల దాడిలో గుర్తించారు. వీటి సమగ్ర విలువ రూ.4 కోట్లు పైబడి ఉంటుందని అధికార వర్గాల సమాచారం. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
ప్రాణాలను సైతం లెక్క చేయలేదు.. నదిని దాటి మరీ..
జయపురం(భువనేశ్వర్): ప్రజలకు సేవలు అందించేందుకు అంగనబడి, హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించారంటే సాధారణంగా నమ్మశక్యం కాదు. కానీ, ఆదివారం జయపురం సబ్‌డివిజన్ ముండిగుడ గ్రామంలో అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. ముండిగుడ గ్రామస్తులకు ఆదివారం బలిగాంలో కోవిడ్ టీకాలు ఇస్తామని ఆరోగ్య సిబ్బంది ముందుగానే ప్రకటించారు. అయితే, భారీ వర్షం కురవడంతో గ్రామస్తులు టీకా కేంద్రానికి రాలేకపోయారు. వర్షాలకు మార్గమధ్యంలో ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు వెనక్కుతగ్గారు. విషయం తెలుసుకున్న హెల్త్‌వర్కర్ సుధామణి, అంగనబడి వర్కర్ సులోచన.. ఎలాగైనా ముండిగుడ గ్రామ ప్రజలకు కోవిడ్ టీకాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. నడుం లోతు నీరు పారుతున్న నదిని దాటుకుంటూ గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు టీకాలు ఇచ్చారు. అంగన్‌బడి వర్కర్, హెల్త్ వర్కర్ సాహసానికి, కర్తవ్య దీక్షకు గ్రామస్తులు అబ్బురపడ్డారు. వారు నది దాటుతున్న దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. కర్తవ్య నిర్వహణలో ప్రమాదం పొంచి ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వహించడం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. చదవండి: ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్లిన ప్రియురాలు -
బాల్య వివాహాలపై నిఘా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలకు చెల్లుచీటి రాసేలా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే పక్కా కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా స్థాయి పిల్లల సంరక్షణ అధికారుల సమన్వయంతో ఇప్పటికే రంగంలోకి దిగింది. బాల్య వివాహాలపై అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం సేకరించి జిల్లా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేస్తోంది. బాల్య వివాహాలకు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ సమాచారాన్ని స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు అందించేలా ప్రజల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ 1098, మహిళా సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ 181తోపాటు స్థానిక పోలీసులు, జిల్లా కేంద్రాల్లోని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్య వివాహాలతో దుష్పరిణామాలెన్నో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బాల్య వివాహాల్లో 40 శాతం మన దేశంలోనే జరుగుతున్నట్టు గుర్తించారు. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మత, కులపరమైన కట్టుబాట్ల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వివాహం చేయటం వల్ల వారిలో మానసిక పరిపక్వత లోపించటం, ఆరోగ్యపరమైన సమస్యలకు దారి తీస్తోంది. దేశంలో 15 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు ఏటా దాదాపు 70 వేల మంది ప్రసవ సమయంలో మరణిస్తున్నట్టు అంచనా. మైనర్ బాలికలకు తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో పిల్లలు పుడుతున్నారు. వారికి పుట్టే శిశువులు మరణిస్తున్న ఘటనలూ నమోదవుతున్నాయి. ఏడాదిలో 1,235 బాల్య వివాహాలకు అడ్డుకట్ట రాష్ట్రంలో గడచిన ఏడాది కాలంలో 1,235 బాల్య వివాహాలను అధికారులు నిరోధించారు. బాల్య వివాహాలపై జిల్లాల వారీగా వచ్చిన సమాచారం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన అధికారులు వాటిని అడ్డుకుని తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు బాల్య వివాహాలు చేసే వారిపైన, వాటిని ప్రోత్సహించే వారిపైన బాల్య వివాహా నిషేధ చట్టం–2006 ప్రకారం చర్యలు తప్పవు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. గతేడాది కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే 165 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. ఇకపై బాల్య వివాహాలు చేస్తున్నట్టు సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు, ఉపాధి కల్పన ఏర్పాట్లు చేస్తాం. – కృతికా శుక్లా, డైరెక్టర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ -
అంగన్వాడీలకు సైబర్ నేరగాళ్ల కాల్స్
‘‘హలో మేడం.. మేం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైద్య శాఖ సిబ్బంది మాట్లాడుతున్నాం. మీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్నారు కదా! మీకు అమౌంట్ పంపిస్తున్నాం. మీ ఫోన్‌పే నంబరు చెప్పండి. మీరు చెప్పే ఫోన్‌పే నంబరులో కనీసం రూ.మూడు వేలు బ్యాలెన్స్ ఉంటేనే నగదు బదిలీ చేయగలం...’’ – ఓ అంగన్వాడీ కార్యకర్తకు సైబర్ నేరగాడి ఫోన్ కాల్ ప్రత్తిపాడు: గుంటూరు జిల్లాలో సోమవారం పలుచోట్ల సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీన్ని నమ్మి మోసగాడికి ఓటీపీ వివరాలు వెల్లడించడంతో బ్యాంకు ఖాతా నుంచి క్షణాల్లో డబ్బులు గల్లంతయ్యాయి. ప్రత్తిపాడు మండలంలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు, ఒక వీవోఏ ఖాతాల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు నగదును కాజేశారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ లేదని బాధితులు చెప్పడంతో స్నేహితుల ఖాతా వివరాలు ఇవ్వాలని మోసగాడు సూచించాడు. కేవలం మహిళల ఖాతాలకు మాత్రమే డబ్బులు బదిలీ చేస్తామంటూ వల విసిరాడు. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్.. బొర్రావారిపాలెం అంగన్వాడీ కార్యకర్తకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులిస్తామంటూ మోసగాడు కాల్ చేశాడు. దీన్ని నమ్మిన బాధితురాలు ఫోన్‌పే లేకపోవడంతో తొలుత తన భర్త ఖాతా నుంచి స్నేహితురాలైన వీవోఏ ఖాతాకు రూ.8 వేలు బదిలీ చేసింది. ఆ తరువాత ఫోన్‌కి వచ్చిన ఓటీపీ వివరాలను నేరగాడికి వెల్లడించింది. అంతే రూ.8 వేలతో పాటు వీవోఏ ఖాతాలో ఉన్న రూ.39,996 కూడా కలిపి మొత్తం రూ.47,996 మాయమయ్యాయి. పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త అనూరాధకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. సైబర్ నేరగాడు ఫోన్‌పే నంబరు అడగడంతో తన కుమారుడికి ఫోన్ చేసింది. ఫోన్ ఎంగేజ్ రావడంతో స్నేహితురాలైన కొత్తమల్లాయపాలెం అంగన్వాడీ కార్యకర్త మేడా సీతామహాలక్ష్మి ఫోన్‌పే నెంబరు నేరగాడికి తెలియచేసింది. ఇక్కడా కూడా సేమ్‌సీన్ రిపీట్. బాధితుల ఖాతా నుంచి రూ.33,997 మాయమయ్యాయి. ఇది అంతటితో ఆగలేదు. హైదరాబాద్‌లో ఉండే తన సోదరుడు కుంభా వెంకటేశ్వర్లు ఫోన్‌పే నంబరు కూడా ఇవ్వడంతో ఆయన ఖాతా నుంచి రూ.12,990 గల్లంతయ్యాయి. గనికపూడికి చెందిన మరో అంగన్వాడీ కార్యకర్తకు నేరగాడు ఫోన్ చేసి మీ కుమార్తె ప్రసవానికి రూ.పాతిక వేలు ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆమెకు ఫోన్‌పే లేకపోవడంతో తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మరో అంగన్వాడీ కార్యకర్త ఫోన్‌పే నంబరును ఇచ్చింది. ఆమె ఖాతా నుంచి రూ.11,999 కట్ అయ్యాయి. వీరేకాకుండా గొట్టిపాడు, గనికపూడి గ్రామాలకు చెందిన మరికొందరికి కూడా ఇలాంటి ఫోన్ కాల్సే వచ్చినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ బుధవారం తెలిపారు. బాధితుల కాల్ డేట్‌ను పరిశీలించగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. సైబర్ నేరగాడు మాయం చేసిన నగదును తన ఖాతాకు బదిలీ చేసుకోకుండా నేరుగా ఆన్లైన్ షాపింగ్ (పీవోఎస్ ట్రాన్సాక్షన్) చేసినట్లు తెలుస్తోంది. -
ఒడిశా పోలీసుల అత్యుత్సాహం
మందస: ఒడిశా అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ మాత్రం సంబంధంలేని అంగన్వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేశారు. అతన్ని విడుదల చేయాలని ఆంధ్రాలోని గిరిజన సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సరిహద్దు పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాసంఘాలు అధికారులను ఆశ్రయించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం అంగన్వాడీ కేంద్రం వివాదం ముదురుతోంది. ఆంధ్రా భూభాగంలో నిర్మించిన కేంద్రాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు ఇప్పటి వరకూ బెదిరిస్తూ వచ్చారు. తాజాగా అరెస్టుల పర్వానికి తెరతీశారు. మాణిక్యపట్నం అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి భర్త గురునాథం సాబకోట సచివాలయం వద్ద ఉండగా, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గారబంద పోలీసులు శనివారం బలవంతంగా తీసుకెళ్లారు. చదవండి: పెచ్చు మీరుతున్న ఒడిశా ఆగడాలు విషయం తెలుసుకున్న మందస, సాబకోట, చీపి సర్పంచ్‌లు చెరుకుపల్లి యల్లమ్మలక్ష్మణమూర్తి, సవర సంధ్యారాము, సవర లక్ష్మీప్రియచిరంజీవి, మాజీ సర్పంచ్ మద్దిల రామారావు, గిరిజన నాయకులు ధర్మారావు, సవర నీలకంఠం, సవర ప్రధాన, సవర బాలయ్య, గురునాథ్, సీఐటీయు నాయకుడు ఆర్.దిలీప్‌కుమార్ తహసీల్దార్ బడే పాపారావు, ఎస్ఐ కోట వెంకటేశ్‌లకు కలిసి వినతిపత్రాలను అందజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన గురునాథాన్ని విడిపించాలని, ఒడిశా అధికారులు, పోలీసుల వేధింపుల నుంచి అంగన్వాడీ కార్యకర్తను రక్షించాలని విన్నవించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న మాణిక్యపట్నం, చీపి పంచాయతీలోని కొండమేర భూసమస్యలను పరిష్కరించాలని కోరారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి అక్రమ అరెస్టు, భూసమస్యలను ఫోన్ ద్వారా వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి, ఒడిశా జిల్లా అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. కాగా అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్ మాణిక్యపట్నం వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు -
చిత్తూరు జిల్లా అంగన్వాడీల్లో 484 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ.. జిల్లాలోని 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 484 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ కార్యకర్త–110, మినీ అంగన్వాడీ కార్యకర్త–65, అంగన్వాడీ సహాయకురాలు–309. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ.7000, అంగన్వాడీ సహాయకురాలికి నెలకు రూ.7000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్ ఇంటర్వ్యూ, ఇతర వివరాలను ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల్ని సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 26.08.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021 ► వెబ్సైట్: https://chittoor.ap.gov.in -
రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్దపీట
హుజూరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవేతనం రూ.2,700 అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.10,950 అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చినా.. కేంద్రమే ఇస్తోందంటూ బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో పీఆర్సీ పెంపుపై కృతజ్ఞతసభ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇచ్చేది టీఆర్ఎస్ సర్కారు అయితే.. చెప్పుకునేది బీజేపీ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో అంగన్వాడీ టీచర్ జీతం, మన రాష్ట్రంలో ఆయాలకు ఇచ్చే మొత్తంతో సమానమని తెలిపారు. వారికి దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒకప్పుడు జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ప్రగతిభవన్‌కు పిలిచి మరీ జీతాలు పెంచారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వారికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని, అంగన్వాడీలకు ఏడేళ్లలో మూడుసార్లు వేతనం పెంచామని పేర్కొన్నారు. త్వరలోనే అంగన్వాడీలకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంగన్వాడీల జీతాలు కూడా ప్రతినెలా మొదటివారంలో వచ్చేలా కృషి చేస్తామన్నారు. అంగన్వాడీలలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. ప్రజలకోసం పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు చేసేది ఉద్యోగం కాదని, సమాజ సేవ అని అన్నారు. వారికి ఎంత జీతం ఇచ్చినా తక్కువే అని గ్రహించిన సీఎం కేసీఆర్ తగిన వేతనాలు పెంచారని తెలిపారు. టీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఆర్ఎస్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు ఉషారాణి, జయ తదితరులు సభలో పాల్గొన్నారు. -
తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా
డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్చెరువు అంగన్వాడీల్లో 32 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 32 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్–08, అంగన్వాడీ ఆయా–24. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీల్లో 57 పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 57 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్లు–08, అంగన్వాడీ ఆయాలు–45, మినీ అంగన్వాడీ టీచర్లు– 04. ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఆలేరు–18, భువనగిరి–14, మోత్కూర్–10, రామన్నపేట–15. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 26.08.2021 నుంచి 28.08.2021 వరకూ. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in డీహెచ్ఎస్, జగిత్యాలలో 10 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన జగిత్యాల జిల్లా హెల్త్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–04, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫార్మసిస్ట్–05. ► సివిల్ అసిస్టెంట్ సర్జన్: అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఫార్మసిస్ట్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డీఎంఎల్టీ/బీఎస్సీ(ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://jagtial.telangana.gov.in మేనేజ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► పోస్టుల వివరాలు: డైరెక్టర్(అగ్రికల్చర్ మార్కెటింగ్)–01, రీసెర్చ్ అసోసియేట్ (అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్)–01, రీసెర్చ్ అసోసియేట్(నాలెడ్జ్ మేనేజ్మెంట్)–01, జూనియర్ స్టెనోగ్రాఫర్–01, అసిస్టెంట్ క్యాషియర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్–500030, హైదరాబాద్, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.manage.gov.in టీఎస్ పోస్టల్ సర్కిల్లో 55 స్పోర్ట్స్ కోటా పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్–11, సార్టింగ్ అసిస్టెంట్–08, పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్–26, ఎంటీఎస్–10. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి. ► వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ► క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్ తదితరాలు. ► క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ► ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://tsposts.in -
అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసిన యజమాని..
భైంసాలోని ఓవైసీ నగర్లో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రానికి రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని శనివారం ఇలా ఇంటికి తాళం వేశాడు. సరుకులన్నీ బయటపెట్టడంతో అంగన్వాడీ టీచర్ లబ్ధిదారులకు ఆరుబయటే టీహెచ్ఆర్ పంపిణీ చేసింది. విషయం తెలుసుకున్న సీడీపీవో నాగలక్ష్మి, సూపర్వైజర్ రాజశ్రీ అక్కడికి చేరుకుని యజమానికి సర్దిచెప్పడంతో మళ్లీ తాళం తీశాడు.. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లాలోని పలు ప్రాజెక్టుల పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలలో ఇదే పరిస్థితి. సకాలంలో అద్దె బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. భైంసాటౌన్(నిర్మల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తిప్పలు త ప్పడం లేదు. అద్దె భవనాలకు నెలనెలా బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. యజమానులు ప్రతినెలా కిరాయి చెల్లించాలంటున్నారని, అయితే తమకు ఏడాదికోసారి కూడా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు. రూ.21.40లక్షల వరకు పెండింగ్‌లో.. భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో భైంసారూరల్, అర్బన్, కుభీర్, కుంటాల మండలాలు ఉండగా, వీటి పరిధిలో 205 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సంబంధించి ఆగస్టు 2020 నుంచి బిల్లులు రావాల్సి ఉంది. దాదాపు రూ.21.40 లక్షల వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు సొంతంగా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. డబ్బులు సర్దుకాని సందర్భాల్లో కొన్నిచోట్ల యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నారు. పట్టణంలోని ఓవైసీనగర్‌లో అద్దె భవనంలో ఉన్న సెంటర్ అద్దె చెల్లించకపోవడంతో యజమానికి తాళం వేసి, సరుకులన్నీ బయటపె ట్టాడు. దీంతో సూపర్వైజర్లు వచ్చి సర్దిచెప్పాల్సిన పరిస్థితి. గతంలో సైతం పులేనగర్‌లోని అంగన్వాడీ కేంద్రానికి సైతం అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు. సొంత భవనాలుంటే... జిల్లావ్యాప్తంగా 363 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 3వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వర కు వీటికి అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఈ బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని టీచర్లు చెబు తున్నారు. అయితే ఏటా రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం, సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెలనెలా చెల్లించాలి.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు ఏడాదికిపైగా బిల్లులు రావాల్సి ఉంది. మేం మాత్రం నెలనెలా చెల్లించాల్సి వస్తుంది. కేవలం రెండునెలల కిరాయి చెల్లించకపోవడంతో యజ మాని తాళం వేశాడు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు మంజూరు చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. – జయశ్రీ, అంగన్వాడీ టీచర్, భైంసా బిల్లులు పంపించాం.. భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల అద్దెలకు సంబంధించి బిల్లులు పంపించాం. ఆగస్టు 2020 నుంచి చెల్లించాల్సి ఉంది. యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. బడ్జెట్ కేటాయించగానే బిల్లులు చెల్లిస్తాం. – నాగలక్ష్మి, ఇన్చార్జి సీడీపీవో, భైంసా -
ఫ్యామిలీ పోలీస్‌గా అంగన్వాడీ టీచర్లు
మహబూబాబాద్: అంగన్వాడీలు అంటే ఫ్యామిలీ పోలీస్‌గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మం త్రి సత్యవతి రాథోడ్ సూచించారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు నిత్యావసరాలు అందించడం, ఇంటింటి సర్వే నిర్వహణ, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో మహిళా, శిశు, సంక్షేమశాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి మహబూబాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖ కమిషనర్, ప్రత్యేకకార్యదర్శి దివ్య, జిల్లాల సంక్షేమ శాఖ ల అధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం అందజేయాలని మంత్రి సూచించారు. భార్య అంత్యక్రియలు.. కాసేపటికే భర్త మృతి తూప్రాన్: అనారోగ్యంతో మృతిచెందిన భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త గుండె ఆగింది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులు కేవలం 12 గంటల వ్యవధిలో మృతి చెందారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయిపల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ చాంద్‌బీ (60), సయ్యద్ హుస్సేన్ (70) దంపతులు. 10 రోజుల క్రితం చాంద్‌బీ తీవ్ర జ్వరం, డయేరియాతో ఇబ్బందులు పడుతుండడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచి్చంది. ఇంట్లోనే మందులు వాడుతూ ఉన్న చాంద్‌బీ బుధవారం రాత్రి మృతి చెందింది. ఉదయం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాసేపటికే భర్త ఇంట్లో టీ తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 12 గంటల వ్యవధిలో భార్య, భర్త మృతి చెందడంతో గ్రామంలో విషాదం ఆలుముకుంది. గ్రామ సర్పంచ్ లంబ వెంకటమ్మ వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసింది. -
హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్– నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ).. టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 38 ► పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–21, టెక్నికల్ ఆఫీసర్–06, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1–07, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2–04. ► టెక్నికల్ అసిస్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► టెక్నికల్ ఆఫీసర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,2 పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.04.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: www.ngri.org.in డబ్ల్యూడీసీడబ్ల్యూలో 42 అంగన్వాడీ టీచర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ హైదరాబాద్ పరిధిలో గల ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 42 ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఐసీడీఎస్, చార్మినార్–08, ఐసీడీఎస్, గోల్కొండ–10, ఐసీడీఎస్, ఖైరతాబాద్–10, ఐసీడీఎస్, నాంపల్లి–09, ఐసీడీఎస్, సికింద్రాబాద్–05. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.05.2021 ► వెబ్సైట్: http://wdcw.tg.nic.in SBI Recruitment 2021: బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు 30వేల వేతనం -
మహిళల భద్రతపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
-
మహిళల భద్రతపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లో నాడు–నేడు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2000 స్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలన్నారు. మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్ డే ఆఫ్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్ లీవ్స్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్, దానికోసం సెర్ప్, మెప్మా, హెచ్ఎల్ఎల్ మధ్య ఎంఓయూ చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. పదో తరగతి పూర్తిచేసిన బాలికలకు ప్లస్–1, ప్లస్–2ల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’ పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందులో ‘దిశ యాప్’ సహా అన్నిరకాల వివరాలు ఉంచాలని సూచించారు. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, వాటిపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారంకొనసాగించాలని అధకారులకు సీఎం జగన్ సూచించారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌పై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను చూపించగా వాటిని సీఎం జగన్ పరిశీలించారు. అంగన్వాడీల్లో నాడు–నేడు 44,119 అంగన్ వాడీల్లో నాడు–నేడు కింద ఉన్నవాటి అభివృద్ధి, కొత్త నిర్మాణాలు చేపట్టాలని సీఎం జగన్ అధికారలును ఆదేశించారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు ప్రారంభం కావాలన్నారు. పీపీ–1 పిల్లలకు 4,17,508 పుస్తకాలు, అలాగే పీపీ–2 పిల్లలకు 4,17,508 పుస్తకాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. మార్చి 20 నుంచి మొదలు కానున్న పుస్తకాల పంపిణీ ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటితోపాటు అంగన్వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ప్రభుత్వం ఇప్పటికే 16పంపిణీ చేసిందని, మిగిలిన 10 బోధనోపకరణాలు నెల రోజుల్లోగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ కూడా ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతలపై నిర్దేశించిన విధివిధానాలతో ఎస్ఓపీ బుక్‌ను అందిస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. దానిపై రూపొందించిన వీడియోలను వారికి షేర్ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఏ రవిశంకర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్ సర్సీసెస్) జి పాలరాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: సహకార రంగం.. బలోపేతం -
టీకా వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
సాక్షి, ఖమ్మం: అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని(27) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తుంది. గడిచిన పది రోజుల క్రితం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాలు వేశారు. నాలుగు రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ చిన్ని కరోనా టీకా వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేసి పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందింది. టీకా వికటించడం వల్లే చిన్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అటవీ అధికారులతో లొల్లి: బావిలో దూకిన మహిళ కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ వద్దు -
టీకా వేసుకున్న అంగన్వాడీ ఆయా మృతి
సాక్షి, మంచిర్యాల : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంగన్వాడీ ఆయా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ సంఘటన కాసిపేట మండలం ముత్యంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, ముత్యంపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా సుశీల ఈ నెల 19న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అప్పటినుంచి జ్వరం వస్తుండటంతో ఆసుపత్రిలో చూపించుకుంది. అయినప్పటికి జ్వరం తగ్గక శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో 28న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆమె మరణించింది. ( ‘వ్యాక్సిన్’ స్పెషలిస్ట్.. నాడు, నేడు ఆయనదే కీలక పాత్ర ) -
వ్యాక్సిన్: ఆసుపత్రిలో అంగన్వాడీ టీచర్
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతున్న అంగన్ వాడి టీచర్‌ను హుజురాబాద్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ సింగిరెడ్డి సరోజన కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఈనెల 19న టీకా తీసుకున్నారు. రాత్రి నుంచి తల తిప్పినట్లుగా వాంతులు చేసుకోవడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అప్రమత్తమై అంబులెన్స్‌లో హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీకా తీసుకున్నాక జ్వరంతో పాటు తల తిప్పినట్లై, వాంతులు కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సరోజన తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. చదవండి: ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్! -
యూపీలో మరో నిర్భయ
బధాయూ(యూపీ): యాభై ఏళ్ల అంగన్వాడీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి, చంపేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బధాయూ జిల్లాలో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 నాటి నిర్భయ హత్యాచార ఘటనను తలపించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన పూజారి పరారీలో ఉండగా, అతడి ఇద్దరు సహాయకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లుగా తేలిందని, అలాగే బాధితురాలి మర్మాంగాలపై తీవ్ర గాయాలున్నాయని, కాలు, ఛాతీ ఎముక విరిగాయని పోలీసులు వెల్లడించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ పూజారి తన సహాయకుల సాయంతో మృతదేహాన్ని బాధితురాలి ఇంటికి తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవాలయ ప్రాంగణంలోని ఎండిపోయిన బావిలో ఈ మృతదేహం కనిపించిందని బాధితురాలి కుటుంబ సభ్యులకు వారు వివరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో రేప్ జరిగినట్లుగా తేలిన తరువాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. దోషులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని బరేలీ జోన్ ఏడీజీని ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ఒక బృందాన్ని ఘటనా స్థలికి పంపించాలని నిర్ణయించింది. ఈ ఘటన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంలో జాప్యం చేసిన, తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపిన ఉఘయితి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు సీనియర్ ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు. ‘ఆదివారం సాయంత్రం దేవాలయానికి ప్రార్థనల కోసం వెళ్లిన మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారని గుడి పూజారి (మహంత్), అతడి ఇద్దరు సహాయకులపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశాం. నిందితుల్లో ఇద్దరిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశాం. పూజారి పరారీలో ఉన్నాడు’ అని వివరించారు. నిందితులపై ఐపీసీలోని 376డీ (గ్యాంగ్ రేప్), 302 (హత్య) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మహంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఘటనాస్థలిని బరేలీ ఏడీజీ అవినాశ్ చంద్ర పరిశీలించారు. పరారీలో ఉన్న పూజారి గురించిన సమాచారం ఇచ్చినవారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్య నిపుణుల నుంచి రెండో అభిప్రాయం కోరామని తెలిపారు. ఈ ఘటనను 2012 నాటి నిర్భయ ఘటనతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. దీన్ని గత ఘటనలతో పోల్చడం సరికాదన్నారు. అధిక రక్త స్రావంతో ఆమె చనిపోయారని బుధాన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్పాల్ సింగ్ తెలిపారు. అంగన్వాడీ సహాయకురాలైన బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని బుధాన్ కలెక్టర్ కుమార్ ప్రశాంత్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం పూజ చేసేందుకు వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదని, రాత్రి 11 గంటల సమయంలో మహంత్, అతడి ఇద్దరు సహాయకులు తమ ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారని బాధితురాలి కుమారుడు వివరించారు. దేవాలయ ప్రాంగణంలోని బావిలో పడిపోయిందని, బయటకు తీసి ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పి వారు వెంటనే వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులకు సోమవారం ఉదయం ఫిర్యాదు చేశామన్నారు. ‘మానవత్వానికి సిగ్గుచేటు. ఇంకా ఎంతమంది నిర్భయలు? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లేస్తుంది?’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ‘మహిళల భద్రతపై గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. -
'మంత్రి పేర్ని నాని కోసం నా ప్రాణాలైనా ఇస్తా'
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కోసం నా ప్రాణాలైనా ఇస్తానని అంగన్వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి పేర్కొన్నారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ఆమె నిందితుడిని పక్కకు లాగి వెనుకకు పడిన మంత్రి పేర్ని నానిని పద్మావతి లేవదీసే ప్రయత్నం చేశారు. ఘటన అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానని ఉద్వేగంగా పేర్కొంది. నియోజకవర్గంలో ఎస్కార్ట్ లేకుండా.. వర్దమాన రాజకీయ నాయకులకు భిన్నంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఉంటారు. మంత్రి హోదా ఎక్కడా చూపరు. ఒక్కోసారి గన్మెన్లను కూడా దగ్గర ఉండనీయరు. నియోజకవర్గంలో ఎక్కడా ఎస్కార్ట్ వాహనం సౌండ్ విన్పించదు. ఎక్కడకు వెళ్లినా నాయకులు, కార్యకర్తలతోనే ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనంలోనే వెళ్లి పోతుంటారు. ఇంటివద్ద రోజూ వందలాది మందిని నేరుగా కలుస్తుంటారు. మధ్యలో ఎవరికి చాన్స్ ఇవ్వరు. నేరుగా వారి సమస్యలు వినడం అక్కడికక్కడే పరిష్కారం చూపడం నాని శైలి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాని కుల మతాల కతీతంగా తండ్రిని మించిన తనయుడిగా నియోజకవర్గంపై పట్టు సాధించారు. గడిచిన ఏడాదిలో బందరు పోర్టు, మెడికల్ కళాశాల, ఫిషింగ్ హార్బర్ ఇలా వేలకోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మరొక పక్క గతంలో ఎన్నడూ లేని విధంగా వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఇవి గిట్టని ప్రత్యర్థులు పథకం ప్రకారమే ఆయన్ని బలహీన పర్చేందుకే ఆయన ప్రధాన అనుచరుడైన మోకాను అంతమొందించారు. ఇప్పుడు తాజాగా ఆయనపైనే హత్యాయత్నానికి ఒడిగట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం) భద్రతా వైఫల్యం ! ఘటన జరిగే సమయంలో ఇంటి వెలుపల సుమారు 30 మందికి పైగా కార్యకర్తలున్నారు. పక్కనే ఉన్న పార్టీ కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులున్నారు. కార్యకర్తల మధ్యలో ఉన్న నాగేశ్వరరావు ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంటి వద్ద కేవలం ఇద్దరే.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారని చెబుతున్నారు. మార్కెట్ పనులు పరిశీలిస్తున్న సమయంలో మోకాపై ఊహించనిరీతిలో దాడిచేసి హత మార్చారని, ఇప్పుడు తనపై కూడా అదే రీతిలో అటాక్ జరిగిందని మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు టీడీపీ కార్యకర్త కావడంతో వెనుక ఏదైనా దురుద్దేశం ఉండిఉండవచ్చునన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ సమగ్ర విచారణ జరిపితే కానీ వాస్తవాలు వెలుగు చూడవని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. హత్యయత్నంపై ఖండన మచిలీపట్నం టౌన్: రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై ఆదివారం జరిగిన హత్యాయత్నం ఘటనను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్రంగా ఖండించారు. దాడి నుంచి బయటపడిన మంత్రి పేర్ని నాని కలిసిన ఆయన పరామర్శించారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం సమాచారం తెలిసిన వెంటనే ఏలూరు నుంచి హుటాహుటిన బయలుదేరి ఆయన మచిలీపట్నం చేరుకున్నారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఉన్న పేర్ని నాని పై హత్యాయత్నంకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఈ ఘటనలో నిందితుడి వెనుక ఎవరు ఉన్నదీ బయటకు తీసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పేర్ని నానిపై హత్యాయత్నాన్ని పలు సంఘాలు, పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఏపీ ఐఅండ్‌పీఆర్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సత్యనారాయణసింగ్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఎండీ సద్రుద్దీన్ ఖురేషి, కాపునాడు ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అనుమకొండ కృష్ణ, పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. -
పడవ మీద తిరిగే ప్రాణదాత
మహారాష్ట్ర నందున్‌బర్ జిల్లాలోని చిమల్‌ఖడీ అనే అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తుంది రేణు వాసావె. నర్మదా నది పరీవాహం చుట్టుపక్కల పల్లెల నుంచి గర్భిణులు, నవజాత శిశువులు ఆమె దగ్గరకు పరీక్షకు, ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారానికి వచ్చేవారు. కాని లాక్డౌన్ తర్వాత గత ఆరు నెలల నుంచి గర్భిణులు కరోనా భయంతో రావడం లేదు. అయితే వారిని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు రేణు. నర్మదా నదిలో తానే పడవ మీద తిరుగుతూ వారి వద్దకే వెళ్లి వస్తోంది. గత ఆరు నెలలు ఆమే వారి ఇంటికి వచ్చే ప్రాణదాతగా నిలిచింది. ‘సాయంత్రమైతే నా చేతులు లాగేస్తాయి. కాని పట్టించుకోను. గిరిజన మహిళల కోసం సేవ చేస్తున్నాన్న తృప్తి ఉంది నాకు’ అంటుంది రేణు వాసవె. ఆమె ఒక సాదా సీదా అంగన్వాడీ వర్కర్. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ తను చేయవలసిన పనులేవో చేస్తే ఆమెకు వచ్చే ఢోకా ఏమీ లేదు. ఆమెకు వీలు లేని పని చేయకపోతే ఎవరూ ఏమీ అనరు కూడా. కాని ఆమె అలా ఊరికే ఉండలేదు. తన డ్యూటీ తాను సక్రమంగా చేయాలనుకుంది. నది మీద తిరిగే ప్రాణదాతగా మారింది. అడవి స్త్రీల కోసం రేణు పని చేస్తున్నది చిమల్‌ఖడి అనే ఏజెన్సీ ప్రాంతంలో. అక్కడి అంగన్వాడి కేంద్రానికి గతంలో అయితే చుట్టుపక్కల గర్భిణులు, బాలింతలు వచ్చి తమకు కావలిసిన పరీక్షలు చేయించుకుని ఇచ్చే రేషన్‌ను తీసుకెళ్లేవారు. కాని కోవిడ్ వల్ల వారి రాకపోకలు హటాత్తుగా ఆగిపోయాయి. కొత్తగా గర్భం దాల్చినవారు, పిల్లల్ని కన్నవారు అంగన్వాడి కేంద్రాలకు రావడం మానుకున్నారు. కాని వారి ఆరోగ్యాన్ని పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి అందే ఆహారం, సౌకర్యాలు అందించడం అంగన్వాడి వర్కర్‌గా రేణు విధి. అందుకే ఆమె తానే వారి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అయితే ఆ గిరిజన పల్లెలకు రోడ్లు సరిగా ఉండవు. కాని వాటన్నింటి గుండా నర్మదా నది ప్రయాణిస్తుంది. అందుకే రేణు తన ప్రాంత బెస్తవాళ్ల దగ్గర పడవను అద్దెకు తీసుకుంది. ఆ పడవలో తెడ్డు వేసుకుంటూ పల్లెలకు తిరగసాగింది. 18 కిలోమీటర్లురోజూ ఉదయం ఏడున్నరకే రేణు వాసవె తన అంగన్ వాడీ కేంద్రానికి వెళుతుంది. అక్కడి రోజువారీ పనులు ముగించుకుని మధ్యాహ్నం భోజనం చేసి పడవ మీద నర్మదా నదికి బయలుదేరుతుంది. నదిలో దాదాపు 9 కిలోమీటర్లు వెళ్లి 9 కిలోమీటర్లు వచ్చి, అంటే 18 కిలోమీటర్లు తిరుగుతుంది. ఆమె తిరిగేది మర పడవ కాదు. తెడ్లు వేయాల్సింది. ఒక్కోసారి ఆమె బంధువు, మరో అంగన్వాడి కార్యకర్త సంగీత తోడు వస్తుంది. పడవలో ఆమె రోజు గర్భిణులకు, చంటి పిల్లలకు ఇవ్వాల్సి ఆహారం, బరువు తూచే మిషన్ తీసుకువెళుతుంది. ‘ప్రస్తుతం నేను 25 మంది చంటిపిల్లలను, 7 మంది గర్భిణులను పర్యవేక్షిస్తున్నాను’ అంటోంది రేణు. ఈత వచ్చు రేణుకు నర్మద నదిపై ఒక్కతే పడవ నడపడం అంటే భయం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఈత వచ్చు. నది పై పడవ నడపడం కూడా వచ్చు. ‘మా ఆయనకు ఈత రాదు. కొంచెం భయపడుతుంటాడు నా గురించి. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు నన్ను మెచ్చుకుంటారు’ అంటుంది రేణు. గత ఆరు నెలలుగా వారంలో ఐదు రోజులు పడవ మీద తిరుగుతున్న రేణుని చూసి గిరిజన మహిళలు చాలా సంతోషపడతారు. ఆమెను తమ ఆత్మీయురాలిగా భావిస్తారు. చంటి పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ‘అత్త వచ్చింది చూడు’ అని రేణును చూపిస్తారు.అందరు ఉద్యోగులు ఇలా ఉండరు. ఇలాంటి వారే ఉద్యోగాలకు గొప్పతనాన్ని తెస్తారు. రేణు ఒక ఆత్మీయ బంధువు. – సాక్షి ఫ్యామిలీ -
అంగన్వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీ పోస్టులకు జిల్లాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తోంది. 5,905 పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు. 4,007 అంగన్వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్వాడీ వర్కర్లు, 1,468 మెయిన్ అంగన్వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. “అనంత’లో 654 పోస్టులకు 3,102 దరఖాస్తులు అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 2019 ఖాళీల ఆధారంగా జిల్లాలో 654 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా 3,102 దరఖాస్తులు అందాయి. అభ్యర్ధుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్ అంగన్వాడీల్లో వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్వాడీల్లో వర్కర్లుకు రూ.7 వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. హెల్పర్లకు కూడా రూ.7 వేల చొప్పున వేతనాన్ని అందచేస్తారు. పారదర్శకంగా పోస్టుల భర్తీ రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీల్లో 48,770 వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 47,302 మంది మాత్రమే ఉన్నందున 1,468 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్ అంగన్వాడీల్లో 48,770 హెల్పర్లకు బదులుగా 44,763 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 4,007 హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ అంగన్వాడీల్లో 6,837 వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 6,407 మంది మాత్రమే ఉన్నందున 430 పోస్టుల భర్తీ జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టి అర్హుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. -
అమ్మా.. మీ సేవలు భేష్
సాక్షి, సిద్దిపేట: ‘అమ్మా.. నేను హరీశ్‌రావును మాట్లాడుతున్నా.. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న సేవలు అభినందనీయం.. మీ చేతుల్లోనే ప్రజల ఆరోగ్యం ఉంది.. ఇప్పటి వరకు బాగానే పనిచేస్తున్నారు.. ఇక ముందు కూడా మెరుగైన సేవలు అందించాలి’.. అని జిల్లాలోని ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభినందించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని డంప్ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం మొదలైన కార్యక్రమాల అమలు తీరును తెలుసుకున్నారు. జిల్లాలోని బక్రిచెప్యాల గ్రామం ఆశవర్కర్ శకుంతల, మిట్టపల్లి గ్రామ ఏఎన్ఎం శోభ, తడ్కపల్లి గ్రామం అంగన్వాడీ టీచర్ తిరుమలకు మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలంటే మహిళల్లో చైతన్యం రావాలని చెప్పారు. కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి మీరు సర్వే చేయడంతోనే కొంతమేరకు కరోనాను నివారించగలిగామని తెలిపారు. ఆహారానికి గంట ముందు, తిన్న తర్వాత తప్పనిసరిగా వేడి నీళ్లు తాగాలనే విషయం చెప్పాలని కోరారు. అలాగే.. ఆవిరి పట్టడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, మంత్రి నేరుగా ఫోన్ చేసి అభినందించడం పట్ల ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. -
అంగన్వాడీ ఆయా మృతి.. హరీశ్‌రావు దిగ్భ్రాంతి
గజ్వేల్: తన జీవితంలో వెలుగొస్తుందని ఎదురు చూసిన ఆమె ఆశ.. ఆడియాసగానే మిగిలింది. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆపరేషన్‌లో కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవంలా మారిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పెరగడంతో తుదిశ్వాస విడిచింది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్వాడీ ఆయా కళావతి విషాధాంతమిది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్వాడీ ఆయా కరికె కళావతి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాల్లో అపశృతి చోటు చేసుకొని విద్యుత్‌షాక్‌తో తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న కళావతిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. సరైన వైద్యం అందించలేమని చేతులెత్తేయడంతో తిరిగి గజ్వేల్‌కు తీసుకొచ్చారు. 20 రోజులుగా ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళావతి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు. తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందించడమే గాకుండా ఆమెను కాపాడడానికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కళావతి విద్యుత్‌షాక్‌కు గురైన చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమే గాకుండా ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని గుర్తించిన వైద్యులు ఈనెల 10న శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చేయిని తొలగించారు. అయినా తన జీవితంలో వెలుగొస్తుందనే ఆశతో ఆమె ఎదురు చూస్తూ వచ్చింది. ఆపరేషన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల ప్రాంతంలో కళావతి తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ తెలిపారు. కాగా కళావతి విషాధ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు కుటుంబీకులకు సానుభూతిని ప్రకటించారు. ఇదిలా ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్‌రెడ్డి అక్కడికి చేరుకొని మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ. 50 వేల సాయాన్ని అందజేశారు. కళావతి కుటుంబాన్ని ఆదుకుంటాం.. సిద్దిపేటజోన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కళావతి బుధవారం మృతి చెందడం పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తు కళావతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా ఇచ్చారు. గత 20 రోజులుగా ఇటిన్సీవ్ కేర్ యూనిట్లో శాస్ర చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ కళావతి మృతి చెందడం కలచివేసిందన్నారు. ఆమె కుటుంబానికి ఇన్స్‌రెన్స్ బీమాను అందించడంతో పాటు అండగా ఉంటామని సృష్టం చేశారు. -
శభాష్ కొండమ్మ..
సాక్షి, కనిగిరి : తెల్లవారుజామున గర్భిణికి నొప్పులు రావడంతో దివ్యాంగురాలైన అంగన్వాడీ కార్యకర్త ఆమెను తన ట్రై సైకిల్ స్కూటీపై ఎక్కించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చిన ఘటన కనిగిరి మండలం నడింపల్లిలో ఆదివారం జరిగింది. నడింపల్లిలో గర్భిణి అయిన బి.ఏసమ్మకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక అంగన్వాడీ కార్యకర్త అయిన కొండమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె 108 వాహనానికి కాల్ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న రెండు 108 వాహనాల్లో ఒక వాహనం టైరు పంక్చరై ఉండగా, మరొక వాహనంలో ఒక గర్భిణిని తీసుకుని ఒంగోలు తరలిస్తున్నారని, రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. చదవండి: సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని.. లాక్డౌన్ కావడంతో ఇతర వాహనాలు కూడా అందుబాటులో లేవు. ఈక్రమంలో ఏసమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో దివ్యాంగురాలైన అంగన్వాడీ కార్యకర్త తన ట్రై సైకిల్ స్కూటీపై ఆమెను ఎక్కించుకుని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ పరీక్షించిన వైద్యులు లోపల బిడ్డ పరిస్థితి బాగా లేదని ఒంగోలు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. ఏసమ్మకు సాధారణ ప్రసవం జరిగి తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సీడీపీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త చేసిన కృషిని, సేవను గుర్తించిన ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్తులు అభినందించారు. చదవండి: లంకె బిందెల పేరుతో లైంగిక దాడి -
ఎవరండీ ఇంట్లో?
ముఖాన్నే తలుపులు వేయిస్తున్న ప్రశ్న. ప్యాడ్‌ను లాక్కునేలా చేస్తున్న ప్రశ్న. పేపర్‌ను చింపేయిస్తున్న ప్రశ్న. అన్ని ప్రశ్నలకూ సమాధానం.. మళ్లీ అదే ప్రశ్న! ‘ఎవరండీ ఇంట్లో..?’ విమలమ్మ కరోనా సర్వే వర్కర్. విరిగిన కాలితోనే డ్యూటీ చేస్తోంది. కోపాలను తగ్గించి వివరాలను కనుక్కోలేదా? విమల కుమారి అంగన్వాడి వర్కర్. ఇంటింటికి వెళ్లి కరోనాను పోలిన వ్యాధి లక్షణాలు ఉన్న వారి లెక్కలు సేకరించమని బిహార్ ప్రభుత్వం నియమించిన ఆశా, అంగన్వాడి వర్కర్లలో ఆమె ఒకరు. ఏప్రిల్ 16 నుంచి మే 3 వరకు ఆమె 380 ఇళ్లను సర్వే చేశారు. పాట్నాలోని బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పాట్నా విద్యుత్ సరఫరా కార్యాలయాలకు ఆనుకుని ఉండే మురికివాడల్లోని ఇళ్లు అవన్నీ. చేతిలో ప్యాడు, పెన్నుతోపాటు ఒక చేతికర్ర సహాయంతో ఆమె ఆ ఇళ్లన్నీ తిరిగి వివరాలు రాసుకున్నారు. సర్వేకోసం వెళ్లినప్పుడే రోడ్డుమీద నీళ్ల గుంటలో పడి ఆమె కాలు విరిగింది. నడవలేక చేతి కర్రను తెచ్చుకుంటున్నారు. నడవలేక సెలవు పెట్టవచ్చు. అందుకు ఆమె ఇష్టపడలేదు. శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి రేణుకుమారి సెలవు మంజూరు చేశారు. విమల వినలేదు. పాట్నా జిల్లా ఐసిడిఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) అధికారి భారతి ప్రియంవద కూడా పిలిపించి చెప్పారు. సెలవు అవసరం లేదనే అన్నారు విమల! పాట్నా జిల్లా జడ్డి కుమార్ రవి సోమవారం తన ట్విట్టర్లో విమల ఫొటోను షేర్ చేశారు. ‘ఈ మహిళ గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. ఈమె పేరు విమల కుమారి. అంగన్వాడి కార్యకర్త. కాలు విరిగినప్పటికీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాట్నా పట్టణంలో తనకు కేటాయించిన ప్రాంతాల ఇళ్లను సర్వే చేస్తూనే ఉన్నారని నాకు ఐసిడిఎస్ టీమ్‌ల ద్వారా తెలిసింది. అంకితభావం, పనిలో నిబద్ధత ఈ మహిళలో మనం చూడొచ్చు’ అని రాశారు. ఎరుపంచు తెల్లచీరలో.. తలకు హెయిర్ నెట్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లవుజులు, చేతిలో సర్వే ప్రశ్నావళి కాగితాలు పట్టుకుని, కట్టుకట్టిన కాలితో.. జిల్లా జడ్జి అన్నట్లే అంకితభావానికి ఒక ఆకృతిలా ఉన్నారు ఆ ఫొటోలో విమల కుమారి. విమల వయసు 46 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. 23 ఏళ్ల కూతురు, ఇద్దరు కొడుకులు. 22 ఏళ్లు, 18 ఏళ్లు. పిల్లలంతా చదువుల్లో ఉన్నారు. ఈ కుటుంబం ఉంటున్నది కూడా మురికివాడలోనే. పాట్నా పట్టణంలోని లలిత్ భవన్ సమీపంలో. ఒక గది ఉన్న చెక్కల ఇల్లు. భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. అంగన్వాడి వర్కర్‌గా ఇప్పుడు ఆమె జీతం రూ.5,650. ఆమె పని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా చూడటం. ప్రస్తుతం సర్వే డ్యూటీలో ఉన్నారు. మార్చి నెలాఖరులో విమల కాలు విరిగింది. అప్పటికి ఆమె తొలి విడత సర్వే పనుల్లో ఉన్నారు. ఎవరింట్లోనైనా శ్వాసకోశ ఇబ్బందులు, ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలు ఉన్నాయేమో తెలుసుకుని ఆ వివరాలు నోట్ చేసుకుని వెంటనే ఆరోగ్య అధికారులకు చేరవేయడం ఆమె బాధ్యత. ఇంట్లోంచి ఉదయాన్నే 8 గంటలకు డ్యూటీకి బయల్దేరుతారు. ఆమెకు సహాయంగా నర్సింగ్ మిడ్వైఫ్ ఒకరు ఉంటారు. మధ్యాహ్నానికల్లా కనీసం 25 ఇళ్లలోని వివరాలు సేకరిస్తారు. అక్కడితో ఆ రోజుకు సర్వే పని పూర్తవుతుంది. మధ్యాహ్నం నుంచి ఐసిసిఎస్ పరిధిలోని ఇతరత్రా విధులు ఉంటాయి. సెలవే పెట్టని ఇంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదని విమల గురించి భారతి ప్రియంవద అంటారు! ‘కఠిన పరిస్థితుల్లో విమల మరింత ప్రశాంతంగా నెగ్గుకొస్తుంది. సర్వేకి వచ్చిన అంగన్వాడి వర్కర్లు ముఖాల మీదే తలుపులు వేసేవారు. చేతిలోని పెన్ను, పేపర్ లాక్కొని వెళ్లగొట్టేవారు కూడా ఉంటారు. అయితే విమల అలాంటి వాళ్లను కూడా సౌమ్య పరిచి వివరాలు రాబడుతుంది’’ అని రేణుకుమారి చెబుతారు. అయితే విమల అనే మాట వేరే. ‘‘నేను సెలవు పెడితే.. ఏ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో తెలుసుకోలేను. అందువల్ల వాళ్లకు అవసరమైన తక్షణ వైద్య సహాయం అందకుండా పోతుంది’’ అంటారు. ప్రస్తుతం మూడోవిడత సర్వే పనిలో ఉన్నారు విమల. మొదట పాట్నా సహా నాలుగు జిల్లాలకు మాత్రమే సర్వేను పరిమితం చేసిన బిహార్ ప్రభుత్వం ఇప్పుడు మిగతా ముప్పై నాలుగు జిల్లాలలో కూడా సర్వేను ప్రారంభించింది. బిహార్‌లో ఇప్పటి వరకు 550 కోవిద్ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు చనిపోయారు. విమల వంటి విధి నిర్వహణ యోధుల తోడ్పాటు ఈ కరోనా సమయంలో ప్రతి చోటా అవసరం. -
సక్రూభాయికి అరుదైన గౌరవం..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త సక్రూబాయ్ సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దివ్యాంగురాలైనా కూడా కరోనా వైరస్‌కు భయపడకుండా ఇంటింటికీ వెళ్లి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆమెను కొనియాడింది. ఈ మేరకు ఆమెకు లేఖ రాసింది. దీనిపై సక్రూబాయ్ సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వైకల్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. ఆ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు కార్యకర్తల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే ఏర్పాట్లు చేసింది. ► ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఈపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కార్యకర్త తన పరిధిలోని అందరికీ మూడుసార్లు రేషన్‌ను సరఫరా చేసింది. ► ఆమె దివ్యాంగురాలైనా ట్రై సైకిల్ సాయంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రేషన్ పంపిణీ చేసింది. ► ఈ సమాచారం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమెను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాఖకు లేఖ రాసింది. ► దివ్యాంగురాలైనా రేషన్ పంపిణీలో ఆమె తన చిత్తశుద్ధి చాటుకున్నారని లేఖలో అభినందించింది. ► సక్రూభాయిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సకల ఉద్యోగుల సంఘం మరో ప్రకటనలో అభినందించింది. ► రాష్ట్రంలోని 6.20 లక్షల గర్భిణులకు, బాలింతలకు, 22 లక్షల మంది పిల్లలకు (ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు) మూడుసార్లు రేషన్ పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. మరింతగా సేవలందిస్తా.. కేంద్ర ప్రభుత్వం నేను చేస్తున్న సేవలను గుర్తించటం చాలా సంతోషంగా ఉంది. 2002లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నా. ఈ రోజు నాకు వచ్చిన గుర్తింపుతో పడ్డ కష్టమంతా మరచిపోయా. మా ఉన్నతాధికారులు, తోటి కార్యకర్తలు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహంతో మరింతగా పనిచేస్తాను. –కె.సక్రూభాయి, అంగన్వాడీ కార్యకర్త, మన్నేపల్లి, బొల్లాపల్లి మండలం, గుంటూరు జిల్లా -
ఆయా కాదు.. అమ్మే
నంద్యాల: పురిటినొప్పులు పడుతున్న ఓ మహిళకు అంగన్వాడీ ఆయా అమ్మలా అండగా నిలిచింది. ఆసుపత్రికి తీసుకెళ్లి కాన్పు చేయించడమే కాకుండా మూడు రోజుల పాటు ఆమె వద్దే ఉండి సపర్యలు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. నంద్యాల షరాఫ్ బజార్లో నివసించే దివ్యభారతికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో భర్త కర్నూలులో ఉన్న ఆమె తల్లికి సమాచారమిచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఆమె నంద్యాలకు రాలేకపోయింది. ఈ విషయాన్ని స్థానిక అంగన్వాడీ ఆయా చెన్నమ్మకు చెప్పి సాయం కోరడంతో ఆమె తెలిసిన వారి ఆటోలో దివ్యభారతిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. తనే దగ్గరుండి సాయం చేసింది. దివ్యభారతి శనివారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. నంద్యాలలోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ చెన్నమ్మ ఆదివారం వరకూ ఆస్పత్రిలోనే ఉండి దివ్యభారతికి సాయం చేసిన విషయం ఐసీడీఎస్ పీడీ భాగ్యరేఖ ద్వారా కలెక్టర్ వీరపాండియన్‌కు తెలిసింది. దీంతో ఆయన చెన్నమ్మను అభినందించి.. రూ.20 వేల నగదు బహుమతి ప్రకటించారు. ఏటా కుటుంబంతో కలిసి ఈస్టర్ పండుగ ఘనంగా జరుపుకుంటామని, అయితే సాటి మహిళ ఇబ్బందుల్లో ఉండటంతో పండుగను పక్కన పెట్టి సాయం చేశానని ఆయా చెన్నమ్మ తెలిపింది. కరోనా పేరు వింటేనే భయపడుతున్న ఈ సమయంలో మూడు రోజులు తనవద్ద ఉండి అమ్మలా సేవ చేసిన చెన్నమ్మను ఎన్నటికీ మరచిపోలేనని దివ్యభారతి పేర్కొంది. -
‘ఏపీలో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీ’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1665 అంగన్వాడీ వర్కర్లు, 3347 అంగన్వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. (జేసీ ట్రావెల్స్ రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు) కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 1 నుంచి అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచిందిని మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు. ఐసీడీఎస్-సీఏఎస్ వినియోగించే అంగన్వాడీ వర్కర్లకు పోషణ్ అభియాన్ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు ఇవి కాకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. (అధిక బరువుతో బాధపడుతున్నారా..) అదే విధంగా 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు, పనితీరును గుర్తిస్తూ వారికి ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రూ.50 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రాష్ట్ర స్థాయిలో 10 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీలకు ఏడాదికి 400 రూపాయల విలువైన చీర కలిగిన రెండు యూనిఫారాలు, 18-50 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వర్కర్లు, హెల్పర్లకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద జీవిత బీమా, 51 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్ర అనారోగ్య బారిన పడినట్లుగా గుర్తించిన అంగన్వాడీలకు 20 వేల రూపాయల వరకు చికిత్స ఖర్చులు, 9 నుంచి 12వ తరగతి చుదువుతున్న అంగన్వాడీల సంతానానికి స్కాలర్షిప్లు, సూపర్వైజర్ల నియామకంలో వారికి 50 శాతం రిజర్వేషన్ వంటి పలు సౌకర్యాలను అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు.(‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’) చదవండి: ‘కడపలో బ్యాంక్ శాఖలను తగ్గించలేదు’ -
‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ ఉద్యోగులు’
సాక్షి, విజయనగరం: అవినీతికి పాల్పపడిన ఐసీడీఎస్ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డ ఘటన విజయనగరం జిల్లాలో చేటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో శిశు సంక్షేమశాఖ సీడీపీఓ మణమ్మ, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలు.. అంగన్వాడి సెంటర్లకు కిరాణా సరుకులు సరఫరా చేసే అడ్డూరి సురేష్ వద్ద నుంచి ఈ ఇద్దరు ఉద్యోగులు రూ.85 వేలు లంచం తీసుకుంటున్నారు. అదే సమయంలో దాడి చేసిన అధికారులు వారిని పట్టుకున్నారు. నవంబర్ నెల సరుకులు సరఫరాకి బిల్స్ చేసేందుకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ మణమ్మ రూ.85 వేలు అడ్డూరి సురేష్ వద్ద లంచం అడిగినట్లు తెలుస్తోంది. -
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రోత్సాహం
సాక్షి, వాకాడు: చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అదనపు ప్రోత్సాహం అందిస్తోంది. సాధారణగా కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబోధనతో పాటు కోడిగుడ్లు, పాలు, తదితర పౌష్టికాహారం అందిస్తోంది. అలాగే బాలింతలు, గర్భిణులకు బాల సంజీవని పేరుతో ఎండు ఖర్జూరం, వేరుశనగ అచ్చులు, రాగిపిండి, బెల్లం వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తోంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన ఏడు నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు బాలామృతం ప్యాకెట్లు అందజేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువమంది వీటిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో అంగనవాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రోత్సాహకాలను ప్రకటించింది. తద్వారా వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసిన వారికి అధనపు నిధులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలతో పాటు, సిబ్బందికి వేతనాలు పెంచి ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సక్రమంగా అందేలా కేంద్రాల నిర్వహణలో కార్యకర్తలు, సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు క్షేత్రస్థాయిలో అందడానికి వారి సహకారం ఎంతో అవసరం. అందుకే వీరి ద్వారా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహన కల్పించి కేంద్రాలను సమర్థవంతంగా నడిపేందుకు కార్యకర్తలకు ట్యాబ్‌లు అందించి నగదు ప్రోత్సాహాలను ప్రవేశ పెట్టింది. కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వివరాలు మండలం అంగన్వాడీ కేంద్రాలు కార్యకర్తలు చిన్నారులు బాలింతలు గర్భిణులు వాకాడు 71 71 2371 316 296 కోట 76 76 2784 367 457 చిట్టమూరు 78 77 2521 307 373 కార్యకర్తలు వారి పరిధిలోని లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించి వారిని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావాలి. అందుకు ప్రతిఫలంగా పోషక అభియాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సాయం అందిస్తోంది. వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసిన కార్యకర్తలకు ప్రతినెలా రూ.500 చొప్పున ఇస్తున్నారు. నెలలో అంగనవాడీ కేంద్రాలను 21 రోజుల పాటు తెరిచి శుభ్రంగా ఉంచడంతో పాటు చిన్నారులను సమయానికి ఇంటి నుంచి తీసుకొచ్చి, తిరిగి ఇంటివద్ద వదిలిపెట్టిన ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనంతో పాటు అదనంగా నెలకు రూ.250 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలున్నాయి. అందులో 225 కేంద్రాలకు గాను 224 మంది కార్యకర్తలు ఉన్నారు. వీరిలో ప్రారంభంలో 50 నుంచి 60 మంది కార్యకర్తలు నూరు శాతం లక్ష్యాలను సాధించి ఈ పథకం ద్వారా అందించే అదనపు ప్రోత్సాహకానికి ఎంపికైనట్టు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ప్రతినెల ఈ సంఖ్య పెరుగుతూ జూలై నెలకు 180 మందికి పైగా పోషణ అభియాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అర్హులైన వారందరికీ ఈ నెలలోనే ప్రోత్సాహకాన్ని జమచేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు మెరుగు పడడంతో పాటు అర్హులకు పౌష్టికాహారం సక్రమంగా చేరుతున్నట్లు వారు వెల్లడించారు. -
‘ఆశా’ల వేతనాలపై.. కావాలనే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ఆశా వర్కర్ల వేతనాల విషయంలో కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. గౌరవ వేతనాల కోసం గతంలో వీరు, అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తే లాఠీచార్జి చేయించి, గుర్రాలతో తొక్కించిన వాళ్లు ఇప్పుడు ఆశా వర్కర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయనన్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి కాగానే ఆ హామీని నెరవేరుస్తూ.. వారు రూ.6 వేలు గౌరవ వేతనం అడిగితే రూ.10 వేలు ఇచ్చారని, ఇది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ నేతలు ఆశా వర్కర్ల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్‌లు పెట్టలేదని, కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రెచ్చగొట్టి వారితో ధర్నా చేయించారని, ఇది ఆశా అక్కచెల్లెమ్మలు గుర్తించాలని మంత్రి అన్నారు. 2014 ఎన్నికల సమయంలో గౌరవ వేతనం ఇస్తామని మభ్యపెట్టిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నరేళ్లపాటు వారిని ఆయన పట్టించుకోలేదని, ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.3వేలు ఇస్తూ జీవో ఇచ్చి అవి కూడా సకాలంలో ఇవ్వలేకపోయారని, ఇదీ చంద్రబాబు నైజమన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పెంచిన వేతనాలు కాగా, పెంచిన వేతనాలను తాము ఆగస్టు నుంచి అమలుచేస్తూ సెప్టెంబరు 1 నుంచి ఇస్తున్నామని, పాత బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి నాని భరోసా ఇచ్చారు. గ్రేడింగుల గురించి ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దని, ప్రభుత్వోద్యోగులందరికీ ఉన్నట్టే జాబ్‌చార్ట్ ఉంటుంది తప్ప మరోటి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నేతలు రెచ్చగొడుతూ ఉంటారని.. ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న దుగ్ధతోనే ఇలా చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి మాట ఇస్తే జగన్మోహన్రెడ్డి వెనక్కు తగ్గరని, రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందాలన్నదే ఆయన అభిమతమని నాని చెప్పారు. -
నేను బతికే ఉన్నా..
సాక్షి, కొందుర్గు/ రంగారెడ్డి : అంగన్వాడీ టీచర్ బతికుండగానే మృతిచెందినట్లుగా గ్రామ ముఖ్య కూడలీలో గుర్తుతెలియని వ్యక్తులు బోర్డు తగిలించారు. ఈ సంఘటనతో కొందుర్గు మండలం బైరంపల్లి ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బైరంపల్లి అంగన్వాడీ టీచర్ వినోద పౌష్టికాహారం చెత్తకుప్పలో పడేసిందని ఈ నెల 16న గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్ విజయలక్ష్మి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి అంగన్వాడీ టీచర్ వినోదకు మెమో జారీ చేశారు. కాగా, ఆదివారం ఉదయం బైరంపల్లి బస్టాండ్ వద్ద అంగన్వాడీ టీచర్ వినోద మృతిచెందిందని బోర్డు తగిలించారు. ఇది చూసిన గ్రామస్తులంతా మనస్తాపంతో చనిపోయిందేమోనని అనుకున్నారు. తోటి అంగన్వాడీ టీచర్ల ఫోన్‌తో విషయం తెలుసుకున్న వినోద కొందుర్గు పోలీసులను ఆశ్రయించింది. తానే బతికే ఉన్నానని, కావాలనే కొందరు చనిపోయినట్లుగా గ్రామ కూడలిలో బోర్డు ఏర్పాటు చేశారని బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు ధర్నా.. అంగన్వాడీ టీచర్ వినోదను ఉద్దేశపూర్వకంగా హింసిస్తున్నారని, బతికుండగానే చనిపోయినట్లు రాయడం బాధాకరమని కొందుర్గు, జిల్లేడ్‌చౌదరిగూడ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు.ఈ సందర్భంగా బైరంపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి దుండగులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
బాలయ్య అడ్డాలో అవినీతి మరక
ఆడపడచులను.. అక్కచెళ్లెమ్మలను తెలుగు తమ్ముళ్లు దగా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ తామై నడిపిస్తూ.. తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా చెలామణి అవడమే కాక.. ఏకంగా అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. మూడు లక్షల వరకూ అక్రమంగా వసూలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నియామక పత్రాలు నేటికీ అందకపోవడంతో టీడీపీ నేతలను నమ్మి డబ్బు ముట్టజెప్పిన మహిళలు లబోదిబో మంటున్నారు. ఈ పరిస్థితి మరెక్కడో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనిదే. వివరాల్లోకి వెళితే.. సాక్షి, హిందూపురం సెంట్రల్: సార్వత్రిక ఎన్నికలకు ముందు అంగన్వాడీ పోస్టుల భర్తీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూపురం డివిజన్లో 49 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 15 సహాయక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అంగన్వాడీ పోస్టుల భర్తీ స్థానిక టీడీపీ నేతలకు కాసుల వర్షమే కురిపించింది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని స్థానికేతరులకు కూడా పోస్టు కచ్చితంగా వస్తుందని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల మొదలు రూ. 3 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు వసూలు చేసుకున్నారు. బాధితుల్లో ఆందోళన నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నియామకాలు పారదర్శకంగా జరిపితే తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన వారి ఆశలపై అప్పట్లో టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. రూ. లక్షల్లో డబ్బు వసూలు చేసుకుని పోస్టింగ్ ఆర్డర్లు ఇప్పించకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోస్టుల భర్తీని వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టనుండడంతో తమకు పోస్టులు వస్తాయో రావో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. పోస్టులు రాకపోతే తాము ఇచ్చిన డబ్బును టీడీపీ నేతలు వెనక్కు ఇస్తారో ఇవ్వరోననే భయం కూడా వారిని వెన్నాడుతోంది. స్వీయ రక్షణలో టీడీపీ నేతలు అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నుంచి రూ. లక్షల్లో దండుకున్న టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. విషయాన్ని కాస్త ఎమ్మెల్యే బాలయ్య దృష్టికెళితే... తమకు ఇబ్బందులు తప్పవని భావించి స్వీయరక్షణలో పడ్డారు. ఇందులో తమ అక్రమ వసూళ్లను కప్పిపుచ్చుతూ టీడీపీని నమ్ముకున్నవారికి పోస్టులు ఎలాగైనా ఇప్పించాలంటూ బాలయ్యను వారు ప్రాధేయపడినట్లు సమాచారం. కాగా, అంగన్వాడీ పోస్టుల భర్తీ విషయంగా చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ నాయకులు భగ్గుమంటున్నారు. అప్పటి నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, నియామకాలను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. డబ్బు వసూళ్ల అంశం మా పరిధిలోది కాదు హిందూపురం డివిజన్లో 49 అంగన్వాడీ టీచర్లు , 15 సహాయకులు ఖాళీలు ఉండేవి. ఈ పోస్టుల భర్తీకి గత టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వెంటనే అభ్యర్థుల నుంచి నిర్ణీత తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించాం. అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాను కలెక్టర్ కార్యాలయానికి పంపించాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. స్థానికేతరులు దరఖాస్తు చేసుకున్నారన్నది అవాస్తవం. ఇక పోస్టు కోసం నాయకులకు డబ్బు చెల్లించారనేది మా పరిధిలో లేని అంశం. నిబంధనల మేరకే పోస్టుల భర్తీ ఉంటుంది. – నాగమల్లీశ్వరి, సీడీపీఓ, హిందూపురం -
నారాజ్ చేయొద్దు
రైతు: రాజు, ఏదులాపూర్, శివ్వంపేట మండలం 139/2 సర్వే నంబర్లో 26. 1/2 (ఇరువై ఆరున్నర గుంటల) భూమి కుమారి సులోచనపై రిజిస్ట్రేషన్ చేయించాము. కాని కొత్త పాస్‌బుక్‌లో 20.1/2(ఇరవైన్నర) గుంటల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామశివారులోని ముత్తయ్య చెరువు కాలువను దాడ్వాయి అశోక్ అనే వ్యక్తి పూడ్చేశారు. ఈ విషయంపై ముత్యాలు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: పాత రికార్డుల ప్రకారం ఎంత ఉంటే అంతా సర్వే చేయిస్తాము. ముతయ్య చెరువు కాలువ పూడ్చివేత పై చర్యలు తీసుకుంటాను. సాక్షి మెదక్/మెదక్ రూరల్: సాధాబైనామాలో భూమి తగ్గింది రైతు: రెడ్డిగారి వీరమణి, యెనగండ్ల గ్రామం, కొల్చారం మండలం కొల్చారం మండలం యెనగండ్ల గ్రామశివారులో గల 62 సర్వే నంబర్లో 2.4 ఎకరాల పట్టా భూమి ఉండగా, సాధాబైనామా తర్వాత అందులో 12 గుంటల భూమి తగ్గించి మంగళి ఆగమయ్య పేరిట నమోదు చేశారు. సంబంధిత తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. జేసీ: మీ సమస్య గురించి సంబంధిత తహసీల్దార్‌తో మాట్లాడి పరిష్కరిస్తాను. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు రైతు: నర్సయ్య, నిజాంపేట మండలం, నస్కల్ గ్రామం గ్రామ శివారులో గల 229/అ సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి ఇచ్చారు. అందులో తమకు ఇచ్చిన 1.15 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేశారు. అధికారులను పొజిషన్ చూపించాలని కోరితే పట్టించుకోవడం లేదు. జేసీ: సర్వేయర్‌ను పంపించి సమస్యను పరిష్కరిస్తాము. ఐదు గుంటలు తక్కువ నమోదు చేశారు రైతు: లక్ష్మీనర్సయ్య, నిజాంపేట మండలం, కె. వెంకటాపూర్ గ్రామం గ్రామ శివారులోని 315, 316, 317 సర్వే నంబర్లలో మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. కాని కొత్త పాస్‌బుక్‌లో 5 గుంటల భూమిని తగ్గించి నమోదు చేశారు. జేసీ: సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు చెప్పి న్యాబద్ధమైనదైతే సరిచేస్తాము. పాస్‌బుక్కులు ఇవ్వలేదు రైతు: నర్సింలు, రామాయంపేట రామాయంపేట శివారులోని 1421 సర్వే నంబర్లో గల లవాణీ పట్టా భూమికి సంబంధించి 15 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చి పాస్‌బుక్కులను ఇవ్వలేదు. జేసీ: ఆ భూమిలో ఏం పంటలు సాగు చేస్తున్నారు. సర్వేయర్‌ను పంపించి వారం రోజుల్లోగా పాస్‌బుక్కులను ఇప్పిస్తాము. మా భూమిని కబ్జా చేశారు రైతు: నర్సింలు, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలం గ్రామ శివారులోని 234 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూమికి సంబంధించి 1977లో తాత పేరిట సర్టిఫికెట్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాము. ప్రస్తుతం తమ భూమిని పక్క పొలం వ్యక్తి కబ్జా చేశాడు. జేసీ: మూడేళ్లకు మించి ఆ భూమిలో పొజిషన్లో లేకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. భూమిని సాగు చేస్తున్న వాళ్లకే వర్తిస్తుంది. భూ సమస్యను పరిష్కరించండి రైతు: సూర్యం చౌహాన్, బిక్యాతండా, శివ్వంపేట మండలం పంచాయతీ పరిధిలో గల 315, 316 సర్వే నంబర్లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి రైతులకు పాస్‌బుక్కులు అందించగలరు. జేసీ: భూమి ఉన్నదాని కంటే ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు గెజిట్ పబ్లికేషన్ తీసుకొచ్చి హద్దులు వేశారు. సమస్య ఉన్నందున ఆ భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. సర్వే చేయించి సమస్య పరిష్కరించి పాస్‌బుక్‌లను అందిస్తాము. లవాణీ పట్టా కొనుగోలు చేశాం రైతు: నర్సింగ్, చిన్నచింతకుంట గ్రామం, నర్సాపూర్ గ్రామ శివారులోని 918 సర్వే నంబర్లో లవాణీ పట్టాను కొనుగోలు చేశాము. పట్టా చేయడం లేదు. జేసీ: హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం పట్టా కాదు. పాస్‌బుక్ ఇప్పించండి రైతు: సిద్ధయ్య, వడియారం గ్రామం, చేగుంట మండలం సర్వే నంబర్ 642లో గల 32 గుంటల ఇనాం భూమికి సంబంధించి పాస్‌బుక్ రాలేదు. జేసీ: ఓఆర్సీ ఇప్పించి 10 రోజుల్లో పాస్‌బుక్‌లను అందిస్తాము. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారు రైతు: వహీబ్ఖాన్, నర్సాపూర్ సర్వే నంబర్ 17/12లో గల లవాణీ పట్టా భూమిని 1989లో తీసుకున్నాము. కాని అదే భూమిని 2006లో ఇతరులకు విక్రయించారు. ఇలా ముగ్గురి పేర్లమీద ఉంది. జేసీ: ఆ భూమిని ఎవరూ కొనడానికి వీలులేదు. అందులో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాము. భూమిని మ్యూటేషన్ చేస్తలేరు రైతు: శ్రీనివాస్, రాజ్‌పల్లి, మెదక్ మండలం సర్వే నంబర్ 427/అ 2లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాము. కాని మోటేషన్ చేయమంటే సంబంధిత వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము. అధికారులు పట్టించుకోవడం లేదు రైతు: విభూది రాచప్ప, దొంతి గ్రామం, శివ్వంపేట మండలంతల్లి ఎల్లమ్మ పేరిట ఉన్న 8గుంటల పట్టా భూమిని పౌతి చేయమంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకుంటాను. నా భూమి వేరే వ్యక్తి పేరిట నమోదైంది రైతు: నారాయణ, శివాయిపల్లి, మెదక్ మండలం 43/ఇ2 సర్వేనంబర్‌లో గల 13 గుంటల బారాణ భూమిని నా పేరుతో ఉన్న మరో వ్యక్తి అయిన నారాయణ పేరిట నమోదయ్యింది. మా పేర్ల పక్కన తండ్రి పేరును గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కరించాలని వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ తిరిగినా పట్టించుకోవడవం లేదు. జేసీ: వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. పాస్‌బుక్కులు ఇవ్వలేదు రైతు: బిక్షపతి, రాయిలాపూర్, కౌడిపల్లి మండలం 394, 387 సర్వే నంబర్లో ఉన్న రైతులకు ఎవరికి పాస్‌బుక్కులు రాలేవు. దీంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. జేసీ: వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తాను. ఇద్దరికి చెందాల్సిన భూమిని ఒక్కరికే ఇచ్చారు రైతు: శంకరయ్య, ఎల్లుపల్లి, టేక్మాల్ మండలం 141 సర్వే నంబర్లో గల 21 గుంటల భూమి శంకరయ్య, సుధాకర్ల పేరు మీద ఉంది. కాగా సాధా బైనామాలో ఇద్దరికి చెందిన భూమిని సుధాకర్ ఒక్కిరి పేరిట రాసారు. జేసీ: ఆర్డీఓకు ఆర్ఓఆర్ అప్పీల్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పాస్‌బుక్ రాలేదు రైతు: విజయ్‌కుమార్, కోనాపూర్ గ్రామం, రామాయంపేట433/202 సర్వే నంబర్లో గల ఎకరం లవాణీ పట్టా భూమికి సంబంధించి పాస్‌బుక్ రాలేదు. జేసీ: పార్ట్ బీలో ఉన్నందు వల్ల పాస్‌బుక్ రాకుండవచ్చు. సర్వేచేయిస్తాను. రిజిస్ట్రేషన్ చేసినా బుక్‌లో నమోదు చేస్తలేరు రైతు: కుమ్మరి మల్లేషం, శెట్టిపల్లి గ్రామం, వెల్ధుర్తి మండలం గ్రామ శివారులో 38 సర్వే నంబర్లో 14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి 2006 రిజిస్ట్రేషన్ చేయించాము. కాని బుక్‌లో నమోదు చేయడం లేదు. అలాగే 289, 38 సర్వే నంబర్లలో ఉన్న భూమిలో 15 గుంటల భూమి తక్కువ వస్తుంది. సంబంధిత ఎమ్మార్వో, వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: మీసేవలో పెట్టిన దరఖాస్తు ఉందా. మీసేవలో రూ.145 చెల్లించి నమోదు చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీసేవ రశీదును వాట్సప్‌కు పెట్టండి. కొన్న భూమిని కోల్పోవాల్సి వస్తుంది రైతు: రఘుపతి, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలంగ్రామ శివారులోని 260 సర్వే నంబర్లో గల 35 గుంటల పట్టా భూమిని మా తండ్రి లక్ష్మీనారాయణ పేరిట కొనుగోలు చేశాము. కాని 266 సర్వే నంబర్లో ఉందంటున్నారు. కాగా 260 సర్వే నంబర్లో గల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. సమస్యను పరిష్కరించండి. జేసీ: రికార్డు ప్రకారం సర్వే నంబర్లో ఉన్న భూమిపై హక్కు ఉంటుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. లేకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. బీఈడీ ఎంట్రెన్స్‌లో నిజాంపేట వాసికి 13వ ర్యాంక్ నిజాంపేట(మెదక్): నిజాంపేట గ్రామానికి చెందిన యువకుడు బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షలో సాంఘీకశాస్త్ర్రంలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు నిజాంపేట గ్రామానికి చెందిన వోగుల సురేష్ గత నెల 31న జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ ర్యాంక్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు పెద్దశంకరంపేట(మెదక్): వర్షాలు సమృద్ధిగా కురియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖర్శర్మ హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కేవీపీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక నర్సాపూర్: కుల వివక్ష వ్యతిరేఖ పోరాట సమితి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నర్సాపూర్‌లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహా సభల్లో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తుకారం, నాగరాజులు ఎన్నికయ్యారు. తమతో పాటు 19 మందితో కూడిన జిల్లా కమిటీని ఎంపిక చేశారని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి మనోహరబాద్(తుప్రాన్): వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృచెందారు. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. కూచారం గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(35) తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్‌ను పక్కకు పెట్టడానికి కింద నిలబడి స్టార్ట్ చేయగా గేర్‌లో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అతనిపైనుంచి వెళ్లింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీకొని.. కొనాయిపల్లి (పీటీ)గ్రామానికి చెందిన శెట్టి బాబు (28) తన బైక్‌పై పనినిమిత్తం రంగాయిపల్లి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ చేసినట్లు సీడీపీఓ సోమశేఖరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దశంకరంపేట అంగన్వాడీ టీచర్, గడిపెద్దాపూర్ తండా మినీ అంగన్వాడీ టీచర్, అల్లాదుర్గం మండలం గొల్లకుంట, రేగోడ్ మండలం కొండాపూర్, జంగంలోంక తండా, టేక్మాల్ మండలం పల్వంచ, పెద్దశంకరంపేట మండలం ఉతూలుర్ గ్రామల అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడమైందని, పోస్టులు పొందినవారు అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయంలో ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కావాలని ఆమె తెలిపారు. పోస్టుల లిస్టు కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. నాలుగు మండలాల్లో.. రామాయంపేట(మెదక్): స్థానిక ఐసీడీఎస్ పరిధిలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి మండలాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ఎంపిక కార్యక్రమం పూర్తయిందని స్థానిక ప్రాజెక్టు సీడీపీవో స్వరూప తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, మక్కరాజ్‌పేట, శంఖాపూర్, బోనాల గ్రామాల్లోని ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. మక్కరాజ్‌పేట, శంఖాపూర్, బోనాల, రామాయపల్లి సెంటర్లలో హెల్పర్లు, మినీ కేంద్రాలైన కోనాపూర్ పెద్ద తండా, చిన్నతండాలో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. ఎంపికైనవారి వివరాలు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, లిస్టు చూసుకోవాలని ఆమె సూచించారు. కాయిదంపల్లిలో పింఛన్ల పంపిణీ అల్లాదుర్గం(మెదక్): గురువారం సాక్షి దినపత్రికలో పింఛన్ పాట్లు అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. గ్రామాల్లో పింఛన్ ఇవ్వడం లేదని, పోస్టాఫీస్‌లో పింఛన్లు ఇవ్వడంతో గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పోస్టల్ సిబ్బంది శుక్రవారం కాయిదంపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల గ్రామాల్లోనే పింఛన్లు పంపిణీ చేయిస్తామని ఎంపీడీఓ విద్యాసాగర్ చెప్పారు. -
‘కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలి’
సాక్షి, విజయవాడ : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) నాయకులు మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచటం చాలా సంతోషమన్నారు. అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేయి రూపాయలు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం పెంచిన వేతనాలను రాష్ట్ర ఖజనాతో కలపకుండా నేరుగా వేతనాలతో జత చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేయాలని గఫూర్ డిమాండ్ చేశారు. కార్మిక శాఖను డీటీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ధార్మిక సంస్థలకు ఇవ్వటం సరి కాదన్నారు. -
ఎగ్ వెరీ స్మాల్..!
నల్లబెల్లి: అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెం టర్లను నిర్వహిస్తున్న విషయం విధితమే. కాని ఆశయం ఘనంగా ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది. ఏదో ఒక కొర్రీ చూపెట్టి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. బలహీనతను పోగొట్టే కోడిగుడ్ల సరఫరాలో సైతం అవినీతి జరుగుతుండడం అంగన్వాడీల పనితీరుకు నిదర్శనం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక తక్కువ పరిమాణం కలిగిన గుడ్లు కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నాడు. అంగన్వాడీ నిర్వాహకులు చిన్నసైజు గుడ్లను తిరస్కరిస్తే గుడ్లు సరఫరా చేసేవారు తీసుకుంటారా లేదా అని వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా లబ్ధిదారులు ఇంత చిన్న గుడ్డా అన్ని ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదని అంగన్వాడీ నిర్వాహకులు సమాధానమిస్తున్నట్లు సమాచారం. అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహరం నడుస్తుందని జిల్లా వ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో ఐసీడీఎస్ పరిదిలో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ప్రాజెక్టులో 908 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 832 మెయిన్, 76 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ప్రతి రోజు 17,338 మంది గర్భిణీలు, బాలింతలతో పాటుగా ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలు 54,296 మంది వచ్చి పౌషికాహారంతో పాటు భోజనం చేసి వెళుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి అందించాల్సిన గుడ్డు ఈ ప్రాజెక్టుల పరిధిలో నిర్ణీత పరిమాణానికి మించి తక్కువగా గుడ్లు సరఫరా అవుతున్నాయి. గుడ్డు మాయాజాలం గుడ్డు ఇస్తున్నారు కదా.. చిన్నదైతే నేమి అని అనుకోవచ్చు. జరిగే మాయాజలామంతా అందులోనే ఉంది. సాధారణంగా నిర్ణీత బరువు 50 గ్రాములున్న గుడ్లను పంపిణీ చేయాలి. ఫారం కోళ్లు పెట్టే గుడ్లు చాలా వరకు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. వీటిని సంబంధిత కాంట్రాక్టర్ చిన్న సైజు గుడ్లను ఏరిపించి అంగన్వాడీ కేంద్రాలకు చాలా వరకు చిన్న సైజు గుడ్లను పంపిణీ చేస్తున్నారు. నిర్ణీత బరువు కలిగిన గుడ్డు ధర నెక్ రేటుకు సరాసరి ధరతో పాటు రవాణా చార్జీలు అదనంగా చెల్లిస్తారు. పరిమాణం తక్కు వల్ల దాదాపు లక్షల్లో స్వార్థపరుల జేబుల్లోకి కమిషన్ రూపంలో చేరుతోంది. దీనికి తోడు 15 రోజుల సరుకు ముందుగానే నిర్వహకులకు ఇవ్వడంతో ముందుగానే కాంట్రాక్టర్ గుడ్లు అమ్ముకుంటున్నారు. ఇలా భారీగానే అవినీతి జరుగుతోందని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిర్వాహకుల తప్పే.. అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పంపిణీ విషయంలో మాకెలాంటి ఫిర్యాదులు అందలేదు. గుడ్ల విషయానికి వస్తే పరిమాణం తక్కువైనా, నలిగినా వాటిని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఇచ్చేయాలని అంగన్వాడీ నిర్వాహకులకు సూచించాం. తక్కువ పరిమాణం గల గుడ్లు తీసుకొంటే తప్పు నిర్వహకులదే. ఫిర్యాదులు వస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సరస్వతి, సూపర్వైజర్, పీడీ, నల్లబెల్లి సరఫరా జరిగేలా చూస్తా.. అంగన్వాడీ కేంద్రాలకు టెండర్ నిబంధనల మేరకు గుడ్లు సరఫరా జరిగేలా చూస్తాం. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా చిన్న సైజు గుడ్లు సరఫరా చేసినట్లు గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. చిన్న సైజు గుడ్ల సరఫరా జరిగితే సమస్యను అంగన్వాడీ టీచర్, లబ్ధిదారులు గుర్తించి ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకరావాలి. –సబిత, పీడీ, ఐసీడీఎస్, వరంగల్ రూరల్ -
వాళ్లు వంట చేస్తే మా పిల్లలు తినరు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం 21వ సెంచరీని దాటిపోతున్నా సమాజంలో దళితుల పట్ల వివక్ష ఇంకా వీడలేదు. ఇటీవల తమిళనాడులోని ఒక అంగన్వాడీ కేంద్రంలో దళితులు వండిన ఆహారాన్ని తమ పిల్లలు తినరని ఒక సామాజిక వర్గం ప్రకటించిన ఘటన గ్రామాల్లో నేటికీ కొనసాగుతున్న జాత్యాహంకారానికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్ గురువారం విచారణకు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వలయపట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి దళిత సామాజిక వర్గానికి చెందిన జ్యోతిలక్ష్మి నిర్వాహకురాలిగా, అన్నలక్ష్మి వంటమనిషిగా ఈ నెల 3న నియమితులయ్యారు. ఈ నియామకాలను ఆ ప్రాంతంలోని మరో సామాజికవర్గానికి చెందిన వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. వారిని పట్టించుకోకుండా అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారాన్ని వండిపెట్టి కేంద్రం వద్ద ప్రతిరోజూ ఎదురుచూడసాగారు. అయితే దళిత మహిళల నియామకం పట్ల అభ్యంతరం లేవనెత్తిన సామాజికవర్గానికి చెందిన వారు తమ పిల్లలను కేంద్రానికి పంపేందుకు నిరాకరించారు. గ్రామస్తులు అదేపనిగా ఆందోళనలు సాగించడంతో ధనలక్ష్మి, అన్నలక్ష్మిలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. కాగా, మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడంతో బదిలీ అయిన ఇద్దరు దళిత మహిళలను తిరిగి అదే అంగన్వాడీ కేంద్రంలో అధికారులు నియమించారు. -
‘అంగన్వాడీ’ల బడిబాట
ఖమ్మంమయూరిసెంటర్: చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించనున్నారు. బాలబాలికలు, ఐదేళ్లలోపు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఐదేళ్లు దాటితే పాఠశాలల్లో ఉండాలనే నినాదంతో పట్టణాలు, గ్రామాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడిబాట నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో 11వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ప్రదర్శనలు నిర్వహించి.. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడేళ్లు వచ్చిన ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రంలో చేరాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని స్థానికులకు వివరించేలా అంగన్వాడీ టీచర్లను సన్నద్ధం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, పోషక పదార్థాల వివరాలు బడిబాటలో ప్రతి ఒక్కరికి వివరించనున్నారు. మంచి విద్యను అందించేందుకు.. అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్చేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహించాల ని ఇప్పటికే నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ–స్కూల్ కార్యక్రమంగా భావించేవారు. పాఠశాలకు వెళ్లడం చిన్నారులకు అలవాటు చేసేందుకు ఉపయోగపడగా.. మరోవైపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి.. వారితో ఆటలు ఆడించి.. పాఠశాల అంటే భయం పోగొట్టేందుకు పనిచేసేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం.. ఆట పాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. చిన్నారులకు వర్క్‌బుక్‌లను అందించి.. వారితో హోమ్ వర్క్ చేయించాలని నిర్ణయించారు. జిల్లాలో 7 ప్రాజెక్టుల కింద మొత్తం 1,896 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,605 మెయిన్ కేంద్రాలు కాగా.. 291 ఉప కేంద్రాలున్నాయి. వీటిలో చిన్నారులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఇలా.. బడిబాట సందర్భంగా ఏ రోజు.. ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారుల నుంచి వివరాలు వచ్చా యి. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవా రం గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందు లో అంగన్వాడీ టీచర్లతోపాటు ఆయాలు, స్వ యం సహాయక సంఘాలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే బడి మానేసిన ఆడపిల్లలను కూడా తిరిగి బడిలో చేర్పించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక ఈనెల 7, 8 తేదీల్లో ఇంటింటికీ తిరిగి రెండున్నరేళ్ల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్ల గురించి.. ప్రీ–స్కూల్ సిలబస్ గురించి, అక్కడ ఉండే టైమ్ టేబుల్, వర్క్ బుక్స్, పిల్లలకు ఇచ్చే యాక్టివిటీ బుక్స్, ప్రీ–స్కూల్ కిట్ మెటీరియల్ గురించి వివరిస్తారు. ఇక 10వ తేదీన అంగన్వాడీలో చేరిన పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యను అందించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులను ఆహ్వానిస్తారు. గ్రామ పెద్దలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి.. అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను ఎందుకు చేర్పించాలో వివరించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రీ–స్కూల్ మెటీరియల్‌ను బహిరంగంగా ప్రదర్శనలో ఉంచుతారు. ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలను గుర్తించి.. తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు. ఇక 11వ తేదీన స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రపరచడం, ఆవరణను శుభ్రం చేసి అనవసరంగా ఉన్న సామగ్రిని తొలగిస్తారు. ఆవరణలో మొక్కలు నాటుతారు. మంచినీటి సదుపాయం కల్పించడంతోపాటు టాయిలెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. దీంతో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ముగిసినట్లవుతుంది. ప్రతి వాడలో అంగన్వాడీ బడిబాట.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రతి వీధిలో, వాడలో అంగన్వాడీ బడిబాట నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులను పాల్గొనేలా చేసి.. వారికి ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించి, వాటిపై అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీల్లో ఐదేళ్ల వయసులోపు పిల్లలు ఎందుకు చేరాలనే ఆవశ్యకతను బాడిబాటలో వివరించనున్నాం. – ఆర్.వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరాలు
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆయన నియోజకవర్గంలోని అంగన్వాడీ వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. స్థానిక కేహెచ్‌ఎం స్ట్రీట్‌లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, తమ నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లలో 150 మందికి పైగా ముస్లింలు ఉన్నారని, జీతాలు ఇవ్వకుంటే మరో రెండు రోజుల్లో రానున్న రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. వీరంతా ఆనందంగా రంజాన్ జరుపుకోవడానికి తన సొంత నిధులతో వారికి ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే ప్రతి ఏడాది అంగన్వాడీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న కొత్త బట్టలు పంపిణీ చేస్తానని, ఈ సంవత్సరం జగన్ సీఎం అయ్యారు కనుక డిసెంబర్ వరకు ఆగకుండా మరో 15 రోజుల్లో బట్టల పంపిణీ చేస్తానని ఆయన అన్నారు. అంగన్వాడీ సిబ్బంది కుటుంబ ఆర్థిక భద్రత కోసం నియోజకవర్గంలోని 800 మంది వర్కర్లకు సొంత డబ్బుతో రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీని కడతానని చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు వరాలు ప్రకటించడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి రాచమల్లు రమాదేవి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
వేతనాలపై ఆశ నిరాశ
పాలకొండ రూరల్: గ్రామీణ ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు పడుతున్న వీరిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. టీడీపీ ప్రభుత్వం 2014 ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినా అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోగా గత కొద్ది నెలలుగా కనీస వేతనాలు అందకపోవటంతో వీరు ఆకలితో అల్లాడుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలల ముందు ‘ఆశా బాసట’ పేరిట ప్రభుత్వం చలో అమరావతి నిర్వహించి.. ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని చెప్పి జీవోలు విడుదల చేసింది. అయితే అవి అమలుకు నోచుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ క్షయ, కుష్టు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించడంతో ఆశాలు కీలక భూమిక పోషిస్తున్నారు. అలాగే 104 సిబ్బంది నిర్వహిస్తున్న శిబిరాల్లో కూడా వీరు విధులు చేపడుతున్నా తగిన గౌరవ పారితోషికం అందడం లేదు. విధి నిర్వహణకు అవసరమైన కనీస వసతులు, యూనిఫారాలు కూడా అందించకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. సీలింగ్ పేరిట అవస్థలు జిల్లావ్యాప్తంగా ఆశా వర్కర్లకు గతంలో రూ.5,600 పారితోషికం, రూ.3 వేలు గౌరవ వేతనం అందించేవారు. దీనిపై సీలింగ్ విధానం అమలు చేసి పారితోషికం వస్తే గౌరవ వేతనం, గౌరవ వేతనం వస్తే పారితోషికం బకాయి పెట్టారు. దీంతో భగ్గుమన్న ఆశాలు సీఐటీయూతో కలసి పోరుబాట పట్టారు. జీవో నెంబర్ 111ను రద్దు చేసి సీలింగ్‌ను ఎత్తివేయాలని, పారితోషికం, గౌరవ వేతనం రెండు కలసి రూ.8,600 అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం దిగివచ్చి జీవో నెంబర్ 111ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇతర జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్ల సేవలు అధికం. ఇక్కడ సీజనల్ జ్వరాలు, మలేరియా వంటివి ఎక్కువ. దీనికి తోడు ఎపిడమిక్ సీజన్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని ఆశా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇవీ ఆశా వర్కర్ల డిమాండ్లు 2019 జనవరి నుంచి గౌరవ వేతనం, పారితోషిక బకాయిలు వెంటనే చెల్లించాలి. రూ.8,600 పారితోషికం కాపీని పరిగణనలోకి తీసుకుని ఎటువంటి సీలింగ్ లేకుండా పారితోషికాలు ఇవ్వాలి. యూనిఫారాల బకాయిలు తక్షణమే చెల్లించాలి. టీబీ, 104 బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వ వెబ్సైట్లో ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడంపై అభ్యంతరం.. తొలగించాలని డిమాండ్ ఆశా వర్కర్లకు జాబ్ చార్టులు ఇవ్వాలి. ఇతర పనులు చేయించరాదు. ఆశా డే మినహా మిగిలిన రోజుల్లో పీహెచ్‌సీలకు పిలిచిన ప్రతి సందర్భంలో టీఏ, డీఏలు ఇవ్వాలి. అధికారుల వేధింపులు, అక్రమ తొలగింపులు అరికట్టాలి. వీటి సాధనకు ఈ నెలలో మరోసారి అన్ని పీహెచ్‌సీల్లో విధులు బహిష్కరించేందుకు ఆశా వర్కర్లు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భారమైన కుటుంబ పోషణ అసలే చాలీచాలని జీతాలు.. ఆపై ఐదు నెలలుగా బకాయిలు.. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. నిత్యం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాం. తాజాగా ఫొని తుపానులో సైతం విధులు నిర్వహించాం. అయినా కష్టానికి తగిన ఫలితం లేదు. –కె.గౌరీశ్వరి, ఆశా వర్కర్, పాలకొండ మండలం వేతనాలు వెంటనే చెల్లించాలి ప్రభుత్వం పేర్కొన్న మాదిరి సీలింగ్‌ను ఎత్తివేసి రూ.8,600 తక్షణమే చెల్లించాలి. చిరు ఉద్యోగులం. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే బతికేదెలా? కనీస అవసరాలకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. –పి.కన్యాకుమారి, ఆశా కార్యకర్త, పాలకొండ మండలం నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారు ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాదిరే ఉంది మాకిచ్చిన మాట కూడా. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి. –కె.శ్రీదేవి, ఆశా వర్కర్, పాలకొండ -
‘ఎగ్’ నామం..
సాక్షి, వరంగల్ రూరల్ : మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేది అంగన్వాడీ సెంటర్ల లక్ష్యం. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, బాలామృతం, ఆరోగ్యలక్ష్మి , హెల్త్ చెకప్ వంటి చాలా ప్రాజెక్టులు ఈ సెంటర్ల కిందికే వస్తాయి. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి చిన్నారులు పెద్దయ్యేవరకు వారి సంరక్షణ బాధ్యతలు అంగన్వాడీలదే. అలాంటి సెంటర్లు అబాసుపాలవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారింది. ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందించాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేస్తూ వస్తోంది. ' కాని అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. పౌష్టికాహారం మాట అటుంచితే నెలవారీగాసరఫరా చేసే గుడ్లు సక్రమంగా ఇవ్వకపోవడం గమనార్హం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో నెలలో 16 కోడి గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నాలుగు నెలల నుంచి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో బాలింతలు, గర్బిణీ స్త్రీలు, చిన్నారులకు కోడి గుడ్డు అందడం లేదు. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా కోడి గుడ్ల సరఫరా చేస్తారు. ప్రతి సంవత్సరం జిల్లా సంక్షేమ శాఖ కోడి గుడ్ల సరఫరాకు టెండర్లు ఆహ్వనిస్తారు. దక్కించుకున్న వారు కోడి గుడ్లను సరఫరా చేస్తుంటారు. నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గత నాలుగు నెలలుగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. గుడ్ల సరఫరా కావడం లేదని అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. గుడ్లు రావడంలేదని బాలింతలు, గర్భిణీలు అంగన్వాడీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో వారు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. వేగలేక ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. టెండర్ కొనసాగింపు అంగన్వాడీ కేంద్రాల్లో కోడి గుడ్ల సరఫరా కోసం ప్రతి ఏడు మార్చిలో టెండర్లను ఆహ్వానిస్తారు. కోడి గుడ్ల సరఫరాకు ఎవరు తక్కువ కోడ్ వేస్తే వారికి అప్పగిస్తారు. నెక్ ధర ప్రకారం కోడి గుడ్డుకు ధరను చెల్లిస్తారు. ప్రతి ఏడు ఏప్రిల్ 1 నుంచి టెండర్ ప్రారంభం అవుతుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో ఏప్రిల్, మే ఈ రెండు నెలలు టెండర్లను పొడిగించారు. 908 అంగన్వాడీలు.. జిల్లా వ్యాప్తంగా 908 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 76 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 832 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. జిల్లాలో మూడు ప్రాజెక్టులు నర్సంపేట. పరకాల, వర్ధన్నపేటలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వారు 18,074, 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులు 12,140, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సువారు 18,074 , 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు వారు 12,140, గర్భిణీ స్త్రీలు, బాలింతలు 9767 ఉన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట భోజనంతో పాటు ఉడికించిన గుడ్లు, కుర్కురేలు, గర్భిణీ, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు 200 మి.లీ పాలు, ఉడికించిన గుడ్లు ప్రతీ రోజు అందిస్తున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందిస్తున్నారు. గుడ్లు అందించడంలేదు.. గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తారనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లకు వెళ్తున్నాం. కాని అంగన్వాడీ సెంటర్లో గుడ్లు పెట్టడంలేదు. అంగన్వాడీ సెంటర్లకు ఐదు ఆరు నెలల నుంచి గుడ్లే రావడం లేదు. మేం కొనుగోలు చేయాలంటే రూ. 5కు ఒక్క గుడ్డు ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సెంటర్లకు గుడ్లు అందించాలి – చిలుక ప్రభావతి, సర్వాపురం ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాం నర్సంపేటకు కోడిగుడ్లను సరఫరా చేసే సదరు కాంట్రాక్టర్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టాం. త్వరలో జిల్లా నెక్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లను సరఫరా చేస్తాం.–సబిత, జిల్లా సంక్షేమ అధికారి -
మంగళగిరి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట అంగన్వాడీ,ఫీల్డ్ ఆఫీసర్ల అందోళన
-
అక్కాచెల్లెమ్మలకు దగా
టీడీపీ గడచిన ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి చేసిన హామీలివి.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం బెల్టుషాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తాం. డీఅడిక్షన్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తాం. ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలకు ఊపిరిపోసేందుకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు పరిశ్రమలు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపట్టే స్థాయికి విస్తరిస్తాం. పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.30వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి రూ.2లక్షలు అందిస్తాం. పండంటి పథకం ద్వారా పేద గర్భిణులకు ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ.10వేలు అందిస్తాం. పేద మహిళలకు స్మార్ట్ సెల్ఫోన్లు ఉచితంగా ఇస్తాం. ఏడాదికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చి సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ ప్రకారం ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. అన్నీ ప్రభుత్వ కాలేజిల్లో విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తాం. పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ద్వారా ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తాం. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచడంతోపాటు కార్యకర్తలకు వేతనాలను పెంచుతాం. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణతోపాటు ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తాం. పేద వితంతువులకు రూ.1000 పింఛన్ మంజూరు చేస్తాం. పై హామీలు ఏమేరకు అమలు చేశారంటూ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త హామీలకు పసుపు రంగు పులుముతూ తమను మోసగించవద్దని చెబుతున్నారు.టమహిళల రక్షణకు సంబంధించి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఐజీ స్థాయి అధికారిని, డివిజన్లో ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, జిల్లాలో అడిషనల్ ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, మండలంలోని సీఐ స్థాయి మహిళా అధికారిని, పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ మహిళా అధికారిని నియమిస్తామని ముఖ్యమంత్రి గతంలో తెలిపారు. నిర్భయ చట్టాన్ని, గృహ హింస చట్టాన్ని, ఇతర మహిళా చట్టాలను కఠినంగా అమలు చేసి విద్యార్థినులపై, మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తాం. కానీ గడచిన అయిదేళ్లలో మహిళలకు రక్షణ కొరవడింది. మహిళా కమిషన్ పటిష్టపరుస్తామన్న మాటలే మిగిలాయి. బాలికలకు పథకాలేవీ.. బాలికలకు సంబంధించిన పథకాలు ఏవీ అమలులో లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. తరచూ ఆడపిల్లల తల్లిదండ్రులు తమను సంప్రదిస్తున్నారు. ఏ పథకం లేదని చెబుతున్నాం. – ఎ.రాజమ్మ, అంగన్వాడీ కార్యకర్త, నాగేంద్రనగర్, ప్రొద్దుటూరు -
అరకొర వేతనాలు..అర్ధాకలి బతుకులు
నెల రోజులు పడిన కష్టానికి ఒకటో తేదీనే వేతనం అందితే ఉద్యోగులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అన్నాళ్లూ పడిన కష్టాన్ని ఆ క్షణంలో కాసేపు మరచిపోతారు. కానీ, చిరు వేతన జీవులకు చంద్రబాబు సర్కారు ఆ ఆనందాన్ని దక్కనివ్వడంలేదు. వేతనాలే కాదు.. బిల్లులు, ఇతర ఖర్చులు ఇవ్వకుండా వారిని ఏడిపిస్తున్నారు. టార్గెట్ చేరుకోలేదన్న కారణంతో జిల్లాలోని 255 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్‌టీఏ ఇవ్వలేదు. జిల్లాలోని 10,500 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చేతి చమురు వదిల్చే ప్రచారం ప్రభుత్వం ప్రచారం కోసం అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకుందనే ఆరోపణలున్నాయి. కేంద్రాల్లో తల్లులు, పిల్లలకు అవగాహన పేరుతో వివిధ రకాల ఈవెంట్లు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విదల్చక పోవడంతో అంగన్వాడీ కార్యకర్తలకు చేతి చమురు వదులుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. నెలకు రెండు కార్యక్రమాల వంతున ఆరు నెలలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలను గత ఏడాదిగా నిర్వహిస్తున్నారు. నెలకు రూ.500 వంతున చెల్లించాల్సి ఉండగా, ఎనిమిది నెలలుగా చెల్లించాల్సిన ఈవెంట్ బకాయిలు రూ.2.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే రవాణా భత్యం రెండేళ్లుగా రూ.6.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలంటూ గతంలో పలుమార్లు అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినా ఫలితం లేదు. మూడు నెలలుగా వేతనాలకు నోచని ‘ఆశ’ వర్కర్లు పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. గతేడాది డిసెంబరు వరకు మాత్రమే వీరికి వేతనాలు చెల్లించారు. ఒక్కో ఆశ కార్యకర్తకు రూ.3 వేల గౌరవ వేతనం ఇస్తుండగా, మిగిలింది పనికి తగ్గ పారితోషికం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా పనికి తగ్గ పారితోషి కం ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన. ఒక్కో ఆశ కార్యకర్త రూ.5 వేల పారితోషికానికి సరిపడా పనిచేసినా, కేవలం మూడు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 4,500 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. వివాహితలు గర్భవతులైనప్పటి నుంచి ఆరోగ్యపరంగా వారి బాగోగులు చూడడం, ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించడం, ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడడం వీరి బాధ్యత. చిన్నారుల ఆరోగ్య రక్షణకు టీకాలు వేయించేందుకు బాధ్యత వహిస్తారు. టీబీ పేషెంట్లకు మందులు సక్రమంగా అందజేయడం కూడా చేస్తారు. అయినా పనికి తగ్గ పారితోషికం రావడం లేదన్నది వీరి ఆవేదన. బిల్లుల కోసం గొల్లుమంటున్న అంగన్వాడీలు జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5,113 అంగన్వాడీ, 433 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 10,500 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. ఇప్పటికే 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వర్కర్లు, ఆయాలకు కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో చెల్లించాల్సిన బిల్లులు బకాయిలున్నాయి. వేతనాలు రెగ్యులర్‌గా రావడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ ఒక నెల వేతనం బకాయి ఉండగా, జిల్లావ్యాప్తంగా 800 మంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నాలుగైదు నెలల వేతనాలు వారి వేతన ఖాతాలకు జమ కాలేదు. ఇందుకు సాంకేతిక అవరోధాలే కారణమని పై అధికారులు చెబుతున్నట్లు అంగన్వాడీ వర్కర్లు, ఆయాల సంఘం నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా గ్యాస్ బిల్లు, అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు, కాయగూరల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ రూపేణా కార్యకర్తలు, ఆయాలకు రూ.7.92 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. అలాగే గత రెండేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలకు రవాణా భత్యం చెల్లించడం లేదు. రవాణా ఖర్చులుగా సుమారు రూ.6.65 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గతంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. టార్గెట్ల పేరుతో ‘ఉపాధి’ సిబ్బందికి వేధింపులు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ల పేరుతో వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనులు వెదకడం, జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఉపాధి కల్పించడం ఫీల్డ్ అసిస్టెంట్ల విధి. ఏడాదిలో ఫీల్డ్ అసిస్టెంట్ పరిధిలో ఉన్న కూలీలకు 7,500 పనిదినాలు కల్పించక పోతేను జూనియర్ మేట్‌గా డిమోట్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విధంగా జిల్లాలో 2017–18లో 115 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు జూనియర్ మేట్లుగా మారగా, అంతకు ముందు సంవత్సరం మరో 120 మంది ఈ విధంగా డిమోట్ అయ్యారు. జిల్లాలో 956 మంది ఫీల్డ్ అసిస్టెంట్లలో 701 మందికి మాత్రమే ఎఫ్టీఏకు అర్హత సాధించారు. టార్గెట్ చేరుకోలేదని కారణంతో 255 మందికి ఎఫ్‌టీఏ ఇవ్వలేదు. అయితే తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేసినా ఫలితం కానరాలేదు. -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, కోరుట్ల (జగిత్యాల): పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంగన్వాడీ సెంటర్లలో గ్రామాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహార వివరాలతో పాటు బాలింతలు, గర్భిణుల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వివిధ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయాలి. ఈ విధంగా నమోదు చేయడానికే కార్యకర్తలకు ఎక్కువ సమయం సరిపోతుంది. దీంతో కార్యకర్తల సమయం వృథా కాకుండా ఉండేందుకు వారు చేపట్టే ప్రతి పనిని త్వరగా పూర్తి చేసేందుకు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడానికి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్లో నమోదు చేసేందుకు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలను ఐటి అధికారులు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. మండలంలోని వివరాలు మండలంలో అయిలాపూర్, మోహన్‌రావుపేట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో 41 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 36 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు 1213 మంది పిల్లలు అర్హులు కాగా 1147 మంది పిల్లలు నమోదు చేసుకోగా 1130 మంది పిల్లలు హాజరవుతున్నారు. 3ఏళ్ల నుంచి 6ఏళ్ల లోపు పిల్లలు 644 మందికి 564 మంది హాజరవుతున్నారు. గర్భిణులు 327కు 286, బాలింతలు 324కు 282 మంది హాజరవుతున్నారు. వీరికి సంబందించిన సమాచారం రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో వారికి సమయం వృథా కావడంతో వేరే పనులపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసినట్లయితే ప్రతి రోజు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లోనే వారి వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రికార్డులు తిరగేసే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో పని సులభంగా అయిపోవడం, సమయంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్తో సమస్యలు అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం తగ్గించి వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు ప్రభుత్వం అందించే స్మార్ట్ఫోన్లకు గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు నెట్ వినియోగం అత్యవసరం. కాగా గ్రామాల్లో వివిధ సెల్ఫోన్ల కంపనీల ఇంటర్నెట్ సేవలు ఒక్కోరకంగా ఉంటాయి. సిగ్నల్ లేనిచోట మాత్రం స్మార్ట్ఫోన్ల వినియోగం సమస్యగా మారే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లతో పనులు సులభతరం కానున్నాయి. స్మార్ట్ఫోన్లతో సమయం ఆదా చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలు రికార్డుల్లో రాసే బదులు స్మార్ట్ఫోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకా పని ఒత్తిడి తగ్గి పనులు వేగవంతం అవుతాయి. ఆన్లైన్ సేవలు కొనసాగడం వల్ల ప్రతి అంగన్వాడీ సెంటర్ పనితీరు పరిశీలించే వీలుంది. – సమీమ్ సుల్తానా, సూపర్వైజర్ సద్వినియోగం చేసుకుంటాం చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలను 14 రికార్డుల్లో నమోదు చేయాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం అందించే స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకుంటాం. దీంతో పనులు వేగవంతం కావడమే కాకా సమయం ఆదా అవుతుంది. – ఎన్. భాగ్యలక్ష్మీ, అంగన్వాడీ టీచర్ పనిభారం తగ్గుతుంది ప్రభుత్వం సూచించిన పనులు చేయడానికి కార్యకర్తలకు సమయం దొరకడం లేదు. దీంతో చిన్నారులకు విద్యాబోధన, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం పెరిగింది. ఆన్లైన్ నమోదుతో పనులు వేగవంతం అవుతాయి. – జి. సుజాత,అంగన్వాడీ టీచర్ -
సీడీపీఓ పద్మ శ్రీ వేధిస్తుందిని అంగన్వాడీల నిరసన
-
టీడీపీ చీప్ ట్రిక్స్
సాక్షి, నెల్లూరు: ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న టీడీపీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తొక్కని అడ్డదారి లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించి కుట్రలకు పాల్పడిన టీడీపీ తాజాగా తమ పార్టీకి ప్రచారం చేసేలా అంగన్వాడీ కార్యకర్తలను పురమాయిస్తూ కుయుక్తులకు తెరలేపింది. విజయమే పరమావధిగా అంగన్వాడీ కార్యకర్తలతో రీజినల్ ఆర్గనైజర్ హోదాలో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కావలిలో టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్ శ్రీదేవికి ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్‌గా ఇటీవల పదవి ఇప్పించిన బీద సోదరులు ఆమె ద్వారా అంగన్వాడీ కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం చేయించేలా ఒత్తిడి పెంచుతున్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె అంగన్వాడీ కార్యకర్తలను సమీక్షల పేరుతో పిలిపించి టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేయించేలా చూడటం వివాదాస్పదంగా మారుతోంది ఐసీడీఎస్ అధికారుల తీరుపై ఆగ్రహం అంగన్వాడీ కార్యకర్తల సమావేశాన్ని పార్టీ ప్రచార సభగా మార్చేయడంపై పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతుల పేరుతో పార్టీలకతీతంగా దాతలను ఆహ్వానించాల్సిందిపోయి పార్టీ అభ్యర్థులను పిలిపించి ప్రచారం నిర్వహించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఐసీడీఎస్ అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల ఆర్ఓ శ్రీదేవి ఆత్మకూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో రహస్యంగా అంగన్వాడీలతో సమావేశాలను నిర్వహించి ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సహకరించాలని ఆదేశించినట్లు తెలిసింది. అలక మానిపించేందుకు కావలిలో అధికార పార్టీ కౌన్సిలర్‌గా ఉన్న శ్రీదేవి బీద సోదరుల వ్యవహార శైలితో ఇటీవల అలకబూనారు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం రావడంతో బీద సోదరులు సీఎంతో చర్చించి హడావుడిగా ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ పోస్ట్ ఇప్పించేలా చేశారు. వాస్తవానికి ఈ పోస్టును ఒంగోలుకు చెందిన టీడీపీ మహిళా నేత మాధవికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనా, బీద సోదరులు చివరి క్షణంలో శ్రీదేవి పేరును తెరపైకి తెచ్చి ఆమెకు దక్కేలా వ్యవహారం నడిపించారు. దీంతో అలకవీడిన ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించాక బీద సోదరుల కనుసన్నల్లో నడుస్తూ చిరుద్యోగులను టార్గెట్ చేసి వారితో పార్టీకి పనిచేయించేలా ఒత్తడి పెంచడం వివాదాస్పదంగా మారుతోంది. పార్టీ ప్రచారం కోసం ప్రభుత్వం అమలుచేసే పలు సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేసేందుకు అంగన్వాడీ వర్కర్లు కీలకంగా ఉన్నారు. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు నెరిపే వర్కర్లను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు తద్వారా ఎన్నికల ప్రచారం చేయించుకునేందుకు పెద్ద ఎత్తుగడే వేశారు. దీంతో అంగన్వాడీ వర్కర్లకు పార్టీ రంగు పులిమి వారితో ఎన్నికల ప్రచారం చేయించుకునేందుకు ప్రయత్నాలు మమ్మురం చేయాలంటూ కొత్తగా రీజినల్ ఆర్గనైజర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ మహిళా నేత శ్రీదేవిని రంగంలోకి దింపారు. ఆమె ఐసీడీఎస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి నియోజకవర్గాల వారీగా అంగన్వాడీ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లోనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు దాతల సహకారం కోరుతున్నామని చెప్తూ టీడీపీకి చెందిన అభ్యర్థులు, నేతలను సమీక్షలకు ఆహ్వానిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడంతో పాటు అందరితో ఓట్లు వేయించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలపై నేతల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలను సమీక్షల పేరుతో ఆత్మకూరులోని ప్రైవేట్ కల్యాణ మండపానికి పిలిపించి టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య ద్వారా పార్టీ ప్రచారం చేయించిన విషయం వివాదాస్పదంగా మారింది. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేయిస్తే సంక్షేమ పథకాల అమలుతో పాటు జీతాలు పెంచుతామని ప్రలోభపెట్టేలా ప్రసంగం చేయడంపై పలువురు అంగన్వాడీలు అభ్యంతరం తెలిపారు. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలోనే ఈ వ్యవహారాన్ని నడిపించడంతో పెద్ద దుమారం రేగింది. -
ఇవేం... పా'పాలు'!
అన్న అమృత హస్తం పథకం అభాసుపాలవుతోంది. పౌష్టికాహారంలో భాగంగా నిరుపేదలైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పాలు అందజేస్తున్నారు. అయితే విషతుల్యమైన పాలు సరఫరా అవుతుండటం వారి పాలిట శాపంగా మారుతోంది. పాలు తొంభై రోజులు నిల్వ ఉంటాయనే ప్రభుత్వ ప్రకటన ఒట్టిదేనని తేలింది. కనీసం అంగన్వాడీ కేంద్రాలకు చేరే వరకు కూడా నిల్వ ఉండటం లేదు. కేంద్రాలకు వచ్చే సరికి ప్యాకెట్లు ఉబ్బిపోయి, దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో లబ్ధిదారులు తాగకుండా పారబోస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు,ఆళ్లగడ్డ: నిరుపేద గర్భిణి, బాలింతలకు అన్న అమృత హస్తం పథకం కింద ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. భోజనంతో పాటు కోడిగుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తున్నారు. 2013 జనవరిలో ఇందిరమ్మ అమృత హస్తం పేరుతో ప్రారంభించగా.. టీడీపీ అన్న అమృత అహస్తంగా పేరు మార్చింది. కాసులు కురిపిస్తున్న టెండర్లు .. పాలకుల ధనదాహం..అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురుస్తోంది. పథకానికి వంటనూనె, బియ్యం, కందిపప్పు చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. గుడ్లు, పాలు మాత్రం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వారు కావడం, నాయకులకు, స్థాయి వారీగా ఉన్నతాధికారుల వరకు నెల మామూళ్లు ఇవ్వాల్సి రావడంతో నాసిరకం వస్తువులు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. తమకు ముట్టేది ముడుతుండటంతో పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వంకల్లో పారబోత.. పాలు పాడై పోతున్నాయని చెబితే అధికారుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో కార్యకర్తలు కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని పెట్టె విప్పి చూసి పాడై ఉంటే పడేస్తున్నారు. చాలా గ్రామాల్లో రోడ్ల వెంట కుప్పకుప్పలుగా పాల ప్యాకెట్లు పడి ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలి.. జిల్లాలో ప్రస్తుతం నెలకు 3,74,674 లీటర్ల పాలు కొనుగోలు చేస్తున్నారు.ఇందుకు శిశు సంక్షేమ శాఖ నెలకు రూ.1.50 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. నెలకు సరిపడా నిల్వలను ఒకేసారి అంగన్వాడీ కేంద్రాలకు చేరుస్తున్నారు. పాడైపోయిన పాల ప్యాకెట్‌పై ముద్రించిన నంబర్‌కు ఫోన్ చేస్తే స్పందన రావడం లేదు. సూపర్వైజర్లు, సీడీపీఓలకు కార్యకర్తలు సమాచారమిస్తున్నా వారు కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదు. పాలు..విషతుల్యం.. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,549 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 74,834 మంది లబ్ధిదారులున్నారు. పాల సరఫరా భాధ్యతను తొలుత మహిళా సంఘాలకు అప్పగించారు. ఐసీడీఎస్, ఐకేపీ మధ్య సమన్వయం లోపించడంతో అంగన్వాడీ కార్యకర్తలే సమకూర్చుకోవాలని సూచించారు. స్థానికంగా అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో పాల సరఫరాను సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ తీసుకుంది. రెండేళ్లుగా ప్రభుత్వం విజయ వజ్రా బ్రాండ్ పేరుతో టెట్రా ప్యాకెట్లు అందజేస్తున్నారు. వీటి కాల వ్యవధి తొంబై రోజులుగా ప్యాకెట్లపై ముద్రించారు. అయితే సరఫరా చేసిన రెండు రోజులు గడవక ముందే పాకెట్లు ఉబ్బిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. -
ఫిర్యాదుతో పెరిగిన వేధింపులు
మంథని: సక్రమంగా విధులకు హాజరవుతున్నా.. వేతనంలో వాటా ఇవ్వడంలేదని వేధిస్తున్న అధికారిపై అంగన్వాడీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే అదికాస్త బెడిసికొట్టింది. ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మంథని సీడీపీవో పద్మశ్రీ తమను వేధిస్తున్నారని ప్రాజెక్టు పరిధిలోని సుమారు 80 అంగన్వాడీ టీచర్లు జనవరి 16న మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతోపాటు కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత నెల 13న జిల్లా సహకార, సంక్షేమ అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి 57 మంది ఆంగన్వాడీ టీచర్లను వ్యక్తిగతంగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సీడీపీవో ప్రతినెలా తమ వేతనం నుంచి బలవంతంగా రూ.3 వేలు వసూలు చేస్తున్నారని విచారణ అధికారికి తెలిపారు. ఇవ్వకుంటే అసభ్య పదజాలంతో ధూషిసూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ సీడీపీవోకు వ్యతిరేకంగా విచారణాధికారి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో.. విచారణ నివేదికను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారికి పంపిస్తామని చెప్పిన అధికారికి రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నట్లు అంగన్వాడీ టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు తమకు కాకుండా సీడీపీవోకు అనుకూలంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా విచారణ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. విచారణ జరిపి 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ అధికారిపై ఎలాంటి చర్య లేకపోగా, తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన కేంద్రాలకు తనిఖీల పేరిట వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత టీచర్లు పేర్కొంటున్నారు. తాము విధులు నిర్వహించే పరిస్థితి లేదని అంటున్నారు. పది రోజుల క్రితం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి గుండెపోటుకు గురైందని తెలిపారు. గతంలో సైతం కన్నాల–1 కేంద్రం టీచర్ పక్షవాతానికి గురైందని, నాగెపల్లికి చెందిన సజన అస్వస్థకుగురై అనారోగ్యపాలైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో పారదర్శత పాటించి తమను ఇబ్బందులకు గురుచేస్తున్న అధికారిపై చర్య తీసుకోవాలని పలువరు టీచర్లు కోరుతున్నారు. వేధింపులు నివారించండి అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా సీడీపీవో సూపర్వైజర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో అనేక మంది టీచర్లు అనారోగ్యబారిన పడుతున్నారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుగుతుండగా...అధికారి పార్టీకి చెందిన వారు టీచర్లకు సపోర్టు చేయకుండా అధికారి అనుకూలంగా మాట్లాడటం సరికాదు. –జ్యోతి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి -
అంగన్వాడీలో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. స్త్రీ శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, సహాయకుల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు http://wdcw.tg.nic.in/ వెబ్సైట్లో ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు గురువారం పేర్కొన్నారు. పోస్టులు ఇలా... నగరంలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 158 పోస్టులు భర్తీ కానున్నాయి. అందులో 42 అంగన్వాడీ టీచర్లు. ఒక మినీ టీచర్, 115 సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే చార్మినార్ పరిధిలో 30 పోస్టులుండగా... అందులో 5 అంగన్వాడీ టీచర్లు, 25 సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. గొల్కొండ పరిధిలో 20 పోస్టులకు గాను 5 టీచర్, 15 సహాయకురాళ్లు, ఖైరతాబాద్‌లో 38 పోస్టులకు గాను 13 టీచర్లు, 25 సహాయకురాళ్లు, నాంపల్లిలో 42 పోస్టులకు గాను 13 టీచర్లు, 29 సహాయకురాళ్లు, సికింద్రాబాద్ ప్రాజెక్టులో 28 పోస్టులకు గాను 6 అంగన్వాడీ టీచర్లు, ఒకటి మినీ టీచర్, 21 సహాయకురాళ్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. 914 కేంద్రాలు.. హైదరాబాద్ జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులìæ పరిధిలో 914 కేంద్రాలు ఉండగా, అందులో సుమారు 63,894 చిన్నారులు నమోదై ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో నాలుగైదు మండలాలు ఉన్నాయి. చార్మినార్ ప్రాజెక్టు పరిధిలో సైదాబాద్, అంబర్‌పేట, చార్మినార్, బండ్లగూడ మండలాల్లో కలిపి 257 కేంద్రాలు, ఖైరతాబాద్ ప్రాజెక్టు పరిధిలోని అంబర్‌పేట, ఖైరతాబాద్, షేక్‌పేట, బాలానగర్ మండలాల్లో కలిపి 141 కేంద్రాలు, గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని ఆసీఫ్‌నగర్, గొల్కోండ మండలాల్లో కలిపి 154 కేంద్రాలు, నాంపల్లి ప్రాజెక్టు పరిధిలోని హిమాయత్‌నగర్, బహదూర్‌పురా, నాంపల్లి మండలాల్లో కలిపి 191 కేంద్రాలు, సికింద్రాబాద్ ప్రాజెక్టు పరిధిలోని సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, ముషీరాబాద్ మండలాల్లో కలిపి 171 కేంద్రాలు ఉన్నాయి. -
‘స్మార్ట్’గా చేద్దాం
వేసవి ప్రారంభం కానేలేదు. అప్పుడే తాగునీటికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఇందుకు కారణం సింగూరు ప్రాజెక్టులో జలాలు అడుగంటడమే. వర్షాభావ పరిస్థితులతో సింగూరులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. వేసవి నాటికి ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. ఫలితంగా మిషన్ భగీరథ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నర్సాపూర్ నియోజకవర్గానికి నేటి నుంచి నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ప్రస్తుతం మెదక్ నియోజకవర్గంలో రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఇక్కడ కూడా సరఫరా నిలిచిపోనుంది. సాక్షి, మెదక్: ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే మాతాశిశు మరణాలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) ప్రత్యేకంగా కామన్ అప్లికేషన్ సిస్టం (సీఏఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు పని భారంతో పాటు రికార్డుల నిర్వహణ తప్పనుంది.ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు రిజిస్టర్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను మొత్తం 14 రకాల రికార్డులు రాయాల్సి ఉంది. దీంతో వారికి పని భారంతో పాటు రిజిస్టర్ల మోత ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించనుండటంతో ఇకపై వారికి ఈ బాధలు తప్పనున్నాయి. దీంతో పాటు గర్భిణులకు సంబంధించిన ఇమ్యూనైజేషన్, ప్రసవం తేదీలను మూడు రోజుల ముందుగానే సంక్షిప్త సమాచారం ద్వారా తెలియడంతో వారు గర్భిణులను సరైన సమయంలో ఆసుపత్రులకు పంపించే అవకాశం ఉంటుంది. స్మార్ట్ఫోన్లు అందించిన సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు నాలుగు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో కుటుంబ నిర్వహణ అనే అంశంపై శిక్షణ ఉంటుంది. ఇందులో ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో ఎలా అనుసంధానం చేయడం తదితర వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. రెండోవిడతలో గృహ సందర్శన అనే అంశంపై శిక్షణ నిర్వహిస్తారు. మూడో విడతలో భాగంగా ఆహార పదార్థాలకు సంబంధించి శిక్షణనిస్తారు. చివరగా నాలుగో విడతలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ అంశంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలన్ని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించిన అనంతరం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక యాప్ ద్వారా... పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్లను సొంతంగా వినియోగించకుండా ప్రత్యేక యాప్ ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీరికి స్మార్ట్‌ఫోన్‌తో పాటు పవర్ బ్యాంక్, ప్రతిపాదించిన నెట్వర్క్ సిమ్‌కార్డుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. సంబంధిత బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుంది. అయితే ఇప్పటి వరకు రికార్డులు రాయడంలోనే అంగన్వాడీ టీచర్లు పూర్తిస్థాయిలో నిమగ్నం కావడంతో పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పాలు, భోజనం వంటి పౌష్టికాహారం అందించడంలో సైతం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఇవి సక్రమంగా అందుతున్నాయా ? లేదా ? సరుకులు అందుబాటులో ఉన్నాయా ? లేదా ? అనే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలుసుకునే వీలుంది. అయితే కొందరు అంగన్వాడీ టీచర్లు ఈ విషయమై తమకు పని భారం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ఫోన్లలో పొందుపర్చిన వివరాలు ఒక్కోసారి డిలీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయని... దీంతో తాము రిజిష్టర్లలో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. పారదర్శకత పెరుగుతుంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. వీటిలో వివరాలు నమోదుకు సంబంధించి నాలుగు దశల్లో ఆయా సెక్టార్లలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పోషన్ అభియాన్ కింద స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంక్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో అంగన్వాడీ టీచర్లకు పని భారం తగ్గుతుంది. అలాగే పనిలో పారదర్శకత పెరుగుతుంది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే అవకాశం ఉంటుంది. –జ్యోతిపద్మ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి -
అమ్మకానికి అంగన్వాడీ సుపర్వైజర్ పోస్టులు
-
అమ్మకానికి అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు
-
అంగట్లో అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు
‘‘సచివాలయంలో ‘సార్’కు డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది. రేపు 10 గంటలకు సచివాలయానికి రమ్మన్నారు. ఇప్పటికే కొంత సొమ్ము చెల్లించాం. మిగిలిన సొమ్మును బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని సార్‌కు చెప్పాం. డబ్బులు చెల్లిస్తే రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తారు. ఆ మేరకు జీవో జారీ చేస్తారు. మంత్రి సునీత, కమిషనర్, ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి గారు సంతకాలు చేసి జీవో ఇస్తామన్నారు. జిల్లాలవారీగా ఎవరు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలో లిస్టు రాసి పెట్టుకోండి. ఇంకా ఇవ్వాల్సిన వారు బ్యాంకుల్లో వేస్తే అమరావతిలో డ్రా చేసి ఇవ్వడం సమస్య అవుతుంది. నగదే జాగ్రత్తగా తీసుకురండి. సచివాలయంలో సార్‌కు ఇచ్చేయొచ్చు, ఎలాంటి సమస్య ఉండదు’’ – కొందరు అంగన్వాడీ మహిళల మధ్య ఫోన్ ద్వారా జరిగిన సంభాషణల సారాంశం ఇదీ... సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం కొలువుదీరిన పవిత్రమైన సచివాలయాన్ని అక్రమార్జనకు అడ్డాగా మార్చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా అమ్మేసుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు అక్షరాలా రూ.లక్ష ధర నిర్ణయించి మరీ సచివాలయం సాక్షిగా వసూలు చేస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శి కనుసన్నల్లోనే ఈ వసూళ్ల భాగోతం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీ మహిళల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఈ సంభాషణల వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. మొత్తం 361 పోస్టులను విక్రయానికి పెట్టారు. ఇప్పటికే కొందరు మహిళలు బ్యాంకుల ద్వారా సంబంధిత మధ్యవర్తులకు కొంత సొమ్ము చెల్లించారు. ఇన్చార్జి సూపర్వైజర్గా పనిచేసిన ఓ మహిళ ఇతర సభ్యులతో ఫోన్లో మాట్లాడిన మాటలివీ.. ‘‘అంగన్వాడీ టీచర్, వర్కర్‌గా కూలీకి పనిచేశాం. మనకు డైరెక్టుగా పదోన్నతి ఇవ్వడం సాధ్యం కాదు. ఆయా నుంచి వర్కర్‌గా ఇస్తారు. వర్కర్ నుంచి గ్రేడ్–2 పోస్టు రాదు. గ్రేడ్–2 పోస్టులో నియమించాలంటే ఎపీపీఎస్సీ ద్వారా ఎంపికవ్వాలి. పరీక్ష లేకుండా తీసుకోవాలంటే సీనియారిటీ లిస్టు తయారు చేయాలి. సీనియారిటీ లిస్టులో మన పేర్లు ఉండవు. డబ్బులు చెల్లిస్తే ఇప్పుడు రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తారు. ఆ మేరకు జీవో జారీ చేస్తారు. మంత్రి సునీత, కమిషనర్, ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి గారు సంతకాలు చేసి జీవో ఇస్తామన్నారు. రెగ్యులర్ పోస్టు ఇచ్చిన తరువాత గ్రేడ్–2 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ గ్రేడ్–2 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది. అప్పుడు సీనియారిటీ లిస్టులో మన పేర్లు చేర్చి, గ్రేడ్–2 పోస్టుల్లో నియమిస్తారు. ఆ తరువాతే మిగతావారిని తీసుకుంటారు. ఇన్చార్జి పోస్టు కాదు రెగ్యులర్ పోస్టే ఇస్తారు. అంతటితో ఆగకుండా గ్రేడ్–2 పోస్టులు ఇస్తారు’’ వివిధ జిల్లాల మహిళా సభ్యుల మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ.. ‘‘ఇప్పుడే మీటింగ్ నుంచి బయటకు వచ్చాం. రేపు కూడా ఉండమని సార్ చెప్పారు. రేపు 10 గంటలకు సచివాలయానికి రమ్మన్నారు. ఇప్పటికే కొంత సొమ్ము చెల్లించాం. మిగిలిన సొమ్మును బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని సార్‌కు చెప్పాం. ఈ విషయాలను ఎక్కడా బయట పెట్టకండి. ఎవరికీ చెప్పకండి. మేము ఒట్టు వేశాం. డబ్బులు చెల్లించిన స్లిప్‌ల ఫొటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టకండి. గ్రూపులో పెడితే ఎవరి దగ్గరికో వెళ్లిపోతాయి. విల్లింగ్, నాన్ విల్లింగ్ లిస్టులను ఆయా జిల్లాల లీడర్లకు పెట్టండి. ఇంత కంటే ఏమీ చెప్పలేం. మనకు ఏడాదికి రూ.1.60 కోట్ల జీతాలని చెప్పారు. ఒకటిన్నర ఏడాది సీనియారిటీ ఇస్తారు. మీరు స్పందిస్తే కచ్చితంగా గ్రేడ్–2 పోస్టులు తెస్తాం. మీరందరూ సహకరించాలి. సహరిస్తేనే ముందుకు వెళ్లగలం. స్పందించకపోతే సూపర్వైజర్గానే ఉంటారు. ఆర్థిక మంత్రి దగ్గర ఫైల్ కూడా చూశాం’’ ఇతర సభ్యులతో.. ‘‘అక్కడ ఏం జరిగిందో ఫోన్ చేసి తెలుసుకుని, ఫోటోలో పెట్టమన్నాం. ఇంకా పెట్టలేదు. సోమవారం ప్రయాణం. ఆర్డర్ కాపీ రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. సోమవారం లీడర్ల మీటింగ్ అన్నారు. ఎవరెవరు వస్తారో చూసి రిజర్వేషన్ చేయించాలి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో మీటింగ్ ఉంటుంది. అనుకున్న రీతిలో డబ్బులు పూర్తిగా కట్టలేకపోయారట. బ్యాంకుల్లో డబ్బులు వేయడం, తీయడం సమస్యగా ఉంది. ఇన్ని రోజులైనా పని పూర్తి కాలేదు. డబ్బులు తీసుకుని సార్‌కు ఇచ్చేస్తే పని అయిపోయేది. 9వ తేదీ కోడ్ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి’’ కొందరు అంగన్వాడీ సభ్యుల మధ్య.. ‘‘జిల్లాలవారీగా ఎవరు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలో లిస్టు రాసి పెట్టుకోండి. ఇంకా ఇవ్వాల్సిన వారు బ్యాంకుల్లో వేస్తే అమరావతిలో డ్రా చేసి ఇవ్వడం సమస్య అవుతుంది. నగదునే జాగ్రత్తగా తీసుకొచ్చేయండి. సచివాలయంలో సార్‌కు ఇచ్చేయొచ్చు, ఎలాంటి సమస్య ఉండదు. 14 మంది నుంచి రూ.7.25 లక్షలు వసూలు చేశాను. సచివాలయంలోనే ఒక సభ్యురాలు మరో సభ్యురాలికి రూ.5 వేలు ఒకసారి, రూ.25 వేలు ఇంకోసారి ఇచ్చింది. ఇప్పటికే లక్ష్మీ అనే మహిళ రామచంద్రయ్య అనే వ్యక్తికి బ్యాంకు ద్వారా రూ.40 వేలు చెల్లించింది. కె.రాజ్యలక్ష్మి అనే మహిళ బ్యాంకు ద్వారా ఎ.బాబు అనే వ్యక్తికి రూ.3,25,059 చెల్లించింది. ఇంకా కొంతమంది మహిళలు బ్యాంకుల ద్వారా రూ.20 వేల చొప్పున చెల్లించారు’’ నేడు ఉండవల్లిలో సమావేశం అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫార్సులతో కొన్ని నెలల క్రితం 384 మంది మహిళలను ప్రభుత్వం అంగన్వాడీ ఇన్చార్జి సూపర్వైజర్లుగా నియమించింది. కొంతకాలం తర్వాత వారిని కొన్ని కారణాలతో విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు వారిలో 361 మందికి మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలు ఎర వేశారు. రెగ్యులర్ పోస్టులు ఇవ్వడంతోపాటు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పర్మినెంట్ చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.లక్ష చొప్పున రేటు నిర్ణయించారు. ఇప్పటికే ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేశారు. ఇప్పటిదాకా రూ.1.5 కోట్లకుపైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగతా సొమ్ము త్వరగా ఇచ్చేస్తే జీవో జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వసూళ్ల ప్రక్రియను సమీక్షించడంతోపాటు అంగన్వాడీ సూపర్వైజర్ల ఎంపికపై సోమవారం ఉండవల్లిలో సమావేశం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. -
రైతులపై వరాల జల్లు
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిసింది. ముఖ్యంగా రైతులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ఏడాదికి ఆరు వేల రూపాయలు అందజేసేందుకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని ప్రవేశపెట్టింది. దీనికితోడు పంట రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీని ప్రకటించింది. అంగన్వాడీల వేతనాలను యాభై శాతం పెంచాలనే నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇవ్వడానికి ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్’ స్కీంను ప్రవేశపెట్టారు. వేతనజీవులకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇస్తుండటంతో వారికి మరింత మేలు చేకూరనుంది. సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులపై వరాలు కురిపించింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే రైతు బంధు పథకం అమలు చేస్తుండగా కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేలు అందనున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాలోని 2,03,788 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.122.27 కోట్ల నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. ఈ పథకం 1 డిసెంబర్ 2018 నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో మొత్తం 2,18,747 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2.5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్నకారు రైతులు 51,885 మంది ఉన్నారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలోపు వ్యవసాయ సాగుభూమి ఉన్న సన్నకారు రైతులు 1,51,903 మంది ఉన్నారు. ఐదు ఎకరాలలోపు వ్యవసాయసాగు భూమి ఉన్న 2,03,788 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి చేకూరనుంది. ఏడాదికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 2,03,788 మంది రైతులకు రూ.122.27 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడత ఆర్థిక సహాయం రూ.40.75 కోట్లు మార్చిలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎకరాను యూనిట్‌గా తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరిగేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పటంతోపాటు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే జిల్లాలో పంటరుణాలపై 2 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో ఏటా లక్ష మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటున్నారు. వీరిలో సగానికిపైగా రైతులు సకాలంలో రుణాలు చెల్లించటం జరుగుతుంది. దీంతో 50వేల మంది రైతులకు 2 శాతం వడ్డీ మాఫీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గోవుల ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. మత్స్యకార్మికులు కిసాన్ క్రెడిట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపితే 2 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. ఇదికూడా జిల్లాలోని మత్సకార్మికులకు లాభం చేకూర్చనుంది. ఆనందంలో అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనం 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 865 మంది అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం పెరగనుంది. జిల్లాలో మొత్తం 885 అంగన్వాడీలు ఉండగా వీటిలో 865 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి రూ.10,500 వేతనం అందుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.4500 కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6వేల తనవాటాగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంచి తన వాటాగా ఉద్యోగులకు ఇకపై రూ.6750 చెల్లించనుంది. దీంతో అంగన్వాడీలకు ఇకపై ప్రతినెలా రూ.12,750 వేతనం అందనుంది. అసంఘటిత రంగ కార్మికులకు మేలు కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు వరం ప్రకటించింది. 60 ఏళ్ల వయస్సుదాటిన వారికి ప్రతినెలా రూ.3వేల పింఛన్ ఇవ్వనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్’ పేరిట అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇస్తుంది. ఇందుకోసం రూ.15వేల లోపు ఆదాయం ఉన్న అసంఘటితరంగ కార్మికుల నుంచి ప్రతినెలా రూ.100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 4,300 మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారు. వీరందిరికీ పింఛన్ పథకం వర్తిసుంది. అయితే జిల్లాలో పదివేల మందికిపైగా అసంఘటితరంగ కార్మికులు ఉన్నట్లు అంచనా. సర్వే చేసి వీరి పేర్లను నూతన పథకంలో చేర్చాలని సీఐటీయూ నేతలు కోరుతున్నారు. పన్ను మినహాయింపు.. వేతన జీవులకు కేంద్రం బడ్జెట్లో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,500 మంది ఉద్యోగులకు మేలు జరనుంది. మెదక్ జిల్లాలో మొత్తం 6,400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1500 మంది ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారు. కేంద్రం నిర్ణయంతో వీరందరికీ మేలు జరనుంది. -
2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర సర్కారు వరాల వర్షం కురిపించింది. మరోసారి గెలుపే లక్ష్యంగా సాగిన ఈ బడ్జెట్లో వేతన జీవులకు, రైతాంగానికి భారీగా తాయిలాలు ప్రకటించింది. ఆర్థిక మంత్రి పీయూష్‌గోయల్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత ఇచ్చింది. ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గృహ కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది. అసంఘటిత కార్మికులకు అండ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం దిశగా అడుగులు పడ్డాయి. 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇవ్వన్నుట్లు బడ్జెట్లో పొందుపర్చారు. అయితే ఈ కార్మికులు నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వయసు 60 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయి. రియల్ రంగం జోరుమీదుండటంతో భవన నిర్మాణ కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలోని సుమారు 1.60 లక్షల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఊరట వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఊహించనిరీతిలో పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వేతనజీవులకు వెసులుబాటు కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తుండగా..వీరందరికి తాజా నిర్ణయంతో ఐటీ చెల్లింపు బాధల నుంచి విముక్తి కలుగనుంది. జిల్లాలోని ఐటీ హబ్‌లో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఐటీ నిపుణులకు కూడా కొంతమేర పన్ను మినహాయింపు దక్కనుంది. వీరేగాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణసంస్థల్లో పనిచేస్తున్న మరో లక్ష మందికి కూడా ఆదాయ పన్ను పరిమితి పెంపుతో రాయితీ లభించనుంది. ఇంకోవైపు ప్రవేటు రంగ సంస్థల్లో పనిచేసే వేతన జీవులకు కూడా ఈ నిర్ణయం కలిసి రానుంది. 2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయి. రైతుబంధు కింద రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా కేంద్రం కూడా ఐదెకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా చిన్నకారు రైతులకు ఈ సాయం అందనుంది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నారు. ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా 2,13,208 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై రూ.127.92 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అంగన్వాడీలకు మేలు మధ్యంతర బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. వారి వేతనాలను 50 శాతం పెంచారు. ప్రస్తుతం ప్రతి అంగన్వాడీ టీచర్‌కు నెలకు రూ. 10,500 గౌరవ వేతనాన్ని అందజేస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3 వేలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోంది. బడ్జెట్లో పొందుపర్చిన మేరకు ఇకపై కేంద్రం వాటా రూ.6 వేలు ఉండనుంది. అంటే టీచర్లకు రూ.13,500 వేతనం అందనుంది. ఫలితంగా జిల్లాలో సుమారు 1,580 మంది అంగన్వాడీ టీచర్లకు మేలు ఒనగూరనుంది.