
విజయవాడ: ఏపీలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన దారి తప్పుతోంది. అంగన్‌వాడీల నీడలో ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
అసాంఘిక, రాజకీయ శక్తుల చేతుల్లోకి ఛలో విజయవాడ కార్యక్రమం వెళ్లినట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. దాంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను నిఘా వర్గాలు అలెర్ట్ చేశాయి. దీనిపై అంగన్‌వాడీలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని ఆదేశించారు.