intelligence agencies
-
రైళ్లపై ఉగ్రదాడులకు స్లీపర్ సెల్స్‌కు ఆదేశాలు?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సూచించినట్టుగా ఉన్న ఓ వీడియో రావడం కలకలం రేపుతోంది. రామేశ్వరం కేఫ్ తరహాలో ఉగ్రదాడులకు అతడు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయిప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న జిహాదిస్ట్ ఘోరీ.. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరిపై కొన్నేళ్లుగా భారత్ ఏజెన్సీల నిఘా కొనసాగుతోంది.తాజాగా భారత్దేశంలోని రైళ్లపై దాడులకు సంబంధించి ఆదేశాలు ఇస్తున్న మూడు నిమిషాల వీడియో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రైళ్లు, పెట్రోలియం పైప్లైన్లపై దాడులు, ప్రెజర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు, హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలంటూ ఘోరీ వ్యాఖ్యానించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఈడీ, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్‌ను వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఘోరీ వీడియోలో తెలిపాడు. తాము తిరిగొచ్చి భారత ప్రభుత్వాన్ని షేక్ చేస్తామని వీడియోలో ఘోరీ వెల్లడించాడు. ఈ పరిణామాల వేళ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యయి.ఘోరీ భారతదేశంలోని పెట్రోలియం పైప్లైన్లను మరియు హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికల గురించి కూడా మాట్లాడాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఎ) ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్‌లను వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఆయన అన్నారు.కాగా ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత్‌లో గతంలో చోటు చేసుకున్న అనేక పేలుళ్ల వెనుక ఘోరీ హస్తం ఉంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకూ గాయపడ్డారు.ఇక 2002లో గుజరాత్‌లోని అక్షరథామ్ దేవాలయంపై జరిగిన దాడిలో 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా అతడి హస్తమే ఉంది. -
శత్రు దేశాల గూఢచారి మిత్రులు
ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితుల అన్వేషణ అది. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానం కూడా పుస్తకంలో కనిపిస్తుంది.బహుశా జాన్ లి కరే(గూఢచర్య కథాంశాల బ్రిటన్ రచయిత) కూడా దీనినొక ఏమాత్రం నమ్మదగని అసంభవంగా భావించి ఉండేవారు. సి.ఐ.ఎ.(అమెరికా నిఘా సంస్థ), కె.జి.బి.(రష్యా నిఘా సంస్థ)ల అధినేతలు కలిసి పని చేసేందుకు ఒక అంగీకారానికి రావటమే ఇది. కానీ నమ్మేందుకు కష్టంగా ఉన్నా, దక్షిణాసియాలో ఇటువంటిదే ఒకటి ఇంకా ఎవరూ గుర్తించకుండా, ఎవరి గమనింపునకూ రాకుండా సంభవించింది. భారత్–పాకిస్తాన్ల గూఢచారి సంస్థలైన ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్), ఐ.ఎస్.ఐ. (ఇంటర్–సర్వీసెస్ ఇంటిలిజెన్స్)ల మాజీ అధిపతులు స్నేహితులుగా మారి తాము ఉమ్మడిగా కలిసి రాసిన పుస్తకాలకు పరస్పరం సహకరించుకున్నారు. అమర్జీత్ సింగ్ దులత్, జనరల్ అసద్ దుర్రానీ తమ తాజా పుస్తకం ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ను ఈ నెలలో ఆవిష్కరించారు (నీల్ క్రిషణ్ అగర్వాల్ మరో సహ రచయిత). వారి మొదటి పుస్తకానికి ‘ద స్పై క్రానికల్స్’ అని సముచితమైన పేరే పెట్టారు. ఈ అనుబంధం ఎలా మొదలైంది? చూస్తుంటే బ్యాంకాక్‌లోని ఛావ్ ప్రాయా నదిపై ఒక చిన్న నౌకలో మొదలైనట్లుంది. ఉగ్రవాదంపై ఒక అనధికార చర్చా కార్యక్రమానికి వాళ్లిద్దరూ ఆ నౌకలోని ఆహ్వానితులు. దులత్‌ని మాట్లాడమని ఆహ్వానించారు. ఇలాంటి చర్చా కార్యక్రమాలకు ఆయన కొత్త కనుక సంకోచంగా, అనాసక్తిగా ఉండిపోయారు. దుర్రానీ ఆ సంగతి గమనించి దులత్‌కు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం గురించి దులత్... తమ మధ్య ‘కెమిస్ట్రీ’ కుదిరిందని అంటారు. ఆ తర్వాత అనతికాలంలోనే వారిద్దరూ స్నేహితులైపోయారు. ‘కోవర్ట్’ పుస్తకం ఆ ఇద్దరి మధ్య సారూప్యాలను, వైరుధ్యాలను వెల్లడిస్తుంది. చిన్నతనంలో దుర్రానీ ‘‘ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు’’. పెద్దయ్యాక కూడా ‘‘సమూహంలో భాగం కావాలని కోరుకోలేదు’’. చిన్నవాడిగా ఉన్నప్పుడు దులత్‌కు కొద్ది మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ‘‘ఎక్కువగా పనివాళ్ల పిల్లలు’’. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘‘తనకై తను ఉండగలగటం, తనను తను కాపాడుకోవటం నేర్చుకున్నారు’’. ఇక భవిష్యత్తు ఐఎస్ఐ చీఫ్... స్కూల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేవాడు. ‘‘నేను ఎల్లప్పుడూ దాదాపు ప్రతి సబ్జెక్టులో మొదటి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరిగా ఉండేవాడిని’’ అంటారాయన. దులత్ అందుకు విరుద్ధం. ఆయన ‘‘చాలా సగటు విద్యార్థి’’. కానీ ఈ భవిష్యత్తు ‘రా’ అధిపతి క్రీడల్లో తన తఢాకా చూపించారు. స్కూల్లో ఆయన ‘‘ప్రతి ఆటా ఆడాడు’’. ఒంటరి దుర్రానీకి ‘‘సైక్లింగ్ అంటే చాలా ఇష్టం’’. కానీ ‘‘లాహోర్ వంటి నగరంలో సైకిల్ తొక్కేందుకు దూరపు స్థలం ఉండేది కాదు’’. వ్యక్తిగతంగా దుర్రానీ ఎలా ఉండేవారో, అలాంటి వ్యక్తిగానే ఆయన ఎదగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘‘నేను భిన్నం, నేను నాలా ఉండే స్వభావం నాది’’, ‘‘నా గుణం ఎప్పుడూ కూడా కాస్త తిరుగుబాటు ధోరణితో ఉంటుంది’’ అంటారు దుర్రానీ. దులత్ ప్రధానంగా తల్లిదండ్రుల మాట వినటానికీ, విద్యాబుద్ధులు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం నడచుకోటానికీ సిద్ధంగా ఉంటారు. ‘‘తగిన పనులు, తగని పనులు అని ఉంటాయి’’ అనే నమ్మకంతో ఆయన పెరిగాడు. ఇది ఆయనకు స్పష్టమైన నైతిక దిశా నిర్దేశం చేసిందని నేను అనుకుంటాను. దుర్రానీ సైన్యంలో చేరారు. ‘‘ఆ కారణంగా నేనెప్పుడైనా పశ్చాత్తాపం చెందానని నేను అనుకోను’’ అంటారు. దులత్ పోలీస్ అయ్యారు. ఎందుకంటే, ‘‘అంతకన్నా మెరుగైన సర్వీసులలోకి వెళ్లలేకపోయాను’’ అని ఆయన అంగీకరిస్తారు. అయితే యాదృచ్ఛికమో లేదా అనుకోని అదృష్టమో ఇద్దరూ కూడా ఇంటిలిజెన్స్ సంస్థల వైపు మళ్లారు. ‘‘అనుకోకుండా నేను అక్కడికి చేరాను’’, ‘‘ఆ విషయాన్ని ఒప్పుకుంటాను’’ అంటారు దుర్రానీ నవ్వుతూ. ‘‘ఇంటిలిజెన్స్ అంటే ఏంటో తెలియకుండానే’’ దులత్ ఇంటిలిజెన్స్ బ్యూరోలో చేరారు. అయినప్పటికీ ఇద్దరూ అత్యున్నత స్థాయికి చేరుకుని, తమ తమ దేశ ప్రజల చేత ఐఎస్ఐ, ‘రా’ సంస్థల అత్యుత్తమ మాజీ అధిపతులుగా గుర్తింపు పొందారు. కనుక వారు విధిని నమ్ముతారని నేను అనుకోవచ్చా? జేమ్స్ బాండే ఇలాంటి మూఢ నమ్మకాలను ఎప్పుడూ ఎకాఎకిన కొట్టిపడేయలేదు. వీళ్లు మాత్రం అలా ఎందుకు చేస్తారు?‘‘కుండబద్దలు కొట్టటం’’ అని దులత్ ఎప్పుడూ అంటుండే దుర్రానీలోని ‘‘నిర్మొహమాటాన్ని’’ దులత్ ఇష్టపడతారు. దుర్రానీ ఉన్నదున్నట్లు బహిరంగంగా మాట్లాడతారు. పాకిస్తాన్ ఆర్మీని విమర్శించటానికి కూడా సంకోచించరు. అలాగే ఆయన భారతీయ సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది మరింత కష్టమైన పని. ఆయన అనిన ఒక మాటను మీకు వదిలేసి, నా ముగింపు సరైనదేనా పరిశీలించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ‘‘భారతదేశంలో ప్రజలు ప్రతిభ ద్వారా పైకి ఎదిగి ఐ.బి. (ఇంటిలిజెన్స్ బ్యూరో) ని, ‘రా’ను చేజిక్కించుకుంటారు. కానీ మా దగ్గర దేశాధ్యక్షుడు, లేదా సైన్యాధ్యక్షుడికి నచ్చిన వ్యక్తి అటువంటి పదవులను చేపట్టవచ్చు. కనుక ఒక మంచి ఐఎస్ఐ చీఫ్ ఎవరు అవగలరు అనే దానికి ఎల్లవేళలా మేము అనుసరించే ఒక ప్రమాణం ఉండదు.’’ రహస్యాలను అలా ఉంచండి – ‘కోవర్ట్’ పుస్తకంలో వీరు ‘రా’, ‘ఐఎస్ఐ’ అంతర్గత కార్యకలాపాల పనితీరును బహిర్గతం చేయలేదు. ‘ద స్పై క్రానికల్స్’ లోనూ వాటి గురించి లేదు. బదులుగా ఈ తాజా పుస్తకం, ‘‘గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితులను అన్వేషిస్తుంది’’. రెండు సూత్రాల మీద ఇది దృష్టి సారించింది. వారు ఎలాంటి మనుషులు? వారు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అనేవి ఆ రెండూ. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానాన్ని కూడా వివరించింది. వారి అభిప్రాయాలు కూడా తరచూ ఒకేలా ఉన్న విషయం కూడా. చూస్తుంటే, గూఢచారులు చాలా అరుదుగా విభేదిస్తారని అనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏపీలో దారి తప్పుతున్న అంగన్వాడీల ఆందోళన
విజయవాడ: ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన దారి తప్పుతోంది. అంగన్వాడీల నీడలో ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అసాంఘిక, రాజకీయ శక్తుల చేతుల్లోకి ఛలో విజయవాడ కార్యక్రమం వెళ్లినట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. దాంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను నిఘా వర్గాలు అలెర్ట్ చేశాయి. దీనిపై అంగన్వాడీలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. -
భద్రతా సవాళ్ల సమీక్ష లేనందునే...
పదిహేనేళ్ల క్రితం, 2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడి తొలిదశలో భారత భద్రతా వ్యవస్థ దాదాపుగా అచేతనమైందంటే అతిశ యోక్తి కాబోదు. నిస్సహాయులైన, నిరాయుధులైన జన సామాన్యంపై పేట్రేగిన ఉగ్రమూక వందల ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన అది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రతపై ఇంత స్థాయిలో ఎన్నడూ దాడి జరగలేదని చెప్పాలి. ఈ ఘటన జాతీయ భద్రత అంశంలోని సంస్థా గత లోపాలను ఎత్తి చూపింది. దేశం మరోసారి 26/11 లాంటి ఘటనను ఎదుర్కోరాదంటే... అంతర్గత భద్రత సవాళ్లపై సమీక్షించుకోవడం మన తక్షణ అవసరం కావాలి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన పద్ధతులు... సరిహద్దులకు అవతలి నుంచి వారికి అందిన సూచనల వంటివన్నీ మనకు అనూహ్యమైనవే. అదే సమ యంలో ఢిల్లీ, ముంబైల్లోని జాతీయ స్థాయి భద్రత వ్యవస్థలు సంపూర్ణంగా విఫలమయ్యాయి. 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనూ సంస్థాగతమైన నిఘా లోపాలు బయటపడ్డాయి. దివంగత కె. సుబ్రమణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ఏజెన్సీల మధ్య సమన్వయానికి, నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు తగిన వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీ లకు పనులు చెప్పేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు, సామర్థ్యాలను పరీక్షించేందుకు, నాణ్యత ప్రమాణాలను సమీక్షించేందుకు కూడా తగిన వ్యవస్థలు లేవు. అన్ని నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసే ఏర్పాట్లు కూడా లేవు’’ అని విస్పష్టంగా పేర్కొందీ కమిటీ. ఈ రకమైన లోపాల కారణంగా భారత్ నివారించ దగ్గ ఎదురుదెబ్బలు ఎన్నో చవిచూడాల్సి వస్తోంది. గల్వాన్ లోయ సంఘటన ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక అంశం. 2020లో జరిగిన ఈ ఘటనలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారతీయ సైనికులను ఒకరకంగా ‘ఆశ్చర్యానికి’ గురిచేస్తూ తీవ్రస్థాయి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మిలిటరీ సంస్కరణల ఫలితం? భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీకి ప్రాతినిధ్యం వహించే ‘ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ మిలిటరీ సంస్కరణలను అమలు చేసే విషయంలో దశాబ్దాల సమయం తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్ట్‌ను సృష్టించేందుకు 1990లలో పీవీ నర సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదల య్యాయి. ఆఖరికి ఇది 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా సాకారమైంది. ఈ జాప్యం చెప్పే విషయం ఏమిటి? జాతీయ భద్రత అంశాల విషయంలో సంస్క రణలు, సంస్థాగత సమీక్షలకు కొంత నిరోధం ఉందీ అని. అది కూడా స్వప్రయోజనాల కోసం పాకులాడే వారి వల్ల అని అర్థమవుతుంది. భారతీయ నిఘా ఏజెన్సీల్లో... ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ– క్లుప్తంగా ‘రా’), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ)లు ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం,కేంద్ర హోంశాఖల కింద ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తాయి. వీటికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రతి సాయుధ దళంలోనూ తమదైన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు అదనం. అంతేకాదు... రెవెన్యూ, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు, నిఘా పెట్టేందుకు ప్రత్యే కమైన విభాగాలు కూడా ఉన్నాయి. సమాచార రంగంలో వచ్చిన సరికొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వాలు రోజంతా తమ నిఘా కార్యక్రమాలను కొన సాగించాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రమే లేదు. చాలా ఏజెన్సీలను ఐపీఎస్‌ల నుంచి ఎంపిక చేసిన సీనియర్ స్థాయి అధికారులు నడుపుతూంటారు. సంస్కరణలు కష్టం అవుతూండేందుకు ఇది కూడా ఒక కారణం. పాతికేళ్ల నివేదికలు... మిలిటరీ సంస్కరణల విషయంలో దాదాపు 24 ఏళ్లుగా చాలా నివేదికలు వెలువడ్డాయి. నిశితంగా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తే ఉన్నత స్థాయిలోని పోలీసు వర్గాలు, రాజ కీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలనే స్వార్థంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. 2024 ఎన్నికల సమయం దగ్గరపడింది. కాబట్టి వ్యవస్థాగతమైన సంస్కరణలకు ఇదేమంత మంచి సమయం కాదు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ విష యాన్ని కచ్చితంగా చేపట్టాల్సిందే. ఇప్పటివరకూ ఈ అంశంపై వెలువడ్డ నివేదికలన్నింటినీ కూలంకుషంగా సమీక్షించి ఒక టాస్క్‌ఫోర్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ధారించుకుని ముందడుగు వేయాలి. ఈ సంస్కరణలకు పునాదులుగా నిలిచే అంశాలు ఇరవై ఏళ్లుగా నిఘా వర్గాల్లో నైపుణ్యం సాధించిన వారి నివేదికల ఆధారంగా ఉంటాయని నమ్ము తున్నాను. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగతంగా నైతిక నియ మాలున్న వారు నిఘా వ్యవస్థల్లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రజా పరిశీలనకు దూరంగా, పారదర్శకం కాని తెర వెనకాల ఈ వ్యవస్థలు పనిచేస్తూంటాయి మరి. కాబట్టి వీరి పనితీరును బహిరంగంగా సమీక్షించడం అసాధ్యమే కాదు, వాంఛనీయం కూడా కాదు. కెనడా ఇటీవలే భారతీయ నిఘా వ్యవస్థలపై కొన్ని ఆరోపణలు గుప్పించింది. అమెరికా కూడా ఈ అంశంలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు ఏమంత మంచివి కాదు. 26/11 ఉగ్రదాడి మనలోని లోపాలు ఎన్నింటినో ఎత్తి చూపింది. వాటిని పరిష్కరించే విషయంలో ఇప్పటికే జరిగిన జాప్యం చాలు. ఈ విషయంలో వీలైనంత తొంద రగా సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం దేశ హితం దృష్ట్యా అవసరం. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త డైరెక్టర్, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇద్దరు పోలీసు అధికారులు.. హవాలా వ్యాపారితో కుమ్మక్కై.. ఏకంగా..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఇటీవల హవాలా డబ్బులను పోలీసులు నొక్కేసిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు ఆలస్యంగా తెలిసింది. గతనెల 20న ‘హవాలా డబ్బులు హాంఫట్’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఓ మండలానికి చెందిన హవాలా వ్యాపారి నగరంలోని గంజ్ ప్రాంతానికి వాహనంలో హవాలా డబ్బులతో రావడంతో పకడ్బందీ సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. సదరు హవాలా వ్యాపారిని డైరెక్ట్‌గా వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, రూ.16 లక్షలను తీసుకున్నట్లు సమాచారం. అనంతరం హవాలా వ్యాపారి, ఎస్‌హెచ్‌వో, ఓ సీఐ బేర సారాలు చేసి రూ. 8 లక్షలు తీసుకుని మిగితా రూ. 8లక్షలను ఓ సీఐ, ఎస్‌హెచ్‌వో, సమాచారమిచ్చిన వారు వాటాలు చేసుకుని పంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సెటిల్మెంట్లో ఎస్‌హెచ్‌వోకు ఫోన్ చేసి సమాచారమిచ్చినవారికి రూ. 3 లక్షలు, హవావా డబ్బులు సెటిల్మెంట్ చేసిన ఓ సీఐకి రూ. 1.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హవాలా వ్యాపారిని పట్టుకున్న ఎస్‌హెచ్‌వోకు రూ. 3.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసు, ఎన్నికల అధికారులకు ఫి ర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ సెటిల్మెంట్పై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు స్పెషల్ బ్రాంచ్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హవాలా డబ్బుల వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ఎన్నికల వేళ పట్టుకున్నట్లుగా.. సదరు రూ. 8 లక్షలను నొక్కేసిన సదరు పోలీసు అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. ఎన్నికల వేళ పట్టుకున్న డబ్బులను చూపిస్తూ ఉన్నతాధికారులను తప్పదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల కంటే ముందే హవాలా డబ్బులను వాటాలు వేసుకున్న పోలీసులు ఎన్నికల వేళ పట్టుకున్న డబ్బులుగా చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు తమ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు పోలీసు అధికారులు హవాలా వ్యాపారితో కుమ్మక్కై ఏకంగా ఉన్నతాధికారులను తప్పదోవ పట్టించడంపై వారు కూడా సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు పీడీఎస్ బియ్యం వ్యాపారులతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. మరొకరు ఇతర ఘటనల ద్వారా డీఐజీకి అటాచ్ చేయబడ్డారు. అయితే ఓ రాజకీయ నేత ద్వారా మళ్లీ ఆయన పోస్టింగ్ తీసుకున్నట్లు తెలిసింది. హవాలా డబ్బులపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు విచారణ చేపట్టడంతో పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రాంతాల్లో హవాలా వ్యాపారులున్నారు..? ఎన్నికల వేళ పోలీసులు హవాలా వ్యాపారులపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో ఎక్కువమంది గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లడంతో ఇక్కడ హవాలా వ్యాపారులు అధికంగా ఉండటంతో పోలీసులు హవాలా దందాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఏ ప్రాంతాల్లో హవాలా వ్యాపారులు ఉన్నారు. గతంలో ఎవరిమీదైనా పోలీసులు కేసులు నమోదయ్యాయా..అనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా హవాలా డబ్బులను పోలీసులు పట్టుకున్నారు. దీంతో జిల్లా తోపాటు మండల కేంద్రాలకు హవాలా డబ్బులు చేరుతున్నాయని పోలీసులు గుర్తిస్తున్నట్లు తెలిసింది. -
‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్
వాషింగ్టన్: చైనా వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టింది!. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఇవే. అంతేకాదు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్-19 జబ్బు వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే చైనా వాటిని ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ.. కౌంటర్ విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనాకు కరోనా విషయంలో దాదాపుగా క్లీన్చిట్ లభించేసినట్లయ్యింది. కోవిడ్ మహమ్మారి వుహాన్ ల్యాబ్ నుంచి పుట్టిందనడానికి ఆధారాలు దొరకలేదు.. ఇది తాజాగా అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన నివేదికలోని సారాంశం. అలాగే.. కరోనా పుట్టుక ఎక్కడి నుంచి అనేదానిపైనా స్పష్టత ఇవ్వలేకపోయాయి కూడా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోపాటు మరో సంస్థ కూడా ఈ దర్యాప్తును చేపట్టగా.. తాజాగా నాలుగుపేజీల నివేదిక బయటకు వచ్చింది. వుహాన్ ఇనిస్టిట్యూట్‌లో(WIV) కరోనావైరస్పై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. కానీ, వ్యాప్తికి అక్కడి నుంచే మొదలైందనడానికి ఆధారాలు మాత్రం లభించలేదు. ప్రత్యక్షంగా ఆ ల్యాబ్ నుంచి పుట్టిందని చెప్పడానికి ఆనవాలు ఏం దొరకలేదు.. అని ఏజెన్సీలు తమ నాలుగు పేజీల నివేదికలో పేర్కొన్నాయి. కరోనా టైంలో ఇనిస్ట్యూట్లోని ల్యాబ్‌లో కరోనా పరిశోధనలు జరిగాయి. కానీ, ప్రీ కోవిడ్ టైంలో అలాంటి వైరస్ల మీద పరిశోధనలు జరిగినట్లు ఆధారాలు దొరకలేదు అని నిఘా నివేదిక వెల్లడించింది. గతంలో పలు అధ్యయనాలు.. కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ ఆరోపిస్తూ వచ్చాయి. అగ్రరాజ్యం సంస్థల ఆరోపణల నేపథ్యంలో.. వుహాన్‌లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం 2021 ఫిబ్రవరిలో సందర్శించింది కూడా. కానీ, ఎటూ తేల్చలేకపోయింది. ఇక ఇప్పుడు అమెరికా నిఘా సంస్థలు సైతం ఏం లేదని తేల్చడంతో.. దాదాపుగా వుహాన్ ల్యాబ్ థియరీకి ముగింపు దొరికిందనే చెప్పొచ్చు. చైనాలో అత్యున్నత వైరస్ పరిశోధాన కేంద్రాల్లో ఒకటైన ఈ వుహాన్ కేంద్రాన్ని 2003లో సార్స్ వైరస్ విజృంభణ తరువాత నిర్మించారు. ఇదీ చదవండి: హిందూ సంప్రదాయం ప్రకారం బైడెన్‌కు.. -
నాపై కుట్రలు చేశారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాలు, ఇటు జిల్లా ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. కాగా, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మంగళవారం స్పందించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, బురద జల్లేందుకే కొందరు సోషల్ మీడియా వేదికగా కుట్రలు చేశారని ఆరోపించారు. వారి వివరాలను బయటపెడతానని స్పష్టం చేశారు. మూడు రోజులుగా సోషల్ మీడియా లో యువతుల కోసం చాటింగ్ పేరుతో వైరలైన ఫొటోలతో తనకు సంబంధంలేదని తెలిపారు. డెయిరీ విస్తరణ కోసం ఎమ్మెల్యేగా పిలిస్తే వెళ్లానని, అంతకుమించి తనకు ఏం తెలియదన్నారు. బాధిత రైతులు నిర్వాహకులపై కేసులు పెట్ట గా, కొందరు కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. డెయిరీ నిర్వాహకులపై ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే పలుచోట్ల కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని డెయిరీలో పనిచేసిన ఓ ఉద్యోగి, పలువురు రైతులు నిర్వాహకులపై ఆరోపణలు చేశా రు. కాగా, డెయిరీ భాగస్వామి షెజల్ మంగళవారం మరో వీడియోను విలేకరులకు విడుదల చేశారు. ‘మేం బ్లాక్మెయిల్ చేస్తున్నామంటున్నారు, ఇంతటి తో ఆపేస్తే ఆయనకు మంచిది, లేదంటే నిజాల్ని బయటపెడతా’ అని వీడియోలో పేర్కొన్నారు. -
సైన్యంలో విద్రోహులు!
న్యూఢ్లిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడైందని వెల్లడించాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా వారు సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలిందని చెప్పాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపాయి. ‘‘వారికి పొరుగు దేశంతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని నిఘా అధికారులు తెలిపారు. దీనిపై ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు. పాక్, చైనా గూఢచారులు మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి సైనికాధికారులపై వల పన్నుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా కొందరు అధికారులు వారి గాలానికి చిక్కినట్టు తెలుస్తోందని నిఘా వర్గాలు వివరించాయి. చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం) -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: ప్రజల మనుసులో ఏముంది?
సాక్షి, వరంగల్: ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీగా ఇంటెలిజెన్స్ వర్గాలు మకాం వేశాయి. ప్రధాన రాజకీయ పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజా అభిప్రాయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీ ‘గ్రాఫ్’ఎలా ఉందో లెక్కలు కడుతున్నాయి. హైదరాబాద్, పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది నియోజకవర్గంలోని కమలాపూర్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు హనుమకొండ, పరకాల, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పథకాలపై ఎలా స్పందిస్తున్నారు? మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, టీఆర్ఎస్కు ఆయన రాజీనామా, బీజేపీలో చేరిక నేపథ్యంలో అధికార పార్టీ, ప్రభుత్వం హుజూరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తి కోసం సుమారు రూ.1,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చే విధంగా దళితబంధు పథకాన్ని ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఈ నెల 16న జమ్మికుంటలో జరిగే సభకు హాజరుకానున్నారు. మరోవైపు పార్టీ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా నియమించి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు?, అధికార పార్టీ విషయంలో ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారు? తదితర అంశాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి అంచనా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏ మేరకు ప్రజాదరణ ఉందో అంచనా వేసే పనిలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. 12 రోజుల పాటు కొనసాగిన ఈటల రాజేందర్ పాదయాత్ర, ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆగిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం హుజూరాబాద్‌పై దృష్టి సారించి దీటైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌ల పేర్లు ఖరారు కావడంతో మాజీ మంత్రి కొండా సురేఖను పోటీలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వివరాలు సేకరించడం చర్చనీయాంశంగా మారింది. -
బాంబ్ ప్రూఫ్ హౌస్‌లో మసూద్..
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఆచూకీని భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. బహవల్పూర్ జైషే ప్రధాన కేంద్రం వెనుక బాంబ్ ప్రూఫ్ నివాసంలో మసూద్ అజర్ బస చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి మసూద్ అజర్ భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. మసూద్‌కు సంబంధించిన కౌసర్ కాలనీ బహవల్పూర్, మదర్సా బిలాల్ హడబ్షి పతున్‌క్వా, మరర్సా లక్కి మర్వత్ బహవల్పూర్ అనే మూడు చిరునామాలనూ నిఘా సంస్థలు కనుగొన్నాయి. జైషే చీఫ్ అదృశ్యమయ్యాడని పాకిస్తాన్ పేర్కొంటున్న క్రమలో మసూద్ అజర్ కదలికలపై నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముంబై ఉగ్రదాడిలో ప్రమేయమున్న లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్తాన్ మసూద్ అజర్‌పై మాత్రం భారత్ పలు ఆధారాలు చూపినా నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. చదవండి : జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఏమైంది.? -
కౌంటింగ్ రోజు భారీ ఉగ్రదాడికి స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఉత్కంఠ రేపిన సార్వత్రిక సమరంలో విజేతలు ఎవరో తేలనున్న మే 23న అదును చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని ఉగ్రమూకలు సంసిద్ధమైనట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు తమ టార్గెట్లుగా ఎంచుకున్న వాటిలో శ్రీనగర్, అవంతిపుర వైమానిక స్ధావరాలు ఉన్నట్టు సమాచారం. సొపియాన్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదుల్లో ఒక మృతదేహం నుంచి ఓ స్కెచ్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్, అవంతిపుర ఎయిర్‌బేస్‌లపై దాడికి ఉగ్ర మూకలు ప్రణాళిక రూపొందించినట్టు ఈ స్కెచ్ వెల్లడించింది. కాగా, ఈనెల 14న పుల్వామాలో ఉగ్ర కమాండర్ల భేటీలో హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన రియాజ్ నైకూ, ఇద్దరు జైషే టెర్రరిస్టులు, లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ దర్లు పాల్గొని భద్రతా, సాయుధ దళాలపై దాడికి వ్యూహం రూపొందించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రంజాన్ మాసంలో ముఖ్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టే మే 23న భారీ ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారని వెల్లడించాయి. -
ఉగ్ర నీడలను పసిగడుతూ పంజా..
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన నేపథ్యంలో పాకిస్తాన్‌లోని బాలకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర కదలికలపై ఆరా.. బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరంలో నాలుగు భవనాల్లో సమావేశమైన టెర్రరిస్టుల సంఖ్యపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు వెల్లడించాయి. దౌరా ఈ మౌలాత్ అనే భవనంలో 30 మంది టెర్రరిస్టులు సమావేశమయ్యారని, ఫిబ్రవరి 25న బాలకోట్లో ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక దౌరా ఈ ఖాస్ అనే భవనంలో ఫిబ్రవరి 26న 91 మంది ఉగ్రవాదుల భేటీలో భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు 25 మంది ఉగ్రవాదులకు ఈ శిబిరంలో శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఐదు రోజుల్లో ఫిబ్రవరి 19న తిరిగి బాలకోట్‌లోని ఉగ్ర స్ధావరానికి టెర్రరిస్టులు చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే స్ధావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లను ఈ శిబిరానికి జైషే చీఫ్ పంపినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల పసిగట్టాయి. ఉగ్ర కదలికలపై అనుక్షణం నిఘా వేసి ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించేలా మెరుపు దాడులతో వైమానిక దళం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున విరుచుకుపడింది. -
దావూద్ గ్యాంగ్‌లో లేడీస్ టీం
సాక్షి, ముంబై : అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన చీకటి సామ్రాజాన్ని విస్తరించేందుకు మహిళలకూ ఎర వేస్తున్నాడు. మాఫియా గ్యాంగ్‌లు తమ కార్యకలాపాల్లో మహిళలు, కుంటుంబాలను దూరం పెడితే డీ గ్యాంగ్ మాత్రం ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. మహిళలు టార్గెట్‌గా ఉన్న ఆపరేషన్స్‌ను చక్కబెట్టేందుకు లేడీస్ వింగ్‌ను రంగంలోకి దించే వ్యూహంతో డీ కంపెనీ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిఘా సంస్థలు భావిస్తున్నాయి. మహిళా సభ్యుల ఫోన్ కాల్స్‌ను నిఘా వర్గాలు విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం మహిళల నుంచి నిత్యం సొమ్ము వసూళ్లు చేస్తూ తమకు కేటాయించిన మిషన్స్‌పై ఎప్పటికప్పుడు దావూద్‌కు వివరాలు చేరవేస్తున్నట్టు తెలిసింది. దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్ లేడీస్ వింగ్ బాధ్యతను ఉస్మాన్ అనే తన సన్నిహితుడికి కట్టబెట్టాడు. లేడీస్ వింగ్‌కు సంబంధించిన సమాచారం, వారు సాగిస్తున్న కార్యకలాపాలపై మాజీ ఐపీఎస్ అధికారి పీకే జైన్ విస్తుపోయారు. పోలీస్ అధికారిగా తన హయాంలో ఇలాంటి అంశాలు ఎన్నడూ తన అనుభవంలోకి రాలేదని మాఫియా కార్యకలాపాలను నిర్వహించడంలో దావూద్ ఇబ్రహీం నిస్సహాయ స్థితిలో ఉన్నాడనేందుకు ఇది సంకేతమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ల నుంచి రూ కోటి డిమాండ్ చేస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని ముంబయి ఖర్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేయడంతో డీ కంపెనీ మహిళా విభాగం కార్యకలాపాలు వెలుగుచూశాయి. మరోవైపు పోలీస్ నిఘా, దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు దావూద్ ముఠా వ్యూహం మార్చిందని.. ఇప్పుడు దావూద్ బిట్‌కాయిన్స్‌లో లావాదేవీలు కొనసాగిస్తున్నాడని, సంప్రదాయ కరెన్సీ నుంచి ప్రత్యామ్నాయాలకు మళ్లాడని భావిస్తున్నారు. -
వార్నింగ్ : ఆ 42 యాప్స్ చాలా డేంజర్
స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ఉంది కదా? అని ఎడాపెడా యాప్స్‌ను డౌన్లోడ్ చేస్తుంటారు కొంతమంది యూజర్లు. కానీ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ యాప్స్‌తో మాల్వేర్ అటాక్‌లు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెనుముప్పు కలిగించే చైనీస్ యాప్స్ వివరాలను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. దీనిలో 42 మొబైల్ అప్లికేషన్లున్నాయి. ఈ యాప్స్ వల్ల భారత భద్రతా వ్యవస్థకు ముప్పు వాటిల్లి ఉందని హెచ్చరించాయి. వెంటనే మీ స్మార్ట్ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని దేశీయ సైన్యాన్ని, పార్లమెంటరీని ఆదేశించాయి. '' చైనీస్ డెవలపర్లు అభివృద్ధి చేసిన యాప్స్ వాడటం ద్వారా ఫోన్లలోని సమాచారం అంతా చైనాకి చేరిపోతుంది. ఈ యాప్స్ డౌన్లోడ్ వల్ల మాల్వేర్ అటాక్స్ జరుగుతున్నాయి'' అని వార్నింగ్ బెల్ మోగించింది. ఆ 42 మొబైల్ యాప్స్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేసి, స్మార్ట్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని భారత సైన్యానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆదేశాలు జారీచేసింది. అదనంగా కొన్ని ఇంటర్నెట్ మోడల్స్‌ను కూడా హానికరమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ఏ యాప్ అయినా డేటాను అధికంగా వినియోగిస్తుంటే.. అది కచ్చితంగా అదనపు సమాచారాన్ని సేకరిస్తుందని భావించాలని భద్రతా నిపుణులు సందీప్ సేన్ గుప్తా వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిత యాప్స్‌గా పేర్కొన్న వాటిలో అత్యంత పాపులర్ అయిన షేర్ ఇట్, ట్రూకాలర్, యాంటీ వైరస్, వెబ్ బ్రోజర్స్ వంటివి కూడా ఉన్నాయి. 42 డేంజర్ యాప్స్ ఇవే : వీబో, వి చాట్ , షేర్ఇట్ , ట్రూకాలర్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్‌డాగ్, వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్, ప్యారెలల్ స్పేస్, ఏపీయూఎస్ బ్రౌజర్, ఫర్ఫెక్ట్ కార్ప్, వైరస్ క్లీనర్, సీఎం బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్, వాల్యుట్ హైడ్, యూక్యామ్ మేకప్, ఎంఐ స్టోర్, క్యాచి క్లీనర్ డీయూ యాప్స్ స్టూడియో, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ క్లీనర్, డీయూ ప్రైవసీ, 360 సెక్యురిటీ, డీయూ బ్రౌజర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్, బైడు ట్రాన్స్‌లేట్, బైడు మ్యాప్, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఫోటో వండర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, విసింక్, క్యూక్యూ సెక్యురిటీ సెంటర్, సెల్ఫీసిటీ, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్-షావోమి, క్యూక్యూ లాంచర్. దీనిపై స్పందించిన ట్రూకాలర్, తాము స్వీడన్‌కు చెందిన కంపెనీ అని, ఈ జాబితాలో తమ పేరు ఎందుకు వచ్చిందో విచారణ జరుపుతామని తెలిపింది. ట్రూకాలర్ మాల్వేర్ కాదని పేర్కొంది. -
మన నట్టింట్లో డ్రగ్స్ భూతం
సందర్భం మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని నిఘా సంస్థలు ఆధారాలతో సహా హెచ్చరిస్తున్నాయి. పెనువాయువును మించిన వేగంతో విస్తరిస్తున్న డ్రగ్స్‌ను అరికట్టకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. ఏ దేశాభివృద్ధి అయినా సరే కుంటుపడిపోవడం, ఒక్కసారిగా వినాశనమవడం లాంటి పెను విపత్తులకు పెద్ద పెద్ద యుద్ధాలు, ఆణ్వాయుధాలే కారణమవ్వాల నేంలేదు. ఆ దేశంలోని తరగతి గదుల్లో అమలవుతున్న విద్యలో విలువలు లేకపోతే చాలు.. యావజ్జాతి తుడిచిపెట్టుకుపో తుంది. అంధకారంలో మగ్గిపోతుంది. డ్రగ్స్ వల్ల ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ఎంతో దృఢకాయు లుగా పేరున్న పంజాబీలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తమ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. ఆ రాష్ట్ర యువతపై గతంలో కొన్ని శాంపిల్స్ తీసి పరీక్షిస్తే 74 శాతం మాదక ద్రవ్యాలకు వ్యసనపరులుగా మారిపోయారని నివే దిక వచ్చిందంటే ఆ రాష్ట్రం ఎంతటి భారీ విపత్తును ఎదు ర్కొన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉందని నిఘా వర్గాలు తేల్చి చెప్పడం ఎంతో ఆందోళన కలిగించే అంశం. కలవరపెట్టే విషయం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉండటం మరింత కలవర పెడుతోంది మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సంపన్న వర్గాల్లోని యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్న విషయాన్ని అవి ఎత్తి చూపుతున్నాయి. విద్యాసంస్థలే లక్ష్యంగా మత్తు పదార్థాల సరఫరా జరుగుతోందని అబ్కారీ శాఖ చెబుతోంది. ఇప్ప టికే 5 వేల మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడినట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మత్తు పదార్థాల వినియో గం అనే అతిపెద్ద ఉపద్రవం నుంచి యువతను తక్షణమే బయటపడేయాలి. సంపన్నవరాలు ఆయాచితంగా వస్తున్న సంపాదన నుంచి బయటకు వచ్చి వారి పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లల స్థితిగతులను గుర్తించి త్వరగా∙దారిలో పెట్టలేక పోతే వారెంత సంపాదించినా వృథానే. చివరికి మిగిలేది శూన్యమే. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించినా.. వాటిని ఉటంకిస్తూ ఎన్ని ప్రకటనలు ఇచ్చుకున్నా.. విలువలు లేని చదువు యువత భవిష్యత్తును ఆదర్శంగా తీర్చిదిద్దలేదనే విషయాన్ని విద్యాసంస్థలు గమనంలో ఉంచుకోవాలి. పదుల వయసులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అనేది తీవ్రమైన సమస్య. ఇది పెనువాయువును మించిన వేగంతో విస్తరిస్తుంది. ‘మత్తు’ను అరికట్టాలంటే అన్ని వైపుల నుంచి తక్షణమే ప్రయత్నాలు మొదలవ్వాలి. లేదంటే దేశ భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఏం చేయాలి? : 1.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా నింది తులను గుర్తించి కేసులు పెడుతోంది. తక్షణమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థలను రంగంలోకి దించాలి. 2.ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు అధ్యాపకు లను గుర్తించి, వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలి. మత్తు బారిన పడిన విద్యార్థులను గుర్తించడం ఎలా..? బాధిత విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇలా ఇవ్వాలి లాంటి అంశాలపై ఎంపిక చేసిన అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి. 3. కళాశాల స్థాయిలోనే డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపేలా ఒక చట్టాన్ని రూపొందించి, కట్టుదిట్టంగా అమలుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. 4. రెండు రాష్ట్రాల్లోనూ కళా శాలలకు సమీపంలో ఉన్న దుకాణాల యజమానులపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగాలి. 5. పొగ తాగడమనే దురలవాటును మన యువతకు దూరం చేయగలుగు తున్నాం.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను డ్రగ్స్ విషయంలోనూ చేపట్టాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి?: 1.తల్లి దండ్రులు తమ పిల్లలను ఒక సంస్థలో చేర్చేప్పుడు.. చదు వుతోపాటు ఆ సంస్థ కనీస విలువలు పాటిస్తున్నదో లేదో చూసుకోవాలి. 2.ధనవంతుల పిల్లలు చేరే కళాశాలలు, పాఠశాలల్లోనూ తమ పిల్లలను కూడా చేర్చాలనే భావన నుంచి బయటకు రావాలి. 3. తమతమ వ్యాపకాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించాల్సిందే. 4.ఇప్పటికే ఇంట్లో పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటుపడి ఉంటే.. వారిని బంధించడం, అసహ్యిం చుకోవడంలాంటివి చేయొద్దు. సమస్యను గుర్తించి వారికి భరోసా ఇవ్వాలి. 5.మత్తు పదార్థాలకు బానిసలవడమనే సమస్య తీవ్రంగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులు మానసిక వైద్యుల వద్దకు, డ్రగ్ అడిక్షన్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలి. విద్యాసంస్థలు ఏం చేయాలి..?: 1.విద్యాసంస్థలు మంచి మార్కులు వచ్చేలా చేయడం, జ్ఞానాన్ని ఇవ్వడం మాత్రమే తమ బాధ్యతగా భావించరాదు. 2. ప్రతి ఉపా ధ్యాయుడు, చదువుతోపాటు తరగతి గదుల్లో కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని నైతిక విలువల గురించి విద్యార్థులకు చెప్పాలి. 3.విద్యాసంస్థలు ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి సమస్యను తెలుసుకోవాలి. పరిష్కార మార్గాన్ని కూడా చూపాలి. 4 తరచూ ప్రతిభా వంతులైన సైకాలజిస్టులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉండాలి. 5. విద్యార్థుల ఆలోచనలు ఎప్పుడూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే దాని చుట్టూనే తిరు గుతుండేలా చేయాలి. మనకున్న ఆస్తిపాస్తులు ఇళ్లు, పొలాలు కాదు.. మన పిల్లల సచ్ఛీలత, వారు నేర్చుకున్న నైతిక విలువలు, జీవి తంలో వారు పాటిస్తున్న క్రమశిక్షణ.. ఇవే మన నిజమైన ఆస్తులు. ఈ సంపాదన కోసం అంతా కృషి చేయాలి. తల్లి దండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విశేష ప్రచారం కల్పించాలి. అప్పుడు మన భవిష్యత్తు తరాలను, మన దేశాన్ని మనం కాపాడుకున్నవారమవుతాం. వ్యాసకర్త విద్యావేత్త, విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య -
ఈసారి రూటు మార్చిన టెర్రరిస్టులు!
న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా పలు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఇంటిలిజెన్స్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెర్రరిస్టులు కొత్త రకం దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ గురువారం మరోసారి హెచ్చరించింది. కుక్కలను, పిల్లులను, ఎలుకలను ఆత్మాహుతి దాడులుగా మార్చి మారణహోమానికి పన్నాగం పన్నుతున్నారని పేర్కొంది. డీఎన్ఏ రిపోర్టుల ప్రకారం ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్ వంటి పలు ముఖ్యమైన ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారని, గణతంత్ర వేడుకల సందర్భంగా వారు కుక్కలతో ఆత్మాహుతికి దాడికి దిగే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉంటాలంటూ ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీచేసింది. శీతాకాల సమయాన్ని అవకాశంగా తీసుకుని , పెంపుడు జంతువులకు వేసే స్వెట్టర్ల ద్వారా దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు వివరించాయి. రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ దాడులు చేస్తారని తెలిపింది. జంతువులను వాడుకుని మొదట సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ టెర్రర్ అటాక్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు పక్షులను సైతం ఉగ్రదాడులకు వాడుకోనున్నాయని తెలుస్తోంది. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిఘా వర్గాల దర్యాప్తు వేగవంతం
కోర్టు ఆవరణలో ఓ బాక్స్స్వాధీనం? అణువణువున తనిఖీలు నెల్లూరు (క్రైమ్) : కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనపై కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఇప్పటికే ఇంటలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటలిజెన్స్ బృందాలు పేలుడుకు గురైన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు ఎలాంటి పరికరాలు, ఏయే పదార్థాలను వినియోగించారు తదితరాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. పేలుడు అనంతరం లభ్యమైన అవశేషాలను పరిశీలించారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ బృందం అవశేషాలన్నింటిని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు, నెల్లూరు కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు ఒకే తరహాలో ఉండటంతో ఉగ్రవాద చర్యగా నిఘా వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే అంతటితోనే కాకుండా విభిన్న కోణాల్లో సైతం విచారణ సాగిస్తున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఎవరో కావాలనే భయాందోళనకు గురి చేసేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేలుడు వెనుక సూత్రధారులను కనుగొనే ప్రయత్నంలో జిల్లా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వారి కార్యకలాపాలు, అసాంఘిక శక్తులు తదితరాల వివరాల సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ హోటల్స్, లాడ్జిలు, శివారు ప్రాంతాల్లోని గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సోదాలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి రోజు బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన కోర్టు ఆవరణలో బుధవారం బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా జడ్జి పరిశీలించారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలోని రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఫ్లిప్‌కార్ట్ బాక్స్‌ను బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
భారత్ కు చైనా మీడియా బెదిరింపులు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. భారతీయులకు తమ దేశ వీసాలు ఇవ్వడం చైనా మరింత కష్టతరం చేసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల చైనాలో ఉంటున్న భారత జర్నలిస్టులపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తమకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవ అని జాతీయ టాబ్లయిడ్ గ్లోబల్ టైమ్స్ ఆదివారం హెచ్చరించింది. వీసాల విషయంలో భారత్ చర్యలకు తమ ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయని, కొందరు భారతీయులకు వీసాలు దొరకడం ఇక కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది. -
చైనాకు భారత్ ఝలక్!
న్యూఢిల్లీ: చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించింది. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చైనీస్ జర్నలిస్టులను భారత్ నుంచి బహిష్కరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో జిన్హుహా బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న వు కియాంగ్, ముంబైలోని అతని సహచరులు లు తాంగ్, షె యంగాంగ్లను జూలై 31లోగా దేశం విడిచి వెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. మారుపేర్లతో, ఇతర వ్యక్తుల మాదిరిగా ఈ ముగ్గురు జర్నలిస్టులూ దేశంలోని ఆంక్షలున్న ప్రాంతాలను సందర్శిస్తున్నారని, వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిఘా ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిన్హుహాకు చెందిన ముగ్గురు సిబ్బంది వీసాలను అధికారులు రద్దుచేశారు. వు కియాంగ్ గత ఆరేళ్లుగా పొడిగింపు వీసాతో దేశంలో పనిచేస్తుండగా, అతని సహచరులు కూడా గతంలో వీసా కాలపరిమితి పొడిగింపు పొందారు. ప్రభుత్వ గొంతుక అయిన జిన్హుహా చైనాలో బలమైన, ప్రభావవంతమైన వార్తాసంస్థగా పేరొందింది. -
పండుగ రోజుల్లో ఢిల్లీపై ఐఎస్ఐఎస్ కన్ను?
దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి ఈ వివరాలు ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్‌కు వెళ్లాయి. వాళ్లు మొత్తం పరిస్థితిని గమనిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. 'లోన్ వుల్ఫ్' అనే బృందం లేదా ఒక వ్యక్తి ఢిల్లీలో దాడులు చేయొచ్చని ఉగ్రవాదుల సంభాషణలను రహస్యంగా సేకరించిన నిఘా వర్గాలు తెలిపాయి. సిమి సభ్యులు కూడా ఐఎస్ఐఎస్ కోసం పనిచేసే అవకాశం కూడా లేకపోలేదని, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దాడులకు పాల్పడొచ్చని చెబుతున్నారు. సిమి ఎప్పుడూ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడుతుంటుంది. ఇదే తరహా వ్యూహాన్ని ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్ కూడా అవలంబిస్తోంది. ఉగ్రవాదుల దాడులకు ఢిల్లీ సులభంగా టార్గెట్ కావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా ఏయూటీ అనే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో కలిసిపోవడంతో ఈ ప్రమాదం పెరిగిందని అంటున్నారు. 2008లో జరిగిన బాట్లాహౌస్ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులను 'అమరవీరులు'గా పేర్కొంటూ ఏయూటీ సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్‌లో సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఇటీవలి కాలంలో ఏయూటీ సంస్థకు, ఇస్లామిక్ స్టేట్‌కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని, కొంతమంది యువకులు ఈ రెండు సంస్థలను సంప్రదించినట్లు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నిఘా వర్గానికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతోపాటు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థల నుంచి కూడా ఢిల్లీకి ముప్పు పొంచి ఉంది. -
మరో మారణ హోమానికి ప్లాన్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లష్కరే ఈ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేయనున్నారా? 2008 ముంబై తరహా దాడులకు పథక రచన చేస్తున్నారా.. ఆగస్ట్ 15 సందర్భంగా ఢిల్లీలో మారణ హోమం సృష్టించడానికి పూనుకుంటున్నారా.. అవుననే అంటున్నారు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసు అధికారులు. జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్టులు ఆగస్ట్ 15, అంతకు ముందు దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, నిఘా అధికారుల నుండి తమకు హెచ్చరికలు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లోధి రోడ్‌లోని తమ సంస్థల కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు. ఇంటిలిజెన్స్ విభాగం హెచ్చరికల ప్రకారం ఒకవైపు టెర్రరిస్టులు దాడులకు సిద్ధమవుతోంటే.. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతా ధికారుల్లో మాత్రం రక్షణ సౌకర్యాల లేమిపై ఆందోళన మొదలైంది. తమ దగ్గర సరైన రక్షణ వ్యవస్థ లేదనందున తమ శ్రేణుల భద్రతకోసం మరిన్ని అధునాతన రక్షణ పరికరాలతో పాటు, సీసీ కెమెరాలు అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్ఎస్జీ, ఎస్పీజీ,సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాల రక్షణకు ప్రత్యేక యూనిట్ కావాలని, ఎవరైనా వాహనంతో బలవంతంగా తమ ఆఫీసులో చొరబడితే, దాన్ని ఎదుర్కొనే శక్తి లేదనీ, మరిన్ని రక్షణ సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. అత్యాధునిక, వాటర్ ప్రూఫ్ గేట్లు, సుమారు 20 టన్నుల భారాన్ని మోసే, మూడు సెకండ్లలో తెరుచుకునే మెటల్ గేట్స్ అవసరం చాలా ఉందన్నారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఇంటిలిటెన్స్ ఏజెన్సీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో డ్రోన్ల వాడకాన్ని నిషేధించారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విమానాలు మినహా, మిగిలినవాటికి అనుమతి లేదని ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
100 కోట్లు - కొత్త పార్టీ !
ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తారు? అవకాశముంటే మంత్రి పదవి దక్కాలని, కుదరకపోతే కార్పొరేషన్ లేదా ఇతర అధికార పదవుల్లో కొనసాగాలని ఆశపడతారు. కానీ కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే మాత్రం అవేవీ తనకు వద్దనీ, భవిష్యత్తులో తానే కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వస్తాననీ చెబుతున్నారట! అధికారంలోకి వచ్చిన తరువాత తానే ఇతరులకు మంత్రి పదవులు ఇస్తానని కూడా సన్నిహితులకు ఆశపెడుతున్నారట. అనుకున్నదే తడవుగా ‘రూ.100 కోట్లు-కొత్త పార్టీ’ లక్ష్యంగా వసూళ్ల పర్వానికీ తెరదీశారట. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులని కూడా చూడకుండా తన దగ్గరకు పనుల కోసం వచ్చే వారందరి దగ్గర ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారట. సదరు ఎమ్మెల్యే వ్యవహారం నచ్చని కొందరు నాయకులు ఈ విషయాన్నిసీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పార్టీ కార్యకర్తలు చెప్పిందంతా నిజమేనని తెలుసుకున్న సీఎం ఆ ఎమ్మెల్యేను పిలిపించి ‘తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు’ అంటూ తలంటుపోశారట. దాంతో ఎమ్మెల్యే వ్యవహారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ నాయకులు భావించినా ఆ ఎమ్మెల్యే మాత్రం ‘లైట్’గా తీసుకున్నారట. ‘రాబోయే ఎన్నికల నాటికి ఫలానా ఐపీఎస్ అధికారి, ఫలానా సామాజికవర్గ ఉద్యమకారుడితో కలిసి నేనే కొత్త పార్టీ పెట్టబోతున్నా. అప్పటి వరకు రూ.100 కోట్లు పోగేసుకుంటా. ఎవరేం చేస్తారో చూస్తా’ అంటూ మరింత రెచ్చిపోతున్నారట. ఇదంతా దగ్గరుండి గమనిస్తున్న సన్నిహితులు ‘మా ఎమ్మెల్యేకు ఇదేం పోయేకాలం’ అంటూ గుసగుసలాడుతున్నారు. -
తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇవ్వలేం
న్యాయపరమైన చిక్కులే కారణం: ఆర్బీఐ న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఇతరత్రా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల్లో జరిపిన తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిరాకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఈ విషయాన్ని పేర్కొన్నాయి. సమాచారాన్ని పంచుకోవడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్నది ఆర్బీఐ వాదన. అయితే, నల్లధనం, ఇతర ఆర్థికపరమైన నేరాలకు అడ్డుకట్టవేయాలంటే నో యువర్ కస్టమర్(కేవైసీ), మనీలాండరింగ్ నిరోధ చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనలపైనే అధికంగా దృష్టిపెట్టాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంటోంది. సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(సీఈఐబీ)కు ఫెమా ఉల్లంఘనల వివరాలను ఇచ్చేందుకు ఆర్బీఐ గతంలో హామీనిచ్చిందని.. ఇప్పుడు సమాచారం ఇవ్వడానికి ముందుకురావడం లేదని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)... తనకు అవసరమైన సమాచారాన్ని సీఈఐబీ నుంచే తీసుకుంటుంది. బ్యాంకుల్లో తనిఖీ నివేదికలను ఆర్బీఐ తమతో పంచుకోవడం లేదన్న విషయాన్ని తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్(ఈఐసీ) సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఈఐబీ చీఫ్ ఈ విషయాన్ని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. సీఈఐబీ అనేది చట్టపరమైన సంస్థ కాదని.. తనికీ నివేదికలను ఇవ్వడంవల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని ఆర్బీఐ చెబుతోందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆదాయపు పన్ను(ఐటీ) విభాగానికి కూడా ఆర్బీఐ నుంచి తగిన సహకారం అందడం లేదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఈ సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం. కేైవైసీ నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకులపై ఆర్బీఐ విధించిన జరిమానాలకు సంబంధించి ఐటీ శాఖకు వివరాలు ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరించడాన్ని సీబీడీటీ ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, ఈ సమాచారం ఇవ్వడం అనేది తమ నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ తేల్చిచెప్పింది. -
విమానాన్ని హైజాక్ చేయొచ్చు
-
విమానాన్ని హైజాక్ చేయొచ్చు: నిఘా వర్గాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి విదేశానికి వెళ్లే విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలు ఎయిర్పోర్ట్ అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. న్యూఢిల్లీ - కాబూల్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో న్యూఢిల్లీ నుంచి ఆప్ఘానిస్థాన్ వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు మళ్లించిన సంగతి తెలిసిందే. -
నిఘావర్గాలు హెచ్చరించినా పోలీసుల నిర్లక్ష్యం..
గోరంట్ల పరిధి ప్రశాంతినగర్‌లో దొంగల హల్చల్ పట్టపగలే యథేచ్ఛగా రూ.30 లక్షల విలువైన సొత్తు దోపిడీ సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాలన్నా, బంగారు ఆభరణాలు ధరించి బయటకు రావాలన్నా జనం హడలిపోతున్నారు. నిఘా వర్గాలు హెచ్చరించిన రెండు రోజులకే నగర శివారు గోరంట్ల గ్రామంలో శుక్రవారం దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంటిలో పనిమనిషిని కట్టిపడేసి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సొత్తు దోచుకెళ్లడం పోలీసులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు చేసే ముఠాలు తిరుగుతున్నాయని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు రెండు రోజుల కిందట హెచ్చరికలు చేశాయి. ఈ విషయంపై అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా గోరంట్లలో జరిగిన దోపిడీ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. గోరంట్లలో దోపిడీ.... గోరంట్ల పరిధి నగరాలులోని పాండురంగానగర్‌లోగల ప్రశాంతినగర్ రెండో లైన్లో రిటైర్డ్ అగ్రికల్చర్ అధికారి మిరియూల లక్ష్మినారాయణ కుమారుడు మిరియూల మురళీకృష్ణ నివాసం ఉంటున్నారు. ఆయన బ్రాడీపేటలో పంచమి ప్రాజెక్ట్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వృద్ధుడైన తండ్రి లక్ష్మీనారాయణను ఇంట్లో ఉంచి తెల్లవారుఝామున మురళీకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లల్ని తీసుకుని అన్నవరం వెళ్లారు. ఇది గమనించిన ఆరుగురు గుర్తు తెలియని దుండగులు తెల్లని కారులో మురళీకృష్ణ ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్న లక్ష్మినారాయణను అమాంతం ఎత్తుకెళ్లి ఇంట్లో కూచోబెట్టారు. అనుకోని సంఘటనతో ఆయన నోటమాటరాలేదు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చారు. సుమారు 12.45 గంటల సమయంలో మురళీకృష్ణ కార్యాలయంలో పనిచేస్తున్న దబేర శ్రీనివాసరావు అనే యువకుడు లక్ష్మీనారాయణకోసం హోటల్ నుంచి భోజనం తీసుకుని వచ్చాడు. ఓ దుండగుడు శ్రీనివాసరావును లోపలకు లాగి కాళ్ళు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టర్ వేశారు. హతమారుస్తామని బెదిరించారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు రూ. 23లక్షల బంగారు ఆభరణాలు, రూ. 7లక్షల నగదును చక్కబెట్టారు ఒంటిగంటన్నర సమయంలో అక్కడకు పనిమనిషి రావడాన్ని బయటవున్న దొంగలకు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లోపలకు సమాచారం అందించారు. దాంతో దొంగలు చప్పుడు కాకుండా బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. ఇప్పటికైనా దృష్టి సారించాలి.... నగరంలో ఆరు పోలీసు స్టేషన్లు ఉండగా, ఇటీవల వరకు అరండల్‌పేట, గుంటూరు రూరల్, కొత్తపేట, పాతగుంటూరు స్టేషన్లకు సీఐలు లేరు. దీంతో పోలీసు సిబ్బంది ఇష్టాను సారంగా వ్యవహరించారు. ఇటీవల అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ ఆయా స్టేషన్లకు అటాచ్‌మెంట్‌పై సీఐలను నియమించినప్పటికీ కొత్త కావడంతో వారికి ఇంకా అవగాహన రాలేదు. ఏదేమైనా నగరంలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు చూసి నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా దొంగతనాలు, దోపిడీలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నగర వాసులు కోరుతున్నారు.