విమానాన్ని హైజాక్ చేయొచ్చు: నిఘా వర్గాలు | Terrorists may hijack Delhi-Kabul Air India flight, intelligence agencies warn | Sakshi
Sakshi News home page

విమానాన్ని హైజాక్ చేయొచ్చు: నిఘా వర్గాలు

Published Sun, Jan 4 2015 12:08 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM

విమానాన్ని హైజాక్ చేయొచ్చు: నిఘా వర్గాలు - Sakshi

విమానాన్ని హైజాక్ చేయొచ్చు: నిఘా వర్గాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి విదేశానికి వెళ్లే విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలు ఎయిర్పోర్ట్ అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

న్యూఢిల్లీ - కాబూల్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు  చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.  గతంలో న్యూఢిల్లీ నుంచి ఆప్ఘానిస్థాన్ వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు మళ్లించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement