అధికారులు విడుదల చేసిన జాకిర్ ముసా ఫొటో
అమృత్‌సర్: కశ్మీర్ ఉగ్రవాది జాకిర్ ముసా తమ రాష్ట్రంలో దాక్కున్నాడన్న సమాచారంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిక్కు మతస్తుడిగా వేషం మార్చుకుని ఫిరోజ్‌బాద్, బతిండా ప్రాంతాల్లో అతడు తలదాచుకున్నట్టు నిఘా విభాగం, సీఐడీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అతడి ఫొటోలను కూడా విడుదల చేశాయి. ఇతడి పోస్టర్‌లను పంజాబ్ పోలిసులు ఇప్పటికే గురుదాస్‌పూర్‌లో అతికించారు. దీంతో ఫిరోజ్‌బాద్, బతిండా ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
జమ్మూ-కశ్మీర్‌ను కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్‌వత్-ఉల్-హింద్(అల్-ఖాయిదా అనుబంధ సంస్థ)కు చీఫ్‌గా ఉన్న ముసా కోసం భద్రతా దళాలు చాలా రోజుల నుంచి గాలిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జేయిఎమ్‌తోనూ అతడికి సంబంధాలున్నాయి. పండగ సీజన్ కావడంతో అలజడిని సృష్టించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆర్మీ ప్రధాన అధికారి బిపిన్ రావత్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment