High alert
-
శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్
అగ్రరాజ్యం అమెరికాను శీతాకాల తుపాను భయకంపితులను చేస్తోంది. సుమారు పది లక్షల మంది అమెరికన్లు భారీ శీతాకాలపు తుఫానుకు ప్రభావితమయ్యారు. ఈ తుపాను కారణంగా ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం, అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.మధ్యఅమెరికాను తాకిన ఈ తుఫాను మరో రెండు రోజుల్లో తూర్పు దిశగా కదులుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్) తెలిపింది. ఈ నేపధ్యంలో కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి(Emergency) ప్రకటించారు. మిసిసిపీ, ఫ్లోరిడాతో సహా ప్రాంతాల్లో తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ముప్పు పొంచివుందని ఎన్‌డబ్ల్యుఎస్ పేర్కొంది.ఆర్కిటిక్ చుట్టూ ప్రసరించే చల్లటి గాలితో కూడిన పోలార్ వోర్టెక్స్(Polar Vortex) వల్ల ఈ విపరీత వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దశాబ్దంలో సంభవించిన అత్యంత భారీ హిమపాతం ఇదేనని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇది 2011 తరువాత అమెరికాలో అత్యంత శీతల జనవరిగా పేర్కొంది. చారిత్రక సగటు కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు ఒక వారం పాటు కొనసాగనున్నాయని పేర్కొంది. ఆదివారం సాయంత్రానికి తుఫాను వచ్చే అవకాశం ఉన్న తూర్పు తీరంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.ఎన్‌డబ్ల్యుఎస్ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ అమెరికాలో ఆదివారం తుపాను కారణంగా జనజీవనానికి ఆటంకాలు ఏర్పాడతాయి. పలు చోట్లు రోడ్లను మూసివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాన్సాస్, ఇండియానా(Indiana)లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం 8 ఇంచుల మేరకు మంచు కురిసే అవకాశాలున్నాయి. మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు తుఫానులు తలెత్తే అవకాశం ఉంది. మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటుకీ, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలలో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది.ఇది కూడా చూడండి: కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు -
Cyclone Fengal: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
-
లండన్‌లో హై అలర్ట్.. అమెరికా ఎంబసీ ముందు పార్సిల్ కలకలం
లండన్:బ్రిటన్ రాజధాని లండన్‌లో హైఅలర్ట్ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం (నవంబర్22) నగరంలో అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ద్వారా ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది.మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన ఇంకొకటి జరిగింది.దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనను విడుదల చేసింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘బాంబు’ అలజడి
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్! -
ఓవైపు పోలింగ్.. మరోవైపు కంచెలేసి హైఅలర్ట్ పరిస్థితులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. మునుపెన్నడూ లేని రీతిలో హైఅలర్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వాష్టింగన్ సహా మొత్తం 18 రాష్ట్రాలు భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించాయి.గత ఎన్నికల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్ అనుకూల వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా? అనే స్థాయిలో చర్చ జరిగింది అంతటా. ఈ నేపథ్యంలో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం, ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాల నడుమ మరోసారి ఆ తరహా ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన భారీ గేట్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు(స్వాట్), భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్, ఎన్నికల సిబ్బంది చేతికి అందుబాటులో పానిక్ బటన్స్(ఎమర్జెన్సీ).. సుమారు లక్ష పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయం నుంచే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో.. ఆ భద్రతను మరింత పటిష్ట పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీటికి తోడు కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనాల నడుమ.. నేషనల్ గార్డ్స్‌లోని సివిల్ సర్వీస్ ట్రూప్స్‌తోపాటు సైబర్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. -
ఇజ్రాయెల్ హై అలర్ట్
టెల్ అవీవ్: ఇరాన్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఎప్పుడు, ఎలా దాడి చేయనుందో కచ్చితంగా తెలియనప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడటం తెలిసిందే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్‌పై రెండు సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇజ్రాయెల్‌పైకి దాడి చేసే శక్తి, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దాడులతో దెబ్బతిన్నట్లు రూఢీ అయ్యింది. ‘ఇజ్రాయెల్ చేసిన దాడులను అతిగా చూపలేం, అలాగని తక్కువని చెప్పలేం’అని సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీయే స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ, ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. -
దానా తుఫాన్ ఉగ్రరూపం
-
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
ముంబైలో హై అలర్ట్..
-
ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి ఉగ్రదాడుల ముప్పు పొంచివున్నదంటూ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. పండుగల సీజన్లో ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే ఛాన్స్ ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌తో నగరం అప్రమత్తమైంది.నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే పలుచోట్ల పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ముంబై నగర డీసీసీ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఎవరైనా గుర్తిస్తే, ముందుజాగ్రత్త చర్యగా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇది పండుగల సీజన్లో భద్రత కోసం చేస్తున్న కసరత్తు అని పోలీసు అధికారులు తెలిపారు.ఇటీవలే ముంబైలో 10 రోజుల గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగల సమయంలో మార్కెట్లో రద్దీ అధికంగా ఉంటుంది. దేవాలయాలలో పూజలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్ -
UP Bahraich: వేటాడుతున్న తోడేళ్లు.. మరో చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt— ANI (@ANI) September 2, 2024 బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
భారత్-బంగ్లా బోర్డర్: BSF హై అలర్ట్
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో త్వరలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కానుంది. ఈనేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత్- బంగ్లా సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది.కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య 4, 096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ ఛౌదరి కోల్‌కత్తాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. VIDEO | Border Security Force (BSF) issues high alert along the Indo-Bangladesh border in Karimganj, Assam in wake of the violent protests and political turmoil in Bangladesh.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/BIVV9t1bsS— Press Trust of India (@PTI_News) August 5, 2024 DG BSF is already present in the eastern Command. The situation on the Indo- Bangladesh border is normal as of now. Troops are aware and alert about the recent development and situation across the IB: Statement#Bangladesh #coup#SheikhHasina #Pakistan pic.twitter.com/PpfOVh9dNB— world of politics (@world_dailyy) August 5, 2024 ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను తొలగించి ప్రతిభకు పట్టం కట్టాలని చేస్తున్న ఆందోళనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడారు. ఈ క్రమంలో భారత్ చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లా సైన్యం రంగంలోకి దిగింది. బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతుండగా.. కర్ఫ్యూ విధించారు. అయితే, కర్ప్యూను దాటుకొని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. Happy #Bangladesh!#HasinaDown #BangladeshWon pic.twitter.com/cdWKALiMVh— Basherkella - বাঁশেরকেল্লা (@basherkella) August 5, 2024 మరోవైపు.. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Fall of Bangladesh government attributed to record high unemployment & inflation!Nearly 8 lakh graduates are unemployed in #BangladeshStudents were protesting the 30% job quota for families of freedom fighters. The supreme court then intervened & reduced the Quota to 5%...… pic.twitter.com/rwdAHTe6Z3— Nabila Jamal (@nabilajamal_) August 5, 2024 शेख़ हसीना की 15 साल की सत्ता 15 मिनट में चली गई!ढाका में प्रधानमंत्री आवास के शयनकक्ष में प्रदर्शनकारी#SheikhHasina #Bangladesh pic.twitter.com/Vc5DJDik3o— Dheeraj Pal (@dheerajpal09) August 5, 2024 ناجائز دھاندلی زدہ وزیراعظم کے فرار کے بعد بنگلہ کے عوام نے وزیراعظم ہاؤس میں کھانا کھایا یہ کھانا حسینہ واجد کیلیے پکایا گیا تھا pic.twitter.com/Od2Qh3ldWO— Sabir Shakir (@ARYSabirShakir) August 5, 2024 Bangladesh Parliament. From Democracy to Mobocracy. pic.twitter.com/LnXQ7NPJXw— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2024 -
మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న సాయంత్రం 7.15 గంటలకు ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయిదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు,స్నిపర్లతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బందినిమోహరించనున్నారు.రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుంది. ఢిల్లీ పోలీసుల SWAT (ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాలు), NSG నుంిచి కమాండోలు ఈవెంట్ రోజున రాష్ట్రపతి ఇంటి చుట్టూ, వివిధ వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ మోహరిస్తారు. ఐదు కంపెనీల పారామిలటరీ, ఢిల్లీ సాయుధ పోలీసు (డిఎపి) జవాన్లతో సహా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించనున్నారు. ఈ కర్యాక్రమానికి సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో గత సంవత్సరం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాటు చేసిన భద్రతనే కల్పించనున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఢిల్లీిలో నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ చేసే ఏ రకమైన పరికరాలపైనా నిషేధం విధించారు. \ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు 291 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో బీజేపీ 242 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. మిత్రపక్షాలతో కలిసి మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
హై అలర్ట్: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు. బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు. -
పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్!
పశ్చిమ బెంగాల్లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్సోల్, బరాక్పూర్లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
గుడివాడలో హై అలెర్ట్
-
గుడివాడలో హై అలెర్ట్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. హీటెక్కిన గుడివాడ రాజకీయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాబు మాములోడు కాదుగా! చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది. -
బాంబు బెదిరింపులు.. ముంబై హైఅలర్ట్
ముంబై ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ బాంబు పేలుళ్లకు సంబంధించిన బెదిరింపులతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడుతామంటూ శనివారం సాయత్రం 6 గంటలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘ముంబైలో బాంబు పేలుళ్లు ఉంటాయి’ అని గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే వెంటనే స్పందిన పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా.. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు తమ దృష్టికి రాలేదన్నారు. అయితే ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ కాల్‌ను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు అప్రమత్తమై నగరం మొత్తం హైఅలర్ట్ ప్రకటించి సెక్యూరిటీ పెంచారు. చదవండి: బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ! -
కేరళ పేలుళ్లు.. ఢిల్లీ, ముంబయిల్లో హైఅలర్ట్..
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని, ముంబయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, ముంబయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ముంబయి పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముంబయిలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. "నిఘా సంస్థలతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిరంతరం టచ్‌లో ఉంది. ఏదైనా అనుమానిత సమాచారం అందితే తీవ్రంగా పరిగణిస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం." అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ, కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రదేశం కొచ్చికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దాదాపు 2000 మంది ప్రజలు ఈ ప్రార్థనా శిబిరానికి హాజరయ్యారు. మూడో రోజుల ప్రార్థనల్లో భాగంగా ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ పేలుడులో ఐఈడీ పదార్ధాలను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) దర్యాప్తు చేపట్టాయి. పేలుళ్లు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. #WATCH | Kerala: Outside visuals from Zamra International Convention & Exhibition Centre, Kalamassery; one person died and several others were injured in an explosion here. pic.twitter.com/RILM2z3vov — ANI (@ANI) October 29, 2023 కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ, ఎన్ఎస్జీ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక పరిశోధనలు, కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన రెండు కేంద్ర ఏజెన్సీలకు చెందిన ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపాలని షా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం! -
నేడు స్వదేశానికి నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(73) దాదాపు నాలుగేళ్ల తర్వాత శనివారం స్వదేశానికి రానున్నారు.లండన్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్టెర్డ్ విమానంలో శనివారం పాకిస్తాన్‌కు చేరుకుంటారు. లాహోర్‌లో శనివారం సాయంత్రం తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్(పీఎంఎల్–ఎన్) నిర్వహించే బహిరంగ సభలో షరీఫ్ పాల్గొంటారు. అయితే, ఆయన భద్రతకు ముప్పు ఉందన్న నిఘా సమాచారం మేరకు పంజాబ్ పోలీస్ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారం అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు సంస్థల దగ్గర భద్రతను పెంచారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీల భద్రతను కాపాడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అనంతరం భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
మణిపూర్ సీఎం ఇంటిపై దాడికి యత్నం
ఇంఫాల్: మణిపూర్‌లో గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చు ఇంకా రగులుతోంది. నాలుగు నెలల కిందట మొదలైన అల్లర్లు.. హింసాత్మక ఘటనలకు కొంతకాలం బ్రేక్ పడినా.. తాజాగా మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘోరాలపై దర్యాప్తులో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇద్దరు విద్యార్థుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్ సింగ్‌కు చెందిన ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు. అయితే.. సీఎం బీరెన్ సింగ్ ప్రస్తుతం ఇంఫాల్‌లోని అధికార నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. #Breaking: Manipur CM N Biren Singh's residence under Mob attack. Rounds of firing heard as the forces retaliate the attack. Manipur is now a Lawless State#Manipur#IndiaWithCongress pic.twitter.com/Z7U0dvoTE2 — Aman Shukla (@AmanINC_) September 29, 2023 సీఎం సొంత ఇంటిపై దాడిచేసేందుకు రెండు గ్రూపులు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించాయని, అయితే దుండగులను 150 మీటర్ల దూరం నుంచే అడ్డుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించిందని, రాష్ట్ర పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అల్లరిమూకను చెల్లాచెదురు చేశారని చెప్పారు. దుండగుల చర్యను కట్టడిచేసే క్రమంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. మరిన్ని బ్యారీకేడ్లతో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డుపై నిరసనకారులు టైర్లను తగులబెట్టారు. అస్థికలైనా ఇప్పించండి.. ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన ఓ అమ్మాయి, అబ్బాయి మృతదేహాల ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగిస్తే.. తాము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మణిపుర్లో ఇటీవల ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ మృతదేహాల ఫొటోలు బయటికొచ్చాయి. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. మృతులను మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించారు. ఈ ఏడాది జులైలో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారిని సాయుధులు కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్ ప్రభుత్వం ప్రకటించింది. -
స్వాతంత్య్ర వేడుకలపై ఉగ్రకన్ను.. హై అలర్ట్..
ఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి. దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. గత ఫిబ్రవరిలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరగనున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల్లో దాడులు చేపట్టాలని ఎల్ఈటీ తన సభ్యులకు సమాచారం పంపించినట్లు ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధానం కేంద్రంపై దాడి చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. భారత్‌లో ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని 2023 మేలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఓ వీడియో విడుదలైంది. పాక్ ఆధారిత ఉగ్రవాదులు, గ్లోబల్ జిహాదీలు స్వాతంత్య్ర వేడుకలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రత కట్టుదిట్టం.. ఉగ్రదాడుల సమాచారంతో స్వాతంత్య్ర వేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వేడుకల్లో భద్రత కోసం దాదాపు 10,000 పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు. కాగా.. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ఇస్తారు. ఇదీ చదవండి: సీమా హైదర్ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్.. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్.. ప్రయాణికులకు కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 15 పంద్రాగస్టుపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు. సీఐఎస్ఎఫ్, పోలీసుల తనిఖీలతో ముమ్మరం చేయనున్నారు. అంతేకాదు.. ఆగష్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రయాణికులతో వెళ్లేవారికి అధికారులు సూచనలు చేస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని సూచిస్తున్నారు. -
హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్
హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. ఢిల్లీ పోలీసుల అప్రమత్తం గురుగ్రామ్ పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎన్సీఆర్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడంతో దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం (ఆగస్టు 2) మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిరసనలకు పిలుపు మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేడు (బుధవారం) నిరసనకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కలిసి మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నాయి. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు. నుహ్‌లో ఘర్షణలు జరిగిన మరుసటి రోజు(మంగళవారం) గురుగ్రామ్‌లోని బాద్షాపూర్లో అల్లరి మూకల గుంపు బైక్‌లపై వచ్చి రెస్టారెంట్‌కు నిప్పుపెట్టింది. పక్కనే ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేసింది. మసీదు ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఓ కమ్యూనిటికీ చెందిన దుకాణాలపై దాడికి పాల్పడింది. ఈ హింసాకాండతో బాద్షాపూర్ మార్కెట్‌ను మూసివేశారు. చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? ఎందుకీ ఘర్షణలు హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా మరో వర్గం వారు అడ్డుకోవడంతో అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారుఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్ ఊరేగింపులో పాల్గొన్న నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. మరో మణిపూర్ కాబోతున్న హర్యానా? గత మూడు నెలలుగా బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో 13 కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో మరో మణిపూర్‌గా హర్యానా మారబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఊరూవాడ గోదావరే..! మరో 24 గంటలు హైఅలర్ట్..!
భద్రాద్రి: ఊహించినట్టుగానే భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది తొలిసారిగా మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోదావరి ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండగా భద్రాచలం వద్ద రాత్రి నది నీటిమట్టం 53 అడుగులను దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతోపాటు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటలపాటు గోదావరి తీరం వెంబడి ప్రాంత ప్రజలను, సిబ్బందిని జిల్లా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వేగంగా పెరుగుతున్న వరద రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన గోదావరి శుక్రవారం అతి వేగంగా పెరిగి రెండో, మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకుంది. ఉదయం 6 గంటలకు 46.20 అడుగులుగా ఉన్న గోదావరి 10 గంటలకు 11,44,645 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్తుండగా, నీటిమట్టం 48 అడుగులుగా నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అంతే వేగంగా పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు 51.40 అడుగులకు చేరింది. రాత్రి 8.43 గంటలకు 53 అడుగులకు చేరుకోగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు 14,54,937 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, నీటిమట్టం 53.60 అడుగులుగా నమోదైంది. మరో 24 గంటలు హైఅలర్ట్.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఇంకా వచ్చే అవకాశం ఉండటంతో మరో 24 గంటలు గోదావరి తీర ప్రాంతాల వెంబడి అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల 58 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 9 లక్షల 11 వేలు, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 13 లక్షల 17వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం భద్రాచలం చేరుకునే అవకాశం ఉందని, దీంతో 58 అడుగుల నుంచి 60 అడుగుల వరకు వరద చేరుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 30 రెవెన్యూ గ్రామాల నుంచి 3,077 కుటుంబాలకు చెందిన 9,798 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. గ్రామాలకు రాకపోకలు బంద్ ► గోదావరి వరద నీరు ఏజెన్సీలో పలు చోట్ల ప్రధాన రహదారులపైకి రావడంతో గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక, బుర్రవేముల ప్రధాన రహదారిపై నీరు చేరటంతో భద్రాచలం నుంచి ఆ మండలానికి వెళ్లే పరిస్థితి లేదు. ► బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాల నడుమ, పర్ణశాల గ్రామంలో వెళ్లే చోట్ల వరద నీరు చేరటంతో ఆయా గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ► చర్ల మండలంలో కుదునూరు, దేవరపల్లి గ్రామాల నడుమ, సుబ్బంపేట వద్ద ప్రధాన రహదారుల నడుమ గోదావరి వరద చేరటంతో ఇటు భద్రాచలం నుంచి చర్లకు, అటు చర్ల నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొత్తపల్లి, గండుపల్లి గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. ► బూర్గంపాడు, రెడ్డిపాలెం మధ్య రోడ్డుపైకి నీరు చేరటంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. బూర్గంపాడు నుంచి కుక్కునూరు రోడ్డుకు, భద్రాచలం నుంచి నెల్లిపాక గ్రామాలకు రవాణా ఆగిపోయింది. ► అశ్వాపురం మండలంలో రామచంద్రాపురం, ఇరవెండి గ్రామాల మధ్య రహదారిపైకి గోదావరి వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా అధికారులు హెచ్చరించినట్లు 60 అడుగులకు చేరితే ఏజెన్సీలో అనేక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. -
హై అలర్ట్..
భద్రాద్రి: వర్షాలు, వరదలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వ సిబ్బంది పని చేసే కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో గోదావరి వరద పరిస్థితిపై భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం నుంచి రాత్రి రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రహదారులు భవనాలు, మిషన్ భగీరథ, విద్యుత్, వైద్య, సెక్టోరియల్, మండల ప్రత్యేక అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన టీములు, ప్రత్యేక అధికారులు, సెక్టోరియల్ అధికారులు కేటాయించిన మండలాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని వివరించారు. సమస్యాత్మక, ముంపునకు గురయ్యే ప్రాంతాల సమగ్ర జాబితా సిద్ధంగా ఉండాలని, చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించాలని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, నీట మునిగే ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు అడ్డుగా పెట్టాలని వివరించారు. ములకలపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మండల స్థాయి బృందాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సమస్య రావొద్దని, ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని, తాగునీటి సమస్య వచ్చిన ప్రాంతాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి పరీక్షలు చేయాలన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లకుండా చూడాలన్నారు. రెండు రోజులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేసేందుకు పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, ఇతర అధికారులు భీమ్లా, డాక్టర్ శిరీష, డాక్టర్ రవిబాబు, మరియన్న, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలు బుధవారం జిల్లాలో ఒక్క దమ్మపేట మండలం మినహా జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. కరకగూడెం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భారీ వర్షపాతం నమోదైన మండలాల్లో చర్ల, పినపాక, సుజాతనగర్, ఇల్లెందు, కొత్తగూడెం మండలాలు ఉన్నాయి. మిగిలిన మండలాల్లోనూ భారీగానే వానలు పడ్డాయి. రెండో ప్రమాద హెచ్చరిక బుధవారం ఉదయం నుంచి తాలిపేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలతో దాదాపు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రాజెక్టుకు చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లన్నింటినీ ఎత్తి కిందకు వదులుతున్నారు. మరోవైపు ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి వరదకు తాలిపేరు కూడా జతవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు వరద రాలేదు. కానీ బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను దాటుకుని 49 అడుగుల పైకి వరద చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా భద్రాచలంలోని కొత్తకాలనీ, చర్ల మండల దండుపేట, రాళ్లగూడెం లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఐఏఎస్ అధికారి అనుదీప్ భద్రాచలం కేంద్రంగా వరద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆపదలో ఉంటే.. ఆపదలో ఉన్నవారు తమ ఫొటోలు, వాట్సాప్ లొకేషన్, పంపి పోలీసుల సేవలు పొందాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. జిల్లా పోలీస్ రెస్క్యూ కంట్రోల్ వాట్సాప్ నంబర్ 87126 82128కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయన్నారు. -
Cyclone Biparjoy: మరికొన్ని గంటల్లో..
సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తరుముకొస్తున్న బిపర్జాయ్ తుపాను సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉండబోతుందా?.. ఆ పరిస్థితులను ఎదుర్కొగలమా? అనే ఆందోళన నెలకొంది అధికార యంత్రాగంలో. సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇది. ఇప్పటికే ఆ రాష్ట్రం వెంట ఉన్న ప్రజల్లో.. లక్ష మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. అదే సమయంలో అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. 🌀 గంటకు 150 కిలోమీటర్లకు తగ్గకుండా వాయువేగంతో గుజరాత్ తీరం వైపుగా దూసుకొస్తోంది సైక్లోన్ బిపర్జాయ్. సౌరాష్ట్ర, కచ్ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్) వైపుగా మళ్లీ అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. 🌀 తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు. గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో దూసుకురానుంది ఇది. 🌀 కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. కచ్ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. The dangerous encirclement of the storm coming towards #Gujarat Was caught on camera..... > > >#Kutch #Gujaratcyclone #GujaratWeather #CycloneBiporjoy #BiparjoyAlert #Biperjoy #BiparjoyUpdate #BiparjoyAlert #biporjoycyclone #NewsUpdate #cycloneBiperjoyupdate pic.twitter.com/SG4lCCJFgh — Gaurav Chauhan (@mrgauravchouhan) June 15, 2023 🌀 తుపాన్‌పై గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మొత్తం గుజరాత్ అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఎనిమిది జిల్లాల నుంచి లక్ష మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 🌀 కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్ఎఫ్ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు. 🌀 ఇక కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డు సిద్ధంగా ఉన్నాయి. Outer bands of #CycloneBiparjoy lashing #Okha - #Dwarka#Rains and #Winds to increase from here , Very Heavy Rainfall for parts of #Saurashtra & #Kutch Then after weakening , system to give Heavy Rainfall in parts of W-S #Rajasthan from tomorrow pic.twitter.com/7ZiIdbMg06 — Weatherman Shubham (@shubhamtorres09) June 15, 2023 🌀 మత్స్యకారులను రేపటి వరకు సముద్రంలోకి అనుమతించబోమని ఇదివరకే అధికారులు తెలిపారు. 🌀 ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పశ్చిమ రైల్వే 76 రైళ్లను రద్దు చేసింది. ద్వారకా, సోమనాథ్ ఆలయాలను గురువారం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. బిపర్జాయ్ తుపానుతో పెను విధ్వంసం జరగొచ్చని ఐఎండీ ఇదివరకే హెచ్చరించింది. భారీ ఎత్తున్న అలలు ఎగసిపడే అవకాశం ఉండడంతో.. తీరం ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. మరింత మందకొడిగా తుపాన్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. రాత్రి 9-10 గంటల మధ్య ప్రాంతంలో తుపాను తీరం దాటనుంది. -
Cyclone Biparjoy: రాకాసి అలలు.. అంతటా హైఅలర్ట్
ముంబై/ అహ్మదాబాద్: తీవ్ర తుపాను కాస్త అతితీవ్ర తుపాన్‌గా మారే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో మొదలైన బిపర్జోయ్ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్ వైపు దూసుకెళ్తోంది తుపాను. అయితే తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతుండగా.. భారీగా ఈదురు గాలులు, వర్షం ముంబై నగరాన్ని ముంచెత్తుత్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు విమానలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక బిపర్జాయ్ తుపాన్ గుజరాత్ వైపు వేగంగా వెళ్తోంది. జూన్ 15వ తేదీన గుజరాత్ తీరాన్ని తాకనుంది. గుజరాత్ తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలుండ్చొని అంచనా వేస్తోంది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. జూన్ 15వ తేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. గుజరాత్ లోని మాండవి- పాకిస్థాన్ లోని కరాచీల మధ్య బిపోర్ జాయ్ తీరందాటనున్న నేపథ్యంలో సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తీరాన్ని తాకే సమయంలో తీరంవెంబడి 125 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లలో ఇది రెండవ బలమైన తుపానుగా పేర్కొంది. మరోవైపు బిపర్జోయ్ ఎఫెక్ట్‌తో బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అది అధికారికంగా బిపర్జోయ్దేనా ధృవీకరణ కావాల్సి ఉంది. Cyclone Biporjoy in Gujarat: દરિયાકિનારે પ્રિ-તોફાન શરુ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી... | Gujarat Tak https://t.co/gF6v28jDIA — Gujarat Tak (@GujaratTak) June 12, 2023 As the #CycloneBiparjoy is frowning to hit on Gujarat coast on 15th June, let's know the name of cyclones to thwack impending. https://t.co/AeOQBtWG3t#CycloneBiparjoy#Cyclone #CycloneAlert #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #scicomm #Cyclones #tropicalcyclones pic.twitter.com/AwLMcMpZ4z — TUHIN SAJJAD SK (@TUHINSAJJADSK1) June 12, 2023 🚨 This video depicts Ganpatipule Beach in Ratnagiri during the occurrence of Cyclone Biparjoy. The intensity of the sea waves is extremely High.#CycloneBiperjoy #viral2023 pic.twitter.com/tfWGQABUzK — Top Notch Journal (@topnotchjournal) June 11, 2023 -
మండే ఎండలు..సూర్యుడు బాగా బాగా
-
హైదరాబాద్ లో దడ పుటిస్తున ఎండలు
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
అమృత్‌పాల్ పిలుపు.. పంజాబ్‌లో హైఅలర్ట్
ఛండీగఢ్: పరారీలో ఉన్న ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ పోలీసులకు లొంగిపోతాడనే ప్రచారం జోరందుకుంది. అకల్ తఖ్త్ సదస్సు నేపథ్యంలో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమృతపాల్ సింగ్ వైశాఖి సందర్భంగా సిక్కుల సర్బత్ ఖల్సా సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో.. పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని చారిత్రక నేపథ్యం ఉన్న ఏదైనా గురుద్వారాకు వచ్చి అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. అలా కానిపక్షంలో పోలీసులే అతన్ని అరెస్ట్ చేయొచ్చు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీస్ శాఖలో సెలవుల్ని రద్దు చేశారు. పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ గ్రూప్ తరపు నుంచి పంజాబ్‌లో విధ్వంసానికి అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక వేశాడని.. ఈ క్రమంలోనే తన అనుచరుడిని విడిపించుకునేందుకు అనుచర గణంతో అమృత్‌సర్‌కు దగ్గర్లో ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి కూడా చేశాడనే అభియోగాలు అమృత్పాల్సింగ్పై నమోదు అయ్యాయి. మరోవైపు అతని అనుచరులను సైతం అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడం గమనార్హం. అమృత్‌పాల్ ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపుపై రాజకీయ విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అమృత్‌పాల్ పేరిట సిక్కు హక్కుల సాధకులపై అణచివేత జరుగుతోందని, అమాయకపు యువతను అరెస్ట్ చేస్తున్నారంటూ పలు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. -
కరోనా పెరుగుదల.. కేంద్రం హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. దేశంలో కేసులు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎల్లుండి(సోమవారం) రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అలాగే.. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. గత 146 రోజుల తర్వాత ఇదే హయ్యెస్ట్ కేసుల సంఖ్య కావడం గమనార్హం. ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. అలాగే.. ఆరు కరోనా మరణాలు సంభవించాయని గణాంకాల్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. DG ICMR Dr Rajiv Bahl and Secy, MoHFW Rajesh Bhushan write to all States/UTs on maintaining optimum testing for Covid-19 pic.twitter.com/xS5ycvqYa1 — ANI (@ANI) March 25, 2023 -
కొత్త ఫ్లూ.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్. అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్. ఇదిలా ఉంటే.. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఇదీ చదవండి: H3N2 వైరస్ తీవ్రంగా ఎందుకు ఉందంటే.. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. -
ముంబైపై ఉగ్రదాడి చేస్తామని ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబైలో ఉగ్రదాడి జరగుతుందంటూ జాతీయ దర్యాప్తు సంస్థకు బెదిరింపు మొయిల్ వచ్చింది. తాను తాలిబాస్ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని ముంబై పోలీసుల అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ముంబైలోని వివిధ నగరాలకు హైఅలర్ట్ జారీ చేశారు. బెదిరింపు మెయిల్లో గర్తు తెలియని వ్యక్తి తనను తాను తాలిబానీ సభ్యుడిగా పేర్కొన్నాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ బాంబు పేల్చాడని పోలీసుల వర్గాలు చెప్పాయి. ఈ మెయిల్ తదనంతరం దర్యాప్తు సంస్థ, ముంబై పోలీసులు సంయుక్తంగా ఇందులో నిజానిజాలను వెలికితీసే పని ప్రారంభించాయి. అంతేగాదు ఆ వ్యక్తి మెయిల్లో ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపినట్లు సమాచారం. అందులో భాగంగా నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు భద్రతను కట్టుదిటట్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలకు ఇలానే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే గతేడాది అక్టోబర్‌లో కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చింది. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
వేలడంత లేదు.. వణికిపోతున్న పశ్చిమ ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు వణికిపోతున్నారు. వేలు సైజులో కూడా లేని ఓ క్యాప్సూల్ కోసమే ఇదంతా. కనిపిస్తే విపత్తుల నిర్వహణ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎమర్జెన్సీ నెంబర్లను ప్రకటించారు. ఎందుకంటే ఆ క్యాప్సూల్ మామూలుది కాదు.. రేడియోయాక్టివ్తో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు, ఆరు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ఓ చిన్న రేడియోయాక్టివ్ క్యాప్సూల్ అది. కిబంర్లీ రీజియన్‌లోని న్యూమన్ నుంచి పెర్త్‌కు(12 వేల కిలోమీటర్ల దూరం) తీసుకెళ్తున్న సమయంలో.. రోడ్ల కుదుపులతో ట్రక్కు బోల్ట్ తెరుచుకుని అది కింద పడిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దాని కోసం వెతుకలాట నడుస్తోంది అక్కడ. ఆ సిల్వర్ క్యాప్సూల్‌లో సీసియం-137 ఉందని, అది చాలా ప్రమాదకరమని అత్యవసర సిబ్బంది ప్రకటించారు. జనవరి 12వ తేదీనే ఆ ట్రక్కు గమ్యస్థానానికి చేరుకుందని, కానీ.. కనిపించకుండా పోయిన ఆ క్యాప్సూల్ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదని అత్యవసర సిబ్బంది వెల్లడించారు. ఈ పదార్థాన్ని మైనింగ్ కార్యకలాపాలలో ఉపయోగిస్తారని, దీని రేడియేషన్ వల్ల శరీరం కాలిపోవడం లేదంటే రేడియేషన్ అనారోగ్యానికి గురికావొచ్చని హెచ్చరించారు అధికారులు. ఇది ఎంత మేర డ్యామేజ్ చేస్తుందనే దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇది అత్యంత ప్రమాదరకమైన వ్యవహారమని చెప్తున్నారు. ప్రస్తుతం పిల్బరా, మిడ్వెస్ట్ గ్యాస్కోయిన్, మిడ్‌ల్యాండ్ గోల్డ్ఫీల్డ్లతో పాటు పెర్త్ మెట్రోపాలిటన్ రీజియన్లలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. -
దలైలామా భద్రతపై అలర్ట్.. పోలీసుల అదుపులో ‘చైనా మహిళ’
పట్నా: బౌద్ధమత గురువు దలైలామా బిహార్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దలైలామా పర్యటన వేళ భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతోందన్న అనుమానాలతో చైనాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను తిరిగి చైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దలైలామా పర్యటన వేళ చైనా మహిళ అనుమానాస్పద కదలికలపై గురువారం స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు అధికారులు. ఆమె ఆనవాళ్లను సూచించే ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పోలీసులు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. ‘గయాలో నివసిస్తున్న చైనా మహిళ గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆమె గత రెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాం. చైనా మహిళ కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా మహిళ ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదు. ఆమె చైనా గూఢచారి అనడాన్ని కొట్టిపారేయలేం.’ అని తెలిపారు గయా సీనియర్ ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్. ఆమె ఊహాచిత్రాలు బుధవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మహిళ గురించి తెలిసిన వారు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైనా గూఢచారి అయిన ఆ మహిళ బుద్ధగయాతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాదికిపైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ వద్ద ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. బుద్ధగయాకు గత వారు చేరుకున్నారు దలైలామా. కోవిడ్-19 కారణంగా బుద్ధ పర్యటక ప్రాంతమైన బుద్ధగయాను రెండేళ్ల తర్వాత సందర్శించారు. గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి డిసెంబర్ 22న చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ త్యాగరాజన్, ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 29-31 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు. ఇదీ చదవండి: బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి -
భారత్ లో బయటపడిన ఒమిక్రాన్ BF- 7 వేరియంట్...ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్
-
‘కిమ్’ చేసిన పనికి జపాన్‌లో హై అలర్ట్!
టోక్యో: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణీ పరీక్షలు చేపడుతూ తన పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు సైతం హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టి జపాన్‌లో అలజడి సృష్టించారు. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టినట్లు దక్షణ కొరియాతో పోటు జపాన్ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు జపాన్ పీఎం. కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిసైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! -
తమిళనాడు కోయంబత్తూరులో హై అలర్ట్
-
ఇండిగో విమానంలో బాంబు కలకలం... కొద్దినిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుందనంగా..
ముంబై: ఇండిగో విమానం టేక్ ఆఫ్ అవుతుందనగా విమానంలో బాంబు ఉందంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. దెబ్బకు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా హైఅలర్ట్ విధించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన ముంబైలోని చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. అయితే సిబ్బంది అప్రమత్తమై హుటాహుటినా తనిఖీలు నిర్వహించగా... అలాంటిదేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కరక్ట్‌గా ఫ్లైట్ టేక్ఆఫ్ అయ్యే సమయానికి శనివారం రాత్రి ఈ గాలి వార్త వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే విమానాన్ని ఆపీ తనిఖీలు చేశారు. దీంతో ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఆ ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిన విమానం. అయితే ఆ ఈమెయిల్ మెసేజ్‌లో ఇండోగో విమానం ఫలాన ఫ్లైట్ నెంబర్లో బాంబు ఉందని చాలా క్లియర్‌గా సందేశం పంపిచడంతో అధికారులు సీరియస్‌గా తీసుకుని వెంటనే తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అసలు ఎక్కడ నుంచి ఈ గాలి వార్త వచ్చిందని పోలీసులు దర్యాప్త చేయడం ప్రారంభించారు. (చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా..) -
MJ మార్కెట్, పాతబస్తీలో హైఅలర్ట్
-
పాతబస్తీలో హైటెన్షన్
-
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొఘల్‌పురాలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్‌కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్‌లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్ కుటుంబమే లక్ష్యం?! -
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం...
న్యూఢిల్లీ: కోల్‌కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు. దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్ జైలులో ఉన్న అనిల్ గ్యాంగ్ స్టర్‌కి ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు. ఈ మేరకు జౌన్‌పర్ నివాసి సద్దాం కోసం అనిల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రుడూన్‌లోని గన్‌హౌస్ నుంచి ఈ ఆయుధాల కంటైనర్లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్‌హౌస్ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు. అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్లు ఎగరువేసిన బంగ్లాదేశ్ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్‌లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్ఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది. అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. -
పంద్రాగస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్
-
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం
సాక్షి, అమరావతి, ధవళేశ్వరం, సాక్షి ప్రతినిధి, ఏలూరు, నెట్వర్క్: భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గోదావరి వరద విరుచుకుపడుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఊరూ ఏరూ ఏకమయ్యాయి. లంకలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి వరద పోటెత్తుతుండటంతో పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన గోదారమ్మ శాంతిస్తోంది. ప్రాణహిత గోదావరిలో కలిసే ప్రదేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజ్‌లోకి వరద 11.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ దిగువన సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజ్‌లోకి వచ్చే వరద కూడా 13.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ తర్వాత ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చే వరద కూడా 21.18 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి భద్రాచలంలో క్రమంగా తగ్గుముఖం.. ఎగువ నుంచి విడుదలైన ప్రవాహం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భద్రాచలం వద్దకు 24,43,684 క్యూసెక్కులు చేరడంతో వరద మట్టం 71.30 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఎగువ నుంచి ప్రవాహం గంట గంటకూ తగ్గడంతో వరద నీటిమట్టం కూడా తగ్గుతూ వచ్చింది. శనివారం రాత్రి 9 గంటలకు 22,41,144 క్యూసెక్కులకు తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 67.70 అడుగుల్లో ఉంది. 53 అడుగుల కంటే దిగువకు చేరుకునే వరకూ మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులు లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం.. భద్రాచలం నుంచి దిగువకు వరద పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తిలతో కలసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణను పర్యవేక్షించారు. శనివారం రాత్రి పోలవరంలోకి 22,41,144 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద మట్టం 38.760 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 28.820 మీటర్లకు చేరుకుంది. ఆదివారం ఉదయం వరకూ పోలవరం వద్ద వరద పెరగనున్న నేపథ్యంలో అధికారులు కంటికి కునుకు లేకుండా సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరంలోకి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎదుర్కొనేలా ఎగువ కాఫర్ డ్యామ్‌ను పటిష్టం చేయడం, ఎత్తు పెంపు పనులను ముమ్మరం చేశారు. 40.5 మీటర్ల నుంచి 42.5 మీటర్ల వరకూ కాఫర్ డ్యామ్ మధ్యలో కోర్ (నల్లరేగడి మట్టి) నింపి మరో 1.5 మీటర్ల ఎత్తున మట్టికట్ట నిర్మాణ పనులను వేగవంతం చేశారు. తద్వారా కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు చేరుకోనుంది. కోనసీమ జిల్లా పాశర్లపూడిబాడవలో వరద బాధిత కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం ధవళేశ్వరంలో వచ్చిన వరద వచ్చినట్లే.. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి శనివారం రాత్రి 9 గంటలకు 25,56,474 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 21.50 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. డెల్టా కాలువలకు 11,500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 25,48,974 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2006 ఆగస్టు 7న బ్యారేజ్‌లోకి 28,50,664 క్యూసెక్కులు రావడంతో నీటి మట్టం 22.80 అడుగులకు చేరుకుంది. 16 ఏళ్ల తర్వాత శనివారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్ట వరద ప్రవాహం రావడం.. అది కూడా జూలైలోనే రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద శనివారం అర్ధరాత్రి గరిష్ట స్థాయికి చేరుకుని ఆదివారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కాటన్ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. వైఎస్సార్ ముందుచూపుతో.. ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. 2004–05లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో రూ.650 కోట్లతో గోదావరి ఏటిగట్లను పటిష్టం చేయడంతో 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే విధంగా ఉన్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులు సహాయ శిబిరాల్లో 71,200 మంది ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో 76,775 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 71,200 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాడేపల్లిలోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పది చొప్పున సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. 62 మండలాల్లో 324 గ్రామాలు వరద బారినపడ్డాయి. మరో 191 గ్రామల్లోకి నీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో అనారోగ్యంతో ఉన్న దేవి ముత్యాలమ్మ (68) శనివారం తెల్లవారు జామున బయటకు వెళ్తున్న క్రమంలో గోదావరిలో పడిపోయి గల్లంతైంది. ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఏటిగట్టు ప్రాంతంలో పలువురు పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలంక గ్రామానికి పడవపై వెళ్తున్న హోం మంత్రి తానేటి వనిత, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ► అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏడు మండలాల్లో 125 గ్రామాలు మునిగిపోగా 165 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 49,623 మందిని తరలించారు. చింతూరు, ఎటపాక మండలాల్లో ఎక్కువ గ్రామాలు మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున ఉన్న వీఆర్ పురం, దేవీపట్నం, కూనవరం మండలాల్లో ముంపు తీవ్రంగా ఉంది. ► అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 74 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు ఏసి 9,290 మందిని తరలించారు. ► ఏలూరు జిల్లాలో ఏడు మండలాలకు చెందిన 26 గ్రామాలు ముంపులో ఉండగా 33 గ్రామాల్లోకి నీరు చేరింది. 18 పునరావాస కేంద్రాలు తెరిచి 9,363 మందిని తరలించారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 మండలాల్లో 28 గ్రామాలు ముంపులో ఉండగా మరో 27 గ్రామాల్లోకి నీరు చేరింది. 18 పునరావాస కేంద్రాల్లోకి 1345 మందిని తరలించారు. ► తూర్పు గోదావరి జిల్లాలో 21 మండలాల్లో 13 గ్రామాలు ముంపునకు గురవగా 23 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ► కాకినాడ జిల్లాలో తాళ్లరేవు ముంపునకు గురి కావడంతో సహాయ శిబిరం ఏర్పాటు చేసి 90 మందిని తరలించారు. ► ఇళ్లు నీట మునగడంతో తలదాచుకునేందుకు పైకి ఎక్కిన వందలాది మందిని ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. -
Godavari River Floods: ఉగ్ర గోదారి 'హై అలర్ట్'
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ అమలాపురం/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చింతూరు/ ఎటపాక/దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది. లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద 19,90,294 క్యూసెక్కులు ఉండగా.. వరద నీటి మట్టం 63.20 అడుగులకు చేరగా. ఇది శుక్రవారం 70 అడుగులను దాటే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. అనంతరం.. గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు. తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంక వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి వనిత, ఎమ్మెల్యే రాజా, కలెక్టర్ మాధవీలత తదితరులు పోలవరం వద్ద హైఅలర్ట్.. ఎగువ నుంచి గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 24 గంటలూ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని అధికారులు సమీక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్దకు గురువారం రాత్రి 9 గంటలకు 16,48,375 క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 36.495 మీటర్లకు చేరగా.. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.20 మీటర్లకు చేరుకుంది. ఇక్కడకు శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత వరద వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు చర్యలు చేపట్టారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉధృతి మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. బ్యారేజ్‌లోకి గురువారం 16,61,565 క్యూసెక్కులు చేరుతోంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి 16,76,434 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. వరద మట్టం 15.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అలాగే, శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీలోకి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముంది. అప్పుడు వరద మట్టం 17.75 అడుగులను దాటే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేయనున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.60 అడుగులుగా ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశముంది. అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరిలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశముంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా గ్రామంలో హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న దృశ్యం కోనసీమ లంక వాసుల ఆందోళన గోదావరికి మరింత వరద వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో కోనసీమ లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, ఐ.పోలవరం మండలాల్లోని పలుచోట్ల ఇళ్లలోకి నీరుచేరింది. 18 మండలాల్లోని 59 గ్రామాలు వరద నీట చిక్కుకున్నాయి. 73,400 మంది వరదబారిన పడ్డారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఈ మండలాల్లో మరికొన్ని గ్రామాలతోపాటు కాట్రేనికోన, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరే అవకాశముంది. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్టు సమీపంలో ఏటిగట్టు తెగే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పలు లంకలకు అధికారులు పడవలు ఏర్పాటుచేశారు. అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 65 ఇళ్లు వరద ముంపుబారిన పడ్డాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు పల్లిపాలెం, ఎల్.గన్నవరం శివారు జొన్నలలంక. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పుచ్చల్లంక, రాయలంక, కనకాయలంక, అయోధ్యలంకల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఈ జిల్లాలో 73 పునరావస కేంద్రాలను గుర్తించి, 143 బోట్లను సిద్ధంచేశారు. 7,600 మందికి అహార ప్యాకెట్లు అందించగా, సుమారు రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లు అందించారు. 79 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపు బాధితుల వద్దకు మంత్రి వేణు పడవపై వెళ్లి నిత్యావసర సరుకులు అందజేశారు. పాండిచ్చేరీ యానాంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకీ వరద నీరు చేరింది. ‘తూర్పులో ఎనిమిది ప్రాంతాలపై దృష్టి ధవళేశ్వరం హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ‘తూర్పు’లో ఎనిమిది వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వూరులో 70, సీతానగరం మండలంలో 270 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో నీటిలో చిక్కుకున్న 8 మంది గొర్రెల కాపరులను, 60 గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కరకట్టలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ కె.మాధవీలత గురువారం పర్యటించారు. విశాఖ జిల్లా ఎటపాక పోలీసుస్టేషన్లోకి గోదావరి వరద చేరింది. తూర్పు గోదావరి జిల్లా బుర్రింక వద్ద గోదావరి లంకల్లో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులను ఒడ్డుకు చేర్చేందుకు బోట్లపైకి ఎక్కిస్తున్న దృశ్యం విలీన మండలాలు విలవిల గోదావరి మహోగ్రరూపంతో పోలవరం ముంపు (విలీన) మండలాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని అనేక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 12,694 కుటుంబాలకు చెందిన 36 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చింతూరు కేంద్రంగా అధికారులు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసరాలను ముంపు ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అందచేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. వేలేరుపాడు మండలంలో కొయిదా గ్రామానికి గురువారం హెలికాఫ్టర్ ద్వారా 800 మందికి సరిపోయే నిత్యావసరాలు అందించారు. శుక్రవారం కూడా ఇలాగే అందించనున్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్దేవ్శర్మలు వేలేరుపాడులో పర్యటించి పునరావాస కేంద్రాలు పరిశీలించారు. -
అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అలర్ట్ (ఫొటోలు)
-
100 మంది పోలీసులు.. రెండు గంటలు.. కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నామంటే..??
-
ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల హైఅలర్ట్
-
Cyclone Asani: సర్కారు హై అలర్ట్
సాక్షి, అమరావతి: తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను క్రియాశీలకం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 16 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించారు. మిగిలిన బృందాలను అవసరమైన చోటుకు పంపేందుకు అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సహాయక శిబిరాలను కూడా గుర్తించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ప్రాంతాల వారీగా తయారు చేశారు. టెలీ కమ్యూనికేషన్లు, తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయడానికి ముందస్తు ప్రణాళికలను జిల్లా యంత్రాంగాలు సిద్ధం చేసుకున్నాయి. తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఇదిలావుండగా.. తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని కలెక్టర్ ఎ.మల్లికార్జునరావుకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద అలల ఉధృతి గ్రామాల వారీగా కమిటీలు తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియపాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ తుపాను ప్రభావిత రాష్ట్రాల విపత్తుల శాఖ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ముందస్తుగా తీసుకున్న చర్యలను వివరించారు. -
పాతబస్తీలో హై అలర్ట్ ఫొటోలు
-
కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం
Karnataka Issues High Alert : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. జిమ్ చేస్తుండగా గురువారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పునీత్ తుదిశ్వాస విడిచారు. అయితే పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ రాజ్‌కుమార్ మృతికి సంతాప సూచకంగా సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. -
తీరం దాటినా గులాబ్ తుఫాన్
-
Cyclone Gulab: తీరం దాటిన తుపాను
సాక్షి, శ్రీకాకుళం/విజయనగరం: కళింగపట్నం-గోపాలపూర్ మధ్య గులాబ్ తుపాను తీరం దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. కాగా, గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్ అదిత్య నాథ్ చర్యలు చేపడుతున్నారు. చదవండి: Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను -
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
గులాబ్ తుఫాన్ ఈరోజు అర్థరాత్రి తీరం దాటే అవకాశం :వాతావరణ శాఖ
-
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి శనివారం సాయంత్రానికి గులాబ్ తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 370 కి.మీ., శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి తూర్పు దిశలో 440 కి.మీ. దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. ఇది శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి.. పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కాస్త పరిస్థితుల మార్పు చెందితే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దండోరా వేయించారు. పోర్డులకు మూడో ప్రమాద హెచ్చరిక తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్రకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం, ఒక ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే యుద్ధప్రాతిపదికన సరిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. కోవిడ్ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని, కోవిడ్–19 బారిన పడిన వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 28న మరో అల్ప పీడనం ఈ నెల 27న ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ‘స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్’ ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లో జిల్లా స్థాయిలోను, తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే 76 మండలాల్లో మండల స్థాయిలోను ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
తాలిబన్లతో జైషే మహ్మద్ చీఫ్ భేటీ, జమ్మూలో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో జమ్మూలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థలు హెచ్చరికలతో హైఅలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, కాందహార్‌లో తాలిబన్ల పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్, ఇతర నాయకులతతోనూ భేటీ అయిన నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ అయింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు భద్రతా చర్యలు చేపట్టాలని తీవ్రవాద వ్యతిరేక విభాగాలను కూడా అప్రమత్తం చేయాలని నిఘా అధికారులు హెచ్చరించారు. జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై లభించిన సమాచారం ఆధారంగా నిఘా సంస్థలు అధికారులను అప్రమత్తం చేశాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే, సమర్ధవంతంగా తిప్పికొట్టేలా ఈ సమాచారాన్ని రాష్ట్ర నిఘా, భద్రతా సంస్థలతో పంచుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో నిఘా ఉంచాలని కూడా ఆదేశించినట్టు ప్రకటించారు. ఆగస్టు మూడో వారంలో కందహార్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహ్మద్ (జేఈఎం) నాయకులు, తాలిబాన్ నాయకుల సమావేశ మైనట్టు తమ దృష్టికి వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు జేఈఎం తాలిబన్ మద్దతుకోరిందనీ, పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించాయి. కాగా అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనుంచీ వేలాది మంది వేలాదిమంది దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక హృదయవిదాకరదృశ్యాలు ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి సంచలనం రేపింది. మరోవైపు ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
-
సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ వద్ద హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కేంద్ర నిఘా వర్గాలు కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న రక్షణాధికారులు సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు దాని పరిధిలో ఉన్న కంటోన్మెంట్ (డిఫెన్స్) రహదారుల్లోకి రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ పరిధిలోని రోడ్లను శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసేస్తున్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాలను వాటిలోకి అనుమతించరు. ఈ మేరకు రక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అసాంఘిక శక్తులకు అడ్డకట్ట వేసేలా తీసుకున్న ఈ చర్యలను సమర్థిస్తూ ప్రజలు తమకు సహకరించాలని అందులో కోరింది. పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట భద్రత: సీపీ అంజనీకుమార్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గోల్కొండ కోటలో జరగనున్న పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం పేర్కొన్నారు. వివిధ విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు రిహార్సల్స్ జరుగుతున్నాయని, బుధవారం జీహెచ్ఎంసీ, పోలీసు, ఆర్ అండ్ బీ అధికారులు ఫీల్డ్ విజిట్ చేశారని తెలిపారు. సాధారణ ప్రజలు సహా ఎవరికీ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లి స్తామని అన్నారు. మరోపక్క నగరంలో ఉన్న గస్తీ బృందాలకు సమకాలీన అంశాలపై ప్రత్యే క శిక్షణ ఇస్తున్నామని, ఈ స్పెషల్ డ్రైవ్ రెండు రోజుల క్రితం ప్రారంభమైందని సీపీ తెలిపారు. ఒక్కో బ్యాచ్‌లో 200 మంది చొప్పున 15 రోజుల్లో 2 వేల మందికి దీన్ని ఇస్తామన్నారు. గస్తీ నిర్వహణలో మార్పు చేర్పులు, ప్రజలతో మమేకమై, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పనిచేసే విధానాలు నేర్పుతున్నామన్నారు. ఈ గస్తీ బృందాలకు సంబంధించి ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలని భావిస్తే 9490616555 నెంబర్ లేదా స్థానిక పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని సూచించారు. -
కేంద్ర మంత్రికి ‘ఉక్కు’ నిరసనల సెగ
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉక్కు’ ఉద్యమ సెగ తగిలింది. 150 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం కట్టుబడిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు కేంద్ర మంత్రి చేరుకోక ముందు నుంచే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్, కేంద్ర బలగాలు కూడా ఎయిర్‌పోర్టు లోపల పహారా కాశాయి. ఎయిర్ పోర్టులోకి వచ్చే వాహనాల్ని తనిఖీ చేసి.. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉద్యమకారులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీస్ బలగాలు వారిని నిరోధించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప పెనుగులాట జరిగింది. నిర్మలా సీతారామన్ గో బ్యాక్, విశాఖ ద్రోహి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ.. విమానాశ్రయ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అప్రమత్తమై వందల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కొంతమంది ఉద్యమకారులు పోలీస్ వలయాన్ని దాటుకుంటూ.. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కు ఆందోళనకారులు ఎయిర్‌పోర్టు వైపు వస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బయటికి రావడంతో ఆమె కాన్వాయ్‌ని అడ్డుకోకుండా భద్రతా బలగాలు ఉద్యమకారులను నిలువరించాయి. సీతారామన్ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వెళ్లేంత వరకూ విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేస్తున్న పోర్టు గెస్ట్ హౌస్ వరకూ ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఢిల్లీలో హైఅలర్ట్
-
రైతుల నిరసనతో ఢిల్లీలో హైఅలర్ట్
-
జికా వైరస్: హై అలర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం
సాక్షి, తిరువనంతపురం: కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జికా వైరస్‌పై హై అలెర్ట్ ప్రకటించింది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. చామరాజనగర్, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేరళలో మొదట ఓ 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది. -
కరోనాపై హెచ్చరిక.. అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: డెంగీ, మలేరియా, ఇతర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా సీజనల్‌గా వస్తుంటాయి. కానీ కరోనా మాత్రం.. సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రతి నిత్యం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మిగతా వ్యాధులకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం సీజనల్ వ్యాధుల కేలండర్‌ను విడుదల చేసింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందజేసింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు వ్యాపిస్తాయని.. నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని.. ఏప్రిల్– జూన్ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి ఇబ్బంది పెడతాయని తెలిది. కరోనా ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని పేర్కొంది. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040–24651119 ఫోన్ నంబర్ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. వానాకాలంలో మరింత జాగ్రత్త వైద్యారోగ్య శాఖ క్యాలెండర్ ప్రకారం.. ప్రస్తుత సీజన్లో కరోనాతోపాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా, ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా, సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశముంది. పాము కాట్లు సంభవిస్తాయి. ఈ అంశాలపై స్థానిక సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. శుక్రవారం డ్రైడే నిర్వహించాలని.. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బాగా వండిన ఆహారాన్నే తినాలని తెలియజేయాలి. అంటువ్యాధులన్నింటినీ నియంత్రించేందుకు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా చూడాలి. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలి. మురికి కాల్వలు, ఆరు బయట నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, పొదలను శుభ్రం చేయాలి. స్టోరేజీ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలి. ప్రజల్లోకి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలి. అవసరమైన మందుల కిట్లు అందజేయాలి. హైరిస్క్ ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీలను నిర్వహించాలి. ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలి. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. యాంటీ బయాటిక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలి. చలికాలంలో వైరస్ల ప్రమాదం చలికాలంలో కరోనాతోపాటు స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ సీజన్లో వైరస్ల ప్రమాదం అధికం. గాలి నుంచి సోకే వైరల్ వ్యాధులను నియంత్రించేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరి. లక్షణాలు లేని కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వానాకాలం తరహాలో చలికాలంలోనూ ఫీవర్ సర్వే చేసి, అవసరమైన మందులు అందజేయాలి. స్వైన్‌ఫ్లూ, కోవిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్ ఓపీ చేయాలి. ఒసెల్టామివిర్/డాక్సిసైక్లిన్, యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన ఆక్సిజన్ నిల్వ, సరఫరా ఉండాలి. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు ఇబ్బందిపెడతాయి. వాటికి సంబంధించి చికిత్స అందించడంతోపాటు ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలి. ఎండాకాలంలో కోవిడ్‌తో పాటు మలేరియా, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎండల కారణంగా వడదెబ్బ, కుక్కకాట్లు వంటివి సంభవిస్తాయి. యథావిధిగా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రజలు ఇళ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీలు, పంచాయతీలు పబ్లిక్ స్థలాల్లో నీడ వసతి, మంచినీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బంది ఫీవర్ సర్వేను కొనసాగించాలి. కోవిడ్, మలేరియా పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్ ఓపీ, ఐసోలేషన్ వార్డులు ఉంచుకోవాలి. ఆక్సిజన్ స్టోరేజీ, సరఫరా ఏర్పాట్లు తప్పనిసరి. క్లోరోక్విన్/డాక్సిసైక్లిన్ సిద్ధంగా పెట్టుకోవాలి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలి. అన్ని కాలాల్లో కరోనా సీజనల్ వ్యాధులు ఆయా కాలాలను బట్టి వస్తూ పోతుంటాయి. కానీ కోవిడ్ మాత్రం అన్ని సీజన్లలోనూ వ్యాపిస్తోంది. కరోనా వైరస్ అన్ని కాలాల్లో మనగలుగుతుంది. కాబట్టి సీజనల్ కేలండర్లో దాన్ని మూడు సీజన్లలోనూ ప్రస్తావించాం. ప్రజలు ప్రతినిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. - డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
కరోనా విజృంభణతో తెలంగాణలో హై అలర్ట్..
-
ఏఓబీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల ఘటనతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఏపీ పోలీస్ యంత్రాంగం హైఅలర్డ్ ప్రకటించింది. దండకారణ్యంలో పథకం ప్రకారం మూడు వైపులా చుట్టుముట్టిన మావోయిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో 24 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణలు ఉన్నారు. మరోవైపు.. కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్‌ను బందీగా పట్టుకున్నట్లు మావోయిస్టులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌గా స్పందించింది. కేంద్ర నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఎన్కౌంటర్ జరిగిన బీజాపూర్–సుక్మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలమైన ఏటపాక సరిహద్దుకు ఘటన ప్రాంతం దగ్గర కావడంతో ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి. అప్రమత్తం చేశాం ఛత్తీస్‌ఘఢ్ ఘటన అనంతరం కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాల ఆదేశాలతో ఆంధ్ర–ఒడిశా బోర్డర్ (ఏఓబీ) ప్రాంతంలోని ఏజెన్సీ మండలాల్లో పోలీసులను అప్రమత్తం చేశాం. ఘటన జరిగిన ప్రాంతం మన రాష్ట్రంలోని విలీన మండలానికి సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదు. అయినప్పటికీ ఏఓబీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశాం. పరిషత్ ఎన్నికల నేపథ్యంలోను ఏజన్సీ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. మన గ్రేహౌండ్స్ బలగాలు, నిఘా వర్గాలు పటిష్ట వ్యూహంతో వ్యవహరిస్తున్నాయి. – డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ -
4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(అవియన్ ఇన్‌ఫ్లూయెంజా) వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ వెల్లడించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్తాన్‌లోని బరాన్, కోట, ఝలావర్, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్, ఇండోర్, మాల్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా(వలస పక్షుల కేంద్రం), కేరళలోని కొట్టాయం, అలప్పుజాలో నాలుగు చోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కనుగొన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై తాజా పరిస్థితి అంచనా వేయడానికి ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల్లో అధికారులు చేపట్టిన బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యలపై రోజువారీ గణాంకాలు సేకరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ నెలకొల్పినట్లు పేర్కొంది. దేశంలో మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలియజేసింది. కర్ణాటకలో హై అలర్ట్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించినట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చెప్పారు. కేరళ నుంచి పౌల్ట్రీ కోళ్లు, కోడి మాంసం రవాణా చేయకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కేరళతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి కోడిమాంసం దిగుమతిపై 10 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం చెప్పారు. ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందాలు బర్డ్‌ఫ్లూ ప్రభావం అధికంగా ఉన్న కేరళలోని అలప్పుజా, కొట్టాయం, హరియాణాలోని పంచకుల జిల్లాలకు బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ బృందాల్లో ఎన్సీడీసీ, ఎన్ఐజీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీకి చెందిన నిపుణులు ఉంటారు. అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో బాతుల్లో, పంచకుల జిల్లాలో పౌల్ట్రీ కోళ్లలో బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు వెల్లడించింది. బృందాలు ఆయా జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలకు సహరిస్తాయని తెలిపింది. -
పోలీస్ శాఖ హై అలర్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆలయాల వ్యవహారంపై పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే మతపరమైన సంస్థలు, ఆలయాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ మరిన్ని పక్కా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేవాలయాలపై ఈ రకమైన ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు గుర్తించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పెట్రోలింగ్, బందోబస్తులతో విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అర్చకులు, ఆలయ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకునేందుకు శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు ఫోన్ ద్వారా చెప్పాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత చర్యలు పర్యవేక్షించాలని, నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. దేవాలయాల ఘటనలపై పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశామని, వాటి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా ఆలయాలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మిగిలిన వాటిలోనూ త్వరితగతిన ఏర్పాటు చేస్తామన్నారు. ‘రామతీర్థం’ నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం! విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కేసు దర్యాప్తునకు సంబంధించి డీఐజీ కేఎల్ కాంతారావు ఆదివారం విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి, ఇతర ముఖ్య అ«ధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ఏపీపైనా నివర్ తుఫాను ప్రభావం
-
గ్రేటర్ హై అలర్ట్
-
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్ టీమ్‌లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. కొన్ని ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. వారం రోజులపాటు కొనసాగే ఈ వారోత్సవాల్లో కొంత అలజడి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మన్యం ప్రజలు భయపడుతున్నారు. (పచ్చని అడవికి నెత్తుటి మరకలు) -
సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదానికి తెరదించేందుకు ఓవైపు సంప్రదింపులు సాగుతున్నా తోకజాడిస్తున్న చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత్ సంసిద్ధమైంది. డ్రాగన్ సైన్యం హద్దు మీరితే బుద్ధిచెప్పేందుకు భారీఎత్తున దళాలు, ట్యాంకులతో సన్నద్ధమైంది. ఇరు పక్షాలు ఎల్ఏసీ వద్ద పెద్దసంఖ్యలో మోహరించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు సరిహద్దు వెంబడి భారత్-చైనా ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఇండో-చైనా, భారత్-నేపాల్, భారత్-భూటాన్ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలను ఆదేశించింది. చైనా సరిహద్దుల్లో నిఘాను, పెట్రోలింగ్ తీవ్రతరం చేయాలని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సహస్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లను కోరాయి. చదవండి : భారత్, చైనా మిలటరీ చర్చలు ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, లడఖ్, సిక్కిం సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఐటీబీపీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు ఇండియా-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేయాలని ఎస్ఎస్బీ, ఐటీబీపీలకు స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ, బోర్డర్ మేనేజ్మెంట్ కార్యదర్శి, ఐటీబీపీ, ఎస్ఎస్బీ అధికారులతో బుధవారం జరిగిన అత్యున్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ త్సో ప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఎల్ఏసీ వెంబడి యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా విఫలయత్నం చేసిన నేపథ్యంలో సరిహద్దు వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం పెద్ద ఎత్తున దళాలను మోహరించింది. సైనిక చర్చలు కొనసాగుతుండగానే మంగళవారం కూడా చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇక సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనాల మధ్య చుషుల్‌లో మంగళవారం ప్రారంభమైన బ్రిగేడ్ కమాండర్ స్ధాయి చర్చలు కొనసాగుతున్నాయి. -
ఉగ్ర అలజడి : హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : భారీ స్థాయి పేలుడు పదార్థాలు కలిగిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ నడి వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద పేలుడు పదార్థాలను గుర్తంచారు. వెంటనే తేరుకున్న సిబ్బంది దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే అతన్ని విచారిస్తుండగా ప్రమాదకర నిషేదిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతనితో పాటు మరికొంత మంది ఉగ్రవాదులు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లోకి అక్రమంగా చొరబడినట్లు తెలిసింది. (చొరబాటుదారులను కాల్చి చంపిన బీఎస్ఎఫ్) ఈ నేపథ్యంలో యూపీ పోలీసుశాఖను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవాస్తీతో చర్చించి సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించాలని, చెక్‌పోస్టుల వద్ద భద్రతలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించింది. దీంతో శనివారం రాష్ట్ర పోలీసులు ఉన్నతాధికారులతో సమావేశమైన డీజీపీ దేశంలో ఉగ్ర అలజడి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలిన ఆదేశాలు జారీచేశారు. గణేష్ ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో ఓ కన్నేసి ఉండాలని సూచించారు. -
అయోధ్యలో హైఅలర్ట్
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న భవ్య రామ మందిరం భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని, తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేశాయి. అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన సాకేత్ మహావిద్యాలయ ప్రాంగణంలో హెలికాప్టర్లో దిగుతారు. ఇక్కడి నుంచి రామ జన్మభూమి వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేస్తున్నారు. -
తెలంగాణ ఏజెన్సీలో అలజడి
-
ఆపరేషన్ భాస్కర్..
సాక్షి, హైదరాబాద్ : వారం రోజులుగా తెలంగాణలో మావోల కదలికలతో పోలీసులు అప్రమత్త మయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృ త్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రేహౌండ్స్, టీఎస్ ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్డ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులతో భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆసిఫాబాద్‌లో దాదాపు 500 మంది, మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ దాదాపు 500 మంది వరకు పోలీసులు అడవిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడి దళం సంచారం, 24 గంటల్లో రాష్ట్రంలో రెండుచోట్ల మావోయిస్టులతో పోలీసుల ఎదురు కాల్పులను హోం శాఖ తీవ్రంగా పరిగణించిందని సమాచారం. సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రంలో మావోల రిక్రూట్మెంట్కు యత్నాలు మొదలుపెట్టడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదిలోనే అణిచివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందుకే భారీ ఆపరేషన్‌కు అప్పటి కపుడు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్ దళాన్ని పట్టుకోవడం, లేదా తెలంగాణ నుంచి తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది పోలీసుశాఖ. డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం స్వయంగా ఆసిఫాబాద్‌కు వెళ్లి తాజా పరి స్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రకమిటీ సభ్యుడి రాకతో.. 2009 తరువాత రాష్ట్రంలో మావోయిస్టు సంచారం దాదాపుగా లేదు. ఇక్కడి గ్రేహౌండ్స్ దళాల దూకుడుకు మావో అగ్రనేతలంతా అంతా చత్తీస్ఘడ్, ఒడిశాలకు వలసవెళ్లారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా..చిన్నస్థాయి కొరియర్లు మాత్రమే వచ్చేవారు. కాని తాజాగా భాస్కర్‌తో పాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ (వీరిద్దరి తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది), చత్తీస్‌ఘడ్‌కు చెందిన వర్గీస్ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగులు, మీనా, రాములతో కూడిన దళం ఆసిఫాబాద్‌లోని తిర్యాణీ మండలం పరిధిలో సంచరించింది. వీరు 24 గంటల్లో రెండుసార్లు స్పెషల్ పార్టీకి తారసపడ్డాయి. రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో భాస్కర్ దళం తృటిలో తప్పించుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానిక యువత అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మావోల రిక్రూట్మెంట్లు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించండి: జగన్ కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలన కోసం అడవుల్లో భారీగా కూంబింగ్ చేపట్టడాన్ని ప్రజలు, ప్రజాసంఘాలు ఖండించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో కోరాడు. ప్రజలు, దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. -
ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ హైలర్ట్ విధించినట్లు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసు వర్గాలు మార్కెట్, ఆస్పత్రి ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం చేశాయి. క్రైం ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.(కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం) కాగా గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఇంటలెజిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారు.(కరోనా పేరిట సైబర్ నేరాలకు ఆస్కారం) -
ఎల్ఏసీకి అదనపు బలగాలు
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 3,500 కిలోమీటర్ల భారత్–చైనా సరిహద్దు వెంట అదనపు సైనిక బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్ఏసీలో సైనిక, వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించాయి. చైనా యుద్ధ నౌకలు తిష్టవేసిన హిందూ మహాసముద్రంలో ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భారత నావికా దళం తమ సిబ్బందికి అదేశాలు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు అదనపు బలగాలు, ఆయుధాలను పంపించినట్లు భారత సైనిక దళం వెల్లడించింది. ఇకనుంచి సన్నద్ధత విభిన్నంగా ఉంటుందని సైనికాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతంలో భారత్, చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. -
నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని హోమంత్రి తెలిపారు. కాగా, మహారాష్ట్ర, డయ్యూడామన్, గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు. (చదవండి: ముంబైకి రెడ్ అలర్ట్ ) -
బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్
సాక్షి, విజయవాడ: పటమటలో జరిగిన గ్యాంగ్ వార్‌లో మృతిచెందిన రౌడీషీటర్ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. (సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు..) రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. పండు గ్యాంగ్‌లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కశ్మీర్లో హై అలర్ట్
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. -
కృష్ణా జిల్లాలో హైఅలర్ట్..
-
హైదరాబాద్‌లో అధికారుల అలర్ట్
-
రెడ్‌జోన్ ప్రాంతాల్లో సమగ్ర సర్వే
-
కత్తిపూడిలో హై అలర్ట్..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కత్తిపూడిలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి నుంచి మరో ఐదుగురికి వైరస్ వ్యాపించడంతో ఆ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. శుక్రవారం వచ్చిన రిపోర్ట్స్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గత రెండు రోజుల్లో కత్తిపూడిలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యింది. జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 17కు చేరుకుంది. కత్తిపూడిని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. -
రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిబంధనలు
-
అష్టదిగ్బంధంలో గుంటూరు నగరం
-
ఎలా ఉన్నాయ్?.. ఏం చేస్తున్నాయ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రా ష్ట్ర అటవీశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ›అభయారణ్యాల్లోని పులులు, జింకల పార్కుల్లో ని జింకలు, జూలలోని జంతువుల్లో వైరస్ ల క్షణాలను పరిశీలించడంతో పాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశిం చారు. పులులు ముక్కు కారడం, దగ్గు, ప్ర యాసపడి ఊపిరి తీసుకోవడం వంటి లక్షణా లతో బాధపడుతున్నాయా అనేది ప్రత్యక్షం గా లేదా కెమెరా ట్రాప్‌లతో పరిశీలించాలని సోమవారం తాజాగా జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంచేశారు. సోమవారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రాష్ట్రాలకు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ఆదేశాలిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలోని పులి కి కోవిడ్–19 వైరస్ సోకినట్టు, ఇది ఇతర జం తువులకు వ్యాప్తి చెందే ప్రమాదంపై ఆదివారం యూఎస్ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ ల్యాబొరేటరీస్ ప్రకటించిన దరిమిలా.. జాతీయ పార్కులు, అభయారణ్యాలు, టైగర్ రిజర్వు ల్లో జంతువుల నుంచి జంతువులకు, మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుం చి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్లు, పీసీసీఎఫ్‌లకు కేంద్ర అటవీ శాఖ వైల్డ్‌లైఫ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. గోపీనాథ్ ఆదేశాలు జారీచేశారు. వైరస్ వ్యా ప్తి నేపథ్యంలో ఫీల్డ్ మేనేజర్, వెటర్నరీ డాక్ట ర్లు, అటవీ సిబ్బందితో టాస్క్‌ఫోర్స్, ర్యాపి డ్ యాక్షన్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అడవుల్లో జంతు సంరక్షణ ఇలా.. పులుల సంరక్షణ సిబ్బంది.. పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిన కేసుల్లో స్థలం, లింగం, వయసు వంటివి రికార్డ్ చేయడంతో పాటు వైరస్ నిర్ధారణకు సంబంధించి నమూనాలు తీసుకోవాలని, సిబ్బంది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉపయోగించాలని తాజా ఆదేశాల్లో సూచించారు. వైరస్ ధ్రువీకరణ కోసం పులులు, ఇతర జంతువుల నమూనాలను ఐసీఏఆర్ ధ్రువీకరించిన ల్యాబ్‌లకు పంపిం చాలని పేర్కొన్నారు. జంతువుల సహజ మ రణాలను ఫీల్డ్‌స్టాఫ్ గుర్తించిన వెంటనే పై అధికారులకు తెలపడంతో పాటు వాటి శాం పిళ్లను మార్గదర్శకాలకు అనుగుణంగా సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్, హిస్సార్, బరేలిలోని సంబంధిత పరిశోధన సంస్థలకు పంపించాలని సూచించారు. అటవీప్రాంతా లు, గ్రామాల్లో సంచరించే కోతులు, లంగూర్లలో కారోనా లక్షణాలున్నాయా అనేది గమనించాలని, అడవుల్లో సాసర్పిట్లను నింపే సిబ్బంది శానిటైజ్ కావాలని, టైగర్జోన్లు, అడవుల్లోకి సందర్శకులను వెళ్లనివ్వరాదని, సిబ్బంది జం తువుల దగ్గరకు వెళ్లడం, కృత్రిమ ఆహా రం పెటవద్దని ఆదేశించారు. 24 గంటలూ.. రాష్ట్రంలోని జూలు, జింకల పా ర్కుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా 24 గంటలూ సీసీటీవీల ద్వారా పరిశీలించి, జం తువుల ప్రవర్తన ఎలా ఉందో గమనించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు. జూలలోని పులులు, ఇతర జంతువుల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే శాంపిళ్లను ఐసీఎంఆర్ సూ చించిన పరిశోధన సంస్థలకు పంపించాలని సూచించారు. సిబ్బంది అనారోగ్యంతో ఉం టే జూ, జింకల పార్కుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని ఆదేశించారు. జంతువుల ప్రవర్తన మారిందా? లాక్‌డౌన్‌తో అడవుల మీదుగా రాకపోకలు (అత్యవసరమైనవి మినహా) ఆగిపోయాయి. కాలుష్యం తగ్గి పర్యావరణపరం గా మంచిమార్పులు చోటుచేసుకుంటున్నా యి. ఫలితంగా అడవుల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. జంతువులు అటవీ ప్రాంతాల్లోని రోడ్లపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవెలా ప్రవర్తిస్తున్నాయో పరిశీలన, అధ్యయనం చేయాలని కన్జర్వేటర్ ఆఫ్ ఫా రెస్ట్స్, డీఎఫ్‌వోలు, ఎఫ్‌డీవో లను అటవీశాఖ ఆదేశించిం ది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఏటూరు నాగారం ఇతర అభయారణ్యాల్లోని జంతువుల కదలికలను కెమెరా ట్రాప్‌ల ద్వారా సునిశితంగా ప రిశీలించాలని, అవి ఆహారాన్ని తీసుకునే పద్ధతుల్లో మార్పు వచ్చిందా? సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయా? అనే దానిపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. అడవుల్లోని కెమెరా ట్రాప్లను నీటికుంట లు, వనరుల వద్దకు, జంతువులు ఎక్కువగా రోడ్లు దాటేచోట్లకు మార్చి వాటి ప్రవర్తనను పరిశీలించాలని సూచించింది. ఫొటో, ఆధారాలతో నివేదిక.. ఏయే జంతువులు ఏయే సమాయాల్లో రోడ్లు, నీటికుంటల వద్దకు వస్తున్నాయో కెమెరా ట్రాప్ ఫొటో ఆధారాలతో గుర్తించేలా అటవీశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయా జంతుజాతుల్లో ఏవేవి గుంపులుగా వస్తున్నాయి, ఏవి ఒంటరిగా వస్తున్నాయి, ప్రవర్తిస్తున్న తీరును రికార్డ్ చేసి, సదరు ఫొటోలు, సమాచారాన్ని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌కు పంపించాలని ఉన్నతాధికారులు సూచించారు. అటవీ రేంజ్‌లు, ప్రధాన అటవీ ప్రాంతాల వారీగా ఫొటో ఆధారాలతో సహా నివేదికను నెలాఖరుకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే, లాక్డౌన్ నేపథ్యంలో అనుమతించిన కొన్ని వాహనాలు అడవుల్లోని రోడ్ల మీదుగా అతివేగంగా వెళుతున్నందున జంతువులు ప్రమాదాల బారినపడకుండా క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టడం, స్పీడ్‌బ్రేకర్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేయాలని సూచించింది. -
ఇస్లాంపేట ప్రాంతంలో పూర్తిస్ధాయి ఆంక్షలు
-
ఏపీలో హై అలర్ట్
-
పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి : కరోనావైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. లాక్డౌన్ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్దితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా ఆదేశాలు జారీచేస్తున్నారు. అంతేకాక కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకెళుతున్నారు. (చదవండి : ఏపీలో మరో 14 కరోనా కేసులు) రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసరాల కొనుగోలుకు సమయం కుదించారు. ఏదైనా అత్యవసర పనులు మినహా మిగిలిన సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఈ నిబంధనలు ధిక్కరిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా వెల్లడైన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు, సోకేందుకు అనుమానం ఉన్న వారిని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా, కరోనా బాధితులను కలిసి ఉండటం వంటి అంశాలతో హోమ్ క్వారంటైన్లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించడమో చేస్తున్నారు. పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతరత్రా కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలుసుకుంటున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నారు. అనుమానితులు, పాజిటివ్ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత పరిధి వరకు హైపోక్లోరైడ్ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరుస్తున్నారు. కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ప్రభుత్వ చర్యలు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే ఏపీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. మర్కజ్ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్ సస్పెక్ట్లను ప్రభుత్వ యంత్రాంగం వేగంగా గుర్తించింది. ఇందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. అంతేకాక గుర్తించిన వారిని శరవేగంతో క్వారంటైన్ క్యాంప్‌లకు, ఆసుపత్రులకు తరలించారు. ఆ తర్వాత వెంటనే వారి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ఆయా ప్రాంతాలు హట్స్పాట్లు ప్రకటిస్తున్నారు.ఈ హాట్స్పాట్ల వద్ద మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇలా వెంటనే చర్యలు తీసుకుంటున్న కారణంగానే పాజిటివ్ కేసులన్నీ త్వరగా బయటికి వస్తున్నాయి. వేగంగా జియో ట్యాగింగ్ కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎం జగన్ ఆదేశాల కనుగుణంగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులు, తదితర విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులు పాజిటివ్ కేసులు, ‘మర్కజ్’ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్ పనులు వేగంగా చేస్తున్నారు. హోమ్ క్వారంటైన్లపై నిఘా.. హోమ్ క్వారంటైన్లలో ఉంటున్నవారిపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో కూడిన బృందాలు నిఘా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. హోమ్‌క్వారంటైన్లలో ఉంటున్న వారు నిబంధనల కనుగుణంగా వ్యవహరిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తున్నాయి. ఒక్కో బృందం దాదాపు ఇరవై మంది హోమ్ క్వారంటైన్‌లోని వ్యక్తులను పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హోమ్ క్వారంటైన్ ఉంటున్నవారు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా జనంలో కలుస్తున్నారని ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో వారిపై ఎప్పటికప్పడు వలంటీర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నిఘా ఉంచుతున్నారు. -
కృష్ణాలో కొనసాగుతున్న హైఅలర్ట్
సాక్షి, కృష్ణా: జిల్లాలో కరోనా కలవరం కొనసాగుతోంది. శనివారం ఏకంగా మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లాలో విజయవాడ, కానూరు, నందిగామ, జగ్గయ్యపేట, మచిలీపట్నం పట్టణాల్లోని కరోనా బాధితుల ఇంటి పరిసర ప్రాంతాల్లో యాంటీ వైరస్ రసాయనాలను పిచికారీ చేయించారు. మూడు రోజుల్లో 26 మంది ఐసోలేషన్ కేంద్రానికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. (లాక్ డౌన్ ముగిశాకే ‘టెన్త్’పై నిర్ణయం) మూడు రోజుల్లో 26 మంది వియజవాడలోని ఐసోలేషన్ కేంద్రానికి వచ్చారు. వీరందరినీ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు, గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ రోగుల ఆరోగ్యం స్థిరంగా ఉంటే పిన్నమనేని సిద్ధార్థ వైద్య కశాశాలలో, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూ చికిత్స అవసరమైనా, వెంటిలేటర్ సపోర్టు కావాల్సి వచ్చినా బాధితులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సంక్రమణ చెందకుండా.. కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమక్రమంగా విస్తరిస్తోంది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోనూ కరోనా సంక్రమణ చెందకుండా కఠినమైన చర్యల్ని తీసుకునేలా యంత్రాంగం అడుగులేస్తోంది. విజయవాడ ఐసోలేషన్‌లో 14 రోజుల పరిశీలన, పరీక్షల తరువాత ఒక యువకుడిని శనివారం ఇంటికి పంపించిన అధికారులు ఇదే తరహాలో ఢిల్లీ వారి విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అనుమానం ఉన్న వారిని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకొచ్చి ముందస్తు పరీక్షలు నిర్వహించేలా చూస్తున్నారు. విజయవాడ నగరంలో వ్యాధి నివారణ దిశగా ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పక్కగా అమలు చేయడంతో పాటు వ్యాపారులు సహా ఇతర దుకాణాల సమయపాలన విషయంలో కచ్చితమైన నిబంధనల్ని పాటిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటించాలి లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రభుత్వం, వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా వైరస్‌పై విజయం సాధించవచ్చని కరోనాను జయించిన యువకుడు పేర్కొన్నారు. పారిస్ నుంచి వచ్చిన విజయవాడ పాతబస్తీ చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రభుత్వాస్పత్రిలో 14 రోజులపాటు చికిత్స పొంది కోలుకున్నాడు. అతనికి రెండు సార్లు కరోనా పరీక్ష నిర్వహించగా, నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పోతురాజు నాంచారయ్య, పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.గోపీచంద్ తెలిపారు. కలెక్టర్ అభినందనలు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన యువకుడిని కలెక్టర్ ఏంఎండీ ఇంతియాజ్ అభినందించారు. కరోనాను జయించిన యువకుడికి వైద్యు లు, వైద్య సిబ్బంది హర్షధ్వానాల మధ్య కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పోతురాజు నాంచారయ్య, పల్మ నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.గోపీచంద్, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జి.చక్రధర్‌రావు తదితరులు ఉన్నారు. -
తిరుపతిలో హై అలర్ట్..ఇంటింటికీ సర్వే
-
కరోనా ఎఫెక్ట్: బెజవాడలో అప్రమత్తం
సాక్షి, అమరావతి : ప్యారిస్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 1,005 మంది వివరాలతో కూడిన జాబితా జిల్లాకు చేరింది. వీరంతా ఎక్కడ ఉన్నారో ఆరా తీయడంలో యంత్రాంగం నిమగ్నమైంది. ఆయా మండలాల అధికారులను అప్రమత్తం చేసి వీరిని స్వీయ నిర్బంధంలో ఉంచేలా చర్యలకు సిద్ధమయ్యారు. అలాగే జిల్లాలో మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో, గన్నవరం వెటర్నరీ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ కేంద్రాల్లో కల్పించాల్సిన సదుపాలయ కోసం ఫ్లోరింగ్, ఇంటీరియర్ పనులు నిర్వహిస్తున్నారు. నగరంలో మరింత అప్రమత్తం.. మూడు రోజుల కిందట ప్యారిస్ నుంచి బాధితుడు నగరానికి వచ్చాడు. ఆ యువకుడు ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జర్వం రావడంతో అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు. 21న అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఉండే ప్రాంతంలో 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన 50 బృందాలతో సర్వే చేశారు. అలాగే బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన మార్గం.. రవాణా సదుపాయాలను గుర్తించే చర్యలు చేపట్టారు. బాధితుడు హైదరాబాద్ నుంచి క్యాబ్‌లో విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ఎవరు? విజయవాడకు వచ్చాక బాధితుడు ఈ మూడు రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరిని కలిశాడు? అని ఆరా తీస్తున్నారు. అలాగే అతని కుటుంబసభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. ఇంటింటా సర్వే.. జిల్లాలో గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులకు కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు 1005 మంది వచ్చినట్లు అధికారికంగా తెలుస్తోంది. వీరందరిని పారామెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వని వారు సైతం వెంటనే తమ వివరాల్ని నమోదు చేయాలని కోరుతున్నారు. నగర రహదారులన్నీ నిర్మానుష్యం.. రోజురోజుకీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెజవాడ నగర కర్ఫ్యూలో భాగమైంది. దీంతో ఎప్పుడూ జనసమూహంతో ఉండే పలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా బస్సులన్ని డిపోలకే పరిమితమవడంతో జాతీయ రహదారులు బోసిపోయాయి. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రజలంతా సహకరించాలి: కలెక్టర్ ఇంతియాజ్ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమవంతు సామాజిక బాధ్యతలను చాటాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ : నగర సీపీ ద్వారకాతిరుమలరావు విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రేపటి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘కరోనా సోకిన యువకుడికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని చెబుతున్నా వారికీ పరీక్షలు అవసరం. వారి కుటుంబ సభ్యులు బయటికి వస్తే వైరస్ విస్తరించే అవకాశం ఎక్కువ. విజయవాడలో కరోనా కంట్రోల్ రూమ్ నెంబర్ 7995244260కు ఫోన్ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చు’ అని నగర సీపీ తెలిపారు. -
కరీంనగర్లో హై అలర్ట్
-
అల్లిపురం అష్టదిగ్బంధం
నాలుగు వార్డులు.. వేలాది ఇళ్లు.. వాటిని కవర్ చేసేందుకు 141 సర్వే బృందాలు.. వందలాది పారిశుధ్య సిబ్బంది.. తోడుగా పోలీసులు, ఇతర అధికారులు.. వారంతా తెల్లవారుజామునే ఆ ప్రాంతాన్ని ముట్టడించారు.. దిగ్బంధించారు.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఆ ప్రాంతం.. నగరంలోని అల్లిపురం.. దాన్ని చుట్టుముట్టడానికి, జల్లెడ పట్టడానికి కారణం.. ఒకే ఒక్క కేసు.. అదే కరోనా పాజిటివ్.. అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గురువారం రాత్రి తేలడంతో.. అల్లిపురంతోపాటు మొత్తం విశాఖ నగరం ఉలిక్కిపడింది. కలవరపాటుకు గురైంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.. శుక్రవారం తెల్లవారుజామునే అల్లిపురం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో రహదారులను దిగ్బంధించింది. వార్డు వాలంటీర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో కూడిన 141 బృందాలను 28, 32, 33, 34 వార్డుల పరిధిలోని ప్రతి ఇంటినీ జల్లెడ పట్టించింది. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించింది. బాధిత రోగి కుటుంబానికి చెందిన 11 మందిని విమ్స్, ఛాతీ ఆస్పత్రుల్లోని క్వారంటైన్ వార్డులకు తరలించారు. అన్ని వీధుల్లోనూ ముమ్మర శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు నగరానికి కరోనా గ్రహణం పట్టింది. సాధారణంగా గ్రహణ సమయాల్లో అన్నీ మూసివేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. నగరంలో కరోనా కాలం నడుస్తోంది. మహమ్మారి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు చేపడుతున్న ముందస్తు చర్యలతో సమస్తం బంద్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింహాచలం సహా ప్రముఖ ఆలయాలన్నింటినీ మూసివేశారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మ్యూజియాలు, జూపార్క్.. ఇలా జనసమ్మర్థం ఉండే సంస్థలన్నింటినీ మూసివేయించారు. విదేశాల నుంచి నగరానికి వచ్చిన 1100 మంది ఆరోగ్యంపై నిఘా పెట్టి.. సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. విమ్స్‌లో ఒక్క కార్వంటైన్ విభాగం మినహా మిగిలిన అన్ని వైద్య విభాగాలను మూసివేశారు. అల్లిపురం(విశాఖ దక్షిణ): కరోనా పాజిటివ్ కేసు బయటపడిన అల్లిపురం పరిసరాలు అష్ట దిగ్బంధమయ్యాయి. అధికారగణం అప్రమత్తమైంది. శుక్రవారం ఉదయం 5 గంటలకే అల్లిపురం వివేకానంద కాలనీలో పరిశుభ్రతా చర్యలు ప్రారంభించారు. రసాయనాలు స్ప్రే చేశారు. బ్లీచింగ్ చల్లారు. బాధితుడు నివాసం ఉంటున్న ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, వలంటీర్లు ఈ చర్యల్లో పాల్గొన్నారు. జీవీఎంసీ ప్రధాన వైద్యా«ధికారి శాస్త్రి దగ్గరుండి రక్షణ చర్యలను పర్యవేక్షించారు. రాకపోకలు సాగించే దారులన్నీ దిగ్బంధం చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. రాకపోకలు బంద్... ►కరోనా కలకలంతో అల్లిపురంలో రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ►డాబాగార్డెన్స్ ఆర్ఆర్ గ్రాండ్ హోటల్ వద్ద స్టాపర్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. ►చావులమదుం హరితాలాడ్జి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ►లీలామహల్ రోడ్డులో ఎంజీఎం హైసూ్కల్, నీలమ్మవేపచెట్టుకు రహదారి మూసివేశారు. ►కొబ్బరితోట సమీపంలోని రామకృష్ణ మార్కెట్ జంక్షన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ►32,33,34 వార్డులలోప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లు కదలలేదు. ►వీధులన్నీ కర్ఫ్యూని తలపించాయి. ►చాలా మంది తాజా సమాచారం కోసం ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయారు. భయం వద్దు... పరిశుభ్రతే మందు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచే అధికారులు 32,33,34 వార్డుల్లో అవగాహన చర్యలు ప్రారంభించారు. ప్రజలు భయపడొద్దని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. మైకుల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జాగ్రత్తలివే... ►ప్రతి ఐదు నిమిషాలకు సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి. ►బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు శుభ్రం చేసుకోవాలి. ►వీలైతే బట్టలు మార్చుకోవాలి. ►మాస్క్‌లు ధరించాలి. ►టిష్యూ పేపర్‌ను వినియోగించిన తరువాత మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి. ►గుంపులుగా సంచరిచొద్దు. ►మనిషికి మనిషికీ మధ్య మీటరు దూరం పాటించాలి. ►అవసరమైతే తప్ప ఇళ్లు కదలొద్దు. మదీనా టు విశాఖ వయా హైదరాబాద్ మార్చి 10: మదీనా నుంచి హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంటికి చేరుకున్న బాధితుడు మార్చి 11: రైలులో హైదరాబాద్ నుంచి నగరానికి ప్రయాణం మార్చి 12: మధ్యాహ్నం 1.30కు నగరంలోని రైల్వే స్టేషన్‌కు చేరిక.. అక్కడ్నుంచి నేరుగా అల్లిపురం వివేకానందకాలనీలోని నివాసానికి వెళ్లారు. మార్చి 14: అనారోగ్యం, దగ్గు, జ్వరం రావడంతో ఆటోలో ఎన్ఏడీ జంక్షన్‌లోని సురక్ష ఆస్పత్రికి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ఆస్పత్రి నుంచి ఆటోలో ఇంటికి వెళ్లారు. మార్చి 17: ఉదయం 11 గంటలకు ఎన్ఏడీలోని సురక్ష ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉండడంతో టీబీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి నమూనాలు తిరుపతి ల్యాబ్‌కు పంపారు. మార్చి 19: రాత్రి 9 గంటల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులకు సమాచారం అందింది. మార్చి 20: అధికారగణం అప్రమత్తమైంది. ఉదయం 5 గంటల నుంచి బాధితుడి నివాస పరిసరాల్లో స్క్రీనింగ్ చర్యలకు ఉపక్రమించింది. 147 కేసుల్లో ఒకటే పాజిటివ్ విశాఖపట్నం: జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన కరోనా అనుమానిత కేసుల్లో ఒక్కటే పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో 147 మందిని పరిశీలనలో ఉంచారు. వారిలో 84 మందికి 28 రోజుల క్వారంటైన్ సమయం ముగిసిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు. మిగిలిన వారిలో 53 మంది వారి ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. 10 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు మొత్తంగా 31 మంది నమూనాలు తీసి పరీక్షలకు పంపించగా.. ఒకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 26 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. మిగిలిన నలుగురి రిపోర్టులు రావాల్సి ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు. -
కాళేశ్వరం వద్ద పటిష్ట భద్రత
కాళేశ్వరం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంలు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోల కదలికలపైన నాలుగు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీల పైనుంచి మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు గల మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. గోదావరి ప్రవాహం తగ్గుతుండటంతో అటువైపున పోలీసులు దృష్టి పెట్టారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఓఎస్డీ శోభన్‌కుమార్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐలు నర్సయ్య, హతిరాం, కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
భారత్‌లో రెండో మరణం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా ప్రకంపనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. కర్నాటకలో బుధవారం కోవిడ్ –19 కి సంబంధించి తొలి మరణం నమోదు కాగా, శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మరో మరణం సంభవించింది. కరోనా నిర్ధారణ అయిన 68 ఏళ్ల మహిళ ఢిల్లీలో మరణించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆమె మధుమేహం(డయాబెటిస్), రక్తపోటు(బీపీ)తో బాధపడుతున్నారని, ఇటీవల ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఆమె రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్, ఇటలీల్లో పర్యటించి వచ్చిన ఆమె కుమారుడికి కూడా కోవిడ్–19 నిర్ధారణ అయిందని వెల్లడించారు. అతడికి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులను వేరుగా ఉంచి, పరీక్షిస్తున్నట్లు తెలిపారు. బికనీర్‌లో కొత్త జంటకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న దృశ్యం దేశవ్యాప్తంగా హై అలర్ట్ కరోనా మరణాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు. అన్ని రకాల ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంప్‌లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సదస్సులు, పుట్టినరోజు వేడుకలు, వివాహ కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజుల పాటు నిలిపేయాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప శుక్రవారం రాష్ట్ర ప్రజలకు సూచించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను వారం పాటు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదని ప్రజలకు సూచించారు. స్కూళ్లను మూసేయాలని, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలతో పాటు సహా అన్ని పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేలా విధుల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయన్నారు. కోవిడ్‌తో కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అతడు కాకుండా, రాష్ట్రంలో మరో ఐదుగురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో, బెంగళూరులోని గూగుల్ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కూడా ఉన్నారు. కల్బుర్గిలో మరణించిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న 46 మందిని కూడా ప్రత్యేకంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 82కి చేరింది. వీటిలో 11 యూపీలో, 7 ఢిల్లీలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసులు నిర్ధారణ అయ్యాయి. సుధామూర్తి సూచనలు కరోనా కట్టడికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నాటక ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. షాపింగ్ మాల్స్‌ను, సినిమా టాకీస్‌లను తక్షణమే మూసేసి, నిత్యావసరాలైన ఫార్మసీ, కిరాణా, పెట్రోల్ బంక్‌లను మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. బాధితుల కోసం ఒక ఆసుపత్రిని సిద్ధం చేయాలని, అందుకు తమ సహకారం అందిస్తామన్నారు. ఇతర ముఖ్యాంశాలు.. ► ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, శ్రీలంక దేశాలకు ఏప్రిల్ 30 వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. ► ఉత్తరప్రదేశ్‌లో 11 కరోనా కేసులు నమోదు కావడంతో అన్ని పాఠశాలలు, కళాశాలల్ని మార్చి 22 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయి. ► ఢిల్లీలో మార్చి 31 వరకు జేఎన్‌యూ సహా అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ని బంద్ చేశారు. ఒడిశా కూడా అదే బాటలో నడుస్తోంది. ► కేరళలో చెంగాళంలో కరోనా వైరస్ సోకిన బాధితుడి పొరుగు ఇంట్లో నివసించే వృద్ధుడు మరణించడంతో కలకలం రేగింది. అతనికి కూడా కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానాలు వచ్చాయి. అయితే అతను గుండె పోటుతో మరణించాడని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 900 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇటలీ నుంచి గత నెలలో కేరళకు వచ్చిన కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకిందని తేలడంతో ఆ రాష్ట్రం పలు చర్యలు తీసుకుంది. ► కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర కూడా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ముంబై, నవీముంబై, పుణె, థానె, నాగపూర్, పింప్రి చించ్వాడాలలో మార్చి 30 వరకు మాల్స్, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లను మూసివేశారు. ► వాఘా సరిహద్దుల ద్వారా విదేశీయులెవరినీ శుక్రవారం సాయంత్రం నుంచి దేశంలోకి అనుమతించడం లేదు. ► ఇటలీలో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మిలాన్‌కు వెళ్లింది. ఆదివారం ఉదయానికి భారతీయుల్ని వెనక్కి తీసుకురానుంది. మరోవైపు ఇరాన్ నుంచి రెండో విడత 44 మంది యాత్రికుల్ని వెనక్కి తీసుకువచ్చారు. ముంబై విమానాశ్రయంలో దిగిన వారిని జైసల్మీర్‌లో ఆర్మీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ► ఏప్రిల్ 15వరకు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ప్రయాణికుల రాకపోకల్ని నిలిపివేశారు. ► సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఈ సోమవారం నుంచి అత్యవసర కేసులు తప్ప మిగిలినవేవీ విచారణ చేపట్టకూడదని నిర్ణయించింది. కోర్టు హాలులోకి లాయర్లను మినహా మరెవరినీ అనుమతించరు. ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 21 నుంచి రెండు రోజుల గుజరాత్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇవీ నిత్యావసరాలే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగించే ఫేస్ మాస్క్‌లు, గ్లవుజులు, హ్యాండ్ శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిని నిత్యావసర వస్తువుల చట్టం–1955 పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో, వీటి ఉత్పత్తి, నాణ్యత, సరఫరా, ధరలను నియంత్రించే అవకాశం రాష్ట్రాలకు లభిస్తుంది. జూన్ 30 వరకు అవి నిత్యావసరాల జాబితాలో ఉంటాయని, వాటిని అక్రమంగా పెద్ద ఎత్తున నిలవ చేయడం నేరమని కేంద్రం పేర్కొంది. వీటి ధరలను పెంచి అమ్మడం కూడా నేరమని పేర్కొంది. అవసరాలకు తగినంతగా వీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలి కరోనా మరణం నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందుతున్న కోవిడ్ అనుమానితులను క్లియర్ రిపోర్ట్ రాకుండా బయటకు పంపొద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి.. ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేసినప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్ అనుమానితులను ఐసోలేషన్ చేయ్సాలిందేని నిర్ణయించింది. కర్ణాటక తొలి కోరోనా మృతుడి వివరాలను సర్వేలైన్స్ బృందాలు ట్రాక్ చేస్తున్నాయి. (కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత) 60 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఐదు వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా.. 60 ప్రైవేటు ఆసుపత్రులకు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి జిల్లాలోని జిల్లా పరిషత్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌లలో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా అనుమానితుల వైద్య పరీక్షల రిపోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు డిచార్జ్ చేయొద్దని జిల్లాల్లో ఏర్పాటు చేసిన రాపిడ్ రియాక్షన్ ఫోర్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు) హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు నెలరోజులు పాటు సెలవులకు హైదరాబాద్ వచ్చిన సౌదీ వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనా ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా సౌదీకి అనుమతి నిరాకరించడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఐసోలేషన్ వార్డులోనే ఉండాలని గాంధీ వైద్యులు సూచించారు. వార్డు నుంచి వైద్యుల అనుమతి లేకుండా బయటకు రాకూడదనే ఆంక్షల నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు సౌదీ తిరిగి వెళ్లడానికి రిటర్న్ టికెట్లు ఉన్నాయని సౌదీ వాసులు చెప్పినట్లు తెలిసింది. -
ఢిల్లీలో నెలకొంటున్న సాధారణ పరిస్ధితులు
-
ఏపీ, తెలంగాణలో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్/అమరావతి: అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పీస్ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదనే ఉత్తర్వులు వెలువడ్డాయి. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన, అనుమానిత ప్రాంతాలకు వాటర్ కెనన్లు, వజ్ర వాహనాలను తరలించనున్నారు. మరీ ముఖ్యంగా నిజామబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియాపై నిఘా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా కామెంట్లు, పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఏపీ అంతటా అప్రమత్తం అయోధ్య కేసులో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. డీజీపీ గౌతం సవాంగ్ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. -
అయోధ్య తీర్పు : రాష్ట్రంలో హైఅలర్ట్!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య తీర్పు నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయం పంపిన ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని పీస్ కమి టీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచి్చనా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోనవద్దని సూచిం చారు. కొందరు అనుమానితులు, నేరచరిత ఉన్నవారిపై నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీసులు తన వద్ద సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీలో ఉన్న మొత్తం 54 వేల మంది సిబ్బందిని వినియోగించేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాపై నిఘా తీర్పు వెలువడ్డాక ఎలాంటి భావావేశాలకు లోను కావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి పుకార్లు, వదంతులు వ్యాప్తి చేయకూడదని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా ఎలాంటి కామెంట్లు, పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ రెచ్చగొట్టేలా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉండే పోస్టులు, వీడియోలు ఏమైనా వస్తే.. వెంటనే వాటిని డిలీట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ‘డిలీట్‌ఇట్’అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా రూపొం దించే ఆలోచనలో ఉన్నారు. అభ్యంతరకర సమాచారం ఏదైనా చూసిన వెంటనే ఇతరులకు షేర్ చేయకుండా.. దాన్ని అప్పటికప్పుడే డిలీట్ చేయడం దీని ఉద్దేశం. పాత జిల్లాలపై ప్రత్యేక నజర్..! పాత ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేక నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. పాత రౌడీïÙటర్లు, నేరచరిత్ర ఉన్నవారిని స్టేషన్లకు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నేరస్వభావం ఉన్నవారు, అనుమానితులపైనా నిఘా ఉంచారు. జిల్లాల్లో ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ ర్యాంకు అధికారి వరకు వివిధ వర్గాలతో సమావేశాల్లో నిమగ్నమయ్యారు. న్యాయస్థానం తీర్పును అంతా గౌరవించాలని సూచిస్తున్నారు. విజయోత్సవాలు, నిరసనల ర్యాలీలు వేటికీ అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. -
సరిహద్దుల్లో సైన్యం డేగకన్ను
శ్రీనగర్/జమ్మూ: పాక్ నుంచి సొరంగాలు, కందకాల ద్వారా అక్రమ చొరబాట్లు, డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులకు ఆయుధ సరఫరా వంటి వాటిపై సైన్యం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తనిఖీలు, నిఘాతో సరిహద్దుల వెంబడి డేగకన్ను వేశాయి. చొరబాట్లను నివారించేందుకు మూడంచెల గ్రిడ్‌ను హై అలర్ట్‌లో ఉంచాలని సైనిక, పరిపాలన యంత్రాంగాలను జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కోరారు. కశీ్మర్, పంజాబ్‌లలో పాక్‌తో ఉన్న వెయ్యి కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సొరంగాలు, కందకాల ద్వారా సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించేందుకు అవకాశం ఉందన్న అనుమానంతో జవాన్లు భారీగా తనిఖీలు చేపట్టారు. సొరంగాల జాడ కనిపెట్టేందుకు మూడంచెల సరిహద్దు కంచె వెంబడి నిర్ణీత లోతున్న కందకాలు తవ్వి, భూమిని దున్నుతున్నారు. గత వారం జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్లో సైన్యం కళ్లుగప్పి దేశంలోకి ప్రవేశించిన పాక్ యువకుడిని సైన్యం పట్టుకుంది. అతడు సరిహద్దుల్లో కంచెను దాటకుండానే చొరబడినట్లు గుర్తించిన సైన్యం..అక్రమ చొరబాట్ల కోసం పాక్ ఆర్మీ సరిహద్దుల్లో తవి్వన కందకాలు, సొరంగాల గుండానే అతడు వచ్చి ఉంటాడని అనుమానిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవాన్లు సరిహద్దుల్లో కందకాలు, సొరంగాలను కనిపెట్టేందుకు పంజాబ్, జమ్మూలలో ప్రత్యేక సెన్సార్లు, ఆధునిక టెక్నాలజీలతో అణువణువూ తనిఖీలు చేపట్టారు. చీనాబ్ నది గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబాట్లను నిలువరించేందుకు నదిలో గస్తీని పెంచింది. భారత గగనతలంలోకి చొరబడే డ్రోన్లను తక్షణమే కూల్చి వేయాలని ఆదేశించింది. సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పహారాను ముమ్మరం చేసింది. కశ్మీర్లో ఎన్ఎస్ఏ దోవల్ పర్యటన పాకిస్తాన్ ఆర్మీ ప్రేరేపిత చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో చొరబాటు నిరోధక గ్రిడ్‌ను అప్రమత్తంగా ఉంచాలని, కీలకమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచాలని ఎన్ఎస్ఏ దోవల్ ఆదేశించారు. కశీ్మర్ లోయలో ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన శ్రీనగర్‌లో అధికార యంత్రాంగం, భద్రతా అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. పాక్ నుంచి భారీగా అక్రమ చొరబాట్లకు అవకాశం ఉందన్న సమాచారంపై ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చొరబాట్ల వ్యతిరేక గ్రిడ్‌ను హైఅలెర్ట్‌లో ఉంచాలని ఆర్మీ, బీఎస్ఎఫ్ అధికారులను కోరారు. -
నల్లమలలో అలర్ట్
సాక్షి, మార్కాపురం(ప్రకాశం) :విశాఖ మన్యంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో నల్లమలలో యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వారం రోజుల కిందట మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులపై నిఘా పెట్టాలని, అన్ని పోలీసుస్టేషన్ల ఎస్ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మన్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ముందు జాగ్రత్తగా నల్లమల పరిధిలోని పోలీసుస్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేసి మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించాలని ఆదేశించారు. గతంలో నల్లమల అటవీ ప్రాంతం, మావోయిస్టులకు నిలయంగా ఉండేది. పలువురు రాష్ట్ర స్థాయి అగ్రనేతలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే నల్లమలలోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించే వారు. పలు సార్లు పోలీసుల ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లలో అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, తదితరులు మృతి చెందారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోవడం, మరికొందరు లొంగిపోవటంతో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గత నెల నుంచి యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయని, దాన్ని వ్యతిరేకించాలంటూ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమం ద్వార మళ్లీ మావోయిస్టులు ప్రవేశిస్తారా, ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ మద్దతు ఇస్తున్నారా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే అంశాలపై సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు సమాచారాన్ని సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో మార్కాపురం డివిజన్లోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, అర్ధవీడు, కంభం, రాచర్ల, గిద్దలూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టులు కార్యకలాపాలు, ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మళ్లీ నల్లమలలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెడుతున్నారు. మరో వైపు మావోయిస్టులు ఏవోబీలో కార్యకలాపాలు చేస్తూ నల్లమలను షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నారా అనే అంశంపై కూడా సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉద్యమం లేకున్నా పోలీసులు మాత్రం ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ విషయమై మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నల్లమలలో మావోయిస్టుల కదలికలు లేవని, అయినా సిబ్బందిని అలర్ట్ చేశామని స్పష్టం చేశారు. -
తీరంలో హై అలెర్ట్
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖపట్టణం): ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌లో ఉగ్ర దాడికి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ చర్యలతో దేశవ్యాప్తంగా అప్రమత్తం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో కేంద్రం హోంశాఖ హై అలెర్ట్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి అందిన ఆదేశాల మేరకు భద్రతా బలగాలు సంయుక్తంగా జల్లెడ పడుతున్నాయి. అందులో భాగంగా విశాఖ తీరం పొడవునా నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్, సివిల్ పోలీసు దళాలు గస్తీ ముమ్మరం చేశాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద బోట్లు సముద్రంలో సంచరించే అవకాశం ఉందన్న సమాచారంతో తీరం పొడవునా డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. నిఘా చర్యలు కట్టదిట్టం చేశారు. అదే విధంగా ఫిషింగ్ హార్బర్లో మెరైన్, కోస్ట్‌గార్డ్ అధికారులు మత్స్యకారులకు రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు వేట చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు, బోట్లు కనిపిస్తే వెంటనే కోస్ట్‌గార్డ్, మెరైన్ కంట్రోల్ రూములకు సమాచారం అందించాలని సూచించారు. -
షార్‌లో హై అలర్ట్..
సాక్షి, నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ మేర సీఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్ తీరంలో తిరిగే పడవలపై మరింత నిఘా పెట్టారు. తీర ప్రాంతంలో రోజూ కన్న మరింత ఎక్కువ బలగాలను మోహరించిన గస్తీని కట్టుదిట్టం చేశారు. మరోవైపు శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారి కదలికలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట సమీపంలోని అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపట్టారు. అలాగే రొట్టెల పండుగ సందర్భంగా వేనాడు దర్గాకు వచ్చే వాహనాల తనిఖీలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. -
భారీ వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్
చండీగఢ్: రానున్న రెండు రోజుల్లో పంజాబ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. పంజాబ్‌లో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణశాఖ తాజాగా హెచ్చరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. ముందుస్తు చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులంతో సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రెవన్యూ, డ్రెయినేజీ, హెల్త్, ఫుడ్, యానిమల్ హజ్బెండ్రీ శాఖలకు సీఎం కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. వరద తాకిడి పెరగడంతో ముందుస్తు జాగ్రత్తగా బాక్రా డ్యామ్ గేట్లను ఎత్తేశారు. సట్లజ్తో పాటు జలంధర్ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారికి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లను ఇప్పటికే భారీ వర్షాలు హోరెత్తింస్తున్న విషయం తెలిసిందే. -
భారీ వరదలు.. కొచ్చి ఎయిర్‌పోర్టు మూసివేత
తిరువనంతపురం: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ సహా తొమ్మిది జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పెరియార్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటం.. కొచ్చి విమానశ్రయం సమీపంలోని కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో.. విమానాశ్రయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుంచి విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారీ వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతాధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పెంచడం కోసం మరిన్ని కేంద్ర బలగాలను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాడు. మలప్పురం జిల్లా నిలంబురి గ్రామంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు తప్పిపోయాయి. సహాయక బృందాలు ఈ రోజు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. -
నగరంలో హై అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు కమిషనర్లు స్వయంగా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పాతబస్తీలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అవసరమైన, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపిపటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీఎస్ఎస్పీ బలగాలను మోహరిస్తున్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో పోలీసు విభాగంలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అన్ని స్థాయిల అధికారులు, అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండాలంటూ ‘స్టాండ్ టు’ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడు కమిషనరేట్లలో ఎక్కడా ర్యాలీలు, సభలు తదితరాలు నిర్వహించరాదని.. అలాంటి వాటికి అనుమతులు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు. అనుమానిత/సున్నిత/సమస్యాత్మక ప్రాంతాలు, కొందరు వ్యక్తులపై నిఘా పెట్టడానికి పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరించారు. గతంలో కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి షాడోటీమ్లను ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ అవసరమైన చోట్ల పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పక్కా బందోబస్తు, భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఉన్నతాధికారులందరూ అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటూ... ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డీజీపీ కార్యాలయంతో అనుసంధానం ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నాం’ అని ఉన్నతాధికారులు ప్రకటించారు. పాతబస్తీకి రామగుండం సీపీ ప్రస్తుతం రామగుండం పోలీసు కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సత్యనారాయణను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పాతబస్తీకి పంపారు. రామగుండం వెళ్లడానికి ముందు సుదీర్ఘకాలం దక్షిణ మండల డీసీపీగా విధులు నిర్వర్తించిన ఈయన అనేక కీలక ఘట్టాలను ప్రశాంతంగా గట్టెక్కించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో సత్యనారాయణను సోమవారం హుటాహుటిన రప్పించారు. పురానీహవేలీలోని కమిషనర్ కార్యాలయంలో కొత్వాల్ అంజనీకుమార్‌తో కలిసి బస చేస్తున్న ఈయన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోపక్క తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వివిధ రకాలైన పుకార్లు షికార్లు చేస్తాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాలపై నిఘా ఉంచడానికి సైబర్ క్రైమ్ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముస్లిం ధార్మిక సంస్థల వ్యతిరేకత... జమ్మూకశ్మీర్ పరిణామాలపై నగరవాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా... మరికొందరు తప్పుపడుతున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ముస్లిం ధార్మిక సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ముస్లిం సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. అదే విధంగా కశ్మీర్ నుంచి నగరానికి ఇక్కడి చదువుకుంటున్న విద్యార్థుల్లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు మద్దతు పలుకుతుండగా... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పాతబస్తీలో భారీ బందోబస్తు యాకుత్‌పురా: జమ్మూకశ్మీర్ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజా మోడ్, హరిబౌలి చౌరస్తా, బీబీబజార్ చౌరస్తా, యాకుత్‌పురా బడాబజార్, దారుషిఫా, గౌలిపురా మీర్‌కా దయారా తదితర ప్రాంతాల్లో పోలీసులు బలగాలు మోహరించారు. లాల్‌దర్వాజా మోడ్ వద్ద స్థానిక పోలీసులతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉన్నతాధికారుల ఆదేశానుసారం బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో మోహరించిన 35వేల బలగాలు
-
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
-
జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్..!
శ్రీనగర్: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద దాడులు జరగొచ్చని భారత్, అమెరికాకు పాకిస్థాన్ నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అవంతిపురలో శక్తిమంతమైన ఐఈడీ బాంబులతో కూడిన వాహనాలతో ముష్కరులు పేలుళ్లకు పాల్పడవచ్చని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసింది. గత నెలలో కశ్మీర్లో ఆర్మీ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో ఉగ్రవాది జకీర్ మూసా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రదాడులు జరుగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. అవంతిపురకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. -
కేరళలో హై అలర్ట్
తిరువనంతపురం: శ్రీలంక నుంచి లక్షద్వీప్ దీవులకు వస్తున్న ఓ బోట్లో పదిహేను మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం కలకలం రేపింది. దీంతో కేరళ, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో తీర ప్రాంతాల్లో నౌకలను, విమానాలను సిద్ధం చేసినట్లు నేవీ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకలో వరుస బాంబు దాడుల తర్వాత హెచ్చరికలు రావడం, కేరళలో ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేశారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళకు చెందిన కొంతమంది ఐసిస్‌తో కలిసి పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు దాడుల్లో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. -
విశాఖ ఏజెన్సీలో హైఅలెర్టె
-
ఫొని తుఫాను ఎఫెక్ట్.. శ్రీకాకుళంలో రెడ్ అలర్ట్
-
సూపర్ సైక్లోన్‌గా ఫొని.. శ్రీకాకుళానికి కుంభవృష్టి
సాక్షి, అమరావతి : కొద్ది సేపటి క్రితమే ఫొని సూపర్ సైక్లోన్‌గా మారినట్లు ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. విశాఖపట్నానికి 175 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ పెను తుపాను దక్షిణ ఒడిశా వైపు దూసుకెళుతున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం తీర ప్రాంత మండలాల్లో కుంభవృష్టి కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఫొని తుఫాను ప్రభావం ఈ రాత్రినుంచి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జాతీయ రహదారిపై ఈ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరించటానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. వేగంగా ఉత్తారాంధ్ర వైపు దూసుకువస్తోంది. దీంతో శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో ఆర్టీజీఎస్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఒడిశాలోని పూరీకి 320 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 170 కిలోమీటర్ల దూరంలో ఫొని కేంద్రీకృతమైంది. రేపు గోపాల్పూర్-చాంద్‌బలి మధ్య ఫొని తీరందాటనుంది. తీరం దాటే సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖ తీరం వెంబడి గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. భీముని పట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నెంబర్, కాకినాడ పోర్టులో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. అలర్ట్ అయిన అధికార యంత్రాంగం శ్రీకాకుళం : ఫొని ప్రభావం ఉండనున్న 13 మండలాల్లో 43 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పూరిళ్లు, రేకుల ఇళ్లళ్లో ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. నాగావళి, వంశధార, మహేంద్రతనయ బహుదా నదుల్లో వరద నీరు వస్తుందని ఒడిశా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, పలాస, నరసన్నపేట, టెక్కలి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో IAS అధికారిని నియమించింది ప్రభుత్వం. తుపాను ప్రభావిత మండలాలు 17 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. 17 మండలాల్లో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాతిక వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. లక్ష మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రతి పునరావాస కేంద్రం వద్ద గ్రామధికార్లతో పాటు పోలీస్, ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. శుక్రవారం రోజు మొత్తం పునరావాస కేంద్రాలు కొనసాగనున్నాయి. -
తీరం హైఅలర్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో ఆదివారం 8 చోట్ల పేలుళ్లు జరిగి 215 మంది ప్రజలు మృతి చెందగా వందల మందిక్షతగాత్రులైన విషయం తెలిసిందే. సోమవారం కొలంబోలోని ఓ చర్చిలో, హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్లతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. దీంతో ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సంకేతాలు అందాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలకు సూచించాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం శ్రీలంక తీరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తమిళనాడులోని తూత్తుకూడి, కన్యాకుమారి, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో తీరం వెంబడి భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మన రాష్ట్రంలో సైతం అధికారులు అప్రమత్తమయ్యారు. మెరైన్ ఉన్నతాధికారులు సోమవారం సిబ్బందితో సమావేశమయ్యారు. నెల్లూరు తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు జిల్లా కావడంతో జిల్లాలో తీరం వెంబడి హైఅలెర్ట్ ప్రకటించారు. 167 కి.మీ. మేర జిల్లాలో తీరప్రాంతం విస్తరించి ఉంది. తీరం వెంబడి 125 గ్రాములు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, మత్స్యకారులతో మెరైన్ పోలీసులు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలను వారికి తెలియజేశారు. కొత్త వ్యక్తులు తారసపడినా, సముద్రంలో అనుమనాస్పదంగా బోట్లు సంచరిస్తున్నా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇస్కపల్లి, దుగరాజపట్నం, శ్రీహరికోట మెరైన్ పోలీసులు బృందాలుగా విడిపోయి తీరం వెంబడి గస్తీని ముమ్మరం చేశారు. జాలర్ల ముసుగులో ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉండడంతో తీరప్రాంత పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న మత్స్యకారులను సైతం గస్తీలో భాగస్వాములను చేశారు. మరోవైపు కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో గస్తీ చేపట్టాయి. తమిళనాడు వైపు నుంచి వచ్చే ఏచిన్న బోటును వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి వివరాలు సేకరించిన అనంతరమే వారిని విడిచిపెడుతున్నారు. దేశానికే తలమానికమైన షార్ వద్ద కేంద్రబలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. షార్ చుట్టూ తనిఖీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కృష్ణపట్నం పోర్టులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మెరైన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసులు సైతం భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులను మెరైన్ పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందికి వివరిస్తూ అందుకు అనుగుణంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
భారత తీర ప్రాంతంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే)’ హస్తం ఉందని శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ద్వీప దేశం నుంచి పారిపోయే అవకాశం ఉందని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్ గార్డ్ అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారత సముద్ర జలాల్లో గస్తీ నిర్వహించడానికి భారీగా షిప్పులను, డ్రోనియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించినట్టు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. భారత జలాల్లోకి ప్రవేశించే అనుమానిత బోట్స్‌ను గుర్తించడానికి పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం శ్రీలంకలో జరిగిన వరసు పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 300 మందికి చేరింది. దాయాది పాకిస్తాన్ నుంచి సుముద్ర జలాల గుండా భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో మరణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. -
దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లుతోంది. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు సంబంధించి పది రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులుకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ‘నేషనల్ తోహీత్ జమాత్(ఎన్టీజే)’ సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిననట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు చీఫ్ పుజత్ జయసుందర ఏప్రిల్ 11వ తేదీన ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. కాగా, గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే రాడికల్ ముస్లిం వర్గానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో ఈస్టర్ పర్వదినాన చర్చిలకు వచ్చే విదేశీ యాత్రికులే లక్ష్యంగా దాడులు జరిగనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
హై అలర్ట్ : వదంతులు నమ్మొద్దు
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లతో దద్దరిల్లిన క్రమంలో శ్రీలంక అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయం మూడు చర్చిలు, ఐదు ఫైవ్‌స్టార్ హోటళ్లలో పేలుళ్లతో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. పేలడు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు స్ధానిక భద్రతాధికారుల ప్రయత్నాలకు తోడు ఎమర్జెన్సీ సర్వీసులు తోడ్పాటు అందిస్తున్నాయి. చదవండి... (బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు పలు చోట్ల సైన్యాన్ని రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేసి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. కొలంబోలోని బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ భద్రతా మండలి సమావేశంలో బాంబు పేలుళ్ల ఘటన అనంతర పరిస్ధితులపై ఆయన తన నివాసంలో సమీక్షించనున్నారు. కాగా బాంబు పేలుళ్ల ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా అధికారులు అందుకు అనుగుణంగా అప్రమత్తం కాలేదనే వార్తలు దుమారం రేపాయి. -
నగరంపై ఎన్ఐఏ నిఘా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌పై భారత వాయుసేన సర్జికల్ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కీలక, సున్నిత ప్రాంతమైన తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. బుధవారం మాత్రం కేవలం తనిఖీలకే పరిమితమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామంటున్న పోలీసులు.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్లతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 6 కమిషనరేట్లలోనూ ఎప్పటికపుడు నివేదికలు డీజీపీ కార్యాలయానికి, ఐబీకి అందజేస్తున్నారు. అనుమానితుల కోసమే..: కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు నగరంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వీరి నిఘా పెరిగింది. స్లీపర్ సెల్స్‌పై పూర్తి సమాచారం లేకున్నా.. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న విషయం వెలుగుచూడటంతో ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎన్ఐఏ నిఘా వేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. తనిఖీ చేశాకే అనుమతి నగరంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. పౌర, సైనిక విమానాశ్రయాల వద్ద భద్రత రెట్టింపు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం రాత్రి పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో వాహన తనిఖీలు, రాత్రిపూట గస్తీని ముమ్మురం చేశారు. గురువారం కూడా కార్డన్ సెర్చ్‌లు, వాహన తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు
-
భారత గగనతలంలోకి పాక్ విమానాలు!
శ్రీనగర్ : పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన మెరుపు దాడులతో తీవ్ర అసహనానికి లోనైన పాకిస్తాన్ బుధవారం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. రాజౌరీ సెక్టార్‌లోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. కాగా, భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఫైటర్ జెట్‌ను భారత వాయుసేన కూల్చివేసిందని అధికారులు చెబుతున్నారు. భారత్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురవడంతో తోకముడిచిన పాకిస్తాన్ తన యుద్ధ విమానాలను తిరిగి తమ గగనతలంలోకి మళ్లించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో భారత్ నేలమట్టం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అసహనానికి లోనవుతున్న సంగతి తెలిసిందే. భారత్‌కు తమ సత్తా చాటుతామని, సరైన సమయంలో దాడులకు తెగబడతామని పాక్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాటువేసి దొంగ దెబ్బ తీసేందుకూ పాక్ దుర్నీతిని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు ఎప్పటికప్పుడు పాక్ కుయుక్తులను తిప్పికొడుతూ ఎలాంటి పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విమానాశ్రయాల్లో హైఅలర్ట్ భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లీ, జమ్మూ, శ్రీనగర్, పఠాన్‌కోట్ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఆయా గగనతలాల పరిధిలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకుల విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. పలు కమర్షియల్ విమానాల సర్వీసులను కూడా పెండింగ్‌లో ఉంచారు. మరోవైపు ఉడీ, పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పలువురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి. -
ఐబీ ఆదేశాలు: దేశవ్యాప్తంగా హై అలర్ట్
న్యూఢిల్లీ: పాక్ అక్రమిత కశ్మీర్లో భారత్ వైమానిక దళం జరిపిన ముప్పేట దాడి అనంతరం కేంద్రం నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించాయి. ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆదేశాలు జారీచేసింది. మంగళవారం జైషే మహమ్మద్ స్థావరాలపై మెరుపు దాడులు జరిగిన నేపథ్యంలో ఉగ్రమూకలు విరుచుకుపడే అవకాశం ఉందని నిఘూ సంస్థలు రాష్ట్రాలకు సూచించాయి. ఈ మేరకు సెంట్రల్ ఐబీ నుంచి అన్ని రాష్ట్రాల డీజేపీలకు వర్తమానం అందింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. -
దేశంలో అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్...
-
కశ్మీర్ లోయలో హైఅలర్ట్
శ్రీనగర్ : పుల్వామా తరహా ఉగ్రదాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జమ్మూతో పాటు పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. జమ్మూలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్‌లో భద్రత బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. (‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’) ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. (పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా) -
పార్లమెంట్ ఎగ్జిట్ గేట్ వద్ద కారు కలకలం
-
పార్లమెంట్లో భద్రతా లోపంపై కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం పోలీసు పహారాలో ఉండే పార్లమెంట్ ఎగ్జిట్ గేట్ నుంచి ఓ వాహనం లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల కళ్లుగప్పి నిష్క్రమణ ద్వారం నుంచి బారికేడ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కారును అడ్డుకున్న భద్రతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఈ కారు నెంబర్ డీఎల్ 12 సీహెచ్ 4897 కాగా, ఈ వాహనంపై ఎంపీ స్టిక్కర్ ఉంది. ఈ కారు ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ డాక్టర్ తొకొం మైనాకు చెందినదిగా అధికారులు గుర్తించారు. కాగా, కారు ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి రావడంతో భద్రతా లోపాలపై పార్లమెంట్ భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటన 2001 డిసెంబర్13న పార్లమెంట్‌పై జైషే, లష్కరే ఉగ్రవాదుల దాడి ఘటనను జ్ఞప్తికి తెచ్చింది. నాటి ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు సహా తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పార్లమెంట్ సిబ్బంది, గార్డెనర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ ఉన్నారు. -
పంజాబ్‌లో హైఅలర్ట్
అమృత్సర్: కశ్మీర్ ఉగ్రవాది జాకిర్ ముసా తమ రాష్ట్రంలో దాక్కున్నాడన్న సమాచారంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిక్కు మతస్తుడిగా వేషం మార్చుకుని ఫిరోజ్‌బాద్, బతిండా ప్రాంతాల్లో అతడు తలదాచుకున్నట్టు నిఘా విభాగం, సీఐడీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అతడి ఫొటోలను కూడా విడుదల చేశాయి. ఇతడి పోస్టర్లను పంజాబ్ పోలిసులు ఇప్పటికే గురుదాస్‌పూర్‌లో అతికించారు. దీంతో ఫిరోజ్‌బాద్, బతిండా ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్‌ను కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్(అల్-ఖాయిదా అనుబంధ సంస్థ)కు చీఫ్‌గా ఉన్న ముసా కోసం భద్రతా దళాలు చాలా రోజుల నుంచి గాలిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జేయిఎమ్తోనూ అతడికి సంబంధాలున్నాయి. పండగ సీజన్ కావడంతో అలజడిని సృష్టించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆర్మీ ప్రధాన అధికారి బిపిన్ రావత్ సూచించారు. -
దేశ రాజధానిలో హైఅలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ఉగ్రవాదులను పట్టుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. హోటళ్లు, అతిథి గృహాలు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదుల ఫొటోలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అతికించారు. సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోలు షేర్ చేశారు. ఢిల్లీ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వీరి గురించి సమాచారం తెలిస్తే తమకు అందించాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన అనుమానిత తీవ్రవాదుల ఫొటో -
ఐదు జిల్లాల్లో హైఅలర్ట్..
సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మావోయిస్టుల ఉనికి పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల వేళ ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని భావిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసే ందుకు నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రశా ంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేపట్టాల్సిన అంశాలపై గురువారం జిల్లాల్లో పర్యటించారు. ఉనికి చాటుతున్న మావోలు.. గోదావరి పరీవాహక జిల్లాలుగా ఉన్న ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మంలో మావోయిస్టు యాక్షన్ కమిటీల కదలికలు భారీ స్థాయిలోనే ఉన్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) గుర్తించింది. దీనికి బలం చేకూరుస్తూ బుధవారం ఏటూరునాగారం కమిటీ పేరుతో ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ బ్యానర్లు, పోస్టర్లు బయటపడటం ఇప్పుడు మరింత ఆందోళనలో పడేసింది. బ్యానర్లు పెట్టి వాటి కింద మావోయిస్టులు ల్యాండ్మైన్లను పాతిపెట్టడం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేసింది. ఈ జిల్లాల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల నుంచి మావోయిస్టు పార్టీకి, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య పోరాటం జరుగుతోంది. ల్యాండ్మైన్లు పేలు స్తూ మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో స్పందిస్తోంది. మూడు సవాళ్లు..: మావోయిస్టు కదలికల నేపథ్యలో పోలీసు శాఖ ఎదు ట మూడు సవాళ్లున్నాయి. ఆయా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తు న్నారు. వీరికి భద్రత కల్పించడం మొదటి ప్రాధా న్యం కాగా, ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన అధికారులు, సిబ్బంది భయాందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పని చేయడం రెండో ప్రాధాన్యం. మావోలను ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి అడుగుపెట్టకుండా, అంతర్గతంగా ఉన్న యాక్షన్ కమిటీలపై దృష్టి పెట్టడం మూడో సవాలు. ఇవి పోలీసు శాఖకు కత్తి మీద సాములాంటివని ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లూ పెద్దగా కనిపిం చని మావోల డివిజన్ కమిటీలు ఒక్కసారిగా వ్యూహా త్మకంగా దాడులకు పాల్పడటం పోలీసు శాఖను శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెద్దపల్లిలో పర్యటించిన డీజీపీ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. మావోయిస్టుల నియంత్రణకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు జరగనిచ్చే అవకాశమేలేదని తేల్చిచెప్పారు. ఐజీ నాగిరెడ్డి రెండ్రోజుల నుంచి గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు, నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై పెద్దపల్లి, మంచిర్యాలకు చెందిన పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షించారు. పోలింగ్ స్టేషన్, గ్రామం ప్రాతిపదికగా భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, గ్రేహౌండ్స్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్, మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, అడిషనల్ డీసీపీలు రవికుమార్, అశోక్‌కుమార్, ఏఆర్ అడిషనల్ కమాండెంట్ సంజీవ్ పాల్గొన్నారు. -
జైపూర్‌లో కోరలు చాస్తోన్న జికా వైరస్
-
ఉత్తరప్రదేశ్‌లో విజృంభిస్తున్న విష జ్వరాలు
-
యూపీలో హై అలర్ట్.. 84 మంది మృతి
లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఫలితంగా యూపీలోని 6 జిల్లాలో ఇప్పటికే 84 మంది మరణించారు. దాంతో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా బరేలి జిల్లాలో అత్యధికంగా 24 మంది మృతి చెందగా, సమీప బుదౌన్ జిల్లాలో 23 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధిలో ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయి. అందువల్ల పూర్తి స్థాయిలో వ్యాధి నివారణ జరగకపోవడంతో ఇప్పటికే 84 మంది మరణించారు. ఈ విషయం గురించి యూపీ వైద్య శాఖ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలయడం లేదు. వ్యాధి బారిన పడిన వారిలో మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫివర్ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యాధి నివారణ కోసం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యాధి ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన బరేలీ, బుదౌన్, హరోయి, సీతాపూర్, బహ్రైచ్, షాజహాన్‌పూర్ జిల్లాలో వ్యాపించింది. ఇది ఇలా కొనసాగితే రాజధానిలో కూడా పాకే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాధి నివారణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాక అవసరమైన మందులు సరఫరా చేస్తున్నాం. దోమల నివారణ కోసం ఫాగింగ్ కూడా జరుపుతున్నాం’ అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సమయంలో ప్రజలను కోరేది ఒక్కటే.. మీ కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా జబ్బు పడితే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లండి. మీడియా వారు కూడా సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. అనవసరమైన పుకార్లను, వదంతులను ప్రచారం చేయవద్దని అభ్యర్ధిస్తున్నాను. త్వరలోనే వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాన’ని తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
భద్రాచలంలో ఉధృతంగా గోదావరి
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక దాటి 50 అడుగులకు చేరుకోవటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతాల్లోని ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, చర్ల, పినపాక మండలాల్లో నాలుగు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. గోదావరి వరద ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులు దాటే అవకాశం ఉందని అందిన సమాచారంతో.. జిల్లాలో వరద ప్రభావానికి గురయ్యే 8 మండలాల్లో లాంచీలను సిద్ధం చేశారు. భధ్రాచలంలో 30 మంది సభ్యులుగల ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచారు. అయితే బుధవారం సాయంత్రానికి ఒక అడుగు నీటిమట్టం తగ్గింది. ఎగువ ప్రాంతమైన ఏటూరు నాగారం, కాళేశ్వరం లో వరద ఉధృతి నెమ్మదించిందని, దీంతో గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద ప్రవా హం మరికొద్దిగా తగ్గనుందని సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. వరద ఉధృతితో గోదావరి పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. రహదారులు చాలా చోట్ల ఛిద్రమయ్యాయి. ఇదిలా ఉంటే భద్రాచలంలోని డ్రెయినేజీ నీటిని సకాలంలో గోదావరిలోకి పంపించే విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రామాలయం పడమర మెట్లవైపు మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. అన్నదాన సత్రంలోకి కూడా డ్రైనేజీ నీళ్లు చేరాయి. గోదావరికి దిగువన ఉన్న ఏపీలోని శబరి నది కూడా పోటెత్తటంతో పోలవరం విలీన మండలాలకు రాకపోకలు స్తంభించాయి. -
వరద ప్రళయం
తిరువనంతపురం/కొచ్చి/న్యూఢిల్లీ: కనీవినీ ఎరుగని తీవ్ర విపత్తుతో కేరళ అతలాకుతలమైంది. వర్ష సంబంధ ఘటనల్లో గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారం రోజుల్లో మృతుల సంఖ్య 97కు పెరిగింది. వేల సంఖ్యలో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. రైలు, విమాన సేవలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాల్లోని 13 జిల్లాల్లో హైఅలర్ట్ హెచ్చరికలు కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సుమారు లక్షన్నర మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ నేవీ.. త్రిసూర్, అలువా, మువాత్తుపుజాలో వరదల్లో చిక్కుకున్న బాధితులను విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రక్షణశాఖ కేరళకు మిలిటరీ బృందాలను పంపింది. 35 అదనపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా ద్వారా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. విజయన్‌కు మోదీ హామీ.. ప్రధాని మోదీ గురువారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున పూర్తి సాయంచేస్తామని హామీ ఇచ్చారు. ‘కేరళలో వరద పరిస్థితి గురించి ముఖ్యమంత్రి విజయన్‌తో చర్చించా. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రక్షణ శాఖను కోరాను. కేరళ ప్రజల సంక్షేమం, భద్రత కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’నని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందని, సహాయక చర్యలకు కేంద్ర సాయం పెంచాలని ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరినట్లు సీఎం విజయన్ వెల్లడించారు. ‘ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ తలెత్తలేదు. ఎప్పుడూ వరదలకు లోనుకాని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరదల నియంత్రణకు చేయాల్సినదంతా చేస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. అయినా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని విజయన్ సూచించారు. పెరియార్, చాలకుడి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్న దృష్ట్యా, వాటికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ అప్రమత్తం.. ప్రధాని మోదీ సూచన మేరకు కేరళలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) సమావేశమైంది. కేరళకు సుమారు వేయి మందితో కూడిన 35 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అదనంగా పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 ఎన్డీఆర్ఎఫ్ దళాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సహాయకచర్యలను ముమ్మరం చేసేందుకు అదనపు మానవ వనరులు, పడవలు, హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద బాధితులకు నీరు, ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు తెలిపింది. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుదలను కేంద్ర జలసంఘం కమిషన్ చైర్మన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. విరాళాలకు రాహుల్ విన్నపం.. కేరళలో వరద పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం, కేరళ ఇంతటి కష్టకాలాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కేరళ తీవ్ర ఇక్కట్లలో ఉంది. ప్రధానితో మాట్లాడి ఆర్మీ, నేవీ దళాలు మోహరించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశా’ అని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా వేదికగా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. తామెక్కడ ఉన్నామో, ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు చేరవేస్తున్నారు. సాయం కోసం విజ్ఞప్తిచేస్తున్న ప్రజల ఫొటోలు బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. పలు వార్తా చానెళ్లు కూడా బాధితులు, వారి కుటుంబాలను కలిపేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఏడు రోజులు ఉచిత కాల్, డేటా సేవలు వరద ప్రభావిత కేరళ ప్రజలకు టెలికాం కంపెనీలు వారంరోజుల పాటు ఉచిత కాల్, డేటా సేవల్ని ప్రకటించాయి. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లందరూ ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించగా, ఎయిర్‌టెయిల్, వొడాఫోన్, ఐడియాలు..తమ ప్రీపెయిడ్ కస్టమర్లు లిమిటెడ్ బ్యాలెన్స్‌తో కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు గడువును పొడిగించాయి. ఈ ఐదు కంపెనీలు వినియోగదారులందరికీ వారంపాటు ఉచితంగా డేటా సేవలను అందిస్తున్నట్లు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ మినహా మిగతా సంస్థలు ఉచిత డేటాకు 1 గిగాబైట్ పరిమితి విధించాయి. నేడు కేరళకు మోదీ.. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ చెప్పారు. శుక్రవారం వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన తరువాత మోదీ కొచ్చి బయల్దేరుతారని వెల్లడించారు. రాత్రి అక్కడే బసచేసి శనివారం ఏరియల్ సర్వే చేపడతారని తెలిపారు. వరద బాధితులకు చేయూత పెరంబూరు(చెన్నై): కేరళ ప్రజలను ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ గురువారం కేరళ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ సీఎంను కలసి నటుడు కార్తీ రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. నటులు కమల్‌హాసన్, సూర్య, కార్తీ, శ్రీప్రియ, రోహిణి తదితరులు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైలు, మెట్రోలకు అంతరాయం రాజధాని తిరువనంతపురం నుంచి రైలు సేవలు, కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. త్రిసూర్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడినట్లు వార్తలొచ్చాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల ముళ్లపెరియార్, ఇడుక్కి, ఇదమలాయర్, చెరుతోని గేట్లు ఎత్తేయడంతో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎర్నాకుళం, అలప్పుజా, పత్తినంతిట్టా జిల్లాల్లో వరదల విధ్వంసం సృష్టించింది. రన్‌వేపై చేరిన నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆగస్టు 26 వరకు అన్ని సేవలను నిలిపేస్తున్నట్లు కొచ్చి విమానాశ్రయం ప్రకటించింది. ముత్తం యార్డులో నీటి మట్టాలు పెరగడంతో గురువారం కొన్ని గంటలపాటు కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. సుమారు 25 రైళ్లను రద్దు లేదా రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది. అలువా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అప్పుడే పుట్టిన శిశువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మువత్తుపుజాలోని ఓ ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో అందులో సుమారు 200 మంది రోగులు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. మురింగూర్‌లోని ఓ చర్చిలో చిక్కుకున్న సుమారు 1500 మందికి ఆహారం, నీరు అందించాలని మత గురువు పంపిన వీడియో పలు చానెళ్లలో ప్రసారమైంది. కొచ్చి సమీపంలోని శంకరాచార్య సంస్కృత కళాశాలలో వందల కొద్ది విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలిసింది. భుజాలపై చంటిబిడ్డలను మోస్తూ కొందరు ఛాతీ లోతున్న నీటిని దాటుదున్న చిత్రాలు టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. రోడ్లు, బ్రిడ్జీలు కుప్పకూలడం, కొన్నిచోట్ల బీటలువారడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై సహాయక చర్యలకు అదనపు వనరులు సమకూర్చుకునేందుకు నవంబర్ 30 వరకు మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. ముళ్లపెరియార్పై తేల్చండి: సుప్రీం కేరళను భారీ వర్షాల నేపథ్యంలో ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టాన్ని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విపత్తు నిర్వహణ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తమిళనాడు, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించాలని సూచించింది. ఈ సందర్భంగా డ్యామ్‌లో నీటిమట్టం తగ్గింపుపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన అంశాలను ఇప్పుడు ప్రస్తావనకు తీసుకురావద్దనీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. డ్యామ్‌పై నీటిమట్టంపై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. డ్యామ్ నీటిమట్టం పెరగడంపై దిగువన ఉన్న ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనిఉన్నాయనీ, దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమై డ్యామ్ నీటిమట్టాన్ని 3 అడుగులు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కమిటీని ఆదేశించింది. అలాగే భారీ వర్షాలు, వరద కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం నాటికి 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తాగునీరు, వ్యవసాయం కోసం పెరియార్ నదిపై ఈ డ్యామ్‌ను 122 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మేరకు ట్రావెన్కోర్ రాజు(కేరళ)తో మద్రాస్(తమిళనాడు) ప్రెసిడెన్సీ కార్యదర్శి 1895లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ డ్యామ్‌లోని నీటితో పాటు నిర్వహణ, ఇతర అధికారాలు తమిళనాడు ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. కాగా, డ్యామ్ కేరళలో ఉన్నందున అక్కడి ప్రభుత్వానికి కొంతమొత్తం అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కొచ్చిలో వరద నీటిలో మునిగిపోతున్న యువకుడిని కాపాడుతున్న వ్యక్తి వరద నీటిలోనే ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం పెరియార్ డ్యామ్ -
ఏవోబీలో హై అలర్ట్
అరకులోయ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ సంఘటనతో ఏవోబీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో 15మంది మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఈ సంఘటనతో కేంద్ర హోంశాఖలోని నిఘా వర్గాలు తెలంగాణా, ఒడిశా, ఆంధప్రదేశ్ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఏవోబీలో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలలో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులు ఇటీవల వారం రోజులపాటు ఏవోబీలో ఆమర వీరుల వారోత్సవాలను విజయవంతంగా జరుపుకున్నారు. ఈ మేరకు మావోయిస్టులు ఏవోబీలో అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో విశాఖ జిల్లాలోని పోలీసు పార్టీలతోపాటు ఒడిశాకు చెందిన పోలీసు భద్రత బలగాలు ఏవోబీవ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో 15మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనతో ఏవోబీలో పోలీసు పార్టీలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేసారు.కూంబింగ్ చర్యలలో ఉన్న పోలీసు పార్టీలకు భద్రతను పెంచే చర్యలను చేపట్టినట్టు విస్వసనీయ వర్గాల సమాచారం. అదనపు పోలీసు బలగాలను ఏవోబీలోకి పంపే చర్యలను ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేసారు. అలాగే విశాఖ ఏజెన్సీలోని రాళ్లగెడ్డ, కోరుకొండ, రూడకోట ప్రాంతాలలో పోలీసు అవుట్ పోస్టులతోపాటు, ఒడిశా సరిహద్దులో ఉన్న పెదబయలు. ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక పోలీసు బలగాలను ఈ స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. పోలీసులు ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేసారు. -
దేశంలోకి చొరబడిన 20 మంది టెర్రరిస్టులు
-
దేశంలోకి జైషే ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్లోకి 20 మందికిపైగా ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరు కశ్మీర్‌లోయతో పాటు ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశముందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కశ్మీర్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి పీర్‌పంజాల్ పర్వతశ్రేణి ద్వారా కశ్మీర్లోకి చొరబడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వీరందరూ చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి వచ్చారని వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద భారీఎత్తున పేలుడుపదార్థాలు, ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇంత భారీస్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఇస్లాం విస్తరణకు కీలకంగా నిలిచిన బద్ర్ యుద్ధం ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం శనివారం (రంజాన్ నెల 17వ రోజు) జరిగింది. అందుకే ఈరోజు వారు విధ్వంసం సృష్టించే అవకాశముంది. కీలకమైన సైనిక స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి నిఘావర్గాలు హెచ్చరించిన కొన్నిగంటల్లోనే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో అధికార పీడీపీ నేత, త్రాల్ ఎమ్మెల్యే ముస్తాక్ షా ఇంటిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ ఇంట్లోని పచ్చిక ప్రాంతంలో పేలడంతో ఎవ్వరికీ గాయాలుకాలేదు. -
హై అలర్ట్...
మక్కువ : మావోయిస్టులు ఆరు రాష్ట్రాల్లో శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో పది మంది మావోయిస్టులు మృతి చెందడంతో నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌యంత్రాంగం ఏజెన్సీ పోలీస్స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మార్చిలో ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్ గుమండి పంచాయతీ (ఏఓబీ) సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే గత నెల 22న మహారాష్ట్ర రాష్ట్రం గచ్చిరోలి సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు కన్నుమూశారు. అయితే రెండు ఎన్కౌంటర్లలో పదిమంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రతీకార చర్యగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలాంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టులు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో విధ్వంసక చర్యలు జరిగే అవకాశం ఉంటుందని పోలీస్‌వర్గాలు భావిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నందున వారు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పోలీసులు సరిహద్దులో నిఘా పెంచారు. అప్రమత్తం బంద్ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఓఎస్డీ విక్రాంత్ పాటిల్ ఏజెన్సీ పోలీస్స్టేషన్లను సందర్శిస్తూ పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అధి కారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
కలకలం
బరంపురం : మావోయిస్టుల దుర్గంగా ఉన్న కొందమాల్ జిల్లాలో ఒక్కసారిగా యుద్ధవాతావరణం అలుముకుంది. కొద్ది కాలంగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జరిగిన ఎదురు కాల్పులు భయానక పరిస్థితులను సృష్టించాయి. కొందమాల్ జిల్లాలో పోలీసులు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో మావోయిస్టు శిబిరాన్ని పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందమాల్ ఎస్పీ ప్రత్తిక్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొందమాల్ జిల్లా కొజ్జిరిపడ సమితి లంబాగుడా పంచాయతీ కుకులసెలయేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరంలో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓడీ జవాన్లు, సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసుల సహాయంతో బుధవారం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. సూమారు 2 గంటల వరకు ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు సాగిన అనంతరం మవోయిస్టులు వెనక్కు తగ్గి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల శిబిరాన్ని పరిశీలించి భారీ డంప్‌ను గుర్తించి విస్ఫోట సామగ్రి, అయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్‌లో మావోయిస్టు జెండాలు, ఒక సీఎల్ఆర్ మెషీన్, రెండు కుర్చీలు, రెండు రేడియోలు, తాగునీటి బాటిల్స్, ఔషధాలు, 3 జతల చెప్పులు, వివిధ సామగ్రి ఉన్నట్లు ఎస్పీ ప్రత్తిక్ సింగ్ తెలియజేశారు. కొందమాల్ జిల్లాలో కొందమాల్, కలహండి, బౌధ్, నయగడ్ (కేకేబీఎన్)డివిజన్ దళం సీపీఐ మావోయిస్టు ఆధ్వర్యంలో మావోయిస్టుల కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు, శిబిరంలో మహిళా క్యాడర్‌తో పాటు సుమారు 14 మంది మవోయిస్టులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. జోరుగా కూంబింగ్ జరిగిన సంఘటపై కొందమాల్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కమనకొలొ, లొండిగాం, గొచ్చపడా, బలందపూర్, దసపల్లా, రాణిపొత్తర, గస్మా, గెలరీ, శ్రీరామ్‌పూర్, దరింగబడి, సాలిమాగచ్ అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహాయంతో సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ జవాన్లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నట్లు కొందమాల్ ఎస్పీ ప్రత్తిక్ సింగ్ తెలియజేస్తున్నారు. గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్దుల్లో వచ్చి పోయే వాహనాలను, ప్రయాణికుల బస్సులను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎస్ఓజీ జవాన్ల సహకారంతో స్థానిక పోలీసులు కూడా సోదాలు చేస్తున్నారు.జేసీబీ, 3ట్రాక్టర్ల కాల్చివేత కొందమాల్ జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం రాయగడ : జిల్లా సరిహద్దులో గల కొందమాల్ జిల్లా బలిగుడ పోలీస్‌స్టేషన్ పరిధి గుమ్మడ మహరోడ్డు కుర్తింగుడ దగ్గరలో బుధవారం అర్ధరాత్రి 40మంది సాయుధ మావోయిస్టులు రోడ్డు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఒక జేసీబీ, 3ట్రాక్టర్లను కాల్చివేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. జినుగు నరసింగరెడ్డి అనే వ్యక్తి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని..దీనిపై ప్రజాకోర్టులో విచారించి తగిన చర్యలు చేపడతామని కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులు పోస్టర్లలో హెచ్చరించారు. అలాగే ప్రజలు కోరుకున్న విధంగా 6నుంచి 8 అడుగుల రహదారి మాత్రమే నిర్మించాలి. రహదారిపనులను గ్రామీణ ప్రజల ద్వారా చేపట్టాలి. మెషినరీతో పనులు చేపట్టకూడదు. రోజుకూలి రూ.200కు బదులు రూ.1200 చెల్లించాలి. వారానికి ఒకసారి పేమెంట్ చెల్లించాలని పోస్టర్లలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో విదేశీ మద్యం నిర్మూలించేందుకు మహిళలు ఉద్యమాలు చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.